విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది.
ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్‌పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్‌బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ఎయిర్‌పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment