బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది.
విమానం ఎక్కి, విమానం రన్‌వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు.
అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్‌లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment