రూ.76 లక్షల ఉద్యోగం పోయినా ఎగిరి గంతేసిన మహిళా టెకీ
దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారయ్యాయి ఉద్యోగుల జీవితాలు. ఎపుడు, ఎందుకు, ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ముఖ్యంగా సంక్షోభంలో చిక్కుకున్న ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఇక మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. కానీ ఒక మహిళా టెకీ మాత్రం ఆ తొక్కలో ఉద్యోగం పోతే పోయింది అంటోంది. ఏడాదికి రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయినా చాలా సంతోషంగా ఉన్నా అంటోంది 24 ఏళ్ల యాక్చురియల్ అనలిస్ట్ . స్టోరీ ఏంటంటే..!
మనీ కంట్రోల్ కథనం ప్రకారం చికాగోలోని డెలాయిట్ కంపెనీలో అననిష్ట్గా పనిచేది సియెర్రా డెస్మరాట్టి. ఏడాది రూ. 76 లక్షల వేతనంతో 2022లో ఉద్యోగంలో చేరింది. అయితే ఐటీ రంగ సంక్షోభం,కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. మామూలుగా అయితే నా ఉద్యోగం పోయింది అని అందరం డీలా పడిపోదాం, ఏడ్చి గగ్గోలు పెడతాం కదా, కానీ సియెర్రా మాత్రం ఎగిరి గంతేసిందట. దాదాపు సంవత్సరం కాలం తరువాత ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.
జీవితంలో ఏం జరిగినా మన మంచికే అను సానుకూల ధోరణే తన సంతోషానికి కారణమని చెప్పుకొచ్చింది. జీవితంలో తనకేదైనా మంచి జరిగిందంటే, అది ఉద్యోగం పోవడమేనని తెలిపింది. ‘‘రోజంతా కుర్చీలో కూర్చొని కూర్చొని వెన్నునొప్పి వచ్చింది. తొమ్మిది కిలోల బరువు పెరిగా, పొట్టి బట్టలేసుకుని తోటి ఉద్యోగుల ముందు నడవం నా వల్ల కాలే...’’ అంటూ తన ఇబ్బందులను ఏకరువు పెట్టింది. 11 గంటల పనితో, మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యానని పేర్కొంది.
రూ. 76 లక్షల జీతం గురించి కూడా ఆమె పెద్దగా బెంగపడలేదు. జీతమే జీవితంకాదు. పొద్దుపు చేసిన డబ్బుతో కొన్నాళ్లు గడిపి, తరువాత ట్రాన్స్‌అమెరికాకు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్‌గా రిమోట్ ఉద్యోగాన్ని సాధించి ఇపుడు నేను చాలా హ్యాపీ అంటోంది సియెర్రా.
కొత్త ఉద్యోగం పాతదిలాగే ఉన్నప్పటికీ పని సంస్కృతి చాలా భిన్నంగా ఉందట. కొత్త వర్క్‌ప్లేస్‌లోని ఉన్నతాధికారులు డ్యూటీ ముగియగానే ఆఫీసు నుంచి వెళ్లిపోవచ్చంటారట. దీంతో తనకు కొంత సమయం మిగిలుతోందని చెప్పింది ఆనందంగా.
సో..అదన్నమాట..! పోయినదాని గురించి బాధపడుతూ కూచుంటే ప్రయోజనం ఉండదు. ఇదీ మన మంచికే అనుకొని మరో కొత్త అవకాశాన్ని వెదుక్కోవడమే. మనసుంటే మార్గం ఉంటుంది.. కాదు కాదు.. టాలెంట్ ఉంటే కొలువు వెతుక్కుంటూ వస్తుంది!
ఇదీ చదవండి: కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
Comments
Please login to add a commentAdd a comment