కుక్కలు చుట్టుముట్టాయ్‌..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి! | Dog attach When youre cornered your only option is to be brave | Sakshi
Sakshi News home page

కుక్కలు చుట్టుముట్టాయ్‌..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!

Published Thu, Sep 12 2024 5:02 PM | Last Updated on Thu, Sep 12 2024 6:37 PM

 Dog attach When youre cornered your only option is to be brave

చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం  ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే  రోడ్డుపై  వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి.  భయంకరంగా మొరుగుతూ  కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి.  దాదాపు అలాంటి వీడియో ఒకటి  ఎక్స్‌లో  ఆకట్టుకుంటోంది.

ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్‌ అనే ఎక్స్‌ యూజర్‌ దీన్ని షేర్‌ చేశారు.  ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో  లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్‌ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.

ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు   ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్‌  వ్యాఖ్యానించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement