brave
-
కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే రోడ్డుపై వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి. భయంకరంగా మొరుగుతూ కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి. దాదాపు అలాంటి వీడియో ఒకటి ఎక్స్‌లో ఆకట్టుకుంటోంది.ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్ అనే ఎక్స్ యూజర్ దీన్ని షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.When you're cornered, your only option is to be brave ... pic.twitter.com/uLDXhtNvcw— Figen (@TheFigen_) September 11, 2024ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే సాహసం.. సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించాడు
పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రంలోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు వాళ్లు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీదిన ఆయన.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. గుజరాత్ అమ్రేలి జిల్లాలో పట్వా గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి బుధవారం మధ్యాహ్నం నలుగురు యువకులు ఈతలకు వెళ్లారు. అయితే వాతావరణంలోని మార్పులతో అలలు పోటెత్తాయి. దీంతో వాళ్లు మునిగిపోసాగారు. ఈలోపు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి మాత్రం ఆలస్యం చేయలేదు. అలలతో పోటెత్తిన సముద్రానికి ఎదురీదారాయన. ఈలోపు కొందరు యువకులు ఆయనకు సాయానికి రాగా.. బోట్ సాయంతో సముద్రంలోకి వెళ్లారు. స్వయంగా నీళ్లలో దూకి ముగ్గురు యువకులను రక్షించారు. మరో యువకుడు అలల ధాటికి కొట్టుకునిపోగా.. సాయంత్రానికి మృతదేహం దొరికింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హీరా సోలంకి. ఆలస్యం చేయకుండా సాహసం ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన ఎమ్మెల్యేపై రియల్ హీరో అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: కన్నకూతురిని పాతికసార్లు పొడిచాడు! -
రియల్ హీరో వీడియో వైరల్.. ఊహించని ట్విస్ట్
పరోపకారిగా బతికే మనుషులు.. ఈరోజుల్లో కనిపించడం అరుదైపోయింది. కొందరు తాము చేసింది చిన్నసాయంగానే ఫీలైనప్పటికీ.. అవతలి వాళ్లు మాత్రం దానిని విలువైందిగా భావించొచ్చు. అలా ఓ పసిప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అదేమంత పెద్దసాయం కాదని అంటుంటే.. ఊహించని ప్రతిఫలం, అదీ ఎంతోకాలంగా అతను ఎదురుచూస్తుందే దక్కింది ఇప్పుడు.. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి ఓ పసికందును కాపాడిన వీడియో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఒక పెద్దావిడ ఓ చిన్నారిని స్ట్రోలర్‌లో పెట్టుకుని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. ఆ టైంలో ఆమె కారులో ఏదో సర్దుతుంటే.. గాలి బలంగా వీయడంతో ఆ స్ట్రోలర్ దానంతట అదే వాహనాలు తిరుగుతున్న రోడ్డు వైపుగా వెళ్తుంటుంది. ఆమె అప్రమత్తమయ్యేలోపు కిందపడిపోగా.. ఓ వ్యక్తి ఆపద్బాంధవుడిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్నారిని రోడ్డు మీదకు వెళ్లకుండా రక్షించాడు. కట్ చేస్తే.. ఆ వ్యక్తి చేసిన సాహసానికి ఇప్పుడు నజరానా లభించింది. అదేంటో కాదు.. అతనికి ఉద్యోగం!. ఆ ఘటనకు ముందు ఆపిల్‌బీ అనే రెస్టారెంట్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడతను. అది అయిపోయి బయటకు రాగానే.. ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ వ్యక్తి సాహసం వైరల్ కావడంతో.. ఆ కంపెనీ వాళ్లు అతన్ని పిలిచి మరీ తమ ఫ్రాంచైజీల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇచ్చారట. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వ్యక్తి పేరు రోన్ నెస్మ్యాన్. సొంతిల్లు లేదు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత ఎనిమిది నెలల నుంచి దగ్గరి బంధువు ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఇంటర్వ్యూకు వెళ్లిన అతనికి.. ఆపదలో ఉన్న చిన్నారి కంటపడింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించి.. రియల్ హీరోగా అందరితో ప్రశంసలు అందుకున్నాడు. ఆ క్షణం ఆ పెద్దావిడ భయంతో వణికిపోతుంటే.. ఆమెను కౌగిలించుకుని ధైర్యం చెప్పి ఓదర్చాడట ఈ రియల్ హీరో. Another HERO😊 surveillance video captures a homeless man saving a baby in a stroller rolling toward heavy traffic. The baby’s aunt was unloading items on the backseat of her SUV parked outside of the A1 Hand Car Wash, when the stroller started to roll away towards the street.… pic.twitter.com/wihD0EmNFQ — DeL2000 (@DeL2000) May 4, 2023 -
ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా నా ఇరుగింటివాడే. ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. ఈ మధ్యే కలిశా. కొంచెం నలతపడ్డట్టు కని పించాడు. ఎలా ఉన్నారని అడిగితే, ఠకీమని ‘మై ఠీక్ హూ’ అన్న సమాధానం వచ్చింది. కానీ దశాబ్దాలపాటు ఇరుగు పొరుగుగా ఉన్న మా అపార్ట్మెంట్ భవనంలో ఇకపై ఆ కంచు కంఠం వినిపించదు. రాకేశ్ కుటుంబ నేపథ్యం సాధారణమైందే. తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. కొడుకు మంచి ఛార్టెర్డ్ అకౌంటెంట్ అవుతాడని ఆశించాడు. అయితే రాకేశ్ మంచి సీఏ అవడమే కాదు... స్టాక్ మార్కెట్‌ను శాసించగల స్థాయికి చేరతాడనీ, వందల మంది ఆరాధించే, అనుసరించే షేర్ గురువుగా ఎదుగుతాడనీ ఆ తండ్రి కూడా ఊహించి ఉండడు. అట్లాంటి వ్యక్తి అయిన నా మిత్రుడు దూరమయ్యాడన్న బాధ ఒకవైపు ఉండనే ఉంది. అదే సమయంలో అతడి జ్ఞాపకాలూ నన్నిప్పుడు వెంటాడుతున్నాయి. ఒకరకంగా రాకేశ్ ఓ మాటల మాంత్రికుడని చెప్పాలి. ఆయన పలికే ప్రతి మాటనూ శ్రద్ధగా విని, ఆయన బాగుండాలని కోరుకున్నవాళ్లు ఎందరో. అహ్మదాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో ఓ సెమినార్ ఏర్పాటు చేసి పాల్గొనాల్సిందిగా రాకేశ్‌ను ఆహ్వానించింది. అయితే అతడిని కలిసేందుకు వచ్చిన జనాలను నియంత్రించేందుకుగానూ ప్రవేశ రుసుమును ఐదు వేల రూపాయలుగా నిర్వాహ కులు ప్రకటించాల్సి వచ్చిందంటే అతడి జనాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. రాకేశ్‌ది చాలా ఉదార స్వభావం. స్టాక్ మార్కెట్ సలహాలు బోలెడు ఉచితంగానే ఇచ్చేసేవాడు. అతడి దృష్టిలో పెట్టు బడులు పెట్టేవాళ్లు అప్పుడప్పుడూ తమ జేబులు ఖాళీ చేసుకోవాలి. అలా చేస్తేనే మళ్లీ అవి నిండు తాయని నమ్మేవాడు. ఇలా రిస్క్ తీసుకునే తత్వం అతడి వైఖరిలోనూ స్పష్టంగా కనిపించేది. పెట్టే పెట్టుబడులు ధైర్యంగా పెట్టేవాడు. ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం తగ్గేవాడు కాదు. రాకేశ్ ఈమధ్యే ‘ఆకాశ’ పేరుతో ఓ విమానయాన సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో అతడితో మాట్లాడుతూ కోటీశ్వరులను లక్షాధిపతులుగా మార్చిన రంగంలో ఎందుకు డబ్బులు పోస్తు న్నావని అడిగా. రాకేశ్ నవ్వుతూ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా? ‘‘నాకు గతంపై నమ్మకం లేదు. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటా. ప్రస్తుత ట్రెండ్ ఏమిటన్నది అంచనా వేస్తా. అందుకు తగ్గట్టుగానే డబ్బులు పెట్టుబడి పెడతా’’ అని! భారత్ వృద్ధి పథంలో ఉందనీ, పర్యాటకంతోపాటు ఇతర రంగాల్లోనూ డిమాండ్ పెరగనుందన్న అంచనా రాకేశ్‌ది. ఇతరుల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడమూ రాకేశ్ నైజమని చెప్పాలి. కానీ అతడు భారత్ విజయంపై పందెం కాశాడు. బ్రాండ్ల విషయంలో అందరికంటే ముందు ఎక్కువ సాధికారత సాధించింది కూడా రాకేశ్ మాత్రమే. టైటాన్ గురించి తరచూ చెబుతూండేవాడు. బ్రాండ్‌ను మాత్రమే చూసి తాను అందులో పెట్టుబడి పెట్టగలనని అనేవాడు. నా స్నేహితుడి కంపెనీ బోర్డులో సభ్యుడిగా చేరాడు రాకేశ్. రావడం రావడంతోనే తన వ్యూహాలతో కంపెనీ విస్తరణను చేపట్టాడు. డిజిటల్ టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చాడు. ఫలితంగా ఒకప్పటి ఆ చిన్న కంపెనీ ఇప్పుడు వందకోట్ల డాలర్ల సంస్థగా (యూనికార్న్) ఎదిగింది. రాకేశ్ ఆలోచనలు సరళంగా, సంప్రదాయా లకు కట్టుబడి ఉండేవి కాదు. గందరగోళ పరిస్థితుల్లోనే వృద్ధి నమోద వుతుందని తరచూ అనేవాడు. ఎంత కష్టపడాలో అంతే ఉల్లాసం గానూ గడపాలన్నది రాకేశ్ సిద్ధాంతం. ‘‘విజయం తాత్కాలి కమైంది. కాలంతోపాటు కరిగి పోయేది’’ అని నమ్మేవాడు. రాకేశ్ గొంతు కొంచెం పెద్దదే. ఎక్కడ ఉన్నా మాటను బట్టే అతడిని గుర్తిం చవచ్చు. అయితే తన ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా పట్టిం చుకునే వాడు కాదు. రోజంతా పడ్డ కష్టాన్ని మరచిపోయేందుకు అతడు చేసే ప్రయత్నాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరుగున పడి పోయింది. రాకేశ్ పాల్గొన్న పార్టీలన్నింటిలోనూ సందడి ఎక్కువగా ఉండేది. సందర్భం ఏదైనా ఏమాత్రం శషభిషలు, సంకోచాలు లేకుండా ఎంజాయ్ చేసేవాడు. ఒకసారి తన పుట్టినరోజు జరుపుకొనేందుకు రెండు వందల మంది మిత్రులను తీసుకుని మారిషస్ వెళ్లాడు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూంటే.. రాకేశ్ జూమ్ కాల్స్‌లో కమెడియన్లను పెట్టుకుని మరీ ఆనందంగా గడిపాడు. అప్పట్లో దీని గురించి పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు నేనున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పక్కనే రాకేశ్ ఓ భారీ భవంతిని కడుతున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్లాలన్న ఆశ నెరవేరకుండానే పర లోకానికి చేరాడు. రాకేశ్ స్థాపించిన కంపెనీ ‘‘రేర్ ఎంటర్ప్రైజ్’’ పేరులో ఉన్నట్లే దాన్ని ఓ అరుదైన సంస్థగా తీర్చిదిద్దేందుకు తన జీవితకాలం మొత్తం శ్రమించాడు. దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు మొదలుకొని, దేశం మూలమూలల్లోని సాధారణ పెట్టుబడిదారులు కూడా రాకేశ్‌ను మరువలేరు. ఈ మార్కెట్ గురువును గౌరవాభిమానాలతో గుర్తు చేసుకుంటారు. నారింజ, ఊదా రంగుల్లోని ‘ఆకాశ’ విమానం ఎగిరిన ప్రతిసారీ రాకేశ్ స్ఫూర్తిని స్మరించుకుంటారు. రాకేశ్ మాట ఒకటి నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది: ‘‘చేయాలను కున్నది, కలలు కన్నది ఏదైనాసరే మొదలుపెట్టు. భయం లేకుండా చేసే పనుల్లో ఓ అద్భుతమైన శక్తి ఉంది.’’ మిత్రుడా! శాశ్వత నిద్రలో నీకు సాంత్వన చేకూరుగాక! బతికినంత కాలం ఉత్సాహంతో ఉరకలెత్తావు. నీ తదుపరి ప్రయాణమూ అదే విధంగా సాగిపోనీయ్!! హర్ష్ గోయెంకా వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త -
యానీ
‘‘ప్రెషర్ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’’ అన్నాడు సత్య. ‘‘కానీ జీవితమే ప్రెషర్గా అనిపిస్తున్నప్పుడు జీవితాన్ని కూడా ముందుగానే కదా ముగించుకోవాలి సత్యా?’’ అంది యామిని.చటుక్కున తల తిప్పి చూశాడు సత్య. అతడి కళ్లలోకే చూస్తూ ఉంది యామిని. ‘‘ఏమంటున్నావ్ యానీ.. జీవితం నీకు ప్రెషర్గా అనిపిస్తోందంటే.. నా ప్రేమ నీకు ప్రెషర్గా అనిపిస్తోందనేనా! అనుకున్నాం గుర్తులేదా, ప్రేమే మన జీవితం అని. ఇప్పుడెందుకిలా జననం.. మరణం.. అంటున్నావ్? ప్రేమ ఎక్కడికి పోయింది? ఏమైంది నీకు’’ అన్నాడు çసత్య. యామినిని అతడు యానీ అంటాడు. ‘‘ప్రేమ ఎక్కడికి పోయింది అని అడిగావ్. కానీ అడగాల్సింది నేను సత్యా. నాపై నీకుందని నువ్వు చెప్పిన ప్రేమ, నాపై నీకు ఉందని నేను నమ్మిన ప్రేమ ఎక్కడికో పోయిందని నాకు అనిపిస్తోంది కాబట్టే.. నాకూ ఇక్కడఉండాల్సిన పని లేదనిపిస్తోంది’’‘‘ఇక్కడ అంటే?’’‘‘ఈ లోకంలో..’’‘‘ఎందుకు నన్ను, ఈ ప్రపంచాన్ని ఒంటరిని చేసి వెళ్లాలనుకుంటున్నావ్ యానీ? ఊహు, ఒంటరిని కాదు, అనాథను చేసి.’’‘‘కవిత్వం ఆపు సత్యా. నేను లేకపోతే ప్రపంచం ఒంటరి, అనాథ అవడం ఏంటి? నేనే ఇక్కడ ఒంటరిగా, అనాథగా ఉండలేక వెళ్లి పోవాలని అనుకుంటున్నాను.’’ ‘‘నేను ఉన్నా కూడానా?’’‘‘ఉన్నావ్. కానీ నా కోసంలేవు’’ ‘‘చచ్చిపో.. యానీ.. ఇలా నన్ను చంపే బదులు’’‘‘పీడ విరగడ అవుతుందనే కదా.. మాటల్లో మాటల్లో నన్ను చావు దాకా తెచ్చావ్?’’‘‘మరేంటి యానీ! హాయిగానే ఉన్నాం కదా. కలుస్తున్నాం.మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఇళ్లకు వాళ్లం వెళ్లిపోతున్నాం. ఇంటికి వెళ్లాక కూడా ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ హాని జరిగింది మన ప్రేమకు. ముందిది చెప్పు. ప్రెషర్ ఎందుకు?’’ ‘‘ఈ మాట నువ్వు ముందే అడగలేదంటే.. నువ్వే నా ప్రెషర్ అని నీకు అర్థమయిందనే కదా నేను అర్థం చేసుకోవాలి సత్యా’’‘‘భగవంతుడా.. ఏం కావాలి నీకిప్పుడు?’’‘‘నీకేం అవసరం లేదా సత్యా?’’‘‘ఏదైనా తక్కువైతే ఆ తక్కువైంది అవసరం అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్‌లో ఉండగా నాకేం తక్కువవుతుంది? నాకేం అవసరం అవుతుంది?’’‘లైఫ్‌లో ఉండడం అంటే ఇలా ఎవరికి వాళ్లం ఉండడమేనా? ఇద్దరంఒకరిగా ఉండలేమా? ఒకే ఇంట్లో. ఒకే సమయంలో. ఒకే చోట?’’‘‘పెళ్లి గురించేనా?’’‘పెళ్లి గురించేనంటే.. అప్పుడు నువ్వుంటావ్.. ‘ఇప్పుడూ పెళ్లయిట్లే కదా ఉంటున్నాం’ అని. కానీ మనిద్దరం ఒకటే అని ప్రపంచానికి తెలియడం ముఖ్యం సత్యా. అప్పుడు నాకు ఏ ప్రెషరూ ఉండదు’’‘ఇప్పుడు మాత్రం.. ఎందుకుండాలి యానీ.. నీకు ప్రెషర్?’’‘‘తెలీదు. కానీ ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. లోకం నిన్ను నిన్నుగా కాకుండా, నన్ను నన్నుగా కాకుండా మనిద్దర్ని కలిపి చూసేవరకూ నాకు ప్రెషరే. నిన్ను చూస్తే నేను గుర్తుకు రావాలి. నన్ను చూస్తే నువ్వు గుర్తుకు రావాలి.. ఈ లోకానికి’’. ‘‘కవిత్వం నువ్వు మాట్లాడుతున్నావ్ యానీ ఇప్పుడు’’‘‘కవిత్వం మాట్లాడ్డం కాదు. హృదయంతో మాట్లాడుతున్నాను.’’‘‘సరే, పెళ్లి చేసుకుందాం’’‘‘సరే ఏంటి! నీకక్కర్లేదా పెళ్లి? నాకోసం సరేనంటున్నావా? నేను ప్రెషర్ ఫీలవుతానని, నేను నా పిచ్చి హృదయపు భాషలో మాట్లాడి నిన్ను చంపడం మానేస్తానని. అంతేకదా! పెళ్లయ్యాక కూడా నాహృదయపు పిచ్చి భాష ఎక్కడికీ పోదు. ఎందుకంటే.. నీపై నా ప్రేమఎక్కడికీ పోదు. ‘‘ఇప్పుడేంటి?’’‘‘నీకు ఉద్యోగం వచ్చేవరకు, మా వాళ్లు తెస్తున్న సంబంధాలను నేను ఆపగలను సత్యా. కానీ నీకు ఉద్యోగం వచ్చి, నన్ను పెళ్లి చేసుకునే వరకు మన ప్రేమను నాకడుపులోనే దాచి ఉంచలేను’’ అంది యామిని. ‘‘కమ్ అగైన్’’ అన్నాడు సత్య. ‘‘అవును’’ అంది యామిని. ఒక్కసారిగా ఆమెను దగ్గరికి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు సత్య. యామిని ఏడుస్తోంది. ‘‘నీకు ప్రేమను మాత్రమే పంచాలనుకున్నాను సత్యా. కానీ ప్రెషర్ని ఒక్కదాన్నీ భరించే శక్తి లేకపోయింది’’ అంది. సత్య ఇంకా ఆమెను హత్తుకునే ఉన్నాడు. యామిని కూడా అతడి గుండెలపై అలాగే ఉండిపోయింది.ఆ తర్వాత.. కొద్దిసేపటికి.. మెల్లగా ‘‘సత్యా’’ అంది. ‘‘ఊ..’’ అన్నాడతను. ‘మనం పెళ్లి చేసుకుందాం. నేను ప్రెగ్నెంట్‌నని తెలియజెప్పడానికైనా పెళ్లిచేసుకుందాం’’ అంది.‘‘సరే’’ అన్నాడు సత్య. ‘‘ఇవాళే.. ఇప్పుడే’’ అంది యామిని. ‘‘ఇవాళా! ఇప్పుడా?’’ నవ్వాడు సత్య. ‘‘అవును’’ అంది. ‘‘సరే’’ అన్నాడు. ‘సరే’ అన్న తర్వాత యామినికి మళ్లీ కనిపించలేదు సత్య. ఎప్పటికీ కనిపించలేదు. ‘‘ఎవరు? నీ కూతురా! చక్కగా ఉంది. నీలాగే’’ అన్నాడు సత్య. చాచి సత్య చెంప మీద కొట్టింది యామిని.‘‘సిగ్గుందా. ఇది మన కూతురు. అడుగో నా భర్త. ధైర్యవంతుడు. ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ముందే చెప్పేశాను నా కడుపులో బిడ్డ ఉందని. పెళ్లి చేసుకోడానికి ముందు నన్ను నా భర్త ఏమడిగాడో తెలుసా? ‘ఎవరతను? నేను వెతికి తెచ్చేదా?’ అని! వద్దన్నాను. ‘పిరికివాడిని పట్టి తెచ్చినా, మళ్లీపారిపోతాడు. వద్దు’ అన్నాను. ఏమన్నాడో తెలుసా? ‘అలా అనకు. ఎందుకు రాలేకపోయాడో’ అన్నాడు! సత్య కళ్ల నిండా నీళ్లు. ‘‘ఎందుకు పారిపోయావ్? నీ కడుపులో కాదు కదా బిడ్డ ఉంది.నువ్వెందుకు భయపడి పారిపోయావ్?’’సత్య మాట్లాడ్డం లేదు. కన్నీళ్లు అతడి చెంపల మీదుగా జారుతున్నాయి. ‘‘చెప్పు.. ఎందుకు పారిపోయావ్?’’ అడుగుతోంది యామిని. యామిని కూతురు తల్లి చేతుల్లోంచి ముందుకు వాలి సత్య కన్నీళ్లను తుడవడానికి తన చిట్టి చేతులతో ప్రయత్నిస్తోంది! అంత దగ్గరగా నిలుచుని ఉంది యామిని.. సత్యకు. నిండు పున్నమి ఆ రోజు. బయటì గేటుకు తలుపు వేసి ఇంట్లోకి వస్తుండగా.. ఆ వెన్నెల్లో గేటు బయట నిలుచుని కనిపించాడు సత్య! సత్య, యామినీ మొదట కలుసుకున్నదీ పున్నమి రోజే. ‘‘ప్రెషర్ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’అని నేనన్నప్పుడు.. నువ్వేమన్నావో గుర్తొచ్చింది యానీ’’ అన్నాడు సత్య. యామినికి ఆ మాట అర్థమయ్యేలోపే.. ఇంట్లోంచి పెద్దగా అరుపు వినిపించింది. ‘‘యామినీ.. పిల్ల పడిపోతోంది!’’ అని. గభాల్న, బిడ్డను పడిపోకుండా పట్టుకుంది యామిని. సత్య ఇంకా అక్కడ ఉండగనే యామిని భర్త పరుగున వచ్చి, కూతుర్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘‘ఎవరూ లేరు కదా! ఇంతసేపూ ఎవరితోమాట్లాడుతున్నావ్ యామినీ’’ అని లోపలికి వెళ్లిపోయాడు. యామిని మాట్లాడలేదు. కళ్ల నిండా నీళ్లతో సత్యనే చూస్తూ ఉంది. - మాధవ్ శింగరాజు -
ఫిరోజ్‌ఖాన్.. ద హీరో!
భువనేశ్వర్ : ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వందలాది మంది ప్రాణాలను కాపాడడంతోపాటు ఎటువంటి ఆస్తినష్టం జరగకుండా అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించిన రైల్వే కానిస్టేబుల్ ఫిరోజ్‌ఖాన్‌ను ‘సాహస పురస్కారం’తో సత్కరించాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే సిఫారసు చేసింది. ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న 45 ఏళ్ల ఫిరోజ్ ఖాన్.. ఏప్రిల్ 27 ఉదయం అలెపీ–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని జహర్సగూడా రోడ్‌స్టేషన్ చేరుకోగానే ఎస్–3 కోచ్‌లో కేకలు, అరుపులు వినిపించాయి. వెంటనే ఖాన్ కోచ్‌లోకి వెళ్లి చూడగా ఒక బెర్త్ కింద ఒక మండుతున్న పాలిథిన్ బ్యాగ్ కనిపించింది. వెంటనే దానిని తీసుకుని ఫ్లాట్ ఫాంకు దూరంగా పరుగెత్తాడు. అక్కడకు చేరుకున్న బాంబ్ స్వా్కడ్ పాలిథిన్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఆరు రకాల పేలుడు పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని నిర్వీర్యం చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతటి క్లిష్టపరిస్థితుల్లో సైతం సమయస్ఫూర్తితో, ధైర్యంగా వ్యవహరించిన తీరుకు ఫిరోజ్ ఖాన్‌కు గ్యాలంటరీ అవార్డు ఇచ్చి సత్కరించాలని కోరుతూ ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. -
యువతిని కాపాడిన శునకం
లండన్: ఊర్లలో వీధి కుక్కలను కాపాడాలని పెద్దవాళ్లు ఎందుకు చెప్పేవారో.. ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక వీధి కుక్క ... ఓ యువతిని ముష్కరుడి నుంచి కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాంటెనీగ్రో.. ఐరోపాలోని చిన్న దేశం. పడగోరికా.. పట్టణం ఆ దేశ రాజధాని. ఈ నగరంలో.. ఒక యువతి రెండు రోజుల కిందట షాపింగ్ చేసుకుని ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఆమె వెళుతున్న దారిలోనే ఒక వీధికుక్క విశ్రాంతి తీసుకుంటోంది. ఇంతలో యువతిని అనుసరిస్తూ వస్తున్న ఓ యువకుడు.. ఎవరూ లేని సమయం చూసి దాడి చేశాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో పాటు.. విలువైన వస్తువులను దోచుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న గ్రామసింహం.. ఒక్కసారిగా యువకుడిపై దాడికి దిగింది. గట్టిగా అరుస్తూ.. అతడి పిక్క పట్టుకుంది. అంతే యువతిని వదిలేసి.. అతగాడు పలాయనం చిత్తగించాడు. బతుకు జీవుడా అని కుక్కను తలుచుకుంటూ.. యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
కుక్క ధైర్యం.. యువతిని రక్షించింది
-
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
- డీఐజీ రమణకుమార్ మద్దికెర: విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని డీఐజీ బీవీ రమణకుమార్ అన్నారు. ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌తో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. జీవితం ఎంతో విలువైనదని, ‡ క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకోవడం తగదన్నారు. సమస్య వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలపై ఆయా పోలీస్స్టేషన్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డీఐజీ వెంట డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ విక్రమసింహ, ఎస్ఐ అబ్దుల్ జహీర్ ఉన్నారు. -
బస్‌ల తయారీ కేంద్రంగా హైదరాబాద్..!
• ప్లాంటు ఏర్పాటు యోచనలో వీర • త్వరలో అశోక్ లేలాండ్ ప్లాంటు • ఇప్పటికే ఎంజీ గ్రూప్, డెక్కన్ కార్యకలాపాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బస్‌ల తయారీకి తెంగాణ కొత్త హబ్‌గా మారనుంది. అంతర్జాతీయ దిగ్గజాలతో ఐటీలో మేటిగా ఉన్న రాష్ట్రంలో ఇప్పటికే ఎంజీ గ్రూప్, డెక్కన్ ఆటోలు ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నారుు. ఇటీవలే అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ ప్లాంటు నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. వీర బ్రాండ్‌తో బస్‌లను తయారు చేస్తున్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్ సైతం తాజాగా తెలంగాణ వైపు చూస్తోంది. ఇప్పటికే 20 దాకా బస్ బాడీ తయారీ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహణలో ఉన్నారుు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం బస్‌లలో 20 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే నడుస్తున్నారుు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారుు. వీర నుంచి రూ.600 కోట్లు... బెంగళూరు సమీపంలో ఉన్న వీర వాహన ఉద్యోగ్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,000 యూనిట్లు. 100 ఎకరాల విస్తీర్ణంలో మరో ప్లాంటు నెలకొల్పాలని కృతనిశ్చయంతో ఉంది. అనుబంధ కంపెనీలు ఉన్న కారణంగా హైదరాబాద్‌లోనే ప్లాంటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నారుు. తొలి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో మరో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కొత్త ప్లాంటు ద్వారా విదేశీ మార్కెట్లలో అడుగు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇక అశోక్ లేలాండ్ తెలంగాణ ప్లాంటుకై తొలి దశలో రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. బస్‌లతోపాటు రానున్న రోజుల్లో ట్రక్‌లను సైతం తయారు చేస్తామని పేర్కొంది కూడా. కంపెనీ చేతికి స్థలం రాగానే 16 నెలల్లో ప్లాంటు రెడీ కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 20 శాతం.. దేశవ్యాప్తంగా ఏటా 90,000 బస్‌లు అమ్ముడవుతున్నారుు. ఇందులో ఏపీఎస్ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ రోడ్డు రవాణా సంస్థలు కొంటున్నవి 45 శాతం దాకా ఉంటున్నారుు. ఆసక్తికర విషయమేమంటే ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్న మొత్తం బస్సుల్లో 20 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతున్నారుు. ఈ రెండు రాష్ట్రాల్లో 200 దాకా బస్ ఆపరేటర్లు ఉన్నారని కరోనా బస్ మాన్యుఫాక్యరర్స్ డెరైక్టర్, డెక్కన్ ఆటో ప్రిన్సిపల్ అడ్వైజర్ ఎం.బాలాజీ రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతున్న బస్సుల్లో 60 శాతానికి రిజిస్ట్రేషన్లు కర్ణాటకలో జరుగుతున్నారుు. పన్నులతోపాటు విధానమూ మారితే తెలంగాణ, ఏపీలో రిజిస్ట్రేషన్లు జరిగి ఆదాయం వస్తుందని కంపెనీలు చెబుతున్నారుు. కన్సాలిడేషన్‌కు అవకాశం!! ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం ఇటీవల ప్రకటించిన బస్ కోడ్ వల్ల పరిశ్రమలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఏర్పడుతున్నట్లు సబంధిత వర్గాలు చెబుతున్నారుు. ‘‘‘2017 ఏప్రిల్ నుంచి బస్ కోడ్ పూర్తిస్థారుులో అమల్లోకి రానుంది. దీని ప్రకారం తయారీ సంస్థలు తాము రూపొందించిన డిజైన్‌కు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒక్కో డిజైన్ అనుమతి పొందాలంటే ఎంత కాదన్నా రూ.40 లక్షల దాకా ఖర్చవుతుంది. దీన్ని చిన్న కంపెనీలు భరించలేవు కనక బస్ బిల్డింగ్ వ్యాపారంలో ఉన్న చిన్న కంపెనీలు పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. కన్సాలిడేషన్ తప్పకపోవచ్చు’’ అని బాలాజీరావు వ్యాఖ్యానించారు. ఇదీ భారత బస్ పరిశ్రమ.. దేశంలోని బస్, కోచ్ పరిశ్రమలో బాడీ బిల్డింగ్ వాటా 32 శాతం. వచ్చే నాలుగైదేళ్లు 8-9 శాతం వార్షిక వృద్ధి ఉంటుందని ఎంజీ గ్రూప్ ఎండీ అనిల్ కామత్ చెప్పారు. ప్యాసింజర్ వాహన విపణిలో బస్‌ల వాటా 45 శాతం ఉందన్నారు. ఏటా 90,000 బస్సులు కొత్తగా రోడ్డెక్కుతున్నారుు. వీటిలో రూ.90 లక్షలు ఆపైన ధర ఉండే ప్రీమియం లగ్జరీ కోచ్‌లు 1,000 దాకా ఉంటాయని చెప్పారాయన. నగరాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య ఏటా 14 శాతం పెరుగుతోంది. భారత్‌లో 2,000 మంది జనాభాకు ఒక బస్ మాత్రమే ఉంది. అదే యూఎస్‌లో ఈ సంఖ్య 32. దేశంలో అపార అవకాశాలు ఉన్నాయని ఎంజీ గ్రూప్ అంటోంది. 65 శాతం విక్రయాలు ఏప్రిల్-ఆగస్టు మధ్యే జరుగుతున్నారుు. -
‘సాహసానికి’ సన్మానం
కర్నూలు: కర్తవ్య విధి నిర్వహణలో పోలీసులు ప్రాణ త్యాగాలకు వెనుకాడరని పెద్దతుంబళం పోలీసులు నిరూపించారని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా పోలీసులు ప్రజలకు మంచి సేవలు అందించి శాఖకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కందుకూరు తుంగభద్ర నదిలో ప్రాణాలకు తెగించి ఏడుగురిని రక్షించిన పోలీసులను మంగళవారం జిల్లా కేంద్రానికి రప్పించి ఎస్పీ ఆకె రవికష్ణ సన్మానించారు. నదిలో కొట్టుకపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మనోధైర్యాన్ని కలుగజేసి వారి ప్రాణాలను కాపాడిన పెద్దతుంబళం ఎస్ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున స్వామిని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అభినందించి సన్మానించారు. రిస్క్యూ టీమ్‌లో పాల్గొన్న పీసీలు 888, 3715, 3693, 3638, 2926, 3640, 9091 తదితరులను కూడా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్ కూడా పాల్గొన్నారు. సమయానికి వచ్చి తమ ప్రాణాలు కాపాడారని బాధితులు కృతజ్ఞతలు తెలిపినట్లు ఈ సందర్బంగా ఎస్పీ వెల్లడించారు. -
వెనక్కు వెళితే భయపడిందనుకున్నాడు
మాస్కో: మొన్న భారతీయ వనిత. నేడు రష్యా వనిత.. వెలుగులోకి రానివారు ఇంకెందరో. ఎవరైతేనేం.. మొత్తానికి మహిళలు 'ధైర్యే సాహసే లక్ష్మీ' అన్నట్లుగా దూసుకుపోతున్నారు. కత్తులకు జంకకుండా, బాంబులకు బెదరకుండా దొంగల ఆటకట్టిస్తున్నారు. మున్ముందు మహిళలు ఉన్న షాపుల్లోకి వెళ్లాలంటేనే దొంగలు ఓ పదిసార్లు ఆలోచించుకుంటారేమో. అది రష్యాలోని ఓరెన్ బర్గ్.. అక్కడ ఓ పెద్ద ఫ్యాన్సీ, బేకరి, షాపు ఉంది. అందులో ఓ యువతి సహాయకురాలిగా పనిచేస్తోంది. ఆమె వస్తువులు సర్దుకునే పనిలో ఉండగా ఓ దొంగ మంకీక్యాప్ కోటుతో లోపలికి వచ్చాడు. ఆమె ఏం కావాలి అని అడుగుతుండగానే కత్తి తీసి పొడిచేస్తా అని బెదిరించాడు. దీంతో ఆమె కొంచెం లోపలికి పరుగెత్తింది. ఆ దొంగ ఆమె భయపడిపోయిందిలే అనుకొని ఎంచక్కా క్యాష్ కౌంటర్లోకి తొంగిచూస్తూ చేత్తో అందులో క్యాష్ బుక్ డబ్బులు అందుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే ఆ యువతి ఒక పెద్ద పింగాణి కప్పు తీసుకొని వచ్చి అతడి తలపై బలంగా కొట్టింది. దాంతో బిత్తరపోయిన ఆ దొంగ వెంటనే తేరుకొని చేతికందినకాడికి తీసుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయాడు.