బస్ల తయారీ కేంద్రంగా హైదరాబాద్..! | ashok leylond plant in hyderabad | Sakshi
Sakshi News home page

బస్ల తయారీ కేంద్రంగా హైదరాబాద్..!

Published Wed, Nov 9 2016 2:13 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

బస్ల తయారీ కేంద్రంగా హైదరాబాద్..! - Sakshi

బస్ల తయారీ కేంద్రంగా హైదరాబాద్..!

ప్లాంటు ఏర్పాటు యోచనలో వీర
త్వరలో అశోక్ లేలాండ్ ప్లాంటు
ఇప్పటికే ఎంజీ గ్రూప్, డెక్కన్ కార్యకలాపాలు 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బస్‌ల తయారీకి తెంగాణ కొత్త హబ్‌గా మారనుంది. అంతర్జాతీయ దిగ్గజాలతో ఐటీలో మేటిగా ఉన్న రాష్ట్రంలో ఇప్పటికే ఎంజీ గ్రూప్, డెక్కన్ ఆటోలు ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నారుు. ఇటీవలే అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ ప్లాంటు నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. వీర బ్రాండ్‌తో బస్‌లను తయారు చేస్తున్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్ సైతం తాజాగా తెలంగాణ వైపు చూస్తోంది. ఇప్పటికే 20 దాకా బస్ బాడీ తయారీ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహణలో ఉన్నారుు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం బస్‌లలో 20 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే నడుస్తున్నారుు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారుు.

 వీర నుంచి రూ.600 కోట్లు...
బెంగళూరు సమీపంలో ఉన్న వీర వాహన ఉద్యోగ్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,000 యూనిట్లు. 100 ఎకరాల విస్తీర్ణంలో మరో ప్లాంటు నెలకొల్పాలని కృతనిశ్చయంతో ఉంది. అనుబంధ కంపెనీలు ఉన్న కారణంగా హైదరాబాద్‌లోనే ప్లాంటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నారుు. తొలి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో మరో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కొత్త ప్లాంటు ద్వారా విదేశీ మార్కెట్లలో అడుగు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇక అశోక్ లేలాండ్  తెలంగాణ ప్లాంటుకై  తొలి దశలో రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. బస్‌లతోపాటు రానున్న రోజుల్లో ట్రక్‌లను సైతం తయారు చేస్తామని పేర్కొంది కూడా. కంపెనీ చేతికి స్థలం రాగానే 16 నెలల్లో ప్లాంటు రెడీ కానుంది.

 తెలుగు రాష్ట్రాల్లోనే 20 శాతం..
దేశవ్యాప్తంగా ఏటా 90,000 బస్‌లు అమ్ముడవుతున్నారుు. ఇందులో ఏపీఎస్‌ఆర్‌టీసీ వంటి ప్రభుత్వ రంగ రోడ్డు రవాణా సంస్థలు కొంటున్నవి 45 శాతం దాకా ఉంటున్నారుు. ఆసక్తికర విషయమేమంటే ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్న మొత్తం బస్సుల్లో 20 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతున్నారుు. ఈ రెండు రాష్ట్రాల్లో 200 దాకా బస్ ఆపరేటర్లు ఉన్నారని కరోనా బస్ మాన్యుఫాక్యరర్స్ డెరైక్టర్, డెక్కన్ ఆటో ప్రిన్సిపల్ అడ్వైజర్ ఎం.బాలాజీ రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతున్న బస్సుల్లో 60 శాతానికి రిజిస్ట్రేషన్లు కర్ణాటకలో జరుగుతున్నారుు. పన్నులతోపాటు విధానమూ మారితే తెలంగాణ, ఏపీలో రిజిస్ట్రేషన్లు జరిగి ఆదాయం వస్తుందని కంపెనీలు చెబుతున్నారుు.

కన్సాలిడేషన్‌కు అవకాశం!!
ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం ఇటీవల ప్రకటించిన బస్ కోడ్ వల్ల పరిశ్రమలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఏర్పడుతున్నట్లు సబంధిత వర్గాలు చెబుతున్నారుు. ‘‘‘2017 ఏప్రిల్ నుంచి బస్ కోడ్ పూర్తిస్థారుులో అమల్లోకి రానుంది. దీని ప్రకారం తయారీ సంస్థలు తాము రూపొందించిన డిజైన్‌కు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒక్కో డిజైన్ అనుమతి పొందాలంటే ఎంత కాదన్నా రూ.40 లక్షల దాకా ఖర్చవుతుంది. దీన్ని చిన్న కంపెనీలు భరించలేవు కనక బస్ బిల్డింగ్ వ్యాపారంలో ఉన్న చిన్న కంపెనీలు పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. కన్సాలిడేషన్ తప్పకపోవచ్చు’’ అని బాలాజీరావు వ్యాఖ్యానించారు.

ఇదీ భారత బస్ పరిశ్రమ..
దేశంలోని బస్, కోచ్ పరిశ్రమలో బాడీ బిల్డింగ్ వాటా 32 శాతం. వచ్చే నాలుగైదేళ్లు 8-9 శాతం వార్షిక వృద్ధి ఉంటుందని ఎంజీ గ్రూప్ ఎండీ అనిల్ కామత్ చెప్పారు. ప్యాసింజర్ వాహన విపణిలో బస్‌ల వాటా 45 శాతం ఉందన్నారు. ఏటా 90,000 బస్సులు కొత్తగా రోడ్డెక్కుతున్నారుు. వీటిలో రూ.90 లక్షలు ఆపైన ధర ఉండే ప్రీమియం లగ్జరీ కోచ్‌లు 1,000 దాకా ఉంటాయని చెప్పారాయన. నగరాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య ఏటా 14 శాతం పెరుగుతోంది. భారత్‌లో 2,000 మంది జనాభాకు ఒక బస్ మాత్రమే ఉంది. అదే యూఎస్‌లో ఈ సంఖ్య 32. దేశంలో అపార అవకాశాలు ఉన్నాయని ఎంజీ గ్రూప్ అంటోంది. 65 శాతం విక్రయాలు ఏప్రిల్-ఆగస్టు మధ్యే జరుగుతున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement