Manufacturing Sector
-
ఏడు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. ఐఐపీ అప్
కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జూలై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 7–9 మధ్య ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష చేపట్టనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.26 శాతంగా, గతేడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 222 బేసిస్ పాయింట్ల మేర తగ్గినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. 2023 మే తర్వాత ఇదే కనిష్టమని పేర్కొంది. కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పు ధాన్యాలు మొదలైన వాటి ధరల పెరుగుదల తగ్గడమే రిటైల్, ఆహార ద్రవ్యోల్బణాలు దిగి రావడానికి కారణమని వివరించింది. ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్జనవరిలో ఐఐపీ 5 శాతం అప్తయారీ కార్యకలాపాలు పుంజుకోవడంతో దేశీయంగా పారిశ్రామికోత్పత్తి జనవరిలో మెరుగుపడింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 5%గా నమోదైంది. ఇది 2024 నవంబర్‌లో 5 శాతంగా ఉంది. 2024 డిసెంబర్ గణాంకాలను ప్రభుత్వం 3.2% నుంచి 3.5%కి సవరించింది. ఇక, గతేడాది జనవరిలో 3.6%గా ఉన్న తయారీ రంగ ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 5.5%కి పెరిగింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 6 శాతం నుంచి 4.2 శాతానికి నెమ్మదించింది. -
మైక్రోమ్యాక్స్ సోలార్ పవర్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలోకి ప్రవేశించింది. సోలార్ ప్యానెళ్ల తయారీ కోసం స్టార్టప్ ఎనర్జీ పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. నివాస గృహాలు, కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సోలార్ ప్యానెళ్లను తయారు చేయడంపై ఇది దృష్టి పెడుతుందని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. అధునాతన ఆటోమేషన్ సామర్థ్యాలతో స్టార్టప్ ఎనర్జీ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం చైనాకు చెందిన జిన్చెన్ సంస్థతో వ్యూహాత్మక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. దీని కింద 5 గిగావాట్ల అధునాతన సోలార్ మాడ్యూల్స్ తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త తరం సోలార్ సొల్యూషన్స్‌పై పరిశోధనలు, అభివృద్ధి కోసం స్టార్టప్ ఎనర్జీ వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకుంటుందని చెప్పారు. -
భారత ఫార్మాకు కొత్త అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న భారతీయ కంపెనీలకు 2025–26లో మరిన్ని కొత్త అవకాశాలు అందనున్నాయి. భారీ అమ్మకాలను నమోదు చేస్తున్న సుమారు 25 ఔషధాల పేటెంట్ల గడువు ముగియనుండడమే ఇందుకు కారణం. భారతీయ సంస్థలకు మరింత సరసమైన ప్రత్యామ్నాయాలను అంతర్జాతీయంగా పరిచయం చేయడానికి ఇదొక పెద్ద అవకాశం కానుంది. ప్రపంచ జెనెరిక్ ఔషధ మార్కెట్లో తయారీ, ఎగుమతుల పరిమాణం పరంగా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన భారత్ 20 శాతంపైగా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. భారత్ బలమైన స్థానాన్ని కైవసం చేసుకుని తన హవాను కొనసాగిస్తోంది. వచ్చే 14 నెలల్లో పేటెంట్ల కాల పరిమితి ముగిసే ఔషధాలు భారత్ పాత్రను మరింత మెరుగుపర్చనున్నాయి. ఏటా రూ. 25.80 వేల కోట్లకుపైగా.. క్యాన్సర్ ఇమ్యునోథెరపీ కోసం యూఎస్ ఫార్మా దిగ్గజం మెర్క్ అభివృద్ధి చేసిన కీట్రూడా, అలాగే మధుమేహం, స్థూలకాయం చికిత్సకై డెన్మార్క్ కంపెనీ నోవో నార్డిస్క్ ఉత్పత్తి చేసిన ఓజెంపిక్ వంటి కీలక ఔషధాల పేటెంట్లు 2025–26లో ముగుస్తాయి. కీట్రూడా ఒక్కటే 2024లో రూ.2,15,000 కోట్లకుపైగా అమ్మకాలను ఆర్జించింది. బ్రిస్టల్–మేయర్స్ స్క్విబ్ తయారీ బ్లడ్ థిన్నర్ అయిన ఎలిక్విస్, నోవారి్టస్ ఉత్పత్తి చేసిన ఇమ్యునాలజీ డ్రగ్ కోసెంటిక్స్ వంటి ఇతర ముఖ్య ఔషధాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 2023–2029 మధ్య క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక వ్యవస్థకు వచ్చే రుగ్మతల చికిత్సలో ఉపయోగించే 100 కంటే ఎక్కువ క్లిష్ట ఔషధాల పేటెంట్ల గడువు ముగుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వార్షిక అమ్మకాలు రూ.25,80,000 కోట్లకు పైమాటే. ఇది జెనెరిక్స్, బయోసిమిలర్ల తయారీలో ఉన్న దేశీయ కంపెనీలకు అదనపు అవకాశాలను సృష్టించనుందని అనడంలో అతిశయోక్తి కాదు. వార్షిక వృద్ధి 7 శాతంపైగా.. యూరోపియన్ ఫార్మాస్యూటికల్ రివ్యూ ప్రకారం ప్రధానంగా ఈ పేటెంట్ల గడువు ముగియడంతో జెనెరిక్స్ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా సగటు వార్షిక వృద్ధి 7 శాతంపైగా నమోదవుతుందని అంచనా. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోకాన్, అరబిందో, హెటిరో, లీ ఫార్మా వంటి భారతీయ సంస్థలు దీని నుండి లాభపడతాయి. బయోసిమిలర్ల విభాగంలోనూ దేశీయ కంపెనీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీలు చవక జెనెరిక్స్ తయారీదారుల నుండి ముఖ్యంగా చైనాలో ఉన్న సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ వంటి మార్కెట్లలో ధరల ఒత్తిడి, ఫార్మసీల నుండి గణనీయ తగ్గింపుల కోసం డిమాండ్లు కంపెనీల లాభాలను ప్రభావితం చేయవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్లో రూ.21,183 కోట్లు.. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులు 2024 డిసెంబర్లో రూ.21,183 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 2.69 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–డిసెంబర్లో ఎగుమతులు 7.85% దూసుకెళ్లి రూ.1,82,021.36 కోట్లకు చేరాయి. ఫార్మా దిగుమతులు డిసెంబర్లో 12.85 % పెరిగి రూ.7,033 కోట్లను తాకాయి. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో ఇవి 7.94% ఎగసి రూ. 55,551.4 కోట్లు నమోదు చేశాయి. దేశం నుంచి 2023–24లో సుమారు రూ.2,36,300 కోట్ల విలు వైన ఔషధాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. జెనెరిక్ మెడిసిన్ అంటే.. బ్రాండెడ్ మెడిసిన్ అనేది పేటెంట్ పొందిన, బ్రాండ్ పేరుతో విక్రయించే ఒక కొత్త ఔషధం. నూతన ఔషధాన్ని నిరీ్ణత వ్యవధిలో తయారు చేయడానికి, అలాగే విక్రయించడానికి ప్రత్యేక హక్కును చట్టపరంగా కల్పించడమే పేటెంట్. పేటెంట్ పొందిన ఔషధం యొక్క కాపీయే జెనెరిక్ మెడిసిన్. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత నియంత్రణ సంస్థల అనుమతితో జెనెరిక్స్ ఔషధాలు తయారు చేసి విక్రయించవచ్చు. భారతీయ ఔషధ కంపెనీలకు యూఎస్, యూకే, రష్యా, దక్షిణాఫ్రికా ప్రధాన మార్కెట్లు. -
జోరందుకున్న తయారీ రంగం
భారత తయారీ రంగం జనవరి నెలకు పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గత డిసెంబర్లో 56.4 శాతంగా ఉంటే, 2025 జనవరి నెలలో 57.7కు దూసుకుకెళ్లింది. ఎగుమతులు 14 ఏళ్లలోనే (2011 తర్వాత) బలమైన వృద్ధిని చూపించడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు ఈ సర్వే అభిప్రాయపడింది. 50 పాయింట్లకు పైన తయారీ పీఎంఐ నమోదు అయితే దాన్ని విస్తరణగా, అంతకు దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తుంటారు.‘భారత తయారీ పీఎంఐ ఆరు నెలల గరిష్ట స్థాయికి జనవరిలో చేరుకుంది. దేశీ, ఎగుమతుల డిమాండ్ బలంగా ఉంది. ఇది వృద్ధికి మద్దతునిచ్చింది’ అని హెచ్ఎస్బీసీ ముఖ్య భారత ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. తయారీదారులకు కొత్త ఆర్డర్లలో వృద్ధి ఉన్నట్టు, దీనికి అనుగుణంగా తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్టు పీఎంఐ సర్వే తెలిపింది. రానున్న కాలంలో 32 శాతం సంస్థలు వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉంటే, కేవలం ఒక శాతం సంస్థలు క్షీణతను అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్ టెక్ కంపెనీఐపీవోకు వీడా క్లినికల్ రీసెర్చ్క్లినికల్ రీసెర్చ్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.185 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. ఇంతక్రితం కంపెనీ 2021 సెపె్టంబర్‌లోనూ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. సెబీ నుంచి అనుమతి లభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఐపీవోను పక్కనపెట్టింది. కంపెనీ ప్రధానంగా వివిధ దశల ఔషధ అభివృద్ధిలో సర్వీసులు అందిస్తోంది. తొలి దశసహా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ తదితర సేవలు సమకూర్చుతోంది. -
భారత్ తయారీ రంగం డీలా
భారత్ తయారీ రంగం(manufacturing sector) డిసెంబర్లో డీలా పడింది. హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డిసెంబర్లో 56.4కు పడిపోయింది. గడచిన 12 నెలల్లో ఇంత తక్కువ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. కొత్త బిజినెస్ ఆర్డర్లు, ఉత్పత్తిలో మందగమనం(slowdown) కనిపించిందని ఈ మేరకు వెలువడిన సర్వే పేర్కొంది. అయితే సూచీ 50పైన ఉంటే దీన్ని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. అంతకంటే తక్కువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీర్ఘకాలికంగా తయారీ సూచీ 54.1గా ఉండడం గమనార్హం. 2025లో ఉత్పత్తిలో భారీ పెరుగుదల నమోదవుతుందన్న విశ్వాసంలో తయారీదారులు ఉన్నట్లు సర్వే పేర్కొంది.ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుపేఇన్స్టాకార్డ్ కార్యకలాపాల విస్తరణఫిన్టెక్ కంపెనీ పేఇన్‌స్టాకార్డ్ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాలన్ని ప్రారంభించింది. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ (BIAC) ఇండియా పార్ట్నర్, పేఇన్‌స్టాకార్డ్ ఛైర్మన్ పచ్చిపాల దొరస్వామి, వ్యవస్థాపక సీఈవో సాయికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్యను 100కు పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సాయికృష్ణ తెలిపారు. తక్కువ లావాదేవీ వ్యయాలతో బిల్లులు, అద్దెలు, ఫీజులు మొదలైనవి చెల్లించేందుకు అనువైన సాధనంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,00,000 మంది పైగా యూజర్లకు చేరువైనట్లు వివరించారు. -
భారత్‌కు ‘తయారీ’ స్వర్ణయుగం
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అన్నారు. ప్రపంచ సరఫరాల చైన్ భారతదేశానికి అనుకూలంగా మారుతుండడం ఇక్కడ సానుకూల అంశమని పే ర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపారాలు సవాళ్లను తట్టుకుంటూ, స్థిరీకరణ సాధిస్తున్నాయని తద్వారా ఈ రెండింట మధ్య (సవాళ్లు–స్థిరీకరణ) కొత్త సమతౌల్యతను సంస్థలు సాధిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రూప్ కంపెనీల సిబ్బందికి చంద్రశేఖరన్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని పంపారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → భారతదేశం ఇప్పుడు తయారీ స్వర్ణయుగంలో ఉంది. 2024 తర్వాత 2025కోసం ఆశావాదంతో ఎదురు చూస్తున్నాను. టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాను కోల్పోవడంతో ఈ సంవత్సరం గ్రూప్‌కు ఒక విచారకరమైన ఏడాదిగా నిలిచింది. → ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నేతృత్వంలోని కీలక చొరవలు జరుగుతాయని, ఇవి మొత్తం మానవాళికి సహాయపడతాయని భావిస్తున్నాం. → తయారీకి భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉంది. → మహమ్మారి స్వల్పకాలిక నష్టాన్ని కలిగించినా ఆన్లైన్, ఏఐ వినియోగం వ్యవస్థలో శాశ్వత ప్రయోజనాలను అందించే స్థాయికి ఎగశాయి. → టాటా గ్రూప్ 5 లక్షల తయారీ ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. → బ్యాటరీలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరికరాలు, హార్డ్‌వేర్ ప్రాజెక్టుల్లో దేశం నేటి పెట్టుడులు రేపటి ఆర్థిక వ్యవస్థలో మున్ముందు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. → గుజరాత్ ధొలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్, అస్సాంలోని సరికొత్త సెమీకండక్టర్– ఓఎస్ఏటీప్లాంట్ సహా ఏడు కొత్త ఉత్పాదక కర్మాగారాలకు భూమిపూజలు, నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలోని నరసపురలో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ ప్లాంట్, తమిళనాడులోని పనపాక్కంలో ఆటోమోటివ్ ప్లాంట్, కర్ణాటకలోని బెంగళూరులో కొత్త ఎంఆర్ఓ చొరవలను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. మనం గుజరాత్‌లోని సనంద్‌లో అలాగే బ్రిటన్‌లోని సోమర్సెట్లో కొత్త బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలను కూడా కలిగి ఉన్నాము. అలాగే గుజరాత్‌లోని వడోదరలో సీ295 ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్)ను ప్రారంభించాము. తమిళనాడులోని తిరునెల్వేలిలో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించాము. కొత్తగా ఐదు లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు, రిటైల్, టెక్ సరీ్వసెస్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఇతర రంగాలలో అనేక సేవల ఉద్యోగాలను అదనంగా గ్రూప్ కల్పించనుంది. → ఇటువంటి వృద్ధి చొరవలు గ్రూప్‌నకు అలాగే భారతదేశానికి ఉత్తేజకరమైనవి. ప్రతి నెలా గ్రూప్ వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే 10 లక్షల మంది యువకులకు ఈ చొరవలు ఆశావాదన్ని కల్పిస్తాయి. → సెమీకండక్టర్ తయారీ వంటి రంగాల నుండి పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. → ఉక్రెయిన్, గాజా, సూడాన్‌లలో సైనిక ఘర్షణలు చూస్తున్నాం. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో మానవతా సంక్షోభాలు తీవ్రం అయ్యాయి. బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో పౌరుల నేతృత్వంలోని ఉద్యమాలను కూడా చూశాము. ఆయా అంశాలు దేశీయ, విదేశీ విధాన కల్పనలపై తీవ్ర ప్రభావితం చూపుతాయి. ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్, సాంకేతికత ఇక్కడ ప్రస్తావనాంశాలు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి టారిఫ్‌లు మరోసారి నాయకుల మనస్సుల్లో ఉన్నాయి. వీటిపై అనిశ్చితి వాతావరణం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రూప్ పురోగతి స్థిరంగా కొనసాగింది. -
తయారీ రంగం, ఆహార ద్రవ్యోల్బణంపై సూచనలు
బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.స్తబ్దుగా తయారీ రంగందేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్లకు దెబ్బ!ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలుసమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు. -
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
తయారీలో సహకారంపై భారత్, సౌదీ చర్చలు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై భారత్, సౌదీ అరేబియా దృష్టి పెడుతున్నాయి. రెండు రోజుల సౌదీ పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్, ఆ దేశ మంత్రులతో ఈ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్షియేటివ్ కార్యక్రమంలో పాల్గొంటారని, పలువురు అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లతో కూడా భేటీ అవుతారని వివరించింది. వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఇండియా–సౌదీ స్ట్రాటెజిక్ పార్ట్నర్íÙప్ కౌన్సిల్ కింద ఎకానమీ–ఇన్వెస్ట్మెంట్ కమిటీ రెండో సమావేశానికి కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. సౌదీ అరేబియాకు భారత్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్‌కు సౌదీ అరేబియా నాలుగో అతి పెద్ద భాగస్వామి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 43 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎల్అండ్టీ, టాటా, విప్రో తదితర దిగ్గజ భారతీయ కంపెనీలు సౌదీ అరేబియాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ అరేబియా 3.22 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. -
జాబ్ లేదా? ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు!
టాటా గ్రూప్ వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ తయారీ విభాగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యానికి తయారీ రంగం కీలకంగా మారుతుంది. ఈ రంగంలో రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తలంచిన వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోలేము. తయారీ రంగం వృద్ధి దిశగా టాటా గ్రూప్ సంస్థలు వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ రంగాల్లో విభిన్న పరికరాలను తయారు చేసేలా టాటా గ్రూప్ చర్యలు చేపడుతోంది. అందుకోసం రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలుటాటా గ్రూప్ అస్సాంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగం వృద్ధి చెందితే దేశ దిగుమతులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులు అధికమవుతాయి. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది. దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దానికి బదులుగా ఉత్పాదకతను పెంచి ఎగుమతులను మెరుగుపరిస్తే ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. బాణా సంచాపై నిషేధం
ఢిల్లీ : దీపావళికి ముందే ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది.అంతేకాదు, అన్నీ రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలు వెంటనే అమ్మల్లోకి తెచ్చేలా కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) ఢిల్లీలో గాలి కాలుష్యంపై దృష్టి సారించింది. పండుగ సీజన్లో ముఖ్యంగా నిన్నటి దసరా వరకు గాలి నాణ్యత భారీగా తగ్గినట్లు గుర్తించింది.అదే సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషించింది. ఆదివారం మద్యాహ్నం 4గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ బోర్డ్ బాణా సంచాపై నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ వాసులు బాణా సంచా కాల్చకుండానే ఈ దీపావళి జరుపుకోనున్నారు.గాలిలో నాణ్యత ఎలా ఉంటే మంచిది..సాధారణ గాలి ఏక్యూఐ 0–50 మంచి గాలి.. ఇబ్బంది లేదు.51 – 100 పర్వాలేదు.. చిన్న చిన్న స్థాయిలో రోగాలు101 – 150 శరీరంపై చిన్నదద్దుర్లు, ఎలర్జీ, నీరసం151 – 200 ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి, కళ్లు తిరుగుతాయి.201 – 300 ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి. కిడ్నీలపై ప్రభావం వాటి సమస్యలు300+ అయితే ఆ ప్రాంత గాలి పిలిస్తే నిత్యం ప్రమాదమే.. అనేక రోగాలబారిన పడతారు. -
సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: సేవల రంగం సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 57.7 వద్ద ముగిసింది. గడచిన 10 నెలల కాలంలో సూచీ ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్త వ్యాపారం, అంతర్జాతీయ అమ్మకాలు, ఉత్పత్తిలో వృద్ధి మందగించినట్లు నెలవారీ సర్వే పేర్కొంది.తీవ్ర పోటీ పరిస్థితులు, ద్రవ్యోల్బణ సవాళ్లు, వినియోగదారుల ఎంపికలో మార్పు (ఆన్లైన్ సర్వీసుల్లోకి మారడం), కొత్త ఎగుమతి ఆర్డర్లలో అంతగా పెరుగుదల లేకపోవడం వంటి అంశాలు కూడా సేవల రంగం మందగమనానికి కారణమయ్యాయి. ఆగస్టులో సూచీ 60.9 వద్ద ఉంది. కాగా సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. అయితే 2024లో సూచీ 60 లో పునకు పడిపోవడం సెపె్టంబర్‌లోనే మొదటిసారి. ఇదీ చదవండి: జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!తయారీ–సేవలు కలిపినా డౌన్...సేవలు–తయారీ రంగం కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.7 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 58.3కు తగ్గింది. అయితే సూచీలో మందగమనం చోటుచేసుకున్నప్పటికీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన మెరుగ్గానే ఉందని, ఆగస్టు నుంచి వ్యాపార ధోరణి పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఒక్క తయారీ రంగమే సెప్టెంబర్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.5కు తగ్గింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టులో సూచీ 57.5 వద్ద ఉంది. 400 తయారీ సంస్థల ప్యానల్లోని పర్చేజింగ్ మేనేజర్లకు పంపబడిన ప్రశ్నపత్రాల ప్రతిస్పందనలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసి, హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐని రూపొందిస్తుంది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా మెజారిటీ కాగా, పారిశ్రామిక రంగం వాటా దాదాపు 25 శాతం. ఇందులో తయారీ రంగం వాటా దాదాపు 75 శాతం. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
చైనా గట్టి నిర్ణయం.. విదేశాలకు ఆహ్వానం!
చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.చైనాకు చెందిన నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.ఆరోగ్య రంగంలోనూ..మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో అప్లికేషన్లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్డాంగ్, హైనాన్ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్లలో అనుమతించనున్నారు.దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్జౌ, షెన్జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. -
విమాన తయారీకి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్‌సభ ఆగస్ట్‌లో ఆమోదించింది. ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్‌బస్‌లకు భారత్ కీలక మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్వో) కార్యకలాపాలలో సైతం భారత్‌కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. -
భారత్ వృద్ధికి తయారీ రంగం కీలకం: పీయూష్ గోయల్
భారతదేశంలో తయారీ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే దేశాభివృద్ధిని నిర్ణయిస్తుందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ ఫోరమ్‌లో వెల్లడించారు. 2017 నాటికి వికసిత భారత్ సాకారానికి తయారీ రంగం కీలకమని అన్నారు.భారతదేశ జీడీపీ వేగవంతమవుతున్నప్పటికీ.. తయారీ రంగం వృద్ధి సాపేక్షంగా నిలిచిపోయింది. జీడీపీలో దీని వాటా 15 శాతం నుంచి 16 శాతంగా ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ సంఖ్య స్థిరంగా ఉంది. అంటే జీడీపీ పెరుగుతున్నప్పటికీ తయారీ రంగం ఇందులో చెప్పుకోదగ్గ వృద్దివైపు అడుగులు వేయడం లేదు.కోట్ల జనాభా ఉన్న మన దేశంలో నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి భారత్ ఎంతో అభివృద్ధి చెందగలదని గోయల్ పేర్కొన్నారు. అయితే దేశంలోని కంపెనీలు తమకు కావాల్సిన వస్తువులను లేదా ఉత్పత్తులను మరో దేశీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలి. ఇది తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం సహాయపడుతుందని ఆయన అన్నారు.ఒక భారతీయ కంపెనీ మరొక భారతీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయడం ఒక స్థితిస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది వ్యాపారాల అంతరాయాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం కూడా దేశాభివృద్ధికి చాలా పాటుపడుతోందని అన్నారు. -
ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలు
తయారీ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. పురుషులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఈ రంగంలో ఆటోమేషన్ (మెషినరీ సాయంతో పనుల నిర్వహణ)తో మహిళల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది భారత్ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తయారీ రంగం మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఆటోమేషన్‌ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది.టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ మాట్లాడుతూ..‘దేశీయంగా చాలా కంపెనీలు దశలవారీ ఆటోమేషన్‌ను అమలు చేస్తున్నాయి. మహిళల నియామకాలు మొదలు పెట్టాయి. తయారీ రంగాల్లో ఆటోమేషన్ అమలు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు మరింత మంది మహిళలను పనుల్లోకి తీసుకుంటున్నాయి. భారత తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 15–20 శాతంలోపే ఉంటారు. ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తున్న కంపెనీల్లో ఇప్పటికే మహిళల నియామకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం విడిభాగాల తయారీ సంస్థలు మరింత మంది మహిళలను తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. శ్రామికశక్తిలో లింగ సమతుల్యంపై కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి’ అని అన్నారు.ఇదీ చదవండి: కార్ల ధరపై భారీ డిస్కౌంట్లుకొన్ని విభాగాల్లో మెరుగైన అవకాశాలుతయారీలో కొన్ని రంగాలు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుండడడాన్ని టీమ్‌లీజ్ నివేదిక ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో కార్మికుల్లో 70–80 శాతం మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే టెక్స్టైల్స్, వస్త్రాల తయారీలోనూ సహజంగానే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఫ్యాబ్రికేటెడ్, బేసిక్ మెటల్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, మోటారు వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమల్లో కఠినమైన పని పరిస్థితుల దృష్ట్యా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, వీటిల్లో ఆటోమేషన్ అమలు తక్కువగా ఉన్నట్టు టీమ్‌లీజ్ తెలిపింది. ఇక ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్లోనూ పురుషులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
తయారీకి ‘ఆర్డర్ల’ జోష్..
న్యూఢిల్లీ: సానుకూల డిమాండ్, కొత్త ఆర్డర్ల దన్నుతో జూన్‌లో తయారీ రంగ ఉత్పత్తి పెరిగింది. దీంతో ఉద్యోగాల కల్పన కూడా గణనీయంగా మెరుగుపడింది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సూచనగా గత నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్‌లో 58.3కి పెరిగింది. మే నెలలో ఇది 57.5గా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. కొత్త ఆర్డర్ల రాకతో కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటున్నట్లు హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఎకానమిస్ట్ మైత్రేయి దాస్ తెలిపారు. 2005 మార్చిలో దీనికి సంబంధించిన డేటాను సేకరించడం మొదలుపెట్టిన తర్వాత గత 19 ఏళ్లలో ఉద్యోగాల కల్పన రేటు ఇంత వేగవంతంగా ఉండటం ఇదే తొలిసారని వివరించారు. జూన్‌లో సిబ్బంది వ్యయాలతో పాటు ముడి వస్తువులు, రవాణాపై ఖర్చులు పెరగడంతో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు దాస్ చెప్పారు. -
రక్షణ ఉత్పత్తుల్లో భారత్ ముద్ర
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీకి భారత్ కేంద్రంగా అవతరించగలదని.. వచ్చే పదేళ్ల కాలంలో (2032 నాటికి) 138 బిలియన్ డాలర్ల విలువైన (రూ.11.45 లక్షల కోట్లు) ఎగుమతులకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్, టెక్నాలజీలు, సరీ్వసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. రక్షణ ఉత్పత్తుల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు అపారమైన అవకాశాలు రానున్నాయని అంచనా వేసింది. ‘ఇండియా డిఫెన్స్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. రక్షణ రంగంపై భారత్ మూలధన వ్యయాలు 2029–30 నాటి బడ్జెట్లో 37 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. 2024–25 బడ్జెట్లో 29 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా పెరగనున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే 2024 నుంచి 2030 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం రూ.15.5 లక్షల కోట్లను భారత్ రక్షణ రంగంపై వెచ్చించనున్నట్టు అంచనా వేసింది. గతంతో పోలి్చచూస్తే ఇది పెద్ద మొత్తమేనని గుర్తు చేసింది. ‘‘సానుకూల విధానాలు, సంస్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి, దేశీ తయారీకి ప్రోత్సాహం రూపంలో రక్షణ రంగానికి భారత ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలుకుతోంది’’అని వివరించింది.హెచ్ఏల్, బీఈఎల్‌కు ఆర్డర్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు గొప్ప అవకాశాలు రానున్నాయని ఈ నివేదిక అంచనా వేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో కంపెనీకి ఉన్న బలమైన సామర్థ్యాలను ప్రస్తావించింది. రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్)కు సైతం బలమైన ఆర్డర్లకు అవకాశాలున్నాయని, దీంతో కంపెనీ మార్జిన్లు, రాబడుల రేషియోలు పెరుగుతాయని నోమురా తన నివేదికలో పేర్కొంది. వివిధ రూపాల్లో భారత్ సర్కారు అందిస్తున్న తోడ్పాటుతో ఈ రంగంలోని కంపెనీలకు సానుకూల వాతావరణం నెలకొన్నట్టు తెలిపింది. ఎగుమతులు టెక్నాలజీ బదిలీ, సహకారం రూపంలో భారత రక్షణ పరిశ్రమ అంతర్జాతీయంగా తన స్థానాన్ని విస్తరించుకుంటున్నట్టు వివరించింది. దీంతో రక్షణ తయారీ, టెక్నాలజీ అభివృద్ధి సామర్థ్యాలున్న కంపెనీలు ఎగుమతుల అవకాశాలను పెద్ద ఎత్తున సొంతం చేసుకోగలవని అంచనా వేసింది. తద్వారా అవి తమ ఆదాయ వనరులను వైవిధ్యం చేసుకోగవలని వివరించింది.లాభదాయక అవకాశాలురక్షణ రంగంలో ఎన్నో విభాగాలు లాభదాయక అవకాశాలను ఆఫర్ చేస్తున్నాయని నోమురా నివేదిక తెలిపింది. డిఫెన్స్ ఏరోస్పేస్ విభాగం ఒక్క దాని విలువే 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతూ.. ఎయిర్‌క్రాఫ్ట్, హెలీకాప్టర్లు, యూఏవీలు, ఏవియానిక్స్, అనుబంధ వ్యవస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను గుర్తు చేసింది. షిప్ బిల్డింగ్ సైతం భారీ అవకాశాలు కల్పిస్తోందని, సముద్ర తీర రక్షణ కోసం నేవల్ వెస్సెల్స్, సబ్మెరైన్లు, పెట్రోల్ బోట్లకు సంబంధించి 38 బిలియన్ డాలర్ల తయారీ అవకాశాలను ప్రస్తావించింది. మిసైళ్లు, ఆరి్టలరీ గన్ వ్యవస్థలపై పెట్టుబడులు 21 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నోమురా నివేదిక అంచనా వేసింది. తన ఆరి్టలరీ, మిసైల్ సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తు చేసింది. -
2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. -
ష్నైడర్ ఎలక్ట్రిక్ భారీ పెట్టుబడులు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్‌ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్‌ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది. ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్‌లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్‌తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. -
కేంద్రం కీలక నిర్ణయం.. టెస్లాకు లైన్ క్లియర్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, కేంద్రం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ.. దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విల్లూరుతున్న టెస్లా మార్గాన్ని మరింత సుగమం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతూనే ఉంది. నేటికి కొత్త పాలసీ రావడంతో త్వరలోనే టెస్లా మనదేశానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఈవీ పాలసీ కింద.. ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ సుమారు రూ. 4150 కోట్లు (5వేల మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెడితే.. అనేక రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఫ్యూయెల్ దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆటోమొబైల్ కంపెనీ రూ. 4150 కోట్లు పెట్టుబడి పెడితే.. మూడు సంవత్సరాల్లో స్థానికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా విడి భాగాల్లో 25 శాతం స్థానీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల ధరలను బట్టి 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. గతంలో ఇదే టెస్లా భారత్ ఎంట్రీకి సమస్యగా ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టెస్లా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల శాతం కేవలం 2% మాత్రమే. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్లైన్లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
తయారీ చక్రం స్పీడ్
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.9కి ఎగసింది. ఇది ఐదు నెలలు గరిష్ట స్థాయి. జనవరిలో సూచీ 56.5గా నమోదయ్యింది. సమీక్షా నెల్లో సూచీకి దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ సహకారం లభించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం 2023 జూలై కనిష్ట స్థాయికి తగ్గడంతో తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడినట్లు సర్వే పేర్కొనడం గమనార్హం. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నలు, ప్రతిస్పందనలను ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐని ఆవిష్కరిస్తుంది. -
స్పేస్ స్టార్టప్‌లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
థాయ్‌లాండ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సుప్రాన్ బురీ ప్రావిన్స్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కారి్మకుల మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఘటన జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం వరిపొలాలకు పెట్టిందిపేరు. పచ్చని పొలాల మధ్య బుధవారం మధ్యాహ్నంవేళ దట్టమైన నల్లని పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌చేసింది. చైనీయుల నూతన సంవత్సరం వచ్చే నెలలో థాయిలాండ్‌లోనూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాణసంచాకు భారీగా డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో బాణసంచాను హడావుడిగా తయారుచేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
టయోటా కొత్త ప్లాంటుకు రూ.3,300 కోట్లు
బెంగళూరు: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది. 2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు. మల్టీ–యుటిలిటీ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్‌తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్‌కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్ ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ విక్రమ్ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు. -
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం.. ► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్‌లో రెండు శాతం) నమోదైంది. ► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది. ► మైనింగ్ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్లో మైనస్ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్లో 11.5 శాతం పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ వృద్ధి గత సెపె్టంబర్లో మైనస్ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి మైనస్ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది. ► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్లో ఇది 8.2 శాతం. -
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్ రంగంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. -
సెప్టెంబర్‌లో ‘తయారీ’ నిరాశ.. ఐదు నెలల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం సెప్టెంబర్‌లో నెమ్మదించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 57.5కు పడింది. అంతక్రితం ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ స్థాయి దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పేర్కొంటారు. ఈ ప్రాతిపదికన సూచీ 27 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
రాష్ట్రాల్లో అధికారుల తీరు మారటంలేదు..
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని అధికారుల ఇంకా ఆనాటి నియంత్రణల జమానా (లైసెన్స్ రాజ్)లో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆక్షేపించారు. దీనివల్ల కేంద్రం ఎన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నా తయారీ రంగ వృద్ధి పెద్దగా మెరుగుపడటం లేదని ఆయన చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు కేంద్రం గత తొమ్మిదేళ్లలో 1,000కి పైగా పాత చట్టాలను తొలగించిందని పేర్కొన్నారు. తయారీ రంగంలో దీటుగా పోటీపడేందుకు బాటలు వేస్తోందని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. ‘తయారీదారులు, ఎంట్రప్రెన్యూర్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగం మారలేదు. ప్రతి దానికీ బోలెడంత జాప్యం ఉంటోంది. రాష్ట్రాల్లో చాలా మంది సమయానికి విలువనివ్వడం లేదు. పాలనా యంత్రాంగం ధోరణి ఆనాటి లైసెన్స్ రాజ్ తరహాలో ఉంటోంది. ప్రభుత్వోద్యోగి పని అంటే నియంత్రించడమే తప్ప వెసులుబాటు కల్పించడం కాదనే విధంగా ఉంటోంది‘ అని భార్గవ చెప్పారు. ఇటు వ్యాపారవేత్తల్లో కూడా అప్పటి ఆలోచనా ధోరణులు అలాగే ఉండిపోవడం సైతం తప్పు విధానాలకు దారి తీస్తోందని తెలిపారు. -
ఈ–టూవీలర్ కంపెనీలకు చెక్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు. ఉల్లంఘనలు ఇలా.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది. వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. -
వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ - తయారీలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: ఆసియా తయారీ సరఫరా వ్యవస్థలో వైవిధ్యానికి దారితీస్తున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల నుంచి భారత్ ప్రయోజనం పొందుతుందని ది ఎకనామిస్ట్ గ్రూప్ అంచనా వేసింది. భారత్ బలమైన వృద్ధి మార్గంలో ప్రయాణిస్తోందని ద ఎకనామిస్ట్ గ్రూప్ ఇండియా హెడ్ ఉపాసనా దత్ పేర్కొన్నారు. విధానపరమైన సంస్కరణలతో భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభంగా మారుతోందన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ బలమైన పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన భారత్, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తెలిసిందే. పీఎల్ఐ సహా పలు పథకాల ద్వారా దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఎకనామిస్ట్ గ్రూపు ప్రస్తావించింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ ఇంధన వనరులపై అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యావరణ అనుకూల విధానాలు ఇవన్నీ భారత్ వంటి దేశాలకు అవకాశాలను తీసుకొస్తాయని ఉపాసనా దత్ అభిప్రాయపడ్డారు. తయారీలో స్థానం బలోపేతం ‘‘భౌగోళిక రాజకీయ రిస్క్‌ల నేపథ్యంలో కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలపై పునరాలోచన చేస్తున్నాయి. చైనా మార్కెట్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకునే దిశగా అవి తీసుకునే నిర్ణయాలతో ఇతర మార్కెట్ల వాటా పెరగనుంది. చైనాకు భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ అవుతుంది’’అని ఉపాసనా దత్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, పన్నులు, వాణిజ్య నియంత్రణల పరంగా భారత్‌లో ఎంతో పురోగతి కనిపిస్తోందంటూ.. దేశంలో తయారీ పరంగా ఉన్న రిస్క్‌లను ఇది తగిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో వర్ధమాన, ముఖ్యంగా దక్షిణాసియా మార్కెట్ల నుంచి ఎదురయ్యే బలమైన పోటీ కారణంగా.. తయారీలో బలమైన శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షను కొంత ఆలస్యం చేస్తుందన్నారు. -
పుంజుకున్న ‘తయారీ’
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం కార్యకలాపాలు ఆగస్టులో ఊపందుకున్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 57.7 వద్ద ఉంటే, ఆగస్టులో 58.6కు ఎగసింది. దాదాపు మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయిలో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి త్వరితగతిన పెరగడం దీనికి కారణమని శుక్రవారం విడుదలైన సర్వే పేర్కొంది. కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 26 నెలల నుంచి వృద్ధి బాటన కొనసాగుతోంది. కొత్త ఆర్డర్లు తయారీ రంగానికి ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం వాటా దాదాపు 70 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్యానల్లోని దాదాపు 400 తయారీ రంగ సంస్థల పర్చేజింగ్ మేనేజర్స్‌కు పంపిన ప్రశ్నలు, అందిన సమాధానాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. 2005 మార్చిలో ఈ గణాంకాల సేకరణ ప్రారంభమైంది. -
ఓఎన్డీసీతో ఆర్థిక సేవలు, తయారీకి దన్ను
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది. రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. అయితే, ఓఎన్డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది. ► ఆన్లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్డీసీ సహాయకరంగా ఉండనుంది. ► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి. ► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్ఎంఈలకు ఓఎన్డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు. ► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగకరంగా ఉండగలదు. ► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు. -
2030 నాటికి మూడవ స్థానానికి
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది. -
గల్ఫ్ ఆయిల్ చేతికి టైరెక్స్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జర్ల తయారీ కంపెనీ టైరెక్స్ ట్రాన్స్‌మిషన్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండి యా తాజాగా పేర్కొంది. ఇందుకు రూ.103 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. తద్వారా ఈవీ విభాగంలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు అంచనా వేసింది. ఈవీ చార్జింగ్ మార్కెట్ ప్రస్తుత అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుకాగా.. 2030కల్లా భారీగా 200 బిలియన్ డాలర్లను తాకగలదన్న అంచనాలున్నట్లు తెలిపింది. -
వృద్ధికి ‘తయారీ’ సహకారం అంతంతే
న్యూఢిల్లీ: తయారీ రంగానికి ప్రస్తుతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా అందుతున్న చేయూత వల్ల సమీప మూడేళ్లలో దేశ ఆరి్థక వ్యవస్థకుకానీ లేదా ఎగుమతుల రంగానికిగానీ పెద్దగా జరిగే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. ఆసియా సరఫరా చైన్ ఇటీవల పాక్షికంగా చైనా నుంచి మారడం, దేశ ఎలక్ట్రానిక్ రంగంలో ఇటీవల అందుతున్న భారీ ప్రోత్సాహకాల వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధికి తయారీ తక్షణం అందించే సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా పేర్కొన్నారు. అయితే చైనా నుంచి సరఫరాల చైన్ నిరంతరం కొనసాగడం, దేశంలో వ్యవస్థాగత సంస్కరణలు వల్ల దీర్ఘకాలంలో భారత్ ఎకానమీకి ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న ఆమె, దీనివల్ల 2023 నాటికి వార్షికంగా 6.25 శాతం నుంచి 6.75 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటు ఉంటుందని అన్నారు. వార్షికంగా 40 లక్షల ఉద్యోగల కల్పనా సాధ్యమవుతుందని విశ్లేíÙంచారు. పూర్తి ఆశావహ పరిస్థితుల్లో వృద్ధి 6.75 శాతం నుంచి 7.25 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కూడా పేర్కొన్నారు. తయారీ రంగ ధోరణులు మారాలి... దేశంలో తయారీ రంగం పరిస్థితి గురించి ఆమె ప్రస్తావిస్తూ, తగిన ఉత్పాదక పురోగతి వ్యవస్థ లేనప్పుడు దానివల్ల ఎకానమీలకు పెద్దగా ప్రయోజనం ఒనగూడదన్నారు. తగిన ఉత్పాదక పరిస్థితి సానుకూలంగా ఉండడం అంటే విడిభాగాలను అధికంగా దిగుమతి చేసుకోవడం, వాటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేసుకోవడానికి బదులు వాటినిసైతం స్థానికంగా తయారీ చేసుకోవడం, అందుకు ఒనరులను మెరుగుపరచుకోవడంగా ఆమె అభివరి్ణంచారు. ‘‘భారత్ భారీగా దిగుమతులు చేసుకుంటోంది. ఎక్కువ ఎగుమతి చేస్తోంది. ఇలాంటి విధానాల వల్ల వాస్తవిక ప్రయోజనం అంతంతే. ఇక్కడ మొబైల్ రంగాన్ని మంచి ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ భారత్ చైనా తర్వాత రెండవ అతిపెద్దదిగా మారింది. అయినప్పటికీ, ప్రపంచ మొబైల్ ఉత్పత్తిలో భారత్ వాటా ఇప్పుడు 7 శాతం లోపే ఉంది. స్థానికంగా తయారీ, వనరుల సమీకరణ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఈ రంగంలో మనం 25 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.’’ అని గుప్తా గురువారం ఒక కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విలేకరులతో అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► డాలర్‌తో రూపాయి మారకపు విలువ డిసెంబర్ వరకూ సగటున 82–83గా ఉంటుంది. తరువాత క్రమంగా మార్చి నాటికి 79కి బలపడే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు రూపాయి బలపడటానికి ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ► దేశీయ ఈక్విటీలు ఇప్పుడు అధిక విలువలో ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం ‘‘అండర్ వెయిట్’’ కలిగి ఉన్నాయి. దీనవల్ల ఈక్విటీలు భారీగా పెరిగే అవకాశం ఏదీ లేదు. ► ఆగస్టులో సైతం రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం పైనే కొనసాగవచ్చు. ► మూలధన పెట్టుబడులు ఏదన్నా జరిగితే... అది ప్రభుత్వం ద్వారానే జరుగుతోంది. కార్పొరేట్ల నుంచి పెద్దగా లేదు. రానున్న 12 నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వ్యవస్థలో తగిన మూలధన పెట్టుబడులు ప్రస్తుతం కొనసాగుతుండడం దీనికి కారణం. దీనికితోడు వడ్డీరేట్ల పెరుగుదల్ల వల్ల గృహ వినియోగ ధోరణి కూడా తగ్గుతోంది. -
దేశీ సంస్థల్లో ఏఐ జోరు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగం మిగతా అన్ని విభాగాల కన్నా ముందుంటున్నాయి. కోవిడ్ తర్వాత శకంలో ఏఐ ప్రభావం అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో భారత మార్కెట్లో నిర్వహించిన సర్వేకు కొనసాగింపుగా 2022–23లో 220 పైచిలుకు చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), నిర్ణయాధికారాలు ఉన్న ఉన్నతోద్యోగులతో మాట్లాడి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం గత రెండేళ్లుగా పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్) వినియోగం అత్యధికంగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వాటిలో ఈ రంగాలకు చెందిన 64 శాతం సంస్థలు తాము ప్రస్తుతం ఏఐకు మారే క్రమంలో తొలి దశలో ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏఐని వినియోగించడం ద్వారా పెట్టుబడులపై అధిక రాబడులను అందుకునే విషయంలో ట్రావెల్, ఆతిథ్య పరిశ్రమ ఒక మోస్తరు సంతృప్త స్థాయికి చేరింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, హెల్త్‌కేర్, ఫార్మా తదితర రంగాలు ఏఐ వినియోగంలో స్థిరంగా ముందుకెడుతున్నప్పటికీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ► మిగతా రంగాలతో పోలిస్తే రిటైల్, కన్జూమర్ మార్కెట్లలో ఏఐ వినియోగం తగ్గింది. మార్కెట్ శక్తులు, వినియోగదారుల పోకడలు మారిపోతున్న నేపథ్యంలో ఏఐని ఏయే అంశాల్లో వినియోగించవచ్చనేది గుర్తించడం సంక్లిష్టంగా మారడమే ఇందుకు కారణం. ► గత రెండేళ్లుగా, 2020 మధ్య నుంచి 2022–23 వ్యవధిలో పారిశ్రామికోత్పత్తులు.. తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ సొల్యూ,న్స్ వినియోగం అత్యధికంగా 20 శాతం పెరిగింది. -
Semicon India 2023: సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం
గాంధీనగర్: దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. దీన్ని మరింత పెంచుతున్నామని, ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. 300 కాలేజీల్లో సెమికండక్టర్ డిజైన్ కోర్సులు భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్‌లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ‘గ్రాండ్ కండక్టర్’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్ సప్లై చైన్’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ‘నేషనల్ క్వాంటన్ మిషన్’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్ మిషన్ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్ పీవీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్ రంగ నిపుణులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భారత్ ముందంజ చెన్నై: జీవ వైవిధ్య పునఃస్థాపన, పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ‘జి–20 పర్యావరణ, వాతావరణ స్థిరత్వ మినిస్టీరియల్’ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గంగా నదిని శుభ్రపరిచేందుకు నమామి గంగ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. ‘‘భారతీయులకు ప్రకృతే పెద్ద గురువు. భూమాత పరిరక్షణ అందరి బాధ్యత’’ అన్నారు. -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్‌లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్‌లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
నాణ్యమైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి
ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు. ‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. రీసైకిల్ కీలకం.. ‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు. -
తయారీలో డిజిటల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్) తయారీ రంగ కంపెనీలకు ముఖ్యమైన అజెండాగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. 54 శాతం కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసినట్టు తెలిసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అనలైటిక్స్‌ను తమ వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేశాయి. తద్వారా అవి సమర్థతను పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. భారత తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్లో పనిచేసే సంస్థలు, బహుళజాతి సంస్థల (ఎంఎన్‌సీలు) చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ (సీఎక్స్‌వో)లను సర్వేలో భాగంగా ప్రశ్నించి తయారీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ముఖచిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా జరిగింది. ‘‘భారత తయారీ కంపెనీలు అన్ని ప్లాంట్లకు ఒకే ప్రామాణిక డిజిటల్ పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వివిధ తయారీ కేంద్రాలకు భిన్నమైన డిజిటల్ పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. భారత్‌లో తయారీ కంపెనీలు అనలైటిక్స్, ఏఐను కంపెనీలు అమలు చేస్తున్నాయి. వీటి అమలు రేటు 54 శాతంగా ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. తమ వ్యాపారాల్లో డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే ప్రణాళికేదీ లేదని సర్వేలో పాల్గొన్న 38 శాతం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. ఆరు రంగాల్లోని డిజిటల్ ఛాంపియన్లు పారదర్శకత, సుస్థిరత భవిష్యత్తు వృద్ధికి తమను సన్నద్ధంగా ఉంచుతాయని భావిస్తున్నాయి. గొప్ప ఆవిష్కరణలు, వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం పోటీలో తమను నిలిపి ఉంచుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సవాళ్లను అధిగమించేందుకు.. నిర్వహణ సవాళ్లను అధిగమించేందుకు భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా కొంత వరకు సామర్థ్యాన్ని కంపెనీలు సిద్ధం చేసుకోగా, కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉందని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ ఆపరేషన్స్ లీడర్ అంకుర్ బసు తెలిపారు. ‘‘సంస్థలు తయారీ ప్రక్రియల్లో సమర్థతను పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఖరీదైన యంత్రాల నిర్వహణను వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. తయారీని ఆటోమేషన్ చేస్తున్నాయి. వర్క్స్టేషన్లను ఐవోటీతో అనుసంధానిస్తున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్తఘోష్ తెలిపారు. -
మేలో ‘తయారీ’ పటిష్టం
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పురోగతిని కనబరిచినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ధ్ (పీఎంఐ) స్పష్టం చేసింది. సూచీ 31 నెలల గరిష్ట స్థాయిలో 58.7కు చేరినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సూచీ 57.2 వద్ద ఉంది. నిజానికి సూచీ 50పైన వుంటే వృద్ధి ధోరణిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50 పైన కొనసాగడం వరుసగా 23వ నెల కావడం గమనార్హం. -
ఎఫ్‌డీఐలు తగ్గాయ్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తొమ్మిదేళ్ల క్రితం దేశంలోని 25 రంగాల్లోకి ప్రారంభమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) పర్వం కొనసాగుతూనే ఉంది. అనేక అనుమానాలు వ్యక్తమైనా ఆంక్షలు, అడ్డంకులు ఎదురైనా, కరోనా లాంటి విపత్తులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేసినా బలీయమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ మార్కెట్ మన్ననలు పొందుతున్న భారత్‌లోకి ఈ పెట్టుబడులు ప్రవాహంలా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఎఫ్‌డీఐలు 20 శాతానికి పైగా తగ్గాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2014లో 45.5 బిలియన్ డాలర్లతో ప్రారంభమైన ఈ పెట్టుబడులు ఒకానొక దశలో 60 బిలియన్ డాలర్ల మార్కు దాటాయి. 2016–17లో 60.22 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదేళ్లుగా ఈ పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 44.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఆ తర్వాతి ఏడాదిలో 50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2020–21లో అనూహ్యంగా పెరిగి 2016–17 మార్కుకు దాదాపు సమాంతరంగా 59.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాతి ఏడాదిలో (2021–22)లో 58.8 బిలియన్ డాలర్లు నమోదు కాగా, గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం గణనీయంగా తగ్గిపోయాయని, 46 బిలియన్ డాలర్ల మేరకు మాత్రమే ఎఫ్‌డీఐలు వచ్చాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ లెక్కలు వెల్లడించింది. తయారీ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆర్థిక సేవలు, ఇంధన రంగంలోనే 2022–23లో ఎఫ్‌డీఐలు పెరిగాయి. తయారీ రంగంలో ఈ పెట్టుబడులు ఏకంగా 5 బిలియన్ డాలర్లు తగ్గగా, ఆర్థిక సేవల రంగంలో 2.1 బిలియన్ డాలర్లు పెరిగాయి. కంప్యూటర్ సేవల రంగం 4.4 బిలియన్ డాలర్ల తగ్గుదలను నమోదు చేసుకోగా, కమ్యూనికేషన్ సేవల్లో కూడా 2 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇంధన రంగంలో అంతకుముందు ఏడాది (2.2 బిలియన్ డాలర్లు)తో పోల్చుకుంటే గత ఏడాదిలో (3.3 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డీఐలు పెరిగాయి. వివిధ దేశాలు మన దేశంలోని పరిశ్రమల్లో పెడుతున్న ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎక్కువ శాతం తయారీ రంగంలోనే ఉంటున్నాయి. తయారీ రంగంలో ఎఫ్‌డీఐలు అత్యధికంగా 2021–22లో 16.3 బిలియన్ డాలర్లు రాగా, ఆ తర్వాత ఏడాదిలో 11.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అయితే 2022–23లో ఆర్థిక సర్వీసుల రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఈ రంగంలో గత ఏడాది 6.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ దీనికి ముందు మూడేళ్లు ఇంతకంటే తక్కువగానే పెట్టుబడులు వచ్చాయి. రియల్ ఎస్టేట్‌లో అంతంతమాత్రమే.. ఆసక్తికరమైన విషయమేమిటంటే మన దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో ఎఫ్‌డీఐలు పెట్టేందుకు ఇతర దేశాలు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ రంగంలో అత్యధికంగా 2019–20లో 0.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, గతేడాది అంటే 2022–23లో కేవలం 0.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులే వచ్చాయి. ఇప్పటివరకు దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన జాబితాలో తయారీ, ఆర్థిక సర్విసులు, రియల్ ఎస్టేట్‌తో పాటు కంప్యూటర్ సర్విసులు, రిటైల్–హోల్‌సేల్ వ్యాపారాలు, కమ్యూనికేషన్ సేవలు, ఇంధన, వ్యాపార సేవలు, విద్య–పరిశోధన, రవాణా, నిర్మాణ, హోటళ్లు–రెస్టారెంట్లు, మైనింగ్, ఇతర వ్యాపార రంగాలున్నాయి. పీఎల్ఐ ఇవ్వడం సక్సెస్ కాలేదు– డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకులు ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ గానే స్లో డౌన్లో ఉంది. మార్కెట్లో డిమాండ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఉత్పత్తి పెరిగే అవకాశాలు లేవు. భారత్‌లో ఎఫ్‌డీఐలు తగ్గడానికి మరో ప్రధాన కారణంకూడా ఉంది. 14 రంగాల్లో ముఖ్యంగా మొబైల్స్, ఎల్రక్టానిక్ పరికరాలు తదితరాల్లో ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్–పీఎల్ఐ) ఇవ్వడం అనేది సక్సెస్ కాలేదు. మౌలికసదుపాయాలు మెరుగు కాకపోవడం, రవాణా సౌకర్యాలు పెరగకపోవడం, లాజిస్టిక్స్ ఖర్చు పెరగడం వంటివి ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక నిపుణులు చెబుతున్న దానిని బట్టి చూసినా మొబైల్స్, ఫార్మా రంగాల్లోనే ఇది విజయవంతమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో వియత్నాం, బంగ్లాదేశ్‌లలో ఎఫ్‌డీఐలు పెరుగుతున్నాయి. -
వృద్ధికి ఊతం.. ప్రైవేటు వినియోగం
ముంబై: దేశీయ వృద్ధికి ప్రైవేటు వినియోగం ఊతం ఇస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. ఆయా అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) గ్రామీణాభివృద్ధి, తయారీ రంగాల పునరుద్ధరణకు ఊతం ఇస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్బీఐ అభిప్రాయాలగా పరిగణించకూడని ఈ ఆర్టికల్ ‘‘ప్రస్తుత ఎకానమీ పరిస్థితి’’ పేరుతో సెంట్రల్ బ్యాంక్ బులిటెన్‌లో ప్రచురితమైంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. నివేదిక పేర్కొన్న మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! ► అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గాయి. బ్యాంకింగ్ నియంత్రణ, పర్యవేక్షణల్లో మెరుగుదల నమోదయ్యింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి కొంత తగ్గింది. ► ఇక దేశీయంగా చూస్తే 2023 మే తొలి భాగంలో ఆర్థిక సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రెవెన్యూ వసూళ్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ 5 శాతం దిగువకు వచ్చింది. కార్పొరేట్ ఆదాయాలు ఆదాయాలకు మించి నమోదయ్యాయి. ► బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు కూడా ఆదాయాల విషయంలో మంచి పనితీరును కనబరిచాయి. రుణ వృద్ధి పెరిగింది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
పారిశ్రామికోత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) డేటా ప్రకారం ... ► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది. ► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది. ► మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది. ► ప్రైమరీ గూడ్స్ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 3.1 శాతం నుంచి మైనస్ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ తాజాగా మైనస్ 3.1%కి చేరింది. ► ఇన్ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%. -
వృద్ధి అవకాశాల్లో భారత్ నెంబర్ వన్
న్యూఢిల్లీ: అమెరికా నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ– సిస్కో భారత్‌లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. రూటర్లు, స్విచ్‌ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ, వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్ డిజిటలైజేషన్ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం. ► డిజిటలైజేషన్, 5జీ రోల్అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్‌కు కలిసివస్తున్న అంశాలు. ► భారత్ డిజిటలైజేషన్లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్ ఆశయం చాలా స్పష్టంగా ఉంది. ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను. ► ఒక్క డిజిటలైజేషన్‌లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ దూసుకుపోతోంది. ► మేడిన్ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్‌కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్‌కు దోహపపడే అంశం ఇది. ► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భేటీ -
అకాల వర్షాలు.. తయారీ కంపెనీల అమ్మకాలకు స్పీడ్ బ్రేకర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తరాది సహా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతో కూలింగ్ ఉత్పత్తులైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలు తగ్గినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో వీటి అమ్మకాలు గణనీయంగా నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు వినియోగదారులు వర్షాల వల్ల తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే 15 శాతం తక్కువగా నమోదైనట్టు కొన్ని సంస్థలు వెల్లడించాయి. అయితే ఎండల తీవ్రత మళ్లీ పెరిగిన తర్వాత విక్రయాలు గాడిన పడతాయని ప్యానాసోనిక్, గోద్రేజ్, డైకిన్ తదితర సంస్థలు అంచనాతో ఉన్నాయి. ‘‘ఈ ఏడా ది ఏప్రిల్‌లో వాతావరణం చల్లగానే ఉంది. దీంతో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి తక్కువగానే ఉంది. ఇప్పటివరకు కస్టమర్లు ఎక్కువ మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి వేసవి కాలం ఇంకా ఎక్కువే మిగిలి ఉంది. కనుక అమ్మకాలు పుంజుకుంటాయని ఆశావహంగా ఉన్నాం’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ (ఎయిర్ కండీషనర్లు) గౌరవ్ షా తెలిపారు. ఉత్తరాదిన అకాల వర్షాలతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల అమ్మకాలపై ప్రభావం పడినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రా నిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు, పశ్చిమాదిన ఫ్లాట్‌గా ఉన్నట్టు సీ ఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ వెల్లడించారు. మే నెల కీలకం.. ‘‘వేసవి సీజన్లో అమ్మకాల వృద్ధికి మే నెల కీలకం. అనుకున్న విధంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటే డిమాండ్ పుంజుకుంటుంది. అప్పుడు మార్కెట్లో నిల్వలు గణనీయంగా తగ్గుతాయి’’అని బ్రగంజ వివరించారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదలకు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలకు మధ్య సంబంధం ఉంది. వేసవిలో దేశంలోచి చాలా ప్రాంతాల్లో వేడిగాలులు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, వేసవి సీజన్ కూడా ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, జూన్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్న అంచనాలున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఎయిర్ కండీషనర్లు నేడు లగ్జరీ ఉత్పత్తి కంటే తప్పనిసరి అవసరంగా మారిపోయినట్టు చెప్పారు. అమ్మకాల్లో అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగంగా ఉన్నట్టు తెలిపారు. తమ ఏసీ ఉత్పత్తుల అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధి ఉన్నట్టు వెల్లడించారు. 1 నుంచి 2 టన్నుల పరిధిలో 5 స్టార్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. రిఫ్రిజిరేటర్లలో ఫాస్ట్ఫ్రీ మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు పేర్కొన్నారు. అధిక వేడి వాతావరణం తిరిగి ఏర్పడగానే ఏసీల అమ్మకాలు పెరుగుతాయని, దీనిపై పెద్ద ఆందోళన లేదని డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్జీత్ జావా తెలిపారు. -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
మార్చిలో తయారీ రంగం పరుగు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. అయితే సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ వృద్ధి బాటన కొనసాగడం వరుసగా 21వ నెల. ఉద్యోగ కల్పన విషయానికి వస్తే, మార్చిలో పేరోల్ సంఖ్యలో దాదాపు మార్పులేదు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
తయారీ రంగంపై పెరిగిన రుణ వ్యయ భారం
న్యూఢిల్లీ: తయారీదారులు చెల్లించే వార్షిక సగటు వడ్డీ రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 9.38 శాతానికి పెరిగింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈ రేటు 8.37 శాతంగా ఉంది. సగటు కాకుండా చూస్తే, ఈ రేటు కొన్ని సంస్థల విషయంలో అత్యధికంగా 15 శాతంగా నమోదయ్యింది. చాలా కంపెనీలు తమ రుణాల వ్యయం పెరిగినట్లు తెలిపాయని తాజాగా విడుదలైన పారిశ్రామిక వేదిక– ఫిక్కీ సర్వే తెలిపింది. అయితే భారత ఎకానమీ పరిస్థితుల పట్ల సర్వేలో ఆశావహ దృక్పధం నెలకొంది. సర్వే ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦ కరోనా సవాళ్ల అనంతరం, 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ రికవరీ బాట పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరపు తదుపరి త్రైమాసికాల్లో వృద్ధి ఊపందుకోవడం కొనసాగింది. ♦ ప్రపంచ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ప్రభావం భారత తయారీ రంగంపై తాత్కాలికంగానే ఉంటుంది. గడచిన కొన్ని నెలలుగా ఈ రంగంలో నెలకొన్న వ్యయ భారాలు తగ్గుముఖం పడతాయన్న విశ్వాసం నెలకొంది. ♦ నియామకాలకు సంబంధించి అవుట్‌లుక్ సానుకూలంగా ఉన్నప్పటికీ, రాబోయే మూడు నెలల్లో అదనపు వర్క్‌ఫోర్స్‌ను నియమించుకోవాలని కేవలం 32 శాతం మంది ప్రతినిధులు మాత్రమే పేర్కొంటున్నారు. ♦ గత కొన్ని నెలల్లో రెపో రేట్లను పెంచడం వల్ల పర్యవసానంగా తమ బ్యాంకులు ఈ భారాన్ని తమకు బదలాయించాయని, ఇది రుణ వ్యయాల పెరుగుదలకు ప్రధాన కారణమని 71 శాతం మంది ప్రతినిధులు తెలిపారు. ♦ తయారీలో ప్రస్తుతం ఉన్న సగటు సామర్థ్య వినియోగం 75%. ఇది ఈ రంగంలో స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. క్రితం సర్వే లో ఈ సామర్థ్య వినియోగం 70%గా ఉంది. ♦ భవిష్యత్ పెట్టుబడి ఆశావహ దృక్పథం కూడా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే మెరుగుపడింది. రాబోయే ఆరు నెలల్లో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికల్లో ఉన్నట్లు 47 శాతం మంది ప్రతివాదులు తెలిపారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది 40 శాతంగా ఉంది. ♦ అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనిశి్చతి, ద్రవ్యోల్బణం సవాళ్లు ఇతర దేశాలలో కోవిడ్ వైరస్ వేరియంట్ల పెరుగుదల, ఆందోళనల వంటి సవాళ్లు తయారీ రంగాన్ని వెంటాడుతున్నాయి. సరఫరాల చైన్, డిమాండ్‌లో అస్థిరతలను పెంచుతున్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. ♦ పెరుగుతున్న ఫైనాన్స్ రుణ భారాలు, నిబంధనలు–అనుమతుల్లో గందరగోళ పరిస్థితులు, అధిక ఇంధన ధరలు, మందగమన ప్రపంచ డిమాండ్, భారతదేశంలోకి అధిక చౌక దిగుమతులు, నైపుణ్యం కలిగిన కార్మీకుల కొరత, కొన్ని లోహాల అధిక అస్థిర ధరలు, సరఫరాల చైన్‌లో అనిశ్చితి, లాజిస్టిక్స్ వ్యయాల పెరుగుదల వంటి అంశాలూ సవాళ్లలో ఉన్నాయి. ఇవి తమ విస్తరణ ప్రణాళికకు అవరోధంగా మారే అవకాశం ఉందని తయారీ రంగ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సర్వే సాగింది ఇలా... 11 ప్రధాన రంగాలకు సంబంధించి క్యూ4లో తయారీదారుల అభిప్రాయాలను సర్వే మదింపు చేసింది. మొత్తంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ను కలిగిన భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ)ల విభాగాలలోని 400 తయారీ యూనిట్ల నుండి స్పందనలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఆటోమోటివ్, ఆటో కంపోనెంట్స్, భారీ పెట్టుబడులు–డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, రసాయనాలు, ఔషధాలు, ఎల్రక్టానిక్స్, మిషీన్ టూల్స్, మెటల్ అండ్ మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, ఎరువులు, జౌళి, దుస్తులు తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. -
తయారీ రంగం సుస్థిర వృద్ధి
న్యూఢిల్లీ: తయారీ రంగం సుస్థిర వృద్ధి బాటన కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. అయితే సూచీ 50పైన కొనసాగితే దీనిని వృద్ధి ధోరణిగా పేర్కొంటారు. 50 దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన పీఎంఐ 50పైన కొనసాగడం ఇది వరుసగా 20వ నెల. జనవరి తరహాలోనే కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి ఫిబ్రవరిలోనూ కొనసాగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. కాగా, ఉపాధి కల్పన విషయంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని లిమా పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న 98 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇక కంపెనీలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ కొనసాగుతున్నట్లు తెలిపారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రం, ప్రతిస్పందనల ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదుచేయడం జరుగుతుంది. -
ప్రపంచ ఆటో తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ కేంద్రం(హబ్)గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో దేశీ ఆటో పరిశ్రమ విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరే అంచనాలున్నట్లు తెలియజేశారు. జైపూర్‌లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ఏర్పాటు చేసిన వాహనాలను తుక్కుగా మార్చే(స్క్రాపింగ్) ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభించిన గడ్కరీ ప్రస్తుతం ఆటో పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 7.8 లక్షల కోట్ల పరిమాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2025కల్లా ఈ సంఖ్య 5 కోట్లను తాకనున్నట్లు అభిప్రాయపడ్డారు. జైపూర్‌లో టాటా మోటార్స్ వార్షికంగా 15,000 వాహన స్క్రాపింగ్ సామర్థ్యంతో తొలిసారి రిజిస్టర్డ్ ప్లాంటును ఏర్పాటు చేసింది. రూ. 15 లక్షల కోట్లకు..: గ్లోబల్ ఆటో తయారీ కేంద్రంగా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. సమీప కాలంలో పరిశ్రమ పరిమాణాన్ని రూ. 15 లక్షల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. పాత, పనికిరాని వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపేజ్ పాలసీ దశలవారీగా పర్యావరణ అనుకూల కొత్త వాహనాలకు దారి చూపుతుందని వివరించారు. తుక్కుగా మార్చే తాజా విధానాల వల్ల వాహన డిమాండు ఊపందుకుంటుందని, రూ. 40,000 కోట్ల ఆదనపు జీఎస్టీ ఆదాయానికి వీలుంటుందని తెలిపారు. -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
వందే భారత్ రైళ్ల తయారీకై మేధా సర్వో బిడ్
న్యూఢిల్లీ: అల్యూమినియం బాడీతో 100 వందే భారత్ రైళ్ల తయారీకై హైదరాబాద్ కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ బిడ్ దాఖలు చేసింది. స్విస్ కంపెనీ స్టాడ్లర్‌తో కలిసి ఈ కంపెనీ బిడ్ సమర్పించింది. అలాగే ఫ్రెంచ్ సంస్థ ఆల్స్టమ్ సైతం పోటీపడుతోంది. కాంట్రాక్టు విలువ రూ.30,000 కోట్లు. 100 రైళ్ల తయారీతోపాటు 35 ఏళ్ల పాటు వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. రైళ్ల డెలివరీ కాగానే రూ.13,000 కోట్లు, మిగిలిన మొత్తం 35 ఏళ్ల తర్వాత అందుకుంటాయి. గురువారం ఇరు సంస్థలు సమర్పించిన టెక్నికల్ బిడ్స్‌ను మూల్యాంకనం చేసి విజేతను నిర్ణయించేందుకు ఫైనాన్షియల్ బిడ్స్‌ను కోరతారు. 2024 తొలి త్రైమాసికంలో స్లీపర్ క్లాస్‌తో కూడిన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేస్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటి వరకు 102 రైళ్ల తయారీ కోసం అప్పగించిన కాంట్రాక్టులు అన్నీ కూడా చైర్ కార్ వర్షన్ కావడం గమనార్హం. ప్రస్తుతం 10 రైళ్లు పరుగెడుతున్నాయి. 200 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లకై గతేడాది బిడ్లు దాఖలయ్యాయి. -
India industrial production index: తగ్గిన పారిశ్రామిక వృద్ధి స్పీడ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2022 డిసెంబర్లో మందగించింది. సమీక్షా నెల్లో ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ రేటు 7.3 శాతం. మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు డిసెంబర్ గణాంకాలపై పడినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెలువరించిన లెక్కలు పేర్కొంటున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల రంగం ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం కూడా వృద్ధి (5.1 శాతం) నుంచి క్షీణతకు (–10.4 శాతం) మారింది. సబ్బులు, షాంపూల వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలో వృద్ధి రేటు తగ్గింది. వార్షికంగా పరిశీలిస్తే మాత్రం 2021 డిసెంబర్‌కన్నా 2022 డిసెంబర్లో పనితీరు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తున్న అంశం. అప్పట్లో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1 శాతం మాత్రమే. 9 నెలల్లో ఇలా... మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్– డిసెంబర్) ఐఐపీ 5.4 శాతం పురోగమించగా, 2021 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 15.3 శాతంగా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి ఈ వృద్ధి రేటు 5.5 శాతం -
జనవరిలో ‘తయారీ’ నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం జనవరిలో నెమ్మదించింది. మొత్తం అమ్మకాల్లో వేగం లేకపోవడం దీనికి కారణం. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 55.4గా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ సూచీ 57.8 వద్ద ఉంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తగినంత సిబ్బంది ఉండడం వల్ల ఈ సంఖ్యలో ఎటువంటి పెరుగుదలా నమోదుకాలేదని తమ సర్వే వెల్లడించినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీలిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ 19 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే ఉందన్నమాట. నెలవారీగా నెమ్మదించినప్పటికీ, తయారీ రంగం అప్‌ట్రెండ్ దోరణిలోనే ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు. చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
Budget 2023: PLI పథకం విస్తరణ దిశగా అడుగులు
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇది. దీంతో.. బడ్జెట్ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తయారీ రంగానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి..? అన్న చర్చ జరుగుతోంది. తయారీ రంగం అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేసేలా.. భారీ కేటాయింపులు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీర్ఘకాలిక అభివృద్ధి, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో తయారీ రంగానిది కీలక పాత్ర. PLI పథకాన్ని మరింత విస్తరించి, దీని పరిధిలోకి మరిన్ని సెక్టార్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో ఈ పథకం రూపొందించబడింది. ప్రస్తుతం PLI స్కీమ్ లో ఆటోమొబైల్స్, దాన్ని అనుబంధ వస్తువులు, గృహోపకరణాలు, టెక్స్ టైల్స్, ఆహార పదార్థాలు, సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, స్టీల్ తదితర ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, ఫుట్‌వేర్ తయారీ పరిశ్రమలను కూడా PLI స్కీమ్ పరిధిలోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థకు PLI పథకం ఎంతో ముఖ్యమైనది. ప్రాదేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడంతో పాటు తయారీరంగంలో గ్లోబల్ ఛాంపియన్లను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2022 సెప్టెంబర్ నాటికి PLI పథకం ద్వారా భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.4,784 కోట్లను ఆకర్షించింది. రూ. 2,03,952 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. రూ.80,769 కోట్ల ఎగుమతులు జరిగాయి. PLI పథకంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం గణనీయమైనది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 2022 డిసెంబర్ 16 నాటికి 13 పథకాలకు అనుమతులు లభించగా.. వీటిలో 100కు పైగా MSMEలకు లబ్ది చేకూరింది. -
జోరు మీదున్న తయారీ రంగం.. గరిష్టానికి చేరిన పీఎంఐ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మంచి పనితీరును కనబరిచింది. స్టాండెర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్లో 13 నెలల గరిష్టం 57.8ని తాకింది. నవంబర్‌లో ఈ సూచీ 55.7 వద్ద ఉంది. కొత్త ఆర్డర్లు, పటిష్ట డిమాండ్ తాజా సానుకూల ఫలితానికి కారణమని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన పీఎంఐ వరుసగా 18 నెలల నుంచి వృద్ధి బాటలోనే కొనసాగుతోంది. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు. -
విద్యుత్ వాహనాల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరి రావు ఈ విషయాలు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాల తయా రీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఎప్ప ట్లోగా ప్రారంభించే అవకాశం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ప్రణాళికలు తుది దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు తమిళనాడులోని సేలంలో మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సా మర్థ్యంతో ఉక్కు ప్లాంటు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సహా ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమయ్యే హై– వేల్యూ ఉక్కును ఈ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రా, సిమెంటు, పెయింట్స్ మొదలైన వివిధ రంగాల్లోనూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విస్తరించింది. -
అంచనాలను మించి పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాలు, వాహన విడిభాగాల తయారీ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం జోష్ నింపింది. వచ్చే అయిదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా.. ఏకంగా రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం విశేషం. పీఎల్ఐ పథకం కింద మొత్తం 115 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం, మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 23న ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో 85 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 18 సంస్థలు, కంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 67 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు విభాగాల్లోనూ రెండు కంపెనీలు ఎంపికైనట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ కంపెనీలు సైతం.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఎంపికైన కంపెనీల జాబితాలో భారత్‌తోపాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూఎస్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్ కంపెనీలు ఉండడం గమనార్హం. అంచనాలను మించి పెట్టుబడి ప్రతిపాదనలు రావడం ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా భారత పురోగతికి నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. ఆత్మనిర్భర్ ప్రణాళికలో భాగంగా భారతీయ తయారీదార్లను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల పెంపు, భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
తయారీ రంగంలో ఉద్యోగాల జోరు!
ముంబై: తయారీ రంగంలోని అధిక శాతం కంపెనీలు ఈ ఏడాది(2022–23) చివరి త్రైమాసికంలో ఉద్యోగ కల్పనా ప్రణాళికల్లో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ4)లో మరింత మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరిట టీమ్‌లీజ్ విడుదల చేసిన సర్వే తెలియజేసింది. భారీస్థాయి కంపెనీలు 69 శాతం, మధ్యస్థాయి సంస్థలు 44 శాతం, చిన్నతరహా బిజినెస్‌లు 39 శాతం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వివరించింది. సర్వేకు దేశవ్యాప్తంగా 14 నగరాల నుంచి తయారీ రంగంలోని 301 కంపెనీలను పరిగణించినట్లు తెలియజేసింది. 60 శాతానికిపైగా యాజమాన్యాలు తమ మానవ వనరులను విస్తరించే యోచనలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇక తయారీ, సర్వీసుల రంగాల ఉపాధి ప్రణాళికలు సంయుక్తంగా 68 శాతానికి బలపడినట్లు తెలియజేసింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఇది 65 శాతమేనని ప్రస్తావించింది. ఉపాధి కల్పనా ప్రణాళికల జాబితాలో ముంబై(97 శాతం), బెంగళూరు(94 శాతం), చెన్నై(89 శాతం), ఢిల్లీ(84 శాతం), పుణే(73 శాతం) ముందున్నట్లు పేర్కొంది. -
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
వాహన విడిభాగాల పరిశ్రమ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విడిభాగాల తయారీ రంగంలో భారత జోరు కొనసాగుతోంది. 2022 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో పరిశ్రమ 34.8 శాతం వృద్ధితో రూ.2.65 లక్షల కోట్లు నమోదు చేసింది. దేశీయంగా డిమాండ్.. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహన విభాగం నుంచి ఆర్డర్లు వెల్లువెత్తడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అసోసియేషన్ ప్రకారం.. పండుగల సీజన్ ద్విచక్ర వాహనాలకు చాలా సానుకూలంగా ఉంది. గతంలో మాదిరిగానే టూ వీలర్ల విభాగం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుంది. సెమీకండక్టర్ల లభ్యత, ముడి పదార్ధాల వ్యయాలు అధికంగా ఉండడం, కంటైనర్ల కొరత వంటి సరఫరా సంబంధ సమస్యలు నియంత్రణలోకి రావడంతో ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వృద్ధికి సాయపడింది. పరిశ్రమ ఆదాయంలో ఎలక్ట్రికల్ వాహన విభాగం వాటా 1 శాతంగా ఉంది. వాహన విక్రయానంత రం జరిగే విడిభాగాల కొనుగోళ్ల పరిమాణం 8% అధికమై రూ.42 వేల కోట్లు నమోదు చేసింది. ప్యాసింజర్ వాహనాలదే.. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో వాహన తయారీ సంస్థలకు రూ.2.37 లక్షల కోట్ల విలువైన విడిభాగాలు సరఫరా అయ్యాయి. ఇందులో 47 శాతం వాటా ప్యాసింజర్ వాహనాలదే. గతేడాది ఇదే కాలంలో ఈ వాటా 38 శాతం నమోదైంది. ఎస్‌యూవీల వైపు డిమాండ్ అధికం కావడంతో విడిభాగాల విలువ పెరిగింది. పరిశ్రమ ఆదాయంలో ద్విచక్ర వాహనాల విడిభాగాల వాటా 21 శాతం నుంచి 18 శాతానికి వచ్చి చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఎగుమతులు 8.6 శాతం దూసుకెళ్లి రూ.83,607 కోట్లు నమోదయ్యాయి. దిగుమతులు 17.2 శాతం పెరిగి దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఎగుమతుల్లో ఉత్తర అమెరికా వాటా 12 శాతం పెరిగి ఏకంగా 33 శాతం ఉంది. యూరప్ 30, ఆసియా 26 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో విడిభాగాల పరిశ్రమ రూ.5,794 కోట్ల వాణిజ్య మిగులుతో ముగిసింది. 2022–23లో ఎగుమతులు, దిగుమతులు సరసమైన సమతుల్యతతో తటస్థంగా మారాయి. -
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్‌లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 8.33% ఉంటే, నవంబర్‌లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
Ficci survey: తయారీ రంగానికి వచ్చే 9 నెలలూ ఢోకా లేదు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పటిష్ట వృద్ధి బాటన పయనిస్తుందని పారిశ్రామిక వేదిక ఫిక్కీ త్రైమాసిక సర్వే పేర్కొంది. ఈ విభాగం ప్రస్తుత సగటు సామర్థ్య వినియోగం 70 శాతం అని పేర్కొన్న సర్వే, ఇది ఈ రంగం సుస్థిర క్రియాశీలతను సూచిస్తోందని తెలిపింది. భవిష్యత్ పెట్టుబడుల అవుట్‌లుక్ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, సర్వేలో పాల్గొన్న దాదపు 40 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో సంస్థల సామర్థ్య విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించింది. సవాళ్లూ ఉన్నాయ్... అయితే విస్తరణ ప్రణాళికలకు అధిక ముడిసరుకు ధరలు, పెరిగిన రుణ వ్యయాలు, తగిన విధంగా లేని నిబంధనలు, అనుమతుల విధానాలు, వర్కింగ్ క్యాపిటల్ కొరత, పెరుగుతున్న ఇంధన ధరలు, షిప్పింగ్ లేన్ల నిరోధం కారణంగా అధిక లాజిస్టిక్స్ ఖర్చు, తక్కువ దేశీయ– గ్లోబల్ డిమాండ్, భారతదేశంలోకి చౌక దిగుమతులు అధికం కావడం, అస్థిర మార్కెట్, ఇతర సప్లై చైన్ అంతరాయాలు అడ్డంకుగా ఉన్నాయని సర్వేలో ప్రతినిధులు పేర్కొన్నారు. 10 ప్రధాన రంగాలు ప్రాతిపదిక 10 ప్రధాన రంగాలకు చెందిన 300 భారీ, మధ్య, చిన్న తరహా పతయారీ యూనిట్ల ప్రతినిధుల (ఆటోమోటివ్– ఆటో కాంపోనెంట్స్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, కెమికల్స్ ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ టూల్స్, మెటల్–మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్– టెక్స్టైల్ మిషనరీ) అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న సంస్థల వార్షిక టర్నోవర్ రూ.2.8 లక్షల కోట్లు. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం తయారీ రంగం పటిష్టంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ అక్టోబర్ వరకూ గడచిన 16 నెలల కాలంలో వృద్ధి బాటలోనే నడుస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం ఉంది.ఈ రంగంలో ఒక్క తయారీ రంగం వాటా 70 శాతం. తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయని ఇటీవల విడుదలైన టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ కూడా వెల్లడించింది. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. -
తయారీలో అధిక నియామకాలు
ముంబై: తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయి. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు చెప్పాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. తయారీ, సేవల రంగ కంపెనీల్లో నియామకాల పట్ల ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఇది 70 శాతం దాటుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఉపాధి కల్పన 2.7 శాతం మేర కోలుకుంది. ఇది 2022 ద్వితీయ ఆరు నెలల కాలానికి బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ధోరణి కంపెనీల్లో, ముఖ్యంగా తయారీలో ఎంతో బలంగా ఉంది. పరిశ్రమల్లో ఆశావాదం పుంజుకోవడం, పండుగల సందర్భంగా వినియోగ డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ భట్ తెలిపారు. ప్రోత్సహకాలు కీలకం.. ‘‘ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పర్యాటకం, ఏవియేషన్, నిర్మాణ రంగం, గృహ నిర్మాణానికి నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో సాయంగా నిలుస్తోంది’’అని టీమ్‌లీజ్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లోని 311 తయారీ కంపెనీలను టీమ్‌లీజ్ సర్వే చేసింది. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని తయారీ కంపెనీల్లో 91 శాతం నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కంపెనీల్లో ఇది 69 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 39 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీల్లో 21 శాతం మేర నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ఈ పట్టణాల్లో మెరుగు.. ముంబైలో అత్యధికంగా 93 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఆ తర్వాత బెంగళూరులో 90 శాతం, చెన్నైలో 83 శాతం, ఢిల్లీలో 79 శాతం, పుణెలో 67 శాతం, హైదరాబాద్‌లో 61 శాతం, అహ్మదాబాద్‌లో 61 శాతం మేర కంపెనీలు నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. బెంగళూరులో ఎఫ్ఎంసీజీ.. ముంబైలో తయారీ, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెన్నైలో ఆగ్రోకెమికల్స్ కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధి కల్పించనున్నాయి. -
చౌక తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: చైనా, వియత్నాం దేశాలను వెనక్కి నెట్టేసి.. భారత్ ప్రపంచంలోనే అత్యంత చౌక తయారీ కేంద్రంగా అవతరించింది. ఈ విషయాన్ని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకటించింది. మొత్తం 85 దేశాలకు గాను, మెరుగైన దేశంగా భారత్ 31వ ర్యాంకును సొంతం చేసుకుంది. వ్యాపార స్వేచ్ఛ విషయంలో 37వ స్థానాన్ని ఆక్రమించింది. తయారీ వ్యయాల పరంగా భారత్ 100 స్కోరు సాధించింది. పన్నుల పరంగా అనుకూలతలో 100కు గాను 16.2 స్కోరు లభించింది. అవినీతి రహితంలో 18.1 స్కోరు, పారదర్శక ప్రభుత్వ విధానాల విషయంలో 3.5 స్కోరు మాత్రమే సాధించింది. ఆదాయం సమానత్వంలో 1.9, భద్రతలో 4.3 శాతం స్కోరు లభించింది. -
అక్టోబర్‌లో భారత్ తయారీ రంగం స్ట్రాంగ్!
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం అక్టోబర్‌లో పటిష్టంగా ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సర్వే పేర్కొంది. సెప్టెంబర్‌లో 55.1 వద్ద ఉన్న సూచీ అక్టోబర్‌లో 55.3కు పెరిగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజన్స్లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ వరుసగా 16 నెలల నుంచీ వృద్ధి బాటలోనే నడుస్తోంది. కాగా, తయారీ రంగం ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఎగుమతులకు సంబంధించి ప్రధానంగా ఆందోళనలో ఉందని లిమా పేర్కొన్నారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోలు జరిపే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రం, ప్రతిస్పందనల ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదుచేయడం జరుగుతంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
క్యూ2లో స్తబ్దుగా ఎఫ్ఎంసీజీ విక్రయాలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ముగిసిపోలేదు. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మందగమనం, తయారీ వ్యయాలు పెరిగిపోవడం తదితర సవాళ్ల నుంచి అవి గట్టెక్కాల్సి ఉంది. కాకపోతే రానున్న నెలల్లో పరిస్థితులు సానుకూలిస్తాయన్న అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2) విక్రయాలు స్తబ్దుగా ఉన్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, డాబర్ ప్రకటించాయి. వీటి అమ్మకాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల్లో ఉండడాన్ని అవి ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం నెమ్మదించి, పండుగల సీజన్ కారణంగా వినియోగం పుంజుకుంటుందని ఇవి అంచనా వేస్తున్నాయి. వినియోగం పుంజుకుంటుంది.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు నెమ్మదించనున్నాయి. వర్షాలు కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అంచనాలకు తగ్గట్టే ఉన్నాయి. దీంతో వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం’’అని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొంది. సఫోలా, ప్యారాచూట్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో సైతం విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైనట్టు ప్రకటించింది. ‘‘డిమాండ్ సెంటిమెంట్ అంతకుముందు త్రైమాసికం మాదిరే క్యూ2లోనూ కొనసాగింది. కాకపోతే చివరి నెలలో (సెప్టెంబర్) కాస్త పుంజుకుంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు బలహీనంగా ఉండడం కనిపించింది’’అని మారికో తెలిపింది. కాకపోతే పట్టణ ప్రాంతాలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలు మెరుగ్గా ఉండడం కంపెనీలకు కాస్తంత వెసులుబాటు ఇస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, ద్వితీయ ఆరు నెలల కాలంలో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్టు మారికో తెలిపింది. అధిక పంటల దిగుబడి, పండుగల సీజన్ సానుకూలిస్తుందని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావం వ్యాపారంపై క్యూ2లోనూ కొనసాగినట్టు డాబర్ వెల్లడించింది. దీంతో అన్ని విభాగాల్లో డిమాండ్ బలహీనంగా ఉందని తెలిపింది. పట్టణాలు, ఈ కామర్స్ వేదికల్లో మాత్రం విక్రయాలు రెండంకెల వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, పండుగల సీజన్ వల్ల రానున్న నెలల్లో విక్రయాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. -
ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది
కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని, రికవరీ బాటలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తుండడంపై అప్రమత్త ధోరణిని ప్రకటించారు. స్వదేశీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని కీలక రంగాలు.. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మంచి పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు డిమాండ్, సేవల రంగం పనితీరు అంచనాలకు మించి ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు చేస్తోందంటూ, అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉందని అంగీకరించారు. బ్యాంకింగ్ రంగం తగినన్ని నిధులతో ఉందంటూ, బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం మెరుగునకు ఐబీసీ సాయపడినట్టు చెప్పారు. -
‘సోలార్’కు రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు మన దేశం పెద్ద పీట వేస్తుండడం తెలిసిందే. మన దేశ సౌర ఇంధన రంగానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఇప్పుడు అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. దీంతో దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది. భారీగా ఆదా..: తాజా ప్రోత్సాహకాలతో ఏటా రూ.1.4లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో అన్నారు. ఎగుమతుల రూపంలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు వస్తాయన్నారు. ఉచిత విద్యుత్ అంశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు సింగ్ స్పందించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి, బడ్జెట్ నుంచి చెల్లించొచ్చన్నారు. కానీ, చాలా రాష్ట్రాల బడ్జెట్లో ఇందుకు నిధుల్లేవంటూ, అవి రుణాలు తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నాయన్నారు. ఈ భారం తదుపరి తరాలపై పడుతుందన్నారు. రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నేషనల్ లాజిస్టిక్స్ విధానానికి ఆమోదం న్యూఢిల్లీ: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది. పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. సెమీకండక్టర్ పీఎల్ఐలో మార్పులు సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్వర్క్ చైన్‌లో చిప్ ఫ్యాబ్‌లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సెమీకండక్టర్ స్కీమ్ మరింత పటిష్టవంతం లక్ష్యంగా తాజా మార్పులు జరిగినట్లు వెల్లడించారు. భారత్‌లో సెమీకండక్టర్స్, డిస్ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. -
ప్యాసింజర్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్‌లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్‌యూవీల జోరుతో టాప్–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది. 2018–19ని మించిన విక్రయాలు.. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్‌లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్ 68.3, మహీంద్రా అండ్ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది. ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్‌కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్ 56.2, బజాజ్ 42.2, సుజుకీ 6.2, రాయల్ ఎన్ఫీల్డ్ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి. -
ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్ అందుకుంది. అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డ్ స్వీకరించింది. డీల్ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ ఎలక్ట్రిక్ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రమోట్ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. -
బీపీసీఎల్ ‘నెట్ జీరో’ 2040
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్.. పునరుత్పాదక ఇంధనాల తయారీపై భారీ ప్రణాళికలతో ఉంది. 2040 నాటికి 10 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి (నెట్ జీరో) చేరుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. బీపీసీఎల్ ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఇది చమురు, గ్యాస్ వ్యాపారంలో ఆదాయ క్షీణతకు హెడ్జింగ్‌గా, అదనపు ఆదాయానికి మార్గం కల్పిస్తుందన్నారు. ‘‘ఆరు వ్యూహాత్మక విభాగాలను గుర్తించాం. పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, నూతన వ్యాపారాలు (కన్జ్యూమర్ రిటైలింగ్, ఈ మొబిలిటీ) భవిష్యత్తు వృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయి. వాటాదారులకు స్థిరమైన విలువను తీసుకొస్తాయి. ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ ఎప్పటి మాదిరే స్థిరంగా కొనసాగుతుంది’’అని సింగ్ వివరించారు. భిన్న వ్యాపారాలు.. పునరుత్పాదక ఇంధనంలో ప్రస్తుతం గిగావాట్ కంటే తక్కువ ఉత్పాదక సామర్థ్యం ఉందని.. దీన్ని 2040 నాటికి 10 గిగావాట్లకు తీసుకెళ్లనున్నట్టు అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న 20వేల ఫ్యుయల్ స్టేషన్లు, 6,200 ఎల్పీజీ పంపిణీదారుల నెట్వర్క్ అండతో కన్జ్యూమబుల్స్, డ్యురబుల్స్ విక్రయాలు చేపట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల వెంట చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును కూడా ప్రస్తావించారు. ప్రయోగాత్మక విధానంలో చెన్నై–తిరుచ్చి–మధురై హైవే 900 కిలోమీటర్లను తాము దత్తత తీసుకున్నామని, ప్రతి 100 కిలోమీటర్లకు చార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. బినా, కోచి రిఫైనరీల వద్ద పెట్‌కెమ్ ప్రాజెక్టులు చేపట్టామని, ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందన్నారు. కొత్తగా 8 భౌగోళిక ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీ లైసెన్స్‌లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. -
తయారీ రంగానికి తలనొప్పి.. కారణాలు ఇవే!
న్యూఢిల్లీ: ఎగుమతి వృద్ధి కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) మంచి ఫలితాలను సాధించిన భారతీయ తయారీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2022–23)లో మాత్రం కొంత వెనక్కు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విదేశీ వాణిజ్య కార్యకలాపాల మందగమనం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. పారిశ్రామిక ఉత్పత్తి, వస్తువుల ఎగుమతులపై రూపొందిన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021–22లో సరుకుల ఎగుమతుల్లో కనిపించిన ‘‘అత్యుత్సాహం’’ తయారీ విభాగాలకు తోడ్పాటును అందించింది. అయితే 2022–23లో ఇలాంటి పరిస్థితి కనబడ్డం లేదు. ► ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రతికూల ప్రభావం 2022–23 ఎగుమతుల ధోరణిపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలతో మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుంచి డిమాండ్ తగ్గే వీలుంది. ఇది భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ► దీనికితోడు చైనాలో కఠిన కోవిడ్–19 నియంత్రణ చర్యలు భారతదేశంలోని వివిధ ఉప రంగాలలో ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఆయా అంశాలు, ప్రపంచ సరఫరాల వ్యవస్థపై నిరంతరం ప్రతికూలతలు సృష్టించే వీలుంది. ► 2015–16 నుంచి 2017–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశ సగటు వార్షిక సరుకుల ఎగుమతులు 297.02 బిలియన్ డాలర్లు. 2018–19లో 330.08 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా, 2021–22లో ఈ విలువ 421.89 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఎగుమతుల పెరుగుదల్లో తయారీ రంగం కీలక భాగస్వామిగా నిలిచింది. ► 2021–22లో ఎగుమతుల రంగం ఎంతో పటిష్టంగా కనిపించింది. ప్రాథమిక లోహాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఎంతో మెరుగుదల కనిపించింది. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో అనిశ్చితి నెలకొంది. ► ఎగుమతులు జూలైలో స్వల్ప స్థాయిలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు ఆగస్టు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తరువాత వెలువడిన సవరిత గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి. ► ఇక ఎకానమీకి ప్రస్తుతం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటుపైతం తీవ్ర సవాళ్లను తెస్తోంది. 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) వాణిజ్యలోటు దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి: బ్రిటన్ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది! -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
తయారీ రంగంలోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ తయారీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,70,720 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్శించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 76 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘తయారీలో భారత్‌కు వెల్లువెత్తిన నిధుల్లో 27.01 శాతం వాటాతో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. 17.94 శాతం వాటాతో యూఎస్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వరుసలో మారిషస్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నిలిచాయి.కోవిడ్ మహమ్మారి, ప్రపంచ పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ 2021–22లో భారత్ అత్యధికంగా రూ.6.78 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది’ అని వివరించింది. చదవండి: Zomato Stock Crash Prediction: జొమాటో షేర్లలో అల్లకల్లోలం, రాకేష్ ఝున్‌ఝున్ వాలా మాట వింటే బాగుండేదే! -
తొమ్మిది నెలల కనిష్టానికి తయారీ రంగం
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం క్రియాశీలత జూన్‌లో మందగించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యాను ఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.9గా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి తక్కువ స్థాయి నమోదుకావడం ఇదే తొలిసారి. మే నెల్లో పీఎంఐ 54.6 వద్ద ఉంది. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించే సంగతి తెలిసిందే. వస్తువుల ధరల తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి, అమ్మకాల స్పీడ్ తగ్గిందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అన్ని విభాగాలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. వ్యాపార విశ్వాసం 27 నెలల కనిష్టానికి పడిపోయింది. కాగా, ఉపాధి అవకాశాలు మాత్రం వరుసగా నాలుగవ నెలలోనూ మెరుగుపడ్డం గమనార్హం. -
ద్రవ్యోల్బణం తీవ్రతలోనూ తయారీ రంగం స్థిరం!
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం (మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 75 శాతం) మే నెల్లో స్థిరంగా ఉంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మే నెల్లో దాదాపు ఏప్రిల్ (54.7) స్థాయిలోనే 54.6 వద్ద ఉంది. వ్యవస్థలో తీవ్ర ధరల పెరుగుదల పరిస్థితి ఉన్నప్పటికీ ఎస్అండ్పీ సూచీ దాదాపు స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హం. మే నెల్లో ఉత్పత్తి, ఆర్డర్లు పెరిగాయని, డిమాండ్‌లో రికవరీ ఉందని సూచీ అంశాలు వివరించాయి. పలు రంగాలు రికవరీ బాటన నడిచాయి. ఎగుమతుల పరిస్థితి బాగుంది. సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. అమ్మకాల పెరుగుదల నేపథ్యంలో మేలో తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డం మరో కీలకాంశం. స్వల్పంగానే అయినా, 2020 జనవరి తర్వాత ఉపాధి కల్పన విషయంలో కొంత సానుకూల పరిస్థితి కనిపించింది. మరోవైపు వరుసగా 22వ నెల ముడి పదార్థాల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇంధనం, రవాణా, ఫుడ్‌స్టఫ్, మెటల్స్, జౌళి రంగాల్లో ధరల పెరుగుదల కనబడింది. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బిజినెస్ సెంటిమెంట్ బలహీనంగా ఉంది. -
ద్రవ్యోల్బణ సవాళ్లలోనూ జోరుమీదున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో తయారీ రంగం దూసుకుపోయింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. ఉత్పత్తి, ఫ్యాక్టరీ ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాల్లో పురోగతి వంటి అంశాలు సమీక్షా నెల ఏప్రిల్‌లో సూచీ స్పీడ్‌కు కారణమయ్యింది. కరోనా సంబంధ పరిమితులు, ఆంక్షలు సడలింపు కూడీ సూచీ పురోగతికి దోహదపడింది. సూచీ 50 పైనుంటే వృద్ధి సంకేతంగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సానుకూలత కనబడుతోంది... భారతీయ తయారీ సూచీ ఏప్రిల్‌లో సానుకూలంగా ఉందని ఎస్అండ్పీ గ్లోబల్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియన్నా డి లిమా పేర్కొన్నారు. కర్మాగారాల ఉత్పత్తి వేగం పెరిగిందని తెలిపారు. అమ్మకాలు, ముడి పదార్థాల కొనుగోలులో కొనసాగుతున్న పెరుగుదల వృద్ధిని సూచిస్తోందని, సమీప కాలంలో నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని ఆమె అన్నారు. గణాంకాల ప్రకారం, ఎగుమతుల ఆర్డర్లు కూడా పుంజుకున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయి. కమోడిటీ ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. కాగా, ఉపాధి అవకాశాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. వ్యాపార విశ్వాస కొంత మెరుగుపడింది. అయితే ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ పుంజుకుంటాయని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతుండగా, అవుట్‌లుక్‌ను ఊహించడం ఇంకా కష్టంగానే ఉందని మరికొన్ని సంస్థలు భావిస్తుండడం గమనార్హం. -
ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారీ పన్ను వసూళ్లు బూస్ట్!
న్యూఢిల్లీ: బడ్జెట్లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని, పన్ను రాబడులు పుంజుకుంటాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆయా అంశాలు ఎకానమీని ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడుపుతాయన్న భరోసాను వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయ ం)ను 35.4% పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. తాజా ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అంచనాలపై ఆర్థిక శాఖ ఆవిష్కరించిన అవుట్‌లుక్‌లో ముఖ్యాంశాలు... ► గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు రికార్డు స్థాయిలో 34% పెరిగి రూ. 27.07 లక్ష ల కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొని వేగవంతమైన పురోగతి సాధిస్తోందనడానికి ఇది గొప్ప సాక్ష్యం. ► భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిబద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఆయా అంశాలు దేశాన్ని పటిష్ట ఆర్థిక పురోగతి బాటన నిలుపుతున్నాయి. ► ఎకానమీ పటిష్ట బాటన నడుస్తోందని ఇటీవల భారీగా పెరిగిన పన్ను ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధన సాధ్యమేనని ఈ గణాంకాలు భరోసా ఇస్తున్నాయి. 2020–21లో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.6.5 లక్షల కోట్లయితే, ఇది 2021–22లో రూ.8.6 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో 49 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల వసూళ్లు 20 శాతం పెరిగి 12.90 లక్షల కోట్లకు ఎగశాయి. ► పన్ను వసూళ్ల బేస్ పెంపు, తక్కువ వడ్డీరేట్లు, మినహాయింపులు లేని కొత్త సరళీకృత పన్ను విధానం, కార్పొరేట్ రంగానికి వ్యాపారాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం, పన్ను ఎగవేతలకు చర్యలు వంటి పలు సంస్కరణాత్మక చర్యలు పన్నుల రాబడిని పెంచడానికి, తద్వారా ఎకానమీ పురోగతికి దోహదపడుతున్నాయి. -
5% పెరగనున్న ఏసీల ధరలు
న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు మార్జిన్లపై ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ సీజన్లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని అంచనా వేసుకుంటున్న కంపెనీలు.. తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వేసవి సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు అవుతాయంటూ భారత వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా ఏసీల విక్రయాలపై కంపెనీల్లో ఆశలు పెంచాయి. గత రెండు వేసవి సీజన్లలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా అమ్మకాలు ఆశించిన మేర లేవు. దీంతో అప్పుడు నిలిచిన డిమాండ్ కూడా తోడయ్యి, ఈసీజన్లో అమ్మకాలు జోరుగా ఉండొచ్చని వోల్టాస్, హిటాచి, ఎల్జీ, ప్యానాసోనిక్, గోద్రేజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తున్నాయి. ఏసీ తయారీ కంపెనీలు గత త్రైమాసికంలో ధరలను ఒక విడత పెంచాయి. ఏసీల తయారీలో వినియోగించే అల్యూమినియం, కాపర్ ధరలు గణనీయంగా పెరగడంతో ఈ పనిచేయక తప్పలేదు. ఉదాహరణకు గతేడాది వరకు 3 స్టార్ ఇన్వర్టర్ స్లి్పట్ ఏసీ ధర రూ.33,500 స్థాయిలో ఉంటే, తాజాగా దీని ధర రూ.36,500–37,000కు చేరడం గమనార్హం. మరోవైపు ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు ఆకర్షణీయమైన ఈఎంఐ పథకాలను కూడా అందిస్తున్నాయి. ‘‘2021–22లో ధరలను రెండంకెల స్థాయిలో పెంచాల్సి వచ్చింది. ఇది ఈ వేసవి సీజన్లో వినియోగదారుల కొనుగోళ్లకు ప్రతికూలంగా మారదని భావిస్తున్నాం. కస్టమర్ల సౌలభ్యం కోసం ఆఫర్లకుతోడు, సులభ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నాం’’అని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి తెలిపారు. మే నుంచి ధరల భారం.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) వార్షిక విక్రయాల్లో 40–50 శాతం మేర ఈ వేసవి సీజన్లో నమోదవుతాయని అంచనా వేస్తోంది. గడిచిన 18 నెలల్లో కన్జ్యూమర్ అప్లయన్సెస్ ధరలు 15 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. కమోడిటీ ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరల పెరుగుదల భారాన్ని పరిశ్రమ చూస్తున్నట్టు పేర్కొంది. ‘‘ధరల పెరుగుదల ప్రభావం వినియోగదారులపై వెంటనే ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్చి–ఏప్రిల్ నెలలకు సరిపడా నిల్వలు ఇప్పటికే సమకూర్చడం జరిగింది. మే నుంచి తదుపరి ధరల పెరుగుదల అమల్లోకి రావచ్చు’’ అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. ఈ సీజన్లో వినియోగ డిమాండ్ దెబ్బతినకుండా రేట్ల పెంపును అమలు చేయడం తమకు సవాలని జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ, గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ధరల భారం సర్దుబాటు చేసుకునేందుకు తమవైపు నుంచి వీలైనంత ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గతేడాది ఇచ్చి న ఆఫర్లను సైతం ప్రస్తుత సీజన్‌కు వచ్చే సరికి తగ్గించేసినట్టు గుర్మీత్‌సింగ్ తెలిపారు. తాము ధరల పెంపు విషయంలో వేచి చూస్తున్నట్టు గో ద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్‌నంది తెలిపారు. ‘గత 2 వేసవి సీజన్లపై లాక్డౌన్ ప్రభావం పడింది. దాంతో చాలా మంది కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడం, హైబ్రిడ్ పని నమూనా వినియోగ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నాం’ అని కమల్ నంది తెలిపారు. -
భారత్ ‘తయారీ’ అంతంతే..! మార్చిలో మరీ దారుణంగా..
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చి నెలలో నెమ్మదించింది. ఉత్పత్తి, అమ్మకాల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో 54గా నమోదయ్యింది. సెప్టెంబర్ 2021 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో ఈ సూచీ 54.9 వద్ద ఉంది. అయితే సూచీ 50 లోపుకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. 50 ఎగువన వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ముడి పదార్థాల ధరలు పరిశ్రమకు ప్రధానంగా అవరోధంగా మారాయి. రసాయనాలు, ఇంధనం, ఫ్యాబ్రిక్, ఆహార ఉత్పత్తులు, మెటల్ ధరలు ఫిబ్రవరికన్నా పెరిగాయి. -
మేడిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ కేతన్ పటేల్ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం. కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా విస్తృత శ్రేణి .. హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్ మినీ టవర్స్ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్ (డీఎం), స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ (ఎస్ఎఫ్ఎఫ్) డెస్క్‌టాప్స్, ఆల్–ఇన్–వన్ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. -
అమేకా.. యురేకా!
సాధారణంగా రోబోలంటే ఎలా కనిపిస్తాయి? మర మనిషి అనే పేరుకు తగ్గట్లే గంభీరమైన ముఖం, కృత్రిమ నడకతో దర్శనమిస్తాయి. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముందే సిద్ధం చేసిన మాడ్యూల్‌కు అనుగుణంగా పనిచేస్తాయి. కానీ ప్రపంచంలోకెల్లా తొలిసారి అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘అమేకా’ రూపు దాల్చింది. సహజ స్పందనలతో అందరినీ కనువిందు చేసింది. అచ్చం మనిషి ముఖ కవళికలు, కదలికలు, హావభావాలు ప్రదర్శించగలగడం దీని ప్రత్యేకత! యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ అనే రోబోల తయారీ సంస్థ యూట్యూబ్ వేదికగా దీన్ని ఆవిష్కరించింది. ఆ వీడియోలో అమేకా తనను తాను చూసుకొని తెగ మురిసిపోయింది! కనురెప్పలను పదేపదే ఆర్పడంతోపాటు తనకు అమర్చిన చేతులను అటూఇటూ కదిలిస్తూ ముఖానికి దగ్గరగా పెట్టుకొని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైంది!! తలను పక్కలకు కదిలిస్తూ నిజంగానే నోరెళ్లబెట్టింది! నెటిజన్ల జేజేలు... అమేకాను చూసిన నెటిజన్లంతా తెగ మెచ్చుకుంటున్నారు. అది ప్రదర్శించిన హావభావాలు అత్యంత సహజంగా ఉన్నాయని తెగ పొగిడేస్తున్నారు. ప్రత్యేకించి అమేకా కళ్లను కదిలించిన తీరు ముచ్చటగొలిపిందన్నారు. మామూలుగా రోబోల కళ్లు కాస్త భయంకరంగా కనిపిస్తాయని... కానీ అమేకా కళ్లు అచ్చం మనిషిని పోలినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరికొందరేమో అమేకా ముఖ కవళికలను ఈ స్థాయిలో మారుస్తుండటం చూసి తొలుత నమ్మలేదని... అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్‌గా భావించామని చెప్పుకొచ్చారు. ఇంకొందరేమో 2004లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఐ రోబో’లో హావభావాలు ప్రదర్శించిన రోబోతో అమేకాను పోల్చారు. భావి టెక్నాలజీ ఆవిష్కారానికి వేదిక... ఈ రోబో ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున దీని తయారీకి ఎంత ఖర్చయిందో ఇంజనీర్డ్ ఆర్ట్స్ వెల్లడించలేదు. అయితే మనిషి తరహాలో దాన్ని నడిచేలా చేయడం సవాల్‌తో కూడుకున్నదని పేర్కొంది. భవిష్యత్ రోబో సాంకేతికతల అభివృద్ధికి వేదికగా అమేకాను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. 2005లో ఏర్పాటైన ఇంజనీర్డ్ ఆర్ట్స్... తమ తొలి మెకానికల్ రోబో ‘థెస్పియన్’ను రూపొందించింది. స్టేజీలపై నటించగలగడం, 30 భాషలు మాట్లాడగలగడం దాని ప్రత్యేకతలు. గతంలో ‘సోఫీ’.. మనిషి తరహాలో ఒక రోబో ముఖ కవళికలు మార్చగలగడం ఇది తొలిసారి కాదు. 2016లోనే మానవ ముఖాకృతితోపాటు అత్యంత తెలివితేటలు ప్రదర్శించగల ‘సోఫీ’ అనే హ్యూమనాయిడ్ రోబోను హాంకాంగ్ సంస్థ హాన్సన్ రొబోటిక్స్ తయారు చేసింది. కనురెప్పలు వాల్చడం, పరికించి చూడటం, తలను పక్కకు తిప్పడంతోపాటు గలగలా మాట్లాడటం సోఫీ సొంతం! ప్రత్యేకించి తనతో మాట కలిపే మనుషులతో ఎంతసేపైనా ముచ్చట్లలో మునిగితేలడం, కొంటెగా నవ్వడం, జోకులు వేయడం కూడా చేసేది. సోఫీ పనితీరుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంతగానో ముచ్చటపడింది. దానికి 2017లో చట్టబద్ధ పౌరసత్వం కల్పించడంతో ఈ తరహా ఘనతను సాధించిన రోబోగా సోఫీ చరిత్ర సృష్టించింది. సోఫీలో ఎన్నో సామర్థ్యాలు ఉన్నప్పటికీ దానికన్నా మరింత మెరుగ్గా అమేకా ఉంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్‌లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్‌లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్‌లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్‌లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్‌లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
ఏసీల హబ్‌గా భారత్.. కీలకంగా మారనున్న ఏపీలోని శ్రీసిటీ
న్యూఢిల్లీ: ఏసీల తయారీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) దేశీయ కంపెనీలకు తగినన్ని అవకాశాలు కల్పిస్తాయని.. అంతర్జాతీయంగా పోటీపడే సత్తా సమకూరుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశం దేశీయ కంపెనీలకు లభిస్తుందని డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ప్యానాసోనిక్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆమోదం గత బుధవారం కేంద్ర ప్రభుత్వం వైట్‌గూడ్స్(ఏసీలు, ఏసీల విడిభాగాలు)కు సంబంధించి 42 దరఖాస్తులను పీఎల్ఐ పథకం కింద ఆమోదించడం గమనార్హం. ఇందులో 26 దరఖాస్తులు ఏసీల తయారీకి సంబధించినవి ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.3,898 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏపీలో డైకిన్, బ్లూస్టార్ ప్రాజెక్టులు తాజాగా ప్రభుత్వ ఆమోదం పొందిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండస్ట్రీస్ ఇండియా (జపాన్ కంపెనీ) ఒక్కటే రూ.539 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో 75 ఎకరాల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. కంప్రెషర్లు, హీట్ ఎక్సే్ఛంజర్లు, షీట్‌మెటల్ కాంపోనెంట్స్, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్‌ను డైకిన్ తయారు చేయనుంది. ‘మేము ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నది కేవలం భారత మార్కెట్ కోసమే కాదు. పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని అనుకుంటున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంతో సానుకూలంగా ఉంది’ అని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా పేర్కొన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు తయారీ కేంద్రంగా భారత్‌ను చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘చైనా వన్‌ప్లస్ నమూనాపై దృష్టి పెట్టాం. కరోనా తర్వాత చైనా పట్ల వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నాం. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న మా మూడో ప్లాంట్ కోసం 75 ఎకరాల భూమిని తీసుకున్నాం’’ అని జావా చెప్పారు. శ్రీ సిటీలోనే బ్లూస్టార్ ప్రాజెక్టు కూడా త్వరలో రానుంది. పీఎల్ఐ కింద హీట్ ఎక్సేంజర్లు, షీట్ మెటల్ కాంపోనెంట్లను శ్రీసీటీలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో తయారు చేయనున్నట్టు బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. దేశంలో ఏసీల విడిభాగాల తయారీ వ్యవస్థ వచ్చే మూడేళ్లలో మంచి స్థితికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. వోల్టాస్ ఆత్మనిర్భర భారత్ డొమెస్టిక్ ఏసీల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న వోల్టాస్ సైతం క్రాస్ ఫ్లో ఫ్యాన్, హీట్ ఎక్సే్ఛంజర్లు, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి పీఎల్ఐ కింద అర్హత సాధించింది. తమ తయారీ సదుపాయల ద్వారా దేశీయ తయారీ రంగానికి మరింత చేదోడుగా నిలవనున్నట్టు వోల్టాస్ ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదించిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండియా, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ టెక్నోప్లాస్ట్, హిందాల్కో ఇండస్ట్రీస్, మెట్యూబ్ ఇండియా, బ్లూస్టార్ క్లిమాటెక్, హావెల్స్, జాన్సస్ కంట్రోల్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్, వోల్టాస్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, డిక్సన్ డివైజెస్, ప్యానాసోనిక్ ఇండియా, సిస్కా ఎల్ఈడీ లైట్స్, హేయర్ అప్లియన్సెస్ ఉన్నాయి. చదవండి :అయ్యగారికి దండం పెట్టు.. క్యూఆర్ కోడ్‌కి డబ్బులు కొట్టు... -
ఇక పెయింట్లు, టైల్స్ బౌన్స్‌బ్యాక్!
కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఇటీవల హౌసింగ్ రంగం జోరందుకుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవాలన్న తపనకుతోడు.. కొన్నేళ్ల కనిష్టాలకు చేరిన వడ్డీ రేట్లు హౌసింగ్ రంగానికి బూస్ట్‌నిస్తున్నాయి. మరోపక్క పలు రంగాలు ఆన్లైన్ సేవలవైపు మళ్లడంతో ఐటీ, ఈకామర్స్ తదితర రంగాలు సైతం దూకుడు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై వాణిజ్య సముదాయాలకూ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా పెయింట్లు, సిరామిక్ టైల్స్ రంగాలకు అవకాశాలను పెంచే వీలున్నట్లు చెబుతున్నారు. ముంబై: కరోనా మహమ్మారి పంజా విసరడంతో గత ఆర్థిక సంవత్సరం (2021–22) పెయింట్లు, సిరామిక్ టైల్స్ రంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్త లాక్డౌన్లు, సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలసకూలీలు, నిలిచిపోయిన నిర్మాణం, ఉత్పత్తి తదితరాలు ప్రభావం చూపాయి. వీటికితోడు ముడివ్యయాలు పెరిగిపోయాయి. పెయింట్స్ పరిశ్రమలో ప్రధానంగా ముడిచమురు నుంచి లభించే ఉపఉత్పత్తులు(డెరివేటివ్స్) ముడిసరుకుగా వినియోగితమవుతుంటాయి. గ్యాస్ ధరలు బలపడటంతో సిరామిక్ టైల్స్ తయారీ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ఆధారిత ప్రొడక్టులు, వాటర్ ప్రూఫింగ్ తదితరాలను ప్రవేశపెట్టడం ద్వారా పెయింట్ల పరిశ్రమ రికవరీ బాట పట్టింది. సంఘటిత రంగంలోని లిస్టెడ్ కంపెనీలు ఇందుకు దారి చూపాయి. లీడింగ్ సిరామిక్ టైల్స్ కంపెనీలు సైతం పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ప్రొడక్టులను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే బాట పట్టాయి. వీటికి ఎగుమతి ఆర్డర్లు దన్నునిస్తున్నాయి. అధిక గ్యాస్ ధరలు అసంఘటిత రంగ కంపెనీలకు సవాళ్లు విసరడం వీటికి కలసి వస్తోంది. టైల్స్ తయారీ దిగ్గజాలు ఫాసెట్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ తదితర విభాగాలలోకి ప్రవేశించడం ద్వారా మరింత బలపడుతున్నాయి. ధరల పెంపు..: మార్జిన్లపై ఒత్తిళ్ల నేపథ్యంలో పలు కంపెనీలు కొంతకాలంగా ఉత్పత్తులకు ధరలు పెంచుతూ వస్తున్నాయి. గతేడాది కొద్ది నెలలపాటు ఉత్పత్తి నిలిచిపోవడం, అమ్మకాలు పడిపోవడంతో ఇటీవల పెంటప్ డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా అమ్మకాల పరిమాణం పుంజుకోనుంది. అయితే దీర్ఘకాలానికి అందుబాటు ధరల్లో గృహ సముదాయాలపై ప్రభుత్వ విధానాలు, పట్టణీకరణ, పుంజుకుంటున్న గ్రామీణ ఆదాయాలు రియల్టీ రంగ వృద్ధికి దోహదపడనున్నాయి. మరోపక్క పారిశ్రామిక రంగ రికవరీ సైతం పెయింట్స్ పరిశ్రమకు ఆశలు కల్పిస్తోంది. ఆటో రంగం జోరందుకుంటే పెయింట్ పరిశ్రమ మరింత కళకళలాడేందుకు అవకాశముంటుంది. వెరసి రెండేళ్ల మందగమనం తదుపరి పెయింట్ కంపెనీలు భారీ లాభాల రంగులను అద్దుకునే వీలుంది. వృద్ధి అంచనాలు సిరామిక్ టైల్స్ వినియోగం ఊపందుకుంటున్న నేపథ్యంలో 2027కల్లా పరిశ్రమ రెట్టింపునకు జంప్చేయవచ్చని అంచనా. వెరసి లిస్టెడ్ కంపెనీల టర్నోవర్ ఐదారేళ్లలో రెట్టింపయ్యే అవకాశముంది. టైల్స్ పరిశ్రమ విలువ 2019లో 3.7 బిలియన్ డాలర్లు(రూ. 27,500 కోట్లు)గా నమోదైంది. వార్షికంగా 8.6 శాతం వృద్ధి నమోదైతే 2027కల్లా 7.14 బిలియన్ డాలర్ల(రూ. 53,120 కోట్లు)కు చేరుకునే వీలుంది. ఇక పెయింట్ల మార్కెట్ విలువ రూ. 50,000 కోట్లుకాగా.. రెండు, మూడేళ్లపాటు డిమాండ్ కొనసాగవచ్చని అంచనా. దీంతో భారీ సామర్థ్య వినియోగానికి మార్గమేర్పడనుంది. పలు అవకాశాలు పెయింట్స్ పరిశ్రమలో లిస్టెడ్ దిగ్గజాలు ఏషియన్ పెయింట్స్‌సహా, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్, ఇండిగో పెయింట్స్‌కు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ కౌంటర్లపట్ల నిపుణులు ఆశావహంగా స్పందిస్తున్నారు. గత మూడు నెలల్లో ఏషియన్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ 13% లాభపడ్డాయి. ఇక సిరామిక్ టైల్స్ విభాగంలో కజారియా, సెరా, హింద్ శానిటరీవేర్, సొమానీ సిరామిక్స్ తదితరాలు పెంటప్ డిమాండ్ నుంచి లబ్ధి పొందనున్నాయి. గత మూడు నెలల్లో కజారియా 25 శాతం జంప్‌చేయగా.. సొమానీ 24 శాతం ఎగసింది. -
‘డ్రోన్’ స్టార్టప్స్‌లో పెట్టుబడులు రయ్
డ్రోన్ల వినియోగానికి సంబంధించి కేంద్ర సర్కారు ఇటీవలే నిబంధనలను సరళతరం చేసింది. దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేగవంతమైన డెలివరీకి డ్రోన్లు వీలు కల్పిస్తాయని తెలిసిందే. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం వల్ల తగిన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణలను సడలిస్తూ, పెట్టుబడులను ఆకర్షించే విధానాలను ప్రకటించింది. దీంతో డ్రోన్లను తయారు చేసే స్టార్టప్‌లలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటల్ కంపెనీల్లో ఆసక్తి ఏర్పడింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్ఐ) డ్రోన్ల తయారీ కంపెనీలకు రూ.120 కోట్ల ప్రోత్సాహకాలను సైతం కేంద్రం ప్రకటించడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచినట్టు చెప్పుకోవాలి. డ్రోన్ల తయారీలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఒక సీనియర్ అధికారి తెలిపారు. పీఎల్ఐ పథకం డ్రోన్ల తయారీకి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచి స్పందన వస్తోంది.. డ్రోన్ స్టార్టప్‌లకు మద్దతుగా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్‌దూబే మీడియాకు తెలిపారు. ‘‘వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి వివరాలు కోరుతూ విచారణలు కూడా వస్తున్నాయి. పెట్టుబడుల సలహాల విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోదు. కానీ, మా విధానపరమైన మార్గదర్శకాలు తెలియజేయడం వల్ల వారిలో ఎంతో విశ్వాసం ఏర్పడుతుంది’’అని దూబే వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి డ్రోన్ తయారీ రంగం రూ.900 కోట్లను చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రావచ్చని భావిస్తోంది. 2021 మార్చి నాటికి ఈ రంగంలో రూ.60 కోట్ల మేర వ్యాపారం నమోదు కావడం గమనార్హం. డ్రోన్ల వల్ల విస్తరించే సేవల విలువ రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని.. డ్రోన్ల నిర్వహణ, డ్రోన్ లాజిస్టిక్స్, డేటా ప్రాసెసింగ్, ట్రాఫిక్ నిర్వహణ తదితర విభాగాల్లో వచ్చే మూడేళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది. ఇన్వెస్టర్లలో మార్పు.. ఇప్పటివరకు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు డ్రోన్ స్టార్టప్‌ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పౌర అవసరాలకు సంబంధించి డ్రోన్ల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా 2018లో ప్రభుత్వం ప్రకటించడం, నియంత్రణల పరంగా స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. 2011–2021 మధ్య డ్రోన్ స్టార్టప్‌లలో వచ్చిన పెట్టుబడులు రూ.310 కోట్లకు మించలేదని ట్రాక్సెన్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే కాలంలో అమెరికాలో 4 బిలియన్ డాలర్లు (రూ.29,600 కోట్లు), అంతర్జాతీయంగా 6.2 బిలియన్ డాలర్లు (రూ.46,000 కోట్లు) డ్రోన్ కంపెనీల్లోకి రావడం గమనార్హం. భారత్‌లో డ్రోన్ల స్టార్టప్‌లు 158 ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 2,772 సంస్థలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ‘‘ప్రస్తుతం పలు ఇండియన్ డ్రోన్ స్టార్టప్‌లు సిరీస్ ఏ నిధుల సమీకరణకు చర్చలు నిర్వహిస్తున్నాయి’’ అని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ఇండియా డైరెక్టర్ (పార్టనర్షిప్స్) అమిత్‌షా తెలిపారు. ఈ అసోసియేషన్‌లో 200 డ్రోన్ల కంపెనీలు, వాటికి సంబంధించి సేవల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ►158. 2021 మార్చినాటికి దేశీ డ్రోన్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం కంపెనీల సంఖ్య. ►30,000 డ్రోన్ల వినియోగానికి సంబంధించి విస్తరించనున్న సేవల విలువ. తద్వారా ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా ►310. 2011–2021 మధ్య దేశీ డ్రోన్ల స్టార్టప్‌లలోకి వచ్చిన పెట్టుబడులు ►10,000 ప్రత్యక్షంగా రానున్న ఉపాధి అవకాశాలు ►900. 2024 మార్చి నాటికి ఈ పరిశ్రమ విస్తరిస్తుందని అంచనా వేస్తున్న విలువ -
చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ!
న్యూఢిల్లీ: సరఫరాల్లో సమస్యల కారణంగా కొత్త స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ తగ్గింది. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల విచక్షణారహిత వినియోగానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఫలితంగా రీఫర్బిష్డ్ ఫోన్లకు (నవీకరించినవి) గిరాకీ ఏర్పడింది. 2019తో పోలిస్తే రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు 2020లో రెట్టింపునకు పైగా పెరిగాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. యంత్రా అన్నది మొబైల్ రిపేర్, రీఫర్బిష్డ్ సేవల్లోని కంపెనీ. ఈ సంస్థ సీఈవో జయంత్‌జా మాట్లాడుతూ.. రూ.4,000–6,000 ధరల శ్రేణిలోని రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ల నిల్వలు కేవలం 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్టు చెప్పారు. ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే నవీకరించిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు గడిచిన ఏడాది కాలంలో అధికంగా ఉన్నాయని చెప్పారు. హ్యాండ్సెట్లపై ఆధారపడడం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. వచ్చే 12–18 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 750 పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు 450 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. యంత్ర ప్లాట్‌ఫామ్ వినియోగించిన ఫోన్లను ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేస్తుంటుంది. వాటిని నిపుణులతో తనిఖీ చేయించి తిరిగి మంచి స్థితిలోకి తీసుకొచ్చి (రీఫర్బిష్డ్) విక్రయిస్తుంటుంది. కొత్త ఫోన్ల మాదిరే రీఫర్బిష్డ్ ఫోన్లపైనా ఆరు నెలల వరకు వారంటీ లభిస్తుంది. కరోనా రాకతో ఆన్లైన్ వినియోగం పెరగడం తెలిసిందే. ఎన్నో సేవలను ఫోన్లలోని యాప్‌ల సాయంతో పొందుతున్నారు. విద్యార్థులు సైతం ఆన్లైన్ పాఠాలకు మళ్లడం చూశాం. ఈ పరిస్థితులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఫోన్లకు డిమాండ్‌ను పెంచేశాయి. 4.8 కోట్ల విక్రయాలు.. గతేడాది కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్లు ప్రకటించడం తెలిసిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో కరోనాతో చైనాలోని విమానాశ్రయలు, ఓడరేవుల్లో కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించాల్సి వచ్చింది. దీంతో చైనా నుంచి మన దేశానికి వచ్చే విడిభాగాలకు సమస్యలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్ పెరగడం వంటి పరిస్థితులు పాత ఫోన్లకు డిమాండ్‌ను తెచ్చిపెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులు ఇప్పుడు రూ.30వేల ల్యాప్‌టాప్‌లు, రూ.10,000–15,000 ధరల శ్రేణిలోని స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపడం లేదని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది. 2019లో 2–3 కోట్ల రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్లు అమ్ముడుపోగా.. 2021లో 4.8 కోట్ల రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు నమోదు కావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
తోలు పరిశ్రమకు ప్రోత్సాహకాలు పొడిగింపు!
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ, ఉపాధి కల్పన, ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రోత్సాహక పథకాన్ని (ఐఎఫ్ఎల్ఏడీపీ) 2025–26 దాకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22 నుంచి 2025–26 మధ్య కాలంలో ఈ స్కీమ్ కింద రాయితీల విలువ సుమారు రూ. 1,700 కోట్ల మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమరి్పంచిందని, కేంద్ర క్యాబినెట్ దీన్ని త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యయాలపై ఆరి్థక శాఖ కమిటీ దీనికి ఇప్పటికే ఆమోదముద్ర వేసిందని వివరించారు. గతంలో 2017–18 నుంచి 2019–20 మధ్య కాలంలో రూ. 2,600 కోట్ల వ్యయాల అంచనాలతో కేంద్రం ఐఎఫ్ఎల్ఏడీపీని ప్రకటించింది. తాజాగా పథకం ప్రకారం తోలు, పాదరక్షల రంగంలో దేశీ బ్రాండ్ల ప్రమోషన్ కోసం రూ. 100 కోట్లు, డిజైన్ స్టూడియోల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, తోలు పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం రూ. 500 కోట్లు, సంస్థాగత కేంద్రాల ఏర్పాటుకు రూ. 200 కోట్లు మేర వ్యయాల ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం 10 భారతీయ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు అవసరమైన సహకారం లభిస్తుంది. 10 డిజైన్ స్టూడియోల అభివృద్ధి కోసం కావాల్సిన సహాయం అందుతుంది. ఇక మెగా లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్మెంట్ సబ్–స్కీమ్ కింద స్థల అభివృద్ధి, తయారీ కేంద్రాలు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపరమైన తోడ్పాటు లభిస్తుంది. -
ఆటోమేకర్స్‌కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన
చిప్ సెట్ల కొరతతో సతమతం అవుతున్న అటోమొబైల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్ల తయారీకి సంబంధించి అత్యంతక కీలకమైన విభాగంలో మార్పులు చేర్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు. ప్రతికూల పరిస్థితులు కరోనా సంక్షోభం తర్వాత కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా కార్ల తయారీలో కీలకమైన చిప్సెట్ల కొరత నెలకొంది. దీంతో కార్ల తయారీ సంస్థల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఆటో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయండి పెట్రోలు ధరలు కంట్రోల్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే ఇంజన్లతో నడిచే కార్లను మార్కెట్లోకి తేవాలంటూ కార్ల తయారీ సంస్థలను కేంద్రం ఇప్పటి వరకు కోరుతూ వస్తోంది. ఇటు పెట్రోలో/డీజిల్‌తో పాటు బయో ఇథనాల్‌తో నడిచే విధంగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలని చెబుతోంది. అయితే కేంద్రం సూచనలకు తగ్గట్టుగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయడంపై కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈవీ మార్కెట్‌పై కొద్దొగొప్పో ఫోకస్ చేస్తున్నాయి. తప్పనిసరి చేస్తాం చెరుకు, వరి ఇతర పంట ఉత్పత్తుల నుంచి బయో ఇథనాల్ భారీ ఎత్తున తయారు చేసే అవకాశం ఉందని, కాబట్టి బయో ఇథనాల్‌కి మార్కెట్ కల్పించాలంటే ఫ్లెక్సీ ఇంజన్లతో నడిచే వాహనాలు ఉండాలి. దీంతో ఫ్లెక్సీ ఇంజన్ల తయారీని తప్పని సరి చేస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామని, ఇందుకు ఆర్నెళ్లకు మించి సమయం పట్టబోదంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు. అయోమయంలో కంపెనీలు ఓ వైపు కర్భణ ఉద్గారాలు తగ్గించాలని చెబుతూ... ఈవీ మార్కెట్‌కి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ఇంజన్లు అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చదవండి: BH-Series Tag: రాష్ట్రాల మధ్య వాహనాల తరలింపు సులభతరం -
తయారీలో అమెరికాను మించిన భారత్
న్యూఢిల్లీ: తయారీ కార్యకలాపాలకు అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికాను భారత్ వెనక్కి నెట్టింది. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో తయారీ వ్యయాల భారం తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడింది. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రూపొందించిన 2021 అంతర్జాతీయ తయారీ రిస్క్ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. యూరప్, ఉత్తర–దక్షిణ అమెరికా, ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ)కి చెందిన 47 దేశాల్లో తయారీకి అనువైన ప్రాంతాలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ జాబితా రూపొందింది. ఇందులో ఈ ఏడాది అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. కెనడా, చెక్ రిపబ్లిక్, ఇండొనేíసియా, లిథువేనియా, థాయ్‌లాండ్, మలేసియా, పోలాండ్ దేశాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. ప్రాతిపదికగా నాలుగు అంశాలు .. మిగతా దేశాలతో పోలిస్తే తయారీ హబ్‌గా కంపెనీలు .. భారత్‌ను ఎంపిక చేసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఈ అధ్యయనం నిదర్శనమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ పేర్కొంది. ‘భారత్‌లో నిర్వహణ పరిస్థితులు, వ్యయాలపరంగా ఇతర దేశాలకు గట్టి పోటీనివ్వగలిగే సామర్థ్యాలు ఇందుకు దోహదపడుతున్నాయి. అలాగే అవుట్సోర్సింగ్ అవసరాలకు తగ్గట్లు భారత్ రాణిస్తుండటమూ మరో కారణం‘ అని వివరించింది. తయారీని సత్వరం తిరిగి ప్రారంభించగలగడం, వ్యాపార పరిస్థితులు (కార్మికులు/నిపుణుల లభ్యత, అందుబాటులోని మార్కెట్), నిర్వహణ వ్యయాలు, రిస్కులు (రాజకీయ, ఆర్థిక, పర్యావరణపరమైనవి) అనే 4 అంశాలు ప్రాతిపదికగా ఈ అధ్యయనం నిర్వహించారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదాలతో పలు కంపెనీలు చైనా నుంచి తమ ప్లాంట్లను ఆసియాలోని ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మేకిన్ ఇన్ ఇండియా కాన్సెప్టు క్రమంగా ప్రభావం చూపుతోంది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల విడుదలైన ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ వివిధ అంశాలపై ప్రతీ ఏడు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ ఏడు నిర్వహించిన సర్వేలో ఇండియా సానుకూల ప్రగతిని సాధించినట్టు ఈ సర్వే ప్రకటించింది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో ఇండియా పరిస్థితి మెరుగైంది. ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలమైన దేశాల్లో రెండో స్థానం సాధించింది. ఇంతకు ముందు ఈ స్థానంలో అమెరికా ఉండేది. యూఎస్ఏను వెనక్కి నెట్టి ఇండియా ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియాకు అనుకూలించేనా ? ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల్లో సింహభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇటీవల చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలించే యోచనలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా కంపెనీలకు ఏషియాలో తయారీ హబ్‌గా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదిగేందుకు అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ అంశంలో ఇండియాకు ఇండోనేషియా, తైవాన్, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వ్యయ నియంత్రణలో వెనుకబాటు తయారీ రంగంలో ఇండియా పరిస్థితి మెరుగైనప్పటికీ వ్యయ నియంత్రణలో ఇండియా వెనుకడుగు వేసినట్టు ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకటించింది. గతంలో కాస్ట్ సినారియోలో ఇండియా ద్వితీయ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఇండోనేషియా ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు థాయ్‌లాండ్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చి చేరింది. వ్యయ నియంత్రణలో ఇండియాకు తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక కాస్ట్ విషయంలో కూడా ప్రథమ స్థానంలో చైనానే ఉంది. ఇండియాలో రిస్క్ ఎక్కువ బిజినెస్ రిస్క్‌కు సంబంధించి ఇండియాకు ప్రతికూల ఫలితాలే ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా పాలసీలు, పొలిటికల్ ప్రెషర్లను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించగా ఇండియా టాప్ దేశాల సరసన కాకుండా రిస్క్ ఎక్కువగా ఉన్న మలేషియా, బెల్జియం, ఇండోనేషియా, బల్గేరియా, రోమేనియా, థాయ్‌లాండ్, హంగరీ, కొలంబియా, ఇటలీ, పేరు, వియత్నాంల సరసన నిలిచింది. ఈ విభాగంలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా కెనడా, అమెరికా, ఫిన్లాండ్, చెక్ రిప్లబిక్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మెరుగుపడాల్సిందే తయారీ యూనిట్‌కు కావాల్సిన స్థలం, మానవ వనరులు విషయంలో ఇండియా స్థానం మెరుగైనా పొలిటికల్ ప్రెషర్, పాలసీల విషయంలో వెనుకబడే ఉంది. ఇక కాస్ట్ విషయంలో తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. చదవండి : సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్ -
ఏప్రిల్‌లో స్తంభించిన తయారీ
న్యూఢిల్లీ: తయారీ పరిశ్రమ ఉత్పత్తి ఏప్రిల్‌లో దాదాపు మార్చి స్థాయిలోనే నిలిచింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో 55.5 వద్ద ఉంది. మార్చిలో ఇండెక్స్ 55.4 వద్ద (ఎనిమిది నెలల కనిష్ట స్థాయి) ఉంది. దాదాపు యథాతథ స్థితికి కరోనా వైరెస్ సెకండ్‌వేవ్ సృష్టించిన అనిశ్చితి వాతావరణమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. సూచీ 50లోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఆపై వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. తాజా సమీక్షా నెల్లో కొత్త ఆర్డర్లలో వృద్ధి నమోదుకాలేదు. ముడి పదార్థాల ధరల స్పీడ్... 2014 జూలై తరువాత ఎన్నడూ లేనంత వేగంగా ముడి పదార్థాల ధరలు పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియన్నా డి లిమా పేర్కొన్నారు. కాగా ఏప్రిల్‌లో వరుసగా ఎనిమిదవ నెల ఎగుమతుల ఆర్డర్లు పెరిగినట్లు డి లిమా వెల్లడించారు. భారతీయ వస్తువులకు అంతర్జాతీయ డిమాండ్ దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఇక తయారీ రంగంలో వరుసగా 13వ నెలా ఉపాధి అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. -
భారత్ తయారీకి ‘పీఎల్ఐ’ బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్సహా పదమూడు కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ప్రకటించిన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తయారీ రంగం ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో 520 బిలియన్ డాలర్లకు (డాలర్ మారకంలో రూపాయి విలువ 73గా చూస్తే, దాదాపు 37,96,000 కోట్లు) చేరుతుందన్ని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తయారీ రంగం ఉత్పత్తి దాదాపు 380 బిలియన్ డాలర్లు. దిగుమతులపై ఆధాపడ్డాన్ని తగ్గించడం, ఎగుమతుల పెంపు లక్ష్యంగా మొత్తం 13 రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో రూ.1.97 లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పించడం పీఎల్ఐ పథకంలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. పీఎల్ఐ స్కీమ్‌పై పారిశ్రామిక, అంతర్జాతీయ వాణిజ్య శాఖ (డీపీఐఐటీ), నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని శుక్రవారం చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారీ వృద్ధే ప్రధాన లక్ష్యంగా కేంద్రం తయారీ రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తోంది. వచ్చే ఐదేళ్లకు పీఎల్ఐకి ఈ ఏడాది బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ► ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారుకూడా పీఎల్ఐ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందుతారు. అలాగే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ► మౌలిక వనరులకు సంబంధించి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార పరిస్థితులు మరింత మెరుగుపడ్డానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. పరిశ్రమల రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గడానికి కృషి జరుగుతోంది. ► వివిధ స్థాయిల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహానికి కేంద్రం గడచిన ఆరు, ఏడు సంవత్సరాల్లో పలు విజయవంతమైన చర్యలను తీసుకుంది. ► పలు విభాగాల్లో నియంత్రణా పరమైన క్లిష్టతలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోంది. ► అలాగే విభిన్న రంగాల్లో అత్యాధునిక సాంకేతికను ప్రవేశపెట్టడానికి తగిన చొరవలను, నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. చిరుధాన్యాల సంవత్సరం... మనకు ఒక అవకాశం 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత్ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ ఆమోదముద్ర వేయడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది భారత్ రైతులకు ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు. ఆరోగ్య సంరక్షణలో చిరుధాన్యాల విలువను తెలియజేడానికి ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రారంభించాలని ఆయన పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఈ తరహా ప్రచారం భారత్ రైతులకు ప్రయోజనం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. వృద్ధే బడ్జెట్ లక్ష్యం: వివేక్ దేవ్రాయ్ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వృద్ధే లక్ష్యంగా రూపొందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అలాగే పన్ను రేట్లు స్థిరంగా కొనసాగుతాయని కూడా సంకేతాలు ఇచ్చిందని వివరించారు. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెంపు లక్ష్యంగా సంస్కరణలపై 2021–22 బడ్జెట్ దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ బీఎఫ్ఎస్ఐ అండ్ ఫిన్‌టెక్ సదసు 2021ని ఉద్ధేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత 8 శాతంగా ఉంటుందని అంచనా. ఎగుమతుల పెంపు ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వాస్తవిక వృద్ధిని అందించే రంగాల్లో ఎగుమతులు ఒకటి. అయితే ఎగుమతుల పెరుగుదల ఇంకా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ రంగం ‘నెమ్మది’: చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యం ఇదే సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఫైనాన్షియల్ రంగం తన పూర్తి స్థామర్థ్యం మేరకు పురోగమించడం లేదని అన్నారు. ఒక రకంగా చాలా నెమ్మదిగా నడుస్తోందన్నారు. ఉదాహరణకు ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రపంచంలో 55వ ర్యాంకులో ఉందన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ గుప్తా మాట్లాడుతూ, భారత్‌ను వృద్ధి బాటలో సంఘటితంగా ముందుకు నడిపించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రత్యేకించి లాక్డౌన్ పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీ కీలకపాత్ర మరువలేనిదన్నారు. డిజిటల్ లావాదేవీల పరిమాణం 2020 ఏప్రిల్– 2021 మార్చి 1 మధ్య రూ.4,525 కోట్లకు చేరిందని అన్నారు. -
స్పీడు పెంచనున్న ఆటోరంగం
న్యూఢిల్లీ: గతేడాది కష్టకాలంగా గడిచినప్పటికీ కొత్త ఏడాదిపై ఆటోమొబైల్ కంపెనీలు కాస్త ఆశావహంగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థల సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ .. వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కియా మోటర్స్ ఉత్పత్తి పెంచుకోనుండగా.. టయోటా కొంగొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక హ్యుందాయ్ మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడంపై దృష్టి పెడుతోంది. ‘కొత్త ఏడాదిలో మా తయారీ ప్లాంటులో షిఫ్టులను మూడుకు పెంచుకోనున్నాం. అలాగే కొనుగోలుదారులకు సురక్షితమైన అనుభూతినిచ్చేందుకు ‘ఫిజిటల్’ (ఆఫ్‌లైన్ స్టోర్స్, డిజిటల్) నెట్వర్క్ విధానాన్ని మరింతగా పటిష్టం చేసుకోనున్నాం’ అని కియా మోటర్స్ ఎండీ ఖూఖ్యున్ షిమ్ తెలిపారు. కరోనా పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2020లో రెండు కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది. విద్యుత్ వాహనాలపైనా కసరత్తు .. 2021లో పెరిగే డిమాండ్‌కు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా దశలవారీగా కొంగొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సర్వీస్ విభాగాలు) నవీన్ సోని తెలిపారు. అలాగే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇక వాహనాల లీజింగ్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సోని పేర్కొన్నారు. మరోవైపు, కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత నుంచి అమ్మకాల పరిమాణం క్రమంగా పెరిగిందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ తెలిపారు. విదేశాలకు ఐ20 ప్రీమియం కార్ల ఎగుమతులు: హ్యుందాయ్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి కట్టుబడి తమ సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. మొదటి దఫా ఎగుమతుల్లో భాగంగా 180 ఐ20 మోడళ్లను దక్షిణాఫ్రికా, చిలీ, పెరూ దేశాలకు తరలించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన ఐ20 మోడల్ ధర ఎక్స్ షోరూం వద్ద రూ.6.79 – రూ.11.17 లక్షల మధ్య ఉంది. -
డిసెంబర్లో ‘తయారీ’ మరింత పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మరింత పటిష్టమైంది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్లో 56.4కు ఎగసింది. నవంబర్‌లో ఇది 56.3 వద్ద ఉంది. పీఎంఐ సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. ఆ లోపు నమోదయితే క్షీణతగా భావిస్తారు. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా ఐదవనెల. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, రికవరీ, డిమాండ్ పరిస్థితులు బాగుండడం, ఉత్పత్తి పెంపు ద్వారా నిల్వలు మెరుగుపరచుకోడానికి కంపెనీల యత్నాలు వంటి అంశాలు తయారీ రంగం పురోగతికి కారణమని ఐహెచ్ఎస్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. అయితే ఉపాధి అవకాశాలు డిసెంబర్‌లోనూ మెరుగుపడలేదని ఆయన వివరించారు. ఉపాధి కల్పన క్షీణతలో ఉండడం ఇది వరుసగా తొమ్మిదవసారి. కాగా ముడి సరుకు ధరల పెరుగుదల తీవ్రంగానే ఉందని, డిసెంబర్లో ఇది 26 శాతానికి చేరిందని పోలియానా డీ లిమా తెలిపారు. రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)తో పోల్చితే మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో తయారీ రంగం మెరుగుపడిందని ఆయన పేర్కొంటూ, సూచీ 51.6 నుంచి 57.2కు చేరిందని అన్నారు. వరుసగా 36 నెలలు సూచీ 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చింది. -
పరిశ్రమలు రయ్రయ్..!
న్యూఢిల్లీ: తయారీ, కన్జూమర్ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్‌లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్‌లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదు కాగా.. కరోనా వైరస్‌పరమైన పరిణామాల కారణంగా మార్చి నుంచి ఆగస్టు దాకా ప్రతికూల స్థాయిలోనే కొనసాగింది. సెప్టెంబర్‌లో స్వల్పంగా 0.5 శాతం పెరిగింది. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25న కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల కార్యకలాపాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ 17.5 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక విభాగాలవారీగా చూస్తే అక్టోబర్‌లో.. ► తయారీ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్‌లో ఇది 5.7 శాతం క్షీణించింది. ఐఐపీలో తయారీ రంగానికి 77.6 శాతం వాటా ఉంటుంది. ► కన్జూమర్ గూడ్స్ విభాగం 17.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో ఇది 18.9 శాతం క్షీణించింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది. గత అక్టోబర్‌లో ఇది 3.3 శాతం క్షీణించింది. ► విద్యుదుత్పత్తి మెరుగ్గా 11.2% వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.5% క్షీణించింది. ► పెట్టుబడులకు కొలమానంగా నిల్చే భారీ యంత్రపరికరాల ఉత్పత్తి 3.3 శాతం పెరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో క్షీణత 22.4 శాతం. ► ఇన్ఫ్రా/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం 7.8% వృద్ధి చెందింది. అయితే, ప్రైమరీ గూడ్స్ విభాగంలో 3.3% క్షీణత నమోదైంది. ఇంకా బలహీనంగానే.. ఐఐపీ ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసినప్పటికీ.. అక్టోబర్ డేటా ఊహించిన దానికన్నా బలహీనంగానే కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ‘ఆశాభావంతోనే ఉన్నప్పటికీ ఎకానమీ పటిష్టంగా రికవరీ బాటలో ఉందని విశ్వసించడానికి మరి కొన్ని నెలలు వేచి చూడాల్సి రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే కొద్ది నెలలు వృద్ధి బాటలో ఉండి తర్వాత కుప్పకూలిన ఉదంతాలు ఉన్నాయి‘ అని నాయర్ పేర్కొన్నారు. మరోవైపు, ఐఐపీ గణాంకాలు సానుకూలంగా ఆశ్చర్యపర్చినప్పటికీ.. ఇదే ధోరణి కొనసాగకపోవచ్చని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సంస్థ ఈడీ సుజన్ హజ్రా అభిప్రాయపడ్డారు. భారీ ఉద్దీపన, ప్రభుత్వ వ్యయాలు, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు, నిధుల లభ్యత మెరుగుపడటం, సానుకూల ఐఐపీ.. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గణాంకాలు.. ఎకానమీ సత్వరం కోలుకోవడానికి తోడ్పడ్డాయని మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. పటిష్టమైన రికవరీ సుదీర్ఘకాలం కొనసాగగలదని అంచనా వేశారు. -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
తయారీ రంగానికి ‘రీస్టార్ట్’ కిక్
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌తో దెబ్బ తిన్న రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రీస్టార్ట్ పేరుతో గ్రీన్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి అనుమతించడం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత రాష్ట్ర తయారీ రంగం వృద్ధి బాట పట్టింది. ఆగస్టు నెలలో తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర అర్థగణాంక శాఖ తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ ఇండిస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) గణాంకాల్లో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 353 కర్మాగారాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తయారీ రంగంలో వృద్ధిని అంచనా వేస్తారు. గతేడాది ఆగస్టు నెలలో 120.3 పాయింట్లు ఉన్న తయారీ రంగం ఈ ఏడాది ఆగస్టు నెలలో 121.7 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం. తయారీ రంగంలో లోహాలు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మెషినరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అప్పరెల్స్ వంటి రంగాలు మంచి పనితీరు కనపరచడంతో ఆగస్టు నెలలో వృద్ధి రేటు నమోదైంది. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ రంగంలో 19.7 శాతం, ఇంటర్మీడియేట్ గూడ్స్ 7.0 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 7.1 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 6.8 శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లు ఐఐపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ సగటు కంటే మెరుగైన పనితీరు.. – ఏప్రిల్–ఆగస్టులో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు కనపర్చింది. కోవిడ్ దెబ్బతో ఆ సమయంలో దేశ వ్యాప్తంగా తయారీ రంగంలో 27.9 శాతం క్షీణత నమోదైతే అది మన రాష్ట్రంలో 15.6 శాతానికి పరిమితమైంది. – ఈ సమీక్షా కాలంలో ఆటోమొబైల్ తయారీ రంగంలో గతేడాదితో పోలిస్తే 124.2 శాతం వృద్ధి నమోదైంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ల తయారీలో 71.8 శాతం, ఆహార ఉత్పత్తుల తయారీలో 24.18 శాతం వృద్ధి నమోదైంది. – రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ కింద త్వరతగతిన పరిశ్రమలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా కష్ట సమయంలో రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించడంతో సత్ఫలితాలు వచ్చాయని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తిరిగి వృద్ధి బాట పట్టగలమన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా స్పందించాం.. దేశంలోనే తొలిసారిగా ‘రీస్టార్ట్’ ప్యాకేజీ కింద ఏప్రిల్ మూడో వారం నుంచే కొవిడ్ ఆంక్షలను పాటిస్తూ పరిశ్రమలను ప్రారంభించాం. దాంతో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర తయారీ రంగం వేగంగా కోలుకుంది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకున్నాం. గత ప్రభుత్వ రాయితీ బకాయిలను కోవిడ్ సమయంలో ఇవ్వడంతో పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి ప్రారంభించగలిగాయి. దీనివల్ల ఈ ఏడాది పారిశ్రామికోత్పత్తిలో దేశ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు అవుతుందని అంచనా వేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి నాలుగు అంశాలు కలిసొచ్చాయి సంక్షోభ సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నగదు అందజేయడంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. పరిశ్రమల ప్రారంభానికి పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి సమస్యలను పరిష్కరించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిపుణులను అందిస్తోంది. ఈ నాలుగు అంశాలకు తోడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు బాగుండటం కలిసి వచ్చింది. – డి.రామకృష్ణ, సీఐఐ (ఏపీ చాప్టపర్) చైర్మన్ -
‘తయారీ’ బూస్ట్ 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి తెరతీసింది. దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్ అమలుకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి. కాగా, సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్‌ను విస్తరించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ స్కీమ్ అమలవుతోంది. దేశీ తయారీకి దన్ను... ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన వెల్లడించింది. ‘భారతీయ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ఈ ఐదేళ్ల పీఎల్ఐ స్కీమ్‌ను రూపొందించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తాయి. విడివిడిగా ఆయా రంగాలకు సంబంధించిన తుది ప్రతిపాదనలను వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ) మదింపు చేసిన తర్వాత, కేబినెట్ ఆమోదిస్తుంది. షిప్పింగ్ శాఖ పేరు మార్పు... కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్వావలంబన భారత్’ సాకారం: నిర్మలా సీతారామన్ పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తయారీ రంగానికి ఇది అద్భుతమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు. తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత్) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘రెండు స్కీమ్‌లకు సంబంధించి కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఇది కచ్చితంగా సరైన దన్నును అందిస్తుంది. ఎందుకంటే మేము స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగంగా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని సీతారామన్ వివరించారు. దీనిద్వారా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థకు భారత్‌ను అనుసంధానం చేస్తుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచ తయారీ గమ్యస్థానంగా మార్చేందుకు ఈ ప్రోత్సాహకాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. సమయానుకూల నిర్ణయం: కార్పొరేట్ ఇండియా పీఎల్ఐ స్కీమ్‌ను మరో 10 కీలక రంగాలకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల భారత పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు ప్రశంసలు కురిపింటటచారు. ఎవరేమన్నారంటే... కొత్త పీఎల్ఐ పాలసీ సమయానుకూలమైనది అలాగే తయారీ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తుంది. తద్వారా ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు దోహదం చేస్తుంది. – ఉదయ్ కోటక్, సీఐఐ ప్రెసిడెంట్ తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించిన ఈ ఫ్లాగ్షిప్ పథకానికి సుమారు రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఆర్థిక కార్యకలాపాలపై ఇది భారీ ప్రభావాన్నే చూపుతుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, తదితర విభిన్న రంగాల వ్యాప్తంగా గణనీయంగా ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ పీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి మరిన్ని రంగాలను తీసుకురావడం వల్ల తయారీ రంగానికి భారీ బూస్ట్ లభించనుంది. ఈ చర్యలు వ్యూహాత్మకం అలాగే సాంకేతికతతో ముడిపడినవి, దీనివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన కూడా జోరందుకుంటుంది. దేశీ మార్కెట్ కోణంలోనే కాకుండా ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులకు భారత్‌ను ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు భారీ అవకాశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ అందిస్తుంది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
పరిశ్రమలు పతనబాటే..!
న్యూఢిల్లీ: కఠిన లాక్డౌన్ ప్రభావం ఆగస్టులోనూ కొనసాగిందని సోమవారం విడుదలైన అధికారిక పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడించాయి. సమీక్షా నెలలో 8 శాతం క్షీణత (2019 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. అయితే కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న తాజా గణాంకాలను మహమ్మారి వ్యాప్తి ముందు నెలలతో పోల్చి చూడడం తగదని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వరకూ వెయిటేజ్ ఉన్న తయారీసహా విద్యుత్, మైనింగ్ రంగాలు ఆగస్టులో తీవ్ర నిరాశపరిచాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ రంగంలో 8.6 శాతం క్షీణరేటు నమోదయ్యింది. ► మైనింగ్ రంగంలో ఉత్పత్తి 9.8 శాతం క్షీణించింది. ► విద్యుత్ విషయంలో క్షీణ రేటు 1.8 శాతంగా ఉంది. ► భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, పెట్టుబడులు, డిమాండ్‌కు సంకేతం అయిన క్యాపిటల్ గూడ్స్ కూడా 15.4 శాతం క్షీణతలో ఉంది. ► ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలుసహా కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోని ఉత్పత్తుల్లో క్షీణ రేటు 10.3 శాతంగా ఉంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఉత్పత్తి సైతం 3.3 శాతం క్షీణతలోనే ఉంది. క్షీణత తగ్గుతూ రావడమే ఊరట... కరోనా కట్టడి లక్ష్యంగా మార్చి 25వ తేదీ నుంచీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా 57.3 శాతం క్షీణించింది. మేలో ఈ రేటు మైనస్ 33.4 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు మైనస్ 15.8 శాతానికి తగ్గింది. జూలైలో మైనస్ 10.8 శాతానికి దిగివచ్చింది. తాజా సమీక్షా నెల ఆగస్టులో– క్షీణ రేటు మరింత తగ్గి 8 శాతానికి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి బాటలోకి వచ్చే అవకాశం కూడా ఉందన్న అంచనాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అవుట్‌పుట్ సెప్టెంబర్‌లో క్షీణ బాట నుంచి 54.6కు చేరి వృద్ధి బాటలోకి రావడం ఇక్కడ గమనార్హం. అలాగే సెప్టెంబర్‌లో ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 56.8కి ఎగసింది. లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తుండడంతో పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్డౌన్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఆగస్టులోనూ క్షీణతే... నిజానికి వాణిజ్య యుద్ధం ప్రభావంతో 2019 ఆగస్టులో సైతం పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా (2018 ఆగస్టులో పోల్చి) 1.4 శాతం క్షీణతలోనే ఉంది. దెబ్బమీద దెబ్బలాగా కరోనా తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి పరిమాణం కనీసం 2018 ఆగస్టునాటి స్థాయికన్నా దిగువకు ప్రస్తుతం పడిపోవడం తీవ్ర ప్రతికూలతకు అద్దంపడుతోంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య 25 శాతం క్షీణత ఏప్రిల్–ఆగస్టు మధ్య పారిశ్రామిక ఉత్పత్తి భారీగా 25% క్షీణించింది. 2019 ఇదే కాలంలో వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. -
చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!
సాక్షి, న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ తెలిపింది. దేశీయంగా అమ్ముడయ్యే వివిధ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో 95 శాతం దేశీయంగానే తయారైనవే ఉంటున్నా.. 25–70 శాతం విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. కరోనా వైరస్ పరిణామాలతో చైనా నుంచి సరఫరా దెబ్బతినడంతో అప్పట్నుంచే విడిభాగాల దిగుమతి కోసం దేశీ సంస్థలు ఇతర మార్కెట్లను పరిశీలించడం ప్రారంభించాయని తెలిపింది. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడానికి ముందునుంచే కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. థాయ్‌లాండ్, వియత్నాం, కొరియా తదితర దేశాలను పరిశీలించాయని వివరించారు. ఎయిర్కండీషనర్లకు సంబంధించిన విడిభాగాలను అత్యధికంగా, వాషింగ్ మెషీన్ల విడిభాగాలను అత్యంత తక్కువగా దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి.. ‘పరికరాల కోసం సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దాకా చైనాపై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇందుకు సమయం పడుతుంది. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి‘ అని కమల్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వీటిని అభివృద్ధి చేసుకునేందుకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం కూడా దశలవారీ తయారీ పథకం (పీఎంపీ) వంటి స్కీములతో తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని కమల్ చెప్పారు. దీనిపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చైనాయేతర సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ .. బాయ్‌కాట్ చైనా ఉద్యమంతో చైనాయేతర కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్ కమ్యూనికేషన్స్) అద్వైత్ వైద్య తెలిపారు. ‘గడిచిన కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ధరల శ్రేణిలో కొత్తగా ఆరు హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. అలాగే భారత్‌లో మా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నాం. మా మేకిన్ ఇండియా ఉత్పత్తుల గురించి భారీ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం‘ అని ఆయన వివరించారు. ఇక వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ తాము చైనా నుంచి కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు తెలిపింది. ‘డోక్లాం ఉదంతం జరిగినప్పట్నుంచీ గడిచిన కొన్నాళ్లుగా మేం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం‘ అని సంస్థ ఎండీ చంద్రు కల్రో పేర్కొన్నారు. చైనా నుంచి ఫినిష్డ్ గూడ్స్ కొనుగోళ్లు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, దేశీయంగానే విడిభాగాల వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్ అవసరాల కోసం టీటీకే ప్రెస్టీజ్ దిగుమతి చేసుకునే వాటిల్లో చైనా వాటా సుమారు 10 శాతం ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతులను 5 శాతానికన్నా తక్కువకే పరిమితం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రు చెప్పారు. -
15% కార్పొరేట్ పన్ను గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన గడువు పొడిగింపును పరిశీలించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి.. అదే విధంగా 2019 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంది. ‘‘మేము ఏం చేయగలమన్నది చూస్తాం. నూతన పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్ పన్ను నుంచి పరిశ్రమ ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. దీంతో 2023 మార్చి 31 వరకు ఇచ్చిన గడువును పొడిగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటాము’’ అని సీతారామన్ ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. దేశీయ పరిశ్రమలకు, ఆర్థిక రంగ ఉద్దీపనానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కోవిడ్–19 అత్యవసర రుణ సదుపాయం కేవలం ఎంఎస్ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకు అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లిక్విడిటీ సమస్య లేదు: వ్యవస్థలో లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉందని, ఇందుకు సం బంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని సీతారామన్ చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకూ బకాయిలు తీర్చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దేనని స్పష్టం చేశారు. -
‘‘వైరస్ ప్రభావాన్ని ముందే ఊహించా’’
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చమురు మార్కెట్ బ్లాక్ స్వాన్ లాంటి ప్రమాదాన్ని ఎదుర్కొబోతుందని ఫ్రెంచ్ చమురు వ్యాపారి పియరీ అండురాండ్ గతంలో హెచ్చరించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధాలు, అనూహ్య ఉగ్రవాద సంఘటనలను సాధారణంగా బ్లాక్ స్వాన్‌తో పోలుస్తారు. కరోనా కారణంగా చమురుకు డిమాండ్ లేనప్పుడు ధరలు సాధారణంగా తగ్గుతాయని అన్నారు. అయితే దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారమవుతుందని.. కానీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆండురాండ్ క్యాపిటల్ అనే చమురు సంస్థను పియరీ అండురాండ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చమురు డిమాండ్, సప్లయ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడు చమురు ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు. కోవిడ్ విశ్వరూపం చూపకముందే వైరస్ వ్యాప్తిని ప్రపంచ దేశాలు అరికట్టలేవని తానే ముందే గ్రహించినట్లు పేర్కొన్నారు. చమురు మార్కెట్ లాభాల భాట పట్టాలంటే దేశాలు విదిస్తున్న లాక్డౌన్లను ఎత్తేయాలని తెలిపారు. ముఖ్యంగా రవాణా, తయారీ రంగం వేగంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తేనే చమురుకు డిమాండ్ పెరిగి మార్కెట్లో జోష్ నెలకొంటుందని పియరీ అండురాండ్ అభిప్రాయపడ్డారు. -
పన్నులు తగ్గించినా ఫలితం లేదు!
సాక్షి, న్యూఢిల్లీ : 1991లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కన్నా 2019, సెప్టెంబర్‌నాటికి భారత్ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. అదే త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 2013 సంవత్సరం నాటికన్నా తక్కువగా 4.5 శాతానికి పడి పోయింది. విదేశీ పెట్టుబడులు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దేశం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. ఉత్పాదన రంగం క్షీణించింది. బ్యాంకులు పతనావస్థకు చేరుకున్నాయి. ఆ దశలో ఎలాగైనా దేశానికి విదేశీ పెట్టుబడులు తీసుకరావాలన్న ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ 2019, సెప్టెంబర్ నెల చివర్లో రెండు పర్యాయాలు అమెరికా ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలతో చర్చలు జరిపారు. మోదీ హూస్టన్ సమావేశానికి సరిగ్గా 40 గంటల ముందు దేశంలో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి, కొత్త ఉత్పాదక కంపెనీలకు విధిస్తున్న 25 శాతం పన్నును 15 శాతానికి భారత ప్రభుత్వం తగ్గించింది. అమెరికా నుంచి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసమే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం భారత్ ఖజానాకు 1.5 లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 2019–20 ఆర్థిక వార్శిక సర్వే ప్రకారం దేశానికి 2019 సంవత్సరానికి దేశానికి మొత్తం 49 బిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. చదవండి: కోవిడ్: ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం వాటిలో కార్పొరేట్ పన్నును తగ్గించక ముందే 26.1 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 23 బిలయన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే పన్నులు తగ్గించాక వచ్చాయి. వాటిలో ఎక్కువగా అంటే, 17,58 బిలియన్ డాలర్లు సర్వీస్ సెక్టార్‌కే వచ్చాయి. ప్రధానంగా ఉత్పాదన రంగాన్ని ఆకర్షించడం కోసం పన్నులు తగ్గిస్తే ఆ రంగానికి మాత్రం ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా మించలేదు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజంభించడంతో కొత్తగా విదేశీ పెట్టుబడలు వచ్చే ఆస్కారం కూడా లేక పోయింది. అప్పటికే దేశంలో కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థ కరోన లాక్‌డౌన్‌తో మరింత దిగజారిపోయింది. పన్నులు తగ్గించడం తొందరపాటు చర్యగా మిగిలిపోయింది. చదవండి: భారీ జంప్ : బంగారం మరి కొనలేం.. -
ఏప్రిల్‌లో తయారీ రంగం కుదేలు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఏప్రిల్‌లో దారుణ పతనాన్ని చవిచూసింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో ఏకంగా 27.4కు పడిపోయింది. అసలు ఈ గణాంకాలు ప్రారంభమైన 15 సంవత్సరాల్లో ఇంతవరకూ ఎప్పుడూ ఇంత తీవ్ర పతనాన్ని తయారీ రంగం ఎదుర్కొనలేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ సూచీ 50 పాయింట్ల పైనుంటే దానిని వృద్ధి ధోరణిగా భావిస్తారు. ఆ దిగువనకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. గడచిన 32 నెలల్లో ఎప్పుడూ క్షీణతలోకి సూచీ జారలేదు. మార్చిలోసైతం 51.8గా నమోదయ్యింది. కాగా కోవిడ్–19 సంక్షోభం ఒక కొలిక్కి రావడంతోటే దేశంలో డిమాండ్ తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిస్ట్ ఇలియోట్ ఖేర్ వ్యక్తం చేశారు. -
మద్యం బదులు శానిటైజర్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రైవేటు సంస్థలు ముం దుకొచ్చాయి. ఇన్నాళ్లు ప్రజలకు కిక్కిచ్చే మద్యాన్ని తయారు చేసిన డిస్టిలరీలు ఇప్పుడు కరోనా ముప్పు దరి చేరకుండా ‘సామాజిక బాధ్యత’ను పాటిస్తున్నాయి. మద్యం బదులు శానిటైజర్లను తయా రు చేసి ప్రభుత్వానికి చేయూత అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వీటి లభ్యత అంతంతగానే ఉంది. ఈ కొరతను అధిగమిం చేందుకు ప్రభుత్వం డిస్టిలరీలను శానిటైజర్ల ఉత్పత్తుల తయారీకి మళ్లించింది. హ్యాండ్ వాష్ శానిటైజర్ల తయారీకి డిస్టిలరీల సేవల ను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌తో ప్ర స్తుతం మద్యం ఉత్పత్తులను నిలిపివేసినందున.. దీని స్థానంలో శానిటైజర్లను తయారు చేసేలా చూడాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) కింద శానిటైజర్లను తయారు చేయాలని డిస్టిలరీల యాజమాన్యాలను కోరింది. సానుకూలంగా స్పందించిన మద్యం తయారీ సంస్థలు ఇప్పటివరకు 40 వేల లీటర్ల మేర రాష్ట్ర వైద్య సదుపాయాల కల్పనాభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ)కు సరఫరా చేసింది. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తోంది. కరోనా నివారణ దళానికే ప్రాధాన్యం.. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని 18 డిస్టిలరీలు శానిటైజర్లను త యారు చేసి టీఎస్ఎంఐడీసీకి అందజేశాయి. అక్కడి నుంచి ప్రభు త్వ ఆస్పత్రులు, కార్యాలయాలు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు పంపిణీ చేసినట్లు సంగారెడ్డిలోని ఓ డిస్టిలరీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. మొదటి దశలో ఇచ్చిన ఇండెంట్ మేరకు సరఫరా చేశామని, ప్రభుత్వం ఆదేశిస్తే అధిక సామర్థ్యంలోనూ శానిటైజర్లను తయారీ చేసి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శానిటైజర్ తయారీ ఇలా.. పది లీటర్ల శానిటైజర్ తయారీలో.. 8,333 మిల్లీ లీటర్ల ఇథనాల్, 417 మి.లీటర్ల హైడ్రోజెన్ పెరాక్సైడ్, 145 మి.లీటర్ల గ్లిజరాల్, 1,105 మి.లీటర్ల డిస్టిల్ వాటర్‌ను వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శానిటైజర్లో మిశ్రమాలను కలుపుతున్నారు. -
మార్చిలో తయారీకి కరోనా దెబ్బ: పీఎంఐ డౌన్
న్యూఢిల్లీ: తయారీ రంగంపై కోవిడ్–19 ప్రభావం మార్చిలో తీవ్రంగా కనబడిందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) స్పష్టం చేసింది. తయారీ పీఎంఐ ఏకంగా 51.8కి పడిపోయింది. ఫిబ్రవరిలో సూచీ 54.5గా ఉంది. బిజినెస్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం. నిజానికి పీఎంఐ 50 పాయింట్లపైన ఉంటే అది వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం, గడచిన 32 నెలల నుంచీ తయారీ రంగం 50 పాయింట్లపైనే కొనసాగుతోంది. ఎన్సీడీల ద్వారా 25 వేల కోట్ల సమీకరణ: ఆర్ఐఎల్ న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) రూపంలో రూ.25,000 కోట్లు సమీకరించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రకటించింది. పలు విడతలుగా ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో ఎన్సీడీల జారీ ద్వారా రూ.25వేల కోట్ల వరకు నిధులు సమీకరించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. -
కోవిడ్-19 సమస్యపై ఆర్థిక శాఖ కీలక సమీక్ష
న్యూఢిల్లీ: చైనాలో వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావాలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 వ్యాప్తి వల్ల తమారీ, పంపిణీ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పరిష్కార మార్గాలను ప్రకటిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా తయారీ రంగం, ఔషధాల ముడి సరుకు నిల్వలపై దేశీయ ఫార్మ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్న వార్తలను ఆమె ఖండించారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ముడి పదార్ధాల సరఫరాపై ఫార్మా, సౌర , రసాయన పరిశ్రమల ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారని, అయితే ముడి పదార్థాల కొరత గురించి తక్షణ ఆందోళనలను తొలగించడంతో పాటు, ధరలను నియత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ చర్యలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని ఆమె చెప్పారు. దేశీయ తమారీ రంగం పుంజుకోవడానికి నీతి అయోగ్, ఫార్మాకు చెందిన ప్రముఖులు త్వరలోనే పరిష్కార మార్గాలను సూచించనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
పరిశ్రమలు.. కకావికలం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ► విద్యుత్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ► ఐదు నెలల్లోనూ డౌన్: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. రెండవ త్రైమాసికంపై నీలినీడలు... ‘ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్లో వృద్ధి మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త అదితి నయ్యర్ పేర్కొన్నారు. -
మార్కెట్లకు ‘కార్పొరేట్’ బూస్టర్!
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’. –ప్రధాని మోదీ సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్ మార్కెట్లో ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్లకు నిర్మలా సీతారామన్ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అస్త్రానికి బేర్లు బేర్మన్నారు. సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది. దీపావళి బొనంజా.... కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను నిర్మలా సీతారామన్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్ రిచ్ ట్యాక్స్ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు. తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు అప్ మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్ మార్కెట్లో జోష్ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్ రిచ్ సెస్ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం. నిఫ్టీ కంపెనీల నికర లాభం 12 శాతం పెరుగుతుంది దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది. ఉదయం 9 సెన్సెక్స్ ఆరంభం 36,215 ఉదయం 10.40 ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ కోత 36,226 ఉదయం 11.31 37,701 మధ్యాహ్నం 2 గంటలు 38,378 3.30 ముగింపు 38,015 -
సింగిల్ ‘బ్రాండ్’ బాజా..!
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఇప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలను కేంద్రం సడలించడంతో భారత్‌లో సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ దిగ్గజ సంస్థల ప్రణాళికలకు ఊతం లభించినట్లయింది. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు సంస్థలు భారత్‌లో సింగిల్ బ్రాండ్ విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశీ సంస్థల భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జారా, హెచ్అండ్ఎం, గ్యాప్ వంటి సంస్థలు కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు కూడా నిబంధనల సడలింపుతో మార్గం సుగమమైంది. ఒకే బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే పలు సింగిల్ బ్రాండ్ విదేశీ సంస్థలు.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ సొంతంగా కార్యకలాపాలు సాగించాలంటే కచ్చితంగా ముందు ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయాలన్న నిబంధన వాటికి అడ్డంకిగా ఉంటోంది. స్టోర్ ఏర్పాటు వ్యయాలు భారీగా ఉంటున్న నేపథ్యంలో అసలు తమ ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలియకుండా ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సరికాదనే ఉద్దేశంతో అవి వెనుకడుగు వేస్తూ వస్తున్నాయి. ఒకవేళ ముందుకొచ్చినా.. స్థానికంగా ఏదో ఒక సంస్థతో టైఅప్ పెట్టుకోవడం తప్పనిసరవుతోంది. దీంతో పాటు 30 శాతం కొనుగోళ్లు స్థానికంగా జరపాలన్న మరో నిబంధన కూడా విదేశీ సంస్థలకు అడ్డంకిగా ఉంటోంది. ఫలితంగా.. అవి స్థానికంగా ఇతర సంస్థలతో జట్టు కట్టి కార్యకలాపాలు సాగించాల్సి వస్తోంది. తాజాగా తప్పనిసరి ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు, సోర్సింగ్ నిబంధనలను సడలించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. పలు ప్రయోజనాలు.. నిబంధనల సడలింపుతో సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు ముందుగా ఆన్లైన్లో విక్రయాలు జరపవచ్చు. అయితే, రెండేళ్ల వ్యవధిలో ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక సోర్సింగ్ విషయానికొస్తే సింగిల్ బ్రాండ్ రిటైలర్లు తొలి అయిదేళ్లలో సగటున 30% స్థానికంగా కొనుగోళ్లు చేస్తే చాలు. ఆ తర్వాత నుంచి ఏటా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇందులోనూ రిటైలర్లకు ఇంకొంత వెసులుబాటు లభించనుంది. సదరు బ్రాండ్‌ను విక్రయించే కంపెనీ లేదా ఆ గ్రూప్ కంపెనీలు లేదా థర్డ్ పార్టీ వెండార్లయినా సరే స్థానికంగా జరిపే కొనుగోళ్లు సోర్సింగ్ నిబంధన పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు యాపిల్‌కు వెండార్.. ఫాక్స్‌కాన్ గానీ స్థానికంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే.. అది సోర్సిం గ్పరంగా యాపిల్‌కు కూడా దఖలుపడుతుంది. వాస్తవానికి చిన్న, మధ్య తరహా దేశీ సంస్థలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఈ 30 శాతం నిబంధన పెట్టారు. విదేశీ సింగిల్ బ్రాండ్ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ఈ సోర్సింగ్ నిబంధన కూడా ఒక కారణమే. స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ దిగ్గజం ఐకియా వంటి సంస్థలు భారత్‌లో చాన్నాళ్లుగా వివిధ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ స్టోర్ పెట్టాలంటే కచ్చితంగా 30 శాతం ఇక్కడివే కొనాలన్న నిబంధన కారణంగా చాలా కాలం ముందుకు రాలేదు. తాజాగా నిబంధనల మార్పుతో విదేశీ రిటైలర్లకు మరింత వెసులుబాటు లభించనుంది. ఉపాధికి ఊతం.. నిబంధనలను సడలించడం ఉభయతారకంగా ఉంటుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఆయా సంస్థలు స్వయంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఊతం లభిస్తుందని, ఆన్లైన్లో విక్రయాలు జరిపినా ఉపాధి కల్పనకు తోడ్పాటు లభించగలదని భావిస్తోంది. లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరగగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు.. 2013లో అమెజాన్ భారత మార్కెట్లోకి వచ్చినప్పట్నుంచి 2,00,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరిగిందని అంచనా. అమెజాన్ సుమారు 5,00,000 మంది విక్రేతలతో కలిసి పనిచేస్తోంది. అమ్మకాలు పెరిగే కొద్దీ ఆయా విక్రేతలు మరింత మంది సిబ్బందిని తీసుకుంటూ ఉండటం వల్ల ఆ రకంగా కూడా ఉపాధికి ఊతం లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘స్మార్ట్‌ఫోన్స్’ విస్తరణ.. నిబంధనల సడలింపుతో ఎగుమతులకు కూడా ఉపయోగపడేలా భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ‘ఆఫ్‌లైన్ స్టోర్స్ విస్తరణకు కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ఇప్పటికే మా స్థానిక భాగస్వాములతో అన్ని ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తాజా పరిణామంతో భారత తయారీ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు రాగలవని మరో స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటెజీ విభాగం) నిపుణ్ మార్యా చెప్పారు. యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి దిగ్గజ బ్రాండ్ల సొంత స్టోర్స్ ఏర్పాటుతో దేశీ మొబైల్ హ్యాండ్సెట్ రిటైలింగ్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదగగలదని పరిశ్రమ సమాఖ్య ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అభిప్రాయపడింది. సన్నాహాల్లో యాపిల్.. 3 నెలల్లో ఆన్లైన్ విక్రయాలు ఏడాదిన్నరలో తొలి ఆఫ్‌లైన్ స్టోర్ సింగిల్ బ్రాండ్ రిటైల్ నిబంధనల సడలింపుతో టెక్ దిగ్గజం యాపిల్ తమ తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించే సన్నాహాల్లో పడింది. వచ్చే 3–5 నెలల్లో ఇది సిద్ధం కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఆన్లైన్ స్టోర్స్ తరహాలోనే ఇది కూడా ఉండనుందని పేర్కొన్నాయి. ఇక వచ్చే 12–18 నెలల్లో ఆఫ్‌లైన్ స్టోర్ సైతం ప్రారంభించాలని యాపిల్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ భాగస్వామ్యంతో యాపిల్ ఆన్లైన్లో భారత్‌లో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో ఐఫోన్ అమ్మకాల్లో 35–40 శాతం వాటా ఈ–కామర్స్‌దే ఉంటోంది. ఐప్యాడ్ ట్యాబ్లెట్స్, మాక్‌బుక్ ల్యాప్టాప్స్ అమ్మకాలు కూడా ఆన్లైన్లో భారీగానే ఉంటున్నాయి. దేశీయంగా మొత్తం ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్లైన్ అమ్మకాల వాటా 25 శాతం పైగా ఉంటోంది. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యాపిల్ భావిస్తోంది. ‘భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు అందిస్తున్న సేవలను భారతీయ కస్టమర్లకు కూడా అందిస్తాం. త్వరలోనే మిగతా ప్రణాళికలను వెల్లడిస్తాం‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాపిల్‌కు 25 దేశాల్లో స్టోర్స్ ఉన్నాయి. -
తయారీ, మైనింగ్ పేలవం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► మైనింగ్, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. ► దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్ వచ్చే సరికి భారీగా జారిపోయింది. ► తయారీ: 2018 జూన్‌లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్‌లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. ► మైనింగ్: మైనింగ్‌లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –5.5 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్ మూ వింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికమూ మందగమనమే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. -
వృద్ధి పరుగే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు. రైతులందరికీ ఆదాయం... కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు. నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. బ్యాంకు మోసాలు తగ్గాయి బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు. -
పుంజుకున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న దాఖలాలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారీ రంగం గత నెల మళ్లీ కాస్త పుంజుకుంది. ఏప్రిల్‌లో 51.8 పాయింట్లుగా ఉన్న నికాయ్ ఇండియా తయారీ రంగ సూచీ (పీఎంఐ) మే నెలలో 52.7 పాయింట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. పీఎంఐ 50 పాయింట్ల పైన కొనసాగడం ఇది వరుసగా 22వ నెల కావడం గమనార్హం. పీఎంఐ 50కి పైన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. ‘కొత్త ఆర్డర్ల రావడం మొదలు కావడంతో, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాయి. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది‘ అని పీఎంఐ సూచీ నిర్వహించే ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు వస్తుండటం, ఉత్పత్తి పెంపుపై కంపెనీలు ఆశావహంగా ఉండటం వంటి అంశాలతో తయారీ రంగంలో మరింత మందికి ఉపాధి కల్పన జరిగినట్లు వివరించారు. ధీమాగా కంపెనీలు ఏప్రిల్ నుంచి సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ ఉత్పత్తి పెంపుపై దేశీ తయారీ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ వ్యూహాలు, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, సానుకూల ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలు ఈ ఆశావహ దృక్పధానికి కారణమని నివేదికలో వెల్లడైంది. ద్రవ్యోల్బణ కోణంలో చూస్తే ధరలపరమైన ఒత్తిళ్లు పెద్దగా పెరగలేదని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల స్వల్పంగానే ఉండటం వల్ల కంపెనీలు రేట్లను పెద్దగా మార్చలేదని లిమా తెలిపారు. -
తయారీరంగంలో ఇది మన మార్కు!
సాక్షి, హైదరాబాద్: మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన శరవేగంగా సాగుతోంది. వైద్య ఉపకరణాల తయారీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలకు భూకేటాయింపులు కూడా జరిగాయి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. పార్కు నిర్మాణానికి వీలుగా సుల్తాన్పూర్ పరిధిలోని 174, 70 సర్వే నంబర్ల పరిధిలో 557.32 ఎకరాలను కేటాయించింది. ఔటర్‌రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను టీఎస్ఐఐసీ చేపట్టింది. 2017 జూన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్కును రెండు దశల్లో ఏ, బీ బ్లాకులుగా అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి పార్కు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు పార్కులో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.35 కోట్ల మేర ఖర్చు చేసింది. రూ.20 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొండలను పిండి చేసి.. పార్కు ఆవరణలో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తుండటంతో 272 ఎకరాల్లో మెడికల్ డివైజెస్, 226 ఎకరాల్లో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేలా డీపీఆర్‌లో అధికారులు మార్పులు చేశారు. మరో 47 ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’కు కేటాయించారు. వంద, 60 అడుగుల వెడల్పుతో 5.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, హై టెన్షన్ విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ట్రాన్స్‌కో విభాగం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. నీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయిం చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఐఐసీ ప్రతి పాదనలు సమర్పించింది. పార్కుకు కేటాయించిన ప్రాంతంలో 150 ఎకరాలు మాత్రమే చదునుగా ఉండగా, మిగతా భూమి కొండలు, గుట్టలతో నిండి ఉంది. దీంతో కొండలను పిండి చేయాల్సి రావ డంతో ఖర్చు కూడా పెరుగుతున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. రెండంకెల వృద్ధి రేటు లక్ష్యంగా... దేశంలో వైద్య ఉపకరణాల తయారీ రంగం శైశవదశలో ఉన్న నేపథ్యంలో బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. దేశంలో మూడు బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు జరుగుతుండగా రెండంకెల వృద్ధి రేటుతో 2023 నాటికి 11 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో స్థానికంగా వైద్య ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2015–2020’లో భాగంగా మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇప్పటివరకు మెడికల్ డివైజెస్ పార్కులో 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా రూ.3,631.97 కోట్ల పెట్టుబడులతోపాటు 1,588 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2019 చివరిలోగా భూ కేటాయింపు పొందిన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించే భఃవిధంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. క్రషర్ల తొలగింపునకు నోటీసులు మెడికల్ డివైజెస్ పార్కుకు కేటాయించిన సర్వే నంబరు 174లో గతంలో నాలుగు మైనింగ్ కంపెనీలకు క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం పార్కులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నా, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఖాళీ చేసేందుకు క్రషర్ల యజమానులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రెండు యూనిట్లను మూసివేయించిన టీఎస్ఐఐసీ.. మరో రెండు యూనిట్ల మూసివేతకు కూడా నోటీసులు జారీ చేసింది. -
జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) అంచనా వేసింది. అంతకుముందు ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. వ్యవసాయం, ఉత్పాదక రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచడంతో వృద్ధి రేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తొలి ముందస్తు అంచనాలు వెల్లడిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్టు సీఎస్ఓ వెల్లడించింది. వ్యవసాయం, అటవీ సంబంధిత, మత్స్య కార్యకలాపాలు గత ఏడాది 3.4 శాతం ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి పెరగనున్నాయని పేర్కొంది. ఇక 2017-18లో 5.7 శాతంగా నమోదైన తయారీ రంగం 8.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కాగా 2015-16లో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధిస్తే,2016-17లో 7.1 శాతం వృద్ధి సాధించింది. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతానికి తగ్గింది. -
చైనాలో అరబిందో తయారీ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ అయిన నెదర్లాండ్స్‌లోని హెలిక్స్ హెల్త్‌కేర్, చైనాకు చెందిన షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా జాయింట్ వెంచర్ సంస్థను పెట్టి... దీనిద్వారా చైనాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒప్పందం ప్రకారం జేవీ కంపెనీలో హెలిక్స్‌కు 30 శాతం వాటా ఉంటుంది. జేవీ ద్వారా ఇరు సంస్థలూ నెబ్యులైజర్ ఇన్‌హేలర్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తాయి. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్‌లోకి సైతం ప్రవేశిస్తాయి. ఈ ఉత్పత్తులను చైనాతోపాటు యూఎస్, యూరప్ మార్కెట్లలో విక్రయిస్తారు. జేవీ వర్కింగ్ క్యాపిటల్‌తో కలిపి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.360 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడిలో 30 శాతాన్ని హెలిక్స్, మిగిలిన మొత్తాన్ని లువోక్సిన్ దశలవారీగా పెడతాయి. 2021లో తయారీ ప్రారంభం అవుతుంది. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో అరబిందో షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.44 శాతం అధికమై రూ.736.35 వద్ద స్థిరపడింది. -
నవంబర్‌లో తయారీరంగం మెరుపులు
న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి ఎన్నడూ లేదని నికాయ్ ఇండియా పేర్కొంది. నిజానికి ఈ ఇండెక్స్ 50 పైన ఉంటే, వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రకారం– గడచిన 16 నెలల కాలంలో తయారీ పీఎంఐ 50 పైనే ఉంది. తాజా పరిస్థితి చూస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశావహ పరిస్థితులూ ఏర్పడుతున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, నివేదిక రూపకర్త పోల్యానా డీ లీమా పేర్కొన్నారు. వచ్చే 12 నెలల్లో కూడా తయారీ రంగానికి మంచి మార్కెట్ పరిస్థితులే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. -
ఆగస్టులో నిదానించిన తయారీ
న్యూఢిల్లీ: దేశ తయారీ రంగ వృద్ధి ఆగస్టు మాసంలో నిదానించింది. తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 51.7కు తగ్గింది. ఇది జూలై నెలలో 52.3గా ఉంది. అయినప్పటికీ 50 పాయింట్ల మార్క్‌పైన తయారీ రంగ వృద్ధి నమోదవడం వరుసగా 13వ నెల. 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధి విస్తరణ దశలో ఉన్నట్టు, ఆ లోపు ఉంటే తగ్గిపోతున్నట్టు పరిగణిస్తారు. ‘‘భారత తయారీ రంగ వృద్ధి జోరు కొంత తగ్గినట్టు ఆగస్టు నెల గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఉత్పత్తి, నూతన ఆర్డర్ల రాకలో వృద్ధి నిదానంగా ఉండటాన్ని సూచిస్తోంది’’ అని ఈ నివేదికను రూపొందించిన ఐహెచ్ఎస్ మార్కెట్ ఆర్థికవేత్త ఆష్నాదోధియా అన్నారు. మెరుగుపడిన దేశీ డిమాండ్ ... దేశీయ డిమాండ్ పరిస్థితులు ముందటి నెల కంటే ఆగస్టులో నెమ్మదిగా మెరుగుపడినట్టు, నూతన ఎగుమతి ఆర్డర్లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత వేగాన్ని అందుకున్నట్టు పీఎంఐ డేటా తెలియజేస్తోంది. ఇక తయారీ కంపెనీలు ఆగస్టులో అధిక ఇన్పుట్ వ్య యాల భారాన్ని ఎదుర్కొన్నాయి. రూపాయి విలువ తగ్గడంతో ముడి పదార్థాలపై అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు ధరలు పెంచాయని, అయినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చూస్తే పెంపు పరిమితంగానే ఉన్నట్టు పీఎంఐ డేటా తెలియజేస్తోంది. రానున్న 12 నెలలకు ఉత్పత్తి అంచనాల పట్ల దేశీయ తయారీ కంపెనీలు ఆశావాదంతో ఉండడం గమనార్హం. -
తెలంగాణలో తొలి బైక్ అసెంబ్లింగ్ ప్లాంట్
-
తెలంగాణలో బెనెల్లి బైక్స్ అసెంబ్లింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్ బైక్స్ బ్రాండ్ ‘బెనెల్లి’ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. ఇందుకు తెలంగాణ వేదిక అవుతోంది. సోమవారమిక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో బెనెల్లి బోర్డ్ డైరెక్టర్ జార్జ్ వాంగ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బెనెల్లి భారత భాగస్వామి అయిన ఆటోమొబైల్ రిటైల్ సంస్థ మహావీర్ గ్రూప్ కంపెనీ ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి వద్ద తొలుత 3 ఎకరాల్లో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. రెండవ దశలో 20 ఎకరాల విస్తీర్ణంలో తయారీ ప్లాంటును నెలకొల్పుతారు. ప్రభుత్వం నుంచి సహకారం.. ప్లాంట్ల ఏర్పాటుకు బెనెల్లికి కావాల్సిన పూర్తి సహకారం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ‘అద్భుతమైన బైక్స్ బెనెల్లి సొంతం. ఇప్పుడు భారత్‌లో రోడ్లు మెరుగయ్యాయి. ఇటువంటి బ్రాండ్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే తయారైన వాహనాల రవాణా పరంగా చూస్తే హైదరాబాద్ అనువుగా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సులువుగా సరఫరా చేయవచ్చు. అలాగే ఆగ్నేయాసియా దేశాలు, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లకూ ఎగుమతికి వీలుంది’ అని అన్నారు. ఇంజనీరింగ్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు, నాణ్యమైన విడిభాగాల తయారీ కంపెనీలు ఇక్కడ ఉన్నందునే ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకున్నారని జయేశ్ రంజన్ అన్నారు. తొలి బైక్ అక్టోబరులో.. అసెంబ్లింగ్ ప్లాంటు నుంచి బెనెల్లి తొలి బైక్ 2018 అక్టోబరులో రోడ్డెక్కనుందని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఎండీ వికాస్ జబక్ వెల్లడించారు. 7,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటు రానుందన్నారు. రెండో దశలో బైక్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. మూడు దశాబ్దాల్లో మెర్సిడెస్ బెంజ్, ఇసుజు, స్కోడా, బెనెల్లి బ్రాండ్లలో 50,000లకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నామని మహవీర్ గ్రూప్ చైర్మన్ యశ్వంత్ జబక్ తెలిపారు. కాగా, ఈ ఏడాదే లెంచినో, లెంచినో ట్రయల్, టీఆర్కే 502, టీఆర్కే 502 ఎక్స్, టీఎన్టీ 302 ఎస్ బైక్‌లు రోడ్డెక్కనున్నాయని బెనెల్లి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాంటే బస్టోస్ తెలిపారు. 250 సీసీ బైక్‌లు 2019లో ప్రవేశపెడతామన్నారు. భారత్‌లో బైక్‌ల ధర రూ.2 లక్షలతో మొదలై రూ.6 లక్షల వరకు ఉంది. -
భూమిలేక.. భుక్తి దొరక్క
ఈ చిత్రంలోని రైతు ఎన్పీకుంటకు చెందిన మౌలాసాబ్(68). ఎన్పీకుంట పంచాయతీ పరిధిలో 10 ఎకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేసుకుని వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించే వాడు. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం మౌలాసాబ్ 10 ఎకరబ్ను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంది. మొత్తం భూమికి రూ.లక్ష మాత్రమే ఇస్తామని చెప్పినా.. చివరకు అది కూడా ఇవ్వలేదు. పరిహారం అందక..బతికే మార్గం కనిపించక కుటుంబపోషణకు అప్పులు చేశాడు. రుణదాత ఒత్తిడి పెరగడంతో ఇల్లు విక్రయించి కొన్ని తీర్చాడు. ఇక బతికేదారి లేక ఏడాది క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, కదిరి : ఎన్పీకుంట మండల కేంద్రంలో రూ. 12,500 కోట్లతో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మొత్తం 1,500 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతను ఎన్టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్పీ కుంట పంచాయతీ పరిధిలో 2,079,38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తంగా రెండు విడతల్లో 7,174.25 ఎకరాలను సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల సాగుభూమిని సోలార్ ప్రాజెక్టు కోసం సర్కారు రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది. న్యాయంగా లేని పరిహారం నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు నుంచి రూ. 50 లక్షలు దాకా ఇచ్చారు. కానీ ఎన్పీ కుంట రైతులకు మాత్రం ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ 44.44 కోట్లు చెల్లించింది. ఇంకా అసైన్డ్, పట్టా భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉంది. సాగురైతులు చేసుకున్న పాపమేంటి? తరతరాలుగా అక్కడ భూములు సాగుచేసుకుంటూ తెలిసో, తెలియకో వివిధ కారణాల వల్ల పట్టాలు పొందని 1,156 మంది రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారు. అయితే ఆ రైతులకు మాత్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న ప్రతి రైతుకూ రూ.లక్ష మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పారు. చివరకు అది కూడా ఇవ్వలేదు. ఈ జాబితాలో అనర్హులున్నారంటూ నాలుగు రెవెన్యూ బృందాలు విచారించి 1,156 మందిలో 736 మందిని అర్హులుగా తేల్చారు. ఆ తొలగించిన జాబితాలో నిజంగా సాగుచేసుకుంటున్న రైతులు కూడా ఉన్నారన్న కారణంగా నాలుగేళ్లుగా పరిహారం చెల్లించకుండా నిలిపివేశారు. 26న మరోసారి సమావేశం కలెక్టర్ వీరపాండియన్ గత సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గాండ్లపెంటకు విచ్చేయగా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డితో పాటు ఇతర పార్టీల నాయకులు కలెక్టర్‌ను కలిసి సోలార్ బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్... ఈ నెల 26న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, రైతులంతా సహకరించాలని కోరారు. ఈసారైనా తమకు న్యాయం జరిగేనా అని సాగురైతులు ఎదురు చూస్తున్నారు. 750 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు ఖరాలు రైతులందరికీ పరిహారం చెల్లించకముందే సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. టాటా కంపెనీ 100 మెగావాట్లు, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ, ల్యాంకో, బీహెచ్ఈఎల్ కంపెనీలు 50 మెగావాట్లు చొప్పున మొత్తం 250 మెగావాట్ల విద్యుత్‌ను ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్బ్యాండ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్, అయాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 250 మెగావాట్లు చొప్పున 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి టెండర్లను దక్కించుకున్నాయి. జూలై 12వ తేదీ నుంచి ఈ రెండో విడత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. -
సేమియా.. మజా లియా..!
రంజాన్ మాసం.. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. దీక్షతో ఉపవాసముంటూ అల్లాను స్మరిస్తూ, దైవచింతనలో ఉంటారు. ఈమాసం అందరికీ ఆనందదాయకమే.. ఈనెలలోనే ప్రత్యేకంగా తయారు చేసే వేడివేడి రుచికరమైన హలీంను ఉపవాస విరమణ అనంతరం సాయంత్రం సమయంలో ముస్లిం మిత్రులతో కలిసి అందరూ ఆస్వాదిస్తారు. అయితే హలీంతో పాటు సేమియాకు ఈ మాసంలో విశిష్ట స్థానం ఉంది. రంజాన్ పర్వదినాన తమ చుట్టుపక్కల వారికి కులమతాలకు అతీతంగా సేమియాతో తయారు చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేసి ముస్లింలు సోదరభావాన్ని చాటుకుంటారు... వన్‌టౌన్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే తీపి వంటకం ఖీర్‌ఖుర్మా. రంజాన్ పర్వదినం రోజున ప్రతి ముస్లిం ఇంట సేమియాతో చేసే ఈ వంటకం తప్పనిసరి. పండుగ రోజన ముస్లింలు తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు సేమియాతో చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేస్తారు. అంతేకాకుండా తమ దగ్గర ఆత్మీయులకు రంజాన్ సందర్భంగా సేమియాను అందజేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. అందుకోసం పండుగ సమీపిస్తున్న వారం పది రోజులు ముందుగానే సేమియా తయారీకు సన్నద్ధమవుతుంటారు.అందులో భాగంగానే ఒకొక్కరి ఇంటæ కనీసం ఐదు నుంచి పది కిలోల మేర సేమియాను తయారు చేయిస్తుంటారు. వన్‌టౌన్‌లో సేమియా తయారీ కేంద్రాలు వన్‌టౌన్‌లోని సేమియా తయారీ కేంద్రాలు ఏడెనిమిది వరకూ ఉన్నాయి. రంజాన్ మాసంలో ఆ సేమియా తయారీ కేంద్రాలన్ని ఉదయం నుంచి రాత్రి వరకూ బిజీబిజీగా దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది ఇళ్ల వద్ద సేమియా తయారీ యంత్రాలు కూడా ఉండటంతో వారే స్వయంగా తయారు చేస్తుంటారు. స్వయం తయారీకే ప్రాధాన్యం.. గోధుమలను శుభ్రం చేసి పిండి ఆడించి పిండిని సిద్ధం చేసుకుంటారు. తిరిగి దానిని శుభ్రపరచి సేమియా తయారీ కేంద్రానికి చేరుస్తారు. అక్కడ తయారీ చేసే సిబ్బంది ఆ పిండిని యంత్రంలో వేసి సేమియాను తీస్తారు. తరువాత తయారైన సేమియాను ఆరుబయట గాలి ఆడేవిధంగా ఆరబెడతారు. ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకవైపు ఆధునికత వైపు పరుగులు తీస్తూ సంప్రదాయాలను పక్కనపెడుతున్న ప్రస్తుత కాలంలో ఇంకా సేమియా స్వయం తయారీకే ముస్లింలు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. బయట రకరకాల సేమియాలు విభిన్న రుచుల్లో అందుబాటులో ఉన్నా వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా కొద్దిమంది మాత్రమే అటుగా అడుగులు వేస్తారు. ఖీర్‌ఖుర్మా పంపిణీతో సోదరభావం.. సాధారణంగా పండుగ రోజున ముస్లింలు ఖీర్‌ఖుర్మాను తయారు చేస్తారు. దానిని చుట్టుపక్కల మిత్రులకు, ఇతర బంధువులకు పంపిణీ చేస్తారు. ఖీర్‌ఖుర్మాను పంపిణీ చేయటం ద్వారా రంజాన్ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం తమ బంధువులకే కాకుండా చుట్టుపక్కల వారికి పంపిణీ చేసి తమ ఆత్మీయతను చాటుకుంటారు. ఖీర్ఖుర్మాతో పాటుగా సేమియాతో అనేక వంటకాలు చేసి తమ మిత్రులకు అందజేసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. సాధారణంగా వన్‌టౌన్‌లో ముస్లింలు తమకు ఆత్మీయులైన హిందువులకు తప్పనిసరిగా ఈ వంటకాన్ని లేదా సేమియాను అందజేయడం అనేక దశాబ్ధాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. మతసామరస్యానికి ఇటువంటి ఆత్మీయ పలకరింపులు వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటారు ఇక్కడి స్థానికులు. సేమియా కూడా మతసామరస్యానికి ఒక సాధనంగా రూపుదాల్చడం ఒక విశేషం. -
భారత్‌లో మూడు షియోమి స్మార్ట్‌ఫోన్ ప్లాంట్స్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి భారత్‌లో మూడు స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఏపీలోని శ్రీసిటీతో పాటు తమిళనాడులోని పెరంబదూర్‌లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ యూనిట్ల తయారీ కోసం చెన్నైలో కంపెనీ తొలిసారిగా సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ) ప్లాంట్‌ను నెలకొల్పనుంది. సప్లయర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా షియోమీ గ్లోబల్ ఎండీ వైస్ ప్రెసిడెంట్ మనూ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో షియోమి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా మలిచే క్రమంలో షియోమి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఫాక్స్‌కాన్ ప్లాంట్ల్లో 95 శాతం మంది మహిళలే ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ మూడు స్మార్ట్ ఫోన్ ప్లాంట్లు, చెన్నైలోని ఎస్ఎంటీ ప్లాంట్‌తో స్ధానికులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు సమకూరుతాయని షియోమి పేర్కొంది. -
మార్చిలో తయారీ పేలవం
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం క్రియాశీలత మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నికాయ్ మార్కెట్ తయారీ పీఎంఐ మార్చిలో 51 గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ పాయింట్లు 52.1 శాతం. నిజానికి మార్చిలో ఈ పాయింట్లు 52.8గా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. నెలవారీ సర్వే ప్రకారం– మార్చిలో కొత్త బిజినెస్ ఆర్డర్లు భారీగా పెరగలేదు. ఉపాధి అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. పీఎంఐ ప్రమాణాల ప్రకారం– సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటే దానిని వృద్ధి దశగానే భావించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. అయితే దేశంలో తయారీ ఇండెక్స్ వరుసగా గడచిన ఎనిమిది నెలల్లో 50 పాయింట్ల ఎగువనే ఉంది. -
గుట్కాకు అడ్డాగా..
గుట్కా అమ్మకాలకే కాదు.. దాని తయారీకి కూడా జిల్లా అడ్డాగా మారుతోంది. జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు.. వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మన జిల్లాతోపాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఈ దందాలో ప్రధాన భాగస్వాములుగా నిలుస్తున్నారు. ఈ గుట్టును జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు శనివారం ఛేదించారు. కాకినాడ రూరల్ : గుట్కా అమ్మకాలతోపాటు దాని తయారీకి కూడా కాకినాడ నగరం నిలయంగా మారుతోంది. తూరంగి పంచాయతీ పరిధి కాకినాడ – యానాం రోడ్డులోని ఓ ప్రైవేటు గోడౌన్‌పై ఇంద్రపాలెం పోలీసులు, ఆహార అధికారులు శనివారం చేసిన దాడి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో గుట్కా తయారీకి సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షలకు పైగా విలువైన ముడిసరుకు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సీఐ రాజశేఖర్, ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావుల కథనం ప్రకారం.. గోడౌన్లో గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు, దానిని పొడిగా మార్చేందుకు అవసరమైన యంత్రాలు ఉన్నాయి. అక్కడ ముడిసరుకు తయారు చేసి, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజవోలు గ్రామంలోని మరో గుట్కా తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. రాజవోలు గుట్కా కేంద్రానికి సంబంధించి తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని, వారి ద్వారా వచ్చిన సమాచారంపై తూరంగిలోని గోడౌన్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవ్వరూ పట్టుబడలేదని, ముందుగానే సమాచారం తెలుసుకొని పరారైనట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తోందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని రాజశేఖర్, రామారావు చెప్పారు. ఈ దాడిలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.పాండురంగారావు, ఇంద్రపాలెం ఏఎస్సై మురళీకృష్ణ, కానిస్టేబుళ్లు రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహన విధానంపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని విస్తృత స్థాయి లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రంగంలో కొత్త పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేస్తోంది. విద్యుత్, కార్మిక, రహదారులు, పన్నులు.. తదితర శాఖలతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ విధానానికి ముసాయిదాను రూపొందిస్తోంది. ఈ వాహనాల ఉత్పత్తిరంగంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేలమందికి ఉపాధి కల్పిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ విధానంలో ప్రభు త్వం పలు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ త్వరలో వివిధ ప్రభుత్వ శాఖలతో సమావేశం నిర్వహించి ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు అందించాల్సిన సహాయ, సహకారాలపై చర్చించనున్నారని తెలిసింది. అనంతరం విధాన ముసాయిదాకు తుదిరూపం ఇస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ తదితర పరిశ్రమలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలు సైతం రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో కర్ణాటక రాష్ట్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రా ల్లో ప్రకటించిన విధానాలను పరిశీలించి దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారవర్గాలు తెలిపాయి. -
సాగరతీరంలో సొనాలికా ప్లాంట్!
కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా దేశంలో రెండో ప్లాంటును ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ట్రాక్టర్ల తయారీ సంస్థ సొనాలికా ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఎగుమతులకు అనుకూలంగా ఉండేందుకు కొత్త ప్లాంటును సముద్ర తీరంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అమృత్‌సాగర్ మిట్టల్ చెప్పారు. ఇందులో భాగంగా అనువైన ప్రాంతం కోసం అన్వేషిస్తున్నామని తెలియజేశారు. పరిస్థితులు అనుకూలించి, ప్రభుత్వం చేయూతనిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనైనా ప్లాంట్ ఏర్పాటు చేయటానికి సిద్ధమని చెప్పారాయన. ఇప్పటికైతే ఈ దిశగా ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, కానీ గుజరాత్ ప్రభుత్వంతో మాత్రం సూత్ర ప్రాయ చర్చలు జరిపామని తెలియజేశారు. పంజాబ్‌లోని హోషియార్పూర్ ప్లాంటులో‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... సొనాలికా ట్రాక్టర్స్ అమ్మకాలెలా ఉన్నాయి? మార్కెట్లో మీ వాటా ఎంత? గతేడాది ట్రాక్టర్ల పరిశ్రమ 17 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఇదే సమయంలో మా కంపెనీ 19 శాతం వృద్ధిని అందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ట్రాక్టర్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికి దాదాపు 50 వేల యూనిట్లు విక్రయించాం. వచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల ట్రాక్టర్ల వార్షిక విక్రయాలను లకి‡్ష్యంచాం. దేశీయ ట్రాక్టర్ల మార్కెట్లో మాది మూడో స్థానం. మొత్తం ట్రాకర్ల మార్కెట్లో మా వాటా సుమారు 12.3 శాతం. కానీ 45 హెచ్‌పీ విభాగంలో 15 శాతం వాటా ఉంది. ప్రస్తుతం 20– 120 హెచ్‌పీ వరకు వివిధ విభాగాల్లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నాం. హోషియార్పూర్ ప్లాంటు కొత్తది. ప్రపంచంలోనే అతిపెద్దది. రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వివిధ రకాల ఉత్పత్తులు మా పోర్టు ఫోలియోలో ఉన్నాయి. మరి ఎగుమతుల సంగతో..? మా వార్షిక విక్రయాల్లో ఎగుమతుల వాటా 15 శాతం పైనే ఉంది. వచ్చే ఐదేళ్లలో ఎగుమతుల వాటా 22 శాతానికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ‘సొలెస్’ బ్రాండ్‌తో మా ట్రాక్టర్లను ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతుల పరంగా ఆల్జీరియా మాకు అతిపెద్ద మార్కెట్. ఎగుమతులను మరింత పెంచుకునేందుకు త్వరలో చైనాకు చెందిన ఒక కంపెనీతో జేవీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దేశీయంగా విస్తరణ ఎలా ఉంది? ప్రత్యేకించి దక్షిణాదిలో..? కొన్నాళ్లుగా దక్షిణాదిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డీలర్షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించాం. సీఎస్ఆర్ కార్యకలాపాలకు కూడా తెలుగు రాష్ట్రాలనే ఎంచుకున్నాం. దేశీయంగా విస్తరించేందుకు వచ్చే మూడు నాలుగేళ్లలో కొత్తగా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతానికి తాజా ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యం మాకు సరిపడేంత ఉంది. దక్షిణాదిన విస్తరించి డిమాండ్ బాగా పెరిగితే కొత్త ప్లాంట్ ఏర్పాటు ఊపందుకుంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్‌ను వీలయితే సాగరతీరంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఏపీని సైతం పరిశీలిస్తున్నాం. అన్ని అనుకూలంగా జరిగితే కొత్త ప్లాంట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తాం. కంపెనీ లిస్టింగ్‌కు వచ్చే ఆలోచన ఉందా? సొనాలికాకు ఎలాంటి రుణాలూ లేవు. పైపెచ్చు కంపెనీ వద్ద రూ.2,500 కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. జపాన్‌కు చెందిన ఆటో ఇంజన్ల ఉత్పత్తి దిగ్గజం యాన్మార్కు మా సంస్థలో 30 శాతం వాటా ఉంది. గతంలో బ్లాక్‌స్టోన్‌కున్న వాటాను సైతం యాన్మార్ కొనుగోలు చేసింది. కంపెనీ మూలాలు బలంగా ఉన్నందున ఇప్పట్లో మార్కెట్లో లిస్టింగ్‌కు రావాలని భావించడం లేదు. దేశీయంగా ట్రాక్టర్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? భారత్ ప్రధానంగా రుతుపవన ఆధారిత దేశం. దీంతో వ్యవసాయ రంగం బాగా ఒడిదుడుకులకు గురవుతోంది. ట్రాక్టర్ల పరిశ్రమ కూడా ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించి ఏటా బడ్జెట్ కేటాయింపులు పెంచుకుంటూ పోతోంది. కానీ ఈ ప్రయోజనాలు రైతులకు అందకుండా బ్యాంకులు అడ్డంపడుతున్నాయి. దీంతో రైతులు ఎన్బీఎఫ్సీలు, ఇతర మార్గాల్లో ఎక్కువవడ్డీలకు రుణాలు తీసుకుని ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకులు ఇకనైనా వ్యవసాయ యాంత్రీకరణకు చేయూతనిచ్చేలా యంత్రాలు తక్కువ వడ్డీకి కొనుగోలు చేసేందుకు సహకరించాలి. ప్రభుత్వం కూడా ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. - (హోషియార్పూర్ నుంచి డి.సాయి ప్రమోద్) -
స్పీడు తగ్గిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం శుక్రవారం విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. విభాగాల వారీగా... ♦ ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది. ♦ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 10.3 శాతం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 1.5 శాతంగా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ విభాగం మాత్రం గరిష్ట స్థాయిలో 10 శాతం పెరిగింది. ♦ విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది. -
ఆ ఊరి దారుబొమ్మలకు అందమెక్కువ..
దేవుడే దిగివచ్చాడా..తనకు తానే ఒదిగిపోయి ఊపిరి పోసు కున్నాడా? అనిపిస్తుంది ఆ హస్తకళా చాతుర్యాన్ని తిలకిస్తే. ఆ దారుబొమ్మలు దేనికవే దివ్య కళాదృష్టితో అపు రూపంగా దర్శనమిస్తాయి. తెల్లజిల్లేడుతో వినాయక దారుశిల్పాల తయారీకి ఆ ఊరు ఖ్యాతి గాంచింది. గంగాధరనెల్లూరు మండలం కడపగుంట దళితవాడలో వంద కుటుంబాలు దారు శిల్పాల తయారీయే వృత్తిగా జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన షణ్ముగం పొట్ట చేతపట్టుకుని చెన్నైకి వలస వెళ్లి దారు వినాయక శిల్పాల తయారీని నేర్చుకుని వచ్చాడు. అదే ఇప్పుడు గ్రామానికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే మరింతగా రాణిస్తామని కళాకారులు చెబుతున్నారు. మైమరిపించే సుందర కళాకృతుల తయారీ వెనుక ఉన్న శ్రమైక జీవన సౌందర్యంపై ప్రత్యేక కథనం.. తమిళనాడు వ్యాపారస్తుల నుంచి తెల్ల జిల్లేడు బెరడులను కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కటి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొనుగోలు చేస్తారు. ఒక బెరడుతో ఆరు నుంచి ఎనిమిది బొమ్మల వరకు తయారు చేస్తారు. సైజును బట్టి 30 రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయిస్తారు. రోజుకు ఒక కార్మికుడు 15 బొమ్మల వరకూ తయారు చేస్తాడు. రోజుకు 300 రూపాయల నుంచి 400 వరకు ఆదాయం ఉంటుంది. తయారు చేసిన బొమ్మల్ని తమిళనాడులోని తిరుచ్చి, చెన్నై, కాణిపాకం, తిరుమల, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో వ్యాపారాలు చేసే వారికి విక్రయిస్తుంటారు. ఇటీవల డీఆర్డీఏ శాఖ వీరికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. గిరాకీ ఉంది తెల్లజిల్లేడుతో తయారు చేసిన బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. రోజుకు 300 రూపాయల నుంచి 400 వరకు ఆదాయం వస్తుంది. ఇంట్లోనే ఉండి పని చేస్తున్నా. ఇంట్లోని మహిళలు కూడా బొమ్మల తయారీకి సహకరిస్తుంటారు. –వినాయక్,కడపగుంట రుణం ఇవ్వాలి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. ఒక్కోసారి తెల్లజిల్లేడు దొరకదు. ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయాల్సి వస్తుంది. బ్యాంకు రుణం అందిస్తే అర్థికాభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. రోజుకు 300 రూపాయల ఆదాయం వస్తుంది.-ఉష, కడపగుంట సంతృప్తిగా ఉంది తెల్లజిల్లేడుతో బొమ్మలు తయారు చేసే పనిని నేను మొదట తమిళనాడులో నేర్చుకున్నాను. గ్రామంలో అందరూ నా వద్ద పని నేర్చుకున్నారు. సంతృప్తిగా ఉంది. మహిళలు సైతం బొమ్మలు తయారు చేస్తారు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు. –షణ్ముగం, కడపగంట -
ఐఫోన్ 8 తయారీకి ఖర్చెంత అయిందంటే...
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ ఎక్స్ అనే స్పెషల్ ఫోన్‌తో పాటు వీటిని కూడా ఆపిల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ ఎక్స్‌తో పాటు ఈ రెండు ఐఫోన్లు కూడా చాలా ఖరీదైనవి. ధర పరంగే కాక, తయారీ విషయంలోనూ ఈ ఫోన్లు చాలా ఖర్చుతో కూడుకున్నవని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిని తయారుచేయడానికి ఆపిల్ భారీ ఎత్తున్న ఖర్చు చేసినట్టు పేర్కొన్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ అధ్యయన రిపోర్టు ప్రకారం ఐఫోన్ ఖర్చుగా ఆపిల్ 247.51 డాలర్లను, ఐఫోన్ 8 ప్లస్ ఖర్చుగా 288.08 డాలర్లుగా వెచ్చించినట్టు తెలిసింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం ఐఫోన్ 8 తయారీ కోసం సుమారు రూ.16వేలు, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కోసం రూ.19వేలను ఖర్చుచేసినట్టు వెల్లడైంది. ఇది కేవలం ఈ కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ వెచ్చించిన ఖర్చులో సగ భాగం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుత అధ్యయనంలో లేబర్, మార్కెటింగ్, రీసెర్చ్ వ్యయాలను కలుపలేదు. పాపులర్ హై-ఎండ్ ఫోన్ల తయారీ ఖర్చుపై ఈ అధ్యయనాన్ని ప్రతేడాది మార్కిట్ రీసెర్చ్ చేపడుతోంది. ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి ఆపిల్ విక్రయిస్తుండగా... ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.73వేలు ఉంది. గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన ఈ రెండు స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ కూడా భారత్‌లో నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89వేలు. అయితే ఐఫోన్ ఎక్స్ తయారీ ఖర్చును మాత్రం ఐహెచ్ఎస్ గణించలేదు. ఐఫోన్ ఎక్స్ తయారీ కోసం ఆపిల్ భారీ మొత్తంలో ఖర్చు చేసి ఉంటుందని మాత్రం ఐహెచ్ఎస్ మార్కిట్ చెప్పింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తోంది. అంతకముందు ఐహెచ్ఎస్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు. -
జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి!
♦ జూన్ నెల్లో వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణత ♦ ఈ తరహా ఫలితం ఏడాదిలో ఇదే తొలిసారి ♦ తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల బలహీనత ♦ మరింత రేటు కోత తప్పదంటున్న ♦ పారిశ్రామిక ప్రతినిధులు న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణతలోకి జారిపోయింది. అంటే 2016 జూన్ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్ నెలలో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించిందన్నమాట. 2016 జూన్ నెలలో వృద్ధి భారీగా 8 శాతంగా ఉంది. గడచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ‘క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఇక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) చూసినా, వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది. తాజా ఫలితం నేపథ్యంలో తక్షణం పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) తప్పదని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. . అన్ని రంగాలూ నేలచూపే... ⇔ తయారీ: 2016 జూన్ నెలలో 7.5 శాతం వృద్ధి 2017 జూన్‌లో ఏకంగా –0.4 శాతం క్షీణతకు జారింది. ఇక త్రైమాసికంగా చూస్తే ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి పడింది. ఈ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాన్ని చూశాయి. ⇔ మైనింగ్: నెలలో వృద్ధి రేటు 10.2 శాతం నుంచి 0.4 శాతానికి జారింది. మూడు నెలల్లో ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి చేరింది. ⇔ విద్యుత్: వృద్ధి రేటు నెల్లో 9.8 శాతం నుంచి 2.1 శాతానికి చేరింది. త్రైమాసికంలో రేటు 10 శాతం నుంచి 5.3 శాతానికి పడిపోయింది. ⇔ కేపిటల్ గూడ్స్: భారీ పరిశ్రమల వస్తు ఉత్పత్తికి, డిమాండ్‌కు సూచిక అయిన ఈ రంగంలో రేటు 14.8 శాతం వృద్ధి నుంచి 6.8 శాతం క్షీణతకు పడిపోయింది. ⇔ వినియోగం: కన్జూమర్ డ్యూరబుల్స్‌లో – 2.1 శాతం క్షీణ వృద్ధి నమోదయితే, నాన్–డ్యూరబుల్స్ విషయంలో 4.9 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. -
కొత్త రేటు ముద్రించకపోతే చర్యలు
♦ జీఎస్టీపై తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరిక ♦ మూడు నెలల గడువుంటుందని వెల్లడి న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తదనుగుణంగా ఉత్పత్తులన్నింటిపైనా సవరించిన గరిష్ట చిల్లర ధరను (ఎంఆర్పీ) ముద్రించకపోతే చర్యలు తప్పవని తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరించింది. ఇందుకోసం సెప్టెంబర్ దాకా మూడు నెలల పాటు గడువు ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. గడువులోగా కొత్త రేట్లు ముద్రించని పక్షంలో తయారీ సంస్థలు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆయన ‘ట్వీటర్’లో పేర్కొన్నారు. జీఎస్టీ రాకతో కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గగా, మరికొన్ని పెరిగాయని మంత్రి వివరించారు. తగ్గిన రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాల్సిందేనని, లేకపోతే చర్యలు ఉంటాయన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రేట్ల తీరుతెన్నుల గురించి కొనుగోలుదారులకు స్పష్టంగా తెలిసేలా ప్రతీ ఉత్పత్తిపై సవరించిన ధర ఉండాల్సిందేనని పాశ్వాన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ దాకా స్టిక్కర్స్ ఉపయోగించవచ్చు.. జీఎస్టీ అమలు తేదీకి ముందు అమ్ముడు కాకుండా మిగిలిపోయిన ఉత్పత్తుల ధరలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రీప్యాకేజ్డ్ ఐటమ్స్‌పై ముద్రించిన ఎంఆర్పీకి పక్కనే జీఎస్టీ రాకతో మారిన కొత్త ధరను సూచించేలా స్టిక్కర్స్ రూపంలో అతికించి విక్రయించుకోవచ్చని సూచించింది. స్టాంపింగ్ లేదా స్టిక్కర్ వేయడం లేదా ఆన్లైన్ ప్రింటింగ్ రూపంలో కొత్త ఎంఆర్పీని తెలియజేయాల్సి ఉంటుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాశ్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే, సెప్టెంబర్ 30 దాకా మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని.. ఆ తర్వాత కచ్చితంగా కొత్త రేటును ముద్రించే విక్రయించాలని, యాడ్ ఆన్ స్టిక్కర్స్‌ను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. మిగులు స్టాక్స్ ధరల విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చాలా మటుకు సంస్థలకు దీంతో స్పష్టత లభించినట్లయింది. అమ్ముడవకుండా ఇంకా మిగిలిపోయిన స్టాక్స్ ధరలు పెరిగే పక్షంలో తయారీదారు లేదా ప్యాకర్ లేదా దిగుమతిదారు సదరు మార్పుల గురించి రెండు లేదా అంతకన్నా ఎక్కువ దినపత్రికల్లో కనీసం రెండు ప్రకటనలైనా ఇవ్వాల్సి ఉంటుంది. -
గెలాక్సీ ఎస్8 తయారీ ఖర్చెంతో తెలుసా?
న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ ఎస్8.. ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లలోకి విడుదలైంది. గెలాక్సీ నోట్7 పేలుళ్ల అనంతరం ఎంతో సురక్షితమైన ఫోన్‌గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ ఎస్8ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57,900గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇది గెలాక్సీ ఎస్8 అసలు ధర కాదంట. కంపెనీలు మార్కెట్లోకి ఏ ప్రొడక్ట్‌ను ప్రవేశపెడుతున్నా దానిపై కొంత లాభాలను, ఇతర వ్యయాలను కలుపుకుని ధరను నిర్ణయిస్తాయి. శాంసంగ్ కూడా అలానే గెలాక్సీ ఎస్8ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గెలాక్సీ ఎస్8 రూపొందడానికి అసలు ఖర్చెంత అయిందో వెల్లడిస్తూ ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ 64 స్టోరేజ్ వేరియంట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్(బీఓఎస్)లకు కంపెనీ సుమారు 19,500 రూపాయల వరకు ఖర్చు చేసిందట. తయారీ ఖర్చు సుమారు 392 రూపాయలని, మొత్తంగా ఈ ఖర్చు 19,900 రూపాయల వరకు అయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదించింది. ఈ ఖర్చు శాంసంగ్ గెలాక్సీ ఎస్7 తయారీ ఖర్చు కంటే 2,800 రూపాయలు ఎక్కువని తెలిపింది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఖర్చు కూడా దీని కంటే 2,300 తక్కువేనని వెల్లడైంది. అయితే ఒక్కో కాంపొనెంట్ ధరను ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించనప్పటికీ, ఎన్ఏఎన్డీ ఫ్లాష్ మెమరీ, డీఏఆర్ఎమ్ ధర సుమారు 2,700 అయి ఉంటుందని, బ్యాటరీ ధర 291 రూపాయలు ఉంటుందని తెలిపింది. గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ధరలు కంపెనీ ఎలా నిర్ణయించిందో రివీల్ కానప్పటికీ, గెలాక్సీ నోట్7ను కచ్చితంగా మేజర్ అంశంగా కంపెనీ భావించినట్టు తెలిసింది. కంపెనీ చౌక వెర్షన్‌ను 46,548 రూపాయలకు విక్రయిస్తుంది. ఈ ధర తయారీ ఖర్చు కంటే సుమారు 26,700 రూపాయలు ఎక్కువని రిపోర్టు వెల్లడించింది. అయితే ఇవన్నీ కంపెనీకి వచ్చే లాభాలని మాత్రం ఊహించవద్దంట. ఎందుకంటే మిగతా ఖర్చులు మార్కెటింగ్ వ్యయాలు, పన్నులు, రిటైలర్, క్యారియర్ ఖర్చులు వంటి వాటిని కలుపుకుంటే ఒక్కో యూనిట్‌పై కంపెనీ భరించేది ఎక్కువే ఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. -
మార్చిలో తయారీ పరుగు
న్యూఢిల్లీ: తయారీ రంగం మార్చిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.2కు చేరింది. ఐదు నెలల్లో ఈ సూచీ ఈ స్థాయికి వెళ్లడం ఇదే తొలిసారి. దేశీయంగా, అలాగే అంతర్జాతీయంగా ఎగుమతుల ఆర్డర్లు పెరగడం ఈ సానుకూల ఫలితానికి కారణమని తమ సర్వేలో తేలినట్లు నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన ఉంటే, క్షీణతగా భావించడం జరుగుతుంది. -
ఆపిల్ ప్లాన్స్‌కు అడుగడుగునా అడ్డంకులే
న్యూఢిల్లీ : భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటుచేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ వేస్తున్న ప్లాన్స్ కు అడుగడుగులా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆపిల్ డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అనంతరం వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా జీఎస్టీ అమలు తర్వాతనే ఆపిల్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెబుతోంది. ఆపిల్ కోరుతున్న పన్ను ప్రోత్సహకాలను, ఇతర డిమాండ్లను, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జీఎస్టీ తర్వాతనే చూస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ''జీఎస్టీ బిల్లు తర్వలోనే అమలుకాబోతుంది. ఆపిల్ కోరుతున్న పన్నులకు సంబంధించిన ప్రోత్సహకాలను ఇక వేరే కోణంలో చూడాల్సి ఉంది'' అని సీతారామన్ సోమవారం పేర్కొన్నారు. ఐఫోన్ తయారీదారి ఆపిల్ అడిగే చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆమె చెప్పారు. ఆపిల్ ఈ ఏడాదే బెంగళూరులో ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్లాన్ వేసింది. కానీ ఆపిల్ అడిగే పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో ఆపిల్ ప్లాంట్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆపిల్ చైనా, బ్రెజిల్ లో తన తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. పన్ను ప్రోత్సహకాలతో పాటు తప్పనిసరిగా 30 శాతం స్థానిక వనరులే ఉండాలనే నిబంధనన నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆపిల్ కోరుతోంది.దేశంలో పూర్తిగా తన రిటైల్ అవుట్‌లెట్స్ ను ప్రారంభించాలనీ ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఐఫోన్ల తయారీకి ఆపిల్ తయారుచేసిన బ్లూప్రింట్ కు ప్రభుత్వం సముఖత వ్యక్తంచేసినట్టు ఆపిల్ జనవరిలో సంకేతాలు ఇచ్చింది. కానీ తాజాగా ఆపిల్ కోరుతున్న డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. -
భారత్‌లో తయారీ ఆలోచన పాతదే!
⇒ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి ⇒ కేంద్రానికి రంగరాజన్ సూచన అహ్మదాబాద్: ‘భారత్‌లో తయారీ’ ఆలోచన పాతదేనని, ఇది విజయవంతం కావాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కేంద్రానికి సూచించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మలచాలన్న ఉద్దేశంతో మేకిన్ ఇండియా (బారత్‌లో తయారీ) పేరుతో మోదీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గానూ పనిచేసిన రంగరాజన్ ఈ అంశంపై అహ్మదాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. -
దేశీయ కంపెనీలపై అది తగ్గిపోయింది!
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్న భారత్ లో వ్యాపార ఆశావాదం పడిపోతుంది. వ్యాపారా ఆశావాద విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో కెల్లా భారత్ కంపెనీలపైనే తక్కువ విశ్వసమున్నట్టు తెలిసింది. మార్కిట్ ఇండియా బిజినెస్ అవుట్ లుక్ నిర్వహించిన సర్వేలో గత నాలుగు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశీయ ప్రైవేట్ కంపెనీల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు వెల్లడైంది. 2016 అక్టోబర్ లో బిజినెస్ అవుట్ పుట్ పరంగా 25 శాతం కంపెనీలు ఆశావాదంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ శాతం 15గా ఉందని పేర్కొంది. గ్లోబల్ ట్రెండ్ లో విశ్వాసాన్ని పెంచుకోవడంలో కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి, కానీ బిజినెస్ సెంటిమెంట్ ఫిబ్రవరి నెలలో పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిస్ట్ పోలియన్న డి లిమా తెలిపారు. 12 దేశాల్లో భారత్ కంపెనీలే అతి తక్కువ స్థాయిలో నమోదైనట్టు పేర్కొన్నారు. తయారీరంగం, సర్వీసు సెక్టార్లలో రెండింటిలో వ్యాపార ఆశావాదం పడిపోతున్నట్టు సర్వే వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ విక్టరీ కంపెనీలపై విశ్వాసాన్ని పెంచుతాయని ఆశిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అంతేకాక ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేయడం ఇన్వెస్టర్లలో, కంపెనీల్లో సంస్కరణల ఆశలకు ఊతమిస్తుందని తెలిసింది. -
నకిలీ నెయ్యి కుంకుమ తయారీ గుట్టురట్టు