న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్‌లో మంచి పనితీరును కనబరిచింది. స్టాండెర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్‌లో 13 నెలల గరిష్టం 57.8ని తాకింది.
నవంబర్‌లో ఈ సూచీ 55.7 వద్ద ఉంది. కొత్త ఆర్డర్లు, పటిష్ట డిమాండ్ తాజా సానుకూల ఫలితానికి కారణమని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.
సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన పీఎంఐ వరుసగా 18 నెలల నుంచి వృద్ధి బాటలోనే కొనసాగుతోంది. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్‌లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment