PMI
-
వృద్ధి బాటలో సేవల రంగం..
దేశీయంగా సెప్టెంబర్‌లో పది నెలల కనిష్టానికి పడిపోయిన సేవల విభాగం సూచీ (పీఎంఐ) అక్టోబర్‌లో తిరిగి కోలుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 58.5కి మెరుగుపడింది. డిమాండ్ పటిష్టంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు రావడం, సర్వీసులు పెరగడం, ఫలితంగా ఉపాధి కల్పనకు ఊతం లభించడం మొదలైనవి దీనికి తోడ్పడ్డాయి.తయారీ, సేవల రంగం పనితీరుకు పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌ను (పీఎంఐ) కొలమానంగా పరిగణిస్తారు. వివిధ కంపెనీలవ్యాప్తంగా కొత్త ఆర్డర్లు, నిల్వల స్థాయులు, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన తదితర అంశాల్లో పర్చేజింగ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వే ఆధారంగా దీని స్కోరు ఉంటుంది. సాధారణంగా ఇది 50కి పైన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. ‘భారత సర్వీసెస్ పీఎంఐ సెప్టెంబర్ నాటి పది నెలల కనిష్ట స్థాయి నుంచి అక్టోబర్‌లో 58.5 స్థాయికి మెరుగుపడింది. ఉత్పత్తి, డిమాండ్‌తో పాటు ఉద్యోగాల కల్పన విషయంలోనూ భారతీయ సర్వీసుల రంగం గణనీయంగా మెరుగుపడింది’ అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.ఇదీ చదవండి: రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ -
సెప్టెంబర్‌లో సేవల రంగం భేష్ - 13 సంవత్సరాల్లో ఇదే గరిష్టం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం సెప్టెంబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 60.1 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎప్పుడూ ఇండెక్స్ పెరగలేదు. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త బిజినెస్, ఉపాధి అవకాశాలు సేవల రంగానికి దన్నుగా ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. బిజినెస్ ఆశావహ దృక్పదం మెరుగుపడుతోందని కూడా ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల రంగం సూచీ వరుసగా 26 నెలల నుంచీ వృద్ధి బాటన కొనసాగుతోంది. దాదాపు 400 మంది సేవల రంగ కంపెనీల ప్రతినిధుల ప్యానల్‌కు పంపిన ప్రశ్నలకు సమాధానాల ప్రాతిపదికన ఈ సూచీ కదలికలు ఉంటాయి. సేవలు, తయారీ కలిపినా సానుకూలమే.. కాగా, సేవలు, తయారీ రంగాలతో కూడిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.9 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో చూస్తే, సెప్టెంబర్‌లో భారత్ వస్తు, సేవలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ తరహా పరిస్థితి ఈ 13 సంవత్సరాల కాలంలో ఇది రెండవసారి. కాగా, ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో ఐదు నెలల కనిష్టస్థాయి 57.5కు పడింది. ఈ రంగానికి సంబంధించి సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రాల ప్రతిస్పందనల ప్రాతిపదికన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ మదింపు జరుగుతుంది. నేడు ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయాలు మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటితో (6వ తేదీ) ముగుస్తున్నాయి. ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు శుక్రవారం వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. -
సెప్టెంబర్‌లో ‘తయారీ’ నిరాశ.. ఐదు నెలల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం సెప్టెంబర్‌లో నెమ్మదించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 57.5కు పడింది. అంతక్రితం ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ స్థాయి దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పేర్కొంటారు. ఈ ప్రాతిపదికన సూచీ 27 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
మార్చిలో ‘సేవలు’ అంతంతే..!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో పేలవ పనితీరును కనబరిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరికన్నా తక్కువకు పడిపోయి 57.8కి చేరింది. సూచీ ఫిబ్రవరిలో 12 నెలల గరిష్ట స్థాయి 59.4ను చూసిన సంగతి తెలిసిందే. కొత్త బిజినెస్ ఆర్డర్లు అంతంత మాత్రంగానే పెరిగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన వరుసగా 20 నెలల నుంచి సూచీ వృద్ధి ధోరణిలో పయనిస్తోంది. తయారీ–సేవల రంగం కలిపినా డౌన్! కాగా, తయారీ–సేవల రంగం కలిపినా ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59.0 వద్ద ఉంటే, మార్చిలో 58.4కు పడిపోయింది. మరోవైపు ఒక్క తయారీ రంగం చూస్తే మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్ల స్పందన ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదు చేస్తారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా 60%. పరిశ్రమల రంగం వాటా దాదాపు 15% అయితే, అందులో తయారీ రంగం వెయిటేజ్ 70% ఉంటుంది. -
భారత్ ‘సేవలు’ భేష్...
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. దేశంలో డిమాండ్ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు. సేవలు–తయారీ కలిపినా... పురోగతి! తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. -
జోరు మీదున్న తయారీ రంగం.. గరిష్టానికి చేరిన పీఎంఐ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మంచి పనితీరును కనబరిచింది. స్టాండెర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్లో 13 నెలల గరిష్టం 57.8ని తాకింది. నవంబర్‌లో ఈ సూచీ 55.7 వద్ద ఉంది. కొత్త ఆర్డర్లు, పటిష్ట డిమాండ్ తాజా సానుకూల ఫలితానికి కారణమని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన పీఎంఐ వరుసగా 18 నెలల నుంచి వృద్ధి బాటలోనే కొనసాగుతోంది. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు. -
నవంబర్‌లో సేవలకు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 56.4గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఇది 55.1 వద్ద ఉంది. పీఎంఐ 50 శాతంలోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన దేశ ఎకానమీలో మెజారిటీ పాత్ర పోషిస్తున్న సేవల రంగం వరుసగా 20 నెలల నుంచి వృద్ధి ధోరణిలోనే కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్‌లో సేవల రంగానికి పటిష్ట డిమాండ్ నెలకొంది. మార్కెటింగ్, అమ్మకాలు బాగున్నాయి. సేవల రంగం నవంబర్‌లో చక్కటి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. అయితే కంపెనీలు అత్యధిక నిర్వహణా వ్యయాలను ఎదుర్కొన్నాయి. సేవలు–తయారీ కలిపినా.. స్పీడే! ఇక తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ అక్టోబర్‌లో 55.5గా ఉంటే, నవంబర్‌లో 57.7కు ఎగసింది. ఈ రెండు విభాగాల్లో ప్రైవేటు రంగ క్రియాశీలత పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు డీ లిమా తెలిపారు. ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) చూస్తే, నవంబర్‌లో 55.7గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ గరిష్ట స్థాయిల్లో నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన పీఐఎం వరుసగా 17 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. -
ఎకానమీకి సేవల దన్ను..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ సేవల రంగం ఎకానమీకి మేలో దన్నుగా నిలిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మేలో 58.9గా నమోదయ్యింది. గడచిన 11 సంవత్సరాల్లో సేవల రంగంలో ఈ స్థాయి పటిష్టత నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో సూచీ 57.9 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో పురోగతి సూచీ పటిష్ట స్థాయికి దోహదపడింది. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే పురోగతిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం సేవల సూచీ వృద్ధి బాటన నిలవడం ఇది వరుసగా పదవనెల. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ సేవా రంగంలో వృద్ధిని పెంచడంలో సహాయపడింది. మే నెలలో వ్యాపార కార్యకలాపాలు 11 సంవత్సరాలలో అత్యంత వేగంతో పుంజుకున్నాయి, జూలై 2011 తరువాత కొత్త ఆర్డర్లలో వేగవంతమైన పెరుగుదల ఇదే తొలిసారి’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60%గా ఉంది. తయారీ–సేవలు కలిపినా అదుర్చ్... ఇక సేవలు, తయారీ కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 57.6గా ఉంటే, మేలో 58.3కు ఎగసింది. నవంబర్ తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. భారత్ తయారీ రంగం (పారిశ్రామిక ఉత్పత్తిలో 75%) మే నెల్లో స్థిరంగా ఉంది. -
ఏప్రిల్‌లో సేవల రంగం భేష్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఏప్రిల్‌లో మంచి పనితీరు ప్రదర్శించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 57.9కి ఎగసింది. గత 5 నెలల్లో ఈ స్థాయి నమో దు ఇదే తొలిసారి. మార్చిలో సూచీ 53.6 వద్ద ఉంది. కొత్త వర్క్ ఆర్డర్ల పెరుగుదల, సానుకూ ల వ్యాపార క్రియాశీలత వంటి అంశాలు ఇండెక్స్‌కు బలాన్ని అందించాయి. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ‘సేవల పీఎంఐ డేటా ప్రోత్సాహకరంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణం’ అని ఎస్అండ్పీ గ్లోబల్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. సేవలు, తయారీ... దూకుడే: కాగా సేవలు, తయారీ రంగం కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మార్చిలో 54.3 వద్ద ఉంటే, ఏప్రిల్‌లో 57.6కు ఎగసింది. ఈ సూచీ కూడా ఐదు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల్లో కొంత మెరుగుదల కనబడింది. ఒక్క తయారీకి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. -
అమ్మకాలకే అవకాశం.. మార్కెట్‌పై ఉక్రెయిన్–రష్యా అనిశ్చితి
ముంబై: ఉక్రెయిన్–రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా ఇన్వెస్టర్లు ఈ వారమూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో చోటు చేసుకోనున్న అప్రమత్తత విక్రయాలకు ఊతం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దేశీయంగా ఇదే వారంలో విడుదలయ్యే క్యూ3 జీడీపీ, ఫిబ్రవరి తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి స్టాక్ మార్కెట్‌పై ట్రేడింగ్ ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ప్రభావితం చేసే అంశాలు.. ► ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యాను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర మరోసారి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యుద్ధ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. ► నేడు క్యూ3 జీడీపీ గణాంకాల విడుదల కేంద్ర గణాంకాల శాఖ నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైసికం(క్యూ3) జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. సమీక్షిస్తున్న మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.6% నమోదు అవుతుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్‌లు 5.8 శాతంగా నమోదుకావచ్చని భావిస్తోంది. ఇదే రోజున జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ద్రవ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ► రేపు ఆటో అమ్మక డేటా వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం(రేపు) ఫిబ్రవరి నెల వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. చిప్ కొరత కష్టాలు కాస్త తగ్గడంతో వాణిజ్య, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్ విక్రయాల్లో క్షీణత నమోదు కావచ్చని అంటున్నారు. అమ్మక గణాంకాల విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, జజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం తదితర ఆటో కంపెనీల షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ కావచ్చు. ► బుధవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉక్రెయిన్ – రష్యా సంఘర్షణ నేపథ్యంలో ద్రవ్యపాలసీపై ఫెడ్ రిజర్వ్ వైఖరి వెల్లడించనున్నారు. ► తయారీ, సేవల రంగ గణాంకాలు ఫిబ్రవరి తయారీ రంగ సేవల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి భయాలు తగ్గడం, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. కావున తయారీ డేటా ఆశించిన స్థాయిలో నమోదుకావచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేవారంలో శుక్రవారం జనవరి సేవల రంగ గణాంకాలు విడుదల అవుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు జనవరిలో కోవిడ్ ఆంక్షలతో సేవారంగం నెమ్మదించి ఉండొచ్చని భావిస్తున్నారు. ► వరుసగా ఐదోనెల అమ్మకాలే... దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఐదో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఫిబ్రవరిలో మొత్తం రూ.35,506 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన ఐదు నెలల్లో మొత్తం రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు భయాలకు తోడు తాజాగా ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ధ పరిస్థితులు తోడయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు బేర్స్‌కు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో దేశ ఎక్సే్చంజీలు 4 రోజులకే పనిచేయనున్నాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులను తెలిపే కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అప్రమత్తత ధోరణి ప్రదర్శించవచ్చు. నిఫ్టీకి సాంకేతికంగా దిగువ స్థాయిలో 16,200 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగితే ఎగువస్థాయిలో 16,900 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే... మహాశివరాత్రి సందర్భంగా మంగళ వారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. రష్యా సైనిక చర్యతో గతవారంలో సెన్సెక్స్ 1,974 పాయింట్లు, నిఫ్టీ 618 పాయిం ట్లు చొప్పున నష్టపోయాయి. ఏడు రోజుల వరుస పతనం నేపథ్యంలో వారాంతపు రోజు శుక్రవారం సూచీలు స్వల్పంగా బౌన్స్‌బ్యాక్ కావడం మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది. -
పుంజుకున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న దాఖలాలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారీ రంగం గత నెల మళ్లీ కాస్త పుంజుకుంది. ఏప్రిల్‌లో 51.8 పాయింట్లుగా ఉన్న నికాయ్ ఇండియా తయారీ రంగ సూచీ (పీఎంఐ) మే నెలలో 52.7 పాయింట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. పీఎంఐ 50 పాయింట్ల పైన కొనసాగడం ఇది వరుసగా 22వ నెల కావడం గమనార్హం. పీఎంఐ 50కి పైన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. ‘కొత్త ఆర్డర్ల రావడం మొదలు కావడంతో, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాయి. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది‘ అని పీఎంఐ సూచీ నిర్వహించే ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు వస్తుండటం, ఉత్పత్తి పెంపుపై కంపెనీలు ఆశావహంగా ఉండటం వంటి అంశాలతో తయారీ రంగంలో మరింత మందికి ఉపాధి కల్పన జరిగినట్లు వివరించారు. ధీమాగా కంపెనీలు ఏప్రిల్ నుంచి సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ ఉత్పత్తి పెంపుపై దేశీ తయారీ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ వ్యూహాలు, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, సానుకూల ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలు ఈ ఆశావహ దృక్పధానికి కారణమని నివేదికలో వెల్లడైంది. ద్రవ్యోల్బణ కోణంలో చూస్తే ధరలపరమైన ఒత్తిళ్లు పెద్దగా పెరగలేదని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల స్వల్పంగానే ఉండటం వల్ల కంపెనీలు రేట్లను పెద్దగా మార్చలేదని లిమా తెలిపారు. -
ఒడిదుడుకుల ప్రయాణం..!
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ నేడు జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు జరిగే పోలింగ్... ఎన్నికల చివరి అంకానికి మరింత దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారు? ఎన్ డీఏనే కొనసాగితే.. మెజారిటీ ఎంత ఉండనుందనే ఉత్కంఠ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు మార్కెట్లో ఒడిదుడుకులు కూడా అధికస్థాయిలోనే పెరుగుతాయి. ఇదే సమయంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నాయి’ అని అన్నారయన. మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, సాధారణ ఎన్నికల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజ ఫలితాల వెల్లడి ప్రైవేట్ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ మే 6న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ బ్యాంక్ నికర లాభం రూ.2,162.8 కోట్లుగా ఉండవచ్చని బ్రోకరేజీ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన 112 శాతం, క్వార్టర్ ఆ¯Œ క్వార్టర్ వృద్ధి 34.8 శాతం వృద్ధిని అంచనావేసిన ఈ సంస్థ.. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.6% వృద్ధి చెంది రూ.6,839.3 కోట్లుగా ఉండనుంది విశ్లేషించింది. ఈ ఆదాయం త్రైమాసిక పరంగా స్వల్పంగా 0.5% క్షీణత ఉండనుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ క్యూ4 ఫలితాలు ఈనెల 10న (శుక్రవారం) వెల్లడికానుండగా.. ఇదే రోజున కెనరా బ్యాంక్ ఫలితాలురానున్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఇతర దిగ్గజ కంపెనీల్లో వేదాంత (మంగళవారం).. టైటాన్, శ్రీ రేణుకా షుగర్స్, టాటా కమ్యూనికేషన్స (బుధవారం), ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ (గురువారం).. లార్సెన్ అండ్ టుబ్రో, వోల్టాస్ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేష¯Œ్స, మిశ్రమ ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ 11,800 వద్ద బలమైన రెసిస్టెన్‌సను ఎదుర్కొంటోంది. ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను కొనసాగిస్తుండగా.. డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు’ అని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ మనీష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య బీజింగ్‌లో తాజా విడత వాణిజ్య చర్చలు బుధవారం రోజున పూర్తయ్యాయి. అంతక్రితం సమావేశాలతో పోల్చితే తాజా విడత చర్చల్లో కొంత పురోగతి ఉన్నట్లు ఇరు దేశాల వాణిజ్య అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్ లో మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాల పరంగా ఈవారంలో మార్కెట్లకు ఇది కీలకంగా ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమాత్రం పురోగతి కనిపించినా మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని అంచనావేస్తున్నాయి. దేశీ ఆర్థిక గణాంకాలపరంగా.. ఏప్రిల్ నికాయ్ ఇండియా సేవల పీఎంఐ సోమవారం.. పారిశ్రామికోత్పత్తి, తయారీ ఉత్పత్తిని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుంది. వెనక్కు తగ్గిన ఎఫ్ఐఐలు గడిచిన రెండు సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,255 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. మే నెల 2, 3 తేదీల్లో వీరు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.367 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.888 కోట్లను వెనక్కితీసుకున్నారు. అయితే.. ఏప్రిల్ నెల్లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈమధ్యకాలంలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల డేటా ఆధారంగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా మారారని ఒక తుది అంచనాకు రాలేమని జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు జి.విజయ్ కుమార్ అన్నారు. -
మురిపించింది... మౌలికం
జనవరిలో 6.7% వృద్ధి న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమల విభాగం జనవరిలో పర్వాలేదనిపించింది. వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.4 శాతం. ఐఐపీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది రంగాలూ ఇలా.. ►పెట్రోలియం రిఫైనరీ ప్రోడక్టులు: అసలు ఎటువంటి వృద్ధి లేని స్థితి నుంచి (2016 జనవరిలో 0%) తాజా సమీక్షా నెల– జనవరిలో 11% వృద్ధిని నమోదుచేసుకుంది. ►సిమెంట్: క్షీణత నుంచి (2016 జనవరిలో వృద్ధి లేకపోగా –13.3 శాతం క్షీణత) వృద్ధి ఏకంగా 20.7 శాతానికి ఎగసింది. ►స్టీల్: వృద్ధి 11.3 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ►విద్యుత్: వృద్ధి 5.2 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది. ►బొగ్గు: ఈ రంగంలో వృద్ధి 3.5 శాతం నుంచి 3.0 శాతానికి తగ్గింది. ►క్రూడ్ ఆయిల్: 1.3 వృద్ధి రేటు –3.2 క్షీణతలోకి జారింది. ►సహజవాయువు: ఈ రంగంలో కూడా 11.6 శాతం వృద్ధి –1 శాతం క్షీణతలోకి మారింది. ►ఎరువులు: –1.2 శాతం క్షీణత మరింతగా –1.6 క్షీణతకు జారింది. 10 నెలలూ చూస్తే దిగువ బాటే: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ చూస్తే, మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గింది. గురితప్పింది... ద్రవ్యలోటు జనవరి ముగిసే నాటికి 6.77 లక్షల కోట్లు న్యూఢిల్లీ: భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2017–18) గురితప్పుతున్నట్లు మరింత స్పష్టమైన గణాంకాలు వెలువడ్డాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలు ఉండగానే– జనవరిలో ద్రవ్యలోటు రూ. 6.77 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2017–18 బడ్జెట్ లక్ష్యాలతో పోల్చిచూస్తే ఇది 113.7 శాతం అధికం. ప్రభుత్వ అధిక వ్యయాలు దీనికి కారణం. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2017–18లో ఈ విలువ రూ.5.33 లక్షల కోట్లు దాటరాదని ఈ బడ్జెట్ నిర్దేశించింది. ఇది మొత్తం జీడీపీ విలువతో పోల్చితే 3.2 శాతం. అయితే తాజా గణాంకాలు చూస్తుంటే, లక్ష్యాలను సాధించడంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ఇప్పటికే నిర్ధారించుకున్న కేంద్రం 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని రూ.5.95 లక్షల కోట్లకు పెంచింది. జీడీపీ అంచనా విలువలో ఇది 3.5 శాతం. మరింతగా విశ్లేషిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ అంచనాల ప్రకారం– ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3 శాతానికి తగ్గాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతం లక్ష్యానికి బదులు 3.5 శాతంగా ఉంటుందని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ద్రవ్యలోటు విధానంపై ఆర్థిక విశ్లేషకుల నుంచి విమర్శలు వెలువడ్డాయి. బడ్టెట్ తరువాత, స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి. నెమ్మదించింది... తయారీ! న్యూఢిల్లీ: తయారీ రంగం ఫిబ్రవరిలో నెమ్మదించిందని నికాయ్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో సూచీ 52.1గా నమోదయినట్లు తన సర్వేలో పేర్కొంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. జనవరిలో ఈ రేటు 52.4 వద్ద ఉంది. డిసెంబర్లో 60 నెలల గరిష్ట స్థాయి 54.7 వద్ద సూచీ ఉంది. ఫ్యాక్టరీ ఉత్పత్తి, బిజినెస్ ఆర్డర్లలో మందగమనం ఫిబ్రవరిలో సూచీ నెమ్మదించడానికి కారణమని నికాయ్ పేర్కొంది. అయితే నికాయ్ ఇండెక్స్ ప్రకారం... సూచీ 50పైన ఉంటే అది వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే, క్షీణతగా భావిస్తారు. వరుసగా 7 నెలలుగా సూచీ 50 పైనే ఉంటోంది. -
ఆగస్ట్‌లో వృద్ధి బాటకు... తయారీ: పీఎంఐ
న్యూఢిల్లీ: తయారీ రంగం ఆగస్టులో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. నికాయ్ ఇండియా మేనేజింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 51.2గా నమోదయ్యింది. జూలైలో ఇండెక్స్ 47.9 వద్ద ఉంది. పీఎంఐ పాయింట్లు 50 శాతం ఎగువన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువున ఉంటే, క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో– జూలైలో అప్పటికే ఉన్న నిల్వలను విక్రయించుకోవడంపై దృష్టి పెట్టిన కంపెనీలు, కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించకపోవడం, కొత్త పన్ను వ్యవస్థ (జీఎస్టీ)పై సంక్లిష్టత వంటి అంశాలు జూన్, జూలై తయారీ రంగం పేలవ పనితనానికి కారణమని పేర్కొన్న నికాయ్ ఇండెక్స్, జీఎస్టీ అమల్లోకి వచ్చి, దీనిపై స్పష్టత వస్తున్న కొలదీ ఆర్డర్లు తిరిగి పుంజుకుంటున్నాయని విశ్లేషించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో– ఆగస్టు నికాయ్ తయారీ సూచీ కొంత సానుకూలంగా నమోదవడం విశేషం. -
జూన్‌లో సేవలు జూమ్!
♦ ఎనిమిది నెలల గరిష్టానికి నికాయ్ సూచీ ♦ ఆర్డర్లు పెరిగిన నేపథ్యం న్యూఢిల్లీ: సేవల రంగం జూన్‌లో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. నికాయ్ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, మేలో 52.2 వద్ద ఉన్న సూచీ, జూన్‌లో 53.1కి ఎగసింది. నికాయ్ సూచీ 50 పాయింట్ల పైన వుంటే దానిని వృద్ధిగా ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. తాజా నెల సమీక్షలో సూచీ భారీగా పెరగడానికి ‘సేవల విభాగ ఆర్డర్లు’ పెరగడం ప్రధాన కారణం. సేవల రంగం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సగటున 51.8గా ఉంది. జనవరి–మార్చి త్రైమాసికంలో పేలవంగా ఉన్న వృద్ధి ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొంత పటిష్టమయ్యే వీలుందని తాజా గణాంకాలు పేర్కొంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా తయారీ రంగం వృద్ధి మాత్రం జూన్‌లో దాదాపు అక్కడక్కడే ఉంది. మేలో 52.5 స్థాయిలో ఉన్న సూచీ, జూన్‌లో 52.7 పాయింట్లకు చేరింది. అయితే ఇది కూడా ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. -
జీఎస్టీ అమలు తీరుపై ఇన్వెస్టర్ల దృష్టి
♦ జీఎస్టీ... ఆరంభంలో కొన్ని ఇక్కట్లు ♦ మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశం ∙ ♦ స్టాక్ మార్కెట్ గమనంపై విశ్లేషకుల అంచనాలు జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురికావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రుతుపవనాల విస్తరణ, తయారీ, సేవల రంగాలకు చెందిన గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, తదితర అంశాలు మార్కెట్‌ను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. సోమవారం తయారీ గణాంకాలు భారత్‌లో జూన్ నెలలో తయారీ రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలను మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ సోమవారం(ఈ నెల 3న) వెల్లడిస్తుంది. ఇక సేవల రంగానికి చెందిన పీఎంఐ గణాంకాలు బుధవారం(ఈ నెల5న) వస్తాయి. అమ్మకాల ఒత్తిడి ! దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు తీరు ఎలా ఉందోనని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(బిజినెస్) వి.కె.శర్మ పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాల కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారని, ఈ సమావేశ వివరాలు కూడా మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని వివరించారు. జీఎస్టీ అమలులో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పవని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కొత్త వృద్ధి అంశాలు ఏమీ లేనందున మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. గత నెల వాహన విక్రయ గణాంకాలు వెల్లడైనందున వాహన షేర్లు వెలుగులో ఉంటాయని వివరించారు. ఇక అంతర్జాతీయ అంశాలు, ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు కూడా ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఒడిదుడుకులకు అవకాశం.! జీఎస్టీ అమలు కారణంగా తలెత్తిన ఇబ్బందులపై కంపెనీ యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలు. మార్కెట్ ఒడిదుడుకులకు కారణమయ్యే అవకాశాలున్నాయని ఏంజెల్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ మయూరేశ్ జోషి చెప్పారు. ఒక దేశం–ఒక పన్ను విధానమైన జీఎస్టీ అమలు స్టాక్‌మార్కెట్‌పై సానుకూలంగానే ఉంటుందని ఆమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పవని వివరించారు. ఈ వారం మార్కెట్‌పై సేవల, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రభావం కూడా ఉంటుందని పేర్కొన్నారు. మూడు నెలల గరిష్టానికి జూన్‌లో విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో గత నెలలో రూ.29,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. గత మూడు నెలల్లో ఇవే అత్యధిక విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు. అంతే కాకుండా వరుసగా ఐదో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు కొనసాగాయి. జీఎస్టీ అమల్లోకి రావడం, వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు దీనికి కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం.. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.3,617 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.25,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం రూ.29,302 కోట్లకు విదేశీ పెట్టుబడులు చేరాయి. మార్చి(ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.56,261 కోట్లు ఇన్వెస్ట్ చేశారు) తర్వాత ఈ ఏడాది గత నెలలోనే విదేశీ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి. -
ఆర్బీఐ పాలసీ కీలకం
♦ ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకులు ♦ రుతుపవనాల పురోగతి, సేవల పీఎంఐ గణాంకాల ప్రభావం న్యూఢిల్లీ: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, రుతుపవనాల పురోగతి, కీలక ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శనివారం జరిగిన జీఎస్టీ సమావేశం పెండింగ్‌లో ఉన్న నిబంధనలకు ఆమోదం తెలపడం, మరికొన్ని వస్తువులపై జీఎస్టీ రేట్లను ఖరారు చేసిన నేపథ్యంలో రంగాల వారీ షేర్ల కదలికలు ఉంటాయంటున్నారు. ‘‘ఫలితాల సీజన్ దాదాపుగా ముగిసింది. ఫలితాలను బట్టి షేర్లు ఇప్పటికే స్పందించాయి. మంగళ, బుధవారాల్లో (ఈ నెల 6,7న) జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం స్వల్పకాలంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించనుంది. అలాగే, రుతుపవనాల పురోగతి సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. జీఎస్టీని ఎంత సమర్థవంతంగా అమలు చేయగలరన్న అంశాన్ని మార్కెట్ గమనించనుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్మోది చెప్పారు. కొనుగోళ్లు కొనసాగొచ్చు... ‘‘జీఎస్టీ అమలుతో వ్యాపారాలపై స్వల్ప కాలంలో ప్రభావం పడనుంది. ఇది మార్కెట్లో అస్థిరతకు దారితీయొచ్చు. అయినప్పటికీ జీఎస్టీతో దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏవైనా అంశాలు మారితే తప్పితే ఈ కొనుగోళ్ల వాతావరణం కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్లు ఆర్బీఐ, యూరప్ సెంట్రల్ బ్యాంకు (ఈసీబీ) పాలసీ సమావేశాలను నిశితంగా గమనించనున్నాయి’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ‘‘సోమవారం కీలకమైన సేవల పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. బుధవారం ఆర్బీఐ సమావేశ వివరాలు వెల్లడి కానున్నాయి’’ అని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ అభ్నీష్ కుమార్ అన్నారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ విధానం, రుతుపవనాల పురోగతి, జీఎస్టీ అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘా చెప్పారు. సూచీలు రికార్డు గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నందున కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు లాభపడింది. -
జీడీపీ డేటా, ఫలితాలు కీలకం...
⇔ చివరి దశ క్యూ4 ఫలితాలు ⇔ రుతుపవనాల పురోగతి ⇔ ఈ వారం మార్కెట్ పభావిత అంశాలు ఈ వారంలో వెలువడే జీడీపీ, తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. నైరుతి రుతుపవనాల పురోగతి కూడా ప్రభావం చూపుతుందని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడ, ప్రపంచ మార్కెట్ల గమనం, డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తదితర అంశాలు కూడా కీలకమేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. 31న జీడీపీ డేటా... నేడు(సోమవారం–ఈ నెల 29) బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్లు ఆర్థిక ఫలితాలను వెల్ల డించనున్నాయి. మంగళవారం (ఈ నెల 30న) హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ ఫలితాలను ప్రకటిస్తాయి. ఇక బుధవారం (ఈ నెల 31న) గత ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ గణాంకాలను ప్రభుత్వం వెల్లడించనున్నది. గురువారం (వచ్చే నెల 1న) మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ తయారీ రంగానికి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వస్తాయి. మే నెల వాహన విక్రయ గణాంకాలు గురువారం వెలువడనుండటంతో వాహన షేర్లు వెలుగులోకి రావచ్చు. ఇంధన ధరల సవరణ కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, విమానయాన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. మార్కెట్ ముందుకే.. మార్కెట్ ఇప్పటికే రికార్డ్ స్థాయికి చేరనందున ఈ వారం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. సకాలంలో రుతుపవనాలు రావడం, జీడీపీ గణాంకాలు బావుండడం సంభవిస్తే మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంపెనీల ఫలితాల వెల్లడి చివరి దశకు వచ్చినందున ఇక ఇప్పుడు అందరి కళ్లు జీఎస్టీ అమలుపై ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కంపెనీల ఫలితాలు మెరుగుపడుతుండడం, విదేశీ పెట్టుబడులు జోరుగా వస్తుండడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
ఆర్బీఐ పాలసీ, గణాంకాలు కీలకం
⇒ శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం సెలవు ⇒ ట్రేడింగ్ నాలుగు రోజులే న్యూఢిల్లీ: ఆర్బీఐ ద్రవ్య విధానం.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నదని నిపుణులంటున్నా రు. శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం(ఈ నెల 4న) స్టాక్ మార్కెట్‌కు సెలవు. కావున ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది కాబట్టి గురువారం (ఈ నెల 6న) వెలువడే ఆర్బీఐ పాలసీతో పాటు తయారీ, సేవల రంగాలకు చెందిన గణాంకాల ప్రభా వం మార్కెట్‌పై ఉంటుందని విశ్లేషకులంటున్నారు. ఒడిదుడుకులు తప్పవు...! మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గణాంకాలను సోమవారం వెలువరిస్తుంది. ఇదే సంస్థ సేవల రంగానికి చెందిన పీఎంఐ గణాంకాలను గురువారం వెల్లడిస్తుంది. ఈ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మార్కెట్‌కు ఒడిదుడుకులు తప్పవని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఆర్బీఐ పాలసీని బట్టి మార్కెట్ భవిష్యత్ గమనం ఉంటుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన వి.కె. శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. డాలర్‌తో రూపాయి మారకం, ఆర్బీఐ పాలసీ ఈ రెండు అంశాలు.. సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. వెలుగులో వాహన షేర్లు.. మార్చిలో అమ్మకాలు బాగా ఉన్నందున వాహన కంపెనీల షేర్లు జోరుగా ఉండొచ్చని నిపుణులంటున్నారు. ఆర్బీఐ ద్రవ్య పాలసీ కారణంగా వడ్డీరేట్ల ప్రభావిత షేర్లలో ఒడిదుడుకులు ఉండొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్‌కు చెందిన జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇంధన ధరల తగ్గింపు ప్రభావం ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలపై ఉంటుంది. మరోవైపు విమానయాన ఇంధనం ధరలు 5 శాతం వరకూ తగ్గినందున స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్, ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ షేర్లు లాభపడే అవకాశాలున్నాయి. మార్చిలో రికార్డ్ స్థాయి విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు గత నెలలో రూ.57,000 కోట్ల మేర మన క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మన స్టాక్ మార్కెట్లో రూ.31,327 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.25,617 కోట్లు... వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.56,944 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2002 తర్వాత ఒక్క నెలలో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. -
గణాంకాలు కీలకం
జీడీపీ, పీఎంఐ గణాకాలు ⇒ వాహన విక్రయ వివరాలు ⇒ యూపీ ఎన్నికలపై ఇన్వెస్టర్ల ఆసక్తి న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), సేవల, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. విలీనాలు, షేర్ల బైబ్యాక్ ప్రకటనలు, వివిధ రంగాల వారీ వార్తల ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై ఉంటుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. మంగళవారం జీడీపీ గణాంకాలు 2016 డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదే రోజు కీలకమైన ఎనిమిది పరిశ్రమల పనితీరుకు సంబంధించిన గణాంకాలు కూడా వస్తాయి. ఇక బుధవారం(మార్చి 1న) ఫిబ్రవరి నెల వాహన విక్రయాల గణాంకాలు వెలువడతాయి. దీంతో వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఫిబ్రవరిలో భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలను మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ బుధవారం వెలువరించనున్నది. ఇక భారత సేవల రంగం పీఎంఐ గణాంకాలను ఈ సంస్థ శుక్రవారం(మార్చి3న) వెల్లడిస్తుంది. ఇంధన ధరల సవరణ నేపథ్యంలో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓఎల్ వంటి ప్రభుత్వ రంగ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, జెట్ ఎయిర్వేస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, స్పైస్జెట్వంటి విమానయాన కంపెనీల షేర్లు వెలుగులోకి రావచ్చు. యూపీపై దృష్టి... దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటన లేనందున ఈ వారం మార్కెట్ నిస్తేజంగా ఉండొచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. అందుకని ప్రధానంగా అంతర్జాతీయం సంకేతాల ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాక్ సూచీల్లో కరెక్షన్ జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దృష్టిపెట్టారని వివరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తే, మార్కెట్లో ర్యాలీ వస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ భవితవ్యాన్ని తేల్చడానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. యూపీతో పాటు జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న వస్తాయి. నిఫ్టీ 9,016 పాయింట్ల నిరోధాన్ని దాటగలిగితే మరింతగా ముందుకు వెళుతుందని, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(రిటైల్ రీసెర్చ్) దీపక్ జసాని చెప్పారు. ఒకవేళ 8,809 మద్దతు కోల్పోతే బలహీనపడుతుందని వివరించారు. విదేశీ పెట్టుబడులు ఎట్రూ.14,638 కోట్లు పన్ను అంశాల్లో స్పష్టత కారణంగా ఈ నెలలో విదేశీ పెట్టుబడులు జోరుగా ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.14,638 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలిఉన్నందున పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు మన స్టాక్స్‌లో రూ.9,359 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.5,279 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. -
న్యాక్‌తో అమెరికా సంస్థ జోడీ
సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రాజెక్టు మేనేజ్మెంట్ శిక్షణ ఇవ్వనున్న పీఎంఐ న్యాక్‌లో నిర్వహణ.. పీఎంఐ సంస్థ పేరిట సర్టిఫికెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగావకాశం త్వరలో అవగాహన ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) సంస్థ అమెరికాకు చెందిన ‘ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్(పీఎంఐ)’తో కలసి పనిచేయనుంది. భవన నిర్మాణానికి సంబంధించిన శిక్షణ, ఇంజనీర్లకు నైపుణ్యాభివృద్ధి తర్ఫీదు అందిస్తున్న న్యాక్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. అటు పీఎంఐ సంస్థ ఇచ్చే శిక్షణకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రాజెక్టు మేనేజ్మెంట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే న్యాక్ ఆధ్వర్యంలో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సమావేశంలో పీఎంఐ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. న్యాక్‌లో శిక్షణ.. పీఎంఐ పేరుతో సర్టిఫికెట్ ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పెద్ద పెద్ద సంస్థలు చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడింది. పేరున్న సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందినవారికి కాంట్రాక్టు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మేనేజ్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు పీఎంఐతో కలసి పనిచేయాలని న్యాక్ నిర్ణయించింది. దీనిపై ఇటీవల న్యాక్ ప్రతినిధులు పీఎంఐతో సంప్రదించగా.. ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. శిక్షణ తీరు, ఇతర అంశాలను నిర్ధారిం చాక అవగాహన ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించింది. ఈ మేరకు శిక్షణ ఉండాల్సిన తీరును సిద్ధం చేసేందుకు న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల ప్రతినిధులు, ప్రఖ్యాత ఇంజనీరింగ్ నిపుణులు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇక శిక్షణ కోసం న్యాక్‌లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించేందుకు పీఎంఐ ఇండియా విభాగం హెడ్ రాజ్ కల్లారీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఆ తర్వాత రెండు సంస్థల మధ్య ఎంవోయూ ఉంటుంది. న్యాక్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు అనంతరం ఆన్లైన్ ద్వారా పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైనవారికి పీఎంఐ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి అభ్యర్థులు న్యాక్‌కు వచ్చే అవకాశముంది. -
తయారీ బాగున్నా... సేవలు పేలవం
జనవరిపై నికాయ్ సర్వే న్యూఢిల్లీ: తయారీ రంగం జనవరిలో కోలుకన్నా... సేవల రంగం పేలవంగానే ఉందని నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. 2016 డిసెంబర్లో 46.8 పాయింట్లుగా ఉంటే, జనవరిలో 48.7 పాయింట్లుగానే ఉందని సూచీ తెలిపింది. సేవల రంగం పేలవంగా ఉండడం ఇది వరుసగా మూడవనెల. సూచీ 50 శాతం దిగువున ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. -
మార్చిలో తయారీ రంగం స్పీడ్: నికాయ్ సూచీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో దూసుకుపోయినట్లు నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో 51.1 వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.4కు ఎగసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. బిజినెస్ ఆర్డర్లు భారీగా పెరగడం తయారీ రంగానికి ఊతం ఇచ్చినట్లు సర్వే పేర్కొంది. వరుసగా మూడు నెలలుగా తయారీ రంగం నికాయ్ సూచీ కీలక 50 పాయింట్ల పైన కొనసాగుతోంది. పాయింట్లు 50 పైన నమోదయితే... దానిని వృద్ధిగా 50 లోపు ఉంటే... క్షీణతగా పరిగణిస్తారు. -
పీఎంఐ పనులకు జిల్లాకు రూ.15 కోట్లు
లావేరు : విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా, విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ప్రీ మాన్సూన్ ఇన్‌స్పెక్ష న్ (పీఎంఐ) పనులు చేపట్టేందుకు జిల్లాకు రూ.15 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఈపీడీసీఎల్ ఆపరేషన్ కార్పొరేట్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. లావేరు మండలంలో జరిగిన పీఎంఐ పనులను పరిశీలించేందుకు గురువారం ఆయన లావేరు, వెంకటాపురం గ్రామాలను సందర్శించారు. లావేరులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి రికార్డులు, రీడింగ్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద గాలులు వీచినప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ఆ సమస్యలను అధిగమించేందుకు పీఎంఐ పనులు చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్లు కొట్టడం, కొత్త విద్యుత్ స్తంభాలు వేయడం, పాడైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు వంటివి ఈ పీఎంఐ నిధులతో చేపడతామన్నారు. రైతులకు పగటి విద్యుత్ రైతులకు 7గంటల విద్యుత్‌ను పగలు సమయంలో మాత్రమే ఇస్తామన్నారు. ఒక వారం ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు, మరో వారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని తెలిపారు. ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’ ద్వారా కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం లేని శివారు ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఈపీడీసీఎల్ శ్రీకాకుళం డివిజన్ ఏడీ మధుకుమార్, లావేరు మండల సబ్ ఇంజినీర్ శంకరరావు, లైన్‌మన్ శ్రీను ఉన్నారు. ఏఈ సస్పెన్షన్ లావేరు విద్యుత్ ఏఈ డాంబికారావును విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సస్పెండ్ చేశామని శ్రీనివాసమూర్తి తెలిపారు. కొత్త ఏఈని త్వరలో నియమిస్తామని తెలిపారు. లావేరులో 15 గ్రామాలకు ఒక్కరే విద్యుత్ లైన్‌మన్ ఉన్న విషయాన్ని ప్రస్తావించగా సిబ్బందిని, త్వరలోనే నియమిస్తామన్నారు. -
మేలో ‘తయారీ’భేష్: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పనితీరును కనబరచిందని హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ ఏప్రిల్‌లో 51.3 పాయింట్ల వద్ద ఉంటే.. మేలో 52.6కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. దేశీయ డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణమని కూడా హెచ్ఎస్బీసీ వివరించింది. ముడి వస్తువుల ధరలు తీవ్రంగానే ఉన్నాయని, ఉపాధి కల్పన విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని నివేదిక పేర్కొంటూ... అయినా దేశీయ డిమాండ్ పటిష్టతతో తయారీ రంగం మేలో కొంత మెరుగుపడినట్లు తెలిపింది. హెచ్ఎస్బీసీ సూచీ కూర్పు ప్రకారం... ఇది 50 పాయింట్ల పైన ఉంటే.. సంబంధిత రంగం వృద్ధిలో ఉన్నట్లే భావించడం జరుగుతుంది. దిగువన ఉంటే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 19 నెలల నుంచీ వృద్ధి స్థాయిలోనే కొనసాగుతోంది.