మార్చిలో తయారీ రంగం స్పీడ్: నికాయ్ సూచీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో దూసుకుపోయినట్లు నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో 51.1 వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.4కు ఎగసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. బిజినెస్ ఆర్డర్లు భారీగా పెరగడం తయారీ రంగానికి ఊతం ఇచ్చినట్లు సర్వే పేర్కొంది. వరుసగా మూడు నెలలుగా తయారీ రంగం నికాయ్ సూచీ కీలక 50 పాయింట్ల పైన కొనసాగుతోంది. పాయింట్లు 50 పైన నమోదయితే... దానిని వృద్ధిగా 50 లోపు ఉంటే... క్షీణతగా పరిగణిస్తారు.