Indias manufacturing sector
-
మార్చిలో తయారీ రంగం స్పీడ్: నికాయ్ సూచీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో దూసుకుపోయినట్లు నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో 51.1 వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.4కు ఎగసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. బిజినెస్ ఆర్డర్లు భారీగా పెరగడం తయారీ రంగానికి ఊతం ఇచ్చినట్లు సర్వే పేర్కొంది. వరుసగా మూడు నెలలుగా తయారీ రంగం నికాయ్ సూచీ కీలక 50 పాయింట్ల పైన కొనసాగుతోంది. పాయింట్లు 50 పైన నమోదయితే... దానిని వృద్ధిగా 50 లోపు ఉంటే... క్షీణతగా పరిగణిస్తారు. -
జూన్లో తయారీ మందగమనం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం జూన్లో మందగమనంలో ఉన్నట్లు హెచ్ఎస్బీసీ సర్వే ఒకటి బుధవారం తెలిపింది. హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, మే నెలలో 52.6గా ఉన్న తయారీ రంగం పాయింట్లు 51.3కు పడిపోయాయి. గడచిన 10 వారాల్లో ఈ పాయింట్లు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కొత్తగా ఆర్డర్లు లేకపోవడం జూన్ ప్రతికూల పరిస్థితికి కారణమని డేటా విశ్లేషణా సంస్థ ‘మార్కిట్’- ఎకనమిస్ట్ పొలైనా డీ లిమా తెలిపారు. కాగా హెచ్ఎస్బీసీ పాయింట్లు 50% దిగువకు పడిపోతేనే అది క్షీణతగా భావించడం జరుగుతుంది. ఆ పైన పాయింట్లు వృద్ధి ధోరణికి ప్రతిబింబంగానే పరిగణించాల్సి ఉంటుంది. -
3 నెలల కనిష్టానికి తయారీ రంగం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వృద్ధి జనవరిలో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గినట్లు హెచ్ఎస్బీఐ మార్కెట్ సర్వే ఒకటి వెల్లడించింది. సోమవారం ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆర్డర్లు తగ్గడం దీనికి కారణమని సర్వే తెలిపింది. డిసెంబర్లో రెండేళ్ల గరిష్టాన్ని తాకిన ఈ పాయింట్లు మరుసటి నెలలోనే మూడు నెలల కనిష్టానికి తగ్గడం గమనార్హం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, తయారీ రంగానికి సంబంధించి సూచీ పాయింట్లు డిసెంబర్లో 54.5 వద్ద ఉండగా, ఇది 52.9కి పడిపోయింది. అయితే ఈ పాయింట్లు 50కి పైనుంటే వృద్ధికి సంకేతంగా, 50 దిగువకు పడిపోతే, క్షీణతకు చిహ్నంగా భావిస్తారు. ఫిబ్రవరి 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తాజా సర్వే వివరాలు విడుదల చేసింది.