జూన్‌లో తయారీ మందగమనం: హెచ్‌ఎస్‌బీసీ | Manufacturing growth shrinks in June on weak order inflows, shows HSBC survey | Sakshi
Sakshi News home page

జూన్‌లో తయారీ మందగమనం: హెచ్‌ఎస్‌బీసీ

Published Thu, Jul 2 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

జూన్‌లో తయారీ మందగమనం: హెచ్‌ఎస్‌బీసీ

జూన్‌లో తయారీ మందగమనం: హెచ్‌ఎస్‌బీసీ

న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం జూన్‌లో మందగమనంలో ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సర్వే ఒకటి బుధవారం తెలిపింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, మే నెలలో 52.6గా ఉన్న తయారీ రంగం పాయింట్లు 51.3కు పడిపోయాయి. గడచిన 10 వారాల్లో ఈ పాయింట్లు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కొత్తగా ఆర్డర్లు లేకపోవడం జూన్ ప్రతికూల పరిస్థితికి కారణమని డేటా విశ్లేషణా సంస్థ ‘మార్కిట్’- ఎకనమిస్ట్ పొలైనా డీ లిమా తెలిపారు.  కాగా హెచ్‌ఎస్‌బీసీ పాయింట్లు 50% దిగువకు పడిపోతేనే అది క్షీణతగా భావించడం జరుగుతుంది. ఆ పైన పాయింట్లు వృద్ధి ధోరణికి ప్రతిబింబంగానే పరిగణించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement