‘తయారీ, సేవలు’ భేష్
చైనాకన్నా భారత్ మెరుగంటూ హెచ్‌ఎస్‌బీసీ విశ్లేషణ
న్యూఢిల్లీ: గత నెలలో భారత్‌లో తయారీ, సేవల రంగాలు చైనాతో పోల్చిచూస్తే- మెరుగ్గా ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సర్వే పేర్కొంది. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే ఆర్థిక వృద్ధిలో సైతం భారత్ మెరుగ్గా ఉందని విశ్లేషించింది. దీని ప్రకారం...
- హెచ్‌ఎస్‌బీసీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ (ఈఎంఐ) నెలవారీ సూచీ మార్చిలో 51.5 పాయింట్లుండగా ఏప్రిల్‌లో 51.3 పాయింట్లకు తగ్గింది. జనవరి తరువాత ఇంత తక్కువ స్థాయి పాయింట్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
- తయారీ, సేవలు రెండు రంగాల పనితీరునూ ప్రతిబింబించే హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్ ఇండెక్స్ ఇండియాకు సంబంధించి ఏప్రిల్‌లో 52.5 పాయింట్లుగా ఉంది. చైనా (51.3), బ్రెజిల్ (44.2) రష్యా (50.8)లతో పోలిస్తే ఇది అధికం.