HSBC Survey
-
తరాలు మారినా.. మూలాలు మరవడం లేదు
HSBC survey: ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అంటూ ఎప్పుడో చెప్పారు రాయప్రోలు సుబ్బారావు. ఆ మహానీయుడి మాటలను ఇప్పుడు నిజం చేస్తున్నారు ప్రవాస భారతీయులు. విదేశాల్లో స్థిరపడినా ఇప్పటికీ భారతీయ మూలాలను మరచిపోవడం లేదు. విదేశాల్లోనే మూడో తరం ఎన్నారైలు వచ్చినా ఇప్పటికీ ఇక్కడి మట్టి పరిమళాలను గుర్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రవాస భారతీయులు వివిధ అంశాలపై ఏమనుకుంటున్నారనే విషయాలపై గ్లోబల్ పల్స్ రిపోర్టు పేరుతో ఇటీవల హెచ్ఎస్బీసీ సర్వే చేపట్టింది. వివిధ దేశాలకు చెందిన 4,152 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించింది. అందులో ఇప్పటికీ ప్రవాసులకు భరతమాత మీద ప్రేమ తగ్గలేదని తేటతెల్లం చేసింది. ఎన్నారైలు ఎక్కువగా వెలితిగా భావిస్తున్న అంశాలు - ఓవరాల్‌గా ఎన్నారైలలో 57 శాతం మంది ఫ్యామిలీ, 52 శాతం మంది ఫుడ్, 46 శాతం మంది స్నేహితులు, 36 శాతం మంది కల్చర్, 25 శాతం మంది ప్రాంతీయను మిస్ అవుతున్నామని తెలిపారు. నోరూరించే ఇండియన్ ఫుడ్‌కి సంబంధించి ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాలో సెటిలైన మొదటి తరానికి, అమెరికాలోనే పుట్టి అక్కడే చదువుతున్న మూడో తరం మధ్య అంతరం పెద్దగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియన్ ఫుడ్‌ను ఎక్కువగా మిస్ అవుతున్నామని మొదటి తరంలో 55 శాతం మంది అభిప్రాయపడగా రెండో తరంలో 51 శాతం మూడో తరానికి వచ్చే సరికి 42 శాతంగా ఉంది. ప్రవాసులు ఎక్కువగా కలిపి ఉంచుతున్న అంశాలు - ఈట్, ఇండియన్ ప్రత్యేక వంటకాలు 63 శాతం మంది - ఇండియన్ పండగలు, పేరంటాలు జరుపుకోవడం 52 శాతం - స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు సొమ్ము పంపడం - ఇండియాలో జరుగుతున్న సమాకాలీన అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవడం - తరచుగా ఇండియాకు వస్తుండటం విదేశాల్లో భారతీయులను బలంగా కలిపి ఉంచే అంశాలు క్రికెట్, స్పోర్ట్స్, సైన్స్, టెక్నాలజీ ఇలా వివిధ అంశాల్లో భారత్ సాధించే విజయాలు తమ మధ్య బంధాలను బలంగా మారుస్తున్నాయని 80 శాతం మంది ప్రవాసులు అభిప్రాయపడ్డారు. భారత విజయాల తర్వాత ఇండియాతో గల అనుబంధం అని 77 శాతం మంది భవిష్యత్తులో భారత్ సూపర్ పవర్ కావాలనే ఆకాంక్ష అని 68 శాతం మంది తెలిపారు. మనిషే అక్కడ.. మనసు ఇక్కడే విదేశాల్లో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ తాము ఇండియన్లనే అని నమ్మే ప్రవాస భారతీయుల్లో మొదటి తరం వారు 83 శాతం ఉండగా రెండో, మూడో తరం వ్యక్తులు 70 శాతం ఇదే తరహా భావనలో ఉంటున్నారు. ఇందులో మొదటి తరంలో రిటైర్ అయిన తర్వాత ఇండియాకు వచ్చేయాలని ఫీలవుతున్న వారు 40 శాతానికి పైగానే ఉన్నారు. వచ్చే మూడేళ్లలో ఇండియాలో పెట్టుబడులు పెడతారా ? 35 శాతం మంది తమ పెట్టుబడులను స్వల్పంగా పెంచుతామని చెప్పారు. ఆ తర్వాత 25 శాతం మంది భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. 24 శాతం మంది ప్రస్తుతం ఉన్న విధంగానే కంటిన్యూ అవుతామన్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే తమ పెట్టబడులు తగ్గిస్తామంటూ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు 80 శాతం మంది సుముఖత వ్యక్తం చేశారు. ఎన్విరాన్మెంట్పై ఆసక్తి తాము నివసిస్తున్న దేశం లేదా ఇండియాలో రాబోయే రెండేళ్లలో ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారని ప్రశ్నించగా 73 శాతం మంది ఎన్విరాన్మెంట్ , సోషల్ ఇన్షియేటివ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తామంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌కు ఎన్ఆర్ఐల నుంచి భారీ స్పందన -
ఉపాధికి సింగపూర్ బెస్ట్
కుటుంబ జీవనానికి స్వీడన్ ఉత్తమం హెచ్ఎస్బీసీ సర్వేలో వెల్లడి సింగపూర్: మాతృ దేశాన్ని వదిలి విదేశాల్లో నివసించేవారికి ఏ దేశం ఉత్తమం? కెరీర్ వృద్ధికి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనాలు, మెరుగైన జీవన ప్రమాణాల దృష్ట్యా సింగపూర్ అత్యుత్తమమని ఓ సర్వేలో వెల్లడైంది. 39 దేశాల్లో 21,950 మంది పరదేశీయులపై హెచ్ఎస్బీసీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. ఆర్థికం (పర్సనల్ ఫైనాన్సెస్, కెరీర్ వృద్ధి), అనుభవం (జీవనశైలి, భద్రత), కుటుంబం (సామాజిక జీవితం, విద్య, పిల్లల సంరక్షణ) వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు కేటాయించారు. హెచ్ఎస్బీసీ తరఫున ఈ ఏడాది మార్చి-మే మధ్యలో ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ YouGov ఈ సర్వే చేపట్టింది. ఓవరాల్‌గా సింగపూర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలువగా, భారత్ 17వ స్థానంలో నిలిచింది. ముఖ్యాంశాలు.. * ఆకర్షణీయమైన వేతనాలు, కెరీర్ పురోగతి వంటి ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 77 శాతం మంది ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశారు. కెరీర్ వృద్ధికి ఈ దేశం సరైన గమ్యస్థానం అని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఓవరాల్‌గా మాత్రం ఈ దేశం పదో స్థానంలో ఉంది. * ఆరోగ్యం, మెరుగైన జీవనానికి న్యూజిలాండ్ ఉత్తమమని తేలింది. ప్రతి పదిమందిలో ఎనిమిది మం ది తమ మాతదేశం కంటే ఇక్కడే మెరుగైన జీవితం గడుపుతున్నట్లు చెప్పారు. వేగంగా స్థిరపడడానికి కూడా ఈ దేశం బెస్ట్ చాయిస్ అని కితాబిస్తున్నారు. * కుటుంబ జీవనానికి మాత్రం స్వీడన్‌కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పిల్లల సంరక్షణ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు విద్యావకాశాలు సులభంగా ఉండడం, అదీ భరించగలిగే స్థాయిలో ఉండడంతో ఎక్కువ మంది ఈ దేశం పట్ల మొగ్గు చూపుతున్నారు. మాతృదేశం వదిలి ఇక్కడకు రావడం వల్ల పిల్లల జీవన స్థాయి పెరిగినట్లు 79 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. * మెరుగైన జీవితం, ఒక కొత్త సవాల్‌గా తీసుకోవాలని ఎక్కువ మంది మాతృదేశం వదిలి విదేశాలకు వెళ్తున్నారు. 37 శాతం మంది ఈ కారణాలు చెప్పగా, 28 శాతం మంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకొనేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. * ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, సంస్కృతి, వాణిజ్య వాతావరణం తదితర అంశాల దృష్ట్యా విదేశీయులు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి లండన్, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు ఉత్తమమని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సింగపూర్ ఎందుకు? సింగపూర్‌లో నివసిస్తున్న విదేశీయుల్లో 28 శాతం మంది ఏడాదికి 2లక్షల డాలర్లకు (సుమారు రూ.1.32 కోట్లు)పైగా సంపాదిస్తున్నారు. కెరీర్ పురోగతికి ఇది సరైన స్థానమని 59 శాతం మంది అభిప్రాయపడగా, 79 శాతం మంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశారు. తమ మాతదేశం కంటే ఇక్కడే మెరుగైన జీవితం గడుపుతున్నట్లు 65 శాతం మంది చెప్పారు. -
జూన్‌లో తయారీ మందగమనం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం జూన్‌లో మందగమనంలో ఉన్నట్లు హెచ్ఎస్బీసీ సర్వే ఒకటి బుధవారం తెలిపింది. హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, మే నెలలో 52.6గా ఉన్న తయారీ రంగం పాయింట్లు 51.3కు పడిపోయాయి. గడచిన 10 వారాల్లో ఈ పాయింట్లు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కొత్తగా ఆర్డర్లు లేకపోవడం జూన్ ప్రతికూల పరిస్థితికి కారణమని డేటా విశ్లేషణా సంస్థ ‘మార్కిట్’- ఎకనమిస్ట్ పొలైనా డీ లిమా తెలిపారు. కాగా హెచ్ఎస్బీసీ పాయింట్లు 50% దిగువకు పడిపోతేనే అది క్షీణతగా భావించడం జరుగుతుంది. ఆ పైన పాయింట్లు వృద్ధి ధోరణికి ప్రతిబింబంగానే పరిగణించాల్సి ఉంటుంది. -
‘తయారీ, సేవలు’ భేష్
చైనాకన్నా భారత్ మెరుగంటూ హెచ్ఎస్బీసీ విశ్లేషణ న్యూఢిల్లీ: గత నెలలో భారత్‌లో తయారీ, సేవల రంగాలు చైనాతో పోల్చిచూస్తే- మెరుగ్గా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ సర్వే పేర్కొంది. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే ఆర్థిక వృద్ధిలో సైతం భారత్ మెరుగ్గా ఉందని విశ్లేషించింది. దీని ప్రకారం... - హెచ్ఎస్బీసీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ (ఈఎంఐ) నెలవారీ సూచీ మార్చిలో 51.5 పాయింట్లుండగా ఏప్రిల్‌లో 51.3 పాయింట్లకు తగ్గింది. జనవరి తరువాత ఇంత తక్కువ స్థాయి పాయింట్లు నమోదు కావడం ఇదే తొలిసారి. - తయారీ, సేవలు రెండు రంగాల పనితీరునూ ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ కాంపోజిట్ ఇండెక్స్ ఇండియాకు సంబంధించి ఏప్రిల్‌లో 52.5 పాయింట్లుగా ఉంది. చైనా (51.3), బ్రెజిల్ (44.2) రష్యా (50.8)లతో పోలిస్తే ఇది అధికం. -
కోలుకోని సేవల రంగం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత సేవల రంగం ఇంకా కోలుకోలేదు. హెచ్ఎస్బీసీ మార్కెట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి సూచీ 47.1గా నమోదయ్యింది. సెప్టెంబర్‌తో (44.6) పోల్చితే ఇది స్వల్పంగా మెరుగుపడింది. అయితే సూచీ 50 పాయింట్ల లోపు ఉంటే దీనిని క్షీణ దశగానే పరిగణించడం జరుగుతుంది. సెప్టెంబర్ పాయింట్లు నాలుగున్నర నెలల కనిష్టస్థాయి. ఆర్థిక అస్థిరతే సేవల రంగం మెరుగుపడకపోవడానికి కారణమని హెచ్ఎస్బీసీ సర్వే తెలిపింది. వ్యయాల విషయంలో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సర్వే తెలిపింది. కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డాలర్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి ప్రారంభించిన ప్రత్యేక విండోకు రిజర్వ్ బ్యాంక్ తెరదించాల్సిన సమయం ఆసన్నమయినట్లు ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణా సంస్థ- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. రూపాయిపై మార్కెట్ అంచనాలు మెరుగుపడ్డమే తన విశ్లేషణకు కారణమని వెల్లడించింది.