కోలుకోని సేవల రంగం: హెచ్‌ఎస్‌బీసీ
న్యూఢిల్లీ: భారత సేవల రంగం ఇంకా కోలుకోలేదు. హెచ్‌ఎస్‌బీసీ మార్కెట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి సూచీ 47.1గా నమోదయ్యింది. సెప్టెంబర్‌తో (44.6) పోల్చితే ఇది స్వల్పంగా మెరుగుపడింది. అయితే సూచీ 50 పాయింట్ల లోపు ఉంటే దీనిని క్షీణ దశగానే పరిగణించడం జరుగుతుంది.
సెప్టెంబర్ పాయింట్లు నాలుగున్నర నెలల కనిష్టస్థాయి. ఆర్థిక అస్థిరతే సేవల రంగం మెరుగుపడకపోవడానికి కారణమని హెచ్‌ఎస్‌బీసీ సర్వే తెలిపింది. వ్యయాల విషయంలో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సర్వే తెలిపింది. కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డాలర్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి ప్రారంభించిన ప్రత్యేక విండోకు రిజర్వ్ బ్యాంక్ తెరదించాల్సిన సమయం ఆసన్నమయినట్లు ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణా సంస్థ- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. రూపాయిపై మార్కెట్ అంచనాలు మెరుగుపడ్డమే తన విశ్లేషణకు కారణమని వెల్లడించింది.