
న్యూఢిల్లీ:ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తన పార్టీ కాంగ్రెస్‌ను మరోసారి ఇరకాటంలో పెట్టారు. పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని శామ్ పిట్రోడా అన్నారు. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.
భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు.
చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.
గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment