nikay India
-
స్థూల ఆర్థిక గణాంకాలతోనే దిశా నిర్దేశం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముడిచమురు, రూపాయి కదలికల ఆధారంగా నూతన ఏడాది మొదటివారం ట్రెండ్ ఆధారపడి ఉందని చెబుతున్నారు. ‘భూగోళ రాజకీయ అంశాలు, అధిక స్థాయిల వద్ద కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య యుద్ధాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లలో నెగటివ్ సెంటిమెంట్ అధికంగా ఉండేందుకు ఆస్కారం ఉంది.’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. మరోవైపు ముడిచమురు ధరల్లో కన్సాలిడేషన్ చోటుచేసుకోవడం, డాలరుతో రూపాయి బలపడడంతో పాటు స్థూల గణాంకాల ఆధారంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొనవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. వచ్చే ఏడాది రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు మార్కెట్ దిశకు మరింత స్పష్టత ఇవ్వనున్నాయని వివరించారు. నికాయ్ గణాంకాల వెల్లడి.. ఎనిమిది కీలక రంగాల వృద్ధిరేటుకు సంబంధించిన సమాచారం ఈ వారంలోనే వెల్లడికానుండగా.. నవంబర్ నెల దేశీ మౌళిక సదుపాయాల నిర్మాణ సమాచారాన్ని ప్రభుత్వం సోమవారం వెల్లడించనుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరంగ్ పర్చేరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) బుధవారం, నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈవారంలోనే ఆటోమొబైల్ కంపెనీలు తమ డిసెంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల డేటాను ప్రకటించనున్నాయి. ఎన్బీఎఫ్సీల్లో నెలకొన్న ద్రవ్య లభ్యత కొరత ఈసారి ఆటో డేటాపై ఉత్కంఠ నింపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓలా, ఉబెర్ వంటి ఆటో అగ్రిగేటర్ సంస్థల మద్దతుతో వాల్యూమ్స్ నిలబడే అవకాశం ఉందనే ఆశాభావం ఉన్నట్లు వ్యక్తంచేశారు. ఇక అంతర్జాతీయ గణాంకాల పరంగా చూస్తే.. అమెరికా, చైనా దేశాల డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ మొత్తం సమాచారాల ఆధారంగానే మార్కెట్ కదలికలు ఈవారంలో ఉండనున్నట్లు వినోద్ నాయర్ అన్నారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.5,477 కోట్లు ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా డిసెంబర్ 3–28 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ)లు రూ.5,477 కోట్లను దేశీ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,900 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.3,577 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తేలింది. 71–72 శ్రేణిలో రూపాయి.. గడిచిన వారంలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 52.20 డాలర్లకు పతనం కాగా, యూఎస్ క్రూడ్ 45.12 డాలర్లకు పడిపోయి.. వరుసగా మూడవ వారంలోనూ పతనాన్ని నమోదుచేశాయి. అక్టోబర్ గరిష్టస్థాయిల నుంచి 39 శాతం, ఏడాది ప్రాతిపదికన 17 శాతం పడిపోయాయి. ఉత్పత్తిలో కోత కారణంగా బ్రెంట్ ధర 50 డాలర్ల సమీపంలో బోటమ్ కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు డబ్ల్యూటీఐ ధర మరింత పతనమైతే యూఏఈ, రష్యాలు అత్యవసర సమావేశానికి పిలుపునివ్వగా.. ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆనంద్ రాఠీ కమోడిటీస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ హెచ్ రవీంద్ర వీ రావు విశ్లేషించారు. ఇక గతవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.93 వద్దకు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్ బలపడటం వంటి సానుకూల అంశాలతో రూపాయి విలువ బలపడింది. దిగుమతిదారులు అన్హెడ్జ్ పొజిషన్లను కవర్చేసుకోవడం కోసం వచ్చే కొద్ది సెషన్లలో క్యూ కట్టవచ్చని ఈకారణంగా రానున్న సెషన్లలో రూపాయి 71–72 స్థాయిలో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఆగస్టులో తయారీ రంగం పరుగు
న్యూఢిల్లీ: తయారీ రంగం ఆగస్టులో మంచి పనితీ రును కనబరిచింది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 52.6 పారుుంట్లకు ఎగసింది. గడిచిన 13 నెలల్లో ఈ స్థారుు పారుుంట్ల నమోదు కావటం ఇదే తొలిసారి. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరుగుదల, కొనుగోళ్లు పెరగడం వంటి పలు అంశాలు తయారీ రంగం పురోగతికి కారణమని పీఎంఐ సర్వే తెలిపింది. కాగా జూలైలో ఈ పారుుంట్లు 51.8. సూచీ 50 పారుుంట్ల ఎగువనే నమోదరుుతే దానిని విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పారుుంట్లు పడిపోతే దానిని క్షీణతగా పరిగణిస్తారు. -
మేలో సేవలు, తయారీ పేలవం..
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 70 శాతం వాటా కలిగిన సేవలు, తయారీ రంగాలు మే నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్ సూచీలు పేర్కొంటున్నాయి. కొత్త ఆర్డర్లు లేకపోవడం దీనికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. జూన్ 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి సమీక్ష నేపథ్యంలో వెలువడిన ఈ సూచీ అంశాలు... రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు ప్రస్తుతం 6.5 శాతం) కోత అవసరాన్ని సూచిస్తున్నట్లు కూడా ఆ వర్గాల అభిప్రాయం. సూచీలను చూస్తే.. నికాయ్/మార్కిట్ సేవల బిజినెస్ యాక్టివిటీ: సేవల రంగం క్రియాశీలతను సూచించే ఈ సూచీ ఏప్రిల్‌లో 53.7 పాయింట్ల వద్ద ఉండగా, మేలో 51 పాయింట్లకు పడింది. నవంబర్ తరువాత ఈ సూచీ ఈ స్థాయికి దిగడం ఇదే తొలిసారి. నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ: తయారీ, సేవల రంగాలు రెండింటినీ సూచించే ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 52.8 పాయింట్ల వద్ద ఉండగా, మేలో 50.9 పాయింట్లకు పడింది. తాజా సూచీలు దేశ ఆర్థిక రికవరీ అంచనాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నట్లు సర్వేను రూపొందించిన మార్కిట్ ఆర్థికవేత్త పోలానా డీ లిమా అన్నారు. -
ఏప్రిల్ లో ప్రైవేటు రంగం పేలవం..
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ పేర్కొంది. భారత్ తయారీ, సేవల రంగాలకు సంబంధించిన సూచీ మార్చిలో 37 నెలల గరిష్ట స్థాయిలో 54.3 పాయింట్ల వద్ద ఉంటే... ఏప్రిల్‌లో 52.8 పాయింట్లకు పడింది. కొత్త వ్యాపారాల విస్తరణ జాప్యం, సేవలు, తయారీ రంగాల్లో మందగమనం వంటి అంశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గింపునకు ఇది తగిన సమయమని కూడా పేర్కొంది. ఒక్క తయారీ రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఇప్పటికే పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్‌లో 50.5కి పడింది. కొత్త ఆర్డర్లు పెద్దగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దాన్ని వృద్ధిగా పరిగణిస్తారు. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. -
మార్చిలో తయారీ రంగం స్పీడ్: నికాయ్ సూచీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో దూసుకుపోయినట్లు నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో 51.1 వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.4కు ఎగసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. బిజినెస్ ఆర్డర్లు భారీగా పెరగడం తయారీ రంగానికి ఊతం ఇచ్చినట్లు సర్వే పేర్కొంది. వరుసగా మూడు నెలలుగా తయారీ రంగం నికాయ్ సూచీ కీలక 50 పాయింట్ల పైన కొనసాగుతోంది. పాయింట్లు 50 పైన నమోదయితే... దానిని వృద్ధిగా 50 లోపు ఉంటే... క్షీణతగా పరిగణిస్తారు.