ఆగస్టులో తయారీ రంగం పరుగు
న్యూఢిల్లీ: తయారీ రంగం ఆగస్టులో మంచి పనితీ రును కనబరిచింది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 52.6 పారుుంట్లకు ఎగసింది. గడిచిన 13 నెలల్లో ఈ స్థారుు పారుుంట్ల నమోదు కావటం ఇదే తొలిసారి. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరుగుదల, కొనుగోళ్లు పెరగడం వంటి పలు అంశాలు తయారీ రంగం పురోగతికి కారణమని పీఎంఐ సర్వే తెలిపింది. కాగా జూలైలో ఈ పారుుంట్లు 51.8. సూచీ 50 పారుుంట్ల ఎగువనే నమోదరుుతే దానిని విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పారుుంట్లు పడిపోతే దానిని క్షీణతగా పరిగణిస్తారు.