హైదరాబాద్: నగరంలో పహడీ షరీఫ్ పరిధిలోని గుట్కా తయారీ కేంద్రాలపై దాడి చేశారు. షహీన్ నగర్ లో సోదాలు నిర్వహించి గుట్కా తయారీకి ఉపయోగించే రసాయన, పొగాకు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తయారీలో పాల్గొన్న పలువురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.