పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ గుట్కాల తయారీ కేంద్రంపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. గుట్కాల తయారీపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ...స్థానిక బస్టాండ్ సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా గుట్కాల తయారీ కొనసాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ జె.వెంకట్రావ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రూ.10 లక్షల విలువైన ముడి సరుకులను స్వాధీనం చేసుకోవడంతోపాటు తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అందులో ఆరు మెషిన్లు కూడా ఉన్నాయి. ఇద్దరు యజమానుల్లో, కర్పూర వాసు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.