
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం సెప్టెంబర్‌లో నెమ్మదించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 57.5కు పడింది. అంతక్రితం ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి.
అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ స్థాయి దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పేర్కొంటారు. ఈ ప్రాతిపదికన సూచీ 27 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment