దేశీయంగా సెప్టెంబర్‌లో పది నెలల కనిష్టానికి పడిపోయిన సేవల విభాగం సూచీ (పీఎంఐ) అక్టోబర్‌లో తిరిగి కోలుకుంది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 58.5కి మెరుగుపడింది. డిమాండ్ పటిష్టంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు రావడం, సర్వీసులు పెరగడం, ఫలితంగా ఉపాధి కల్పనకు ఊతం లభించడం మొదలైనవి దీనికి తోడ్పడ్డాయి.
తయారీ, సేవల రంగం పనితీరుకు పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌ను (పీఎంఐ) కొలమానంగా పరిగణిస్తారు. వివిధ కంపెనీలవ్యాప్తంగా కొత్త ఆర్డర్లు, నిల్వల స్థాయులు, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన తదితర అంశాల్లో పర్చేజింగ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వే ఆధారంగా దీని స్కోరు ఉంటుంది. సాధారణంగా ఇది 50కి పైన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. ‘భారత సర్వీసెస్ పీఎంఐ సెప్టెంబర్ నాటి పది నెలల కనిష్ట స్థాయి నుంచి అక్టోబర్‌లో 58.5 స్థాయికి మెరుగుపడింది. ఉత్పత్తి, డిమాండ్‌తో పాటు ఉద్యోగాల కల్పన విషయంలోనూ భారతీయ సర్వీసుల రంగం గణనీయంగా మెరుగుపడింది’ అని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.
ఇదీ చదవండి: రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment