PMI statistics
-
వృద్ధి బాటలో సేవల రంగం..
దేశీయంగా సెప్టెంబర్‌లో పది నెలల కనిష్టానికి పడిపోయిన సేవల విభాగం సూచీ (పీఎంఐ) అక్టోబర్‌లో తిరిగి కోలుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 58.5కి మెరుగుపడింది. డిమాండ్ పటిష్టంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు రావడం, సర్వీసులు పెరగడం, ఫలితంగా ఉపాధి కల్పనకు ఊతం లభించడం మొదలైనవి దీనికి తోడ్పడ్డాయి.తయారీ, సేవల రంగం పనితీరుకు పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌ను (పీఎంఐ) కొలమానంగా పరిగణిస్తారు. వివిధ కంపెనీలవ్యాప్తంగా కొత్త ఆర్డర్లు, నిల్వల స్థాయులు, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన తదితర అంశాల్లో పర్చేజింగ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వే ఆధారంగా దీని స్కోరు ఉంటుంది. సాధారణంగా ఇది 50కి పైన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. ‘భారత సర్వీసెస్ పీఎంఐ సెప్టెంబర్ నాటి పది నెలల కనిష్ట స్థాయి నుంచి అక్టోబర్‌లో 58.5 స్థాయికి మెరుగుపడింది. ఉత్పత్తి, డిమాండ్‌తో పాటు ఉద్యోగాల కల్పన విషయంలోనూ భారతీయ సర్వీసుల రంగం గణనీయంగా మెరుగుపడింది’ అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.ఇదీ చదవండి: రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ -
జీడీపీ గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. గురువారం నవంబర్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్ పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. ఇతర అంశాలూ కీలకమే.. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు. నవంబర్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్ జీడీపీ, యూఎస్ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. వడ్డీ రేట్ల ప్రభావం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు. యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు. -
ద్రవ్యోల్బణ సవాళ్లలోనూ జోరుమీదున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో తయారీ రంగం దూసుకుపోయింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. ఉత్పత్తి, ఫ్యాక్టరీ ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాల్లో పురోగతి వంటి అంశాలు సమీక్షా నెల ఏప్రిల్‌లో సూచీ స్పీడ్‌కు కారణమయ్యింది. కరోనా సంబంధ పరిమితులు, ఆంక్షలు సడలింపు కూడీ సూచీ పురోగతికి దోహదపడింది. సూచీ 50 పైనుంటే వృద్ధి సంకేతంగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సానుకూలత కనబడుతోంది... భారతీయ తయారీ సూచీ ఏప్రిల్‌లో సానుకూలంగా ఉందని ఎస్అండ్పీ గ్లోబల్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియన్నా డి లిమా పేర్కొన్నారు. కర్మాగారాల ఉత్పత్తి వేగం పెరిగిందని తెలిపారు. అమ్మకాలు, ముడి పదార్థాల కొనుగోలులో కొనసాగుతున్న పెరుగుదల వృద్ధిని సూచిస్తోందని, సమీప కాలంలో నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని ఆమె అన్నారు. గణాంకాల ప్రకారం, ఎగుమతుల ఆర్డర్లు కూడా పుంజుకున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయి. కమోడిటీ ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. కాగా, ఉపాధి అవకాశాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. వ్యాపార విశ్వాస కొంత మెరుగుపడింది. అయితే ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ పుంజుకుంటాయని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతుండగా, అవుట్‌లుక్‌ను ఊహించడం ఇంకా కష్టంగానే ఉందని మరికొన్ని సంస్థలు భావిస్తుండడం గమనార్హం. -
గణాంకాలు కీలకం
స్టాక్ మార్కెట్‌పై కొత్త ఏడాది తొలి వారంలో తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, వీటితో పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా ఇన్వెస్టర్లు గమనిస్తారని నిపుణులంటున్నారు. రేపు ‘తయారీ’ పీఎంఐ గణాంకాలు రేపు(ఈ నెల 2 మంగళవారం) మార్కెట్ ఎకనామిక్స్ సంంస్థ భారత తయారీ రంగానికి సంబంధించి గత నెల పీఎంఐ గణాంకాలను విడుదల చేస్తుంది. అక్టోబర్‌లో 50.3గా ఉన్న ఈ పీఎంఐ గత ఏడాది నవంబర్‌లో 52.6కు పెరిగింది. ఈ నెల 4వ తేదీ(గురువారం) మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ భారత సేవల రంగానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ పీఎంఐ గణాంకాలను ఉదయం గం.10.30కు వెల్లడిస్తుంది. గత ఏడాది అక్టోబర్‌లో 51.7గా ఉన్న ఈ పీఎంఐ గత ఏడాది నవంబర్‌లో 48.5కు తగ్గింది. వేల్యూయేషన్లు కొనసాగుతాయ్..! ముడిచమురు ధరల గమనం స్టాక్ సూచీలపై ప్రభావం చూపుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. స్టాక్‌మార్కెట్ సానుకూల ఫండమెంటల్స్ కారణంగా వేల్యూయేషన్లు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. కంపెనీల ఎర్నింగ్స్ ఏమైనా వృద్ధి చెందుతాయోమోనన్న ఆశతో ఇన్వెస్టర్లు క్యూ3 ఫలితాల కోసం చూస్తున్నారని తెలిపారు. రానున్న కేంద్ర బడ్జెట్, ప్రభుత్వ సంస్కరణలు.. రంగాల వారీ షేర్ల వైపు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తాయని వివరించారు. కంపెనీల ఉత్పత్తి సామర్థ్య పెంపు యత్నాలు, మూలధన పెట్టుబడుల్లో రికవరీ పుంజుకుంటే,... మార్కెట్ ముందుకే సాగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి కంపెనీల క్యూ3 ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ చెప్పారు. ఇక అందరి కళ్లు బడ్జెట్‌పై ఉంటాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకే ఈ బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంచనాలున్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈఓ అరుణ్ తుక్రల్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అశాంతిని తొలగించే మంచి అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అంతర్జాతీయ పరంగా చూస్తే, చైనా, యూరోజోన్, అమెరికా తయారీ రంగ గణాంకాలు రేపు(మంగళవారం, జనవరి 2న) వస్తాయి. ఈ ప్రాంతాల సేవల రంగ గణాంకాలు గురువారం(జనవరి 4న) వస్తాయి. డిసెంబర్లో జరిగిన ఫెడ్ మినట్స్ బుధవారం(ఈ నెల 3న) వస్తాయి. కాగా గత ఏడాది సెన్సెక్స్ 28 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 శాతం చొప్పున లాభపడ్డాయి. గత మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కు ఇదే మంచి పనితీరు. విదేశీ ఈక్విటీ పెట్టుబడులు రూ.51 వేల కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) గత నెలలో రూ.5,883 కోట్ల విలువైన పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. రూ.2,350 కోట్ల మేర డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని నిపుణులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది(2017)లో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.51,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ఏడాది ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్విడిటీ తగ్గుతుండటం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు. -
ఒడిదుడుకుల వారం
♦ ఆగస్టు సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈ వారంలోనే ♦ క్యూ1 జీడీపీ గణాంకాలపై మార్కెట్ దృష్టి ♦ నీలేకని రీఎంట్రీతో అందరి చూçపూ ఇన్ఫోసిస్‌పైనే ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనుండటం, జీడీపీ, పీఎంఐ గణాంకాలు వెలువడుతున్నందున స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని వారంటున్నారు. వీటికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ప్రపంచ స్టాక్‌మార్కెట్ల పోకడ.. తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్(క్యూ1) జీడీపీ గణాంకాలను ఈ నెల 31న(గురువారం–ఇదే రోజు ఆగస్టు సిరీస్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు కూడా ముగుస్తాయి)మార్కెట్ ముగిసిన తర్వాత ప్రభుత్వం వెల్లడిస్తుంది. మార్కెట్ దృష్టి ఈ గణాంకాలపైన ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(పీసీజీ) టీనా వీర్మాణి చెప్పారు. కొత్త సీఈఓ ఎంపిక విషయమై ఇన్ఫోసిస్ యాజమాన్యం తీసుకునే చర్యలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని వివరించారు. ఇక శుక్రవారం (వచ్చే నెల 1న) తయారీ రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వస్తాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల అధినేతల(జాక్సన్ హోల్) సమావేశ ఫలితాలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. కాగా ఎలాంటి తాజా ట్రిగ్గర్లు లేనందున మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గత క్వార్టర్లో మంచి ఫలితాలు సాధించిన రంగాలు, కంపెనీలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్‌గా మళ్లీ నందన్ నీలేకని పగ్గాలు చేపట్టడంతో ఇన్ఫీపై అందరి చూపూ ఉంటుందని వివరించారు. రూ.12వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి... మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రెండో వారం కూడా కొనసాగింది. తయారీ, సేవా రంగాలు మందగించడం, ఈ క్యూ1లో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ నుంచి రూ.12,626 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే డెట్ మార్కెట్లో మాత్రం రూ.13,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. -
క్యూ4 ఫలితాలతో ట్రెండ్..
* ఈ వారం మార్కెట్‌పై అంచనాలు * చమురు, రూపాయి కదలికలూ కీలకమే * ఏప్రిల్ పీఎంఐ గణాంకాలు ఈ వారమే న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ, టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్తో పాటు ఇతర బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక పలితాలు, ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. దీంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పోకడలు కూడా కీలకమని వారంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు ఇవన్నీ స్టాక్ మార్కెట్ తీరుపై ప్రభావం చూపుతాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు వెల్లడించనున్నందున వాహన షేర్లపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. ఈ వారంలో వెల్లడయ్యే సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయి. మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ ఏప్రిల్ నెలకు సంబంధించి భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాలను సోమవారం(మే 2న)న వెల్లడిస్తుంది. ఇక నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం( మే 4న) వెల్లడవుతాయి. పెరుగుదల అవకాశాలు స్వల్పమే... మార్కెట్ కరెక్షన్ దిశలో ఉందని సామ్కో సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేవని, ఈ విషయం ఇప్పటికే డిస్కౌంట్ అయిందని, అందుకని మార్కెట్ పెరుగుదలకు స్వల్పంగా మాత్రమే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అందరి కళ్లు రాజకీయ పరిస్థితులపైననే, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల ఫలితాలపైనే ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఇటీవల వచ్చిన ర్యాలీ అనంతరం మార్కెట్ కన్సాలిడేషన్ దశలో ఉందని వివరించారు. రానున్న కంపెనీల ఆర్థిక ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వివరించారు. విదేశీ పెట్టుబడుల జోరు... భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలు, ప్రోత్సాహకరంగా ఉన్న ఆర్థిక గణాంకాలు, ఆర్బీఐ రేట్ల కోత కారణంగా ఏప్రిల్ నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 220కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో ఈక్విటీ మార్కెట్లో రూ.8,416 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,418 కోట్లు... మొత్తం రూ.14,834 కోట్లు పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇది వరుసగా రెండో నెల. మార్చిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.19,967 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందటి నాలుగు నెలల్లో (గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ) విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్లు నికర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12,911 కోట్లు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా, రూ.939 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా భారత్‌లో రూ. 11,971 కోట్లకు పెట్టుబడులు పెట్టారు.