ఎగుమతులకు అపార అవకాశాలు
పదేళ్లలో 138 బిలియన్ డాలర్లు
బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీకి భారత్ కేంద్రంగా అవతరించగలదని.. వచ్చే పదేళ్ల కాలంలో (2032 నాటికి) 138 బిలియన్ డాలర్ల విలువైన (రూ.11.45 లక్షల కోట్లు) ఎగుమతులకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డిఫెన్స్ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీలు, సరీ్వసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. రక్షణ ఉత్పత్తుల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు అపారమైన అవకాశాలు రానున్నాయని అంచనా వేసింది.
‘ఇండియా డిఫెన్స్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. రక్షణ రంగంపై భారత్ మూలధన వ్యయాలు 2029–30 నాటి బడ్జెట్‌లో 37 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. 2024–25 బడ్జెట్‌లో 29 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా పెరగనున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే 2024 నుంచి 2030 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం రూ.15.5 లక్షల కోట్లను భారత్ రక్షణ రంగంపై వెచ్చించనున్నట్టు అంచనా వేసింది. గతంతో పోలి్చచూస్తే ఇది పెద్ద మొత్తమేనని గుర్తు చేసింది. ‘‘సానుకూల విధానాలు, సంస్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి, దేశీ తయారీకి ప్రోత్సాహం రూపంలో రక్షణ రంగానికి భారత ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలుకుతోంది’’అని వివరించింది.
హెచ్‌ఏల్, బీఈఎల్‌కు ఆర్డర్లు
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు గొప్ప అవకాశాలు రానున్నాయని ఈ నివేదిక అంచనా వేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో కంపెనీకి ఉన్న బలమైన సామర్థ్యాలను ప్రస్తావించింది. రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్)కు సైతం బలమైన ఆర్డర్లకు అవకాశాలున్నాయని, దీంతో కంపెనీ మార్జిన్లు, రాబడుల రేషియోలు పెరుగుతాయని నోమురా తన నివేదికలో పేర్కొంది.
వివిధ రూపాల్లో భారత్ సర్కారు అందిస్తున్న తోడ్పాటుతో ఈ రంగంలోని కంపెనీలకు సానుకూల వాతావరణం నెలకొన్నట్టు తెలిపింది. ఎగుమతులు టెక్నాలజీ బదిలీ, సహకారం రూపంలో భారత రక్షణ పరిశ్రమ అంతర్జాతీయంగా తన స్థానాన్ని విస్తరించుకుంటున్నట్టు వివరించింది. దీంతో రక్షణ తయారీ, టెక్నాలజీ అభివృద్ధి సామర్థ్యాలున్న కంపెనీలు ఎగుమతుల అవకాశాలను పెద్ద ఎత్తున సొంతం చేసుకోగలవని అంచనా వేసింది. తద్వారా అవి తమ ఆదాయ వనరులను వైవిధ్యం చేసుకోగవలని వివరించింది.
లాభదాయక అవకాశాలు
రక్షణ రంగంలో ఎన్నో విభాగాలు లాభదాయక అవకాశాలను ఆఫర్ చేస్తున్నాయని నోమురా నివేదిక తెలిపింది. డిఫెన్స్ ఏరోస్పేస్ విభాగం ఒక్క దాని విలువే 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతూ.. ఎయిర్‌క్రాఫ్ట్, హెలీకాప్టర్లు, యూఏవీలు, ఏవియానిక్స్, అనుబంధ వ్యవస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను గుర్తు చేసింది. షిప్ బిల్డింగ్ సైతం భారీ అవకాశాలు కల్పిస్తోందని, సముద్ర తీర రక్షణ కోసం నేవల్ వెస్సెల్స్, సబ్‌మెరైన్‌లు, పెట్రోల్ బోట్లకు సంబంధించి 38 బిలియన్ డాలర్ల తయారీ అవకాశాలను ప్రస్తావించింది. మిసైళ్లు, ఆరి్టలరీ గన్ వ్యవస్థలపై పెట్టుబడులు 21 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నోమురా నివేదిక అంచనా వేసింది. తన ఆరి్టలరీ, మిసైల్ సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment