న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై భారత్, సౌదీ అరేబియా దృష్టి పెడుతున్నాయి. రెండు రోజుల సౌదీ పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్, ఆ దేశ మంత్రులతో ఈ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్షియేటివ్ కార్యక్రమంలో పాల్గొంటారని, పలువురు అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లతో కూడా భేటీ అవుతారని వివరించింది.
వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఇండియా–సౌదీ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్íÙప్ కౌన్సిల్ కింద ఎకానమీ–ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ రెండో సమావేశానికి కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. సౌదీ అరేబియాకు భారత్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్‌కు సౌదీ అరేబియా నాలుగో అతి పెద్ద భాగస్వామి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 43 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎల్‌అండ్‌టీ, టాటా, విప్రో తదితర దిగ్గజ భారతీయ కంపెనీలు సౌదీ అరేబియాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ అరేబియా 3.22 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment