
స్టార్టప్ ఎనర్జీ పేరుతో సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థ ఏర్పాటు
చైనా కంపెనీ జిన్‌చెన్‌తో జట్టు
న్యూఢిల్లీ: దేశీ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలోకి ప్రవేశించింది. సోలార్ ప్యానెళ్ల తయారీ కోసం స్టార్టప్ ఎనర్జీ పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. నివాస గృహాలు, కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సోలార్ ప్యానెళ్లను తయారు చేయడంపై ఇది దృష్టి పెడుతుందని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు.
అధునాతన ఆటోమేషన్ సామర్థ్యాలతో స్టార్టప్ ఎనర్జీ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం చైనాకు చెందిన జిన్‌చెన్ సంస్థతో వ్యూహాత్మక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. దీని కింద 5 గిగావాట్ల అధునాతన సోలార్ మాడ్యూల్స్ తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త తరం సోలార్ సొల్యూషన్స్‌పై పరిశోధనలు, అభివృద్ధి కోసం స్టార్టప్ ఎనర్జీ వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment