Micromax
-
స్టోరేజ్ చిప్సెట్స్ తయారీలోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న మైక్రోమ్యాక్స్, తైవాన్‌కు చెందిన స్టోరేజ్ చిప్ కంపెనీ ఫీజన్ తాజాగా మిఫీ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేశాయి. ఈ జేవీ కృత్రిమ మేధస్సుతో (ఏఐ) కూడిన స్టోరేజ్ చిప్సెట్ మాడ్యూళ్లను రూపొందించి, తయారు చేస్తుంది. నోయిడా ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభించామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ కో–పౌండర్ రాహుల్ శర్మ గురువారం తెలిపారు. ‘ఎన్ఏఎన్డీ కంట్రోలర్, ఎన్ఏఎన్డీ స్టోరేజ్ టెక్నాలజీలలో ఫీజన్ అగ్రగామిగా ఉంది. జేవీలో మైక్రోమ్యాక్స్‌కు 55 శాతం, ఫీజన్కు 45 శాతం వాటా ఉంది’ అని శర్మ చెప్పారు. భద్రత, వ్యూహాత్మక దృక్కోణం నుండి ఏ దేశానికైనా సర్వర్స్ చాలా ముఖ్యమైన అంశం అని అన్నారు. స్టోరేజ్ చిప్సెట్ల రూపకల్పనపై సంస్థ దృష్టి సారిస్తుందని చెప్పారు. ధర పదో వంతుకు తగ్గింపు.. ఈ వెంచర్‌తో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) ధరను పదో వంతు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇది భారత్‌లోనే కాకుండా ఇతర మార్కెట్లలోనూ సంచలనం కలిగిస్తుందని చెప్పారు. భారత్‌లోని కొన్ని ప్రముఖ సంస్థలతో ట్రయల్స్ ఈ నెలలో పూర్తవుతాయని, 2025 మొదటి త్రైమాసికంలో వాణిజ్య పరంగా సరఫరా ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘స్టోరేజ్ పరిష్కారాలను అందించే కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. స్వదేశీ స్టోరేజ్ సొల్యూషన్స్ కంపెనీ లేని దేశాలకు.. ముఖ్యంగా భారత్‌కు ఇది చాలా ముఖ్యం. మా జాయింట్ వెంచర్ మన స్వంత డిజైన్, తయారీని కలిగి ఉండటం వల్ల విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’ అని శర్మ చెప్పారు. మూడేళ్లలో 1,000 మంది.. కంపెనీ ఫ్రెషర్లను నియమించి వారికి స్టోరేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇస్తుందని రాహుల్ తెలిపారు. ‘మా కాన్సెప్ట్ మొదట భారత్ కోసం.. ఆ తరువాత ప్రపంచం కోసం రూపొందించబడింది. రెండు ఏళ్లలో మొదటి డిజైన్‌ను సిద్ధం చేయాలనేది మా ఆకాంక్ష. మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 1,000 ఇంజనీర్లను కలిగి ఉండాలని భావిస్తున్నాం. వీరందరికీ ఫీజన్ శిక్షణ ఇస్తుంది. కంపెనీ ఇప్పటికే ఉన్న తయారీ సంస్థల నుండి వేఫర్లను కొనుగోలు చేస్తుంది. స్టోరేజ్ మాడ్యూల్స్ తయారీకి వాటిని ఉపయోగిస్తుంది’ అని వివరించారు. -
అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది.అయితే ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతకుముందు బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2017లో తమ అరిన్ జన్మించింది. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ సక్సెస్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు కేవలం రూ. 3 లక్షల మొదలైన వ్యాపారం ఇప్పుడేమో ఏకంగా రూ. 1300 కోట్లకు చేరుకుంది.రాహుల్ శర్మ మొదట మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. ఆ తరువాత 2008లో మొబైల్ రంగంలోకి ప్రవేశించారు. 2010 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లి కార్ప్ కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. కేవలం రూ.3 లక్షలతో వ్యాపార మొదలు పెట్టి.. వందల కోట్లకు చేరుకున్న రాహుల్ శర్మ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. అక్షయ్ కుమార్ వల్లే పరిచయం..ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ శర్మకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకరించాడు. అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన కామెడీ చిత్రం హౌస్‌ఫుల్ 2. అదే సమయంలో అక్షయ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్‌ను పరిచయం చేశాడు. అలా రాహుల్, అసిన్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆసిన్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. వీరికి ఢిల్లీలో ఫామ్‌హౌస్ ఉంది. అతని వద్ద ఖరీదైన బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్య్లూ, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. -
రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో పరిచయమైనా పరిచమైన 'అసిన్' గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ ఈమె భర్త 'రాహుల్ శర్మ' గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈయన ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త.. వేలకోట్ల సామ్రాజ్యానికి అధినాయకుడు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ. ఈయన తన స్నేహితులు రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరాలతో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ను స్థాపించారు. ప్రారంభంలో ఇది ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ.. ఆ తరువాత 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 210 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే ఫోన్లను అందించే సంస్థగా భారతదేశపు అగ్రగామిగా మారింది.రాహుల్ శర్మ రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం (Saskatchewan University) నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత రాహుల్ శర్మ తన తండ్రి నుంచి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు ఈయన నికర విలువ ఏకంగా రూ. 1300 కోట్లు. ఈయన మైక్రోమ్యాక్స్‌తో పాటు.. 2017లో భారతదేశపు మొట్టమొదటి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ఫౌండర్ కూడా.రాహుల్ శర్మ 2016లో నటి 'ఆసిన్'ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇప్పుడు అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది. వీరు ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్‌హౌస్‌లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. వీరికి బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్ల్యూ ఎక్స్6, మెర్సిడెస్ జీఎల్450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. -
ఇప్పటివరకూ స్మార్ట్ఫోన్లు.. ఇక ఎలక్ట్రిక్ టూవీలర్లు!
దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. వీటిలో అత్యధికంగా టూవీలర్లే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోని పలు కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ (Micromax) కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఎలక్ట్రిక్ టీవీలర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి కంపెనీలు సత్తా చాటుతున్నాయి. వీటికి తోడు హీరో, బజాజ్, టీవీఎస్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో మైక్రోమ్యాక్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, మైక్రోమ్యాక్స్‌లో కొన్ని అస్థిరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌తో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లు వైదొలగడం వంటి కారణాల నేపథ్యంలో కంపెనీ ఈవీ తయారీ రంగంలో అన్వేషణకు కారణమని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్‌లో రాహుల్ శర్మ రాజీనామా తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సహ వ్యవస్థాపకులలో ఒకరైన వికాస్ జైన్ కూడా కంపెనీ నుంచి వైదొలిగారు. గత ఫిబ్రవరిలో కంపెనీ వ్యవస్థాపకులు రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్లు కలిసి మైక్రోమ్యాక్స్ మొబిలిటీ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. ఈ కొత్త వెంచర్ మొదట ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తుందని తెలిసింది. ఇందు కోసం వ్యూహాత్మక ప్రయత్నాల్లో భాగంగా గురుగ్రామ్‌లో కార్యాలయ పునరుద్ధరణను చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మైక్రోమ్యాక్స్ 2014 ఆగస్టులో మార్కెట్ లీడర్ శాంసంగ్‌ను అధిగమించి భారతదేశపు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అగ్రస్థానాన్ని పొందింది. ఆ తర్వాత షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల ఆవిర్భావంతో ప్రభను కోల్పోయింది. వాటి పోటీ ధరల వ్యూహాలను తట్టుకోలేక కిందకు జారిపోయింది. -
మార్కెట్‌పై మైక్రోమ్యాక్స్ ఫోకస్.. మరో కొత్త ఫోన్ రిలీజ్‌కి రెడీ
దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోన్న మైక్రోమ్యాక్స్ మరో మోడల్ ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంఆ చైనా ఫోన్లకు దీటుగా తక్కువ బడ్జెట్లో ఓ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. మైక్రోమ్యాక్స్ నోట్ సిరీస్‌లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మైక్రోమ్యాక్స్ సంస్థ 2020 నవంబరులో నోట్ 1 పేరుతో స్మార్ట్‌పోన్‌ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ మోడల్‌కి కొనసాగింపుగా నోట్ 1 ప్రో మొబైల్‌ని మార్కెట్లోకి తేనున్నట్టు సమాచారం. మీడియాటెక్ హెలియె G 90 చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో ఉపయోగించారు. నోట్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ 10 పై పని చేస్తుండగా నోట్ 1 ప్రో మొబైల్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై పని చేయనుంది. అంతేకాకుండా 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్‌సీ పోర్టుతో కొత్త ఫోన్ ఉండబోతుంది. ధర ఎంత ? మైక్రోమ్యాక్స్ నోట్ 1 ప్రో ధర రూ 15,000లు దగ్గరగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తెస్తారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పట్టుకోసం ప్రయత్నాలు ఇండియన్ మార్కెట్లో నోకియా, శామ్సంగ్ హవా కొనసాగుతున్న కాలంలో వాటి తర్వాత స్థానం మైక్రోమ్యాక్స్‌దే అన్నట్టుగా ఉండేంది. ముఖ్యంగా కాన్వాస్ పేరుతో తక్కువ ధరకే స్మార్టు ఫోన్లను అందించి మార్కెట్‌ను కైవసం చేసుకుంది. అయితే మైక్రోమ్యాక్స్ తరహాలోనే చైనా కంపెనీలైన వివో, ఒప్పో, షావోమీ, రియల్‌మీలు ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టాయి. వీటితో పోటీ తట్టుకోలేక మైక్రోమ్యాక్స్ వెనుకబడిపోయింది. మరోసారి ఇండియన్ మార్కెట్‌పై పట్టు పెంచుకునేందుకు ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
Micromax in 2b: అదిరిపోయే ఫీచర్లు... అతి తక్కువ ధరలో..
దేశీ బ్రాండ్‌గా ఒకప్పుడు ఇండియా మార్కెట్లో హవా చెలాయించిన మైక్రోమ్యాక్స్ మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తనదైన శైలిలో అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్ తెస్తోంది. హ్యాంగ్ ఫ్రీ గతేడాది మైక్రోమాక్స్ ఐఎన్ 1బీ మోడల్ని మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మైక్రోమ్యాక్స్ ఐన్ 2బీని రిలీజ్ చేస్తోంది. ఐఎన్ 2బీ ఫోన్ పెర్ఫామెన్స్ స్మూత్‌గా ఉంటుందని, హ్యంగ్ ఫ్రీ ఫోన్ అంటూ మైక్రోమ్యాక్స్ క్లయిమ్ చేసుకుంటోంది. ఈ మొబైల్లో యూనిసాక్ టీఎ610 చిప్సెట్ని మైక్రోమ్యాక్స్ ఉపయోగిస్తోంది. ధర ఆడ్రాంయిడ్ 11 వెర్షన్‌పై ఐన్ 2బీ మోడల్ ఫోన్ పని చేస్తుంది. ఈ మొబైల్‌ను 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌లు 64 జీబీ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 4 జీబీ వేరియంట్ మొబైల్ ధర రూ. 7,000లు ఉండగా 6 జీబీ ర్యామ్ మొబైల్ ధర రూ. 8,999లుగా ఉంది. ఆగస్టు 4న ఫ్లిప్‌కార్ట్ వేదికగా 2బీ మొబైల్ లాంచ్ చేయనుంది మైక్రోమ్యాక్స్. బిగ్ బ్యాటరీ మైక్రోమ్యాక్స్ 2బీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీంతో 15 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్, 20 గంటల బ్రౌజింగ్ టైమ్‌ని అందిస్తోంది మైక్రోమ్యాక్స్. అంతేకాదు ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్స్కానర్ ఈ మొబైల్లో పొందు పరిచారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్లలో ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌కెమెరా, వెనుక వైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. 6.5 అంగులాల వాటర్ డ్రాప్ నాచ్ హెడ్డీ డిస్ప్లేని అమర్చింది. -
ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ వచ్చేసింది
న్యూఢిల్లీ: మైక్రోమాక్స్ తన ఇన్ 1 స్మార్ట్ ఫోన్ తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో మెటాలిక్ ఫినిష్, వెనకవైపు ఎక్స్ ప్యాటర్న్ ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇన్ 1 ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1(ఫస్ట్ ఇంప్రెషన్స్) మార్చి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, మైక్రోమాక్స్ వెబ్సైట్ ద్వారా కొనుగోలుకు రానుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లు 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డుతో 256జీబీ వరకు పెంచుకునే అవకాశం 48 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ.9,999 6జీబీ + 128జీబీ వేరియంట్‌కు రూ.11,499 చదవండి: జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు -
ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్..!
న్యూఢిల్లీ: గత ఏడాది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బి మోడళ్లను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా ఇన్ సీరిస్ నుంచి మూడో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మొబైల్ ఫోన్‌ను వర్చువల్‌గా కంపెనీ వెబ్సైట్ మైక్రోమాక్స్ఇన్ఫో.కామ్‌లో మార్చ్ 19 న మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్చేయబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘తయార్ హోజావో.. ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ ,ఇన్1 కమింగ్ సూన్!, మేడ్ ఇన్ ఇండియా, ఇండియన్ డైరక్ట్ చేసిన, సూపర్‌స్టార్ వచ్చే శుక్రవారం మార్చి 19న జరగబోయే మ్యాట్ని షోకు అందరూ ఆహ్వానితులే ’ అంటూ మైక్రోమాక్స్ సోషల్ మీడియాలో షేర్చేసింది. ప్రస్తుతం మైక్రోమాక్స్ ఇన్ 1 ఫీచర్స్ పై ఎలాంటి సమాచారం లేదు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం మైక్రోమాక్స్ ఇన్ 1 , 6.67-అంగుళాల ఏఫ్హెచ్డీ + హోల్-పంచ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్టర్నల్ స్టోరేజ్‌తో రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 18వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్‌తో , బ్యాటరీ 5,000 ఎమ్ఏహెచ్ కెపాసిటితో రానుంది. అంతేకాకుండా త్రిపుల్ రియర్ 48 ఎమ్‌పి ప్రైమరీ కెమరా, 2 ఎమ్‌పి సెకండరీ కెమరా , 2 ఎమ్‌పి షూటర్కెమరా 8ఎమ్‌పి ఫ్రంట్కెమరాతో రాబోతుంది. (చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!) Taiyyar ho jao, India Ka Naya Blockbuster, #IN1 is coming soon! Made in India, directed by Indians, starring the Indian Superstar! Releasing next Friday, 19th March, matinee show! 🎬🍿#INMobiles #INdiaKeLiye pic.twitter.com/6en3nfCiJG — IN by Micromax (@Micromax__India) March 13, 2021 -
త్వరలో మైక్రోమాక్స్ నుంచి 5జీ మొబైల్
న్యూఢిల్లీ: మైక్రోమాక్స్ గత ఏడాది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బి మోడళ్లను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తీసుకురానున్నట్లు సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ప్రకటించారు. మైక్రోమాక్స్ 5జీ ఫోన్ "అతి త్వరలో" భారతదేశంలోకి తీసుకోని వస్తున్నట్లు రాహుల్ శర్మ వినియోగదారులతో మాట్లాడిన వీడియో సెషన్లో వెల్లడించారు. యూజర్ అనుభవాన్ని మెరుగుపర్చడానికి మైక్రోమాక్స్ ఇన్ 1బి కోసం సాఫ్ట్వేర్ అప్డేట్ ను కూడా అందించనున్నట్లు వీడియోలో హైలైట్ చేశారు. 11 నిమిషాల వీడియో సెషన్ లో భవిష్యత్ ప్రణాళికలు గురించి మాట్లాడుతూ మైక్రోమాక్స్ 5జీని ప్రస్తావించారు. బెంగళూరు ఆర్&డి సెంటర్ లో 5జీ కోసం ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎప్పుడు తీసుకువస్తారో అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వీడియో సెషన్లో రాహుల్ శర్మ 6జీబీ ర్యామ్ అధిక డిస్ప్లే రిఫ్రెష్ రేట్, లిక్విడ్ కూలింగ్ గల స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఇంకా ఆ మోడల్ ని అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. ఆ ఫీచర్స్ ని మైక్రోమాక్స్ 5జీ ఫోన్‌తో తీసుకోని రానున్నట్లు సమాచారం. స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బెంగళూరులో అభివృద్ధి చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. చదవండి: ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! -
మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్
మైక్రోమాక్స్ చివరకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బీ సిరీస్‌తో కంపెనీ భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొదటిసారిగా నవంబర్ 24న విక్రయించగా, మైక్రోమాక్స్ ఇన్ 1బీఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటి సేల్‌కి తీసుకొచ్చింది. మైక్రోమాక్స్ యొక్క ఇన్ నోట్ 1ని మొదటి సేల్‌కి తీసుకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్ అమ్ముడైంది. మైక్రోమాక్స్ ఇన్ 1బి స్పెసిఫికేషన్స్ మైక్రోమాక్స్ ఇన్ 1బి 6.52-అంగుళాల హెచ్డీ + మినీ డ్రాప్ డిస్ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1బీ పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 10వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎంహెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ వెనకభాగంలో అందించారు. (చదవండి: జియో పేజెస్‌లో కొత్త ఫీచర్) మైక్రోమాక్స్ ఇన్ 1బి ధర 2 జీబీ ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 6,999, కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్‌లోని కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్.. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం అదనపు తగ్గింపు పొందగలరు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మైక్రోమాక్స్ ఇన్ 1బిపై 9 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని పొందవచ్చు. -
అద్భుతమైన ఇన్ నోట్ 1 లాంచ్ : ధర, ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ‘ఇన్’ సిరీస్ స్మార్ట్ఫోన్లను మైక్రోమాక్స్ మంగళవారం లాంచ్ చేసింది. ఇన్ నోట్ 1, ఇన్1బీ పేరుతో స్మార్ట్న్లను మంగళవారం లాంచ్ చేసింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగి రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కంపెనీ అద్భుత ఫీచర్లు, బడ్జెట్ ధరలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతున్న షావోమి,రియల్‌మి లాంటి సంస్థలకు భారీ షాక్ ఇవ్వనుంది. డిజైన్ పరంగా అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. “ఇల్యూమి నేటింగ్ ప్రిజం పాటర్న్ అంటూ వెనుక ‘ఎక్స్’ పాటర్న్ ఆకర్షణీయంగా ఉంది. ఇన్ నోట్ 1ఫీచర్లు 6.67అంగుళాల పూర్తి హెచ్డీ + డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ) మీడియా టెక్హీలియో జీ 85 ప్రాసెసర్ 48+5+2+2 ఎంపీరియర ఏఐ క్వాడ్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వా (టైప్-సి) ఫ్లిప్‌కార్ట్, సంస్థ వెబ్సైట్ ద్వారా నవంబరు 24 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం. ఇన్ నోట్ 1 ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499 -
వాటికి షాక్ : అతి తక్కువ ధరల్లో మైక్రోమాక్స్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఇన్ బ్రాండ్ పేరుతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. నోట్ 1, 1బీ పేరుతో స్మార్ట్న్లను మంగళవారం లాంచ్ చేసింది. మార్కెట్లో పోటీ ధరలకు భిన్నంగా బడ్జెట్ ధరల్లో తనకొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. గేమింగ్ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్1 బీ ఫీచర్లు 6.5 హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ) మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 13+2 ఎంపీ రియర్ ఏఐ కెమెరా 8 ఎంపీ సెల్పీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పర్పుల్, బ్లూ , గ్రీన్ రంగుల్లో లభ్యం. ఇన్ 1బీ ధరలు 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 6999 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 7999 ఫస్ట్ సేల్ నవంబరు 26 నుంచి ప్రారంభం ఇన్ నోట్ 1ఫీచర్లు 6.67హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ) ఆండ్రాయిడ్ 11, 12 అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్ 48+5+2+2ఎంపీ క్వాడ్ రియర్ ఏఐ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వా (టైప్-సి) నోట్ 1 ధరలు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499 గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం. -
దేశీ స్మార్ట్ఫోన్ల రీఎంట్రీ...
సాక్షి,హైదరాబాద్: దేశీయ స్మార్ట్ఫోన్ల రంగం మరోసారి వేడెక్కుతోంది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో సంచలనం సృష్టించిన భారతీయ బ్రాండ్లు చైనా కంపెనీల ధాటికి కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే మైక్రోమ్యాక్స్ తన ప్రణాళికను వెల్లడించింది. లావా, కార్బన్‌తోపాటు హైదరాబాద్ కంపెనీ సెల్కాన్ సైతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగి ప్రవేశించేందుకు ఉవ్విల్లూరుతోంది. అయితే లాక్డౌన్ తర్వాత మొబైల్స్ మార్కెట్ ఆగస్టు నుంచే పుంజుకుంది. పండుగల సీజన్ మొదలవడంతో అటు ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయాలు జోరు మీద ఉండడం దేశీయ బ్రాండ్లకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మారుతున్న మార్కెట్.. దశాబ్ద కాలంలో స్మార్ట్ఫోన్ల ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకున్నాయి. క్వాడ్ కెమెరాలు, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, అధిక ర్యామ్, ఇన్‌బిల్ట్ మెమరీ ఉన్న మోడళ్లను కస్టమర్లు కోరుతున్నారు. ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు భారతీయ బ్రాండ్లు ఎలాంటి ఫీచర్లను తీసుకొస్తాయన్నదే ఆసక్తిగా మారింది. 2011–12 ప్రాంతంలో భారత్‌లో 160కిపైగా బ్రాండ్లు మొబైల్స్ రంగంలో పోటీపడ్డాయి. శామ్సంగ్, సోనీ, నోకియా, ఎల్జీ, మోటరోలా, ప్యానాసోనిక్ వంటి బ్రాండ్ల హవా నడుస్తున్న కాలంలో ఒక్కసారిగా దేశీయ బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇక్కడి బ్రాండ్ల ధాటికి శామ్సంగ్ మినహా మిగిలినవి కనుమరుగయ్యాయి. అయితే 2014 నుంచి చైనా బ్రాండ్లు క్రమంగా తమ వాటాను పెంచుకుంటూ వస్తున్నాయి. దీంతో దేశీయ బ్రాండ్లు పోటీ నుంచి తప్పుకున్నాయి. తాజాగా ఈ కంపెనీలు తిరిగి పోటీకి సై అంటున్నాయి. (చదవండి: మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్) తక్కువ ధరల్లో.. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్.. భారతీయ బ్రాండ్లకు పునాదిగా నిలవనుంది. దేశీయ కంపెనీలు రూ.15,000లోపు ధరలో ఉండే ఫోన్లను భారత్‌తోపాటు విదేశాల్లో విక్రయించినా ప్రభుత్వం 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. విదేశీ కంపెనీలకైతే ఇది రూ.15,000 పైన ధరగల మోడళ్లకు వర్తింపజేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు సమాచారం. దేశీయ బ్రాండ్లు గతంలో ఎగుమతులను విజయవంతంగా చేశాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల అండతో తిరిగి విదేశీ మార్కెట్లకూ ఈ కంపెనీలు విస్తరించే అవకాశం లేకపోలేదు. భారతీయ బ్రాండ్లు రూ.3–7 వేల ధరల శ్రేణిలో సైతం స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. గతంలో మాదిరిగా ఇబ్బడిముబ్బడిగా కాకుండా పరిమిత మోడళ్లతోనే రంగ ప్రవేశం చేయనున్నాయి. మైక్రోమ్యాక్స్ తన ‘ఇన్’ బ్రాండ్‌లో రూ.7–20 వేల శ్రేణిలో పోటీపడతామని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తాము తిరిగి ప్రవేశిస్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు ధ్రువీకరించారు.(వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్) అత్యధిక అమ్మకాలు.. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 5 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడై జీవితకాల గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఈ మొత్తం అమ్మకాల్లో 76 శాతం వాటా చైనా కంపెనీలదేనని పరిశోధన సంస్థ కెనాలిస్ వెల్లడించింది. షావొమీ 26.1 శాతం, శామ్సంగ్ 20.4, వివో 17.6, రియల్మీ 17.4, ఒప్పో 12.1 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకున్నాయి. చైనా కంపెనీలకు పోటీగా అమెజాన్‌తో కలిసి శాంసంగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బెస్ట్ ప్రైస్‌లో ఎక్కువ ఫీచర్లతో ‘ఎం’ సిరీస్ ఫోన్లను తీసుకొచ్చి విజయవంతం అయింది. షావొమీ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సత్తా చాటుతోంది. వివో, ఒప్పో ఆఫ్‌లైన్‌లో చొచ్చుకుపోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆసరాగా రియల్మీ సక్సెస్ అయింది. ఇప్పుడు దేశీయ బ్రాండ్లు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనున్నాయో వేచి చూడాలి. కొత్త బ్రాండ్లకూ భారత్‌లో మార్కెట్ ఉందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. అధిక ఫీచర్లతో తక్కువ ధరలో మోడళ్లను అందించగలిగితే సక్సెస్ ఖాయమన్నారు. -
మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్
సాక్షి, ముంబై: ఒకపుడు దిగ్గజంగా వెలిగిన దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు సిద్ధపడుతోంది. దేశంలో చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో మైక్రోమాక్స్ సరికొత్త వ్యూహాలతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈమేరకు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ ఒక వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. పోటీ మార్కెట్ లో చైనా మొబైల్ సంస్థలు వస్తే.. ఒకే కానీ, సరిహద్దులో అనిశ్చితి సరైనది కాదు అంటూ ఆయన చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో, ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడిగా తన వ్యాపార ప్రస్థానాన్నిఈ వీడియోలో వివరించారు. ప్రపంచంలో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచిన మైక్రోమాక్స్ జర్నీని ప్రస్తావించారు. అయితే కొన్ని పొరపాట్లు జరిగినా, తాను ఓడిపోకపోయినా, సాధించిన దానితో సంతృప్తి చెందానని చెప్పుకొచ్చారు. కానీ సరిహద్దు వద్ద ఏమి జరిగిందో అది సరైనది కాదన్నారు. ఏం చేయాలి.. ఎవరికోసం చేయాలి అని చాలా ఆలోంచించాను.. అయితే ఎక్కడినుంచి మొదలు పెట్టానో.. మళ్లీ అక్కడ్నించే మొదలు పెట్టే అవకాశాన్ని జీవితం ఇచ్చింది. కానీ ఈసారి ఏం చేసిన దేశం కోసం మాత్రమే చేస్తానని రాహుల్ ప్రకటించారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిభర్ భారత్ పిలుపులో భాగంగా ఇండియా కోసం మైక్రోమాక్స్ 'ఇన్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో తిరిగి వస్తోందని వెల్లడించారు. భారతదేశంలో కొత్త ఇన్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలకు సూచికగా బ్లూ బాక్స్ ను కూడా వీడియోలో షేర్ చేశారు. ఇంతకుమించి వివరాలను ఆయన ప్రకటించపోయినప్పటికీ, 7-15 వేల రూపాయల ధరల మధ్య ఉత్పత్తులను మైక్రోమాక్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. నవంబర్ ఆరంభంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించనుందని టెక్ నిపుణుల అంచనా. ఇందుకోసం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. We're #INForIndia with #INMobiles! What about you? #IndiaKeLiye #BigAnnouncement #MicromaxIsBack #AatmanirbharBharat pic.twitter.com/eridOF5MdQ — Micromax India (@Micromax__India) October 16, 2020 -
చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దు వివాదం, చైనా దిగుమతులు, వస్తువులను బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో రీ ఎంట్రీకి సిద్ధ మవుతోంది. తాజాగా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను దేశీయంగా విడుదల చేయాలని యోచిస్తోంది. ఒకప్పుడు భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా ఉన్న మైక్రోమాక్స్ చైనా ఫోన్ల కంపెనీల దూకుడుతో వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో బడ్జెట్ ఫోన్లతో వినియోగదారులను ఆకర్షించనుంది. మోడ్రన్ లుక్, ప్రీమియం ఫీచర్లతో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ల ధర 10వేల రూపాయల లోపు ఉంటుందని అంచనా గత అక్టోబర్ లో సంస్థ లాంచ్ చేసిన చివరి స్మార్ట్‌ఫోన్ ఐఓన్ నోట్. దీని ధర 8,199 రూపాయలు. కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నామని మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. అంతర్గతంగా చాలా కృషి చేస్తున్నాం..త్వరలోనే ఒక బిగ్ లాంచింగ్ తో వస్తున్నాం...వేచి ఉండండి! అంటూ వినియోగదారుల్లో ఒకరికి మైక్రోమాక్స్ సమాధానం ఇచ్చింది. మేడ్ బై ఇండియన్, మేడ్ ఫర్ ఇండియన్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. A device with premium features, thoroughly modern look and budget friendly, how does that sound Nani Kishor?🙂 Stay tuned. #Micromax #MadeByIndian #MadeForIndian — Micromax India (@Micromax_Mobile) June 18, 2020 -
అద్భుత ఫీచర్లుతో ఆండ్రాయిడ్ టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. భారత మార్కెట్లో 40 ఇంచుల ఒక నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. మైక్రోమాక్స్ సబ్‌బ్రాండ్ యు టెలివెంచర్స్ యు యుఫోరియా పేరిట బుధవారం ఈ స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. దీని ధర రూ. 18,999. అలాగే ఎక్సేంజ్ ఆఫర్లో (పాత టీవీ మార్చుకుంటే) రూ. 7,200 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. యు యుఫోరియా స్మార్ట్ టీవీ ఫీచర్లు 40-అంగుళాల ఫుల్ హెచ్డీ(1920x1080 పిక్సల్స్) డిస్ప్లే 5000: 1 కాంట్రాస్ట్ రేషియో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్ వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ ఫీచర్ మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్ 24 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మీడియా ఫైల్స్‌ను నేరుగా టీవీలో ప్లే చేసుకోవచ్చు. యూజర్లు తమకు కావల్సిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ అనే ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్‌తోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు. -
మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘యూ ఏస్’
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ తాజాగా తమ సబ్ బ్రాండ్ యూ కింద కొత్త స్మార్ట్‌ఫోన్ ‘యూ ఏస్‘ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 5,999. సెప్టెంబర్ 6 నుంచి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ శుభదీప్ పాల్ తెలిపారు. 5.45 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 18:9 యాస్పెక్ట్ నిష్పత్తి, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. ఫోన్ వెనుకవైపు 13 ఎంపీ, ముందువైపు 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి. -
రూపాయికే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్
చెన్నై : 251 రూపాయిలకే స్మార్ట్‌ఫోన్ అంటూ.. రింగింగ్ బెల్స్ సంస్థ ఫ్రీడం 251 ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మోస్ట్ అఫార్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా పెను సంచలనానికి దారితీసిన ఈ కంపెనీ, డివైజ్‌లను ఎంతమందికి అందించన్నది అసలు లెక్కలే లేవు. చివరికి ఆ స్మార్ట్‌ఫోన్ సూత్రధారి మోహత్ గోయలే జైలు పాలయ్యాడు. ఇక 251 రూపాయల స్మార్ట్‌ఫోన్ గురించి మరచిపోవాల్సిందేనని వినియోగదారులు భావిస్తూ ఉంటే... తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ అత్యంత చౌకగా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తానంటూ టీజ్ చేస్తోంది. అత్యంత చౌకగా కేవలం రూపాయికే..! సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నామని దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ చెబుతోంది. అత్యంత తక్కువగా రూపాయికే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తామంటూ కంపెనీ టీజర్ కూడా విడుదల చేసింది. లేదా ఉచితంగానైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జూలై 5న కంపెనీ ఈ టీజర్‌ను షేర్చేసింది. ‘హలో చెన్నై! బిగ్ న్యూస్! రూపాయికే మేము స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటిస్తున్నాం - ఆర్ యూ రెడీ? అంటూ.. టీజ్ చేసింది అంటే వచ్చే వారాల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ చెన్నై వాసుల ముందుకు తీసుకురాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ జియోఫోన్ మాదిరి ఉండొచ్చని టెక్ వర్గాలంటున్నాయి. జియోఫోన్ కూడా పూర్తిగా జీరోకే కంపెనీ ఆఫర్ చేస్తోంది. కానీ తొలుత ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సెక్యురిటీ డిపాజిట్ కింద 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ అనంతరం ఆ మొత్తాన్ని రిలయన్స్ జియో రీఫండ్ చేయనుంది. అదే మాదిరి ఈ కంపెనీ కూడా రూపాయికే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేస్తుందని అంటున్నారు. అయితే యూజర్లు ఈ స్మార్ట్‌ఫోన్ పొందడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, ఆ అనంతరం ఆ మొత్తాన్ని టెలికాం ప్రొవైడర్లతో లింక్ అయి డేటా, వాయిస్ కాల్స్ రూపంలో అందిస్తుందని చెబుతున్నారు. లేదా రూపాయికే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను నిజంగానే లాంచ్ చేసి, లిమిటెడ్ మొత్తంలో మార్కెట్లోకి అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. అయితే ఏ విధంగా రూపాయికి స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని టెక్ వర్గాలు అంటున్నాయి. -
బిగ్ బ్యాటరీతో మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్
మైక్రోమ్యాక్స్ తన కాన్వాస్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాన్వాస్ 2 ప్లస్(2018) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర 8,999 రూపాయలు. 5.7 అంగుళాల స్క్రీన్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్ ఫోన్లు ఆఫర్ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ టాప్ ఫీచర్ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ. దీని బ్యాటరీ లైఫ్ 15 నుంచి 20 గంటలు. 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రూపొందింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీనిలో ఉన్నాయి. పలుచైన బడ్జెట్ ఫోన్లలలో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ 8ఎంఎం థిక్‌నెస్‌ను కలిగి ఉందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. జెట్ బ్లాక్ ఫిన్నిష్‌తో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. తొలుత కాన్వాస్ రేంజ్లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసినప్పుడు తమ తొలి స్మార్ట్‌ఫోన్ కాన్వాస్ 2 అని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ చెప్పారు. ఇన్ఫినిటీ స్క్రీన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, అతిపెద్ద బ్యాటరీతో ప్రస్తుతం కాన్వాస్ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఒకానొక సమయంలో భారత్‌లో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారిగా మైక్రోమ్యాక్స్ ఉండగా.. కానీ గత రెండేళ్ల నుంచి కంపెనీ తన స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్‌ను చైనీస్ కంపెనీలు నడిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ లీడర్‌గా షావోమి ఉంది. మైక్రోమ్యాక్స్ తాజాగా లాంచ్ చేసిన కాన్వాస్ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్‌గా అందుబాటులో ఉండనుంది. -
భారత్ తొలి ఆండ్రాయిడ్ గో ఫోన్ వచ్చేస్తోంది...
భారత్ తొలి ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు దేశీయ హ్యాండ్సెట్ తయారీదారి మైక్రోమ్యాక్స్ సిద్ధమైంది. రిపబ్లిక్ డే(జనవరి 26) సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఓరియో గో-స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్న తొలి కంపెనీ మైక్రోమ్యాక్సే కావడం విశేషం. ''భారత్ గో'' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్-ఇన్-క్లాస్ మొబిలిటీ డివైజ్, ఆప్టిమైజ్ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డివైజ్‌గా కంపెనీ అభివర్ణించింది. ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఉంటుందని, 4జీ, వాయస్‌ఓవర్ ఎల్టీఈ సపోర్టు ఫీచర్లతో ఇది మార్కెట్లోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్)తో ఇది రన్ అవుతుంది. ఎంట్రీ లెవల్ డివైజ్‌లు మంచిగా పనిచేయడానికి ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ను గూగుల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో దీన్ని లాంచ్ చేస్తున్నట్టు గత నెలలోనే గూగుల్ పేర్కొంది. ఈ ఓఎస్ ముఖ్యంగా 1జీబీ కంటే తక్కువ ర్యామ్, తక్కువ స్టోరేజ్ స్పేస్ కలిగిన స్మార్ట్ఫోన్లలో అతివేగంగా పనిచేస్తుంది. ఫీచర్ ఫోన్ పాపులర్‌గా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పెంచడానికి ఈ ఓఎస్ దోహదం చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌తో వస్తున్న భారత్ గో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను, ధరను మైక్రోమ్యాక్స్ వెల్లడించనప్పటికీ, తొలిసారి స్మార్ట్‌ఫోన్ వాడే యూజర్లకు ఇది మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. -
అదరగొట్టే ఫీచర్లతో మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్
దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ'ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎడ్జ్-టూ-ఎడ్జ్ డిస్ప్లే, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో రూ.13,999కు ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌పై ఈ నెల 6 నుంచి విక్రయానికి రానుంది. ఈ ఫోన్లో 5.7 ఇంచ్ భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇది బెజెల్ లెస్ డిస్ప్లే అయినందున యూజర్లకు ఫోన్ తెరను చూసేటప్పుడు ఫుల్ వ్యూ అనుభూతి కలుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కీ ఫీచర్లుగా పోర్ట్రైట్ మోడ్, ఫేస్ బ్యూటీ, ఆటో సీన్ డిటెక్షన్, ఫేస్ గ్యాలరీ, టేల్ ఆల్బమ్లున్నాయి. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ ఫీచర్లు... 5.7 అంగుళాల ఫుల్ విజన్ డిస్ప్లే 1440 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1 నోగట్ డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సల్ వెనుక కెమెరా 20, 8 మెగాపిక్సల్‌తో డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీ, బడ్జెట్ ధర, 50జీబీ డేటా..‘భారత్-5’
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ భారీ బ్యాటరీతో ‘భారత్ 5’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ డివైస్‌లో అతిపెద్ద హైలైట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే మరో విశేషం రూ.5555 ధరకే ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేవడం. అలాగే వొడాఫోన్తో భాగస్వామ్యంలో డేటా ఆఫర్ కూడా ఉంది. దేశంలో ఆఫ్‌లైన్ రిటైలర్లు ద్వారా కొనుగోలు చేయడానికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. భారత్-సీరీస్‌లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్5 సిరీస్ స్మార్ట్ఫోన్లు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో తరువాత దిశగా భారత్‌ను తీసుకెళతాయని, ఈ క్రమంలో ఇప్పటికీ తీవ్రమైన విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న దేశంలోని 3-4 టైర్ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్‌లు కీలకంగా నిలుస్తాయన్నారు. లాంచింగ్ ఆఫర్ దేశ్కా స్మార్ట్‌ఫోన్ అంటూ లాంచ్ అయిన రెడ్మీ5ఏ కీ పోటీగా తీసుకొచ్చిన భారత్ 5 లాంచింగ్ ఆఫర్‌గా వొడాఫోన్ కస్టమర్లకు 5నెలలు 50జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది. అంటే 1జీబీ డేటా అందించే ఏదైనా వోడాఫోన్ ప్యాక్‌లో కస్టమర్లకు అదనంగా 10 జీబీ డేటాను 5నెలలపాటు ఉచితంగా అందిస్తుంది. మైక్రోమ్యాక్స్ భారత్ 5 ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ 1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగాట్ 720x1280 పిక్సల్స్ రిజల్యూషన్ 1జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 64జీబీదాకా విస్తరించుకునే సదుపాయం 5 మెగాపిక్సెల్ బ్యాంక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
4జీ ఫోన్లపై వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
ఎంపికచేసిన మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్ఫోన్లపై టెలికాం దిగ్గజం వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మైక్రోమ్యాక్స్‌తో కొత్త భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నట్టు గురువారం ప్రకటించిన వొడాఫోన్, ఈ మేరకు క్యాష్‌బ్యాక్ వివరాలను కూడా వెల్లడించింది. గురువారం ప్రకటించిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్, మైక్రోమ్యాక్స్ భారత్ 3, మైక్రోమ్యాక్స్ భారత్ 4, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 1 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వొడాఫోన్ కొత్త, పాత కస్టమర్లు పైన పేర్కొన్న ఆ నాలుగు స్మార్ట్ఫోన్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు 36 నెలల పాటు నెలకు కనీసం రూ.150 వరకు వొడాఫోన్ రీఛార్జ్‌లు చేయించుకోవాలి. ఇలా చేసిన కస్టమర్లకు తొలి 18 నెలలు ముగియగానే, రూ.900 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత 18 నెలలు ముగియగానే రూ.1300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు. సబ్‌స్క్రైబర్ వొడాఫోన్ ఎం-పెసా వాలెట్లో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేయనున్నారు. గత నెలలో కూడా వొడాఫోన్, మైక్రోమ్యాక్స్లు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. అప్పుడు మైక్రోమ్యాక్స్ భారత్ 2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ.999కే అందుబాటులోకి వచ్చింది. మోడల్ పేరు భారత్2 ప్లస్ భారత్ 3 భారత్ 4 కాన్వాస్ 1 18 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్ రూ.900 రూ.900 రూ.900 రూ.900 36 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్ రూ.1300 రూ.1300 రూ.1300 రూ.1300 మార్కెట్ ఆపరేటింగ్ ధర రూ.3749 రూ.4499 రూ.4999 రూ.5999 మొత్తం క్యాష్‌బ్యాక్ రూ.2200 రూ.2200 రూ.2200 రూ.2200 తుది ధర రూ.1549 రూ.2299 రూ.2799 రూ.3799 -
రెడ్మికి కౌంటర్..‘భారత్ 5’ రేపే లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ్కా స్మార్ట్‌ఫోన్ అంటూ షావోమి బడ్జెట్‌ధరలో రెడ్ మి 5ఏను గురువారం లాంచ్ చేసింది. మరోవైపు రెడ్మీ షాకిస్తూ దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్‌కూడా మరో బడ్జెట్ ఫోన్‌ను రేపు (శుక్రవారం) విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. బడ్జెట్‌ఫోన్ల మార్కెట్లో భారత్ ఫోన్ల సిరీస్‌లో ‘భారత్ 5’ పేరుతో మైక్రోమాక్స్ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. డిసెంబర్ 1 గుర్గావ్లో ‘భారత్ 5’ (పవర్ ఆఫ్ 5) ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం అందించింది. సోషల్ మీడియాలో టీజర్ ను షేర్ చేసింది. దీని ప్రకారం కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో రానుందనే అంచనాలు నెలకొన్నాయి. ‘పవర్ ఆఫ్ 5 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో లేదా 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలతో రానుందట. మిగిలిన ఫీచర్లు, ధర విషయాలో రేపటి వరకు సస్పెన్స్ తప్పదు. కాగా మైక్రోమ్యాక్స్ రూ. 3,499 ధరలలో ఏప్రిల్‌లో భారత్ 2 లాంచ్ చేసింది. సెప్టెంబర్‌లో మైక్రోమ్యాక్స్ 4జీ వీవో ఎల్టీఈ సేవలతో భారత్ 3, భారత్ 4లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
మైక్రోమాక్స్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్ఎన్ఎల్’ తాజాగా కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.97కే అపరిమిత కాల్స్‌తో పాటు కొంత డేటాను అందిస్తోంది. అయితే ఇది అందరికీ కాదండోయ్.. మైక్రోమాక్స్ 4జీ వీవోఎల్టీఈ ఫీచర్ ఫోన్ ‘భారత్–1’ను కొన్నవారికే. ఈ ఫోన్ ధర 2,200. తాజా కొత్త పథకాల వల్ల బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు మరింత పెరుగుతారని, అలాగే సంస్థ ఆర్థికంగా కూడా బలోపేతమౌతుందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా ధీమా వ్యక్తంచేశారు. ‘దన్‌తేరాస్ సందర్భంగా దేశీ మొబైల్ హ్యాడ్‌సెట్స్ తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌తో జతకట్టడం ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యూజర్లకు చేరువకావడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా బీఎస్ఎన్ఎల్.. అపరిమిత కాల్స్, డేటాతోపాటు రోమింగ్‌లో ఉన్నప్పుడు ఉచిత ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను కూడా అందిస్తుందని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. మైక్రోమాక్స్ ఫోన్లు అక్టోబర్ 20 నుంచి వినియోగదారులకు అందు బాటులో ఉంటాయని చెప్పారు. కాగా బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 3జీ సర్వీసులనే అందిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి 4జీ సేవలను ప్రారంభించనుంది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ ఎక్స్ట్రామార్క్స్తో భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సేవలను అందిస్తోంది. మనోజ్ సిన్హా ఈ సేవలను ఆవిష్కరించారు. -
మైక్రోమాక్స్ 4జీ ఫోన్ అక్టోబర్ 20 నుంచే..ధర?
సాక్షి, ముంబై: రిలయన్స్, జియో ఫీచర్ ఫోన్ల సందడి తర్వాత తాజాగా మైక్రోమ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ 4జీ వోల్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ ఫోన్‌ను ఈ నెల 20 వ తేదీనుంచి కసమర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్టు మైక్రోమాక్స్ వెల్లడించింది ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో 4జీ వోల్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనున్నామని మంగళవారం ప్రకటించింది. భారత్-1 పేరుతో లాంచ్ చేయనున్న 4జీ ఫోన్ ను 500 మిలియన్ల మంది భారతీయులకు పౌరులకు అందించే లక్ష్యంతో ఉన్నామని మైక్రోమ్యాక్స్ , బిఎస్ఎన్ఎల్ తెలిపాయి. వినియోగదారులకు ఉత్తమ మొబైల్ అనుభవాన్ని , డేటా సేవలను అందించనున్నట్టు చెప్పాయి. దేశ్కా 4జీ ఫోన్ ‘భారత్-1’ పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ ధరను రూ.2,200గా నిర్ణయించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా అన్ని రీటైల్ కౌంటర్లలో అక్టోబర్ 20నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించాయి. అలాగే నెలకు రూ .97ల రీచార్జ్‌పై అపరిమిత కాలింగ్, అపరిమిత డేటా సేవలను బీఎస్ఎన్ఎల్ అందించనుంది. డ్యూయల్ సిమ్ కనెక్టివిటీతో 22 వివిధ భాషలకు మద్దతుతో ఇది అందుబాటులోకి వస్తుంది. అక్టోబరు 20 నుంచి రిటైల్ అవులెట్లలో భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. భారత్ -1 ఫోన్ తమ లక్షల మంది వినియోగదారులు డేటా సేవల్ని అనుభవించటానికి, ఎన్నడూ లేని విధంగా కాలింగ్ అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుందని తాము విశ్వసిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ, మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. భీమ్ యూపీఐ పేమెంట్స్ యాప్, బీఎస్ఎన్ఎల్ వాలెట్ యాప్స్‌ను ఇందులో ప్రీలోడెడ్‌గా అందిస్తున్నారు. 100 లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించవచ్చు. పాటలను వినవచ్చు. వీడియోలను చూడవచ్చు. భారత్-1 ఫోన్ ఫీచర్లు 2.4 అంగుళాల స్క్రీన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 512ఎంబీ స్టోరేజ్ 2ఎంపీ వెనుక కెమెరా వీజీఏ సెల్ఫీ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇక మైక్రోమాక్స్ ఫ్రిజ్‌లు, వాషింగ్మెషిన్లు!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమాక్స్’ పూర్తిస్థాయి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా మారటానికి వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు), మైక్రోవేవ్ వంటి విభాగాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందుకోసం మ్యాన్యుఫాక్చరింగ్పై రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో టీవీ ప్యానెల్ మార్కెట్లో 8 లక్షల యూనిట్ల విక్రయాలతో 7–8 శాతం వాటాను సాధించాలని ప్రణాళికలు వేస్తోంది. మైక్రోమాక్స్ గతేడాది ఏసీల విభాగంలోకి ప్రవేశించడం తెలిసిందే. ‘వచ్చే ఏడాది కాలంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో 70–80 శాతం ప్రొడక్ట్ లైనప్ కలిగి ఉంటాం. ఇందులో ఏసీ, ఎయిర్ కూలర్స్, వాషింగ్ మెషీన్లు వంటివి ఉంటాయి’ అని మైక్రోమాక్స్ ఇన్ఫర్మాటిక్స్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్ చెప్పారు. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్లను రెండేళ్ల కాలంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారాయన. సంస్థ మొత్తం ఆదాయంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వాటా వచ్చే మూడేళ్లలో దాదాపు 40 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. రానున్న 2–3 ఏళ్లలో రూ.200–300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. ‘పూర్తిస్థాయి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా ఎదగాలనేది కంపెనీ లక్ష్యం. ఏసీ, ఎల్ఈడీ టీవీ కేటగిరీల్లో సముచితమైన వాటాను కలిగి ఉన్నాం. వచ్చే ఏడాది కాలంలో మార్కెట్లోకి మరిన్ని ప్రొడక్టులను తెస్తాం. దీంతో ఆయా విభాగాల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాం. అదేసమయంలో కొత్త కేటగిరీల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం’ అని చెప్పారాయన. -
బీఎస్ఎన్ఎల్ ఫీచర్ ఫోన్.. ధరెంత?
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ ప్రకటనాంతరం టెలికాం దిగ్గజాలు ఒక్కోటి ఫోన్ల మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవలే జియోఫోన్‌కు పోటీగా ఎయిర్టెల్ రూ.2500కు స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుపగా... తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయబోతుందట. దీనికోసం దేశీయ మొబైల్ డివైజ్ తయారీదారులు లావా, మైక్రోమ్యాక్స్‌లతో కూడా బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. 2000 రూపాయల ధరలో, అన్ని ఉచిత ఆఫర్లతో అక్టోబర్‌లో కో-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్లను బీఎస్ఎన్ఎల్ ఆవిష్కరించబోతుందని వెల్లడైంది. లావా, మైక్రోమ్యాక్స్ వంటి డివైజ్ తయారీదారులతో కలిసి సొంత మోడల్లో కో-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఫోన్లు మార్కెట్లో ఉన్న ప్రస్తుత వాయిస్ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తాయన్నారు. ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందించబోతున్నట్టు తెలిపారు. ఈ డివైజ్ ధర కూడా 2000 రూపాయలు.. బీఎస్ఎన్ఎల్ 10.5 కోట్ల సబ్స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రెండు కంపెనీలు కో-బ్రాండెడ్ డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్ ఫోన్ మార్కెట్ పూర్తిగా కుదుపులకు లోనుకానున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు జియో ఫోన్, మరోవైపు బీఎస్ఎన్ఎల్ కో-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్లు.. వీటితో తీవ్ర పోటీ నెలకొనబోతుంది. ఫీచర్‌ఫోన్ల ద్వారా వస్తున్న రెవెన్యూలు 15 శాతం ఉండగా.. ఈ డివైజ్‌లు మార్కెట్లో 50 శాతం స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. ఇటీవల వెల్లడైన రిపోర్టుల ప్రకారం 85 శాతం ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్ఫోన్లలోకి మారడానికి సిద్ధంగా లేనట్టు తెలిసింది. బీఎస్ఎన్ఎల్ ఫీచర్ ఫోన్ లాంచింగ్‌పై లావా కానీ, మైక్రోమ్యాక్స్ కానీ స్పందించలేదు. -
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ..సునామీయేనట!
మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఫేస్బుక్ లైవ్ ద్వారా ‘కాన్వాస్ ఇన్ఫినిటీ’ పేరుతో కొత్త డివైస్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధరను 9,999గా నిర్ణయించింది. రిజిస్ట్రేషన్లను ఈ రోజునుంచే ప్రారంభమయ్యాయి. అలాగే అమెజాన్‌లో ప్రత్యేకంగా సెప్టెంబరు 1నుండి అందుబాటులో ఉంటుంది. అనంతరం దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. తమ కొత్త డివైస్ సునామీ సృష్టిస్తుందనీ , హైలీ డిస్రప్టివ్ అని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పేర్కొన్నారు. 18.9 డిస్ప్లే తో వస్తున్న అతి చవకైన ఫోన్ ఇదే అన్నారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 84.2 శాతం బాడీ రేషియో స్క్రీన్ అందిస్తుందగా తమ ఇన్ఫినిటీ 83 శాతం అందిస్తోందని శర్మ చెప్పారు. అలాగే ఆండ్రాయిడ్ నౌగట్ అప్డేటెడ్ వెర్షన్ 8.0 ఓరియో అందుబాటులోకి రాగానే ఈడివైస్ కూడా అప్డేట్ అవుతుందని ఆయన చెప్పారు. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ 5.77 అంగుళాల డిస్ ప్లే పూర్తి విత్ ఫుల్ విజన్ 18: 9 స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, 1440 x 720 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 16 సెల్ఫీ కెమెరా 128 జీబీదాకా విస్తరించుకునే అవకాశం 2900 ఎంఏహెచ్ బ్యాటరీ It is time to #ExpandYourView with the #CanvasInfinity. pic.twitter.com/bKBnoPRjOB — Micromax India (@Micromax_Mobile) August 22, 2017 Canvas Infinity Launch Event: https://t.co/g1IDC8Vg7N — Micromax India (@Micromax_Mobile) August 22, 2017 -
నోకియా 3310కు మైక్రోమ్యాక్స్ గట్టిపోటీ
న్యూఢిల్లీ : హెచ్ఎండీ గ్లోబల్ కొన్ని రోజుల కిందటే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ కు ఇప్పటికే మైక్రోమ్యాక్స్ నుంచి గట్టి పోటీ నెలకొంది. మైక్రోమ్యాక్స్ కొత్త ఫీచర్ ఫోన్ ఎక్స్1ఐ2017, నోకియా ప్రస్తుత మోడల్ కు గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చం నోకియా 3310 ఫోన్ మాదిరే ఉండే ఈ ఫోన్, కేవలం పేరు, ధరల్లో మార్పుతో వినియోగదారుల ముందుకు వచ్చింది. నోకియా 3310 మోడల్ కంటే తక్కువ ధరకు మైక్రోమ్యాక్స్ ఎక్స్1ఐ2017 ఫీచర్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. కంపెనీ సొంత వెబ్ సైట్లో ఇది లిస్టు అవడం మాత్రమే కాక, అమెజాన్ ఇండియాలోనూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర కేవలం 1399 రూపాయలే. అదే నోకియా 3310 ఫీచర్ ఫోన్ ఖరీదు 3310గా హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. మైక్రోమ్యాక్స్ కొత్త ఫీచర్ ఫోన్ ఫీచర్లు... 2.4 అంగుళాల క్యూవీజీఏ టీఎఫ్టీ డిస్ ప్లే 58 గ్రాములు 0.8 ఎంపీ రియర్ కెమెరా 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 8జీబీ వరకు విస్తరణ మెమరీ 1300ఎంఏహెచ్ బ్యాటరీ(234 గంటల పాటు స్టాండ్ బై టైమ్, 11.5 గంటల టాక్ టైమ్) -
మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2:ఏడాదంతా ఫ్రీ కాలింగ్ 4జీ డేటా
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2012లో లాంచ్ చేసిన కాన్వాస్ 2 ను తిరిగి అద్భుతమైన ఆఫర్లతో తిరిగి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినూత్న ఆఫర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా యూజర్లకు సంవత్సరంపాటు 4జీ ఉచిత డేటాను, ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. దీనికోసం దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు కాన్వాస్ 2 డివైస్‌లో ఎయిర్టెల్ 4జీ సిమ్‌తో కలిపి అందిస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో లాంచ్ చేసిన దీని ధరను రూ.11,999 గా కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు దీనిపై ఒక సంవత్సరం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. కాన్వాస్ -2 ఫీచర్లు ఫ్రింగర్ ప్రింట్ సెన్సర్, క్వాడ్ కోర్ 1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్ 3 జీబీర్యామ్ 16 జీబీ ఇంటర్నెనల్ స్టోరేజ్, 64 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, విత్ ఎఫ్.20 ఎపర్చర్, ఆటో ఫోకస్, 5పి లెన్స్ 3050 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే, ఎయిర్టెల్భాగస్వామ్యంతో ఏడాది పాటు ఉచిత 4జీ డేటా, ఉచిత కాలింగ్ సదుపాయంతో కాన్వాస్ 2 ఒక బెంచ్‌మార్క్‌గా, విప్లవాత్మకంగా ఆశిస్తున్నామని మైక్రో మ్యాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మ వ్యాఖ్యానించారు. తమ వినియోగదారులకు అద్భుతమైన యూజర్ అనుభవాన్ని, గొప్ప స్పెక్స్, ఇతర కావలసిన లక్షణాలతో ఒక పరికరాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మైక్రోమ్యాక్స్ తెలిపింది. మార్కెట్లో తన బలమైన హోదాను మరింత పటిష్టపరుచుకోవడంతోపాటు, భారత్ సహా ఇతర మార్కెట్లలో 1 మిలియన్ కన్నా ఎక్కువ కాన్వాస్ 2 స్మార్ట్ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో తన ధరల విభాగంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ వాదిస్తోంది. -
స్మార్ట్‌ఫోన్ రారాజులకు చైనీస్ బ్రాండ్ల దెబ్బ
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ల మార్కెట్ షేరుకు దెబ్బకొడుతూ చైనీస్ కంపెనీలు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ ప్లేయర్లు లెనోవో, షియోమి, వివో, ఓపోలు మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టి, టాప్-10 స్థానాల్లో నిలిచాయని హాంగ్‌కాంగ్ ఆధారిత మార్కెట్ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత క్వార్టర్లో 27శాతమున్న చైనీస్ బ్రాండ్ల మార్కెట్ షేరు ఈ క్వార్టర్లో 32శాతానికి ఎగిసిందని పేర్కొంది. అదేవిధంగా సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులతో ఆ ఇండస్ట్రీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఎల్వైఎఫ్ మార్కెట్లో నెంబర్ 4 స్థానానికి ఎగబాకినట్టు కౌంటర్ పాయింట్ వెల్లడించింది. మరోవైపు పండుగల సీజన్ నేపథ్యంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లూ భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ 35 మిలియన్ యూనిట్లు రికార్డు మార్కును తాకినట్టు వెల్లడైంది. అంటే ఈ షిప్మెంట్లు దాదాపు 21శాతం పెరిగాయి. ఇదంతా పండుగ సీజన్ కాలంలో రీటైలర్ల నుంచి వస్తున్న డిమాండేనని కౌంటర్ పాయింట్ వివరించింది. మొట్టమొదటిసారి భారత్‌లో 30 మిలియన్ స్మార్ట్ఫోన్లు విక్రయాలు జరిగాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో మందకొండిగా సాగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు, ద్వితీయార్థంలో పండుగ సీజన్లో భారీగా పుంజుకుంటున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. దీపావళి ఈ అమ్మకాలను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఉచితమైన వాయిస్, డేటా వంటి సంచలనమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన జియో సర్వీసులతో, ఎల్వైఫ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేరు 6.7శాతానికి ఎగిసినట్టు కౌంటర్‌పాయింట్ తెలిపింది. మార్కెట్ రారాజులు శాంసంగ్, మైక్రోమ్యాక్స్లు తీవ్ర ఇరకాటంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆ సంస్థలు మార్కెట్ షేరు సెప్టెంబర్ క్వార్టర్లో 21.6శాతం, 9.8 శాతం కోల్పోయినట్టు వెల్లడించింది. అయినప్పటికీ ఈ రెండు టాప్ స్థానాల్లోనే ఉన్నాయి. రెడ్మి నోట్3 మోడల్ అద్భుతమైన ప్రదర్శనతో షియోమి నంబర్ 6 స్థానంలోకి వచ్చింది. వివో, ఓపోలు 7, 8 స్థానాలను దక్కించుకున్నాయి. -
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త ‘కాన్వాస్ ట్యాబ్’
ధర రూ.7,499 న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా ‘కాన్వాస్ ట్యాబ్ పీ681’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,499గా ఉంది. ఇందులో డీటీఎస్ డ్యూయెల్ ఆడియో స్పీకర్స్, 8 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫుల్ హెచ్డీ ప్లేబ్యాక్ రెజల్యూషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ట్యాబ్స్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. -
వాల్నట్ చెక్కతో మైక్రోమ్యాక్స్ స్పెషల్ ఎడిషన్
దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ కొత్తగా ఆవిష్కరించిన కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ప్రస్తుతం కంపెనీ సైట్లో నమోదైంది. దీని ధర వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, ఈ హ్యాండ్‌సెట్‌ను త్వరలోనే విక్రయించనున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌ను వాల్నట్ ఉడ్ ఫినిస్తో రూపొందించడం కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ సైతం దీనికి మరో హైలెట్. గతేడాది రూ.11,999కు లాంచ్ చేసిన కాన్వాస్ 5 స్మార్ట్‌ఫోన్‌కు లైట్ వేరియంట్‌గా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. కాన్వాస్ 5 లైట్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు. 5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ 1గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 16 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మైక్రోమ్యాక్స్ ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా తన ‘యునైట్ సిరీస్’లో మరో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘యునైట్-4’, ‘యునైట్-4 ప్రో’ అనే ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ.6,999గా, రూ.7,499గా ఉన్నాయి. ఇండస్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో మైక్రోమ్యాక్స్ మార్కెట్లోకి తెస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్స్ ఇవి. ఈ ఓఎస్ 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. యునైట్ -4 స్మార్ట్‌ఫోన్ ఆఫ్లైన్లోనూ, యునైట్-4 ప్రో స్నాప్‌డీల్‌లోనూ అందుబాటులో ఉంటాయి. -
12 భాషలతో మైక్రోమ్యాక్స్ ఫోన్లు
దేశీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మైక్రోమ్యాక్స్, యునైట్ సిరీస్ లో తన స్మార్ట్ ఫోన్లను విస్తరిస్తోంది. తాజాగా యునైట్ 4, యునైట్ 4 ప్రో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. యునైట్ 4 ధర రూ.6,999గా, యునైట్ 4 ప్రో ధర రూ.7,499గా కంపెనీ వెల్లడించింది. యునైట్ 4 స్మార్ట్ ఫోన్లు ఆఫ్ లైన్ రిటైల్ లభ్యమవుతాయని తెలుపగా.. యునైట్ 4 ప్రోను ప్రత్యేకంగా స్నాప్ డీల్ లో మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. ఎవరైతే తమ ప్రాంతీయ భాషలో మొదటిసారి స్మార్ట్ ఫోన్ ను వాడాలనుకుంటున్నారో వారిని టార్గెట్ గా చేసుకుని ఈ ఫోన్లను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. 12 ప్రాంతీయ భాషల సపోర్టుతో వచ్చిన ఇండస్ ఓఎస్ 2.0 మొదటి డివైజ్ లు ఇవేనని కంపెనీ ప్రకటించింది. యాప్ బజార్(ఇండస్ ప్రాంతీయ భాషల యాప్ మార్కెట్ ప్లేస్), ఇండస్ టూ ఇండస్ ఉచిత ఎస్ఎమ్ఎస్ సర్వీసులు, ఇండస్ స్వైప్ ఫీచర్లు ఈ ఓఎస్ ద్వారా సపోర్టు చేయనున్నాయి. ఆరు ప్రాంతీయ భాషల్లో టెస్ట్ నుంచి స్పీచ్ టెక్నాలజీని ఈ ఓఎస్ సపోర్టు చేస్తుంది. ఇండస్ ఓఎస్ భాగస్వామ్యంతో భాష అడ్డంకులను తొలగించి, బెస్ట్ స్థానిక స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని యూజర్లకు కల్పిస్తున్నామని మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుభజిత్ సేన్ తెలిపారు. ఈ రెండు డివైజ్ లను ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కంపెనీ ఆవిష్కరించింది. యునైట్ 4 ఫీచర్లు... 5.00 అంగుళాల డిస్ ప్లే 1జీహెచ్ జడ్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెసుల్యూషన్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్పెల్ ముందు కెమెరా 2500 ఎంఏహెచ్ యునైట్ 4 ప్రో ఫీచర్లు... 5.00 అంగుళాల డిస్ ప్లే 1.3 జీహెచ్ జడ్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెసుల్యూషన్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 3900 ఎంఏహెచ్ -
ఎరోస్ నౌ తో మైక్రోమాక్స్ భాగస్వామ్యం
ముంబై: దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు మైక్రోమాక్స్, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తో డిజిటల్ కంటెంట్ సేవల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నియోగదారులకు సీమ్ లెస్ డిజిటల్ కంటెంట్ అందించే లక్ష్యంతో ఎరోస్ ఇంటర్నేషనల్ డిజిటల్ ప్లాట్ ఫాం ఎరోస్ నౌ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులకు సౌకర్యవంతమైన, అసాధారణ డిజిటల్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మైక్రో మాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం మైక్రో మాక్స్ లేటెస్ట్ స్మార్మ్ ఫోన్లలో ఎరోస్ నౌ యాప్ ప్రీ ఇన్ స్టాల్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ యాప్ ద్వారా మ్యూజిక్ లవర్స్ సంగీతాన్ని ఆస్వాదించవచ్చన్నారు. సినిమాల డిజిటల్ కంటెంట్, వీడియోలతో పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి వస్తుందని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ వివరించారు. అలాగే లక్షా యాభైవేలకు పైగా ఔట్ లెట్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మైక్రోమాక్స్ పరపతి తమ వ్యాపార వృద్ధి తోడ్పడనుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ సీఈవో రిషిక లుల్లా సింగ్ వెల్లడించారు. మైక్రోమాక్స్ యూజర్లు ఇక ఎరోస్ నౌ యూనిక్ కంటెంట్ ప్రాప్యతకు ఆమోదం లభించనుందన్నారు. దాదాపు 3.5 మిలియన్ల వినియోగదారులు ఇక ఎక్కడైనా ఎప్పుడైనా వినోదాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. -
చైనా మార్కెట్ లోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ : భారత అతిపెద్ద హ్యాండ్ సెట్ల తయారీదారి మైక్రోమ్యాక్స్, చైనా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో 2020లోపు నెంబర్.5 స్థానాన్ని సొంతంచేసుకోవడమే లక్ష్యంగా వచ్చే ఏడాది చైనా మార్కెట్లోకి ప్రవేశించాలని మైక్రోమ్యాక్స్ యోచిస్తోంది. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పబ్లిక్ లిస్టింగ్ ద్వారా కంపెనీ నగదును పెంచుకోనుందని కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో నెంబర్.2 స్థానంగా ఉన్న మైక్రోమ్యాక్స్, అతిపెద్ద మార్కెట్లోకి ప్రవేశించనంత కాలం ప్రపంచంలో నెంబర్.5 క్లబ్ లోకి చేరలేమని మైక్రోమ్యాక్స్ ఇన్ ఫర్ మాటిక్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన వికాస్ జైన్ చెప్పారు. త్వరలోనే చైనాలోకి అరంగేట్రం చేసి మైక్రోమ్యాక్స్ లను అక్కడ కూడా ఆవిష్కరిస్తామని హాంకాంగ్ లోని రైజ్ కాన్ఫరెన్స్ లో జైన్ వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో టాప్ కంపెనీలుగా ఉన్న శామ్ సంగ్, యాపిల్ లు చైనాలో మార్కెట్లో దూసుకుపోతూ.. అక్కడి స్థానిక కంపెనీలకు పోటీగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన మైక్రోమ్యాక్స్ , రష్యాలో టాప్.3 స్థానంలో దూసుకుపోతోంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు లెనోవా, వివో, ఓప్పో, షియోమి లు కూడా భారత్ లో మైక్రోమ్యాక్స్ కు గట్టి పోటీని ఇస్తున్నాయి. చైనా మార్కెట్ దాదాపు 8000లక్షల స్మార్ట్ ఫోన్లను కలిగి ఉంది. దీనిలో 31శాతం గ్లోబల్ వాల్యుమ్స్ ఆక్రమించుకున్నాయి. ఈ పోటీని తట్టుకుని, మైక్రోమ్యాక్స్ చైనాలో మార్కెట్ ను బలపర్చుకోవాల్సి ఉంది. -
రూ.7వేలకే.. 4జీ ట్యాబ్
విలక్షణమైన స్మార్ట్ ఫోన్లతో ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న మైక్రోమ్యాక్స్ సంస్థ ట్యాబ్ సెగ్మెంట్ ను విస్తరించుకుంటోంది. గత మార్చిలో 4జీ కనెక్టివీటీతో కాన్వాస్ పీ702 ని 7,999 లకే అందించిన సంస్థ తాజాగా కాన్వాస్ పి701 పేరుతో ఒకట్యాబ్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. నిర్దిష్ట వర్గ వినియోగదార్ల అవసరాలకనుగుణంగా కొత్త డివైస్ ల రూపొందిస్తున్నామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శుభజీత్ సేన్ తెలిపారు. టాబ్లెట్ సెగ్మెంట్లో అన్ని రకాల వీడియోలను చూడటం కోసం కాన్వాస్ టాబ్ పీ 701ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీనిద్వారా యూజర్లకు అద్భుతమైన వినోద అనుభవం మిగులుతుందన్నారు. ఫ్లిప్ కార్ట్ లో బ్లూ,గ్రే కలర్స్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. స్పెసిఫికేషన్స్ ఇలావున్నాయి... 7 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే 1024 x 600 పిక్సెల్స్, స్క్రీన్ రిజల్యూషన్ 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, వాయిస్ కాలింగ్ 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్ , 4 గంటల బ్రౌజింగ్ టైమ్) వైఫై, బ్లూ టూత్, మైక్రో యూఎస్బీ కనెక్టవిటీ -
తుక్కుగూడలో మైక్రోమాక్స్ ఉద్యోగుల ఆందోళన
మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా): మహేశ్వరం మండలం తుక్కగూడ ఫ్యాబ్‌సిటీలో నెల క్రితం ప్రారంభించిన మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతాలు తగ్గిస్తున్నారనీ, భోజనంలో సున్నం కలిపి పెడ్తున్నారని, రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటున్నారని, చెకింగ్‌ల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
కాన్వాస్ 6 అమ్మకం ఆన్లైన్లోనే !
న్యూఢిల్లీ: గత నెల మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన కాన్వాస్ 6 మొబైల్ ను ఆన్లైన్లో విక్రయించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది. ఔత్సాహికులు మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్ నుంచి మొబైల్ ను ముందుగా ఆర్డర్ ఇవ్వొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్స్: 5.5 అంగుళాల స్క్రీన్ 1.3 జీహెచ్జీ ప్రాసెసర్ లాలీపాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 13 మెగాపిక్సల్ రీర్ కెమెరా 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 4జీ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తాజాగా భారత్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఒడిసి పట్టుకునేందుకు మైక్రోమ్యాక్స్ చేసిన ప్రయత్నమిది. ఈ మొబైల్ ధరను రూ.13,999/- కంపెనీ నిర్ణయించింది. -
జారిపోతున్న మైక్రోమ్యాక్స్..!
ఏడాదిలో 8% తగ్గిన మార్కెట్ వాటా * 22 శాతం నుంచి 14.1 శాతానికి తగ్గిన తీరు * తగ్గిన నాణ్యత, రిపేర్ల కోసం కస్టమర్ల క్యూ * విక్రయానంతర సేవలు తగ్గటంతో అసంతృప్తి * తక్కువ ధర ఫోన్లతో చైనా కంపెనీల పోటీ * వేగంగా పట్టు పెంచుకుంటున్న డ్రాగన్ మైక్రోమ్యాక్స్!!. పేరుకు తగ్గట్టే మ్యాక్స్ స్థాయి నుంచి మైక్రోకు జారిపోతోందా? పరిస్థితులు చూస్తుంటేఅవుననే సమాధానమే వస్తోంది. 2014లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏకంగా 22 శాతం వాటాతో నెంబర్-1కు కాస్తంత దూరంలో నిలిచిన ఈ సంస్థ... జస్ట్ ఏడాదిలో ఏకంగా 8 శాతం వాటాను కోల్పోయింది. 2015 డిసెంబరు క్వార్టర్లో దీని వాటా కేవలం 14.1 శాతానికి పరిమితమైందని ఐడీసీ చెబుతోంది. ఒకవైపు దేశీ మొబైల్ మార్కెట్ బాగా వృద్ధి చెందుతున్నా... మైక్రోమ్యాక్స్ కూడా విపరీతంగా మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నా... అవేవీ కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ వైఫల్యం అంకెల్లో కనిపిస్తోంది కూడా!!. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత మొబైల్ మార్కెట్ వృద్ధి మామూలుగా లేదు. 2015లో స్మార్ట్‌ఫోన్స్ విపణి ఏకంగా 29% వృద్ధి చెంది 10.3 కోట్ల యూనిట్లు నమోదు చేసింది. స్మార్ట్‌ఫోన్ విప్లవంతో ఈ వృద్ధి మరికొన్నేళ్లు అంతకంతకూ పెరుగుతుందనే అంచనాలున్నాయి. చైనా కంపెనీలు దీన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాయి. దీంతో ఒకప్పుడు దేశీ కంపెనీలకు... అవి చెప్పినట్లుగా ఫోన్లు తయారు చేసి ఇచ్చిన చైనా సంస్థలు... నేరుగా భారత మార్కెట్లోకి తమ సొంత బ్రాండ్లతో వచ్చేశాయి. యాపిల్‌తో సహా వివిధ దిగ్గజ బ్రాండ్లకు తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్‌కాన్‌తో పాటు.. షావొమీ, జియోనీ, కూల్‌ప్యాడ్, ఓపో తదితర ప్రముఖ సంస్థలు వరుస కట్టాయి. అలాగే వన్‌ప్లస్, వివో, లెనోవో, ప్యానాసోనిక్, మోటరోలా వీటికి తోడయ్యాయి. ఫలితం.. గడచిన ఏడాదిలో చైనా కంపెనీల వాటా ఏకంగా 12 నుంచి 22 శాతానికి చేరినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) వెల్లడించింది. అంతేకాదు! 2015లో బ్రాండింగ్‌కు, ప్రకటనలకే చైనా కంపెనీలు రూ.1,200 కోట్ల దాకా వెచ్చించాయి. వీటిలో వివో, ఓపో, జియోనీ, ఎల్ఈ ఎకో 55% ఖర్చు చేశాయి. వివో ఏకంగా ఐపీఎల్‌కే ప్రధాన స్పాన్సర్‌గా మారింది. దేశీ బ్రాండ్లయిన సెల్కాన్, కార్బన్, వీడియోకాన్, లావా, ఇంటెక్స్ కూడా మెల్లగా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పరిణామాలన్నీ మైక్రోమ్యాక్స్‌ను తిరోగమన బాట పట్టేలా చేశాయి. సర్వీసింగ్‌లో విఫలం..! ఒకప్పుడు మైక్రోమ్యాక్స్ బలం దాని విక్రయానంతర సేవలే. ఇపుడు అవి సరిగా లేకపోవటమే దాని బలహీనతగా మారింది. ఈ మధ్య కాలంలో కంపెనీ భారీగా మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో నాణ్యత కొరవడిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘‘ఏ కంపెనీకైనా విక్రయానంతర సేవలే బలం. వాటిలో మైక్రోమ్యాక్స్ విఫలమైంది’’ అని మొబైల్స్ విక్రయ సంస్థ టెక్నోవిజన్ ఎండీ సికందర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు. ఒకప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ల ధరతో పోలిస్తే సగం ధరకే మోడళ్లను కంపెనీ తెచ్చిందని, తక్కువ ధరకే అధిక ఫీచర్లున్న ఫోన్లు వస్తున్నాయి కదా అని కస్టమర్లు కొన్నారని ఆయన చెప్పారు. ‘‘నాణ్యత లేదు. సర్వీసింగ్ కేంద్రాల్లో కస్టమర్లు క్యూ కడుతున్నారు. మొబైల్లో చిన్న సమస్య వచ్చినా, పరిష్కారానికి రోజుల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. అమ్మకాలపై చూపిన శ్రద్ధను సర్వీసింగ్‌పై కంపెనీ చూపడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. పెద్ద కంపెనీల ధరల మంత్రం.. నిజానికి మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీల విజయ రహస్యం ధరలే. కానీ ఇపుడు శామ్సంగ్తో పాటు చైనా కంపెనీలన్నీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. శామ్సంగ్ ఇటీవల తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లను తీసుకురాగా... ఇన్ఫోకస్ బ్రాండ్‌తో ఫాక్స్‌కాన్ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. చైనా బ్రాండ్లన్నీ అధిక ఫీచర్లతో అందుబాటు ధరలో మోడళ్లను తెస్తుండటంతో ఆ ప్రభావం మైక్రోమ్యాక్స్కే గట్టిగా తగిలింది. మున్ముందు ఈ కంపెనీకి తీవ్ర పోటీ తప్పదని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ అనలిస్ట్ తరుణ్ పాఠక్ చెప్పారు. 2015 చివరి త్రైమాసికంలో మొబైల్ పరిశ్రమ 15.4% పెరగ్గా మైక్రోమ్యాక్స్ విక్రయాలు 12% తగ్గాయని ఐడీసీ వెల్లడించింది. డిసెంబర్ క్వార్టర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశంలో శామ్సంగ్కు 26.8%, మైక్రోమ్యాక్స్ 14.1, లెనోవో గ్రూప్ 11.6, ఇంటెక్స్ 9.4, లావా 7, ఇతర కంపెనీలు 31.1% వాటా ఉంది. వాటా కొనలేదు... ఐపీఓ రాలేదు ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా... మైక్రోమ్యాక్స్‌లో 20 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించినా ఒప్పందం బెడిసి కొట్టింది. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి రుణం పొందే ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. అంతెందుకు! పబ్లిక్ ఇష్యూకు రావటానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. గతంలో ఓ సారి మైక్రోమాక్స్ సంస్థ సెబీకి ప్రాస్టెక్టస్ కూడా దాఖలు చేసింది. కానీ ఐపీఓ ఆగిపోయింది. వీటన్నిటికీ తోడు సంస్థలో కీలక వ్యక్తులుగా ఉన్న సీఈవో వినీత్ తనేజా, చైర్మన్ సంజయ్ కపూర్లు దూరం కావడమూ గట్టిదెబ్బే. కంపెనీకి, సంజయ్‌కి మధ్య నడుస్తున్న వివాదం బాగా ముదురుతోంది. తనను చట్ట విరుద్ధంగా తొలగించారని చెబుతున్న సంజయ్... అందుకు రూ.600-700 కోట్లు పరిహారం చెల్లించాలంటూ మైక్రోమ్యాక్స్పై దావా వేసే అవకాశం కనిపిస్తోంది. -
‘మైక్రోమ్యాక్స్’యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్ మొబైల్ ఫోన్ తయారీ యూనిట్‌ను మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోటీఎస్ ఐపాస్ విధానంలో ప్రారంభమైన మొదటి సంస్థ మైక్రో మ్యాక్స్ అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారనుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. -
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త ఉత్పత్తులు
♦ కాన్వాస్ 6 సహా పలు స్మార్ట్ ♦ ఉపకరణాల ఆవిష్కరణ ♦ కంపెనీకి ఇక కొత్త లోగో... న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 6, కాన్వాస్ 6 ప్రో సహా పలు స్మార్ట్‌ఫోన్స్, 4జీ ట్యాబ్స్, ఎల్ఈడీ టీవీలను మార్కెట్లో ఆవిష్కరించింది. గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించే దిశగా బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ పాత లోగోను రీడిజైన్ చేసి కొత్త లోగో విడుదల చేసింది. అలాగే కొత్త ఈ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిరీస్‌లోనే కాన్వాస్ 6, కాన్వాస్ 6 ప్రో అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర 13,999గా ఉంది. వీటి ప్రి-బుకింగ్స్ సంస్థ ఆన్లైన్ స్టోర్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. కాన్వాస్ 6: ఇందులో 5.5 అంగుళాల తెర, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 4జీ, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉంటాయని కంపెనీ తెలిపింది. కాన్వాస్ 6 ప్రో: 5.1 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 4జీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. -
దూసుకుపోతున్న మైక్రోమాక్స్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మైక్రోమాక్స్ తన వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ మైక్రోమాక్స్ స్మార్ట్ ఫోన్ల తయారీలో మరింత విజృంభిస్తోంది. ఈ క్రమంలో మైక్రో మాక్స్ లోగోను కూడా బుధవారం కొత్తగా లాంచ్ చేసింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీలో రెండవ స్థానాన్ని ఆక్రమించిన మైక్రో మాక్స్ రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లతో సహా, 15 కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. తన సరికొత్త కాన్వాస్ 6, కాన్వాస్ 6 ప్రో లతో మార్కెట్లో హల్ చల్ చేయనుంది. దీంతోపాటుగా ఎల్ ఈడీ టీవీలను, 4జీ టాబ్లెట్స్ ను విడుదల చేసింది. కొత్తగా విడుదల చేసిన లోగో ప్రకారం 'నట్స్ గట్స్, గ్లోరీ' అనే టాగ్ లైన్ తో మైక్రోమాక్స్ బ్రాండ్స్ ఇక ముందు మనముందుకు రానున్నాయి. హీలియో ప్రాసెసర్ తో 4జీ రామ్ గల దేశంలోనే మొట్టమొదటి స్మార్ట ఫోన్ కాన్వాస్ 6 ప్రో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే ఫింగర్ ప్రింట్ కెమెరా, ఫుల్ మెటల్ బాడీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా, 3 జీబీ రామ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ కెపాసిటీ స్పెసిఫికేషన్స్ తో కాన్వాస్ 6 లాంచ్ అయింది. ఇదే కార్యక్రమంలో ఈ కామర్స్ పోర్టల్ ని లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ ఫోన్ల ఆర్డర్లను తక్షణమే స్వీకరించి, ఓపెన్ సేల్స్ ఏప్రిల్ 20 నుంచి మొదలు పెట్టనుంది. మిగిలిన అన్ని వస్తువుల ఆర్డర్లను త్వరలోనే స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తోంది. టెలివిజన్ అమ్మకాల్లో 5వ స్తానంలోఉన్న ఈ సంస్థ 40, 50 అంగుళాల ఎల్ఈడీ టీవీలను కూడా కొత్తగా లాంచ్ చేసింది. విదేశాల్లో కూడా హవా చాటుతున్న మైక్రోమాక్స్ మొబైల్ అమ్మకాల్లో రష్యాలో మూడవ స్థానాన్ని కొట్టేసింది. దీంతో విదేశాల్లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోనే ప్రయత్నాల్లో ఉంది. దేశంలో లార్జెస్ట్ సర్వీసెస్ కంపెనీగా మైక్రోమాక్స్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కంపెనీ కో ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. 2017 సం.రానికి 5కోట్ల వినియోగదారులను సాధించే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈనేపథ్యంలో తెలంగాణా, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లలో నాలుగు కొత్త ప్లాంట్ లను నిర్మించ తలపెట్టినట్టు వెల్లడించారు. 2017 కల్లా 300 వందల కోట్ల పెట్టుబడితో 10 వేల సిబ్బందితో తమ సేవలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంద. -
పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్
గత జనవరిలో రాహుల్ శర్మను పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆసిన్ థొట్టుంకల్. పెళ్లయిన తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్లు ఆమె ఒప్పుకోవడం లేదట. ఈ విషయాన్నే పెళ్లికి ముందు కూడా చెప్పింది. అయినా తనకు పలు సినిమాల ఆఫర్లు వస్తున్నాయంటూ కథనాలు వస్తుండటంతో మళ్లీ ఓసారి వివరణ ఇచ్చింది. 'నేను గతంలో చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన నా మీడియా మిత్రులందరికీ మరోసారి తెలియజేస్తున్నా. నేను ఎలాంటి అసైన్మెంట్లను ఒప్పుకోవడం లేదు. నా బ్రాండ్ ఎండార్స్మెంట్లు సహా నా కమిట్మెంట్లన్నింటినీ పెళ్లికి ముందే పూర్తి చేశాను. నా వర్క్ గురించి, అసైన్మెంట్ల గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుతం నేను వాటిని చేయడం లేదు. పెళ్లికి ముందే నేను ప్రకటన చేశాను' అని ఆసిన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించింది. మైక్రోమాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్-ఆసిన్ పెళ్లి జనవరి 19న జరిగిన సంగతి తెలిసిందే. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. 2008లో 'గజినీ' సినిమాతో బాలీవుడ్‌కు హాయ్ చెప్పిన ఆసిన్.. పెళ్లికి ముందు చివరగా అభిషేక్ బచ్చన్ నటించిన 'ఆల్ ఈజ్ వెల్' సినిమాలో హీరోయిన్గా కనిపించింది. -
మైక్రోమాక్స్ పెద్ద టార్గెటే పెట్టుకుంది!
న్యూఢిల్లీ: దేశీయ ముబైల్ హ్యాండ్సెట్ మేకర్ మైక్రోమాక్స్ అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని భావిస్తోంది. మద్యప్రాచ్యం, ఆఫ్రికా, కామన్వెల్త్ దేశాల మార్కెట్లలోకి ప్రవేశించి.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా ఐదు అగ్రశేణి ముబైల్ ఫోన్ సంస్థల్లో ఒకటిగా నిలువాలని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా టార్గెట్ పెట్టుకుంది. గార్ట్నెర్ సంస్థ ప్రకారం 2015 జూన్‌తో ముగిసే త్రైమాసికానికి మైక్రోమాక్స్ సంస్థ అంతర్జాతీయంగా పదోస్థానంలో నిలిచింది. ఇప్పటికే తమకు రష్యా, బంగ్లాదేశ్, నేపాల్‌లో బలమైన మార్కెట్ ఉందని, ఇకముందు మరింత విస్తరిస్తామని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది. 'నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మార్కెట్లలో కొన్ని సంవత్సరాల కిందటే మా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించాం. ఇతర మార్కెట్లలోనూ మేం బాగా వృద్ధి చెందాం. రష్యా మార్కెట్లో మాకు ఐదుశాతం వాటా ఉంది' అని మైక్రోమాక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బిజినెస్) అమిత్ మథూర్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా టాప్ 5లో ఒకరిగా ఉండటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మైక్రోమాక్స్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మేకర్‌గా ఉంది. దేశంలో మొబైల్ అమ్మకాల్లో శామ్సంగ్ తర్వాత రెండోస్థానంలో మైక్రోమాక్స్ ఉంది. -
మైక్రోమాక్స్‌ను దాటేసిన శామ్సంగ్
న్యూఢిల్లీ : భారత్‌లో స్మార్ట్ఫోన్లకు భారీగా డిమాండ్ పెరిగిపోతున్నది. 2014లో8.11 కోట్లు(81.1 మిలియన్)గా ఉన్న స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2015లో పదికోట్ల (100 మిలియన్) మార్క్‌ను దాటాయి. మొత్తం మీద గడిచిన ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 23.3 శాతం వృద్ధి నమోదైందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 28.6 శాతం వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో నిలిచింది. 14.3 శాతంతో మైక్రోమ్యాక్స్, 11.4 శాతంతో లెనోవా, 9.6 శాతంతో ఇంటెక్స్, 6.8 శాతంతో లావా ఫోన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2015 ఆర్థిక సంవత్సరం మొత్తంగా తీసుకున్నా శామ్‌సంగే ఇండియా మార్కెట్లో 23.6 శాతం వాటాతో మొదటిస్థానంలో నిలిచింది. దేశంలో 22 కోట్లమంది వినియోగదారులు.. దేశంలో ఇప్పటికే 22 కోట్లమంది స్మార్ట్ ఫోన్ మొబైల్ వినియోగదారులు ఉన్నారని, దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఏ కంపెనీకైనా విస్తారమైన అవకాశాలు కలుగజేస్తున్నదని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ తెలిపారు. దేశ జనాభాలో కేవలం 30శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉందని, దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలను ఇది చాటుతోందని ఆయన చెప్పారు. 4జీ ఎల్టీఈ డివైజ్‌లు, స్మార్ట్ఫోన్ల దిగుమతి 15 శాతం పెరిగి, గత ఏడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 25.3 మిలియన్ యూనిట్స్‌కు తాకిందని తెలిపారు. నాలుగో త్రైమాసికం సెలవుల సమయంలో దేశంలో స్మార్ట్ఫోన్లకు గిరాకీ బాగా పెరిగినప్పటికీ.. నవంబర్ నెల మధ్యకాలానికి అది పడిపోవడంతో స్మార్ట్‌ఫోన్ దిగమతులు 11 శాతం వరకు తగ్గాయని తరుణ్ పాఠక్ చెప్పారు. కానీ ఎల్టీఈ దిగుమతలు మాత్రం పెరిగినట్టు తెలిపారు. ఎల్టీఈ స్మార్ట్ఫోన్లకు ధర తక్కువ కావడం, 4 జీ సర్వీస్‌లు ఆఫర్ చేయడమే దీనికి కారణమని అంటున్నారు. నాలుగో త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న ఫోన్లలో 40 శాతం స్మార్ట్‌ఫోన్సే. ఇక ఈ త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఫోన్లలో సగానికి పైగా ‘మేడ్ ఇన్ ఇండియా’వే. దాదాపు 20 మొబైల్ ఫోన్ బ్రాండ్లు దేశంలో కంపెనీలు స్థాపించి మొబైల్స్‌ను విక్రయిస్తున్నాయి. -
టెరిఫిక్ ఫీచర్స్ తో 'యుటోపియా' స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 'యుటోపియా'ను విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ యూ టెలివెంచర్స్ గురువారం విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను విప్లవాత్మక ఉత్పత్తిగా, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా పేర్కొంది. ఇందులో 'అరౌండ్ యూ' అనే కొత్త ఆప్షన్ పొందుపరిచామని యూ టెలివెంచర్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ట్రావెల్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిన సమాచారం దీనిద్వారా సులవుగా పొందవచ్చన్నారు. దీంతో వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నీరు. ఇలాంటి ఫోన్ తేవాలంటే ఇతర కంపెనీలకు కనీసం ఐదేళ్లు పడుతుందని చెప్పారు. ఫింగర్ ప్రింట్ స్కాన్ తో అర సెకను కంటే తక్కువ సమయంలో లాక్ ఓపెనవుతుందని తెలిపారు. అమెజాన్ లో ప్రిబుకింగ్స్ ప్రారంభించారు. ఈనెల 26 నుంచి డెలివరీ చేస్తారు. 'యుటోపియా' స్పెసిఫికేషన్స్ 21 ఎంపీ రియర్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 5.2 ఇంచ్ షార్ప్ డబ్ల్యూక్యూహెచ్ డీ ఐపీఎస్ డిప్లే 810 క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 4 జీబీ డీడీఆర్ 4 ర్యామ్ 32జీబీ మైక్రో ఎస్డీ ఎక్స్ పాన్సన్ 5.1 ఆండ్రాయిడ్ లాలిపాప్ ధర రూ. 24,999. -
ఐపీటీఎల్ నుంచి తప్పుకున్న మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ ఫ్రాంచైజీ నుంచి మైక్రోమ్యాక్స్ తప్పుకుంది. ఈ జట్టులో 60 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ ప్రస్తుత సీజన్ నుంచే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. తొలి సీజన్లో రూ.24 కోట్ల భారీ నష్టం రావడంతో మైక్రోమ్యాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘ప్రస్తుతానికి ఐపీటీఎల్‌లో మాకు ఫ్రాంచైజీ హక్కులు లేవు. అయితే స్పాన్సర్‌గా కొనసాగుతాం’ అని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి శుభజిత్ సేన్ తెలిపారు. అయితే ఏ లీగ్‌లో అయినా ప్రారంభ సీజన్లో నష్టాలు రావడం సహజమేనని నిర్వాహకుడు మహేశ్ భూపతి తెలిపారు. తమకు రావాల్సిన రూ.18.5 కోట్ల బకాయిలను చెల్లించాల్సిందిగా మైక్రోమ్యాక్స్‌కు భూపతి లాయర్లు సెప్టెంబర్‌లో లీగల్ నోటీసులు పంపడంతో వ్యవహారం ముదిరింది. టిక్కెట్ల రేటు రూ.4 వేల నుంచి ప్రారంభం వచ్చే నెల 10 నుంచి 12 వరకు జరిగే భారత్ అంచె పోటీలు ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల టిక్కెట్ల రేట్లు రూ.4 వేల నుంచి 48 వేల మధ్య ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్లో ఐపీటీఎల్‌వరల్డ్.కామ్, బుక్‌మైషో వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. -
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: ప్రస్తుతం మొబైల్ ఫోన్ మార్కెట్లో 4జీ స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో..ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తొలిసారిగా ‘కాన్వాస్ఎక్స్ప్రెస్4జీ’ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,599. ‘కాన్వాస్ఎక్స్ప్రెస్4జీ’ స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాప్ 10లో మైక్రోమ్యాక్స్: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మైక్రోమ్యాక్స్ అమ్మకాలు రెట్టింపయ్యాయి. 56 లక్షల నుంచి 1.21 కోట్లకు పెరిగాయని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా టాప్ 10 దిగ్గజ కంపెనీల్లో మైక్రోమ్యాక్స్ కూడా చోటు దక్కించుకున్నట్లు వివరించింది. -
ఆఫ్‌లైన్‌లోకి యూ టెలీవెంచర్స్!
రిలయన్స్ రిటైల్‌తో జట్టు న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ కూడా షావోమి, మోటరోలా దారిలోనే నడుస్తోంది. యూ టెలీవెంచర్స్ తన యూ బ్రాండ్ మొబైల్ హ్యాండ్సెట్లను ఆఫ్‌లైన్ మార్కెట్లో విక్రయించడానికి సన్నద్ధమయ్యింది. ఆఫ్‌లైన్ విక్రయాల కోసం రిలయన్స్ రిటైల్‌తో జతకడుతున్నట్లు యూ టెలీవెంచర్స్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యం వల్ల యూఫోరియా, యురేకా ప్లస్, యూనిక్యూ వంటి హ్యాండ్సెట్లు దేశవ్యాప్తంగా 30,000 రిటైల్ ఔట్లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులకు యూ బ్రాండ్ హ్యాండ్సెట్లను మరింత చేరువచేసే లక్ష్యంతోనే తాము ఈ చర్య తీసుకున్నామని యూ టెలీవెంచర్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 1.5 లక్షల రిటైల్ ఔట్లెట్స్, 1,200 డిస్ట్రిబ్యూటర్ల ఏర్పాటు ద్వారా తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంది. -
పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్
'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వచ్చేనెల 26న తన చెలికాడు రాహుల్ శర్మను మనువాడనున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో వీరి వివాహం జరుగనుంది. నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనుంది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొనున్నారు. ఇదే ఫామ్‌హౌజ్‌లో గతంలో షాహిద్, మీరాల రిసెప్షన్ జరిగింది. నవంబర్ 28న ముంబైలో ఈ దంపతులు మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్ శర్మ-అసిన్ కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మనస్సులు కలువడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. -
ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్
భూమి పూజ చేసిన ప్రతినిధులు - రూ.200 కోట్ల పెట్టుబడి; 500 మందికి ఉపాధి మహేశ్వరం : ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్... తెలంగాణలో తన సెల్‌ఫోన్ తయారీ ప్లాంటుకు శుక్రవారం భూమి పూజ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల, శ్రీనగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఫ్యాబ్‌సిటీలో కంపెనీ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్లాంటులో సెల్ ఫోన్లతో పాటు, ఎల్ఈడీ స్క్రీన్లను తయారు చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఫ్యాబ్ సిటీలోని 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ కమర్షియల్ అధికారి రాకేష్ గుప్త చెప్పారు. త్వరలోనే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ‘‘ఈ ప్లాంటుపై రూ.200 కోట్లపెట్టుబడి పెడుతున్నాం. సుమారు 500 మందికి దీన్లో ఉపాధి దొరుకుతుంది’’ అని తెలియజేశారు. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్‌కు దేశంలో ఒక ప్లాంట్ ఉందని, ఇది రెండో ప్లాంటు అవుతుందని చెప్పారాయన. మంచిరోజు కాబట్టి ఇపుడు భూమి పూజ చేశామని, త్వరలో మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ ఏజీఎం గజేందర్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి ఆనంద్ ప్రకాష్, టీఐఐసీ అధికారి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ : ఫస్ట్‌టచ్ భాగస్వామ్యంతో ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3,499. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.3 గిగాహెర్ట్జ్ డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల తెర, 3 ఎంపీ రియర్ కెమెరా, ఫస్ట్‌టచ్ యాప్ బజార్, 10 ప్రాంతీయ భాషల సపోర్ట్, అనువాదం కోసం స్వైప్ ఆప్షన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. -
మొబైల్స్‌లో ‘సబ్ బ్రాండ్ల’ హవా
విలువ పెంచుకోవటానికి కంపెనీల పోటాపోటీ ♦ రంగంలో మైక్రోమ్యాక్స్, హువాయి, జెడ్‌టీఈ తదితరాలు ♦ ‘బ్లాక్’ పేరిట సబ్‌బ్రాండ్ బరిలోకి దిగుతున్న జోలో ♦ ఆరంభంలో ఆన్లైన్లో అమ్మకాలకే పరిమితం ♦ ఆన్‌లైన్‌తో అనేక లాభాలంటున్న విశ్లేషకులు ♦ హానర్.. ఒకే వైపు రెండు కెమెరాలున్న 6 ప్లస్‌ను తొలిసారి తెచ్చింది. ♦ నూబియా జెడ్9 మోడల్‌ను అంచులు లేని (బెజెల్ ఫ్రీ) స్క్రీన్‌తో రూపొందించింది. దీన్లో ఎస్ఎల్ఆర్ కెమెరా ఉంది. ♦ పేటెంటు కలిగిన ఫ్రేమ్‌లెస్ స్మార్ట్‌ఫోన్‌ను డాజెన్ తయారు చేసింది. ♦ బ్లాక్ సైతం ఒకే వైపు రెండు కెమెరాలున్న మోడల్‌ను తీసుకొస్తోంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 2015లో 150 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. దీన్లో భారత్ వాటా 11.8 కోట్లు. 2017కి ఈ సంఖ్య 170 కోట్లకు చేరొచ్చని విశ్లేషకులు చెబుతుండగా దీన్లో భారత్ వాటా 10.4%. అంటే.. 17.4 కోట్లు. ♦ 2014లో భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 8 కోట్ల యూనిట్లు. ఇందులో ఆన్లైన్ వాటా 15 శాతం మాత్రమే. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒకే ఒక్క ఏడాది. ఏకంగా 1,137 మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. అలాగని వీటిని విడుదల చేసిన బ్రాండ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. దాదాపు 95 బ్రాండ్లు పోటీలు పడుతూ ఈ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చాయి. సగటున చూస్తే ఒక్కో బ్రాండ్ ఏడాదికి 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చినట్లు. అదీ... మన దేశ మొబైల్ మార్కెట్ సత్తా. అందుకేనేమో!! ఇపుడు కొన్ని కంపెనీలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మోడళ్లనే కాక... బ్రాండ్లను కూడా పెంచుకుంటున్నాయి. అంటే ఒకే కంపెనీ వివిధ రకాల బ్రాండ్లతో మార్కెట్లోకి ఫోన్లను విడుదల చేస్తోందన్న మాట. ఈ నయా ట్రెండ్‌పై ప్రత్యేక కథనమిది... సబ్ బ్రాండ్ల హవా... మైక్రోమ్యాక్స్ మనందరికీ సుపరిచితమే. దేశీ మార్కెట్లోకి తూఫాన్‌లా దూసుకొచ్చిన ఈ కంపెనీ విలువ ఇప్పటికే బాగా పెరిగింది. ఇప్పటిదాకా మైక్రోమ్యాక్స్ పేరిట వివిధ మోడళ్లను తెచ్చిన ఈ సంస్థ ఇపుడు ‘యూ’ బ్రాండ్‌తోనూ ఫోన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే యూ-యురేకాను విడుదల చేసి... తాజాగా యూ-యుఫోరియాను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఇక అంతర్జాతీయ దిగ్గజం హువాయి... ‘హానర్’ పేరిట మరో బ్రాండ్‌ను తెరపైకి తెచ్చి, పలు మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది కూడా. ఇక చైనా దిగ్గజాలు ఒప్పో, జెడ్‌టీఈ, కూల్ప్యాడ్తో పాటు లావా కూడా సబ్బ్రాండ్ను మార్కెట్‌కు పరిచయం చేసింది. నుబియా పేరిట జెడ్‌టీఈ, డాజెన్ పేరిట కూల్‌ప్యాడ్ తమ సబ్ బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చాయి. ఒప్పో పేరెంట్ కంపెనీ బీబీకే ఎలక్ట్రానిక్స్... తాజాగా వివో బ్రాండ్‌తో కూడా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. ఇంకా విశేషమేంటంటే జోలో పేరిట లావా మొబైల్స్ సబ్ బ్రాండ్‌ను తేగా... ఈ నెల 10న జోలో మరో సబ్‌బ్రాండ్ ‘బ్లాక్’ను ఆవిష్కరించేందుకు సిద్ధమయింది. డాజెన్ మినహా మిగిలిన సబ్ బ్రాండ్ మొబైల్స్‌పై ఎక్కడా ప్రధాన బ్రాండ్ పేరు కనిపించదు. హానర్ 2014లో ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల యూనిట్లను విక్రయించింది. రెండింతల అమ్మకాలను 2015లో నమోదు చేయాలన్నది కంపెనీ లక్ష్యం. ఇక జెడ్‌టీఈకి చెందిన నుబియా గతేడాది వివిధ దేశాల్లో 50 లక్షల యూనిట్లు అమ్మింది. 2015లో కోటి యూనిట్ల లక్ష్యం పెట్టుకుంది. ఈ ఏడాది కూల్‌ప్యాడ్ ఇప్పటిదాకా 50 లక్షల పైచిలుకు డాజెన్ ఫోన్లను విక్రయించింది. దేశీ బ్రాండ్లే ఎక్కువ...: గతేడాది మార్కెట్లోకి వచ్చిన 95 బ్రాండ్లలో విదేశీవి 31కాగా మిగిలిన 64 దేశీయ బ్రాండ్లే. పెపైచ్చు ఇవి విడుదల చేసిన 1135 ఫోన్లలో స్మార్ట్ఫోన్లే ఎక్కువ. వీటిలో 691 స్మార్ట్‌ఫోన్లుండగా మిగిలినవి ఫీచర్ ఫోన్లు. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న భారత్... 2017 నాటికి అమెరికా మార్కెట్‌ను మించిపోయి 2వ స్థానానికి చేరుతుందని పరిశోధన సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్ తెలియజేసింది. 2015లో దేశంలో 11.8 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. ఇంతటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే భారత్‌లో సబ్ బ్రాండ్లు సైతం అడుగు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌తో ప్రారంభమై.. హువాయి, జెడ్‌టీఈ, కూల్‌ప్యాడ్, మైక్రోమ్యాక్స్, జోలో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ మోడళ్లను విక్రయిస్తున్నాయి. అయితే వీటి సబ్ బ్రాండ్లు మాత్రం షియోమీ, మోటరోలా మాదిరిగా ఆన్లైన్ ద్వారానే రంగ ప్రవేశం చేస్తున్నాయి. వ్యాపారావకాశాల దృష్ట్యా ఇటీవలే హానర్ ఆఫ్‌లైన్‌లోకి ప్రవేశించింది. బ్లాక్ ఈ నెల ఆవిష్కరించనున్న మోడల్‌ను వొడాఫోన్ ఔట్లెట్లలో ప్రదర్శనకు పెట్టింది. ఆన్‌లైన్‌కే పరిమితమైతే పంపిణీ, సరఫరా వ్యవస్థను పూర్తిగా నియంత్రించుకునేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉంటుందని సైబర్ మీడియా రీసర్చ్ విశ్లేషకుడు ఫైజల్ కవూసా తెలిపారు. అంతేగాక మార్జిన్లు బాగుంటాయని, మోడళ్లను భిన్నంగా అందించేందుకు వీలవుతుందని చెప్పారు. కోట్ల మంది పట్టణ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవచ్చని కౌంటర్ పాయింట్ టెక్నాలజీ అనలిస్ట్ తరుణ్ పాఠక్ చెప్పారు. ఆవిష్కరించిన తొలి రోజు నుంచే దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరుకోవచ్చన్నారు. -
మైక్రోమ్యాక్స్ నుంచి అతి పలుచని స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : ప్రముఖ దేశీ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ప్రపంచంలోనే అతి పలుచనైన ‘కాన్వాస్ సిల్వర్ 5’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఆవిష్కరించింది. దీని ధర రూ.17,999. బంగారు, నలుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచలోనే అతి పలుచనైనది (5.1 మిల్లీమీటర్లు), అతి తక్కువ బరువు (97 గ్రాములు) కలది. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.8 అంగుళాల తెర, 4జీ, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, డబుల్ డేటా ఆఫర్‌తో కూడిన ఉచిత 4జీ ఎయిర్టెల్ సిమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ చివరి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. -
మైక్రోమ్యాక్స్ ప్లాంటుకు రూ.400-500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు రూ.400-500 కోట్లు వెచ్చించనుంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో (ఈఎంసీ) రానున్న ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో ఈ ప్లాంటు ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారమిక్కడ చెప్పారు. ఈఎంసీలో 1,000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద ఈఎంసీ రానున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ వద్ద మైక్రోమ్యాక్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫోన్ల విపణిలో ఉన్న మైక్రోమ్యాక్స్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం (నేడు) తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ సందర్భంగా సీఎం కె.చంద్రశేఖరరావు సమక్షంలో మైక్రోమ్యాక్స్ తన ప్రణాళికను ప్రకటించనున్నట్టు సమాచారం. ఎంత పెట్టుబడి, ప్లాంటు తయారీ సామర్థ్యం వంటి విషయాలను ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించనుంది. పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. గార్టనర్ నివేదిక ప్రకారం 2015 జనవరి-మార్చి కాలంలో ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇందులో మైక్రోమ్యాక్స్ 81.58 లక్షల యూనిట్లతో 1.8 శాతం వాటా దక్కించుకుంది. తద్వారా ప్రపంచ టాప్-10 సెల్‌ఫోన్ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 2014లో మొత్తం 3.3 కోట్ల యూనిట్లను విక్రయించింది. -
మైక్రోమ్యాక్స్ ‘యునైట్ 3’ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్: ప్రముఖ దేశీ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ ‘యునైట్ 3’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,999. ఆండ్రాయిడ్ లాలీపాప్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.7 అంగుళాల తెర, 1.3 గిగాెహ డ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 10 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే వినియోగదారులు ట్రాన్స్‌లేట్, ట్రాన్స్లిటరేట్ చేసుకునేందుకు అనువైన యునైట్ మెసేజింగ్ సర్వీస్ ఫీచర్ దీని సొంతం. -
7% తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 7 శాతం క్షీణించి 1.95 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. సుంకాల విధానంలో మార్పులు, చైనా నుంచి సరఫరాలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణమని సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) వెల్లడించింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ1లో భారత్‌లో మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ (ఫీచర్ ఫోన్లు సహా) 15 శాతం క్షీణించి 5.3 కోట్ల యూనిట్లకు తగ్గింది. చాలా మటుకు కొత్త హ్యాండ్సెట్స్ 2014 క్యూ4లోనే వచ్చేయడంతో 2015 క్యూ1లో మొబైల్స్ మోడల్స్‌పై ఆసక్తి తగ్గిందని సీఎంఆర్ లీడ్ అనలిస్ట్ టెలికమ్ రీసెర్చ్ ఫైసల్ కవూసా తెలిపారు. మరోవైపు కొరియా హ్యాండ్సెట్ దిగ్గజం శాంసంగ్..స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన వాటాను 23.7 శాతం నుంచి 27.9 శాతానికి పెంచుకుంది. ఎంట్రీ లెవల్ నుంచి హై ఎండ్ దాకా మూడు సెగ్మెంట్లలో కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టడం శాంసంగ్‌కు లాభించినట్లు కవూసా వివరించారు. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో 17.8 శాతం నుంచి 16.2 శాతానికి మార్కెట్ వాటా తగ్గడంతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో నిల్చింది. 9.2 శాతం మార్కెట్ వాటాతో ఇంటెక్స్ మూడో స్థానంలో ఉంది. సీజన్ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు పూర్తిగా ఆన్లైన్ అమ్మకాలపై ఆధారపడకుండా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని సీఎంఆర్ టెలికం అనలిస్ట్ కర్ణ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
మైక్రోమాక్స్ ప్రమోటర్లకు జాక్‌పాట్!
మొబైల్ అమ్మకాల్లో దూసుకెళుతున్న దేశీ దిగ్గజం మైక్రోమాక్స్.. త్వరలో చేతులు మారనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం టాప్‌గేర్‌లో ఉండటంతో ఇదే అవకాశంగా మంచి రేటుకు విక్రయించి బయటపడేలా ప్రమోటర్లు ప్రణాళికలు వేస్తున్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ.21,000 కోట్ల వేల్యుయేషన్ లభించినట్లు సమాచారం. కేవలం మొబైల్స్‌ను అసెంబుల్ చేసి విక్రయించే దేశీ కంపెనీకి ఇంత భారీ విలువ రావటం... మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ⇒వాటా విక్రయానికి తహతహ.. ⇒కంపెనీ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా ⇒సాధ్యమైతే పూర్తిగా కంపెనీని అమ్మేసే ప్రణాళిక! ⇒అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు దేశీ మొబైల్స్ మార్కెట్లో మైక్రోమాక్స్ ఒక కెరటం. శామ్సంగ్ లాంటి దిగ్గజాలతో పోటీగా సెల్ఫోన్లను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్న ఈ కంపెనీ ప్రమోటర్లు... సరైన భాగస్వామి లభిస్తే కొంత వాటాను విక్రయించాలని, లేదంటే పూర్తిగా వేరొకరికి అమ్మేసి కంపెనీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ప్రపంచ ఈ-కామర్స్ అగ్రగామి అలీబాబా, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం కంపెనీ విలువను ప్రమోటర్లు 3-3.5 బిలియన్ డాలర్లుగా (గరిష్టంగా రూ.21,000 కోట్లు) లెక్కగట్టారు. ఇది 2013-14లో మైక్రోమాక్స్ ఆదాయానికి 2.5-2.9 రెట్లు కావడం గమనార్హం. ఐదేళ్లలో 14 రెట్లు జూమ్... మైక్రోమాక్స్ వాటా విక్రయంతో అటు ప్రమోటర్లతో పాటు పెట్టుబడిపెట్టిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండనుంది. ప్రస్తుతం ప్రమోటర్ల తర్వాత మైక్రోమాక్స్‌లో టీఏ అసోసియేట్స్ 15 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 2010లో ఈ కంపెనీ రూ.225 కోట్లను పెట్టుబడిగా పెట్టి బోర్డులో చోటు దక్కించుకుంది. అప్పటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మైక్రోమాక్స్ వేల్యుయేషన్ రూ.1,500 కోట్లు మాత్రమేనని అంచనా. ఇప్పుడు ఏకంగా దీనికి 14 రెట్ల విలువను ప్రమోటర్లు ఆశిస్తుండటం గమనార్హం. సెకోయా క్యాపిటల్, శాండ్‌స్టోన్ క్యాపిటల్‌తో పాటు మాడిసన్ ఇండియా క్యాపిటల్‌కు స్వల్ప వాటాలున్నాయి. చైనాకు చెందిన స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్స్ కోటి డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రమోటర్ల అంచనా ప్రకారం సంస్థ అమ్ముడుపోతే ఇన్వెస్టర్లకు బొనాంజా తగిలినట్లే. పదిహేనేళ్ల ప్రస్థానం... 2000వ సంవత్సరంలో నోకియా కంపెనీకి మొబైల్ విడిభాగాల సరఫరాదారుగా మైక్రోమాక్స్ ప్రస్థానం మొదలైంది. రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్... ఈ నలుగురూ దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో హ్యాండ్సెట్ విక్రయాల్లోకి అడుగుపెట్టింది. అనేక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ హ్యాండ్సెట్లను చౌక రేటుకు అందించడంతో మైక్రోమాక్స్‌కు విశేష ఆదరణ లభించింది. తర్వాత స్మార్ట్ఫోన్లలోనూ వేగంగా కొత్త మోడళ్లను పరిచయం చేయడం కంపెనీకి కలిసొచ్చింది. ప్రస్తుతం నెలకు 30 లక్షలకుపైగా హ్యాండ్సెట్లను విక్రయిస్తోంది. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతంగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా దాదాపు 80 శాతం. అంటే తాజా వేల్యుయేషన్ ప్రకారం ఈ నలుగురికీ రూ.16,000 కోట్లకుపైగా లభిస్తాయి. మరోవంక మొబైల్స్ రంగంలో ఉద్ధండులైన ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడం ద్వారా వాటా విక్రయానికి ముందు బ్రాండ్ విలువను మరింత పెంచుకునేలా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. భారతీ ఎయిర్టెల్ సీఈఓ సంజయ్ కపూర్, శామ్సంగ్ ఇండియా మొబైల్ హెడ్ వినీత్ తనేజా తదితరులు గతేడాది మైక్రోమాక్స్‌లో చేరారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లను సమీకరించేందుకు సన్నాహాలు కూడా చేశారు. అయితే, ఇప్పుడు ప్రమోటర్లు ఐపీఓ కంటే వ్యూహాత్మక భాగస్వామి లేదా పూర్తి వాటా విక్రయంపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు వృద్ధి పథంలో కంపెనీని ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్(కంపెనీ) చేతికి అప్పగించాలనేది ప్రమోటర్ల వ్యూహంగా చెబుతున్నారు. ⇒ భారత్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి మొబైల్ ఫోన్ కంపెనీగా... డ్యుయల్ సిమ్ ఫోన్లను దేశంలో ప్రవేశపెట్టిన తొలి హ్యాండ్సెట్ సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది. ⇒ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సైనోజెన్ ఓఎస్‌తో(యురేకా బ్రాండ్) తొలిసారిగా చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. ⇒ భారత్‌లో పెట్టుబడులకు ఉరకలేస్తున్న అలీబాబా... ఇటీవలే ఎం-కామర్స్ దిగ్గజం పేటీఎంలో 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దేశీ మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టింది. ⇒ సాఫ్ట్‌బ్యాంక్ కూడా వచ్చే కొన్నేళ్లలో భారతీయ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల్లో 10 బిలియన్ డాలర్లను వెచ్చించే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే స్నాప్‌డీల్, హౌసింగ్.కామ్, ఓలా క్యాబ్స్ తదితర కంపెనీల్లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుపెట్టింది. ⇒ దాదాపు ఏడాది క్రితం భారత్‌లోకి అడుగుపెట్టిన చైనా ‘యాపిల్’ షియోమి ప్రస్తుత వేల్యుయేషన్ 45 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012లో దీని విలువ 4 బిలియన్ డాలర్లే. -
రూ. 699కే మైక్రోమ్యాక్స్ ‘జాయ్’ ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్ అతి తక్కువ ధరలకే జాయ్ సీరిస్‌లో రెండు రకాల ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 1.76 అంగుళాల తె ర, 750 ఎంఏహెచ్ బ్యాటరీ, 0.08 ఎంపీ కెమెరా వంటి ప్రత్యేకతలున్న ‘జాయ్ ఎక్స్-1800’ ఫోన్ ధర రూ. 699. ఇదే ప్రత్యేకతలతో 1,800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న మరో ఫోన్ ‘జాయ్ ఎక్స్-1850’ ధర రూ.749. దీర్ఘకాల మన్నిక, అధిక బ్యాటరీ సామర్థ్యం వంటి త దితర ప్రత్యేకతల వల్ల వినియోగ దారుల ఎంపికలో మా ఫోన్లు అగ్రస్థానంలో నిలుస్తాయని మైక్రోమ్యాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్స్-1800 రకం ఫోన్లు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని, ఎక్స్-1850 రకం ఫోన్లను మరో వారంలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోమ్యాక్స్ శుభాజిత్ సెన్ను ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. గతంలో ఈయన గ్లాక్సో స్మిత్‌క్లైన్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త త్రీజీ కాలింగ్ ట్యాబ్
దేశీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తాజాగా మరో ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏడు అంగుళాల స్క్రీన్‌సైజుతో వస్తున్న ఈ ట్యాబ్ పీ470లో తెలుగుతోపాటు 21 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం విశేషం. అంటే మనకు నచ్చిన ప్రాంతీయ భాషలో మెయిళ్లు, సోషల్ నెట్వర్కింగ్ పోస్టింగ్స్ సులువుగా చేసుకోవచ్చునన్నమాట. శక్తిమంతమైన 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. రెండు సిమ్ల ద్వారా ఫోన్, డేటా అందుకునే సౌకర్యముంది దీంట్లో. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తూనే 3200 ఎంఏహెచ్ బ్యాటరీని వాడటం ద్వారా అత్యధిక టాక్‌టైమ్, లేదా స్టాండ్‌బై టైమ్ లభించే అవకాశమేర్పడింది,. కంపెనీ అంచనాల ప్రకారం బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 11 గంటల టాక్‌టైమ్, 158 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుంది. మెమరీ విషయానికి వస్తే దీంట్లో ర్యామ్ 1 జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజీ 8 జీబీల దాకా ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. చివరగా ఈ ట్యాబ్లెట్లో ప్రధాన కెమెరా ఐదు, సెల్ఫీ కెమెరా 0.3 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. ధర రూ.6999 మాత్రమే. -
మైక్రోమ్యాక్స్ నుంచి తొలి 4జీ స్మార్ట్‌ఫోన్
యురేకా@ రూ.8,999 న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు తన తొలి 4జీ డివైస్, యురేకాను ఆవిష్కరించింది. శ్యానోజెన్ (ఈ ఓఎస్‌కు ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారం) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే యురేకా మొబైల్ ధర రూ.8,999. జోరుగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఔత్సాహికుల సెగ్మెంట్‌ను దృష్టిలోపెట్టుకొని యురేకాఫోన్ను అందిస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. అమెజాన్‌లో విక్రయం... ఈ ఫోన్‌కు ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌డాట్‌ఇన్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని, వచ్చే నెల రెండో వారం నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టకోర్ ప్రాసెసర్, 64 బిట్ మల్టీ-కోర్ సీపీయూ, 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా యు బ్రాండ్ కింద మరిన్ని కొత్త స్మార్ట్ఫోన్లను అందిస్తామని పేర్కొన్నారు. -
ఫార్చ్యూన్ ‘40 అండర్ 40’లో మనోళ్లు నలుగురు..
న్యూయార్క్: ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన 40 అండర్ 40 జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాల లోపు వయస్సున్న 40 మంది అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన, ముఖ్యమైన వ్యక్తులతో ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొందించింది. స్నాప్‌డీల్ , మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకులతో పాటు హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. హార్వార్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన రాజ్ చెట్టి ఈ జాబితాలో 16 వ స్థానంలో ఉన్నారు. న్యూఢిల్లీలో జన్మించిన ఆ 35 ఏళ్ల రాజ్ చెట్టి 23 ఏళ్లకే హార్వార్డ్ యూనివర్శిటీలో పీ.హెచ్డీ చేశారు. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 37 ఏళ్ల రాహుల్ శర్మ ఈ జాబితాలో 21వ స్థానంలో నిలిచారు. స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 31 సంవత్సరాల వయస్సున్న కునాల్ బహాల్ 25వ ర్యాంక్‌ను సాధించారు, ట్విట్టర్‌కు న్యాయ సలహా దారు, ఆ కంపెనీ ఏకైక మహిళా ఎగ్జిక్యూటివ్ అయిన 39 సంవత్సరాల విజయ గద్దె 28వ స్థానంలో నిలి చారు. కాగా ఈ జాబితాలో రైడ్‌షేరింగ్ సర్వీస్ కంపెనీ యుబెర్ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్, ఆతిథ్య రంగ కంపెనీ ఎయిర్బన్బ్స్ సీఈఓ బ్రియాన్ చెస్కీలు మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. -
మైక్రోమ్యాక్స్ డివైస్‌లపై ఉచితంగా ఇంటర్నెట్
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సంస్థ విక్రయించే ఆరు ఎంపిక చేసిన డివైస్ల ద్వారా ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసుల సంస్ధ, బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని మైక్రోమ్యాక్స్ సీఈఓ వినీత్ తనేజా చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా 3 నెలలకు 2జీబీ డేటా చొప్పున ఏడాది పాటు ఇంటర్నెట్ ఉచితమని వివరించారు. ఫీచర్ ఫోన్లపై ఉచిత వాయిస్ కాల్స్(నెట్‌పై) పొందవచ్చని పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ ఎక్స్070, ఎక్స్088 (ఫీచర్ ఫోన్లు), ఏ37, ఏ37బి (స్మార్ట్ఫోన్లు), పీ410ఐ (ట్యాబ్లెట్), ఎంఎంఎక్స్377జీ(డేటాకార్డ్)లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని వివరించారు. ఈ ఆఫర్‌తో వినియోగదారులకు హై స్పీడ్ 3జీ డేటాను అందిస్తామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏఎన్ రాయ్ చెప్పారు. ఇప్పటికే 2,300కు పైగా నగరాల్లో 3జీ సర్వీసులందిస్తున్నామని, మరిన్ని నగరాలకు ఈ సర్వీసులందజేస్తామని వివరించారు. -
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ హవా
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాల వృద్ధి జోరు బలహీనంగా ఉందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వేగంగా వృద్ధిచెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వృద్ధి గత ఏడాది మొదటి మూడు నెలల్లో మూడంకెల్లో ఉండగా, ఈ ఏడాది 84 శాతంగానే ఉందని ఐడీసీ తాజా నివేదిక వెల్లడించింది. మరిన్ని వివరాలు... గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి కోటికి పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే కాలానికి 1.84 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 29 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(18 శాతం), కార్బన్ (8 శాతం), లావా(6 శాతం) ఉన్నాయి. ఈ వృద్ధిరేట్లను పరిగణనలోకి తీసుకుంటే, ఈ కంపెనీల స్థానాలు మారే అవకాశం ఉంది. మరిన్ని చౌక ధరల స్మార్ట్ఫోన్లను అందించాల్సిన అవసరం శామ్సంగ్కు ఉంది. అంతేకాకుండా అమ్మకాల వృద్ధి జోరును కొనసాగించాలంటే హై ఎండ్ కేటగిరిలో యాపిల్ వంటి బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌ను అందించాల్సి కూడా ఉంది. మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఫీచర్ ఫోన్ల విక్రయాల వాటా 71 శాతంగా ఉంది. ఫీచర్ ఫోన్లు కొనుగోళ్లు చేసినవాళ్లు ఆ తర్వాత స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో స్మార్ట్ఫోన్ల మార్కెట్ వృద్ధి జోరుగా ఉండొచ్చు. రానున్న పండుగల సీజన్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారీగా పెరగవచ్చు. చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రానుండడం, ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ కానుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్ఫోన్లు భారీగా అమ్ముడవుతున్నాయి. పలు చైనా కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుండడం, మోజిల్లా సంస్థ అందుబాటు ధరల కేటగిరి స్మార్ట్ఫోన్ల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు ఢోకా లేదు. -
శామ్సంగ్ను మించిన మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: శామ్సంగ్, నోకియా వంటి విదేశీ దిగ్గజాలకు గట్టిపోటీనిస్తున్న దేశీ సంస్థ మైక్రోమ్యాక్స్...తాజాగా వాటిని అధిగమించింది. ఏప్రిల్-జూన్ కాలానికి దేశీయంగా మార్కెట్వాటాలో శామ్సంగ్ను, ఫీచర్ఫోన్స్ విక్రయాల్లో నోకియాను దాటేసింది. అటు అంతర్జాతీయంగా అతి పెద్ద హ్యాండ్సెట్ బ్రాండ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివరాలు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా మొబైల్స్ విక్రయాల్లో 16.6 శాతం మా ర్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ అగ్రస్థానంలో నిల్చింది. ఆ తర్వాతి స్థానాల్లో శా మ్‌సంగ్ (14.4 శాతం వాటా), నోకియా (10.9%) కార్బన్ (9.5%)లు నిలిచాయి. ఇక ఫీచర్‌ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ తొలిసారిగా నోకియాను అధిగమించింది. 15.2 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోయింది. నోకియా 14.7% వాటాతో రెండో స్థానంలో నిలిచింది. కార్బన్, శామ్సంగ్, లావా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నా యి. స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోమ్యాక్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నప్పటికీ 19% మార్కెట్ వాటాతో రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25.3% వాటాతో శామ్సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. -
మైక్రోమ్యాక్స్.. విండోస్ మొబైల్ ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే తొలి మొబైల్ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. కాన్వాస్ విన్ డబ్ల్యూ121(ధర రూ.9,500), కాన్వాస్ విన్ డబ్ల్యూ092(ధర రూ.6,500)- ఈ రెండు ఫోన్లు డ్యుయల్-సిమ్ ఫోన్లని కంపెనీ చైర్మన్ సంజీవ్‌కపూర్ చెప్పారు. వచ్చే నెల నుంచి వీటి విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉన్న కాన్వాస్ డబ్ల్యూ121లో 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఇక కాన్వాస్ విన్ డబ్ల్యూ 092లో 4-అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. తొలి దేశీయ కంపెనీ..: స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో భారత్‌లో రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పటివరకూ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై ఫోన్లను అందిస్తోంది. మొదటి స్థానంపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ ఓఎస్ ఆధారిత మొబైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఓఎస్‌పై పనిచేసే మొబైళ్లను తయారు చేసిన మొదటి దేశీయ కంపెనీగా మైక్రోమ్యాక్స్ అవతరించింది. ఇప్పటికే విండోస్ ఓఎస్ ఆధారిత ఫోన్లను నోకియా, హెచ్‌టీసీ, ఎల్జీ, డెల్‌లు తయారు చేస్తున్నాయి. -
కొత్త సరుకు
లావా ఐరిస్ ఎక్స్1 దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐరిస్ ఎక్స్1 పేరుతో కిట్‌క్యాట్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్ షాపింగ్ పోర్టల్ ద్వారా లభిస్తున్న ఎక్స్1 ధర దాదాపు రూ.7999. రెండు జీఎస్ఎం సిమ్‌లను సపోర్ట్ చేసే ఎక్స్1 స్క్రీన్ సైజు దాదాపు 4.5 అంగుళాలు. స్క్రీన్ రెజల్యూషన్ 480 బై 854గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.2 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేసే బ్రాడ్‌కామ్ బీసీఎం 23550 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెండు ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది. రెజల్యూషన్ 8 మెగాపిక్సెల్స్. వీడియోకాలింగ్ కోసం రెండు ఎంపీల కెమెరా ఉంటుంది. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీ కార్డు ద్వారా 32జీబీకి పెంచుకోవచ్చు) ఉంటుంది. త్రీజీతోపాటు వైఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్/ఎడ్జ్, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ స్మార్ట్‌ఫోన్‌లో తాజా ఓఎస్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎంగేజ్... మైక్రోమ్యాక్స్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కాన్వాస్ ఎంగేజ్ను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే కొనుక్కోగల ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.6199 మాత్రమే కావడం గమనార్హం. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌ను ఉపయోగించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (1.2 గిగాహెర్ట్జ్) ఉన్నప్పటికీ ర్యామ్ మాత్రం 512 ఎంబీ మాత్రమే ఉండటం కొంచెం నిరాశపరిచే అంశం. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 5 ఎంపీ కాగా, వీడియోకాలింగ్ కెమెరా రెజల్యూషన్ 0.3 మెగాపిక్సెల్స్. బ్యాటరీ సామర్థ్యం 1500 ఎంఏహెచ్. ఈ బ్యాటరీతో 5.5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, హైక్, ఎంఐగేమ్స్, గేమ్స్క్లబ్, రివెరై ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి సాఫ్ట్వేర్లు దీంట్లో ప్రీలోడెడ్. గెలాక్సీ ఎస్4 వాల్యూ ఎడిషన్... శామ్సంగ్ తాజాగా కిట్‌క్యాట్‌తో నడిచే గెలాక్సీ ఎస్4 వాల్యూ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి దీన్ని ఆన్లైన్ స్టోర్ ద్వారా నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ధర దాదాపు రూ.31,700. అయిదు అంగుళాల ఫుల్హెచ్డీ స్క్రీన్‌తో వచ్చే ఎస్4 వాల్యూ ఎడిషన్‌లో శక్తిమంతమైన 1.9 గిగాహెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ మైక్రోప్రాసెసర్‌ను ఉపయోగించారు. రెండు గిగాబైట్ల ర్యామ్, 15 జీబీల ఇంటర్నల్ మెమరీ దీని సొంతం. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెళ్లు. వీడియో కాలింగ్ కెమెరా రెజల్యూషన్ 2 ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 2600 ఎంఏహెచ్. -
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో చౌక ఫోన్
న్యూఢిల్లీ: మోటరొల మొబిలిటి కంపెనీ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్క్యాట్పై పనిచేసే సరికొత్త మొబైల్ ఫోన్, ‘మోటో ఇ’ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యూయల్ సిమ్ మొబైల్ ధర రూ.6,999 అని మెటరోల మొబిలిటీ ఇండియా జీఎం అమిత్ బొని తెలిపారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఫోన్లలో అత్యంత చౌకైన ఫోన్ ఇదే. ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 1.2 గిగా హెర్ట్జ్ డ్యుయల్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ(32 జీబీ వరకూ విస్తరించుకోగల మెమరీ), 1,980 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ తాజా ఫోన్ కారణంగా భారత మార్కెట్లో తమ జోరు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునే భారత వినియోగదారుల అవసరాలకనుగుణంగా ఇ ఫోన్‌ను రూ పొందించామన్నారుు. దేశీ మొబైల్ కంపెనీలు మైక్రోమ్యాక్స్, కార్బన్లకు ఈ ‘మోటో ఇ’ ఫోన్ గట్టి సవాల్నిస్తుందని అంచనా. ఆన్లైన్ విక్రయాలు అదుర్స్ ఆన్లైన్ ద్వారా తమ మొబైళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని అమిత్ బొని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే 2 కోట్ల మొబైళ్లు విక్రయించామని వివరించారు. తాజాగా అందిస్తున్న మోటో ఇ అమ్మకాలు ఆన్లైన్లో ఈ ఒక్క వారంలోనే 5 లక్షలు ఉండొచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
కొత్త సరుకు
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో ఎల్జీ ఎల్80 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ కిట్‌క్యాట్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ కంపెనీ ఎల్80 పేరుతో ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మధ్యమశ్రేణి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ధర రూ.13,100 వరకూ ఉండవచ్చునని అంచనా. ఎల్జీ ఇండొనేషియా ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ఎల్80 రాకను తెలియజేయగా దీంట్లో సింగిల్ సిమ్, డబుల్ సిమ్ వేరియంట్లు రెండూ ఉంటాయని తెలిపింది. ఎల్80లో 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ క్వాల్కామ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. స్క్రీన్‌సైజు దాదాపు 5 అంగుళాలు. ఇక మెమరీ విషయానికొస్తే దీంట్లో ఒక గిగాబైట్ ర్యామ్, 4 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు ఉపయోగించే వీలుంది కాబట్టి మెమరీని మరింత పెంచుకోవచ్చు. అయిదు మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీంట్లో ఏర్పాటు చేశారు. త్రీజీ, బ్లూటూత్ 4.0, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, వైఫై వంటి అదనపు హంగులున్న ఎల్జీ ఎల్80లో 2540 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 కలర్స్... దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ రంగు రంగుల కవర్షెల్స్తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన కాన్వాస్ శ్రేణిలో భాగంగా ‘కాన్వాస్ 2 కలర్స్’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.పది వేల వరకూ ఉండవచ్చు. డార్క్ గ్రే, వైట్ రంగుల్లో లభించే కాన్వాస్ కలర్స్ కవర్షెల్స్ మాత్రం భిన్న రంగుల్లో లభిస్తాయి. డార్క్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్‌ను ఖరీదు చేస్తే దాంతోపాటు రేడియెంట్ రెడ్, మిస్టిక్ బ్లూ కవర్లు లభిస్తాయి. తెల్లరంగు ఫోన్‌తోపాటు వైబ్రంట్ ఎల్లో, స్ప్లెండిడ్ గ్రీన్ కవర్లు ఉంటాయన్నమాట. రెండు జీఎస్ఎం సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగల కలర్స్‌లో అయిదు అంగుళాల స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ 4 గిగాబైట్లు. పిక్సెల్ రెజల్యూషన్ 720 బై 1280 ఉండటం విశేషం. అలాగే ప్రధాన కెమెరా 8 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీయగలుగుతుంది. వీడియో కాలింగ్‌కు ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 2 మెగాపిక్సెల్స్. బర్న్ ద రోప్, ఫుక్రే, ఫ్రాగ్ బరస్ట్ వంటి గేమ్స్, కింగ్‌సాఫ్ట్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, ఎంఐ గేమ్స్, రివరీ ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి అప్లికేషన్లతో కలిపి లభిస్తోంది ఈ స్మార్ట్‌ఫోన్. ఐవరీ ఎస్ టాబ్లెట్ దేశీయ టెక్నాలజీ కంపెనీ లావా త్రీజీ ఆధారిత టాబ్లెట్ ఐవరీఎస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ స్టోర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టాబ్లెట్ ఏడు అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఐవరీ ఎస్‌లో గ్రాఫిక్స్ కోసం మాలీ 400 జీపీయూ కూడా ఏర్పాటు చేశారు. రెండు సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగలదీ టాబ్లెట్. త్రీజీ, 2జీ బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక గిగాబైట్ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీకార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు) ఉన్న ఐవరీ ఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్. వాట్స్అప్, హంగామా, పేటీఎం, ఈఏ గేమ్స్, వంటివి ప్రీలోడెడ్‌గా లభిస్తాయి. ధర రూ.8499. నికాన్ కూల్‌పిక్స్ శ్రేణి కెమెరాలు.. సుప్రసిద్ధ కెమెరా తయారీ కంపెనీ నికాన్ తాజాగా తన కూల్‌పిక్స్ శ్రేణిలో భాగంగా 16 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఫొటోగ్రఫీ నిపుణులతోపాటు సామాన్యులు సైతం సులువుగా ఉపయోగించేందుకు వీలుగా వేర్వేరు స్పెసిఫికేషన్స్, ఫీచర్లతో ఉన్నాయి ఈ కెమెరాలు. కూల్‌పిక్స్ పీ సిరీస్‌లో భాగంగా విడుదలైన పీ600, పీ530, పీ340ల్లో సూపర్ లాంగ్ జూమ్ లెన్సులు, ఫుడ్ హెచ్డీ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కూల్‌పిక్స్ పీ600లో అప్టికల్ జూమ్ 60 ఎక్స్ వరకూ ఉండగా, డైనమిక్ జూమ్1 120 ఎక్స్ వరకూ ఉండటం వల్ల సుదూర చిత్రాలను కూడా స్పష్టంగా తీసే అవకాశముంది. వైడ్ యాంగిల్ 24 మిమీల నుంచి 1440 మిమీ వరకూ ఉండటం విశేషం. వైఫై, జీపీఎస్ టెక్నాలజీలనూ దీంట్లో పొందుపరిచారు. ఇక ఎస్ శ్రేణి కెమెరాల్లో మొత్తం ఎనిమిది కెమెరాలను విడుదల చేసింది. ఎస్9700లో 30 ఎక్స్ ఆప్టికల్, డైనమిక్ జూమ్1లు ఉన్నాయి. ట్రావెల్లాగ్స్ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణించే మార్గాన్ని, ఫొటో తీసిన ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా లొకేషన్ రికార్డు చేయవచ్చు. ఎస్9600లో 22 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 16 ఎంపీ రెజల్యూషన్ ఉన్నాయి. ఎల్శ్రేణిలో మొత్తం 4 మోడళ్లను ప్రవేశపెట్టారు. వీటిల్లోని ఎల్830లో అల్ట్రా హై పవర్ జూమ్ బ్రిడ్జ్ కెమెరా టెక్నాలజీని ఉపయోగించారు. ఇక ఎల్330 26ఎక్స్ ఆప్టికల్ జూమ్ సౌకర్యం కలిగి ఉంది. ఈజీ ఆటోమోడ్, స్మార్ట్ పోర్టెయిట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ ఎల్ శ్రేణి కెమెరాల్లో. చివరగా కూల్‌పిక్స్ ఏడబ్యూ120 గురించి. రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఉద్దేశించిన ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ కూడా. రెండు మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా తట్టుకునే విధంగా తయారు చేశారు. పీ శ్రేణి కెమెరా ధర రూ.19 నుంచి రూ.24 వేల మధ్యలో ఉంటే.. ఎస్ శ్రేణి ధర రూ.6450 నుంచి రూ.17950 వరకూ ఉంటాయి. ఎల్శ్రేణి కెమెరాల ధర రూ.5వేల నుంచి రూ.16 వేల వరకూ ఉంది. ఏడబ్ల్యూ 120 ధర రూ.17950. -
దక్షిణ కొరియా సంస్థపై మైక్రోమ్యాక్స్ కన్ను
సియోల్: దేశీ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్... దక్షిణ కొరియా కంపెనీ పాన్టెక్లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. విదేశాలలో విస్తరించేందుకు వీలుగా పాన్టెక్లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పాన్‌టెక్ మూడో స్థానంలో ఉంది. అయితే విపరీతమైన పోటీ కారణంగా వరుసగా ఆరు క్వార్టర్లపాటు నష్టాలను ప్రకటించింది. దీంతో రుణ పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. కాగా, వాటా కొనుగోలుకి ఆసక్తిగా ఉన్న విషయాన్ని పాన్‌టెక్ కంపెనీకి మైక్రోమ్యాక్స్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎంతమేర వాటాను కొనుగోలు చేసేదీ, అలాగే వాటాకు సంబంధించిన విలువ తదితర వివరాలు వెల్లడికాలేదు. పాన్టెక్లో 9 రుణదాత సంస్థలు సంయుక్తంగా 37% వాటాను కలిగి ఉన్నాయి. ఇక క్వాల్‌కామ్‌కు 12%, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు 10% చొప్పున వాటా ఉంది. వ్యాఖ్యానించలేం: భాగస్వామ్యం, కొనుగోలు వంటి కార్యకలాపాలకు డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేయాలని, దీంతోపాటు సంబంధిత నియంత్రణ సంస్థలు, నిబంధనలు అనుమతించాలని పాన్‌టెక్ కొనుగోలు అంశంపై మైక్రోమ్యాక్స్ స్పందించింది. ఊహాజనిత అంశాలపై వ్యాఖ్యానించబోమంది. దక్షిణ కొరియా మార్కెట్లో శామ్సంగ్, ఎల్జీ వంటి కంపెనీలతో పోటీ కారణంగా పాన్‌టెక్ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంది. -
రెండు ఓఎస్‌లపై పనిచేసే మైక్రోమ్యాక్స్ ‘ల్యాప్‌ట్యాబ్’
లాస్‌వేగాస్: మైక్రోమ్యాక్స్.. ల్యాప్‌ట్యాబ్ పేరుతో రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పని చేసే కొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొస్తోంది. విండోస్ 8, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌లపై పనిచేసే ఈ ల్యాబ్‌ట్యాబ్ ధర రూ.30,000 లోపు ఉంటుందని మైక్రోమ్యాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. ఇక్కడ జరుగుతున్న కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించిన ఈ ట్యాబ్లెట్‌ను వచ్చే నెల నుంచి భారత్‌లో విక్రయిస్తామన్నారు. ఈ ట్యాబ్‌లో 1.46 గిగాహెర్ట్జ్ ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, 10.1 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 64 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయి. -
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ బ్లేజ్ @ రూ.11,000
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ కాన్వాస్ సిరీస్‌లో కొత్త ఫోన్, కాన్వాస్ బ్లేజ్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.11,000. ఈ ఫోన్‌ను ఎంటీఎస్ సీడీఎంఏ నెట్‌వర్క్‌ను, ఏ ఇతర జీఎస్ఎం నెట్‌వర్క్‌నైనా సపోర్ట్ చేసే విధంగా రూపొందించామని మైక్రోమ్యాక్స్ సహ-వ్యవస్థాపకుడు వికాస్ జైన్ తెలిపారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 3జీ ఈవీడీవో(సీడీఎంఏ టెక్నాలజీ) ప్రత్యేక ఆకర్షణ అన్నారు. యూజర్లు తమ జీఎస్ఎం నం బర్తో పాటు ఎంటీఎస్ 3జీ ఈవీడీవో నెట్వర్క్ ప్రయోజనాలను పొందవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సెల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 768 ఎంబీ ర్యామ్, 4జీబీ మెమెరీ, 32జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఆర్నెళ్లు డేటా, వాయిస్ ప్రయోజనాలు ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 2జీ మొబైల్ ఇంటర్నెట్, ఎంటీఎస్ నుంచి ఎంటీఎస్కు 1,000 నిమిషాల లోకల్ కాలింగ్, 120 నిమిషాల ఇతర లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితమని వికాస్జైన్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ ఆర్నెళ్ల పాటు వర్తిస్తుందని తెలిపారు. కాన్వాస్ బ్లేజ్తో ఆర్నెళ్ల పాటు డేటా, వాయిస్ ప్రయోజనాలు ఉచితమని ఎంటీఎస్ ఇండియా చీఫ్ మార్కెటింగ్, సేల్స్ ఆఫీసర్ లియోనిద్ ముసతోవ్ చెప్పారు. -
విదేశీ మార్కెట్లపై మైక్రోమ్యాక్స్ కన్ను
న్యూఢిల్లీ/ముంబై: మైక్రోమ్యాక్స్ ఐదేళ్ల క్రితం చైనా తయారీ ఫోన్‌ను రూ.1,800కు విక్రయించింది. ఫ్లిప్ చేస్తే ఇప్పుడు దేశంలోనే నంబర్ 2 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎదిగింది. ఇంట గెలిచిన ఈ కంపెనీ ఇప్పుడు రచ్చ గెలవాలనుకుంటోంది. శామ్సంగ్, నోకియా వంటి కంపెనీలు రాజ్యమేలుతున్న మార్కెట్లలోకి పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. మాస్కు చేరువలో స్మార్ట్ఫోన్లు ఐటీ సాఫ్ట్వేర్, టెలికామ్ గేర్ల వ్యాపారం చేసే ఈ కంపెనీ మొదట చౌక ధరల ఫోన్లతో మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. డ్యుయల్ సిమ్ ఫోన్లను అందుబాటులోకి తేవడం, పెద్ద స్క్రీన్ ఫోన్లను చౌక ధరలకే అందించడం వల్ల మొబైల్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ క్లిక్ అయింది. స్మార్ట్ఫోన్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మైక్రోమ్యాక్స్‌దే. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఇక ఇప్పుడు మైక్రోమ్యాక్స్ తన మార్కెట్‌ను విస్తృతం చేసుకోవాలనుకుంటోంది. భారత కంపెనీలు సాధారణంగా బ్రాండ్ అంబాసిడర్లుగా క్రికెటర్లను, హిందీ సినిమా నటులను నియమించుకుంటాయి. ఈ రివాజుకు భిన్నంగా మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా హాలీవుడ్ హీరో హ్యూ జాక్‌మన్‌ను నియమించుకుంది. విదేశీ విస్తరణ దృష్టితోనే జాక్‌మన్‌ను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నదని నిపుణులంటున్నారు. -
భారత్‌లోనే మైక్రోమ్యాక్స్ ఫోన్ల తయారీ
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ భారత్‌లో ఫోన్ల అసెంబ్లింగ్‌ను వచ్చే ఏడాది మార్చికల్లా ప్రారంభించనున్నది. ఇప్పటికి ప్రయోగాత్మకంగా రుద్రపూర్ ప్లాంట్‌లో ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్నామని మైక్రోమ్యాక్స్ సహ-వ్యవస్థాపకులు రాహుల్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ చైనా నుంచి ఫోన్లను దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి రష్యాకు ఫోన్ల ఎగుమతులు ప్రారంభిస్తామని శర్మ చెప్పారు. ఆర్నెల్ల 20 కొత్త మొబైళ్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,168 కోట్ల టర్నోవర్ సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. -
మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా ‘ఎక్స్-మెన్’ జాక్మన్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు ఎక్స్-మెన్ సినిమాల హీరో, ప్రముఖ హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్మన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యహరించనున్నారు. విదేశీ మార్కెట్లపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ ఈ హాలీవుడ్ స్టార్‌తో బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ఒక హాలీవుడ్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత మొబైల్ కంపెనీగా మైక్రోమ్యాక్స్ నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడానికి అక్కడి ప్రజలతో అనుసంధానానికి హ్యూ జాక్‌మన్‌తో భాగస్వామ్యం దోహదపడుతుందని భావి స్తున్నట్లు మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, శుభోదిప్ పాల్ చెప్పారు. భారత్ అద్భుత దేశమని, ఈ దేశాన్ని తాను అమితం గా ప్రేమిస్తానని జాక్మన్ వ్యాఖ్యానించారు. సీఈవో రాజీనామా: మైక్రోమ్యాక్స్ సీఈవో పదవికి దీపక్ మెహరోత్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల దీపక్ రాజీనామా చేశారని మైక్రోమ్యాక్స్ తెలిపింది. కొత్త సీఈవోను త్వరలోనే ప్రకటిస్తామని వివరించింది. -
మైక్రోమ్యాక్స్‌తో ఎయిర్‌సెల్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌తో టెలికం సర్వీసుల కంపెనీ ఎయిర్‌సెల్ చేతులు కలిపింది. మైక్రోమ్యాక్స్ హ్యాండ్‌సెట్స్‌తో పాటు తమ కనెక్షన్ తీసుకున్నవారికి రూ.10,000 దాకా విలువ చేసే ఆఫర్లు అందించనున్నట్లు తెలిపింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎయిర్‌సెల్ రీజనల్ బిజినెస్ హెడ్ హమీర్ బక్షి ఈ విషయాలు వివరించారు. హ్యాండ్సెట్, మొబైల్ కనెక్షన్..రెండూ ఒకే చోట అందించే దిశగా ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని బక్షి పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో పాటు ఆఫర్ అందిస్తున్నట్లు ఎయిర్‌సెల్ ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపిందర్ తివానా తెలిపారు. దీని ప్రకారం రూ. 10,000 దాకా విలువ చేసే ఇంటర్నెట్ టీవీ, మూవీస్, గేమ్స్, యాప్స్ మొదలైన కంటెంట్‌ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, రెండు సెకన్లకు 1 పైసా కాల్ టారిఫ్‌తో పాటు 3జీ స్మార్ట్ఫోన్లలో 2జీబీ దాకాను, 2జీ ఫోన్లలో 1 జీబీ దాకాను డేటా ఉచితంగా అందజేస్తున్నట్లు తివానా పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ డాంగిల్పై 500 ఎంబీ ఇంటర్నెట్ యూసేజ్ ఉచితంగా లభిస్తుంది. 3 నెలల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు పాత టవర్లను కూడా పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నాలుగు వేల పైచిలుకు టవర్లు ఉండగా, హైదరాబాద్‌లో కొత్తగా మరో 22 టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.5 లక్షలుగా ఉన్న యూజర్ల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 20 లక్షలకు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తివానా తెలిపారు.