మైక్రోమ్యాక్స్‌తో ఎయిర్‌సెల్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌తో టెలికం సర్వీసుల కంపెనీ ఎయిర్‌సెల్ చేతులు కలిపింది. మైక్రోమ్యాక్స్ హ్యాండ్‌సెట్స్‌తో పాటు తమ కనెక్షన్ తీసుకున్నవారికి రూ.10,000 దాకా విలువ చేసే ఆఫర్లు అందించనున్నట్లు తెలిపింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎయిర్‌సెల్ రీజనల్ బిజినెస్ హెడ్ హమీర్ బక్షి ఈ విషయాలు వివరించారు. హ్యాండ్‌సెట్, మొబైల్ కనెక్షన్..రెండూ ఒకే చోట అందించే దిశగా ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని బక్షి పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్‌లతో పాటు ఆఫర్ అందిస్తున్నట్లు ఎయిర్‌సెల్ ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపిందర్ తివానా తెలిపారు.
దీని ప్రకారం రూ. 10,000 దాకా విలువ చేసే ఇంటర్నెట్ టీవీ, మూవీస్, గేమ్స్, యాప్స్ మొదలైన కంటెంట్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, రెండు సెకన్లకు 1 పైసా కాల్ టారిఫ్‌తో పాటు 3జీ స్మార్ట్‌ఫోన్లలో 2జీబీ దాకాను, 2జీ ఫోన్లలో 1 జీబీ దాకాను డేటా ఉచితంగా అందజేస్తున్నట్లు తివానా పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ డాంగిల్‌పై 500 ఎంబీ ఇంటర్నెట్ యూసేజ్ ఉచితంగా లభిస్తుంది. 3 నెలల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు పాత టవర్లను కూడా పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నాలుగు వేల పైచిలుకు టవర్లు ఉండగా, హైదరాబాద్‌లో కొత్తగా మరో 22 టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.5 లక్షలుగా ఉన్న యూజర్ల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 20 లక్షలకు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తివానా తెలిపారు.