
చేతిలో మొబైల్ ఉంటే సినిమా థియేటర్‌తో పనిలేదు చాలామందికి. అయితే, వీరందరూ స్మార్ట్‌ఫోన్‌లో 3డీ సినిమాలను చూడలేరు. ఇప్పుడు థియేటర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే 3డీ సినిమాలను కూడా మొబైల్‌లోనే చూడొచ్చు. అదికూడా 3డీ స్క్రీనింగ్‌లో!
‘హమామట్సు ఫొటోనిక్స్’ కంపెనీ తాజాగా ఒక కొత్త సెల్ ఎనలైజర్ ‘సైటో క్యూబ్’ను రూపొందించింది. ఇందులోని లైట్ స్క్రీనింగ్ ఆప్టికల్స్, అత్యాధునిక ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్, మైక్రోప్లేట్ సెల్ కల్చర్ సాయంతో మొబైల్ స్క్రీనింగ్‌ను 3డీ ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్‌తో అందిస్తుంది. మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని దీనిని వాడుకోవచ్చు. అటాచబుల్ స్పీకర్స్‌తో ఒకేసారి కుటుంబం మొత్తం కూడా చూసే వీలుంటుంది.