Three dimensional
-
అతికించిన అందం! ఇంటి గోడలకు త్రీడీ వాల్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంచరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇల్లు అయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది. త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటుంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1/1 సైజ్ నుంచి 20/20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి ఉంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
రాయుడిపై వివక్ష లేదు
ముంబై: విండీస్ టూర్‌కు జట్ల ప్రకటన సందర్భంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వద్ద... తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడి గురించి మీడియా ప్రస్తావించింది. దీనిపై ఎమ్మెస్కే వ్యంగ్యంగా స్పందించాడు. విజయ్ శంకర్‌ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకుంటూ అతడిని త్రీ డైమెన్షనల్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆటగాడిగా ప్రసాద్ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో రాయుడు... ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే ‘3డి’ కళ్లజోడుకు ఆర్డరిచ్చా’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్ స్పందిస్తూ ‘ఆ ట్వీట్ చాలా బాగుంది. సమయోచితం, అద్భుతం కూడా. నేను బాగా ఎంజాయ్ చేశా. ఆ ఆలోచన తనకు ఎలా వచ్చిందో?’ అని అన్నాడు. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడిని ఎంపిక చేయలేదని; అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో అతడు ఎంత ఉద్వేగానికి గురయ్యాడో సెలక్షన్ కమిటీ కూడా అంతే ఉద్వేగానికి లోనైందని అన్నాడు. ఇదే రాయుడు గతేడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికై, యో యో పరీక్ష విఫలమైనప్పుడు విమర్శలు రాగా తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. ప్రపంచ కప్‌లో ధావన్ గాయపడ్డాక జట్టు మేనేజ్మెంట్ ఎడంచేతి ఆటగాడు కావాలని కోరిందని, అందుకే పంత్‌ను పంపామని, ఇక ఓపెనర్ రాహుల్‌కు బ్యాకప్‌గా మయాంక్‌ను తీసుకున్నామని ఎమ్మెస్కే వివరించాడు. ఇందులో పూర్తి స్పష్టతతో వ్యవహరించామని తెలిపాడు. కోన భరత్‌కు తప్పని నిరీక్షణ సెలక్టర్లు టెస్టులకు పంత్, సాహాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్‌కు నిరీక్షణ తప్పలేదు. ఇటీవల అద్భుత ఫామ్ రీత్యా భరత్ ఎంపికపై వార్తలు వచ్చాయి. ‘ఎ’ జట్టు తరఫున ప్రదర్శనలనూ లెక్కలోకి తీసుకున్నామని చెప్పిన ఎమ్మెస్కే... టెస్టు జట్టులోకి ఎంపికకు భరత్ చాలా చాలా దగ్గరగా ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే, గాయంతో దూరమైన జట్టులోని ఒక రెగ్యులర్ ఆటగాడు ఫిట్నెస్ సాధిస్తే ఎంపికలో అతడికే ప్రాధాన్యం ఇవ్వాలన్న అప్రకటిత నియమంతో సాహాకు చాన్స్ దక్కింది. -
ఏమిటీ త్రీడీ ప్రింటింగ్..?
వస్తువులను త్రిమితీయ రూపం(త్రీ డైమన్షనల్)లో ముద్రించడమే 3డీ ప్రింటింగ్. మామూలుగా కాగితంపై అక్షరాలను ముద్రిస్తే.. వాటికి పొడవు, వెడల్పు అనే రెండు డైమన్షన్స్ మాత్రమే ఉంటాయి. వాటికి ఎత్తును కూడా జోడిస్తే.. అదే త్రిమితీయ రూపం. ఉదాహరణకు.. మనకు కావలసిన కీచైన్లు, బొమ్మలు, సెల్‌ఫోన్ కేస్లు, పెన్నులు ఒకటేమిటి.. ఏ వస్తువునైనా 3డీ ప్రింటర్ ద్వారా ముద్రించుకోవచ్చు. ముందుగా కంప్యూటర్లో త్రీడీ బొమ్మను డిజైన్ చేసుకుని లేదా ఎంపిక చేసుకుని.. ప్రింటర్లో ముడిపదార్థం పోసి బటన్ నొక్కితే చాలు.. ఆటోమేటిక్‌గా ముడిపదార్థాన్ని కరిగించి ప్రింటర్ పొరలుపొరలుగా పోస్తూ 3డీ రూపంలో వస్తువులను ముద్రిస్తుంది! విప్లవాత్మకమైన ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.