ఏమిటీ త్రీడీ ప్రింటింగ్..?
వస్తువులను త్రిమితీయ రూపం(త్రీ డైమన్షనల్)లో ముద్రించడమే 3డీ ప్రింటింగ్. మామూలుగా కాగితంపై అక్షరాలను ముద్రిస్తే.. వాటికి పొడవు, వెడల్పు అనే రెండు డైమన్షన్స్ మాత్రమే ఉంటాయి. వాటికి ఎత్తును కూడా జోడిస్తే.. అదే త్రిమితీయ రూపం. ఉదాహరణకు.. మనకు కావలసిన కీచైన్లు, బొమ్మలు, సెల్‌ఫోన్ కేస్‌లు, పెన్నులు ఒకటేమిటి.. ఏ వస్తువునైనా 3డీ ప్రింటర్ ద్వారా ముద్రించుకోవచ్చు. ముందుగా కంప్యూటర్‌లో త్రీడీ బొమ్మను డిజైన్ చేసుకుని లేదా ఎంపిక చేసుకుని.. ప్రింటర్‌లో ముడిపదార్థం పోసి బటన్ నొక్కితే చాలు..
ఆటోమేటిక్‌గా ముడిపదార్థాన్ని కరిగించి ప్రింటర్ పొరలుపొరలుగా పోస్తూ 3డీ రూపంలో వస్తువులను ముద్రిస్తుంది! విప్లవాత్మకమైన ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.