అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి.. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆవిష్కరించింది. వామ్మో..! ఏంటిది అనుకోకండి. మాములుగా మనమే స్నానం చేయడం అనేది పాత ట్రెండ్. దీన్ని కూడా మిషన్ సాయంతో తొందరగా పనికానిస్తే.. అనే వినూత్న ఆలోచనతో జపాన్ చేసిన ఆవిష్కరణ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాదిరి "హ్యూమన్ వాషింగ్ మెషిన్" అన్నమాట. ఏంటీ మిషన్‌తో స్నానమా అని విస్తుపోకండి. ఇది వెల్‌నెస్‌ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధుని ఫీచర్లతో రూపొందించారు. అసలేంటీ మిషన్ ? ఎలా పనిచేస్తుంది..? తదితరాల గురించి తెలుసుకుందామా..!
ఈ "హ్యూమన్ వాషింగ్ మెషిన్"ని ఒసాకాకు చెందిన సైన్స్ కో కంపెనీ ఏఐ సాంకేతికతో రూపొందించింది. దీన్ని జపాన్‌లో మిరాయ్ నింగెన్ సెంటకుకిగా పిలుస్తారు. ఈ మిషన్ కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుందట. అలాగే మంచి విశ్రాంతితో కూడిన మానసిక ఆనందాన్ని అందిస్తుందట.
దీంట్లో కేవలం స్నానమే కాదు మనసు రిలాక్స్ అయ్యేలా చక్కటి వేడినీళ్ల మసాజ్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే ఐఏ సెన్సార్లు మానవుల బాడీ మూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి దానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత ఆటోమెటిక్‌గా సెట్ అవుతుందట. అలాగే మన భావోద్వేగా పరిస్థితికి అనుకుణంగా మంచి విజువల్స్‌ని కూడా ప్రొజెక్ట్ చేస్తుందట. కేవలం పరిశుభ్రత మాత్రేమ గాక మంచి వెల్‌నెస్ అనుభవాన్ని కూడా అందిస్తుందని ఈ ఒసాకా కంపెనీ చైర్మన్ యసుకి అయోమా చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ మిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
ఇది కొత్తదేం కాదు..
ఇంతకు ముందే ఈ మానవ వాషింగ్ మిషన్‌ని రూపొందించారు. దీని తొలి వర్షన్‌ని 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో సాన్యో ఎలక్ట్రిక్ కో పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ..కమర్షియల్ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి బాగా వెళ్లలేదు. కానీ ప్రస్తుతం ఏఐ సాంకేతికతో కూడిన ఈ మిషన్‌ని అత్యాధునిక ఫ్యూచర్లతో డిజైన్ చేశారు. ఈ ప్రొడక్ట్‌ని పానాసోనిక్ హోల్డింగ్స్ కార్పోరేషన్ కంపెనీ తీసుకురానుంది.
ఈ ఏడాది ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో ఈ సరికొత్త సాంకేతిక హ్యూమన్ వాషింగ్ మిషన్‌ని ప్రదర్శించనున్నారు. అక్కడ దాదాపు వెయ్యిమందికి పైగా అతిథులు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో.. ప్రత్యక్షం అనుభవం ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే ఈ మిషన్ పనితీరు వారెంటీల గురించి సంకిప్త సమాచారం గురించి వివరింనుంది సదరు కంపెనీ ఒసాకా.
అయితే సదరు కంపెనీ దీని ధర ఎంతనేది ఇంక ధృవీకరించలేదు. కాగా, ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆఖరికి వ్యక్తిగత శుభ్రతను కూడా హై-టెక్ లగ్జరీగా మార్చడం జపాన్‌కే చెల్లిందని ఒకరూ, ఇంత చిన్న పనికోసం అంతప్రయాస పడ్డారా మీరు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
🚨AI-POWERED HUMAN WASHING MACHINE: BECAUSE WHO HAS TIME TO SCRUB?
Japan’s "Mirai Ningen Sentakuki" is here to wash your...everything.
A 15-minute AI-powered bath capsule uses jets, microbubbles, and calming videos to cleanse bodies and soothe egos.
Chairman Yasuaki Aoyama… pic.twitter.com/0GBwOtCV9r— Mario Nawfal (@MarioNawfal) December 3, 2024
(చదవండి: ‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!)
Comments
Please login to add a commentAdd a comment