Washing Machine
-
మూడ్‌ని బట్టి స్నానం చేయిస్తుంది!
అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి.. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆవిష్కరించింది. వామ్మో..! ఏంటిది అనుకోకండి. మాములుగా మనమే స్నానం చేయడం అనేది పాత ట్రెండ్. దీన్ని కూడా మిషన్ సాయంతో తొందరగా పనికానిస్తే.. అనే వినూత్న ఆలోచనతో జపాన్ చేసిన ఆవిష్కరణ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాదిరి "హ్యూమన్ వాషింగ్ మెషిన్" అన్నమాట. ఏంటీ మిషన్‌తో స్నానమా అని విస్తుపోకండి. ఇది వెల్‌నెస్‌ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధుని ఫీచర్లతో రూపొందించారు. అసలేంటీ మిషన్ ? ఎలా పనిచేస్తుంది..? తదితరాల గురించి తెలుసుకుందామా..!ఈ "హ్యూమన్ వాషింగ్ మెషిన్"ని ఒసాకాకు చెందిన సైన్స్ కో కంపెనీ ఏఐ సాంకేతికతో రూపొందించింది. దీన్ని జపాన్‌లో మిరాయ్ నింగెన్ సెంటకుకిగా పిలుస్తారు. ఈ మిషన్ కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుందట. అలాగే మంచి విశ్రాంతితో కూడిన మానసిక ఆనందాన్ని అందిస్తుందట. దీంట్లో కేవలం స్నానమే కాదు మనసు రిలాక్స్ అయ్యేలా చక్కటి వేడినీళ్ల మసాజ్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే ఐఏ సెన్సార్లు మానవుల బాడీ మూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి దానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత ఆటోమెటిక్‌గా సెట్ అవుతుందట. అలాగే మన భావోద్వేగా పరిస్థితికి అనుకుణంగా మంచి విజువల్స్‌ని కూడా ప్రొజెక్ట్ చేస్తుందట. కేవలం పరిశుభ్రత మాత్రేమ గాక మంచి వెల్నెస్ అనుభవాన్ని కూడా అందిస్తుందని ఈ ఒసాకా కంపెనీ చైర్మన్ యసుకి అయోమా చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ మిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇది కొత్తదేం కాదు..ఇంతకు ముందే ఈ మానవ వాషింగ్ మిషన్‌ని రూపొందించారు. దీని తొలి వర్షన్‌ని 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో సాన్యో ఎలక్ట్రిక్ కో పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ..కమర్షియల్ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి బాగా వెళ్లలేదు. కానీ ప్రస్తుతం ఏఐ సాంకేతికతో కూడిన ఈ మిషన్‌ని అత్యాధునిక ఫ్యూచర్లతో డిజైన్ చేశారు. ఈ ప్రొడక్ట్‌ని పానాసోనిక్ హోల్డింగ్స్ కార్పోరేషన్ కంపెనీ తీసుకురానుంది. ఈ ఏడాది ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో ఈ సరికొత్త సాంకేతిక హ్యూమన్ వాషింగ్ మిషన్‌ని ప్రదర్శించనున్నారు. అక్కడ దాదాపు వెయ్యిమందికి పైగా అతిథులు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో.. ప్రత్యక్షం అనుభవం ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే ఈ మిషన్ పనితీరు వారెంటీల గురించి సంకిప్త సమాచారం గురించి వివరింనుంది సదరు కంపెనీ ఒసాకా. అయితే సదరు కంపెనీ దీని ధర ఎంతనేది ఇంక ధృవీకరించలేదు. కాగా, ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆఖరికి వ్యక్తిగత శుభ్రతను కూడా హై-టెక్ లగ్జరీగా మార్చడం జపాన్‌కే చెల్లిందని ఒకరూ, ఇంత చిన్న పనికోసం అంతప్రయాస పడ్డారా మీరు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. 🚨AI-POWERED HUMAN WASHING MACHINE: BECAUSE WHO HAS TIME TO SCRUB?Japan’s "Mirai Ningen Sentakuki" is here to wash your...everything. A 15-minute AI-powered bath capsule uses jets, microbubbles, and calming videos to cleanse bodies and soothe egos.Chairman Yasuaki Aoyama… pic.twitter.com/0GBwOtCV9r— Mario Nawfal (@MarioNawfal) December 3, 2024 (చదవండి: ‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!) -
అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు
-
అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..!
ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్ మెషిన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు భారతీయ ఇంజనీర్ సెబిన్ సాజీ. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. అయితే ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. వర్కింగ్ పరంగా అసెంబుల్ చేసి చూస్తే..అది పూర్తిగా వర్క్ అవ్వడమే కాక, వాష్ , రిన్ , స్పిన్, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్లను ఉపయోగించారు. సాజీ వాషింగ్ మెషీన్ ఎలా వర్క్చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వాషింగ్ మెషీన్లో చిన్న క్లాత్, చిటికెడు వాషింగ్ పౌడర్ వేయగానే ఎలా వాష్ చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్ మెషీన్లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. (చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
బీజేపీ ‘వాషింగ్‌మెషిన్’ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ సెటైర్లు వేసింది. బీజేపీ ఒక వాషింగ్‌మెషిన్ పార్టీ అని శనివారం(మార్చ్ 30) నిర్వహించిన ప్రెస్మీట్లో తృణమూల్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ప్రెస్మీట్లో తృణమూల్ నేతలు బీజేపీ వాషింగ్ మెషిన్ అని స్టిక్కర్లు అతికించిన వాషింగ్ మెషిన్‌ను ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి తోడు ‘వాషింగ్ పౌడర్ బీజేపీ’ అనే టైటిల్‌తో వీడియోను కూడా తృణమూల్ నేతలు రిలీజ్ చేశారు. అవినీతి కేసులున్న పక్క పార్టీల నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ పొందుతున్నారనేది ఈ వీడియోలో సెటైరికల్‌గా చూపించారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్పటేల్పై ఉన్న విమానాల లీజు కేసులో సీబీఐ ఆయనకు క్లీన్చిట్ ఎందుకిచ్చిందని తృణమూల్ నేత రితబ్రతా బెనర్జీ ప్రశ్నించారు. తమకు లొంగనందునే అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరేన్లను బీజేపీ అరెస్టు చేయించిందని తృణమూల్ నేతలు మండిపడ్డారు. శరద్‌పవార్ ఎన్సీపీని చీల్చి మేనల్లుడు అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇది జరిగి సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత ఎయిర్ ఇండియా విమానాల లీజు కేసులో ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇస్తూ దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ -
ఈడీ సోదాలు.. వాషింగ్ మెషిన్లో రూ. 2.5 కోట్ల నగదు
న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ.1800 కోట్ల మేర సింగపూర్ కంపెనీలకు అక్రమ చెల్లింపులు చేసినట్లు క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఇదీ చదవండి.. తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత -
పొలిటికల్ సెటైర్: మోదీ వాషింగ్ పౌడర్.. మరకలు చిటికెలో మాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకులు అవినీతిపరులంటూ ఆరోపించిన మోదీ ఇప్పుడు ఆదే నాయకులను ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ వాషింగ్ మెషీన్ మళ్లీ పని చేస్తోందని, ఇన్‌కంట్యాక్స్, సీబీఐ, ఈడీ(ఐసీఈ) అనే సబ్బుతో అవినీతిపరులను పరిశుద్ధులను చేస్తోందని ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్ని మరకలను చిటికెలో తొలగిస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో ‘మోదీ వాషింగ్ పౌడర్’ చిత్రాన్ని జైరామ్ రమేశ్ షేర్ చేశారు. విపక్షాల కూటమి ఏర్పాటు కాకూడదని కోరుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. Yesterday when the BJP Washing Machine restarted in Mumbai with its ICE (Incometax, CBI, ED) detergent, BJP-inspired obituaries on Opposition unity were being planted. The obit writers will be disappointed. The next meeting of the parties that met at Patna on June 23rd will be… pic.twitter.com/LqdwRSg7CO — Jairam Ramesh (@Jairam_Ramesh) July 3, 2023 -
టెక్ టమారం: ఇది వాషింగ్ మెషిన్..కాదు అంతకు మించి
వాషింగ్ మెషిన్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! దుస్తుల మురికిని శ్రమలేకుండా వదలగొట్టే వాషింగ్ మెషిన్ల వాడకం సర్వసాధారణంగా మారింది. అయితే, వాషింగ్ మెషిన్ల తయారీలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలో కనిపిస్తున్న వాషింగ్ మెషిన్. సాధారణ వాషింగ్ మెషిన్లకు మించి పనిచేస్తుంది. సింథటిక్ దుస్తులను ఉతికేటప్పుడు నీటితో పాటే కొట్టుకొచ్చే మైక్రోప్లాస్టిక్స్‌ను ఒడిసి పట్టుకుంటుంది. దుస్తులను ఉతకడం పూర్తయ్యాక, దీనిలోని ప్రత్యేకమైన మైక్రోప్లాస్టిక్ ఫిల్టర్‌లో చేరిన మైక్రోప్లాస్టిక్స్ వ్యర్థాలను తేలికగా వేరుచేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి డిటర్జెంట్లనైనా వాడుకోవచ్చు. బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన ‘గల్ప్’ కంపెనీ ఈ అధునాతన వాషింగ్ మెషిన్‌కు రూపకల్పన చేసింది. దీని ధర 250 పౌండ్లు (రూ.24,513). ప్రస్తుతం ఇది బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
వాషింగ్మిషన్లో బుస్
శివమొగ్గ: స్కూటర్, కారు, బూట్లు, బట్టలు ఇలా అన్నింటా పాములు చేరి ప్రజలను హైరానా పెట్టిస్తున్నాయి. తాజాగా వాషింగ్‌మెషిన్‌లో నాగుపాము కనిపించడంతో ఇంట్లోనివారు భయాందోళనకు గురయ్యారు. శివమొగ్గ నగరానికి దగ్గరలోని పురలే గ్రామంలో నంజప్ప అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చిన నాగుపాము వాషింగ్ మెషిన్లో మకాం వేసింది. దానిని గమనించిన ఇంట్లోనివారు వెంటనే శివమొగ్గలోని స్నేక్ కిరణ్‌కు ఫోన్ చేశారు. ఆయన వచ్చి వాషింగ్ మెషిన్లో ఉన్న నాగుపామును భద్రంగా బయటకు తీసి దూరంగా వదిలిపెట్టాడు. (చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..) -
‘ఒయాసిస్’.. పండ్లు, కూరగాయాల్ని శుభ్రం చేసే వాషింగ్ మెషిన్
పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం అందరికీ తెలిసిన సమస్యే! రసాయనాల ప్రభావం ఉందని వాటిని తినడం మానుకోలేం కదా! మరి పరిష్కారం ఏమిటంటే? వీలైనంత వరకు వాటిని శుభ్రంగా కడుక్కోవడమేనని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు అంతకు మించిన పరిష్కారమే అందుబాటులోకి వచ్చింది. పండ్లు, కూరగాయలకు ఒక వాషింగ్ మెషిన్ ప్రత్యేకంగా రూపొందింది. దక్షిణ కొరియాకు చెందిన సియింఘో స్టూడియోకు చెందిన డిజైనర్లు ‘ఒయాసిస్’ పేరుతో ఈ పండ్లు, కూరగాయల వాషింగ్ మెషిన్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇది అల్ట్రాసోనిక్ వాషింగ్ మెషిన్. పండ్లు, కూరగాయలను ఇందులో వేసి, ఆన్ చేసుకుంటే, దీనిలో వెలువడే అల్ట్రసోనిక్ తరంగాలు వాటిపైన ఉండే ప్రమాదకర రసాయనాలను నిర్వీర్యం చేస్తాయి. ఇందులో వేసి, శుభ్రం చేసుకున్నాక పండ్లు, కూరగాయలు తినడానికి పూర్తి సురక్షితంగా తయారవుతాయి. దీనిని ఇంకా మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది. -
మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్! భయపడకండి భలే ఉంటుంది!
మీరు చదివింది నిజమే.. బట్టలు ఉతకడం కోసం కాదు. మనుషుల స్నానం కోసం వాషింగ్ మెషీన్ తయారు చేస్తోంది ఓ జపనీస్ కంపెనీ. ఒసాకాకు చెందిన ‘సైన్స్ కో లిమిటెడ్’ దీన్ని రూపొందిస్తోంది. ఫైన్ బబుల్ టెక్నాలజీతోపాటు వివిధ సెన్సర్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు విశ్రాంతినిచ్చే సంగీతం వినిపిస్తూ, వాటర్ రెసిస్టెంట్ డిస్ప్లేలో ఫొటోలు కూడా చూపిస్తూ.. మరింత హాయిగొలిపేలా చేస్తున్నాయి. ఏదేమైనా వాషింగ్ మెషీన్‌లోకి వెళ్లి కూర్చుంటే ఇంకేమన్నా ఉందా? అని భయపడకండి. ఇందులోని సెన్సర్లు శరీరంలోని నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలా మనుషుల వాషింగ్ మెషీన్ తయారు చేసే ఐడియా కొత్తదేం కాదు. జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ 1970 సమయంలోనే ‘అల్ట్రాసోనిక్ బాత్’ పరికరాన్ని తయారు చేసింది. అది 15 నిమిషాల్లోనే శరీరాన్ని శుభ్రం చేయడంతోపాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తిచేసింది. కానీ దానిపై వెల్లువెత్తిన సందేహాలతో మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇన్నేళ్ల తర్వాత సైన్స్ కో లిమిటెడ్ చైర్మన్ యసాకీ అయోమా దీనిపై దృష్టి పెట్టాడు. ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే సాన్యో తయారు చేసిన మనుషుల వాషింగ్ మెషీన్‌ను డెవలప్ చేసి.. మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నాడట. ఇంతకీ ఈ మెషీన్‌ను కొనాలనుకుంటే 2025 దాకా ఆగాల్సిందే. 2024 చివరికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, 2025లో అందరికీ అందుబాటులోకి తెస్తామని సైన్స్ కో సంస్థ చెబుతోంది. -
భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో బోలెడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన డివైజ్‌లు, మిషీన్లు మరో ఏడాదికల్లా అదనపు ఫీచర్లతో కస్టమర్లను పలకరిస్తున్నాయి. తాజాగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ (Washing Machine) మార్కెట్లోకి వచ్చేసింది. ఈ తరహా టెక్నాలజీతో రావడం భారత్‌లో ఇదే తొలిసారి. ఈ వాషింగ్ మెషీన్‌ను హోమ్ అప్లయెన్సెస్, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్ సంస్థ హయర్(Haier) విడుదల చేసింది. ప్రత్యేకంగా ఇందులో ఏఐ డైనమిక్ బ్యాలన్స్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ వాయిస్ కంట్రోల్, డైరెక్ట్ మోషన్ మోటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది. డైరెక్ట మోషన్ మోటార్ అదిరిపోయే ఫీచర్లు కొత్త వాషింగ్ మెషీన్లో ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్ మోషన్ మోటార్ ఉంది. ఇది గణనీయంగా మెషిన్ వైబ్రేషన్‌ని తగ్గిస్తుంది, తద్వారా మిషన్ సౌండ్ లేకుండా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ మెషీన్ లైఫ్టైంను కూడా పెంచుతుంది. ఇందులో 30పైగా వాషింగ్ ప్రోగ్రామ్‌లతో డిజైన్ చేయబడింది. పాటు వివిధ రకాల బట్టలను సునాయాసంగా వాష్ చేసేస్తుంది. అదనంగా హై-ఎఫిషియన్సీ ABT (యాంటీ బాక్టీరియల్ టెక్నాలజీ) ఉంది. ఇందులోని డిటర్జెంట్ డిస్పెన్సర్‌ను శుభ్రంగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ డ్యూయల్ స్ప్రే టెక్నాలజీ, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను సమర్థవంతంగా తొలగించే పూరిస్టీమ్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా కస్టమర్లు ఇంట్లో ఎక్కడ నుంచైనా ఇచ్చే ఆదేశాలతో ఈ వాషింగ్ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లో 10కేజీల దీని ధర రూ.96వేల వరకు ఉంది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
ఇస్త్రీపెట్టె కొత్తదానిలా మెరవాలంటే ఇలా! ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు
సులువైన, ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు మీకోసం.. ఇస్త్రీ పెట్టె క్లీనింగ్ ఇలా.. నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఇయర్ బడ్స్‌ను ముంచి ఇస్త్రీ పెట్టె అడుగు భాగంలో ఉన్న రంధ్రాలను తుడిస్తే లోపల పేరుకున్న దుమ్ముధూళీ పోతాయి. పెట్టె అడుగుభాగాన్ని కూడా ఈ నీటిలో ముంచి వస్త్రంతో తుడిచి, తరువాత పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇస్త్రీపెట్టె అడుగు భాగంలో నలుపు మొత్తం పోయి కొత్తదానిలా మెరుస్తుంది. అయితే ఇలా తుడిచేటప్పుడు ఇస్త్రీపెట్టె ప్లగ్‌ను స్విచ్‌బోర్డు నుంచి తీసేయాలి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. కళ్లజోడు రోజూ వాడడం వల్ల అద్దాల మీద చిన్నచిన్న గీతలు, దుమ్ము ధూళి పడుతుంటాయి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. అద్దాల మీద కొద్దిగా వెనిగర్ రాయాలి. రెండు నిమిషాలు ఆగిన తరువాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే గీతలు, దుమ్ము ధూళి పోతాయి. టేప్ వేస్తే.. ట్యాబ్లెట్స్, సిరప్ డబ్బాల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్లు ఒక్కోసారి తడితగిలి చెరిగిపోతుంటాయి. డేట్ తెలియకపోతే ఆ మందును వాడడం కష్టం. ఇలా జరగకుండా ఉండాలంటే ట్యాబ్లెట్గానీ, సిరప్‌ను గాని తీసుకొచ్చిన వెంటనే ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాడవచ్చో తెలిపే డేట్స్ మీద ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించాలి. ఈ టేప్ ఉండడంవల్ల మందు అయిపోయేంత వరకు డేట్ చెరిగిపోకుండా ఉంటుంది. మూత బిగుసుకు పోకుండా నెయిల్ పెయింట్ తీసి వేసుకునేటప్పుడు మూత అంచుల మీద కారి గాలికి గట్టిపడిపోతుంది. దీంతో .. తీసిన వెంటనే రాకుండా మూత స్ట్రక్ అయిపోతుంది. మూత పెట్టేముందు పెయింట్ సీసా మూతి చుట్టూ ఉన్న పెయింట్‌ను శుభ్రంగా తుడిచి, ఇయర్ బడ్‌తో కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసి మూతపెట్టాలి. అప్పుడు మూత బిగుసుకు పోకుండా చక్కగా వస్తుంది. రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో పెద్దవాళ్ల బట్టలతోపాటు, సాక్సులు, కర్చీఫ్‌లు, చిన్న చిన్న బట్టలు వేయాలనుకున్నప్పుడు.. కూరగాయలు, పండ్లకు ఇచ్చే నెట్ బ్యాగ్‌లో చిన్నచిన్న బట్టలను వేసి రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో వేయాలి. అప్పుడు చక్కగా క్లీన్ అవ్వడంతోపాటు, మిగతా బట్టల్లో కలిసిపోకుండా ఉంటాయి. తాజాగా ఉండేందుకు టొమాటో తొడిమ తీసిన ప్రాంతంలో రెండు చుక్కలు నూనె రాసి రిఫ్రిజిరేటర్లో నిల్వచేస్తే ఎక్కువ రోజులపాటు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
ఉతికేస్తున్న వాషింగ్ మెషీన్లు.. ఈ ఏడాది 60 లక్షల సేల్స్!
న్యూఢిల్లీ: దేశీయంగా వాషింగ్ మెషీన్ల అమ్మకాలు రెండు మూడేళ్లలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాయని వర్ల్‌పూల్ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని సంస్థ ఇండియా ఎండీ విశాల్ భోలా తెలిపారు. ‘గడిచిన రెండేళ్లలో మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో వాషింగ్ మెషీన్ల విభాగం రెండంకెలలో పెరుగుతుందని అంచనా. వాషింగ్ మెషీన్ల విస్తృతి ప్రస్తుతం 14 శాతమే. ఈ ఏడాది భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 60 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదవుతాయని మార్కెట్ ఆశిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయి. 30 శాతం వాటా ఉన్న ఫ్రంట్ లోడ్ విభాగంలోకి వర్ల్‌పూల్ ప్రవేశిస్తోంది. కంపెనీ వృద్ధికి చోటు ఉంది’ అని పేర్కొన్నారు. అధిక సామర్థ్యం, ఫీచర్లు.. మిడ్, ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులు అధిక సామర్థ్యం, అధిక ఫీచర్లున్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని విశాల్ తెలిపారు. తద్వారా వృద్ధిని నడిపిస్తున్నారని చెప్పారు. ‘ప్రవేశ స్థాయిలో వినియోగదారులు చాలా విచక్షణతో ఉన్నారు. ఇక గృహోపకరణాల విషయంలో కంపెనీ అంచనా సానుకూలంగా ఉంది. అధిక సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అదే మార్కెట్లో ఎంట్రీ లెవల్ వినియోగదారులు తమకు గొప్ప విలువను అందించే మోడళ్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 40 శాతం. మహమ్మారి కాలంలో దూసుకెళ్లిన ఆన్లైన్ విభాగం వృద్ధి ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆన్లైన్ వాటా 10–15 శాతానికి వచ్చి చేరింది’ అని వివరించారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
వాషింగ్ మెషీన్ త్రో..
జావెలిన్ త్రో, డిస్కస్ త్రో తెలుసు... ఈ వాషింగ్ మెషీన్ త్రో ఏంటనుకుంటున్నారా? నిజమే వాషింగ్ మెషీన్‌ను ఎత్తి విసిరేయడమే. అలా 14 అడుగుల 7 అంగుళాల దూరానికి విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడో స్వీడిష్ వ్యక్తి. ఇంట్లో ఓ పక్క ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఇంకోపక్కకు జరపాలంటే కష్టం. అలాంటిది అలా ఎలా విసిరాడు? అందరికీ వచ్చే సందేహమే. ఆయనొక్కడే కాదు... అంతకుముందు 13 అడుగుల 6.6 అంగుళాలు, 14 అడుగుల 1 అంగుళం దూరాలు విసిరిన రికార్డులున్నాయి. తాజాగా మిలన్లో జరిగిన పోటీలో స్వీడన్‌కు చెందిన జోహన్ ఎస్పెన్రోనా.. వాషింగ్ మెషీన్‌ను 14 అడుగుల 7 అంగుళాల దూరం విసిరి వాళ్లిద్దరి రికార్డులను బ్రేక్ చేశాడు. అయితే దీనికి స్ఫూర్తి... పేపర్ ప్లేన్ గిన్నిస్ రికార్డ్. అదే చిన్నపిల్లలు పేపర్ఫ్లైట్ తయారు చేసి ఒకరిమీదకు ఒకరు విసురుకుంటారు కదా. అలా చిన్న పిల్లల్లా మారిపోయిన దక్షిణ కొరియాకు చెందిన ఓ ఇద్దరు, మలేసియాకు చెందిన ఒకరు, మొత్తం ముగ్గురు కలిసి... పేపర్ ప్లేన్ తయారు చేశారు. 252 అడుగుల 7 అంగుళాల దూరం ప్రయాణించేలా విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. -
వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ రియల్మీ భారత మార్కెట్లో మరింత పురోగతిని సాధించేందుకు గృహోపకరణాల రంగంలోకి అడుగుపెట్టింది. గృహోపకరణాల విభాగంలో ప్రముఖ చైనీస్ సంస్ధ షావోమీ ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షావోమీ పోటీగా భారత మార్కెట్లలోకి వాషింగ్మెషిన్లను, వాక్యూమ్ క్లీనర్స్‌ను, ఎయిర్ ఫ్యూరిఫైయర్, రోబోట్ వాక్యూమ్ గృహోపకరణాలను రియల్మీ లాంచ్చేసింది. చదవండి: AI స్వగతం: తప్పులు లేకుండా చెప్పే యాంకర్లు.. రైటర్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో కొనుగోలుదారులకు ఈ ఉపకరణాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ గృహోపకరణాలను లాంచ్ సందర్భంగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్, రియల్మీ ఇండియా, యూరోప్, అండ్ లాటిన్ సీఈవో మాధవ్ సేత్ మాట్లాడుతూ..‘భారతీయులకు టెక్లైఫ్ను అందించేందుకు రియల్మీ ఎప్పుడు ముందుఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ హోమ్ కేటగిరీని మెరుగుపరుస్తూ..భారత్‌లో రియల్మీ నెం.1 లైఫ్‌స్టైల్, టెక్లైఫ్ బ్రాండ్‌గా నిలిచేందుకు కంపెనీ కృషి చేస్తోంద’ని వెల్లడించారు. రియల్మీ గృహోపకరణాల ధరలు ఇలా ఉన్నాయి..! రియల్మీ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 1000 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ హ్యండ్హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 500 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ ధర రూ .24,999 అయితే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ .19,999 కే విక్రయించబడుతుంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో రియల్మీ రెండు కొత్త టాప్-లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను కూడా విడుదల చేసింది. వాషింగ్ మెషీన్ల ధర రూ .12,990(7.5 కిలోలు ), రూ .15,990(8 కిలోలు). చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! -
జీన్స్‌ను నెలకు ఒక్కసారే ఉతకాలంట.. కారణమేంటంటే
న్యూఢిల్లీ: సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది మనిషికి సౌకర్యాలు పెరిగాయి. ప్రతిదీ చేయి దగ్గరకు వస్తుంది.. ఇక మన శారీరక శ్రమను తగ్గించే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్లు. వీటి వల్ల మహిళలకు ముఖ్యంగా ఉద్యోగం చేసే ఆడవారికి పని సులువు అయ్యింది.. సమయం కూడా చాలా కలసి వస్తుంది. అయితే ఈ పరికరాల వల్ల మనిషికి లాభమే కానీ పర్యవరణానికి చాలా కీడు జరుగుతుంది. ముఖ్యంగా మన సౌకర్యం కోసం వాడుతున్న ఫ్రిజ్‌ల వల్ల ఓజోన్ పొరకు చాలా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి మరోకటి వచ్చి చేరింది. అది వాషింగ్ మెషీన్. మనల్ని బట్టలుతికే శ్రమ నుంచి తప్పించని వాషింగ్ మెషీన్‌ను తరచుగా వాడటం వల్ల పర్యావరణం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది అటున్నారు నిపుణులు. భూమిని పరిరక్షించుకోవాలని భావిస్తే.. వాషింగ్ మెషిన్ వాడకాన్ని తగ్గించమని సూచిస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: ఉన్నట్టుండి వాషింగ్ మిషిన్ ఢాం!! అని పేలింది..) తాజాగా సోసైటీ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సమాజంలో ఎక్కువ మంది చాలా తరచుగా.. అంటే ప్రతి రోజు వాషింగ్ మెషీన్‌ను వాడుతున్నారని.. దీనివల్ల పర్యావరణం మీద చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఈ నివేదక వెల్లడిస్తుంది. మీరు వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికే ప్రతిసారి, మిలియన్ల మైక్రోఫైబర్లు నీటిలోకి విడుదల అయ్యి మహాసముద్రాలలోకి ప్రవేశిస్తాయి. మైక్రోఫైబర్లు ప్లాస్టిక్ చిన్న తంతువులు. ఇవి పాలిస్టర్, రేయాన్, నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్ల నుంచి వెలువడతాయి. మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి ఇవి ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని నివారించాలంటే.. నెలకు ఒక్కసారి మాత్రమే వాషింగ్ మెషీన్ వాడమని నిపుణులు ఈ నివేదికలో సూచించారు. అంటే జీన్స్ ప్యాంట్స్‌ని నెలకు ఒకసారి.. జంపర్స్ని పదిహేను రోజులకు ఒకసారి.. పైజామాలను వారానికొకసారి ఉతకాలని తెలిపారు. అలానే లోదుస్తులను ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలని.. అది మెషీన్లో కాకుండా సాధారణ పద్దతుల్లో ఉతుక్కోవాలని సూచించారు. టీ షర్ట్స్, టాప్స్ వంటి వాటిని ఐదు సార్లు.. డ్రెస్‌లను ఆరు సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచించారు నిపుణులు. ఇలా చేయడం వల్ల టైమ్, మనీతో పాటు దుస్తులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయని తెలుపుతున్నారు. బట్టలు తక్కువ సార్లు ఉతకడం వల్ల కరెంట్, నీటి వినియోగం తగ్గుతుంది. డిటర్జెంట్ల వాడకం తగ్గడం వల్ల తక్కువ సార్లు రసాయనాలు వాడినట్లు అవుతుంది. ఫలితంగా భూమికి మేలు చేసినవారం అవుతాం అంటున్నారు నిపుణులు. (చదవండి: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్) "వాషింగ్ మెషీన్లను కనిపెట్టడానికి ముందు, బట్టలు ఉతకడం అనేది శ్రమతో కూడుకున్నది, అలసటగా ఉండేది. అయితే వాషింగ్ మెషీన్లు వచ్చాక ఈ శ్రమ తగ్గింది. ఉతకడం ఎక్కువయ్యింది. దీన్ని తగ్గిస్తే.. మనం మనతో పాటు మనం నివసించే గ్రహం కూడా బాగుంటుంది" అని ఫ్యాషన్ రివల్యూషన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు , ఓర్సోలా డి కాస్ట్రో తెలిపారు. చదవండి: జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా? -
వైరల్ వీడియో: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము
-
వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్
సాక్షి, తూర్పు గోదావరి: టీవీ, సినిమాల్లో పాముతో కనిపించే భయానక దృశ్యాలను చూస్తేనే జడుసుకుంటాం. ఇక పాము ఇంట్లో కనిపిస్తే సరేసరి. భయంతో వణికిపోయి పరుగులు పెడతాం. అలాంటిది పామును చాలా దగ్గరగా అంటే.. అలవాటుగా ఇంటి పనులు చేస్తున్న సమయంలో.. సరాసరి అది మీద దూకే పరిస్థితే ఉంటే.. వామ్మో!.. తలుచుకుంటేనే అదోలా ఉంది కదా. (చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి) జిల్లాలోని ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో కుంచే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంట్లోని వాషింగ్ మెషీన్లో దూరిన ఓ పొడవాటి నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్ మెషీన్లో బట్టలు వేద్దామని దాని డోర్ తెరవగా.. అక్కడే తిష్ట వేసిన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. (చదవండి: నిమజ్జనాలకు అనుమతి లేదనడంతో హైదరాబాద్‌లో ఆగమాగం..) -
ఉన్నట్టుండి వాషింగ్ మిషిన్ ఢాం!! అని పేలింది..
ఈడిన్‌బర్గ్ : మన శ్రమను తక్కువ చేసే యంత్రాలు.. కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఓ వస్తువని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ప్రతీ వస్తువు ఏదో ఒక సందర్భంలో మనల్ని ప్రమాదంలో పడేయోచ్చు. ఇందుకు స్కాట్లాండ్లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. గ్లాస్గోకు చెందిన మిస్ లారా బిర్రెల్ కొద్దిరోజుల క్రితం వాషింగ్ మిషిన్‌లో బట్టలు వేసి, ఇంట్లో వేరే పనులు చేసుకోవటానికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఆ వాషింగ్ మిషిన్ ఢాం!! అని పేలింది. పేలుడు దాటికి అది ముక్కలు అయిపోయి సొట్టలు పడింది. వంట గది కూడా దెబ్బతింది. బాంబు పేలిన శబ్ధం రావటంతో ఆమె అక్కడికి వెళ్లి చూసింది. వాషింగ్ మిషిన్‌లోంచి పొగలు రావటం గమనించి, పవర్ సప్లై స్విచ్ఛ్‌ను ఆఫ్ చేసింది. దీనిపై బిర్రెల్ మాట్లాడుతూ.. ‘‘ ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు వాషింగ్ మిషిన్‌ను ఆన్ చేసి వెళ్లొద్దని చెప్పటం నేను విన్నాను. కానీ, ఈ రోజు నేను వాషింగ్ మిషిన్‌ను ఆన్ చేసి బయటకు వెళ్లలేదు. అయినా అది పేలింది. నేను బాంబు పేలిందేమో అనుకున్నాను. పొగలు రావటం చూసి అక్కడికి వెళ్లాను. వాషింగ్ మిషిన్ ముక్కలై ఉంది. కిచెన్ కూడా చాలా వరకు పాడైంది. ఇంకోసారి వాషింగ్ మిషిన్‌ను వదలి బయటకు వెళ్లను. ప్రమాదం జరిగిన సందర్భంలో నేను కానీ, మా వాళ్లు కానీ, ఉండి ఉంటే ఏమయ్యేదో ఊహించలేకుండా ఉన్నాను’’ అని పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. చదవండి, చదవించండి : కడుపుతో ఉన్న మహిళ మళ్లీ గర్భం దాల్చింది -
పైత్యం ఎక్కువైతే ఇలాంటివే జరుగుతాయి
సియోల్ : కరోనా వైరస్ జనాలను ఎంత భయపెడుతుందో చెప్పడానికి ఈ వార్తను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం ముట్టుకునే ప్రతీచోట వైరస్ ఉంటుందో లేదో తెలియదు గాని... మనం చేసే పనులు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కరోనా వైరస్‌కు భయపడి మనం తినే కూరగాయలు నుంచి వాడే ప్రతి వస్తువును శుభ్రం చేసే తీసుకుంటున్నాం. ఇది మంచిదే.. కరెన్సీ నోట్లకు వైరస్ ఉంటుందా లేదా అన్నది పక్కనపెడితే.. ఒకవేళ ఉన్నా వాటిని ఒకసారి నీళ్లలో ముంచి ఎండలో పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రబుద్దుడు వైరస్ సోకుంతుందేమోనని భయపడి వాటిని వాషింగ్ మెషిన్లో వేశాడు. ఇంకేముంది మంచిగా ఉన్న కరెన్సీ నోట్లన్నీ నిమిషాల్లో చిత్తుకాగితాల్లా మారిపోయాయి. వైరస్ రాకుండా శుభ్రత పాటించడం మంచిదే.. కానీ ఆ శుభ్రత మరీ ఎక్కువైపోతే ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయి.(పొగాకు నుంచి కోవిడ్ వ్యాక్సిన్?) ఈ ఘటన దక్షిణకొరియాలోని సియోల్‌లో చోటుచేసుకుంది. సియోల్‌కు చెందిన ఒక వ్యక్తికి తన కుటుంబసభ్యుని అంత్యక్రియలు జరిపించమని అతని బంధువులు, మిత్రులు 50వేల వాన్ (కొరియా కరెన్సీ) అందజేశారు. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు 3వేల రూపాయలు. అయితే వారు ఇచ్చిన డబ్బుకు కరోనా వైరస్ ఉందన్న అనుమానం అతనికి వచ్చింది. వాషింగ్ మెషిన్లో ఆ నోట్లను వేస్తే వైరస్ సోకకుండా డిస్ ఇన్ప్క్ట్ చేస్తుందని భావించాడు.అంతే ఆ నోట్లన్నీ తీసి వాషింగ్ మెషిన్లో వేశాడు. ఒక్కరౌండ్ స్పిన్ అవగానే నోట్లను బయటికి తీసి చూడగా చాలా వరకు నోట్లు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి పరుగున బ్యాంకుకు వెళ్లి అసలు విషయం చెప్పి సహాయం చేయాలని కోరాడు. అయితే బ్యాంకు అధికారులు ఆ నోట్లను పరిశీలించి ఇవి చెల్లవని.. ఏ సహాయం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు లబోధిబోమంటూ ఎలాగైనా తనను ఆదుకోవాలని విన్నవించుకున్నాడు. అధికారులు ఈ విషయాన్ని మేనేజర్ సియో జున్ వోన్ దృష్టికి తీసుకెళ్లారు. నోట్లలో చాలా వరకు చిరిగినవి ఉన్నాయని.. మంచి నోట్లను పరిశీలించి చూడగా కేవలం 507 వాన్లు మాత్రమే బాగున్నాయని చెప్పి బాధితుడికి అంతే మొత్తం ఇచ్చి అక్కడినుంచి పంపించేశారు. దయచేసి కరెన్సీ నోట్లను వాషింగ్ మెషిన్, ఓవెన్లలో వేయొద్దని ప్రజలకు బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి. -
‘అది వాషింగ్ మెషీన్ కాదు యశ్’
కరోనా కల్లోలంతో జనజీవనం ఎక్కడికక్కడా స్తంభించిపోయింది. ఇక లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు రద్దవ్వడంతో సినిమావాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా దొరికిన లాక్డౌన్ సమయాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి తెగ ఎంజయ్ చేస్తున్నారు. అయితే కేవలం వారు మాత్రమే ఎంజయ్ చేయకుండా పలు వెరైటీ వీడియోలతో అభిమానులను కూడా అలరిస్తున్నారు. బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ కూడా లాక్డౌన్ సమయంలో తన ఫ్యాన్స్‌కు తగినంత వినోదాన్ని అందించేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లాక్డౌన్విత్దజోహార్’ పేరిట పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా తన పిల్లలు యశ్, రూహీలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెటిజన్లును తెగ ఆకర్షిస్తున్నాయి. తాజాగా కరణ్ షేర్ చేసిన వీడియోలో యష్ తమ ఇంట్లోని లాకర్‌ను చూసి వాషింగ్‌మెషీన్ అని పొరపాటు పడతాడు. ఈ విషయాన్ని చాక్లెట్ తింటూ ఎంతో ఫన్నీగా ముద్దుముద్దుగా చెప్పడంతో కరణ్ నవ్వుతూనే అది వాషింగ్ మెషీన్ కాదని లాకర్ అని వివరిస్తాడు. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram Well we are now back in the closet but this time with a twist #lockdownwiththejohars A post shared by Karan Johar (@karanjohar) on May 6, 2020 at 11:08pm PDT చదవండి: ‘కరోనా రాలేదు.. క్వారంటైన్‌కు పంపలేదు’ విష్ణు ఎంట్రీ మాములుగా లేదు కదా! -
వాషింగ్ మెషీన్లో దాక్కున్న యువతి
-
లాక్డౌన్: వాషింగ్ మెషీన్లో దాక్కున్న యువతి
లాక్డౌన్ సమయంలో ఓ యువతి నిజంగానే లాక్ అయిపోయింది. అది కూడా వాషింగ్మెషీన్లో. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని పద్దెనిమిదేళ్ల అమరీ డాన్సీ అనే అమ్మాయి తన సోదరీమణులలతో కలిసి దాగుడు మూతలు (హైడ్ అండ్ సీక్) ఆడింది. అయితే దాక్కోవడానికి ఇంట్లో ఎక్కడా చోటే లేనట్టు వాషింగ్ మెషీన్‌లోకి దూరడానికి ప్రయత్నించింది. ఇరుకుగా ఉన్నప్పటికీ అదేదీ పట్టించుకోకుండా ఎలాగోలా దూరేసింది. అప్పుడే అసలు కథ మొదలైంది. వెళ్లడమైతే వెళ్లింది కానీ బయటకు మాత్రం రాలేకపోయింది. తన శక్తినంతా కూడదీసుకున్నా ఫలితం లేకపోయింది. (సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..) ఇది గమనించిన ఆమె సోదరి ఇంట్లోవాళ్లకు విషయం చెప్పింది. అయితే ఆమెను ఎలా రక్షించాలో ఎవరికీ అర్థం కాకపోపవడంతో ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేశారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది ముఖానికి మాస్కులతో ఆమె ఇంటిని చేరుకున్నారు. నానా రకాలుగా ప్రయత్నించి సురక్షితంగా ఆమెను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అప్పటికే అన్ని చోట్లా దాక్కున్నాం. కాబట్టి ఈసారి కొత్త చోటు వెతుక్కుందామని వాషింగ్ మెషీన్‌లోకి దూరానని చెప్పుకొచ్చింది. కానీ నేను బయటికి వస్తానో లేదోనని భయంతో చచ్చిపోయానని పేర్కొంది. (టిక్‌టాక్ వీడియోకు లైక్స్ రాలేదని..) -
మర మనిషి కష్టం
ఇంట్లో ఎన్ని మెషీన్లు ఉన్నా ఇంట్లో మనిషి మెషీన్లా పని చేయడం తప్పదని భావని అనుభవం చెబుతోంది. భావని లేని ఇల్లు, భావని లేందే ఇల్లు లేకపోవచ్చు. అయితే ఇంట్లో ఉండేది ఒక్క భావనియే కాదు కదా! తలా ఒక చెయ్యి వెయ్యమెందుకని?! భావని వయసు నలభైల చివరికి వచ్చేసింది. నాలుగిళ్లలో పని చేస్తుంది ఆవిడ. ఇంట్లోంచి వెళ్లే ముందు ఇంటి పని మొత్తం చేసి వెళుతుంది. ఇంటికి వచ్చాక ఇంట్లో మిగిలి ఉన్న పనిని చక్కబెడుతుంది. ‘చక్కబెట్టడం’అనే మాటలో ఒడుపుగా చేసేయడం అనే అర్థం ధ్వనించవచ్చు. కానీ అది ఎంత శ్రమతో కూడిన పనో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. భర్త, వాళ్ల ఐదుగురు పిల్లల పని కూడా ఇంట్లో ఆమెదే కనుక.. ఆమె పడే శ్రమ గురించి వారికి తెలియదు. పిల్లలైతే చదువుల చివరికి వచ్చేస్తున్నారు కానీ.. భర్త రామ్‌కుమార్ చేపల వ్యాపారం ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. వ్యాపారం అంటే పెద్ద వ్యాపారం కాదు. చెరువు దగ్గర చేపల్ని కొని తెచ్చి చుట్టుపక్కల అమ్మడం. భార్యాభర్తలకు బయట వచ్చేది తక్కువ. ఇంట్లో ఖర్చయ్యేది ఎక్కువ. భావనికి అదనంగా ఒంట్లో శక్తి కూడా ఖర్చవుతుంటుంది. భర్తకు, పిల్లలకు వండిపెట్టడం; వాళ్ల బట్టల్ని ఉతికి, ఇస్త్రీ చేసి ఉంచడం. తిన్నాక మళ్లీ గిన్నెల్ని కడిగి సర్దడం.. ఇవన్నీ తను కష్టం అనుకోదు కానీ, కొన్నిసార్లు కష్టం అవుతుంది. ‘చేయలేకపోతున్నాను’ అని ఒక్కరోజు కూడా భర్తతో గానీ, పిల్లలతో గానీ అనలేదు భావని. ఆర్నెల్ల క్రితం ఓరోజు రామ్‌కుమార్ చెప్పా పెట్టకుండా సెకండ్ హ్యాండ్ వాషింగ్ మెషీన్ తీసుకొచ్చాడు! ఒక కబడ్డీ ప్లేయర్ దగ్గర దానిని మూడు వేలకు కొన్నాడు. దాన్ని తెచ్చిన రోజున భావని కళ్లు మెరిశాయి. కళ్లు మెరిసింది భర్త తెచ్చిన వాషింగ్ మెషీన్‌ని చూసి కాదు. ‘నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను’ అనే భావం భర్త కళ్లల్లో కనిపించి! వాషింగ్ మెషీన్‌ని ఆపరేట్ చేయడం భావనికి కష్టం కాలేదు. తను పని చేసే మధ్యతరగతి ఇళ్లల్లో తను రోజూ చేసే పనే. బట్టలు వెయ్యడం, వాషింగ్ పౌడర్ చల్లడం. మెషీన్ బటన్ని నొక్కడం. అంతే. గుర్‌గ్రామ్ (హరియాణా)లోని 15వ సెక్టార్లో ఉండే ఝుగ్గీ ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో ఉంటోంది భావని కుటుంబం. వాషింగ్మెషీన్కి ఇంట్లో చోటు లేక ఇంటి బయట గుమ్మం పక్కనే పెట్టుకున్నారు. ఆ పక్కనే రెండు మూడు బక్కెట్లు, డ్రమ్ముల నీళ్లు ఉంటాయి. ఆ బక్కెట్లు, డ్రమ్ములకు కూడా ఇంట్లో చోటు లేదు. ఎప్పుడు నీళ్లు రాకుండా పోతాయోనని ముందు జాగ్రత్తగా వాటినెప్పుడూ నింపి ఉంచుకుంటారు. వాషింగ్ మెషీన్.. బట్టల్ని ఎంతసేపట్లో ఉతికేస్తుందో, భావని కూడా అంతే సమయంలో ఉతికేయగలదు కానీ.. వాషింగ్ మెషీన్‌తో ఆ గంట కాస్త శారీరక శ్రమ తగ్గింది. అలాగని ఆమె జీవితమేమీ పూర్తిగా మారిపోలేదు. ‘‘ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్తాను. నేను పని చేసే ఇళ్లలో గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు తుడిచి.. అన్ని ఇళ్ల పనీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి చేరుకుంటాను. ఇంట్లోనూ మళ్లీ అదే పని. ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, వంట చేయడం. సాయంత్రం 5 గంటలకు మళ్లీ బయటి ఇళ్లలో పని. పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది. ఇంటికి రాగానే మళ్లీ వంట..’’ అని ముఖంపై చిరునవ్వును చెరగనీయకుండా చెబుతుంది భావని. -
వాషింగ్ మెషిన్లో చిక్కుకుని బాలుడి మృతి
ఆజ్మాన్: పెద్దల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలను చిదిమేసిన ఘటన యూఏఈలోని ఆజ్మాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ నాలుగు ఏళ్ల బాలుడి తల్లి బయటకు వెళ్తూ పిల్లాడిని అల్ రవాదాలో నివాసం ఉంటున్న అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్లింది. అయితే బాలుడు తనను ఎవరు గమనించని సమయంలో లాండ్రీ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడున్న ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్లో ఎముందనుకున్నాడో తెలియదు గానీ.. బాలుడు అందులోకి దూరాడు. ఆ తర్వాత డోర్ మూసేసుకున్నాడు. వెంటనే అటోమేటిక్‌గా వాషింగ్ మెషిన్ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా వేడి నీళ్లు మెషిన్‌లోకి చేరడం, మెషిన్ తిరగడం ప్రారంభం కావడంతో.. అందులో చిక్కుకున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో బాలుడి అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. కాగా, బయటికి వెళ్లి వచ్చిన బాలుడి తల్లి.. అతని కోసం వెతుకుంతుడగా కనిపించలేదు. వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి దాన్ని ఆపివేశారు. ఆ తర్వాత డోర్ తెరచి చూస్తే బాలుడు ఘోరమైన స్థితిలో శవమై కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్ట తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
15 ఏళ్ల తర్వాత.. వాషింగ్ మెషీన్లో చిక్కాడు
సాక్షి, ముంబై : 15 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. ఛీటింగ్ కేసులలో నిందితుడైన అతని కోసం ప్రతీసారి పక్కా సమాచారంతో దాడి చేస్తున్నా... అతను దొరక్కపోవటం పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించేది. చివరకు అతని ఇంట్లోనే నాటకీయ పరిణామాల మధ్య అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే... జూహు ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తిపై 2002 లో ఓ కేసు నమోదు అయ్యింది. బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి కొందరి నుంచి సుమారు 1 లక్ష రూపాయాల దాకా వసూలు చేశాడు. వారి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం వేట ప్రారంభించారు. ఇతగాడు పుణేలో జరిగిన ఓ కోటి రూపాయల స్కామ్‌లో నిందితుడిగా కూడా ఉన్నాడంట. దీంతో అతన్ని పోలీసులు 15 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నా ఫలితం లేకపోయింది. చివరకు సోమవారం అతను నివసించే అపార్ట్‌మెంట్‌ను మూడు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అతని భార్య మాత్రం వారిని ఇంట్లోకి అనుమతించలేదు. మూడు గంటల తర్వాత వాళ్లు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. వాషింగ్‌మెషీన్ డోర్ నుంచి దుస్తులను బయట పెట్టి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. చివరకు పోలీసులు మూత తెరిచి చూడగా అందులో అతగాడు నక్కి ఉన్నాడు. అవాక్కయిన పోలీసులు చివరకు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. -
వీడు గొప్ప ఆటగాడ్రా ‘బుజ్జి’
బాల్యంలో మనలో చాలామంది దాగుడుమూతల ఆట ఆడే ఉంటాం. ఎవరికీ దొరక్కుండా ఆటలో మనమే గెలవాలని భలే గమ్మత్తయిన ప్రదేశాలను ఎంచుకుని మరీ దాక్కునే వాళ్లం.. అయినా చివరికి ఎలాగోలా దొరికిపోయే వాళ్లం. అయితే ఉక్రెయిన్‌లోని ఏడేళ్ల బుజ్జిగాడు ఓ రోజు దాగుడుమూతలు ఆట ఆడుతున్నాడు. ఎవరూ ఊహించలేని, ఎవరికీ కనబడని ప్రదేశంలో దాక్కొని తానే గెలవాలని అనుకున్నాడు. దాక్కునే చోటు కోసం చూస్తుండగా పక్కనే ఉన్న వాషింగ్ మెషీన్ బుడతడి కంటికి కనబడింది. ఇదేదో బాగుందే ఎవరికీ కనబడకుండా ఉండొచ్చని వెంటనే దానిలోకి దూరేశాడు. దానిలో దాక్కున్న కొద్దిసేపు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అర్థమైంది మనోడికి ఈ ప్రదేశం ఏదో తేడాగా ఉందే అని. తక్షణమే దానిలోంచి బయట పడాలని ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ఎమర్జెన్సీ సర్వీస్‌కి ఫోన్ చేయగా.. నలుగురు పోలీసులు వచ్చి పిల్లాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడే వారికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే సన్‌ఫ్లవర్ నూనెను వాషింగ్ మెషీన్లో గుమ్మరించారు. నూనె బాలుడి శరీరానికి అంటుకోవడంతో కాసేపటికి తనంతట తానే బయటకు జారిపడ్డాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
హృదయవిదారక ఘటన
వాషింగ్ మెషీన్ లో పడి కవలల మృతి న్యూఢిల్లీ: కొద్ది నిమిషాల పాటు తల్లి వదిలివెళ్లడమే ఆ చిన్నారుల శాపంగా మారింది. వాషింగ్ మిషన్ రూపంలో వచ్చిన మృత్యువు కవలలను పొట్టన పెట్టుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శనివారం జరిగిన హృదయవిదారక ఘటనలో రెండున్నరేళ్ల వయస్సు కల్గిన ఇద్దరు కవలలు నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు వాషింగ్‌మెషిన్‌లో పడి మృతి చెందారు. సెక్టార్-1లోని ఓ అపార్ట్మెంట్ లో ఈ దుర్ఘటన జరిగింది. బట్టలు ఉతికేందుకు నిశాంత్, నక్షయ తల్లి వాషింగ్ మెషీన్ లో నీళ్లు నింపింది. వాషింగ్ మెషీన్ దగ్గరే ఆడుకుంటున్న పిల్లల్ని అక్కడే వదిలేసి డిటర్జెంట్ పౌడర్ కొనుక్కునేందుకు షాపుకు వెళ్లింది. తిరిగొచ్చేసరికి పిల్లలిద్దరూ కనిపించలేదు. ఎంత వెతికినా వారి జాడ కానరాలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆఫీసు నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన చిన్నారుల తండ్రి రవీందర్ కూడా వెతుకుతుండగా చిన్నారులిద్దరూ వాషింగ్ మెషీన్లో తేలియాడుతూ కనిపించారు. వెంటనే వీరిద్దరినీ సమీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వాషింగ్‌మెషిన్‌లో మునగడం వల్లే నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
వాషింగ్ మెషిన్లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
-
బాష్ ‘నో డ్యామేజ్’ ప్రచారం
హైదరాబాద్: ఐరోపా దిగ్గజ గృహోపకరణాల సంస్థ ‘బాష్’ తాజాగా తన నూతన శ్రేణి వాషింగ్ మెషీన్ల కోసం ‘నో డ్యామేజ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. సంస్థ ఇటీవల లాండ్రీ విభాగంలో 6.5-8 కిలోగ్రాముల ఉత్పత్తుల శ్రేణిలో కొత్తగా వాషింగ్ మెషీన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిల్లో యూనిక్యూ వేవ్ డ్రాప్లెట్ డిజైన్‌తో కూడిన వరియోడ్రమ్ టెక్నాలజీని ఉపయోగించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో వినియోగదారులు ఈ కొత్త మెషీన్ల ద్వారా వారి నూతన, ఖరీదైన దుస్తులను డ్యామేజ్ లేకుండా వాష్ చేసుకోవచ్చని పేర్కొంది. -
వాషింగ్ మెషీన్ల విపణిలో 40% వాటా: శాంసంగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా యాక్టివ్ వాష్ ప్లస్, యాడ్ వాష్ శ్రేణిలో నూతన వాషింగ్ మెషీన్లను హైదరాబాద్ వేదికగా భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. ధరల శ్రేణి రూ.18,590-59,990గా ఉంది. వాషింగ్ పౌడర్ పూర్తిగా కరిగేలా ‘కె’ సిరీస్ టాప్లోడ్ మోడళ్లలో మ్యాజిక్ డిస్పెన్సర్‌తో పాటు బిల్ట్ ఇన్ సింక్‌ను పొందుపరిచారు. బట్టలు ఉతికే సమయంలో వస్త్రాలను అదనంగా జోడించేందుకు ఫ్రంట్‌లోడ్ మోడళ్లలో ముందు డోర్‌కు మరో చిన్నపాటి డోర్‌ను భారత్‌లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. టాప్లోడ్ వాషింగ్ మెషీన్ల విభాగంలో కంపెనీ వాటా గతేడాది 5% పెరిగి 35 శాతానికి చేరిందని శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటానీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 2016లో 40% వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. ఫ్రంట్ లోడ్ విభాగంలోనూ సుస్థిర వాటా దక్కించుకుంటామన్నారు. భారత్‌లో వాషింగ్ మెషీన్ల విపణి విలువ రూ.7,500 కోట్లుంది. ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్ విభాగం వాటా 58 శాతముంది. -
వాషింగ్ మిషన్‌లో తల ఇరుక్కుపోయింది..
ఫ్యూకింగ్: ఎప్పటిలాగే తన బట్టలను శుభ్రం చేయాలనుకున్నాడో వ్యక్తి. అనుకున్నదే తడువుగా ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేశాడు. కానీ వాషింగ్ మిషన్ ఎందుకో ఆ రోజు మోరాయించినట్టుంది. దీని సంగతి ఏంటో చూద్దామంటూ వాషింగ్ మిషన్‌లో తలపెట్టేశాడు. అంతే అలా పెట్టిన తల అందులోనే ఇరుక్కుపోయింది. అదేంటో మరీ తల లోపలికి తొంగిచూసినప్పుడు సులభంగానే వెళ్లింది.. మళ్లీ వెనక్కి తల తిప్పడానికి ప్రయత్నిస్తే రాదేంటి.. భలే పనైందే.. ఎరక్కపోయి.. వచ్చి ఇరుక్కపోయినట్టైందే నా పని అనుకున్నాడా వ్యక్తి. ఈ సంఘటన ఎక్కడో కాదు.. ఆగ్నేయ చైనాలోని ఫ్యూజియన్ రాష్ట్రంలోని ఫ్యూకింగ్ నగరంలో చోటుచేసుకున్నట్టు డైలీ మొయిల్ వెల్లడించింది. బాధితుడి నరకయాతనను గమనించిన తోటి స్నేహితులు.. వాషింగ్ మిషన్లోనుంచి అతని తలను బయటకు తీసేందుకు శతవిధాలుగా యత్నించారు. చివరి ప్రయత్నంగా అతడి చొక్కా విప్పి.. వాషింగ్ మిషన్ చివిరి కొనల్లో సబ్బును ఉపయోగించి అతని బయటకు లాగడానికి ప్రయత్నించారు. బాధితుడికి సరిగా శ్వాస అందకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చేసేది ఏమి లేక బాధితుడి స్నేహితులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది 40 నిమిషాలపాటు శ్రమిస్తేగానీ వాషింగ్ మిషన్ లో నుంచి అతగాడి తల బయటకు రాలేదు. మిషన్ లోనుంచి తలను తియడానికి ఒక లోహపు రంపముతో మిషన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోశారు. శ్వాస తీసుకునేందుకు వీలుగా మిషన్ కు రంధ్రాలు చేశారు. ఈ ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యహరించి విజయవంతంగా మిషన్ లోనుంచి బాధితుడి తలను బయటకు తీశారు. అమ్మయ్యా..! బ్రతికిపోయాను అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మెడ, తలకు మాత్రం చిన్న గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు. గత మార్చి నెలలో ఉత్తర చైనాలో హెబెయి ప్రాంతంలో రెండు భవనాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. ఆమెను రక్షించడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. నెమ్మదిగా ఎలాగో అలా ఆ మహిళను కిందికి దింపారు. -
వాషింగ్ మెషిన్లో 2 కిలోల బంగారం...
ముంబై: రెండు కిలోల బంగారం బిస్కట్ల స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. బంగారు బిస్కట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ముంబై ఎయిర్ పోర్టు నిఘా విభాగం(ఏఐయూ) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 19 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ అస్లాం షేక్ అనే వ్యక్తి రియాద్ నుంచి భారత్ కు వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో అధికారులు రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న వాషింగ్ మెషిన్ లో ఏదో అనుమానిత వస్తువులు ఉన్నట్లు గమనించారు. వాషింగ్ మేషిన్ ను పరిశీలించి చూడగా ఒక్కొక్కటిగా 19 గోల్డ్ బిస్కట్లు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు రెండు కిలోలకు పైగా ఉందని, విలువ దాదాపు అరవై లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారు బిస్కట్లను మరో వ్యక్తిని తాను అప్పగించాల్సి ఉందని, అతని పేరు సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అస్లాం షేక్ కోసం ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న సల్మాన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది అన్న కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టమామని ఎయిర్ పోర్టు నిఘా విభాగం అధికారులు వివరించారు. -
వాషింగ్ మెషిన్ షాక్: ఇద్దరు మృతి
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక వారాసిగూడ ముంతాజ్ కేఫ్ సమీపంలోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో దుస్తులు ఉతుకుతున్న మహిళ కు షాక్ తగిలింది. ఇది గమనించిన ఆమె కొడుకు తల్లి ప్రాణాలు రక్షంచబోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అది ఇప్పట్లో జరగదు!
షూటింగ్స్ లేనప్పుడు మీరేం చేస్తారు? అని ఇలియానాని అడిగితే... ‘ఇంటి పనులు చేస్తా’ అని చెబుతారు. గిన్నెలు కడగడం, వాషింగ్ మిషన్ ఉన్నప్పటికీ చేత్తో బట్టలు ఉతకడం వంటివన్నీ చేస్తారట. ఇలాంటి పనులు చేయడానికి మనుషులు ఉన్నప్పటికీ పనిగట్టుకుని ఇలియానా చేయడానికి కారణం ఉంది. దాని గురించి ఈ గోవా బ్యూటీ చెబుతూ - ‘‘సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు, షూటింగ్ స్పాట్లో మినహా ఎక్కడ ఉన్నా నా పనులు నేనే చేసుకోవాలని ఒట్టేసుకున్నా. ఆర్టిస్ట్‌గా చేయడమంటే అందరి మీదా ఆధారపడటమే అని నా ఫీలింగ్. హెయిర్ స్టైల్‌కి ఒకరు, మేకప్ చేయడానికి ఇంకొకరు, కాస్ట్యూమ్స్ కోసం ఒకరు, మేకప్ టచప్ కోసం ఒకరు.. ఇలా చాలామంది స్టాఫ్ ఉంటారు. వద్దనుకున్నా వాళ్ల మీద ఆధారపడాల్సిందే. ఎవరి మీదా ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోగలిగేది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంట్లో ఉన్నప్పుడు క్లీనింగ్, కుకింగ్ వంటివన్నీ నేనే చేస్తా. ఆ క్షణాల్లో నేనో సెలబ్రిటీని అనే విషయాన్ని కూడా మర్చిపోతాను. అది చాలా హాయిగా ఉంటుంది’’ అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. హిందీలో ఆమె నటించిన ‘హ్యాపీ ఎండింగ్’ విడుదలై ఏడాదిన్నర పైనే అయ్యింది. ఈ గ్యాప్‌లో ఆమె అక్కడ వేరే సినిమాలు ఒప్పుకోలేదు. దాంతో ఇలియానా కెరీర్ ఎండ్ అయ్యిందని చాలామంది ఫిక్స్ అయ్యారు. అది తప్పని నిరూపిస్తూ.. ఈ మధ్యే ‘రుస్తుమ్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారామె. ‘‘నా కెరీర్ అయి పోయిందను కున్నారేమో.. అది ఇప్పట్లో జరగదు’’ అని ఇలియానా పేర్కొన్నారు. -
వాషింగ్ మెషీన్లో ఇరుక్కున్న రెండేళ్ల బాలుడు
రెండేళ్ల బాలుడు ‘వాషింగ్ మెషీన్’లో ఇరుక్కున్న సంఘటన కలబుర్గిలోని విద్యానగరలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు అరగంట పాటు శ్రమించి వాషింగ్ మెషీన్‌ను విరగ్గొట్టి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాలు....కలబుర్గిలోని విద్యానగరలో నివాసం ఉంటున్న దంపతుల రెండేళ్ల కుమారుడు కుర్చీ సహాయంతో టాప్లోడ్ వాషింగ్ మెషీన్‌పై ఎక్కి అందులోకి దిగి ఏడుపు మొదలు పెట్టాడు. వంటింట్లో ఉన్న తల్లి వచ్చి చూసేసరికి ఆ చిన్నారి వాషింగ్ మెషీన్లో ఇరుక్కొని కనిపించాడు. కాళ్లు మెషీన్లో ఇరుక్కు పోవడంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. కుమారుడి పరిస్థితిని చూసి భయంతో ఆమె కేకలు వేయగా పక్కింటి వారు వచ్చి అరగంట పాటు శ్రమించి వాషింగ్ మెషీన్‌ను కత్తితో కత్తరించేసి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు దిగిన సమయంలో వాషింగ్ మెషీన్ ఆన్‌లో లేదని, అందువల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని ఘటనా స్థలంలో ఉన్న వారు చెబుతున్నారు. -
వాషింగ్ మెషిన్లో రెండేళ్ల బాలుడు
కర్ణాటక: కర్ణాటకలోని కాల్బుర్గిలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్లో రెండేళ్ల బాలుడు పడి ఇరుక్కుపోయాడు. ఆడుకుంటూ వెళ్లినబాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు ప్రాథమికంగా తెలిసింది. తొలుత ఇంట్లో వాళ్లు ఎంత ప్రయత్నించినా అతడిని వెలికి తీసేందుకు సాధ్యం కాలేదు. దీంతో సహాయక సిబ్బంది వచ్చి మెషిన్‌ను కత్తిరించి బాలుడిని బయటకు సురక్షితంగా తీశారు. అతడికి ఎలాంటి గాయాలు అవలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
పసిపాపను వాషింగ్ మెషిన్లో పడేశారు..
కోజికోడ్ : ఇరవై రోజుల పసికందును వాషింగ్ మెషిన్లో పడవేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరనేది మాత్రం మిస్టరీగా మారింది. అయితే ఆ పాపను కన్నతల్లే వాషింగ్ మెషిన్ లో పడేసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా, పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఇప్పుడే ఈ కేసు వివరాలు వెల్లడిస్తే నిందితులకు తప్పించుకునే అవకాశం ఉంటుందని, అందువల్ల విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కోడువ్యాలీ సీఐ ప్రేమ్జీత్ పేర్కొన్నారు. అందుకే తాము ఎవరి పేరును బయటపెట్టాలని భావించడం లేదని చెప్పారు. కేరళలోని కోడువ్యాలీలోని గురువారం ఓ ఇంట్లో ... పసిపాపను వాషింగ్ మెషిన్ లో గుర్తించిన విషయం స్థానికంగా కలకలం సృష్టించిన విషయం విదితమే. గుర్తు తెలియని వ్యక్తి.. పాప తల్లి కళ్లలో కారం చల్లడంతో ఆమె గట్టిగా కేకలు వేసిందని, శబ్దం విని అక్కడికి వెళ్లిన చుట్టుపక్కల వాళ్లు వాషింగ్ మెషిన్లో పసికందును గుర్తించినట్లు చెబుతున్నారని సీఐ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, నిజనిజాలు తేలేంత వరకూ ఎవరిని అరెస్టు చేసేది లేదన్నారు. ఈ ఘటనలో పాప తల్లిదే తప్పు అని మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ తాము అలా తొందరపడి ఓ అభిప్రాయానికి రాలేమని సీఐ వివరించారు. -
బకెట్ వాషింగ్ మెషీన్..
వాషింగ్ మెషీన్.. ఇది లేకుండా చాలా మందికి ఇళ్లలో నడవదు.. అదే సమయంలో మరికొందరికి ఇది అవసరమైనా.. ధర వల్ల కొనుక్కునే పరిస్థితీ లేదు. ఈ అంతరాన్ని పూర్తించే పనిలో పడ్డారు ముంబైకి చెందిన వింబస్ నవరచన సంస్థకు చెందిన పీయూష్ అగర్వాలా. దాని ఫలితమే ఈ వీనస్ వాషింగ్ మెషీన్. మన వద్ద 25 లీటర్ల బకెట్.. వీనస్ యంత్రం ఉంటే చాలు.. ఎంచక్కా బట్టలు ఉతికేసుకోవచ్చు. ఒక ట్రిప్పులో 3 జతల వరకూ ఉతుకుతుంది. బకెట్లో నీళ్లు పోసి.. డిటర్జెంట్ వేసి.. దానికి వీనస్‌ను క్లాంప్స్ సాయంతో తగిలించేసి.. పవర్ ఆన్ చేస్తే.. 5 నిమిషాల వ్యవధిలో తళతళలాడే తెలుపు మీ సొంతం. వీనస్ యంత్రం బరువు 2.1 కిలోలు. చిన్నసైజు బ్యాగులో పట్టేస్తుంది. అంటే.. మనం ఎక్కడికెళ్తే.. అక్కడికి తీసుకుపోవచ్చు. ప్రస్తుతం దీన్ని ఉత్పత్తి చేసేందుకు వీలుగా పెట్టుబడి కోసం పీయూష్ ఎదురుచూస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ ‘ఇండిగోగో’ ద్వారా ప్రయత్నిస్తున్నారు. రూ.50 లక్షలు వస్తే.. ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2015 మే సరికి మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నారు. ‘చాలాకాలం పాటు చేతులతో బట్టలు ఉతకడం వల్ల భుజం, నడుం నొప్పి వస్తుంది. రసాయనాలతో కూడిన డిటర్జెంట్లను వాడటం వల్ల చర్మ వ్యాధులు, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా వాషింగ్‌మెషీన్ కొనుక్కోలేని అల్పాదాయ వర్గాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఇంటికి దూరంగా వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికే కొన్నిటిని పరిమిత స్థాయిలో రూ.2,500 చొప్పున విక్రయించాం. భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఇది రూ.1,500 కే లభిస్తుంది.’ అని పీయూష్ చెప్పారు. త్వరలో బ్యాటరీతో పనిచేసే దాన్నీ తేవాలని యత్నిస్తున్నారు. -
వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది?
వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత దుస్తులు ఉతకడం చాలా సులువైపోయింది. కొంచెం అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. ఇంతకీ వాషింగ్ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసా? వాషింగ్ మిషన్ అనేది విద్యుచ్ఛక్తి సాయంతో నడిచే ఒక గృహోపకరణం. దాదాపు అన్ని రకాల వాషింగ్ మిషన్లలోనూ గుండ్రటి డ్రమ్ము వంటిది ఉంటుంది. ఉతికిన దుస్తులను తీసి, ఇందులో వేస్తే, ఇది గిరగిరా తిరుగుతూ దుస్తులను నీళ్లు లేకుండా పిండుతుంది. ఇప్పుడు వస్తున్న అధునాతన వాషింగ్ మిషన్లలో అంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లలో ముందుగా రూపొందించబడిన మెకానిజం ప్రకారం, మనం కొన్ని మీటలను నొక్కితే చాలు... దుస్తులను ఉతకడం, జాడించడం, పిండటం వంటివన్నీ అదే చేస్తుంది. విద్యుత్తుతో పని చేసే కవాటం లోపలి ద్వారంలో నీటిని పోయాలి. ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే నీటి కుళాయికి అనుసంధానిస్తే చాలు, అదే కావలసినంత నీటిని తీసుకుంటుంది. నీరు కావలసినంత మట్టానికి చేరగానే, దానిని కనిపెట్టి, దానంతట అదే నీటి ధార ఆగిపోయేలా సెన్సర్లు ఉంటాయి. కవాటం లోపలి ద్వారంలో ఉండే నీటి పీడనం మూలంగా కవాటం దానంతట అదే మూసుకుపోతుంది. నీటిని వేడి చేయవలసిన అవసరం ఉంటే, అందులో ఉండే వేడి చేసే పరికరం (హీటర్) ద్వారా నీరు వేడెక్కుతాయి. ముందుగానే సెట్ చేసి ఉంచిన సెన్సర్ ద్వారా దానికి కావలసిన వేడిని చేరగానే నీరు వేడెక్కటం ఆగిపోతుంది. నీటిలో కలిపిన డిటర్జెంట్ పొడి సాయంతో మురికి పోయేలా డ్రమ్లోని దుస్తులను పరికరం అటూ ఇటూ వేగంగా తప్పుతుంది. శుభ్రపడిన దుస్తులు స్పిన్నింగ్ డ్రమ్ములోకి వెళతాయి. సెమీ ఆటో మేటిక్ అయితే మనమే వాటిని స్పిన్నింగ్ డ్రమ్ములోకి పంపించాలి. ఉతికిన దుస్తులలోని సర్ఫు నురగ పోయేలా బట్టలను ఆ పరికరం శుభ్రంగా జాడించి, అక్కడినుంచి బట్టలను ఎండబెట్టే డ్రయ్యర్‌లోకి పంపుతుంది. దుస్తులలోని నీరంతా పోయే వరకూ డ్రయ్యర్ వాటిని గట్టిగా పిండుతుంది. దుస్తులను పిండటం అయిపోయాక మనం వాటిని తీసి, గాలి లేదా ఎండ తగిలేలా ఆరవేయాలి. వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా గృహిణులకు చాలా శ్రమ తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. -
‘ఇన్స్పైరింగ్’ చిల్డ్రన్
పుస్తకం చదువుకుంటూ.. టీవీ చూసుకుంటూ వాషింగ్ మెషీన్లో బట్టలుతకొచ్చు. పైసా విద్యుత్ కూడా ఖర్చుకాదు. వోల్వో బస్సులో మంటలంటుకున్నాయి. ఎర్రదీపాలు వెలిగి అలారం మోగింది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. అంతా క్షేమంగా కిందకు దిగిపోయారు. అంధ విద్యార్థుల కోసం స్నేక్ అండ్ లాడర్ ఉంది. దీన్ని తయారు చేసింది ఓ అంధ విద్యార్థి. అద్భుతమైన ఈ ప్రాజెక్టులను రూపొందించింది బాల మేధావులు. సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో ప్రారంభమైంది. ఆరు జిల్లాల విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బట్టలు శుభ్రం...ఒంటికి వ్యాయామం మా సార్ కె.రవికుమార్ సహాయం తో పెడల్ పవర్ వాషిం గ్ మెషీన్‌ను తయారు చే శాను. పల్లెటూర్లలో తల్లిదండ్రులిద్దరు పొ లాలకు వెళ్లిపోతే ఇంట్లో పనులన్నీ ఆడపిల్లలకు అప్పగించేస్తారు. కొందరు ఇంట్లో పనుల కోసమే చదువులు మానేస్తుంటారు. అది ఆలోచించి ఈ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశాను. దీనివల్ల స్థూలకాయులకు మంచి వ్యాయా మం అవుతుంది. బట్టలుతకడం సులభమవుతుంది. -కె.సురేష్, ఆరో తరగతి, కె.గంగవరం, తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ సమస్యకు చక్కని పరిష్కారం ప్రస్తుతం ట్రాఫిక్, పార్కింగ్ సమస్య బాగా పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ, లండన్, అమెరికాలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. ఆ విధానం స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్‌ను తయారు చేశాను. పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్తే వాహనాల పార్కింగ్‌కు చాలాసేపు నిరీక్షిం చాల్సి వస్తోంది. అండర్ గ్రౌండ్ పార్కింగ్తో ఈ సమస్య పరిష్కారమవుతుంది. దీనికి మా టీచర్ సత్యవేణి ఎంతో సహాయం చేశారు. - పి.జ్యోత్స్న, ఎనిమిదో తరగతి, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా సురక్షిత బస్సు ప్రయాణం టెన్త్ క్లాస్ చదువుతున్నాను. బస్సులో అగ్ని ప్రమాదాలను నివారించే ప్రాజెక్ట్‌ను మా సార్ డి.రవికుమార్ సహకారంతో తయారు చేశాను. బస్సులో సెన్సార్లు, ఎమర్జెన్సీ తలుపులను ఏర్పాటు చేయాలి. మంటలు చెలరేగితే పొగలు వస్తాయి. పొగ సెన్సార్‌ను తాకగానే డ్రయివర్, ప్రయాణికుల దగ్గర ఎర్రదీపాలు వెలిగి అలారం మోగుతుంది. తలుపులు కూడా ఆటోమెటిక్‌గా తెరుచుకుంటా యి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ట్రైమిథేన్ ట్రైమిథైల్ గ్లైకాల్ అనే రసాయనాన్ని ఉంచాలి. అప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడతారు. - రాజరాజేశ్వరి, పదో తరగతి, కైకలూరు, కృష్ణాజిల్లా. పవర్ పార్క్ పార్కులో పిల్లలు జారుడు బల్లలపై నుంచి జారుతుంటారు. వాళ్లు జారుతున్నప్పుడు కలిగిన ఒత్తిడికి విద్యుదుత్పత్తి అవుతుంది. పైపులోంచి నీరు మొక్కలకు సరఫరా అవుతుంది... ఇది సాధ్యమేనా అంటారా?.. సాధ్యమేనని నిరూపించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న నవ్య. తన ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి, టీచర్ దివ్య ప్రత్యూష సహకారంతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకోసం డైనమోలను ఉపయోగించింది. అంధుల కోసం స్నేక్ అండ్ లాడర్ అంధులు కూడా స్నేక్ అండ్ లాడర్ ఆడొచ్చు. దీన్ని తయారు చేసింది ఓ అంధ విద్యార్థి. పశ్చమగోదావరి జిల్లా నర్సపురానికి చెందిన ఆర్.పార్థసారధిరెడ్డి ఈ పరికరాన్ని ప్రదర్శించి ప్రశంసలందుకున్నాడు. దీని తయారీలో తన టీచర్ వి.రాజేష్ పూర్తి సహకారాన్ని అందించారని చెప్పాడు. -
షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలిన టివి
-
మాట మంచిదైతే.. కొలువు సొంతమే
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత నేటి యువతకు చాలా అవసరం. ఎందుకంటే టెలిఫోన్ ఇంటర్వ్యూల్లో తెలిసీతెలియక నోరుజారి, అవకాశా లను చేజార్చుకుంటున్నారు మన విద్యార్థులు. ఎక్కడైనా మర్యా దపూర్వక మైన మాటతీరుకే మన్నన దక్కుతుంది. హలో.. హాయ్.. ఏరా మామ... ఇలాంటి పిలుపులకు అలవాటైన కుర్రకా రు ఇవే మాటలను ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ ఉపయోగిస్తు న్నారు. కంపెనీలు నిర్వహించే టెలిఫోన్ ఇంటర్వ్యూల్లో క్యాజువల్‌గా మాట్లాడుతున్నారు. ఫలితంగా చేతిదాకా వచ్చిన కొలువును నోటి మాటతో దూరం చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు లేకపోవడం వల్లే విద్యార్థులు కోరుకున్న కొలువులను దక్కించుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ‘ఇంజనీరింగ్, ఎంబీఏలో అగ్రశ్రేణి ప్రతిభ చూపిన ఓ విద్యార్థి టెలిఫోన్ ఇంటర్వ్యూలో చిన్నపాటి తప్పిదం చేయడం వల్ల పెద్ద కంపెనీ అతడిని రిజెక్ట్ చేసింది’ అని ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో వెనుకబడి ఉండడం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్.ఎన్.హసన్. దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతో ‘ఇంగ్లిష్ క్లబ్’ను ఏర్పాటు చేసి భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని వివరించారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో చదివినవారు సైతం ఉద్యోగావకాశాలు దూరం చేసుకుంటున్నారంటే ప్రధాన కారణం.. వారి మాటతీరేనని అంటున్నారు ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ హెడ్ దేవీప్రసాద్. ఇటీవలి కాలంలో బహుళజాతి సంస్థలు నాన్ టెక్నికల్ ఉద్యోగుల తొలిదశ ఎంపిక ప్రక్రియలో భాగంగా టెలిఫోన్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల బాడీలాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా కేవలం మాటతీరును బట్టి వారి నైజాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. మెయిల్ ద్వారా తమకు చేరిన అభ్యర్థుల రెజ్యుమెలోని సమాచారం ఆధారంగా టెలిఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇవి సాధారణంగా రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి ఆటోమేటెడ్, మరొకటి నాన్-ఆటోమేటెడ్. ఆటోమేటెడ్లో ముందే రికార్డు చేసిన ప్రశ్నల శ్రేణికి వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్-ఆటోమేటెడ్లో కంపెనీ ప్రతినిధి ఫోన్లో స్వయంగా అభ్యర్థితో మాట్లాడుతారు. ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేస్తారనే విషయాన్ని కూడా ముందుగానే అభ్యర్థికి తెలియజేస్తారు. దీన్నిబట్టి అభ్యర్థి సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఇలా సరిదిద్దుకుందాం! ►సంస్థ నుంచి ఫోన్‌కాల్ రాగానే మర్యాదపూర్వకమైన పలకరింపుతో పరిచయం చేసుకోవాలి. ►సదరు సంస్థ గురించి ముందుగానే సమాచారం సేకరించి పెట్టుకోవాలి. ► దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కనీస అవగాహన ఉండాలి. ► ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి. ► తాను చేయబోయే ఉద్యోగం పట్ల తనకున్న ఆసక్తిని తప్పనిసరిగా వ్యక్తీకరించాలి. ►వ్యక్తిగత సమాచారం, సాధించిన విజయాలు.. ముఖ్యంగా రెజ్యుమెలో పేర్కొన్న అంశాలను ఇంటర్వ్యూల్లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కచ్చితంగా గుర్తుంచు కోవాలి. అడిగిన వెంటనే వాటి గురించి చెప్పేలా సంసిద్ధంగా ఉండాలి. రెజ్యుమెను పక్కనే ఉంచుకోవాలి. ► రిక్రూటర్ చెప్పే విషయాలను రాసుకొనేందుకు ఒక నోట్ పుస్తకం, పెన్నును దగ్గర పెట్టుకోవాలి. ► ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో విరామం ఉండదు. దాహం తీర్చుకునేం దుకు కూడా అవకాశం ఉండకపోవ చ్చు. కాబట్టి ఇంటర్వ్యూ కాల్ రావడానికంటే ముందే నీరు తాగి సిద్ధంగా ఉండాలి. ► ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలగ కుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లో ఉంటే స్టీరియోను, టీవీని ఆఫ్ చేయాలి. ► మాట్లాడేందుకు వీల్లేని పరిస్థితిలో ఫోన్‌కాల్ వస్తే.. కారణాన్ని సున్నితంగా వివరించాలి. మీరు ఏ సమయానికి అందుబాటులో ఉంటారో తెలియజేయాలి. ► వీలైతే మీరే తిరిగి ఫోన్ చేసేందుకు సంస్థ ప్రతినిధులకు అనుకూలమైన సమయాన్ని కోరాలి. ► ఫోన్లో మాట్లాడేందుకు ఎలాంటి అవాంతరాలు లేని, మంచి వాతావరణం ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ►మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. శరీరం కూడా రిలాక్స్డ్గా ఉండాలి. ► గొంతులోంచి మాట స్వేచ్ఛగా రావాలి. ఇందుకోసం కొంత ప్రాక్టీస్ చేయడం మంచిది. ►ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు తెలుసు కాబట్టి.. వాటికి సరైన సమాధానాలు ఇచ్చేందుకు ఇంట్లో అద్దం ముం దు సాధన చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ►ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం అభ్యర్థులకు ఉండాలి. ఇంటర్వ్యూలో ఇది చాలా ముఖ్యం. రిక్రూటర్ అడిగే ప్రశ్నను పూర్తిగా విని, అర్థం చేసుకోవాలి. ►రిక్రూటర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే సమాధానం ఇవ్వాలి. ►అభ్యర్థి వేగంగా మాట్లాడితే రిక్రూటర్‌కు అర్థం కాకపోవొచ్చు. నిదానంగా, స్పష్టంగా మాట్లాడాలి. గొంతులోంచి వచ్చే మాట వేగాన్ని బట్టి అభ్యర్థి మానసిక పరిస్థితిని రిక్రూటర్లు సులభంగా అంచనా వేస్తున్నారు. సంభాషణలో ప్రొఫెషనల్ లాంగ్వేజ్‌ను మాత్రమే ఉపయోగించాలి. ►మాట్లాడేటప్పుడు ఎక్కువ సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిరునవ్వు చిందించాలి. అభ్యర్థి ఎలాంటి ఆందోళన చెందకుండా రిలాక్స్డ్గా ఉన్నాడన్న విషయం రిక్రూటర్‌కు తెలిసేలా మాటతీరు ఉండేలా జాగ్రత్తపడాలి. ► ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకోగానే సాధారణ సంభాషణ ప్రారంభించడం. ► హ..హలో..ఏంటి చెప్పు.. వంటి మాటలతో డోంట్‌కేర్ అన్నట్లుగా ఉండే మాటతీరు ► మాట్లాడే భాష సక్రమంగా లేకపోవడం ► ఫోన్‌కాల్ చేసిన వ్యక్తి హోదా, వివరాలను అడగకపోవడం ► సంభాషించేటప్పుడు నీరసంగా, ఆసక్తి లేనట్లుగా సమాధానం ఇవ్వడం. ► భాషలో లోపాలు, యాస దొర్లడం. స్వచ్ఛమైన భాష అవసరం టెలిఫోన్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే.. భాషపై మంచి పట్టు అవసరం. వ్యావహారిక భాషను ఉపయోగించడం మంచిదే కానీ.. అటువైపు నుంచి కాల్ చేసిన కంపెనీ మల్టీ నేషనల్ కంపెనీ అయితే మాటతీరు, పదాల కూర్పు దానికి తగినట్లుగా ఉండాలి. సాధారణంగా మనం డెరైక్టర్, ఫైనాన్స్ అంటూ ఆంగ్ల పదాలను ఉచ్ఛరిస్తాం. అదే ఇంగ్లిషులో డిరెక్టర్, ఫినాన్స్ అంటూ పలుకుతారు. భాష విషయంలో గ్రామర్ ఎంత ముఖ్యమో యాక్సెంట్‌కు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పదాలను పలకడంలో చోటుచేసుకునే చిన్నచిన్న తప్పిదాలను కూడా కంపెనీలు తీవ్రంగా పరిగణిస్తాయి. తమ ఉద్యోగులు క్లయింట్లతో ఎలాంటి తప్పులు లేకుండా స్వచ్ఛమైన భాష మాట్లాడాలని కంపెనీలు ఆశిస్తాయి. అందుకే ఈ అంశాన్ని ఇంటర్వ్యూల్లో కచ్చితంగా పరీక్షిస్తాయి. చాలామంది సంభాషణ ప్రారంభంలో ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకూ కొనసాగించరు. అభ్యర్థులు ఆసక్తితో, ఉత్సాహంగా మాట్లాడితే ఇంటర్వ్యూలో విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ముగింపు సమయంలోనూ.. మీతో మాట్లాడటం తనకు దక్కిన అవకాశమంటూ కంపెనీ ప్రతినిధులకు వివరించాలి. విలువైన సమయాన్ని వెచ్చించినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ ముగించాలి. -
చేపలు బట్టలుతుకుతాయి..
నిజం.. ఈ వాషింగ్మెషీన్లో చేపలే బట్టలుతుకుతాయి. అయితే.. అవి రోబో చేపలు. ఇప్పుడు చాలా మల్టీప్లెక్స్‌లలో మృత శరీర కణాలను తినే డాక్టర్ ఫిష్‌లతో కూడిన తొట్టెలు పెడుతున్నారు. వాటిలో మనం కాళ్లు పెడితే.. ఆ చేపలు వచ్చి.. కాళ్ల వద్ద ఉన్న మృత శరీర క ణాలను తినేస్తాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకునే దక్షిణ కొరియాకు చెందిన చాంగ్ జియాంగ్ ‘పెసెరా’ అనే ఈ వాషింగ్ మెషీన్ డిజైన్‌ను రూపొందించారు. ఇందులో డిటర్జెంట్ అవసరముండదు. మామూలు వాషింగ్ మెషీన్ తిరిగినట్లే తిరుగుతుంది. అయితే.. బట్టల్లోని మురికిని ఇందులోని రోబో చేపలు తినేస్తాయి. రోబో చేపల ముందు భాగంలో ఉండే కెమెరా మురికిని గుర్తిస్తుంది. దీంతో రోబో చేప అక్కడికి చేరి.. పనికానిచ్చేస్తుంది. పైగా.. ఇది అక్వేరియం తరహాలో ఉండటంతో హాలులో అలంకరణ సామగ్రిగానూ పనిచేస్తుంది. అంతేకాదు.. సున్నితమైన శరీర స్వభావం ఉన్నవారికి డిటర్జెంట్లు పడకపోవడం వల్ల దద్దుర్లు రావడం వంటివి జరుగుతుంది. ఈ వాషింగ్ మెషీన్‌తో ఆ సమస్య ఉండదు.