
శివమొగ్గ: స్కూటర్, కారు, బూట్లు, బట్టలు ఇలా అన్నింటా పాములు చేరి ప్రజలను హైరానా పెట్టిస్తున్నాయి. తాజాగా వాషింగ్‌మెషిన్‌లో నాగుపాము కనిపించడంతో ఇంట్లోనివారు భయాందోళనకు గురయ్యారు. శివమొగ్గ నగరానికి దగ్గరలోని పురలే గ్రామంలో నంజప్ప అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చిన నాగుపాము వాషింగ్ మెషిన్‌లో మకాం వేసింది. దానిని గమనించిన ఇంట్లోనివారు వెంటనే శివమొగ్గలోని స్నేక్ కిరణ్‌కు ఫోన్ చేశారు. ఆయన వచ్చి వాషింగ్ మెషిన్‌లో ఉన్న నాగుపామును భద్రంగా బయటకు తీసి దూరంగా వదిలిపెట్టాడు.
(చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..)