shivamogga
-
శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృగాళ్లు ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గాజనూరు జలాశయం వద్ద మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులతో కలిసి వచ్చిన యువతిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు.వివరాలు.. ఓ యువకుడు తన ప్రియురాలు, మరో మిత్రునితో కలిసి గాజనూరు జలాశయానికి వచ్చారు. ఈ సమయంలో నలుగురు యువకులు వారిపై దాడి చేసి కొట్టి యువతిని బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న తోటలో ఆమైపె నలుగురూ లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె ప్రియుడు, మరో యువకుడు వెళ్లి స్థానిక తుంగానగర పోలీసులకు తెలియజేయగా గాలింపు చేపట్టారు.ఒకటిన్నర రోజు తరువాత..బుధవారం అంతా గాలించినా యువతి, దుండగుల జాడ దొరకలేదు. చివరకు గురువారం ఉదయం సమీపంలోని తోటలో యువతి అపస్మారక స్థితిలో కనిపించగా ఆమె శివమొగ్గలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వినాయక, అబి, మంజు, కౌశిక్, అనే నలుగురు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. గాజనూరులోని ఒక ఇంటిలో నలుగురు కామాంధులు ఉన్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. అభి, మంజును అరెస్టు చేయగా మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
Lok sabha elections 2024: ‘శక్తి’ అంతమే విపక్షాల లక్ష్యం
శివమొగ్గ/కోయంబత్తూర్: ‘శక్తి’ని అంతంచేయడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘శక్తిని అంతం చేస్తామని ముంబై శివాజీ గ్రౌండ్ సభలో విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది. శక్తిని నాశనం చేయడమే వారి లక్ష్యమైతే శక్తి ఉపాసనే మా సంకల్పం. శివాజీ పార్కులో ప్రతి పిల్లాడూ జై భవానీ, జై శివానీ మంత్రం వింటూ, పఠిస్తూ పెరుగుతాడు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ తుల్జా భవానీ మాత ఆశీస్సులతోనే దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు. శక్తిని ఆరాధించారు. ఆయన పేరిట ఉన్న శివాజీ పార్కులోనే శక్తిని అంతమొందిస్తామని విపక్షాలు ప్రతినబూనాయి. ఈ మాట వింటే శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడు ఉద్ధవ్ అదే సభా వేదికపై ఉన్నారు. ప్రతి భారతీయ మహిళా శక్తికి ప్రతిరూపమే. నారీ శక్తికే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. చంద్రయాన్–3 దిగిన చోటుకు శివశక్తిగా నామకరణం చేశాం’’ అని మోదీ గుర్తుచేశారు. ‘‘నారీ శక్తే నాకు నిశ్శబ్ద ఓటరని కొందరు రాజకీయ విశ్లేషకులంటున్నారు. కానీ నా దృష్టిలో నారీ శక్తి అంటే అమ్మవారి శక్తి స్వరూపం’’ అన్నారు. ‘‘అమ్మవారి శక్తి స్వరూపమంటే భరతమాతకు మరో పేరు. కన్నడ కవి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత కువెంపు సైతం కర్ణాటక మాత అంటే శక్తి స్వరూపిణి అన్నారు. ఇండియా కూటమి నేతలు మాత్రం ఏకంగా శక్తినే నాశనం చేస్తామంటున్నారు. ఇది మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లపై, మహిళా సంక్షేమ పథకాలపై దాడి. ధర్మాగ్రహ శక్తే ఉగ్రవాదాన్ని, అరాచకాలను అంతమొందిస్తుంది. ఆ శక్తినే విపక్షాలు సవాలు చేస్తున్నాయి. శక్తి సత్తా ఏంటో, శక్తికి ఎదురెళ్తే ఏమైతుందో ప్రతి మహిళ, కుమార్తె, సోదరీ కాంగ్రెస్‌కు తెలిసేలా చేయాలి’’ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది సీఎంలున్నారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘‘వెయిటింగ్ సీఎం, కాబోయే సీఎం, సూపర్ సీఎం, షాడో సీఎం. అధిష్టానానికి నిధులు పంపించే కలెక్షన్ మంత్రి విడిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి కూడా పైసల్లేకుండా నిధులన్నీ నొక్కేశారు’’ అంటూ దుయ్యబట్టారు. కోయంబత్తూర్‌లో మోదీ 2.5 కి.మీ. పొడవున రోడ్ షో చేశారు. -
Video: పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన
బెంగళూరు: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందిపోయి పని పిల్లలుగా మార్చుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థులతో టాయిలెట్స్ కడిగించారు.కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్ధులతోటి బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన విద్యార్ధులు బ్రష్‌లు చేతబట్టి బాత్రూమ్లు శుభ్రం చేయడం కనిపిస్తుంది. కాగా శివమొగ్గ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సొంత జిల్లా. మంత్రి బుధశారం రాత్రి చిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన జిల్లాలో జరిగిన ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక అందించారు. ఈ షాకింగ్ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ వివరణ ఇస్తూ.. విద్యార్థులను కేవలం టాయిలెట్లో నీళ్లు సరిగా పోయమని మాత్రమే చెప్పానని, క్లీన్ చేయమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో విద్యార్ధులు బాత్రూమ్లు కడగడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇది మూడోసారి. గత వారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కార్యకర్తలు నగరంలోని ఆండ్రహళ్లి ప్రాంతంలోని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతం విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు టాయిలెట్లు క్లీన్ చేయడంపై సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. చదవండి: ‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్ Shocker from Karnataka | Students found cleaning toilet in a school in Shivamogga pic.twitter.com/iZhe66gNRC — NDTV (@ndtv) December 28, 2023 -
నేను రాహుల్ అభిమానిని..కాంగ్రెస్ ర్యాలీలో కన్నడ సూపర్ స్టార్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజులే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శివమొగ్గలో భారీ ర్యాలీ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఆ బహిరంగ సభలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ సందడి చేశారు. తాను రాహుల్ గాంధీకి పెద్ద అభిమానినని, ఆయనతో పాటు ర్యాలీకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. 'నేను ఇక్కడికి రాహుల్ గాంధీ అభిమానిగా వచ్చా. ఆయన ఇటీవలే భారత్ జోడో యాత్రలో దేశమంతా పాదయాత్ర చేశారు. ఆ యాత్ర నుంచి చాలా స్ఫూర్తి పొందా.' అని శివరాజ్ కుమార్ తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేరింతలు, చప్పట్లతో సభను మారుమోగించాయి. Rahul Gandhi and legendary actor Shiva Rajkumar campaigned for Congress in Karnataka. 🔥 pic.twitter.com/JAfvxj7LxO — Shantanu (@shaandelhite) May 2, 2023 కాగా.. శివరాజ్ కుమార్ సతీమణి గీత శివ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్‌కు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విషయమే అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున కన్నడ సీనియర్ హీరోలు కిచ్చ సుదీప్, దర్శన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం బొమ్మైతో కలిసి వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వీరు కమలం పార్టీలో అధికారికంగా చేరలేదని, వారి వల్ల తమకు ఎలాంటి నష్టం ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి.. -
ప్రసూతి వార్డులోకి ప్రవేశించిన కుక్క.. శిశువును నోటకరుచుకుని..
బెంగళూరు: కొద్ది నెలల క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే, ఇలాంటి దారుణ ఘటనే తాజాగా కర్నాటకలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అనంతరం ఈ ఘటనలో నవజాత శిశువు మృతి చెందింది. వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లాలోలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో శనివారం ఉదయం ఓ మహిళ.. శిశువు జన్మించింది. అయితే, శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ విధి కుక్క.. ప్రసూతి వార్డులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న శిశువును నోటకరుచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. దీన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది.. వెంటనే కుక్కను తరిమికొట్టారు. దీంతో, శిశువును అక్కడే వదిలేసి.. కుక్కు బయటకు పరుగులు పెట్టింది. అనంతరం, సిబ్బంది శిశువును ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శిశువును పరిశీలించిన వైద్యులు.. బిడ్డ చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే, కుక్క కాటుకు ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా అంతకుముందే చనిపోయాడా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, శిశువు మృతిలో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. శివమొగ్గ జిల్లా షికారిపురలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటక ఎస్సీ రిజర్వేషన్లలో మొన్నటివరకు బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై సర్కార్.. కొత్తగా ఎస్సీ రిజర్వేషన్లలో కోటాలు తీసుకొచ్చింది. ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. చదవండి: సావర్కర్ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలుసా!కేంద్రమంత్రి ఫైర్ -
అందరికీ విమానయోగం
శివమొగ్గ/బెల్గావీ: ‘‘హవాయి చెప్పులేసుకునే సామాన్యులు కూడా హవాయీ జహాజ్ (విమాన) ప్రయాణం చేయగలగాలి. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం కర్నాటకలోని శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత వైమానిక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. ‘‘మున్ముందు మనకు వేలాది విమానాలు అవసరమవుతాయి. వాటిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుంటున్నా భారత్‌లోనే తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు మనమంతా దర్జాగా మేడిన్ ఇండియా విమానాల్లోనే ప్రయాణిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోదీ చెప్పారు. 2014 దాకా దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుంటే గత తొమ్మిదేళ్లలోనే తాము మరో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘2014కు ముందు ఎయిరిండియాను నష్టాలు, కుంభకోణాల సంస్థగా చూసే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి సంస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నూతన భారతదేశానికి ప్రతీకగా విజయపుటంచులు చూస్తోంది’’ అన్నారు. రూ.3,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శివమొగ్గ జిల్లాకే చెందిన కర్నాటక మాజీ సీఎం, బీజేపీ అగ్ర నేత బి.ఎస్.యడియూరప్ప సోమవారం 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో సభికులంతా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మోదీ కోరారు. ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారని, రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డబుల్ ఇంజన్ సర్కారుకే మరో అవకాశమివ్వాలని కర్నాటక ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. అనంతరం బెల్గావీలో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు కారులో నుంచుని అభివాదం చేస్తూ సాగారు. అభివృద్ధి చేసిన బెల్గావీ రైల్వేస్టేషన్ భవనాన్ని, రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్ల మంది రైతులకు ప్రధాన్‌మంత్రీ కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకంలో 13వ విడతగా రూ.16 వేల కోట్ల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వాషింగ్మిషన్లో బుస్
శివమొగ్గ: స్కూటర్, కారు, బూట్లు, బట్టలు ఇలా అన్నింటా పాములు చేరి ప్రజలను హైరానా పెట్టిస్తున్నాయి. తాజాగా వాషింగ్‌మెషిన్‌లో నాగుపాము కనిపించడంతో ఇంట్లోనివారు భయాందోళనకు గురయ్యారు. శివమొగ్గ నగరానికి దగ్గరలోని పురలే గ్రామంలో నంజప్ప అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చిన నాగుపాము వాషింగ్ మెషిన్లో మకాం వేసింది. దానిని గమనించిన ఇంట్లోనివారు వెంటనే శివమొగ్గలోని స్నేక్ కిరణ్‌కు ఫోన్ చేశారు. ఆయన వచ్చి వాషింగ్ మెషిన్లో ఉన్న నాగుపామును భద్రంగా బయటకు తీసి దూరంగా వదిలిపెట్టాడు. (చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..) -
Wife Tortured: మతం మారలేదని భార్యకు చిత్రహింసలు!
సాక్షి,బళ్లారి: మతం మారడం లేదని భార్యను హత్య చేసేందుకు యత్నించిన భర్త ఉదంతం చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గకు చెందిన అబ్దుల్ ఖాదర్ శివమొగ్గకు చెందిన ఉమాను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత మతం మారాలని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యంపాలైంది. కాళ్లు రెండు పని చేయకుండా పోయాయి. తోడునీడుగా ఉండాల్సిన భర్త ఆమెను హింసించడమేగాక చివరకు గొంతు నులిమి చంపాలని యత్నించాడు. బాధితురాలు తన బంధువు విశ్వనాథ్‌కు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో చిత్రదుర్గ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పోయిన బంగారం తిరిగివస్తే.. ఉద్యోగి నిజాయితీకి కాళ్లు మొక్కిన దంపతులు
సాక్షి, బెంగళూరు: తనకు దొరికిన నగల బ్యాగ్‌ను సొంతదారుకు అప్పగించి ఓ కోర్టు ఉద్యోగి నిజాయితీ చాటాడు. శివమొగ్గ వినోబా నగరానికి చెందిన అర్పిత చింతామణిలో బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్తూ ఈక్రమంలో శివమొగ్గ రైల్వే స్టేషన్లో బ్యాగ్‌ను పోగొట్టుకుంది. పనిపై శివమొగ్గకు వెళ్లిన తుమకూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ అసిస్టెంట్ గురురాజ్‌కు ఆ బ్యాగ్ దొరికింది. అంతలోనే రైలు రావడంతో బ్యాగ్‌తో తుమకూరు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నగల బ్యాగును అందజేస్తున్న గురురాజ్ అర్పితా కూడా బ్యాగ్ మిస్ అయినట్లు శివమొగ్గ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగ్ దొరికిందని తెలియడంతో అర్పితా కుటుంబం తుమకూరు తాలూకా వక్కోడికి రాగా గురురాజ్ దంపతులు నగల బ్యాగ్ అందజేశారు. అర్పితా కుటుంబ సభ్యులు గురురాజ్ దంపతుల కాళ్లకు నమస్కరించి బ్యాగును స్వీకరించారు. -
వంటగదిలో ఉన్న భార్య గొంతుకోసి హత్యచేసి.. మరో గదిలో..
శివమొగ్గ (బెంగళూరు): భార్యను గొంతు కోసి చంపిన భర్త తాను చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శివమొగ్గ నగరంలోని ప్రియాంక లేఔట్లో జరిగింది. తుంగా నగర పోలీసులు తెలిపిన ప్రకారం. మంజుళ (30), దినేష్ భార్యభర్తలు. మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారు. బుధవారం ఉదయం వంటగదిలోనున్న భార్యను దినేష్ చాకుతో గొంతు కోసి హత్య చేసి, మరో గదిలో తాను చేయి కోసుకున్నాడు. ఇరుగుపొరుగు చూసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?') -
సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు!
బెంగళూరు: వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్ అహ్మెద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్కల్ జంక్షన్‌కు హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరును మారుస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బ్యానర్‌ను తొలగించారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టీ అభ్యర్థనతో సర్కిల్‌కు సావర్కర్ పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది నగర కార్పొరేషన్. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో సూరత్కల్ సర్కిల్ చాలా సున్నితమైన ప్రాంతమని, సావర్కర్ పేరు పెట్టటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్డీపీఐ స్థానిక కార్యకర్త ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: Vinayak Damodar Savarkar: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు -
హృదయ విదారక దృశ్యం: నడుము లోతు నీళ్లలోనే అంతిమ వీడ్కోలు!
బెంగళూరు: కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని కోడ్లు గ్రామం వర్షాం వస్తే చాలు జలమయం అయిపోతుంది. ఐతే ఆ సమయంలో ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఏ వ్యక్తి అయిన చనిపోతే వారిని శ్మశానానికి తీసుకువెళ్లడం గ్రామస్తులకు ఒక సవాలుగా ఉంది. పైగా అక్కడ నివాసితులు వర్షకాలం అంటేనే చాలా భయపడతారు. శ్మశాన వాటిక రహదారులన్ని ఈ వర్షాకాలం ముంపునకు గురై శవాలను తరలించడం అత్యంత కష్టంగా ఉంటుంది ఈ మేరకు ఆ కోడ్లు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే నడుమ లోతు నీళ్లో శవాన్ని తీసుకువెళ్తున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వర్షాకాలం వస్తేనే చాలు ఈ గ్రామంలోని రోడ్డన్నీ నీళ్లతో నిండిపోతాయని, పరిష్కారం కోసం ఎన్నో నెలలుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సహాయం అందించడంలేదని వాపోయారు. పైగా ఇది రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గ్రామం. (చదవండి: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ అందజేసిన ప్రకాశ్ రాజ్) -
ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..
శివమొగ్గ: జోగ్ జలపాతాన్ని చూడాలని వచ్చిన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. భార్య నీటి కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు బెంగళూరు నగరానికి చెందిన నిశా (24). ఆమెకు ఏడాది క్రితం నాగేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరూ కలిసి జోగ్ జలపాతం చూడాలని వచ్చారు. మంగళవారం జలపాతం వెనుకాల ఉన్న జంగిల్ రిసార్టు కాలువలో ఆమె జారి పడింది. వెంటనే అక్కడ ఉన్న వారు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కార్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) -
కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు
శివమొగ్గ: కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్బీఎఫ్) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జూన్ నెలలోనే సుమారు 51 మంది ఈ జ్వరానికి గురయ్యారని చెప్పారు. ఏమిటీ ఎలుక జ్వరం రెండు రకాల బ్యాక్టీరియా వల్ల ఎలుక జ్వరం సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన ఎలుకలు, పందికొక్కులు వంటి జీవులు మనిషిని కరిచినా, లేదా అవి కొరికిన పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తిన్నా ఈ జబ్బు వ్యాపించే ప్రమాదముంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, కొందరిలో కీళ్ల వాపు, దద్దుర్లు ఈ జ్వరం లక్షణాలు. చలి–జ్వరం విడిచి విడిచి వస్తుంటుంది. వైద్యులను కలిసి యాంటి బయాటిక్స్ చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ జ్వర పీడితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. పరిసరాల్లో ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలి. చదవండి: (అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు) -
శివమొగ్గ – చెన్నై మధ్య బైవీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం శివమొగ్గ–చెన్నై సెంట్రల్ మధ్య బై వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ రైలు (నం:06223) శివమొగ్గ నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో బయలుదేరుతుంది. ఈ రైలు ఏప్రిల్ 17 నుంచి జూన్ 28వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో (రైలు నం: 06224) చెన్నై సెంట్రల్ నుంచి సోమ, బుధవారాల్లో బయలుదేరుతుంది. ఈ నెల 18 నుంచి జూన్ 29వ తేదీ వరకు మాత్రమే ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు శివమొగ్గ, భద్రావతి, తరికెరె, బీరూర్, అజాంపురా, హసదుర్గ, చిక్జాజూర్, చిత్రదుర్గ, చెళ్లికెర, మొలకాల్మూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, వైఎస్సార్ కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా అర్కోణం నుంచి చెన్నై సెంట్రల్‌కు చేరుతుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. -
బజరంగ్ దళ్ కార్యకర్త హత్య.. కన్నడనాట కార్చిచ్చు
Shivamogga Tensions: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతం కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని గత రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి, బెంగళూరు: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు నిరసనగా సోమవారం సీగేహట్టిలో వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్ ప్రదర్శించి.. నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండురోజులపాటు విద్యా సంస్థల బంద్ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్ దళ్ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీ తీస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. ‘హిజాబ్’తో సంబంధం లేదు! ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదం వల్లే ఈ హత్య జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుండడం కలకలం రేపింది. దీనిని ఖండిస్తూ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ హత్యకు కారణం వేరే ఉంది. పోలీసులు కేసును చేధించే పనిలో ఉన్నారు. శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం. కాబట్టి, ఇలాంటి పుకార్లను ప్రసారం చేయకండని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ఘటనపై స్పందించారు. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ప్రకటించారు. Koo App Deeply saddened by the murder of a Hindu activist Harsha in Shivamogga. Investigation is on and those responsible for this will be arrested at the earliest. Police officials have been instructed to maintain law and order and I request people to also stay calm. - Basavaraj Bommai (@bsbommai) 21 Feb 2022 ఇక పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోందన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు.. హిజాబ్ వ్యవహారం కారణం కాదని స్పష్టం చేశారు. మరోవైపు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ రఘు మాట్లాడుతూ.. పోలీస్ చర్యలపై తాము సంతృప్తిగా లేవని, హర్ష క్రియాశీలక సభ్యుడని, తమ కార్యాచరణ ఏంటో త్వరలోనే ప్రకటిస్తామన్నాడు. రాజకీయ విమర్శలు కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.. హర్ష హత్యకు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కారణమంటూ ఆరోపించారు. ‘హిజాబ్ నిరసనల ద్వారా రెచ్చగొట్టే వ్యవహారంతో ఈ హత్యకు శివకుమార్ కారణమయ్యారు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు ఈశ్వరప్ప. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేపాడు ఈశ్వరప్ప. ఇక ఈశ్వరప్ప కామెంట్లను శివకుమార్ ఖండించారు. ఈశ్వరప్పను మతిస్థిమితం లేని వ్యక్తిగా పేర్కొంటూ.. ఆయన(ఈశ్వరప్ప) నాలికకు, బుర్రకు సంబంధమే ఉండదని సిద్ధరామయ్య(ప్రతిపక్ష నేత) తరచూ చెప్తుంటారని, ఈశ్వరప్పను తొలగించాల్సిందేన’ని శివకుమార్ బీజేపీను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని, హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. కాంగ్రెస్, బీజేపీలే ఈ ఘటనకు కారణమని, హిజాబ్ వ్యవహారం మొదలైనప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించానని విమర్శలు గుప్పించారు. శివమొగ్గలోని భారతి కాలనీ రవిశర్మ వీధిలో ఆదివారం రాత్రి హర్షను దుండగులు పొడిచి దారుణంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండుగులు హర్షను వెంబడించి పదునైన ఆయుధాలతో పొడిచి పరారయ్యారు. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కమల్ హాసన్ స్పందన ఇదిలా ఉంటే.. శివమొగ్గ బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతంపై నటుడు, మక్కల్ నీది మయ్యయ్ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు. ‘ఈ తరహా రాజకీయాలకు నేను వ్యతిరేకంగా. జనవరి 30, 1948న ఒక్క హత్యతో దీనిని ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది’’ అంటూ కమల్ గాంధీ హత్యను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. -
పసిమనసుల్లో విషబీజం!
బేటీ పఢావో, బేటీ బచావో అని చెబుతున్న దేశంలో ఒక ఆడపిల్ల తను చదువుకుంటున్న చోటుకు స్వేచ్ఛగా వెళ్ళలేకపోవడం ఎంత దురదృష్టం? తోటి విద్యార్థిని ఒంటరిగా కాలేజీలోకి వెళుతుంటే, వెనకాల గుంపుగా వెంటబడి వేధింపుగా నినాదాలు చేయడం ఎంత ఘోరం? విద్యాబుద్ధులు నేర్పా ల్సిన ప్రదేశం విద్వేషానికి ఆలవాలమైతే, ఎంత బాధాకరం? అవును... అదుపు తప్పిన భావోద్వే గాలు, అల్లరి మూకలు రాళ్ళు రువ్వడాలు, తల పగిలి రక్తం ఓడిన టీచర్లు, జాతీయజెండా స్తంభం పైకెక్కి కాషాయ ధ్వజం ఎగరేసే తుంటరితనాలు, శివ మొగ్గలో రాళ్ళదాడులు, లాఠీఛార్జీ, దావణగెరెలో బాష్పవాయు ప్రయోగం... కలత రేపుతున్న కర్ణాటక దృశ్యాలివి. ఉడుపిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆరుగురు ముస్లిమ్ విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని అధికారులు తప్పుబట్టడంతో కోస్తా కర్ణాటకలో మొదలైన వివాదం దేశవ్యాప్తమైంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ గురువారం జరగనున్న వేళ రాజకీయ అంశంగానూ మారింది. పరపురుషుల ముందు తల, ఛాతీని కప్పి ఉంచేలా వస్త్రాన్ని వేసుకొనే ‘హిజాబ్’ ధారణ కొత్తదేమీ కాదు. దానిపై విద్యార్థుల్లో వివాదమే కొత్త. కాలేజీకి హిజాబ్‌తో వస్తామని పట్టుబడుతున్న స్టూడెంట్లను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) వెనక ఉండి నడిపిస్తోందని ఒక ఆరోపణ. వారికి వ్యతిరేకంగా తోటి విద్యార్థులతో కాషాయ తలపాగాలు, శాలువాలు ధరింపజేయడం వెనుక ఏబీవీపీ లాంటి సంఘ్ పరివార్ శక్తులున్నాయని ప్రత్యారోపణ. ఆరోపణల్లో నిజానిజాలెలా ఉన్నా, స్థానికంగా ఆ విద్యాసంస్థ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశం ఇంత పెద్దది కావడంలో కర్ణాటకలోని బీజేపీ సర్కారు తప్పూ కనిపిస్తూనే ఉంది. కర్ణాటక విద్యా చట్టం–1983లోని 133(2)వ సెక్షన్ కింద ఈ నెల మొదట్లో బొమ్మై ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. ‘సమానత్వానికీ, సమగ్రతకూ, పౌర శాంతిభద్రతలకూ భంగం కలిగించే దుస్తులు ధరించరాదు’ అని పేర్కొంది. హిజాబ్ ధారణ అనేది సమానత్వం, శాంతి భద్రతలకు ఏ రకంగా భంగకరం అంటే జవాబివ్వడం కష్టమే. పైపెచ్చు, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, విద్యాహక్కు, మతస్వాతంత్య్ర హక్కులకు ఈ ఆదేశాలు విరుద్ధమనిపిస్తాయి. పిల్లల హిజాబ్ ధారణ చిన్న విషయమనిపించినా అనేక కోణాలున్నాయి. ఈ వస్త్రధారణ ఛాంద సవాదమని నిరసించేవాళ్ళూ, ఇష్టపూర్వకంగా ధరిస్తుంటే అది స్వీయ నిర్ణయ హక్కు అనేవారూ – ఇద్దరూ ఉన్నారు. అలాగే, హిజాబ్ ధారణ రాజ్యాంగపరమైన హక్కు అవునా, కాదా? దాన్ని అడ్డుకోవడం మహిళల స్వీయనిర్ణయ హక్కుకూ, వ్యక్తిగత గోప్యతకూ భంగకరమా? అవతలి వారికి ఇబ్బంది కలగని రీతిలో ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించకూడదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే, ఇది కేవలం రిట్ పిటిషన్ వేసిన ఆరుగురు విద్యార్థినుల అంశంగా కోర్టు చూడట్లేదు. హిజాబ్ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కర్ణాటక హైకోర్ట్ బుధవారం నిర్ణయించింది. అదే సమయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా, కేసు వేసిన విద్యార్థినుల పక్షాన మధ్యంతర ఉపశమన ఉత్తర్వులేమీ ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికే హిజాబ్‌ను సమర్థిస్తూ, 2017 నాటి కేరళ హైకోర్ట్ తీర్పు, 2018 బాంబే హైకోర్ట్ తీర్పు లాంటివి ఉన్నా, తొందరపడకూడదనుకుంది. 65 మెడికల్ కాలేజీలు, 250 ఇంజనీరింగ్ కాలేజీలతో విద్యాకేంద్రంగా, వేలమందిని విదేశాలకు పంపిన సాఫ్ట్వేర్ కూడలిగా వినుతి కెక్కిన కర్ణాటకలో కోస్తాప్రాంతం సున్నితం. అక్కడ ముస్లిమ్, క్రైస్తవ వ్యతిరేక ప్రచారాస్త్రం చేపట్టిన బీజేపీ తనకు అనుకూలంగా మెజారిటీ వర్గాన్ని ఏకం చేయాలని భావిస్తోంది. ఆ అజెండాకు తాజా పరిణామాలు తోడ్పడవచ్చు. కానీ, దాని పర్యవసానాలే దారుణం కావచ్చు. విద్యాపరంగా చూస్తే, ఇప్పటికే దేశంలో 57 శాతం మంది ఆడపిల్లలు మధ్యలో చదువు మానేస్తున్నారు. ముస్లిమ్ యువతులైతే 21.9 శాతం మంది చదువుకే దూరంగా ఉన్నారనీ లెక్క. కరోనాతో 24 కోట్ల మంది పిల్లల చదువుపై ప్రభావం పడిందని పార్లమెంటరీ స్థాయీ సంఘమే తేల్చింది. ఇప్పుడీ అనవసర వివాదాలతో ఒక మతం ఆడపిల్లలు పూర్తిగా చదువుకే దూరమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే ‘బేటీ పఢావో’ ఎవరో అన్నట్టు ‘బేటీ హఠావో’ అయిపోతుంది. ఇప్పటికే రెండేళ్ళుగా కరోనా కాలంతో చదువులు దెబ్బతిన్నాయి. భౌతిక తరగతులకు దూరమై, విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ప్రవర్తన ధోరణులూ మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడీ వివాదం అగ్నికి ఆజ్యం. ఘర్షణలతో ఇచ్చిన 3 రోజుల సెలవుల తర్వాతైనా కాలేజీలు తెరవాల్సి ఉంది. రెండు నెలల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. వివాదం ఇలాగే కొనసాగితే దెబ్బతినేది విద్యార్థులు, వారి చదువులు. సామాజికంగా చూస్తే, సున్నితమైన ఈ వ్యవహారంలోకి రాజకీయ పార్టీలు చొరబడడం, రాజకీయ లబ్ధికి గేలం వేయడం అవాంఛనీయం. హిజాబ్ వేసుకొమ్మని బలవంతం చేయడమే కాదు... వద్దని నిషేధించడమూ కచ్చితంగా అణచివేతే! సామరస్యాన్ని చెడగొట్టి, మత విద్వేషాగ్నిని రగిలించే ఏ చర్యలనూ సమర్థించలేం. విద్వేషం వల్ల జరిగేది నష్టమేనన్నది తరతరాలుగా యుద్ధభూమి నేర్పిన పాఠం. మరి, పాఠాలు చెప్పాల్సిన బడినే వైమనస్యాల యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుంటే ఏమనాలి? పసిమనసుల్లో కులమతాల విద్వేషపు విషబీజం నాటితే, అది మొత్తం జాతికే నష్టం. శతాబ్దాల సామరస్య పునాదిపై నిలిచిన లౌకికవాద ప్రజాస్వామ్య భారతావనిలో ఆ ప్రయత్నం ఎవరు చేసినా... అక్షరాలా వారే అసలు దేశద్రోహులు! -
మాట వినకపోతే ఆ ఫొటోలు బయటపెడతా.. భర్త బెదిరింపు
శివమొగ్గ: మాట వినకపోతే నగ్న ఫొటోలు బయటపెడతా అంటూ సాక్షాత్తూ తాళికట్టిన భర్త బెదిరింపు చేయడంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... స్థానికంగా నివాసం ఉంటున్న భార్యభర్తల మధ్య విభేదాలు పొడసుపాయి. అదే సమయంలో నీచుడు భార్య నగ్న ఫొటోలను రహస్యంగా తీశాడు. నేను చెప్పినట్లు వినకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు మంగళవారం భద్రావతి పేపర్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది. -
మైనర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో..
శివమొగ్గ (కర్ణాటక): మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్టు చేసిన దుండగులను హొసనగర పోలీసులు అరెస్టు చేశారు. వారంబళ్లికి చెందిన సునీల్, ఆయనూరు గ్రామానికి చెందిన సంతోష్‌లు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. సచిన్, సుబ్బ, రఘు అనే వ్యక్తులు వారికి సహకరించారు. ఈ ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సునీల్, సంతోష్‌లు సదరు మైనర్ బాలికకు పరిచయస్తులు. ఇటీవల హొసనగర పట్టణంలోని బస్టాండ్‌లో ఊరికి వెళ్లేందుకు బాలిక వేచిచూస్తోంది. ఈ సమయంలో కారులో వచ్చిన నిందితులు ఇంట్లో దింపుతామని నమ్మించి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి పోస్ట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృగాళ్లను అరెస్టు చేశారు. పసిమొగ్గపై కిరాతకం యశవంతపుర: చిన్నారిపై దారుణం చోటుచేసుకుంది. నందిని లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో బాలిక (8) తల్లి పనికి వెళ్లిన సమయంలో శనివారం రాత్రి 7 గంటలప్పుడు పక్క ఇంటిలో ఉండే యువకుడు అత్యాచారం చేశాడు. తల్లి ఇంటికి వచ్చిన తరువాత బాలిక విషయం చెప్పగా, నందినిలేఔట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) -
బాత్రూమ్లో ప్రత్యక్షమయిన నాగుపాము.. పరుగో పరుగు
కర్ణాటక: ఓ ఇంట్లోని మరుగుదొడ్లో నాగుపాము ప్రత్యక్షమయింది. ఈ ఘటన శివమొగ్గ నగరానికి సమీపంలో ఉన్న శివప్పనాయక లే ఔట్లో చోటుచేసుకుంది. ఇంట్లోని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లగా.. అక్కడ పాము కనిపించడంతో బయటకు పరుగులు పెట్టాడు. అయితే బయట నుంచి మరుగుదొడ్లోకి వచ్చిన నాగుపాముకు అక్కడ నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాలేదు. దాంతో అందులోనే ఉండిపోయింది. అనంతరం ఇంటి సభ్యులు వెంటనే స్నేక్ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతను వెంటనే అక్కడకు చేరుకుని నాగుపామును బంధించి సురక్షితంగా అడవిలో వదిలాడు. చదవండి: (MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్ నడిరోడ్డుపై కారు ఆపి..) -
భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులతో భర్త పార్టీ.. మద్యం మత్తులో
శివమొగ్గ: ముగ్గురు స్నేహితులు ఇంటిలో పార్టీ చేసుకుని మద్యం మత్తులో గొడవపడి ఒకరిని హతమార్చి శవాన్ని చెరువులో పడేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా రిప్పన్‌పేట సమీపంలోని గరతికెరె గ్రామంలో చోటు చేసుకుంది. హతుడిని గ్రామానికి చెందిన సతీశ్ (32)గా గుర్తించారు. భార్య పుట్టింటికి వెళ్లడంతో సతీశ్ బుధవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో గొడవలు జరిగాయి. స్నేహితులు సతీశ్‌ను చాకుతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలోని చెరువులో పడేశారు. గురువారం సాయంత్రం పొద్దుపోయిన తరువాత మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో -
ఇంట్లో పాము పిల్లలు
శివమొగ్గ (బెంగళూరు): నగరంలోని శేషాద్రిపురం లేఔట్ ఐదో క్రాస్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇబ్రహీం ఇంట్లో బుధవారం మూడు పాము పిల్లలు కనిపించాయి. స్నేక్ కిరణ్ వచ్చి పట్టుకున్నాడు. ఆభరణ జాతికి చెందిన పాము పిల్లలని, విషరహితమైనవని చెప్పాడు. అటవీ ప్రాంతంలో వదిలేశారు. చదవండి: (జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం) -
karnataka: ఆకాశంలో వింత.. ఎగబడ్డ జనం
Straight Line Of Stars In The Sky, శివమొగ్గ: ఆకాశంలో దూరదూరంగా దర్శనమిచ్చే నక్షత్రాలు ఒకే వరుసలో రైలులా వెళ్తున్నట్లు కనిపించడంతో శివమొగ్గవాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సోమవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఆకాశ వింత కనువిందు చేసింది. దీంతో తమ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి మురిసిపోయారు. అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తరువాత తెలిసింది ఏమిటంటే అమెరికాకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు ఇలా ఆకాశంలో సంచరిస్తున్నట్లు తెలిసి ఔరా అనుకున్నారు. ప్రపంచంలో ప్రతి మూలకూ ఇంటర్నెట్ వసతిని అందించడానికి ఆ సంస్థ ఇటీవల సుమారు 52 శాటిలైట్లను ఒకే వరుసగా అమర్చి ప్రయోగించింది. ఇవి ప్రపంచంలో అన్ని దేశాల మీదుగా సంచరిస్తూ ఉంటాయి. భూమి మీద నుంచి సుమారు 580 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఏదేమైనా ఈ శాటిలైట్ కొన్ని గంటలపాటు అందరిలో కుతూహలాన్ని నింపింది. చదవండి: (కరుణ ‘నీడ’ ఇక లేరు.. స్టాలిన్ ఘననివాళి) -
వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా..
శివమొగ్గ(కర్ణాటక): అమ్మ కొట్టిందని, పెన్సిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ మధ్యకాలంలో చూశాం. అటువంటిదే ఈ కేసు. నా ఆవులు పాలు ఇవ్వడం లేదు. పాలు ఇచ్చేలా చేయండి, లేదా వాటిపై కేసు నమోదు చేయండి.. అని ఒక రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలోని హళెహోన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చదవండి: అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్! ‘ఆవులకు తగినంత దాణా, గడ్డి పెట్టి పోషిస్తున్నా, 4 రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు, పాలు పితకడానికి వెళ్తే తంతున్నాయి. వాటికి బుద్ధి వచ్చేలా చేయండి’ అని స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నివ్వెరపోయారు. ఇటువంటి కేసులను నమోదు చేయడం కుదరదు. ఆవులను మంచిగా చూసుకో, పాలు ఇస్తాయని నచ్చ చెప్పి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మటన్ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..!