కోలారు / మాలూరు : బక్రీద్‌ను ముస్లింలు సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఈద్గా మైదానంలో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. నగరంలో నిర్వహించిన ఊరేగింపులో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. నగరంలో ప్రముఖ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
మాలూరులో...
పట్టణంలో బక్రీద్ సందర్భంగా ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
శివమొగ్గలో...
శివమొగ్గ జిల్లా వ్యాప్తంగా బక్రీద్‌ను ముస్లింలు వైభవంగా జరుపుకున్నారు. నగరంలోని సవళంగ ఈద్గామైదానంలో సామూహిక ప్రార్థన చేశారు. భద్రావతి, హలేహొన్నూరు, హొసనగర, రిప్పన్‌పేట, సాగర, ఆనందపురం, సొరబ, ఆనవట్టి, తీర్ధహళ్లి, శికారిపుర, శిరాళకొప్న తదితర ప్రాంతాల్లోని ఈద్గామైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లింలకు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, సంఘ సంస్థల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో బక్రీద్
Published Tue, Oct 7 2014 2:22 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement