bakrid
-
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’
వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. -
ముస్లిం సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
-
బక్రీద్ వేడుక: మేకలు, గొర్రెలతో మార్కెట్లలో నెలకొన్న సందడి
-
ముస్లింలకు మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
-
ఒంటెనే చోరీ చేశారు
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్‌కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు. -
బక్రీద్ పొట్టేళ్లకు భలే డిమాండ్
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి. రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళారులకు పండగే.. ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్ ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్‌లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు -
బక్రీద్‌కు ‘తోఫా’!
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు పంపిణీ చేయాల్సిన తోఫాను బక్రీద్ సమయంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఇచ్చే గిఫ్ట్‌ప్యాక్ (వస్త్రాలు)ల కోసం 4.50 లక్షల కిట్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ తోఫా పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల సంఘానికి గత నెలలోనే లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో కూడిన లేఖ గతనెల 23న తెలంగాణ ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతిని నిరాకరిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్ గత నెల 30నే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో రంజాన్ తోఫా పంపిణీతోపాటు జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ పార్టీల నిర్వహణను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ తోఫాను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బక్రీద్ సందర్భంగా ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. -
మద్యం మత్తులో స్నేహితుణ్ని చంపేశారు
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిని చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ దశరథ్ చెప్పిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన మహ్మద్ అకీల్ (25) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బక్రీద్ సందర్భంగా అకీల్ న్యూ హాఫీజ్పేట్ ప్రేమ్‌నగర్‌కు వచ్చి తన పాత స్నేహితులు షేక్ ఆసీఫ్ (22), మహ్మద్ అబ్బాస్ (23), సమీర్‌ఖాన్(22), షేక్ అమీద్ (25), అస్లాంఖాన్ (20), మహ్మద్ ఫరునుద్దీన్ (22)లతో కలిసి శనివారం రాత్రి మద్యం తాగారు. ఈ క్రమంలో గొడవ జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. కోపోద్రిక్తులైన ఆరుగురు స్నేహితులు కలిసి అకీల్ కడుపులో చాకుతో పొడిచి, సుత్తె, బండరాయితో తలపై మోది హత్య చేసి పరారయ్యారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
Bakrid 2023: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు (ఫొటోలు)
-
మనోవాంఛల త్యాగమే బక్రీద్.. ఖుర్బానీ అంటే ఏమిటి?
ఈదుల్ అజ్ హా ఒక మహత్తర పర్వదినం. వ్యావహారికంలో దీన్ని బక్రీద్ పండుగ అంటారు. బక్రీద్ పేరు వినగానే మొదట మనకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాంల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహనీయుల విశ్వాస పటిమ, త్యాగ నిరతి కళ్ళముందు కదలాడతాయి. అలనాటి ఆ మధుర ఘట్టాలు ఒక్కొక్కటిగా మనో యవనిక పై ఆవిష్కృతమవుతాయి. వారి ఒక్కో అడుగు జాడ విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఈ విధంగా ఆ త్యాగ దనుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినమే ఈదుల్ అజ్ హా... అదే బక్రీద్. ఆరోజే అరేబియా దేశంలోని మక్కా నగరంలో ‘హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్ర నగరం కళకళలాడుతూ ఉంటుంది. ‘లబ్బైక్’ నినాదాలు సర్వత్రా మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త వారి ప్రవచనాలను ΄ాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో ‘తవాఫ్ ‘చేసేవారు కొందరైతే, ‘సఫా మర్వా’ కొండల మధ్య ‘సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందర దృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలనూ విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోషకార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్ధిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకాతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన దైవం హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుధ్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. ఒకప్పుడు ఎలాంటి జనసంచారం లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన గొప్పదైవ ప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన ముద్దుల కొడుకు ఇస్మాయీల్ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి దగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న పరీక్షలు, అందులో వారు సఫలమైన తీరు, వారి ఒక్కో ఆచరణ ప్రళయకాలం వరకు సజీవంగా ఉండేలా ఏర్పాటు చేశాడు దైవం. అందుకే విశ్వవ్యాప్త విశ్వాసులు ఆ మహనీయుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ, దేవుని ఘనతను, గొప్పతనాన్ని కీర్తిస్తూ, సముచిత రీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పండుగ రోజు ఈద్గాహ్కు చేరుకుని వేనోళ్ళా దైవాన్ని స్తుతిస్తారు. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మంకోసం, ధర్మసంస్ఢాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈరోజున ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్పూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్ధయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్నకార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొదించాలని ప్రార్ధిద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
గొర్రెల రాజు.. కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయడట!
చాలాకాలం కిందట సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. బహుశా పాకిస్తాన్ నుంచి అనుకుంటా.. తనను దూరం చేయొద్దంటూ ఓ మూగజీవి తన ఓనర్‌ను బతిమాలినట్లు ఉన్న వీడియో నెట్లో ట్రెండ్ అయ్యింది. అయితే.. కుటుంబం గడవడానికి ఆ యజమానిని దానిని అమ్మేయక తప్పలేదు. కానీ, ఇక్కడో గొర్రెల ఓనర్ మాత్రం అలా కాదు. కోటి రూపాయలు ఇచ్చినా కూడా తన మందలోని ఆ గొర్రెను మాత్రం అమ్మేయడంట. రాజస్థాన్ చురూ జిల్లాలో ఏడాది వయసున్న ఓ గొర్రె పిల్ల.. ఏకంగా కోటి రూపాయలకు పైగా రేటు పలుకుతోంది. అలాగని అదేం భారీ సైజులో లేదు. కానీ, దాని ఓనర్ రాజు సింగ్‌కు మాత్రం అది ఎంతో ప్రత్యేకమంట. అందుకే ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు దానిని. కోటి కాదు కదా.. వందల కోట్లు ఇచ్చినా అమ్మేయడంట. అందుకు కారణం ఉంది. రాజు సింగ్‌ను స్థానికంగా గొర్రెల రాజు అని పిలుస్తారు. తన మందలోని గొర్రెలను వారాంతపు సంతలో అమ్మేస్తుంటాడతను. అయితే రాజు ఒకరోజు ఆ ప్రత్యేకమైన గొర్రె పొట్ట భాగంలో ఏదో అక్షరాల మాదిరి ఉండడం గమనించాడట. అది ఉర్దూ భాషగా కొందరు చెప్పడంతో.. తన ఊరిలోని ముస్లిం పెద్దలను సంప్రదించాడతను. అది 786 నెంబర్ అని.. తమ పవిత్రమైన నెంబర్ అని ముస్లిం పెద్దలు చెప్పడంతో రాజు సింగ్ దానిని అమ్మకూడదని నిర్ణయించుకున్నాడట. బక్రీద్ సందర్భంగా ఆ గొర్రెకు లక్షల నుంచి కోటి దాకా డిమాండ్ వెళ్లినా.. రాజు సింగ్ మాత్రం ఆ గొర్రెను అమ్మేయడానికి సిద్ధంగా లేడు. అల్లా ముస్లిం దేవుడు. కానీ, దేవుడి దయ తమ కుటుంబంపై ఉంటుందనే ఉద్దేశంతో ఆ గొర్రెను తన ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు రాజు సింగ్. అంతేకాదు.. దానిని దానిమ్మలు, బొప్పాయిలు, మిల్లెట్లు పెట్టి అపరూపంగా చూసుకుంటున్నాడు. రిస్క్ రేటు ఎక్కువగా ఉండడంతో.. దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అలా.. స్థానికంగా సెలబ్రిటీ గొర్రెగా మారిపోయిందది. ఇదీ చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. అంతలో షాక్ -
అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
బక్రీద్ వేళ మేకలను ఇంటికి తెచ్చాడని.. అపార్ట్‌మెంట్‌వాసుల ఆందోళన..
ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్‌మెంట్‌కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్మెంట్లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు. Uproar over goats in Mumbai Housing Society. (@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz — IndiaToday (@IndiaToday) June 28, 2023 దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్మెంట్లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్మెంట్లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది. ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
బక్రీద్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటో పిల్‌గా కోర్టు స్వీకరించింది. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొనగా.. చర్యలు తీసుకోవాలని బక్రీద్‌కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదన్న ధర్మాసనం.. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది. గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్న ఏజీ ప్రసాద్.. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు.. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని సూచించింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా? -
బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో.. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. బతకడానికి దొంగతనాలకు, దోపిడీలకు సైతం తెగపడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో బక్రీద్ వేళ మేకలు, గొర్రెల దొంగతనాలు పెరిగిపోవడం.. అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తోంది. జూన్ 29న బక్రీద్ కాగా.. పాక్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు అక్కడ ఆకాశాన్నంటుతుండడంతో.. చాలామంది దొంగతనాలకు మొగ్గుచూపుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోనూ ఈ కేసులు అడ్డగోలుగా నమోదు అయ్యాయట. గత ఐదు నెలలుగా అక్కడ మూడు నెల కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధ్ సిటిజన్స్ పోలీస్ కమిటీ ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది కూడా. క్వెట్టాలోనూ ఈ తరహా కేసులు చాలానే నమోదు అయ్యాయి. మేతకు వెళ్లిన మంద నుంచి.. రిస్క్ చేసి వాహనాలపై తీసుకెళ్తున్నవాటిని.. ఆఖరికి దుకాణాలు పగలకొట్టి మరీ మూగజీవాలను ఎత్తుకెళ్తున్నారు. అంతేకాదు మందతో అమ్మడానికి వెళ్తున్న వాళ్లను సైతం బెదిరించి దొపిడీలకు పాల్పడుతున్నారట. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను ఎత్తుకెళ్లారు. అలాగే.. ట్రాలీలోకి ఎక్కేసి మరీ చోరీలకు పాల్పడుతున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. Goat🐐 kidnapp!ng in "film style" in Pakistan😂😂 pic.twitter.com/5ZytmCi9sp — Bharat Ojha🗨 (@Bharatojha03) June 25, 2023 ఇదీ చదవండి: కొత్త చట్టంతో పాక్‌లో అడుగుపెట్టబోతున్నాడు! -
హైదరాబాద్‌లో బక్రీద్ కోలాహలం (ఫొటోలు)
-
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి
మంచిర్యాలక్రైం: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల పండుగలు వరుసగా ఉన్నందున అన్ని మతాల పెద్దలతో స్థానిక ఏసీపీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవధపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించిన చర్యలు ఉంటాయని తెలిపారు. మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే 100డయల్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. బెల్లంపల్లిరూరల్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లిరూరల్ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శంకరయ్య, మతపెద్దలు, తాళ్లగురిజాల, వన్‌టౌన్, టూటౌన్ ఎస్సైలు నరేష్, విక్టర్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పసందైన పొట్టేళ్ల సంత!
బైరెడ్డిపల్లి/పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా జత పొటేళ్లు రూ.40 వేల దాకా ఉంటాయి. కానీ బక్రీద్ పండుగ కోసం ప్రత్యేకంగా సంరక్షించిన కొమ్ములు తిరిగిన పొట్టేళ్ల ధరలు లక్షలు పలుకుతున్నాయి. రాష్ట్రంలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెలకు ప్రాచుర్యం పొందిన వారపు సంతల్లో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ముఖ్యమైంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి కూడా వస్తుంటారు. బక్రీద్‌ను పురస్కరించుకుని బైరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వ చ్చినట్టు తెలిసింది. జత పొట్టేళ్లు రూ.30 వేల నుంచి రూ.2.70 లక్షల దాకా అమ్ముడయ్యాయి. మొత్తంమీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగినట్టు సమాచారం. గత శనివారం సైతం ఇదే స్థాయిలో రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంతకు బడా వ్యాపారులు బయటి రాష్ట్రాల నుంచి రావడంతో ఇక్కడి పొట్టేళ్లుఅత్యధిక ధరలు పలుకుతున్నాయి. అంతేకాదు, ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగ సంత కావడంతో దళారుల హవా కొనసాగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే కీâలకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. మొత్తం మీద బక్రీద్ పండుగకు ముందే దళారులు జేబులు నింపుకొన్నారు. మే నుంచి ఏడాది పాటు పొట్టేళ్ల పెంపకం బక్రీద్ పండుగ కోసం పొట్టేళ్లను పెంచి అమ్ముకోవడం రైతులకు లాభసాటిగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం(అవిభక్త) జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతోంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. ప చ్చిగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాదిపాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ము లు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు విక్రయించా.. బక్రీద్ కోసం పొట్టేళ్లను మేపడమే వృత్తిగా పెట్టుకున్నాం. ఏడాదంతా పొట్టేళ్లను మేపి.. బక్రీద్ పండక్కి ముందు సంతకు తోలుకెళతాం. వ్యాపారులు ఎక్కువగా వస్తారు కాబట్టి బాగా మేపిన పొట్టేళ్ల ధర ఎక్కువ పలుకుతుంది. ఈ దఫా జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు అమ్మడం ఆనందంగా ఉంది. – జగదీష్ , పొట్టేళ్ల పెంపకందారు, తాయిళూరు, కర్ణాటక వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది.. నేను బైరెడ్డిపల్లి సంతలో 23 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. ఎందుకంటే ఈ ప్రాంతంలోని కొండ, గుట్టల్లో మేత మేస్తుంటాయి. దీంతో వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొట్టేళ్లు రుచీపచీ ఉండవు. – అబ్దుల్‌బాషా, గుడియాత్తం, తమిళనాడు -
ఆవులు, దూడలను తరలించొద్దు
అనంతగిరి: బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆవులు, లేగ దూడలను తరలించొద్దన్నారు. ఇతర పశువులను తీసుకెళ్లే వారు ఫిట్ ఫర్ స్లాటర్ పత్రాలు, పశువును తరలిస్తున్న వాహనాల పత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని తెలిపారు. వాహనంలో ఒక్కో పశువు మధ్య రెండు స్క్వేర్ మీటర్ల స్థలం ఉండాలన్నారు. వాహనాల్లో పరిమితికి మించి, ఎక్కువ సంఖ్యలో తరలించకూడదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే అక్రమ రవాణాగా పరిగణించి పశువులను గోశాలలకు తరలిస్తామని తెలిపారు. పది చెక్ పోస్టులు పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పశువులు కలిగిన వాహనాలను అనధికారికంగా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా వెటర్నరీ అధికారి అనిల్ కుమార్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వికారాబాద్, పరిగి, తాండూరు అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. -
త్యాగ నిరతికి చిహ్నం బక్రీద్
ఎన్నో త్యాగాలు.. ఎన్నోబలి దానాలు... ఒక మానవ మాత్రుని సహనానికి పరాకాష్ట అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకొని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వవ్వక్తిత్వం.. ఎన్నో ఉలిదెబ్బల తరువాత శిల శిల్పంగా మారుతుంది. కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవ జీవితానికీ వర్తిస్తుంది. సయ్యిదినా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఆయన ఎన్నోపరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, మిథ్యాదైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్ళముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే మంటల్లో పడవేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కాని, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశంనుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి అణుమాత్రమైనా చోటులేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరక ముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్షకాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. బాబును సంప్రదించారు. ’దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండినాన్నా! దైవచిత్తమైతే నన్నుమీరు సహనవంతునిగా చూస్తారు. ’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ వినడానికి సృష్టిలోని అణువణువూ అవాక్కయి పోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించి పోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దేవుని ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనకు వారు మానసికం గా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారి పట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గ పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. ఇదీ నేటి త్యాగోత్సవానికి(ఈదుల్ అజ్ హా/ బక్రీద్ సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కని ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతోకొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికిస్తున్న సందేశం ఇదే. (నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్’ అని ట్వీట్ చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి: మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్: సీఎం జగన్ త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2022 -
మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఆంక్షలు విధించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని బక్రీద్ సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో 100ను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, మసీదుల్లో పెద్ద సంఖ్యలో గుమికూడటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మసీదుల్లో 50 మందికి మించి ప్రార్థనలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది షేక్ ఆరీఫ్ మాలిక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చేజర్ల సుబోద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల బక్రీద్ ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని, ఈద్గాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రతి మతస్తుడు వారి మతాన్ని ఆచరించుకోవచ్చునని, అయితే ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో ఈ కేసులో చూడాల్సింది ప్రజారోగ్యం, ప్రజా క్షేమం మాత్రమేనని తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం విషయంలో కూడా ఆంక్షలు విధించారని ఆయన గుర్తు చేశారు. మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది టీఎన్ఎం రంగారావు వాదనలు వినిపిస్తూ.. కరోనా కట్టడి నిమిత్తం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. -
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
వారిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల రవాణా లేదా వధ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్ శశికళ దాఖలు చేసిన కేసుపై విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం..రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించకూడదంటూ పేర్కొన్న హైకోర్టు.. జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. జంతు మాంసం ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని.. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారాన్ని గుర్తుచేసింది. మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (బక్రీద్ బిజినెస్ ఎలా?) -
సోదరుడిని కలవనివ్వండి: కశ్మీరీ యువతి ఆవేదన
శ్రీనగర్: గత వారం రోజులుగా బయటి ప్రపంచంతో కశ్మీరీలకు సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. దీంతో కశ్మీరీలకు ఊరనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులపై విధించిన ఆంక్షలను పాక్షికంగా సడలించింది. సోమవారం నాటి ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని.. ఆంక్షల సడలింపు నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 తొలగింపు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్లో కేంద్రం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఫోన్ సర్వీసులు పనిచేస్తున్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ వారంలో బక్రీద్, రాఖీ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూ ని ఎత్తివేసి, ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పునరుద్దరించాలని ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ కశ్మీరీ యువతి అక్కడున్న ఇబ్బందికర పరిస్థితులను గ్రీవెన్స్‌లో వ్యక్తం చేసింది. ‘మా ప్రాంతంలో కనీసం ఇంటర్నెట్, ఫోన్ సర్వీసు కూడా లేదు. మా కుంటుంబ సభ్యులతో మాట్లాడక వారం గడుస్తోంది. ఈనెల 15న రాఖీ సందర్భంగా మా సోదరుడుని కలవాలి. దయచేసి ఆంక్షల నుంచి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పలుప్రాంతాల్లో ముస్లింల ప్రార్థనలపై ఆంక్షలను పాక్షికంగా సడలించిన విషయం తెలిసిందే. బక్రీద్ పర్యదినాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొననున్నారు. నగరంలోని ప్రధానమైన జమా మసీదు తెరవకపోయినప్పటికీ.. చిన్న చిన్న మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిచ్చారు. ప్రార్థనలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్మీ అధికారులు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరసోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని ట్విటర్లో పోస్ట్ చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలంటూ ఆయన పేర్కొన్నారు. -
ఈద్ సందర్భంగా కశ్మీర్లో ఆంక్షల సడలింపు
శ్రీనగర్ : ఈద్ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రార్థనలకు, వ్యాపారానికి కశ్మీర్లో విధించిన ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు రోజులుగా జమ్మూ కశ్మీర్లో కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక ప్రసంగంలో మాట్లాడుతూ ఈద్ జరుపుకునే ప్రజలు ‘ఇబ్బందులు ఎదుర్కోరు’ అని, త్వరలోనే పరిస్థితి సాధారణమవుతుందని కశ్మీరీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి వేగంగా కృషి చేస్తోంది. శ్రీనగర్‌లోని చరిత్రాత్మక జామామసీదులో కూడా ప్రార్థనలకు అనుమతించారు. బ్యాంకు లావాదేవీలు పరిమిత స్థాయిలో జరుగుతున్నాయి. కూరగాయల దుకాణాలు, మెడికల్ షాపులను వ్యాపారులు తెరుస్తున్నారు. కశ్మీర్ లోయలో ఎవరినీ వేధించకుండా చూసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ అధికారులను ఆదేశించిన తరువాత ఈ ప్రాంతంలో ఆంక్షలు సడలింపు మరింత వేగమైంది. పండుగ వస్తువులు కోసం దుకాణాల దగ్గరకి ప్రజలు రావాల్సిన అవసరం లేదని, ఇళ్ల దగ్గరకే వివిద వస్తువులు సరఫరా చేయబడతాయని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే మార్కెట్లు కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కశ్మీర్ అంతటా సెక్షన్ 144 అమలులో ఉన్నా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని పేర్కొన్నారు. -
లక్షలు పలికే పొట్టేళ్లు
సాక్షి బెంగళూరు: ముస్లింల పండుగ అయిన బక్రీద్ సమీపిస్తుండటంతో నగరంలో చామరాజపేటెలోని ఈద్గా మైదానంలో గొర్రెలు, మేకల వ్యాపారం పుంజుకుంది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పొట్టేళ్లు విక్రయానికి వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియా నుంచి రూ.85 వేలు విలువ చేసే టెగరు జాతి పొట్టేలు అబ్బురపరుస్తోంది. సుమారు 17 నెలల వయసు ఉన్న పొట్టేలు 100 కిలోలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కోలార్‌కు చెందిన వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడు. అయితే వారం రోజులుగా అక్కడే ప్రదర్శనకు ఉంచారు. మరో వ్యక్తి రూ.55 వేలు వెచ్చించి నలుపు రంగులో ఉన్న పొట్టేలును కొన్నాడు. దీని బరువు సుమారు 75 కేజీలుగా అంచనా వేశారు. ఇంకొకటి 90 కిలోలు ఉండగా రూ.60 వేలు ధరగా నిర్ణయించారు. కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. లక్ష రకు విలువ చేసే గొర్రెలు, పొట్టేళ్లను విక్రయానికి ఉంచారు. బన్నూరు గొర్రెలకు గిరాకీ బెంగళూరుతో పాటు కోలారు, రామనగర, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపుర తదితర జిల్లాల్లో గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు అక్కడక్కడా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాంసం వ్యాపారులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. బన్నూరు జాతికి చెందిన గొర్రెలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం తక్కువగా ఉన్నట్లు జీవాల వ్యాపారులు తెలిపారు. పండుగకు మరో వారం రోజులు గడువు ఉండటంతో వ్యాపారం పెరగవచ్చని ఆశాభావంతో ఉన్నారు. -
దుస్తులు కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్: జిల్లాలోని ముస్లింలందరూ బుధవారం బక్రీద్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్ కాలనీలోని మహబూబ్‌బాషా ఇంటిలో మాత్రం విషాదం నెలకొంది. బక్రీద్ పండుగకు కొత్త దుస్తులు కొనివ్వలేదని మనస్తాపం చెందిన అతని పెద్ద కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన మహబూబ్‌బాషకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రెడ్డి షమియా (18) నగరంలోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో బీకామ్ చదువుతోంది. బుధవారం బక్రీద్ పండుగ వస్తుందని కొత్త బట్టలు కావాలని తల్లిని అడిగింది. లారీకి వెళ్లిన తండ్రి రాగానే కొనిస్తాడంటూ తల్లి కాస్త గట్టిగా చెప్పింది. దీంతో తల్లిపై అలిగిన రెడ్డి షమియా మంగళవారం రాత్రి ఇంటి పైకప్పుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ఎస్ఐ నరేంద్ర అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫరూఖ్ అబ్దుల్లాకు నిరసన సెగ
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమ యంలో పలువురు నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగస్టు 20న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభ సందర్భంగా ఆయన ‘భారత్ మాతాకీ జై’అని నినా దాలు చేసిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుర్చీలోనే కూర్చుని అబ్దుల్లా ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఘటన జరుగుతున్నా కూడా అబ్దుల్లా స్పందించకుండా అలాగే ప్రార్థనలను కొనసాగించారు. ‘ఫరూఖ్ అబ్దుల్లా తిరిగి వెళ్లిపోండి. మాకు కావాల్సింది స్వాతంత్య్రం’ అంటూ నిరసనకారుల గుంపు నినాదాలు చేసింది. అందులో కొందరు అబ్దుల్లాకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అబ్దుల్లా అనుచరులు, రక్షక సిబ్బంది ఫరూఖ్‌కు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు. ‘కొందరు ఆందోళన చేశారు. ‘నేను ప్రార్థనా స్థలాన్ని విడిచి వెళ్లలేదు. ప్రార్థనలు పూర్తి చేసుకున్నాను. నిరసన వ్యక్తం చేసిన వారంతా నా మనుషులే. ఎవరో వారిని తప్పు దోవ పట్టించారు. వారి నాయకుడి బాధ్యతల నుంచి నేను తప్పించుకోను. ప్రతి ఒక్కరినీ సమైక్యంగా ఉంచే బాధ్యత నాపై ఉంది’ అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్లో ప్రశాంతంగా బక్రీద్ కశ్మీర్ లోయలో ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రశాంతంగా సామూహిక ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల తర్వాత శ్రీనగర్, అనంత్‌నాగ్‌లోని జంగ్లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ ప్రాంతాల్లో ఈద్గాల వద్ద దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా బక్రీద్ పర్వదినాన్ని ప్రజలు జరుపుకొన్నారని పోలీసులు తెలిపారు. -
కుక్కను మేక అని నమ్మించి...
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఓ వ్యక్తి దగ్గర ఉన్న మేకను దొంగిలించాలని భావించిన కొందరు దొంగలు.. అది మేక కాదు కుక్క అని చెప్పి ఆ వ్యక్తిని నమ్మిస్తారు. దొంగల మాటలు నమ్మిన ఆ వ్యక్తి మేకను కుక్కగా భావించి దాన్ని వదిలేసి వెళ్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి మోసపూరిత సంఘటనే ఒకటి కాన్పూర్‌లో జరిగింది. కుక్కను మేక అని నమ్మించి దుండగుడు ఓ అమాయకుడిని బురడీ కొట్టించాడు. పది వేల రూపాయలు విలువ చేసే మేకను ఎత్తుకుపోయాడు. వివరాల ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన అశ్రఫ్ బక్రీద్ పర్వదినం సందర్భంగా తన దగ్గర ఉన్న మూడు నల్ల మేకలను అమ్మడానికి స్థానిక సంతకు తీసుకెళ్లాడు. రెండు మేకలను అమ్మాడు. మూడో మేకను ఒక దగ్గర కట్టేసి.. దాన్ని అమ్మడం కోసం సంతంతా తిరుగుతున్నాడు. అయితే ఇంతలో ఒక వ్యక్తి అశ్రఫ్ దగ్గరకు వచ్చి నీ మేక తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఓ చోట కట్టేశాను, వెళ్లి ఆ మేకను తెచ్చుకోమని చెప్పాడు. ఆ విషయం విన్న అశ్రఫ్, ఆ వ్యక్తి చెప్పిన మాటలను నిర్ధారించుకోకుండా, సరాసరి ఆ వ్యక్తి చెప్పిన చోటకే వెళ్లాడు. అక్కడ మొహం కనపడకుండా పూలతో అలంకరించిన ఒక నల్ల జంతువును చూశాడు. అయితే అశ్రఫ్ ఏ తాడుతో తన మేకను కట్టేసాడో అచ్చం అలాంటి తాడుతోనే ఆ నల్ల జంతువును కూడా కట్టి వేసి ఉంచాడు దుండగుడు. దాంతో అశ్రఫ్ దాన్ని తన మేకగానే భావించి వెళ్లి తాడు విప్పడానికి ప్రయత్నించాడు. అంతే ఆ మేక కాస్తా మొరగడం ప్రారంభించింది. మేక మొరగడమేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే అది మేక కాదు.. కుక్క కాబట్టి మొరిగింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న అశ్రఫ్ ప్రారంభంలో తన మేకను కట్టివేసిన ప్రదేశానికి వెళ్లాడు. కానీ అక్కడ అశ్రఫ్ మేక లేదు. మేక తప్పించుకు పోయిందని చెప్పిన వ్యక్తి తనని బురిడి కొట్టించి మేకను దొంగలించాడని అశ్రఫ్‌కు అర్ధమయ్యింది. దాంతో ఈ విషయం గురించి అక్కడ మార్కెట్ అధికారులకు చెప్పి సాయం చేయమని కోరారు. కానీ వారు అశ్రఫ్ అమాయకత్వానికి నవ్వడంతో అవమానం భరించలేని అశ్రఫ్ అక్కడ నుంచి వెళ్లి పోయాడు. -
5 లక్షలకు అమ్ముడుపోయిన ‘సల్మాన్ ఖాన్’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్, స్టార్డమ్ ఎలాంటిదో అందరికి తెలిసిన సంగతే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు ఆయన ఆరాధిస్తుంటారు. చిన్న యాడ్‌లో నటింపజేయడం కోసం కంపెనీలు ఆయనకు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేస్తాయి. అలాంటిది ఈ స్టార్ హీరో కేవలం 5 లక్షల రూపాయలు పలకడం ఏంటి అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే ఇంత ధర పలికింది బాలీవుడ్ హీరో సల్లు భాయ్ కాదు.. ఆయన పేరు పెట్టిన ఒక మేక. బక్రీద్ సందర్భంగా ముస్లింలు గొర్రె/మేకలను బలి ఇస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న మేకకు ‘సల్మాన్ ఖాన్’ పేరు పెట్టి అమ్మకానికి తీసుకొచ్చాడు. ఇంకేముంది తమ అభిమాన నటుడి పేరుతో ఉన్న ఆ మేకను కొనడానికి జనాలు ఎగబడ్డారు. చివరకు ఓ వీరాభిమాని అక్షరాల ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఆ ‘సల్మాన్ ఖాన్’ను అదే మేకను సొంతం చేసుకున్నాడు. ఇబ్రహీం ప్రవక్త త్యాగానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నేడు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఇదే రోజున ఇబ్రహీం ప్రవక్త దేవుని అనుగ్రహం కోసం తన కుమారున్ని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో దేవుడు ఇబ్రహీం కుమారుని స్థానంలో ఒక గొర్రెను ఉంచుతాడు. ఫలితంగా నాటి నుంచి నేటి వరకూ బక్రీద్ పర్వదినాన ముస్లింలు గొర్రెను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. -
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు ఘనంగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈద్గాల వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో లక్షలాది మంది పాల్గొన్నారు. చిన్నా పెద్దా, పేద ధనిక తారతమ్యం లేకుండా సహపంక్తిలో ప్రార్థనలు జరిగాయి. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బక్రీద్ పండుగను ముస్లింలు పవిత్ర దినంగా భావిస్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా జోరుగా మేకల వ్యాపారం సాగుతోంది. పండుగ సందర్భంగా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జీవాలను తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారు. వర్షాల కారణంగా వ్యాపారం సరిగా నడవడం లేదని, అలాగే పోలీసుల వేధింపులు కూడా ఎక్కువ అయ్యాయని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. మామూలు సమయంలో రూ.5 వేలు పలికే మేకను సందట్లో సడేమియాగా రూ.15 వేల నుంచి 18 వేలకు అమ్ముతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మేకను ఖుర్భానీ చేస్తారు కాబట్టి కొనకతప్పడం లేదంటున్నారు. -
ప్రజాసంకల్ప యాత్రకు నేడు విరామం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు బుధవారం విరామం ప్రకటించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించినట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం ప్రకటించారు. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను నిర్వహించుకునేందుకు వీలుగా పాదయాత్రకు విరామం ప్రకటించినట్టు ఆయన తెలిపారు. పాదయాత్ర గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు పార్టీ తరపున రఘురాం శుభాకాంక్షలు తెలిపారు. -
పండుగ ముందు విషాదం
సాగర్‌నగర్(విశాఖ తూర్పు): పండుగ ముందు రోజు విషాదం నెలకొంది. బక్రీద్ సందర్భంగా ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన వారిలో ఓ యుకుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జోడుగుళ్లపాలెం సీతకొండ దిగువన గల నాచురాళ్లుపై సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి 16 ఏళ్ల యువకుడు జయూద్ గల్లంతయ్యాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదర్శనగర్ పరిధి రవీంద్రనగర్‌కు చెందిన అన్నదమ్ములు జయూద్, జయాన్, వారి స్నేహితుడు మాజీన్ కలసి మంగళవారం సాయంత్రం సముద్ర తీరంలో ఫొటోలు తీసుకోవడానికి వెళ్లారు. సీతకొండ వ్యూ ఫాయింట్ కిందన నాచురాళ్లపై నిల్చొని కొన్ని ఫొటోలు తీసుకున్నారు. వీరిలో జయూద్ కాస్త ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపోయి సముద్రంలో పడిపోయాడు. వెంటనే అలల తాకిడికి లోనికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన జయాన్, మాజీన్ ఆందోళనకు గురై ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు తెలియజేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో ఆరిలోవ సీఐ తిరుపతిరావు, ఎస్ఐ అప్పారావు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి గల్లంతైన జయూద్ కన్పించలేదని పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహ్మద్ జబీర్‌కు జయూద్, జయాన్ కుమారులు. జయూద్ బాసర జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి సంవత్సరంగా చదువుతుండగా జయాన్ శ్రీనిధి మోడల్ స్కూళ్లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. వీళ్ల స్నేహితుడైన మరో విద్యార్థి మాజీన్ శ్రీనిధి స్కూల్లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఇలాంటి విషాదం జరగడంతో జయూద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఇదే స్థలంలో సెల్ఫీలు తీసుకుంటూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఇక్కడ ముగ్గురు యువకులు గల్లంతుయ్యారు. అయినా పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడం విచారకరమని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువతిని కాపాడిన లైఫ్ గార్డ్స్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర అలల తాకిడికి ప్రమాదానికి గురైన యువతిని లైఫ్‌గార్డ్స్ కాపాడారు. మెరైన్ సీఐ వి.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బి.మీనాక్షి తీరంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయింది. వెంటనే గుర్తించిన లైఫ్‌గార్డ్స్ రంగంలోకి దిగి ఆమెను సురక్షితంగా రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం మీనాక్షిని ఆమె తండ్రికి అప్పగించారు. మెరైన్ ఏఎస్ఐ కుమార్, పోలీసులు కనకరాజు, లైఫ్ గార్డ్స్ లక్ష్మణ్ ఆమెను రక్షించారు. -
త్యాగం, సహనమే బక్రీద్ స్ఫూర్తి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈద్–ఉల్–జుహ (బక్రీద్) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దైవ ప్రవక్త బోధనలను అనుసరించాలని ఈ పండుగ గుర్తుచేస్తోందన్నారు. తోటి మనుషుల పట్ల కరుణ, త్యాగం, సహనంతో వ్యవహరించడానికి ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తోందని తెలిపారు. -
పేదల పట్ల కరుణకు బక్రీద్ సూచిక: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఈద్–ఉల్–జుహ (బక్రీద్) పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతంలో గొప్ప ప్రాశస్త్యం కలిగిన బక్రీద్‌ను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. త్యాగానికి ప్రతీక, దేవుడి పట్ల అపార భక్తిభావం, పేదల పట్ల కరుణకు బక్రీద్ సూచిక అన్నారు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న గొప్పదనాన్ని ఈ పండుగ తెలియజేస్తోందన్నా రు. దాతృత్వం, సుహృద్భావ స్ఫూర్తిని పండుగ సందర్భంగా అందరూ స్మరించుకోవాలని గవర్నర్ తన సందేశంలో కోరారు. -
వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరసోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకోవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ లభించాలని వైఎస్ జగన్ ఆకాక్షించారు. -
బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: బక్రీద్ పండగ నేపథ్యంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గాతో పాటు సికింద్రాబాద్‌లోని ఈద్గా వద్ద ఉదయం 8గంటల నుంచి 11:30గంటల వరకు వన్ వే అమలులో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. మీరాలం వద్ద... ♦ ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పురా పోలీసుస్టేషన్ మీదుగా పంపిస్తారు. ఈద్గా వైపు నుంచి బహదూర్‌పురా పోలీసుస్టేషన్ వైపు వాహనాలను అనుమతించరు. ♦ శివరామ్‌పల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ మీదుగా బహుదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ గుడిసెల వద్ద ఉన్న ‘టీ’ జంక్షన్ నుంచి ఇంజిన్‌బౌలి మీదుగా పంపిస్తారు. ♦ ఈద్గా క్రాస్ రోడ్స్ నుంచి సైకిళ్లు, రిక్షాలను ఈద్గా వైపు అనుమతించరు. నిర్దేశించిన ప్రాంతాల్లో వీటిని పార్క్ చేసుకోవాలి. ♦ కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, లారీలు ఇతర వాహనాలను ఈద్గా వద్దకు అనుమతించరు. ఇవి మీరాలం ఫిల్టర్ బెడ్ ‘టీ’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లకుండా కేటాయించిన ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి. ♦ ప్రార్థనల అనంతరం ఈద్గాకు వచ్చిన వారిలో వేగంగా వెళ్లే వాహనాలను తాడ్బన్ రోడ్, బోయిస్ టౌన్ స్కూల్, న్యూ రోడ్ షంషీర్గంజ్, ఆలియాబాద్, చార్మినార్ మీదుగా పంపుతారు. సికింద్రాబాద్ ఈద్గా వద్ద... ♦ బ్రూక్‌బాండ్ సెంటర్, సీటీఓ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ఈద్గా ఎక్స్‌రోడ్ నుంచి తాడ్‌బండ్ వైపు పంపిస్తారు. -
ఈ నెల 22న బక్రీద్
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ పండుగను ఈ నెల 22వ తేదీన జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ తెలిపారు. సోమవారం మోజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులోని మదురైలో నెలవంక కనబడినట్లు సమాచారం కాస్త ఆలస్యంగా అందినట్లు పేర్కొన్నారు. ఇస్లామియా కేలండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజు ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారని అన్నారు. అలాగే ఈ ఏడాదీ నెలవంక దర్శనమిచ్చిన పదవ రోజైన ఆగస్టు 22న పండుగ జరుపుకోవాలని సూచించారు. -
‘బక్రీద్ బలులు’ వద్దంటే ఎలా ?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ముస్లింల బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని జంతు బలికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని సాగించాలని భారతీయ జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్లూబీఐ) నిర్ణయించింది. జంతు బలిని నియత్రించేందుకు జంతువుల క్రూరత్వ నిరోధక చట్టాన్ని అమలు చేయాలని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లాలని నిర్ణయించింది. జంతువులను బలివ్వడం మతపరమైన చర్య కాదని, ఏ మతం పేరిట కూడా జంతువులను బలివ్వడానికి వీల్లేదని బోర్డు చైర్మన్ ఎస్పీ గుప్తా వ్యాఖ్యానించారు. ఆయన్ని చట్టం గురించి తెలియని అజ్ఞాని అనుకోవాలా, ఓ మతాన్ని లక్ష్యం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్న మూర్ఖుడు అనుకోవాలా? అర్థం కావడం లేదు. బక్రీద్ సందర్భంగా ముస్లింలు గొర్రెలను, మేకలను బలిస్తారనే విషయం తెల్సిందే. ఈ ఆచారం ఓ ముస్లింల మతానికే పరిమితం కాలేదు. హిందూ మతం పేరిట కూడా ఈ ఆచారం అమల్లో ఉంది. మైసమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ లాంటి గ్రామ దేవతల పేరుతోనే కాకుండా దేశంలోని పలు హిందూ దేవాలయాల్లో రోజుకు వేలాది జంతువులను బలిస్తుంటారు. అందుకనే జంతువుల క్రూరత్వ నిరోధక బిల్లులోని 28 సెక్షన్ ఇలాంటి జంతు బలులకు మినహాయింపు ఇచ్చింది. ‘ఓ సామాజిక వర్గం వారి మతాచారం ప్రకారం అవసరమైన జంతు బలి ఇవ్వడాన్ని నేరంగా పరిగణించాలని ఈ చట్టంలోని ఏ అంశం కూడా సూచించడం లేదు’ అని చట్టంలోని 28వ సెక్షన్ చెబుతోంది. అంతేకాకుండా ఏ మతానికైనా ఆచారాలు ముఖ్యమని, రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద మత విశ్వాశాలకు స్వేచ్ఛ ఉన్నందున మతాచారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఏ కోర్టుకు లేదంటూ సుప్రీం కోర్టు పలుసార్లు తీర్పు చెప్పింది. ఈ లెక్కన మతాచార జంతు బలులకు సంబంధించి కోర్టులకెళ్లే అధికారం లేదా హక్కు జంతు సంక్షేమం బోర్డుకు లేదు. అయితే జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం కింద దేశంలో జంతు బలులను క్రమబద్ధీకరించవచ్చు. లైసెన్స్‌లున్న కబేళాలలో మాత్రమే జంతువులను వధించాలనడంతోపాటు వధించేటప్పుడు జంతువులకు నొప్పి తెలియకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చట్టాల్లో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో జంతువులను బలివ్వరాదు. దీనర్థం కబేళాల్లోనే జంతువులను బలివ్వాలి. అలాగే దేవాలయాల వద్ద కూడా బలివ్వ వచ్చు. దేశవ్యాప్తంగా 1700 కోట్ల కబేళాలు మాత్రమే ఉన్నాయని గతేడాది ప్రభుత్వమే లోక్‌సభకు తెలియజేసింది. 130 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఇవేమాత్రం సరిపోవు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలిస్తుంటారు. జంతు బలులను క్రమబద్దీకరించాలనుకుంటే జంతు సంక్షేమ బోర్డు ముందుగా కబేళాల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దానికి బదులుగా జంతు బలులను నియంత్రిస్తామంటే ఓ మతాన్ని లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడడమే అవుతోంది. మరో రెండు నెలల్లో అంటే, ఆగస్టు 21న బక్రీద్ వస్తుందనగా నిర్ణయం తీసుకోవడమంటే మరెట్లా అర్థం చేసుకోవాలి! బక్రీద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా, రోడ్లపైన, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు ఇవ్వరాదని ముస్లిం మత పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. -
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
-
వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశం అన్నారు. బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు జరుపుకొనే ఈ పండుగ త్యాగానికి చిహ్నమని జగన్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులు శాంతి, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. -
మత సామరస్యాన్ని చాటుదాం
– 2న గణేష్ నిమజ్జనం, బక్రీదు వేడుకలు – హిందూ–ముస్లింలు శాంతియుతంగా మెలగాలి – ఐక్యతా స్ఫూర్తితో జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి – శాంతి ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెస్టెంబర్ 2న వినాయక నిమజ్జనం, బక్రీదు వేడుకలను శాంతియుతంగా నిర్వహించి మత సామరస్యాన్ని చాటాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి సూచించారు. íహిందూ–ముస్లింలు ఐక్యతా స్ఫూర్తితో కర్నూలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు. బుధవారం జమ్మిచెట్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు హిందూ–ముస్లింలు భాయి భాయి నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ శాంతి హితోపదేశం చేసి శాంతి కపోతాలు, బెలూన్లను ఎగుర వేశారు. అనంతరం ర్యాలీ చిత్తారి వీధి జంక్షన్, కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ మీదుగా పూలబజార్, గడియారం ఆసుపత్రి, పెద్దమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, కొండారెడ్డి బురుజు, తెలుగు తల్లి విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ–ముస్లింలు సోదరులుగా మెలుగుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతి ర్యాలీలో అడిషనల్ ఎస్పీలు షేక్ షాక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీ రమణామూర్తి, సీఐలు ములకన్న, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్, కృష్ణయ్య, బి.శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఆర్ఐలు రంగముని, రామకృష్ణ, ముస్లిం మత పెద్దలు, గణేష్ కేంద్ర మహోత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. నిమజ్జనానికి సుంకేసుల నీరు వస్తుంది సెప్టెంబర్ 2న కర్నూలులో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 2వ తేదీ ఉదయంలోపు కర్నూలుకు చేరే విధంగా సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఎస్ఈని ఆదేశించారు. నీటి కొరత ఉన్నందున కేసీలో నీరు ముందుకు వెళ్లకుండా ఇసుక బస్తాలు, అడ్డుగోడలు ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, లైటింగ్ సదుపాయం, నగరంలో పారిశుద్ధ్య పనులు, తాగు నీరు, వైద్య శిబిరాలు, విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, డీఎస్పీ రమణమూర్తి, ఆర్అండ్బీ ఈఈ జయరామిరెడ్డి, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కిష్టన్న, బాలసుబ్రమణ్యం, సందడి సుధాకర్, కాళంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాలపండుగ బక్రీద్
అల్లాహ్ విశ్వాసులకు రెండు పర్వదినాలు ప్రసాదించాడు. ఒకటి ఈదుల్ ఫిత్ర్, మరొకటి ఈదుల్ అజ్ హా. వీటినే రమజాన్, బక్రీద్ లని వ్యవహరిస్తారు. రమజాన్ తర్వాత వచ్చేదే బక్రీద్. ఇది జిల్ హజ్జ్ మాసంలో వస్తుంది. ఈ నెలలోని మొదటి పదిరోజులు విశ్వవ్యాప్త విశ్వాసులు ఆయన ఘనతను, గొప్పతనాన్ని కీర్తించడానికి, సముచితరీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బక్రీద్ రోజున ఈద్గాహ్కు చేరుకుని వేనోళ్ళా స్తుతిస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుణ్యకార్యాలు ఆచరించి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’(దైవభీతి)ను హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. జీవితం సార్థకం కావాలంటే పరమ ప్రభువు ఆదేశాలను తు.చ. తప్పక పాటించాలి. అందుకే పరమ దయాళువైన అల్లాహ్ మనకోసం కొన్ని వసంత రుతువుల్ని ప్రసాదించాడు.అందులో ఒకటి రమజాన్ కాగా, రెండవది బక్రీద్. బక్రీద్ పండుగ జరుపుకునే నెల పేరు ‘జిల్ హజ్జ్’. ఈ నెలలోని మొదటి పది రోజులకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. ఈ రోజుల్లో చేసే పుణ్య కార్యాలు అల్లాహ్‌కు అన్నిటికన్నా ఎక్కువ ప్రీతికరమైనవి. అందుకని ఈ మొదటి పది రోజులు కరుణామయుని దయను పొందే నిమిత్తం కష్టపడాలి. వీలయినన్ని ఆరాధనలు చేసి, నఫిల్ ఉపవాసాలు పాటించి, దానధర్మాలు చేసి, పవిత్రఖురాన్ పారాయణం చేసి అల్లాహ్ ప్రీతిని, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్, హ.ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. మనందరి ప్రభువు ఒక్కడే, మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే... అనిఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదని. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ. ప్రతి ఒక్కరూ తమస్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ’హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమతలేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. అదికూడా లేనివారు రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తనదాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రంలేదు. కనుక సర్వకాలసర్వావస్థల్లో చిత్తశుద్ధితోకూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవప్రసన్నతకోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛలత్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి సాక్ష్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సెప్టెంబర్ 2న బక్రీద్
సాక్షి, హైదరాబాద్: మంగళవారం నెలవంక దర్శనం కాకపోవడంతో సెప్టెంబర్ 2వ తేదీ (శనివారం)న బక్రీద్‌ను జరుపుకోవాలని రూయత్ –ఎ– హిలాల్ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్ పాషా షుత్తరీ ప్రకటించారు. మంగళవారం మొజంజాహీ మార్కెట్లోని కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కమిటీలతో ఈ విషయమై సంప్రదింపులు జరిపామని పాషా షుత్తరీ తెలిపారు. -
రక్తం.. నిజంగానే ఏరులై పారింది!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో రక్తం ఏరులై పారింది. బక్రీద్ సందర్భంగా వేలాది మేకలు, గొర్రెలు, ఆవులను అక్కడ నరికేశారు. వాటి రక్తానికి వర్షపు నీరు కూడా తోడవడంతో ప్రధానమైన రోడ్లన్నీ ఎర్రగా మారిపోయాయి. అసలే అక్కడి డ్రైనేజి వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండటంతో.. జంతువుల రక్తం వర్షపునీళ్లతో కలిసి రోడ్లమీద పారింది. జంతువుల వ్యర్థాలు కూడా ఆ నీళ్లలో తేలియాడుతూ వచ్చాయి. వీటికి సంబంధించిన పలు ఫొటోలను ఢాకావాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను పోస్టుమార్టం చేసిన ప్రాంతం గుండా వెళ్తున్నట్లు అనిపించిందని ఢాకాకు చెందిన అతిష్ సాహా అనే కళాకారుడు చెప్పారు. తాను నిజంగా చాలా భయపడిపోయానని, ఇది సామూహిక హింసకు ప్రతీకలా కనిపించిందని.. ఇలాంటివి జరగకూడదని అన్నారు. నిజానికి జంతువులను నరకడానికి తాము వందకు పైగా ప్రాంతాలను గుర్తించామని, అక్కడైతే వాటి రక్తంతో పాటు వ్యర్థాలను కూడా సులభంగా శుభ్రం చేయొచ్చని అధికారులు చెప్పారు. అయితే ప్రజలు మాత్రం దాదాపు లక్ష వరకు జంతువులను ఈ ఏడాది బలిచ్చారని బీబీసీ తెలిపింది. అదికూడా చాలావరకు వీధుల్లోను, తమ ఇళ్లలోని అండర్‌గ్రౌండ్ గ్యారేజిలలోను నరికారని అంటున్నారు. బుధవారం నాడు ఢాకాలో ఏ వీధి చూసినా రక్తం పారుతూనే కనిపించింది. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
-
బక్రీద్ నమాజ్
-
భక్తిశ్రద్ధలతో బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లిం సోదరులు బక్రీద్ (ఈదుల్ జుహా) పండగను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, షాద్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్, దేవరకద్ర, కొడంగల్, మక్తల్, ఆత్మకూరు, అయిజ కొత్తకోట తదితర పట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్ సంబరాలను ఇస్లామిక్ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హిందూ, ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వర్షం వచ్చిన లెక్కచేయకుండా తడుస్తూనే ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. జిల్లాకేంద్రంలోని వానగుట్టపై రహెమానియా ఈద్గా మైదానంలో ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామె మసీదు ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 9గంటలకు ప్రత్యేక నమాజ్ చేయించారు. పండగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం పవిత్ర ఖురాన్ గ్రంథంలోని సందేశాలతో పాటు ప్రవక్త మహ్మద్ అలైహివసల్లమ్ ఆచరించిన ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. జిల్లా, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా కటాక్షించాలని అల్లాను వేడుకున్నారు. ప్రముఖుల ఈద్ ముబార క్ ... బక్రీద్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తర ఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్‌తో పాటు ఆయా పార్టీల నేతలు ఎన్పీ వెంకటేశ్, మహ్మద్ వాజిద్, మక్సూద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల భారీ బందోబస్తు... బక్రీద్ సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహారా కాశారు. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
మెదక్: త్యాగనిరతికి విశ్వాసానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లింలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. బక్రీద్‌ను వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మెదక్ పట్టణానికి చెందిన ముస్లింలు స్థానిక జమా మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏటా పట్టణంలోని నవాబుపేటలో గల ఈద్గా వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారు. ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో జమా మజీద్లోనే సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాపన్నపేటలో... పాపన్నపేట: పాపన్నపేట మండలంలో బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఉదయం వేళ ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. పలువురు గొర్రెపొటేళ్లు, మేకలను భగవంతునికి బలి ఇచ్చి ఆ మాంసాన్ని పేదలకు పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హిందూముస్లింలు ఒకరినొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నశంకరంపేటలో... చిన్నశంకరంపేట: పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురువడంతో ఈద్గా వద్ద జరపాల్సిన ప్రార్థనలు మజీద్లోనే నిర్వహించారు. మత గురువు ప్రార్థనల అనంతరం బక్రీద్ ప్రత్యేకతను వివరించారు. ప్రతి ముస్లిం దాన గుణంతో పాటు, త్యాగనిరతిని కలిగి ఉండాలని సూచించారు. ఈ ప్రార్థనలో ముస్లిం మతపెద్దలు గౌస్‌మియా, దస్తగిరి, ఖాజా, రఫీ, ఏదుల్ తదితరులు పాల్గొన్నారు. -
బక్రీద్ ప్రార్థనలు
-
మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రార్థనలు
హైదరాబాద్ : త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన ‘ఈదుల్ అజ్ఉహా’ బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా, మక్కా మసీద్‌లో మంగళవారం ఉదయం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహికంగా నమాజులు పఠించారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ వారు తమ ప్రార్థనలు కొనసాగించారు. అలాగే ఢిల్లీ జామా మసీదు పోటెత్తింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదుకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఇక అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. మరోవైపు బక్రీద్‌ను పురస్కరించుకుని మేకలు, గొర్రెలు, ఒంటెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. -
మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రార్థనలు
-
వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశం అన్నారు. బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు జరుపుకొనే ఈ పండుగ త్యాగానికి చిహ్నమని జగన్ పేర్కొన్నారు. -
జోరుగా పొట్టేళ్ల విక్రయాలు
బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి పోచమ్మమైదాన్ : ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ఈద్ ఉల్ జుహా (బక్రీద్). దీనినే ఖుర్బానీ అనికూడా అంటారు. ఈ పండుగను మంగళవారం నిర్వహించేందుకు ముస్లింలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జంతువును బలి ఇచ్చే పండుగ కనుక ఈద్- ఉల్ -జుహా అంటారు. ఖుర్బానీ అంటే దేవుని పేరుతో పేదవారికి జంతుమాంసం దానం ఇవ్వడం. ఇస్లాం చరిత్రలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. నేడు బక్రీద్ కావడంతో వరంగల్‌లోని మండిబజార్, న్యూ రాయపుర, కాజీపేటలలో పొట్టేళ్లను జోరుగా విక్రయిస్తున్నారు. పండుగ రోజున ఖుర్బాని ఇచ్చేందుకు ముస్లింలు పొట్టేళ్లు కొనుగోలు చేస్తుండడంతో ఇదే అదనుగా అమ్మకందారులు ధరలు పెంచేశారు. దీంతో పేద ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. -
నేడు ఈద్–ఉల్– జుహా
సాక్షి, సిటీబ్యూరో: త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈద్–ఉల్–జుహా (బక్రీద్) ప్రార్థనల కోసం మహా నగరంలో ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. చారితక ఈద్గా మీరాలం, మాదన్నపేట ఈద్గా ఖదీమ్, గోల్కొండ, శేరిలింగంపల్లి, మక్కా మసీదు, నాంపల్లిలోని షాహీ మస్జీద్ బాగేమాలతో పాటు సుమారు 120 మసీదులు ముస్తాబయ్యాయి. ఈద్ ప్రార్థనల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాదన్నపేట ఈద్గాలో 9గంటలకు.. మాదన్నపేటలోని ఈద్గా ఖదీమ్లో ఉదయం 9 గంటలకు ఈద్–ఉల్–జుహా ప్రార్థనలు జరుగనున్నాయి. ఉదయం సదాత్ పీర్ మౌలానా సయ్యద్ మహ్మద్ హుస్సేన్ బగ్దాది ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం మౌలానా ఖరీ సయ్యద్ మొహ్మద్ యూసుఫ్ మదాని ఈద్–ఉల్–జుహాæనమాజ్ చదివిస్తారు. నగరంలోని వివిధ మసీదుల్లో ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. మీరాలంలో ఉదయం 9.30 గంటలకు... నగరంలోని ప్రసిద్ధ మీరాలం ఈద్గాలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఈద్–ఉల్–జుహాæ ప్రార్థనలు జరుగనున్నాయి. ఉదయం జామే నిజామియాకు చెందిన మౌలానా షఫీయుల్లా షేక్ ఉల్ ఆదాబ్, హైదరాబాద్ దారుల్ ఉలూమ్‌కు చెందిన మౌలానా జాఫర్ పాషా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. అనంతరం మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషీ ఈద్ నమాజ్ చదివిస్తారు. బక్రీద్ సందర్భంగా జీçహెచ్ఎంసీ ఏర్పాట్లు బక్రీద్ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మీరాలం ఈద్గా, మక్కా మసీదు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. మసీదుల వద్ద ఖుర్బానీ వ్యర్థాల కోసం కవర్లు పంపిణీ చేయనుంది. వాటిని సేకరించేందుకు వాహనాలను ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
యినాయకుని పెసాదం..బక్రీదు సేమ్యాల పాశం తినాల్సిందే..!
కర్నూలు(కల్చరల్): ఏంవై మోదీనూ!... యియ్యాల శానా లేటుగ వస్తుండవ్. దినాం పొద్దు గాల్గ వస్తుంటివి గద. సూస్తుంటే ఆదాయం బాగా పెరిగినట్టుంది ఈ నడుమ. అందుకే మన్సులతోని మాట్లాడకోకుండ తలకాయ తిప్పుకోని పోతుండవబ్బా! అడిగాడు భద్రయ్య మామ. ఊ! బాగుంది మామా నూ సెప్పేది. దమ్మిడి ఆదాయం లేదు... పైస పురసత్తు లేదు అన్నట్లుంది నాకత. తెల్లారుజామున లేసి పూలబజారుకు పొయ్యి... పూలు కట్టీకట్టీ సేతులు నొస్తే సేతిలోనికి రొండొందలొచ్చేది శానా కటకట అయింది. యిప్పుడు గణేష్ పండుగ వచ్చింది. రోంత మేలు అనిపిస్తుంది. అందుకే వూరికి వచ్చెతలికి మొబ్బైతుంది మామా!... యాదో ఇదింత సీజన్ల నాలుగు రాల్లు మిగిలిచ్చుకోవల్లని ఆశ... చెప్పాడు మోదీన్. ఇంతకీ మీ అబ్బాకొడుకులను మెచ్చుకోవాలవై. మీ నాయన సత్తారు సాబు పూలదండ లేనిది మనూరోల్లు అమ్మవారి కాడికి పోతుండ్లా్య! దసర పండుగ నవరాత్రులు జరిగినన్నాల్లు మీ నాయినే అందరికీ దండలు కుట్టిస్తుండె. ఇప్పుడు ఆ పని నూ నేర్సుకున్నావు... చెప్పాడు భద్రయ్య మామ. అవు మామా!.. మీ తమ్ముడు మా నాయన శానా మంచి న్యాస్తులు గదా. మీ తమ్ముడు ఈరయ్య పీర్ల పండగ జరిగిన పది దినాలు పీర్ల సావిడి కాడే ఉంటుండె. మా నాయిన పీర్లకు పూలు కుట్టియ్యడం, ఈరయ్య మామ పేర్లకు అలంకారాలు సేయడం... బలే ఉండెలే మామ!... చెప్పాడు మోదీన్. అవు మామా!... మన ఊర్ల పీర్ల పండగ, కర్నూల్ల గణేష్ పండగ రొండూ ఒకటే సూడు మామా! సాయిబులు, హిందువులు అందురు కల్సి ఈ రొండు పండుగలు బలే సంబ్రంగ సేస్కుంటరు సూడు. మన ఊర్ల యినాయకునికి పూలదండలు కుట్టి యిచ్చినేది గూడా మోదీనే మామ! చెప్పాడు సిన్నరంగడు. అంత ఎందుకురా! కర్నూల్ల నలభై ఏండ్ల నాడు పీర్ల పండగ బమ్మాండంగ జరుగుతాండె. మేమల్ల కర్నూల్ల పీర్ల సావిళ్ల కాడికి పోయి అల్లాయి గుంతల కాడ సావుశేన్ తొక్కుతాంటిమి. దానిలెక్కనే ఇప్పుడు శానామంది సాయబుల పిల్లగాల్లు మట్టి యినాయకుల్ని సేసి యినాయకసవితి నాటినుండి నిమజ్జనం వరకు శానా సంబరాలు సేస్తున్నారు.. అదేరా మనకు కావాల్సింది. ఎవురి దేవుడైనా సెప్పేది ఒకటే. అందుకే పాతకాలం నాటి నుండి పల్లెల్లో టవున్లో గూడ అన్ని పండగలు అందురు కల్సిమెల్సి సేస్కుంటుండరు... చెప్పాడు భద్రయ్య మామ. మోదీనూ... ఈసారి గూడ నిరుడు లెక్కనే నిమజ్జనం బక్రీదు పండగ కలిసి వచ్చినాయి. ఒకపక్క సేమ్యాల పాశం ఘుమఘుమ, ఇంగోపక్క యినాయకుని పెసాదం ఘుమఘుమ. రొండు కలిపి కొట్రకావేటి రంగ... బలెవుంటదివై ఈసారి.. చెప్పాడు సిన్నరంగడు. వాయబ్బ నువ్వు ఇప్పటినుండే నోరూరిస్తుండవ్ గదరోయ్!... అట్లయితే ఈ పొద్దునుండే కడుపు ఖాలీ పెట్టుకోవల్ల. బలె ఉంటది మామా ఆ పొద్దు. కర్నూల్ల గేరిలో ఇనాయకుడు లేస్తున్నాడని యింటింటికి పెసాదం పంచుతారు. సాయబులు బక్రీదు పండుగకు పక్కింటోల్లకు సేమ్యాల పాశం పంచుతరు. ఈల్లది వాల్లకు, వాల్లది ఈల్లకు దేవుడు ఏం కల్పినడు మామ!... చెప్పాడు మోదీన్. అంతేరా! మన పురాణాల్లో ఏముంటదో ఖురాన్లో అదే... బైబిల్లో అదే ఉంటది. రాముడు రహీము... ఇబ్రహీము అబ్రహాము.. పేర్లుల్లో ఎంత కలివిడితనం ఉందో సూడర్రి... ఇది తెల్సుకోక కొంతమంది నాదే గొప్ప నాదే గొప్ప అంటుంటరు. అందరి దేవుండ్లూ గొప్పనే. ఈడనే సూస్తే తెలుస్తుంది కదరా! మన వూర్లో యాప మానుకు గ్యారమీలు సేసి జెండా లెక్కిస్తరు. అదే యాప మానుకు మనూర్లో దస్ర నాడు, సంకురాత్రి నాడు కుంకుమ పూసి పూజలు సేస్తరు. అందరికీ యాపమాను నీడనే... తల్లిదండ్రి లెక్క ఆదుకుంటది... చెప్పాడు భద్రయ్య మామ! అంతెందుకు మామా! మా పెద్ద నాయనోల్ల యింట్ల పిలగాండ్లు బత్కడం లేదని దర్గకు పోయి దస్తగిరి సామికి మొక్కుకున్నరంట. అప్పుడు నుండి పుట్టిన పిల్లలు బత్కపట్టినరంట. ఇంగ సూస్కో లైనుగ వాల్లింట్లో పుట్టిన పిల్లలకు పెద్ద దరగయ్య, సిన్న దర్గయ్య, పెద్ద దస్తగిరి, సిన్న దస్తగిరి, నడిపి దస్తగిరి... యిట్లా మొదులుపెట్టినారు. అంతే మామ! మనూర్లో అందురు ఇకింటి పిల్లల్లెక్కనే ఉంటరు. ఈ ఓట్లకొచ్చేతోల్లే సూడు వాల్ల నడ్మ ఈల్ల నడ్మ కొండి పెట్టి గెల్కుతరు. అయినా మన వూరోల్లు మాత్తరం ఏకంగానే ఉంటరు మామ!.. సెప్పాడు సిన్నరంగడు. -
నేడు బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు జిల్లావ్యాప్తంగా మంగళవారం బక్రీద్ పండగను ఘనంగా జరుపుకోనున్నారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం చివరి మాసమైన జిల్‌హిజ్జా 10తేదీన జరుపుకునే ఈ పండగను ‘ఈద్–ఉల్–జహా గా’ వ్యవహరిస్తారు. ముస్లింలు సామూహికంగా ఈద్గాకు వెళ్లి ప్రత్యేక నమాజు చేయడం రివాజు. బక్రీద్ పండగను జరుపుకుని, లోక కల్యాణం కోసం నమాజు చేసి ప్రార్థనలు చేస్తారు. పేదలు, ధనికుల తేడా లేకుండా అందరూ ఆనందోత్సహాలతో పండగను జరుపుకుంటారు. స్థానిక జామియ మసీదు నుంచి ఉదయం 8 గంటలకు ముస్లింలు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక రహెమానియ ఈద్గా వద్దకు చేరుకుని 9గంటలకు ప్రత్యేక నమాజ్ చేస్తారని ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ జకీ తెలిపారు. బక్రీద్ ప్రాశస్త్యం.. ఇబ్రహీం ఖలీలుల్లా రజియల్లాహు తాలా అనే పైగంబర్ దంపతులు చేపట్టిన నియమనిష్టల ఫలితంగా వారికి ఇస్మాయిల్ జబీవుల్లా అనే ఏకైక కొడుకు ఉన్నాడు. అయితే వారి భక్తిని, త్యాగాన్ని పరీక్షించడానికి అల్లా తన కొడుకును బలి ఇవ్వాల్సిందిగా ఇబ్రహీం కలలో కనిపించి ఆజ్ఞాపిస్తాడు. దైవ నిర్ణయాన్ని శిరసావహించడమే మార్గదర్శకంగా భావించిన ఆ దంపతులు తమ కుమారుడిని బలి ఇవ్వడానికి నిర్ణయించి, అతడిని సిద్ధం చేస్తారు. దైవాదేశం మేరకు ఆ బాలుడిని సుదూర ప్రాంతమైన అడవుల్లోకి తీసుకెళ్లి బలిపీఠంపై పీక కోయడానికి తండ్రి సిద్ధమవుతుండగా.. ఆ ఖుర్బానీ ప్రక్రియను ఆపి వేయాలని దైవవాణి వినిపిస్తుంది. దైవ వాక్కు వృథాగా పోవద్దని, ఇస్మాయిల్ జబీవుల్లాస్థానంలో అటుగా వచ్చిన ఓ పొట్టెలును బలి ఇవ్వాలని ఆదేశిస్తుంది. లోకకల్యాణం కోసమే ఈ సంఘటన జరిగిందని, తమ సంతానానికి ఎలాంటి కీడు జరగరాదనే భావించి ముస్లింలు ఆ నాటి నుంచి బక్రీద్ నెలలో పొట్టెళ్లతో పాటు పలు రకాల జంతువులను ఖుర్బానీ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకుని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శిబిరం వద్ద ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలపనున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరితోపాటు ఆయా పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొనున్నారు. ఈద్ నమాజ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఊపందుకున్న పొట్టెళ్ల విక్రయాలు స్టేషన్ మహబూబ్‌నగర్: బక్రీద్‌కు ఖుర్బానీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మూడు రోజులపాటు పొట్టెళ్ల మాంసాన్ని పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో వారంరోజుల నుంచే పొట్టెళ్ల విక్రయకేంద్రాలు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్, వన్‌టౌన్, క్లాక్‌టవర్, మార్కెట్, మదీనా మజీద్, షాసాబ్‌గుట్ట, రామచూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో పొటెళ్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి పొటెళ్ల ధర అమాంతం పెరిగింది. పొట్టెళ్ల బరువును బట్టి రూ.7 వేల నుంచి రూ.12వేల వరకు అమ్ముతున్నారు. -
బక్రీద్ వ్యర్థాల కోసం కవర్ల పంపిణీ
బక్రీద్ పండుగ సందర్భంగా తయారయ్యే వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో మాత్రమే పడేయాలని చాంద్రాయణగుట్ట ఎస్సై చంద్రమోహన్ అన్నారు. స్టేషన్ పరిధిలోని అల్ జుబేల్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్లాస్టిక్ కవర్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ నిర్వహించే వ్యర్థాలను రోడ్లపై పడేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము అందజేసే కవర్లలో వ్యర్థాలను పడేసి చెత్త కుండీలలో, లేకుండే జీహెచ్ఎంసీ వాహనాలలో పడేయాలని ఆయన సూచించారు. తమ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
పుకార్లు నమ్మొద్దు: సీపీ మహేందర్ రెడ్డి
- నగరంలో భారీ భద్రత - ప్రశాంతంగా పండుగ జరుపుకోండి - పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు హైదరాబాద్: ఓ వైపు గణేశ్ నిమజ్జనం, బక్రీద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుకార్లు నమ్మకుండా ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. అల్లర్లకు అవకాశం లేకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ముందుజాగ్రత్తగా నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి నగరంలో పర్యటిస్తున్నారు. పోలీసుల బందోబస్తును సీపీ పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో, ఇతర మాధ్యామాల ద్వారా పుకార్లుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పాతబస్తీలో ఫ్లాగ్‌మార్చ్
హైదరాబాద్: బక్రీద్, వినాయక నిమజ్జనం నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. సోమవారం దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పాతబస్తీలోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. మత ఘర్షణలు జరిగే అవకాశాలున్న మొగల్పురా, శాలిబండ, ఫలక్‌నుమా, మీర్‌చౌక్, హుస్సేనీ ఆలం, కామాటిపురా, కాలపత్తర్ ప్రాంతాల్లో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మొత్తం వెయ్యి మంది రెండు గ్రూపులుగా ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. పర్వదినాలను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవచ్చుననే భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. నిమజ్జనం రోజు (15) ఒక్క దక్షిణ మండలం పరిధిలోనే 3,000 మంది భద్రతా బలగాలను రంగంలోకి దించనున్నట్లు డీసీపీ తెలిపారు. -
బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
- మంగళవారం ఉదయం 8 నుంచి 11.30 వరకు అమలు హైదరాబాద్: బక్రీద్ పండుగ నేపథ్యంలో మంగళవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గాతో పాటు సికింద్రాబాద్‌లోని ఈద్గా వద్దా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వన్ వే అమలులో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. మీరాలం - ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పుర పోలీసుస్టేషన్ మీదుగా పంపిస్తారు. ఈద్గా వైపు నుంచి బహదూర్‌పుర పోలీసుస్టేషన్ వైపు వాహనాలను అనుమతించరు. - శివరామ్‌పల్లి, నేషనల్ పోలీసు అకాడెమీ మీదుగా బహుదూర్‌పుర వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ గుడిసెల వద్ద ఉన్న టి జంక్షన్ నుంచి ఇంజన్ బౌలీ మీదుగా పంపిస్తారు. - ఈద్గా క్రాస్ రోడ్స్ నుంచి సైకిళ్లు, రిక్షాలను ఈద్గా వైపు అనుమతించరు. నిర్దేశించిన ప్రాంతాల్లో వీటిని పార్క్ చేసుకోవాలి. - ఈద్గా వద్దకు వస్తున్న వారిని తీసుకువచ్చే కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, లారీలు ఇతర వాహనాలను ఈద్గా వద్దకు అనుమతించరు. వీటిని మీరాలం ఫిల్టర్ బెడ్ టి జంక్షన్ వద్ద కేటాయించిన ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి. - ప్రార్థనల అనంతరం ఈద్గాకు వచ్చిన వారిని తీసుకుని వెళ్లే వాహనాల్లో వేగంగా వెళ్లే వాటిని తాడ్బన్ రోడ్, బోయిస్ టౌన్ స్కూల్, న్యూ రోడ్ షంషీర్గంజ్, ఆలియాబాద్, చార్మినార్ మీదుగా పంపుతారు. సికింద్రాబాద్ - కార్లు, ఆర్టీసీ బస్సులు, మోటారు సైకిళ్లు, లారీలు ఈద్గా చౌరస్తా నుంచి బాలమ్రాయ్ మీదుగా బాలమ్రాయ్ టి జంక్షన్‌కు చేరుకోవాలి. -
13న బక్రీద్ సెలవు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పర్వదినం సందర్భంగా ఈ నెల 13వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సెప్టెంబర్ 12న బక్రీద్ సెలవు ప్రకటించగా... నెలవంక ఆధారంగా 13వ తేదీన పండుగను జరుపుకోనున్నట్లు ప్రభుత్వానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేసింది. -
గ్రూప్-1 మెయిన్స్ 13వ తేదీ పరీక్ష వాయిదా
హైదరాబాద్: 2011 గ్రూప్-1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను ఈనెల 13వ తేదీ నుంచి 24వ తేదీకి మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభమై 23వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే బక్రీద్ పండగను ఈనెల 12వ తేదీకి బదులు 13వ తేదీకి మార్పు చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను 13వ తేదీకి బదులు 24వ తేదీకి మార్పు చేసింది. విద్యార్ధులు ఈ మార్పును గమనించాలని సూచించింది. పరీక్ష కేంద్రాలు దూరాభారం ఇలా ఉండగా హైదరాబాద్ కేంద్రంగా పరీక్షలు రాయాలనుకున్నవారికి కేటాయించిన సెంటర్లు దూరాభారంగా ఉన్నాయని ఆయా అభ్యర్ధులు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షల కోసం తెలంగాణ ప్రాంత జిల్లాలవారే కాకుండా ఏపీలోని పలు జిల్లాల నుంచి అభ్యర్ధులు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో చేరారు. వీరంతా పరీక్షలను హైదరాబాద్ కేంద్రం నుంచి రాయడానికి ఆప్షన్ ఇచ్చారు. అయితే వీరికి కేటాయించిన కేంద్రాలు హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లిరావడానికి దాదాపు 2గంటలకు పైగా సమయం పడుతోందని, ఇలా పరీక్షలన్ని రోజులూ అయిదారు గంటలు ప్రయాణానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్రాలుగా కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కావలసి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. అనుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నందున ప్రైవేటు విద్యాసంస్థలను ఎంచుకుని అభ్యర్ధులకు కేటాయించామని పేర్కొన్నాయి. -
హైకోర్టుకు 13న బక్రీద్ సెలవు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కింది కోర్టులకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది. 12వ తేదీ యథాతథంగా కోర్టు విధులు కొనసాగుతాయని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్లారెడ్డికి హైకోర్టు ఘన నివాళి: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఇ.ఎల్లారెడ్డికి ఉమ్మడి హైకోర్టు గురువారం ఘనంగా నివాళులు అర్పించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు ఎల్లారెడ్డి అందించిన సేవలను ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావులు కొనియాడారు. -
హైకోర్టుకు 13న సెలవు దినం
ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కింది కోర్టులకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది. 12వ తేదీ యథాతథంగా కోర్టు విధులు కొనసాగుతాయని రిజిష్ట్రార్ జనరల్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
5 నుంచి గణేశ్ ఉత్సవాలు
– 13న నిమజ్జనం – బలవంతపు వసూళ్లు వద్దు – వేడుకలు రామానుజచార్యులకు అంకితం – జిల్లా ఆధికార యంత్రాగం సహకరించాలి – గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య కర్నూలు(టౌన్): నగరంలో గణేశ్ ఉత్సవాలు 5 వ తేదీ నుండి ప్రారంభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్రసమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక వినాయక్ ఘాట్ ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ తేదీన గణేశులను ప్రతిష్టించి ఎనిమిది రోజుల పాటు పూజిస్తారన్నారు. తొమ్మిదో రోజు సెప్టెంబర్ 13వ తేదీ నిమజ్జనం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేశుల వద్ద ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆధ్యాత్యిక వాతావరణాన్ని కల్పించాలాన్నరు. మహిళలు పెద్దసంఖ్యలో ఉత్సవాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడ కూడదని స్థానిక కమిటీలకు సూచించారు. రికార్డు డ్యాన్స్‌లు చేయకూడదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను రామానుజాచార్యులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. మతసామరస్యనికి ప్రతీకగా నిలుస్తున్న కర్నూలులో వినాయక నిమజ్జనం ముందు రోజు వచ్చే బక్రీద్ పండుగను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. వేడుకలు విజయవంతం అయ్యేందుకు జిల్లా అధికార యంత్రాగం సహకరించాలన్నారు. నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ అధికారులు కేసీకి నీరు విడుదల చేయాలన్నారు. 10న విద్యార్థులకు పోటీలు గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ , చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు సమితి కార్యాధ్యక్షుడు కష్టన్న వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు రామానుజాచార్యులు జీవిత సందేశం, కళశాల విద్యార్థులకు ‘కల్లోల కశ్మీరం– పరిష్కారాలు,’ స్వచ్ఛభారత్‌పై వక్తత్వపు పోటీలు ఉంటాయన్నారు. చిత్రలేఖనానికి సంబంధించి గణేశ్ చిత్రాలు గీయాల్సి ఉంటుందన్నారు. శనివారం ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు బుధవారపేటలోని కేశవ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం హై స్కూలులో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోపు తమ పేర్లను గణేశ్ మహోత్సవ కేంద్ర సమతికి తెలియ జేయాలన్నారు. సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి రంగస్వామి, ఉపాధ్యక్షుడు నాగరాజు, సంఘటన కార్యదర్శి హారీష్‌బాబు, సాంస్త్రతిక విభాగం కార్యదర్శి హనుమంతరావు పాల్గొన్నారు. -
డీసీపీల ఆధ్వర్యంలో కోఆర్డినేట్ మీటింగ్
హైదరాబాద్: వినాయక చవితి, బక్రీద్ పండుగల సందర్భంగా కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో శంషాబాద్ డీసీపీ, సౌత్ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీల ఆధ్వర్యంలో కోఆర్డినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వినాయక చవితి, బక్రీద్ల దృష్ట్యా జంట కమిషనరేట్ల సరిహద్దుల్లో తీసుకోవాల్సిన బందోబస్తూపై చర్చించనున్నారు. చెక్‌పోస్టుల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో బార్డర్ పోలీస్ స్టేషన్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
వినాయక చవితి, బక్రీద్లకు పటిష్ట భద్రత
ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: వినాయకచవితి, బక్రీద్ వరుస పండుగల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం లో సోమవారం డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు, లౌడ్‌స్పీకర్ల నిర్వహణ, నిమజ్జనం తదితర విషయాలపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, అవసరమైతే మత పెద్దలను సమావేశపరిచి వారి సహకారం తీసుకోవాలన్నారు. ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల భద్రతపై అనురాగ్‌శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులకు ఆటంకాలు కలగకుండా పోలీసులు తీసుకున్న చర్యలు అత్యద్భుతమని కితాబిచ్చారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరీ, ప్రకాశ్‌రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనర్లు మహేశ్ భగవత్, నవీన్‌చంద్, శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, డీఐజీలు అకున్‌సబర్వాల్, కల్పననాయక్ పాల్గొన్నారు. -
ఈసారి కూడా ఒకేసారి జంట పండుగలు
-గతేడాది లాగే ఈసారి కూడా వినాయక ఉత్సవాల్లో బక్రీద్ -ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తమవుతున్న అధికార యంత్రాంగం -9వ వినాయక నిమజ్జనోత్సవాల రోజే బక్రీద్ పండుగ చార్మినార్ వచ్చే నెల ప్రారంభమయ్యే వినాయక ఉత్సవాల కోసం అటు ఉత్సవాల నిర్వాహకులు... ఇటు అధికారులు సిద్ధమవుతున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా వినాయక ఉత్సవాలు కొనసాగుతుండగానే బక్రీద్ పండుగ వస్తుండటంతో సంబంధిత అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే అప్రమత్తమవుతుంది. ఇరువర్గాల ప్రజల పండుగలు ఒకేసారి కలిసి రానుండటంతో ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పుడు తగిన విధంగా స్పందించడానికి జీహెచ్ఎంసీ, పోలీసులు, జలమండలి, విద్యుత్ విభాగాల అధికారులు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 15 అడుగులకు పైగా భారీ విగ్రహాల ప్రతిష్టాపనకు అవకాశాలు లేవనే విషయాలను కూడా దక్షిణ మండలం పోలీసులు సంబంధిత ఉత్సవాల నిర్వాహకులకు స్పష్టం చేస్తున్నారు. గతేడాది లాగే... గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు 27వ తేదీన ముగియగా... మధ్యలో 9వ రోజు నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవం నాడే బక్రీద్ పండుగ వచ్చింది. దీంతో ముందే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, దక్షిణ మండలం పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పండుగలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇరువర్గాల ప్రజలు సంబంధిత ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి కూడా సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు 15వ తేదీన నిమజ్జనోత్సవాలతో ముగియనున్నాయి. కాగా ఉత్సవాల మధ్యలో అంటే సెప్టెంబర్ 13వ తేదీన బక్రీద్ పండుగ ఉండటం... అదే రోజు 9వ రోజు వినాయక నిమజ్జనోత్సవాలుండటంతో ఈసారి కూడా ఇరువర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. వినాయక నిమజ్జనోత్సవ పనులు...: జోనల్ కమిషనర్. వచ్చే నెల 5వ తేదీన ప్రారంభమై 15వ తేదీన ముగిసే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా త్వరలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నామని జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా బాలాపూర్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు ఉన్న ప్రధాన ఊరేగింపుతో పాటు అంతర్గత ఊరేగింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిమజ్జనోత్సవాల్లో ఒక శానిటరీ సూపర్వైజర్, ముగ్గురు శానిటరీ ఫిల్డ్ అసిస్టెంట్లతో పాటు వర్కర్లు ఉంటారన్నారు. ఒక వైపు వినాయక ఉత్సవాలు జరుగుతుండగానే... మరోవైపు బక్రీద్ పండుగ వస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తమ సిబ్బందితో పాటు జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులతో కూడిన కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కమిటీ వచ్చే 5వ తేదీ నుంచి సర్ధార్ మహాల్లో నిర్వహించే కంట్రోల్ రూమ్‌లో అందుబాటులో ఉంటారన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా జంతువు కళేబరాలు (యానిమల్ వెస్టేజ్) పడే అవకాశాలున్నందున.. వాటన్నింటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంట పండుగల సందర్భంగా గట్టి బందోబస్తు...: డీసీపీ. గతేడాది లాగే ఈసారి కూడా వినాయక ఉత్సవాలతో పాటు బక్రీద్ పండుగలు వస్తుండటంతో పాతబస్తీలోని ఇరువర్గాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో కలిసి మెలసి ఉత్సవాలు నిర్వహించుకోవాలని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెల 13వ తేదీన పాతబస్తీలోని చాలా మంది ఉత్సవాల నిర్వాహకులు తమ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారని... అదే రోజు ముస్లింల పండుగైన బక్రీద్ ఉండటంతో ఎవరికి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. మండపాలకు దగ్గరగా యానిమల్ వెస్టేజ్ ఉండకుండా కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకొని చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ తదితర అసిస్టెంట్ పోలీసు కమిషనర్ల పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. ఉత్సవాల నిర్వాహకులకు పలు సూచనలు చేశామన్నారు. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలు, బంధువులకు మాంసంతో చేసిన వంటకాలను అందించారు. అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ ప్రాశస్త్యాన్ని మత పెద్దలు, గురువులు వివరించారు. త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన ‘ఈదుల్ అజ్ఉహా’ బక్రీద్ పర్వదినాన్ని జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇబ్రహీం, ఇస్మాయిల్ త్యాగానికి అల్లాః ప్రసన్నుడైన పవిత్రదినాన పేదలకు, తమ బంధువులకు విందు ఇచ్చారు. ఉదయం నుంచే మసీదులు కిక్కిరిశాయి. కొత్త బట్టలు ధరించి చిన్నాపెద్దా తేడా లేకుండా పవిత్ర హృదయంతో అల్లాఃను ప్రార్థించారు. జిల్లాలోని ముఖ్య నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. -
అమ్మకానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్
లక్నో: పైన శీర్షిక చూసి ఐపీఎల్లో క్రికెటర్ల వేలం మాదిరిగా సినీతారల వేలం కూడా నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారా? నో నో.. అదేం లేదు. సల్మాన్, షారుఖ్ అనేవి మేకల పేర్లు. శుక్రవారం ఈద్‌ను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వ్యాప్తంగా వెలిసిన మేకల మార్కెట్లలో వినిపిస్తున్న పేర్లివి. వినియోగదారులను ఆకర్షించడానికి విక్రయదారులకు మేకలకు బాలీవుడ్ తారల పేర్లు పెడుతున్నారు. ఓల్డ్ సిటీ, ఆలంబాగ్, నిషత్గంజ్, జామా మసీదు రోడు బకర్ మండీలో ఇలాంటి మేకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఖాన్ ల మధ్య శత్రుత్వం ఉండడంతో మేకలకు సల్మాన్, షారుఖ్ పేర్లు పెట్టామని అమ్మకందారులు చెబుతున్నారు. దిట్టంగా బలిసిన మేకలకు సల్మాన్ ఖాన్ పేరు, నల్లగా ఉన్న వాటికి షారుఖ్ ఖాన్ పేరుతో వ్యవహరిస్తూ బోర్డులు కూడా పెట్టారు. ఇలా సినీతారల పేర్లున్న మేకల ధర రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. కొన్ని మేకలకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు పెట్టారు. ఈ సందర్భంగా సాజిద్ అనే మేకల వ్యాపారి మాట్లాడుతూ అత్యంత జాగ్రత్తగా వీటిని పెంచుతామని చెప్పారు. ఏకంగా 125 కేజీల మాంసం ఇవ్వగల బర్ఫీ అనే మేక కూడా తన దగ్గరుందని చెప్పారు. మేకలు అందంగా, బలిష్టంగా కనిపిం చేందుకు బాదాములు, తేనె, తినిపిస్తున్నారు. చంద్రవంక, నక్షత్ర వంటి గుర్తు లున్న మేకలకు కూడా గిరాకీ బాగుందన్నారు. -
సహనం.. త్యాగం... ఈ పండుగ సందేశం!
నేడు బక్రీద్ ఎన్నో త్యాగాలు... మరెన్నో బలిదానాలు... ఒక మానవమాత్రుని సహనానికి పరాకాష్ఠ అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకుని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వ వ్యక్తిత్వం... ఎన్నో ఉలిదెబ్బల తర్వాత శిల శిల్పంగా మారుతుంది. కంసాలి కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుతరూపాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవజీవితానికి కూడా వర్తిస్తుంది. సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఇయన అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికారాన్ని, దైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్లముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే కీలల్లో పడేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కానీ, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశం నుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. ఈసారి మానవుల నుండి కాదు, సాక్షాత్తూ దైవం నుండి. కట్టుకున్న భార్యను, కన్నకొడుకునూ జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేయమని దైవాజ్ఞ. ఎందుకూ? అన్న ప్రశ్న కాదుగదా, కనీసం అలాటి ఊహ కూడా మనసులో లేకుండా ఓ నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేశారు. కనీసం నాలుక తడుపుకోవడానికి సైతం గుక్కెడు మంచినీళ్లు కరువైన ఆ ప్రదేశంలో, చిన్నారి పసికందు ఇస్మాయిల్ దాహంతో గుక్కపట్టి ఏడుస్తూ, కాళ్ల మడిమెలతో రాసిన చోట అల్లాహ్ మహిమతో బ్రహ్మాండమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీబిడ్డలు దాహం తీర్చుకున్నారు. ఆనాడు రెండు ప్రాణాల కోసం వెలసిన ఆ నీరు ఈనాడు లక్షలాదిమంది అవసరాలు తీరుస్తూ, తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం దేవుని ప్రత్యక్ష మహిమకు తిరుగులేని నిదర్శనం. కొన్నాళ్ల తరువాత ఆ మహనీయునికి మరో కఠినపరీక్ష వచ్చి పడింది. మానవేతిహాసంలో కనీవినీ ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యాలకు అణుమాత్రమైనా చోటు లేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యాబిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరకముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్ష కాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. శ్రీమతినీ, పిల్లాడినీ కూడా సంప్రదించారు. లేక లేక అల్లాహ్ మనకు అనుగ్రహించిన వరం ఇస్మాయీల్. తిరిగి ఆ వరాన్ని ఆయనే కోరుకుంటున్నప్పుడు సమర్పించుకోవడమే మన ధర్మం. అంతా దైవలీల’’ అన్నారు శ్రీమతి హాజరా (అ). ‘‘దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండి నాన్నా! దైవచిత్తమైతే నన్ను మీరు సహనవంతునిగా చూస్తారు’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ విన్న సృష్టిలోని అణువణువూ అవాక్కయిపోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించిపోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్రనామాన్ని స్మరిస్తూ, తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం (అ). దీంతో తన ప్రియప్రవక్త ఇబ్రాహీం పట్ల దైవప్రసన్నత పతాకస్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనలో వారు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారిపట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గలోకపు పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. ఇదీ నాటి త్యాగానికి సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కటి ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికి నేర్పిస్తున్న సందేశం ఇదే. యండీ ఉస్మాన్‌ఖాన్ అక్షరసాహితి అధ్యక్షులు -
'సమన్వయంతో పండుగలు చేసుకోండి'
పశువులను తీసుకెళ్లే వాహనాలను ఆపరాదు పోలీసులకు సమాచారమివ్వాలని హిందువులకు సూచన హైదరాబాద్ సిటీబ్యూరో: సెప్టెంబరు నెలలోనే వినాయక చవితి ఉత్సవాలు, బక్రీద్ పండుగ రావడంతో ఇరువర్గాల ప్రజలు సమన్వయంతో వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో హిందువులు, ముస్లిం పెద్దలతో ఆయన గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అన్నిజోన్ల ఏసీపీలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, హిందువులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పెద్దలు లేవదీసిన ప్రశ్నలకు సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు. బందోబస్తుతో పాటు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే బక్రీద్ కూడా ఇదే నెలలో ఉండటంతో ముస్లింలు తీసుకొచ్చే పశువులను నేరుగా ఎవరూ ఆపొద్దని హిందూ పెద్దలకు సూచించారు. ట్రాలీలు, లారీల్లో వచ్చే ఈ లోడ్లను ఆపడంతో గొడవ జరిగే అవకాశముందని సూచించారు. అలాగే ముస్లింలతోనూ జరిగిన ప్రత్యేక సమావేశంలో వారి సమస్యలను సీవీ ఆనంద్ సావధానంగా విన్నారు. నిరంతర నిఘా.. నగరంలోకి అక్రమంగా తరలించే పశువులు, ఆవులు, దూడలపై పోలీసులు నిరంతరం నిఘా ఉండనుంది. ప్రధాన ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల్లో 21 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఐల ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు జరుగుతాయి. అలాగే చట్ట ప్రకారంగానే పశువులను తరలిస్తున్నారా అని సర్టిఫై చేసేందుకు వెటర్నరీ డాక్టర్లు విధులు నిర్వర్తించనున్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు వారు పనిచేయనున్నారు. అలాగే అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన పశువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల షెడ్డులోకి తరలిస్తారు. ఇప్పటికే ఐదు జోన్లో పూర్తయిన షెడ్డుల్లో పశువుల దాణా, గడ్డి, నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. హైవేలతో పాటు ఫ్రధాన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని సీవీ ఆనంద్ హిందూ, ముస్లిం పెద్దలకు వివరించారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
కోలారు / మాలూరు : బక్రీద్‌ను ముస్లింలు సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఈద్గా మైదానంలో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. నగరంలో నిర్వహించిన ఊరేగింపులో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. నగరంలో ప్రముఖ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మాలూరులో... పట్టణంలో బక్రీద్ సందర్భంగా ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. శివమొగ్గలో... శివమొగ్గ జిల్లా వ్యాప్తంగా బక్రీద్‌ను ముస్లింలు వైభవంగా జరుపుకున్నారు. నగరంలోని సవళంగ ఈద్గామైదానంలో సామూహిక ప్రార్థన చేశారు. భద్రావతి, హలేహొన్నూరు, హొసనగర, రిప్పన్‌పేట, సాగర, ఆనందపురం, సొరబ, ఆనవట్టి, తీర్ధహళ్లి, శికారిపుర, శిరాళకొప్న తదితర ప్రాంతాల్లోని ఈద్గామైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లింలకు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, సంఘ సంస్థల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రశాంతంగా ఈద్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. దేశ రాజధానిలోని చారిత్రక జామా మసీద్, ఫతేపూర్ మసీదుల్లో వేల సంఖ్యలో ప్రార్థనలకు హాజరై నమాజ్ అనంతరం ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రార్థనా స్థలాల వద్ద ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లాం ప్రవచించిన ప్రేమ, దయ, కరుణ, సామరస్య గుణాలను అనుసరించాలని మత గురువులు ఉద్బోధించారు. ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్లో ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు. -
బక్రీద్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు!
న్యూఢిల్లీ: ఈద్ ఉల్ జుహా(బక్రీద్) పండగ సందర్భంగా హోల్ సేల్ కమాడిటి మార్కెట్లకు, మెటల్, స్టీల్ సోమవారం సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్, మనీ, కమాడిటి ఫ్యూచర్ (ఎన్ సీడీఎక్స్, ఎంసీఎక్స్) మార్కెట్ల కూడా హాలీడే ప్రకటించారు. అయితే బులియన్ మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్ లో అక్టోబర్ 2, దసరా, వారాంతపు సెలవు దినాల కారణంగా వరుసగా సెలవు దినాల్ని పాటిస్తోంది. మంగళవారం మార్కెట్ సూచీలన్ని తమ వ్యాపారా లావాదేవిలు ప్రారంభమవుతాయి.