
ప్రత్యేక ప్రార్ధనలు చేస్తోన్న ముస్లింలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు ఘనంగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈద్గాల వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో లక్షలాది మంది పాల్గొన్నారు. చిన్నా పెద్దా, పేద ధనిక తారతమ్యం లేకుండా సహపంక్తిలో ప్రార్థనలు జరిగాయి. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బక్రీద్ పండుగను ముస్లింలు పవిత్ర దినంగా భావిస్తారు.
బక్రీద్ పండుగ సందర్భంగా జోరుగా మేకల వ్యాపారం సాగుతోంది. పండుగ సందర్భంగా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జీవాలను తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారు. వర్షాల కారణంగా వ్యాపారం సరిగా నడవడం లేదని, అలాగే పోలీసుల వేధింపులు కూడా ఎక్కువ అయ్యాయని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. మామూలు సమయంలో రూ.5 వేలు పలికే మేకను సందట్లో సడేమియాగా రూ.15 వేల నుంచి 18 వేలకు అమ్ముతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మేకను ఖుర్భానీ చేస్తారు కాబట్టి కొనకతప్పడం లేదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment