
బక్రీద్ రోజున గోవధ నిషేధం
బక్రీద్ సందర్భంగా ఎవరైనా గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ను ఉల్లంఘించరాదని తెలిపారు. ఆవులను, గేదెలను, దూడలను కబేళాలకు అమ్మడాన్ని కూడా నిషేధించినట్లు హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించి కబేళాలకు వీటిని అమ్మినా, గోవధకు పాల్పడినా చట్టపక్రారం శిక్ష తప్పదన్నారు.
బక్రీద్ సమయంలో ఎవరైనా ఆవులను, గేదెలను కబేళాల వద్ద కొనుగోలు చేయరాదని, కేవలం ఆంబోతులు, దున్నపోతులను మాత్రమే కొనాలని కబేళాల యాజమాన్యాలకు కూడా పోలీసులు సూచించారు. గోల్కొండ, లంగర్ హౌస్, నాంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఉన్న కబేళాల యాజమాన్యాలు, నిర్వాహకులతో పోలీసులు ఓ సమావేశం నిర్వహించారు.