cow slaughter
-
సిద్దిపేటలో గోవధ: 8 మంది అరెస్ట్
సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన గోవధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ రామేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆరు గంటల్లోపే 8 మంది నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటనపై సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన జుబేర్, ఖాజా, సద్దాం, అరాఫత్, ఇబ్రహీం, హర్షద్, ఆరాఫ్, జావిద్‌లు సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లోని అంగళ్లలో ఆవులను కొనుగోలు చేసి, పట్టణంలోని పాత కోళ్లఫాంలో వధించి, హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి విక్రయించేవారని తెలిపారు. ఇప్పటికి ఇలా మూడుసార్లు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌లో ట్రయల్ జరిపించి వీరికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ సంఘటనతో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. (చదవండి: సిద్దిపేటలో కలకలం.. 16 గోవులను వధించారు) -
సిద్దిపేటలో కలకలం.. 16 గోవులను వధించారు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో గోవధ ఉదంతం కలకలం రేపింది. బీజేపీ, అనుబంధ సంఘాల నాయకుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం పట్టణ శివారులోని ఓ కోళ్ల ఫాంలో కొందరు 68 గోవులను తీసుకొచ్చి వాటిని చంపి మాంసాన్ని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యా రు. తొలుత 16 గోవులను వధించారు. ఈ విష యం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బీజేపీ, బీజేవైఎం, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు గోవధ తగదని అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారం అందుకున్న సీపీ జోయల్ డేవిస్‌తోపాటు ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను చెద రగొట్టారు. దీంతో వారంతా సిద్దిపేట పాతబస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గోవులను వధిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రామేశం మాట్లాడుతూ విషయం తెలియగానే సంఘటనాస్థలానికి చేరుకున్నామని, అప్పటికే 16 గోవులను వధించారని, మిగిలిన 52 గోవులను గోశాలకు తరలించామని తెలిపారు. కాగా, గోవధకు పాల్పడటం హేయమైన చర్య అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. -
‘గోవధ నిషేధంపై త్వరలోనే బిల్లు’
బెంగళూరు: రాష్ష్ర్టంలో గోవధ నిషేధం త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గోవధను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. ఇక ‘లవ్ జిహాద్’పై చర్చ నేపథ్యంలో పెళ్లి పేరుతో మతం మారేందుకు కుదరదని ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటకలో అమలు చేస్తామని సీటీ రవి తెలిపారు. తమ సోదరీమణులను ‘లవ్ జీహాద్’ పేరుతో మతం మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(చదవండి: లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: యడియూరప్ప) కాగా, తమ మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గత జూలైలో పెళ్లి చేసుకున్న ఓ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అమ్మాయి తన ఇష్టంతోనే మతం మారినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తమ విషయంలో జోక్యం చసుకోవద్దని అమ్మాయి తండ్రితో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆ జంట కోర్టును కోరింది. అయితే వివాహం పేరుతో మతం మారడం కుదరదని పేర్కొంటూ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. Cow Slaughter Ban will be a reality in Karnataka in the near future. In have asked Animal Husbandry Minister Sri @PrabhuChavanBJP to get "The Karnataka Prevention of Slaughter & Preservation of Cattle Bill" passed in the Cabinet and present the same in upcoming Assembly Session. — C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) November 20, 2020 -
బీజేపీని చిక్కుల్లో పడేసిన ఫోటో
లక్నో: బులంద్‌షహర్ బీజేపీ అధ్యక్షుడు, ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటో ఒకటి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. హంతకులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వివరాలు.. బులంద్‌షహర్‌లోని ఓ సంస్థ జూలై 14 న ‘ప్రధాన్ మంత్రి జాన్ కళ్యాంకరి యోగి జాగ్రుక్తా అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు ముఖ్య అతిథిగా బులంద్‌షహర్ బీజేపీ అధ్యక్షుడు అనిల్ సిసోడియాను ఆహ్వానించింది. అనంతరం సంస్థ సభ్యులకు సిసోడియా చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ క్రమంలో శిఖర్ అగర్వాల్ అనే వ్యక్తికి కూడా సిసోడియా సర్టిఫికెట్ అందజేశారు. 2018లో యూపీలో సంచలనం సృష్టించిన పోలీసు అధకారి హత్య కేసులో శిఖర్ అగర్వాల్ నిందితుడిగా ఉన్నాడు. సిసోడియా, అగర్వాల్‌ను సంస్థకు జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సర్టిఫికెట్ అందజేసిన ఫోటో సోషల్ మీడయాలో తెగ వైరలయ్యింది. దాంతో నేరస్తులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూన్నాయి. (పరిమళించిన మానవత్వం) వివాదం కాస్తా పెద్దది కావడంతో సిసోడియా దీనిపై స్పందించారు. ఓ స్థానిక సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని.. ఈ కార్యక్రమానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 2018లో బులంద్‌షహర్‌లో గోహత్య పుకార్ల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. దాంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌పై నిందితులు దాడి చేశారు. ఆయన చేతి వెళ్లను నరికి.. తలపై కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసు వాహనంలో వేసి.. పొలాల్లో వదిలేశారు.. ఈ దారుణానికి పాల్పడిన వారిమీద కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో శిఖర్ అగర్వాల్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అగర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి.. సర్టిఫికెట్ అందుకోవడం వివాదాస్పదంగా మారింది. -
‘జాతీయ జంతువుగా గోవు’
గువహటి : గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆవులపై సరైన వ్యూహం అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. విక్రేతల నుంచి మంచి ధరలకు గోవులను కొనుగోలు చేసి వాటిని షెల్టర్ హోంలలో ఉంచేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వకార్ సూచించారు. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ పదార్ధాలను తింటూ, డ్రైన్ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గో రక్షణ, గోవధ నియంత్రణ కోసం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం గోవథకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ 5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. చదవండి : గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో? -
గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!
లక్నో : ఆవును వధించిన ఆరుగురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురవారం అరెస్టు చేశారు. ఘటనలో ప్రమేయమున్న మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. ఎస్పీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఎస్పీ నాయకురాలు రుచీ వీర డెయిరీ ఫాం సమీపంలో ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. ఎస్పీ లక్ష్మీనివాస్ మిశ్రా వివరాల ప్రకారం.. భగవాలా ఔట్‌పోస్టు సమీపంలోని జఖారి బంగర్ గ్రామంలో బీఎస్పీ నేత రుచీ వీర డెయిరీ ఫాంలో గోవధ జరుగుతోందనే సమాచారం వచ్చింది. దీంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే, అక్కడ ఎవరి జాడా లేదు. పక్కనే ఉన్న చెరుకు తోటలో గాలింపు చేపట్టగా.. ఆవును వధించిన 13 మంది కంటబడ్డారు. దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నాం. మరో ఏడుగురు పరారయ్యారు. త్వరలో వారిని పట్టుకుంటాం.ఘటనాస్థలం నుంచి రెండు క్వింటాళ్ల మాంసం, ఆవు చర్మం, మిగతా అవశేషాలు స్వాధీనం చేసుకున్నాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. నిందితుల్ని స్టేషన్‌కు తరలించాం. 13 మందిపైనా కేసులు నమోదు చేశాం. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే రుచీ వీరకు ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. నిందితులు షకు, జహీద్, ఓసాఫ్, జుబైర్, నానూ, తస్లీం అరెస్టు చేయగా.. గుఫ్రాన్, నయీముద్దీన్, షకీల్, వీల్, రాయీస్, ఫయీం, అబ్రార్‌గా పరారీలో ఉన్నారు. ఫాం మాదే.. గోవధతో సంబంధం లేదు.. రుచీ వీర భర్త ఉదయన్ వీర మాట్లాడుతూ.. మాకు జఖారి బంగర్‌లో డెయిరీ ఫామ్ ఉన్న మాట నిజమే. కానీ, పశువధతో మాకు సంబంధం లేదు. అక్కడొక వాచ్‌మన్‌ను నియమించాం. అక్కడేం జరిగింది అతనికే తెలుస్తుంది. ఈ చర్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలి. కాగా, లోక్‌సభ తాజా ఎన్నికల్లో ఆన్లా నుంచి పోటీచేసి రుచీ ఓడిపోయారు. -
మా వంతు సహాయంగా రూ. 70 లక్షలు!
లక్నో : బులంద్‌షహర్ హింసాకాండలో మృతి చెందిన ఎస్ఐ సుబోధ్ కుమార్ కుటుంబానికి యూపీ పోలీసులు అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా 70 లక్షల రూపాయలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ సుబోధ్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల పరిహారంతో పాటుగా.. మా వంతు సహాయంగా మరో 70 లక్షల రూపాయలు వాళ్లకు అందిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా బులంద్‌షహర్‌లోని మహావ్ గ్రామంలోని ఓ చెరుకు తోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదంమొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్ కుమార్‌తో పాటు సుమిత్ కుమార్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’) ఇక యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్ కుమార్ ఈ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్ దళ్ నాయకులు ఈ కేసులో నిందితులుగా ఉండటం.. బులంద్‌షహర్ ఘటనలో కూడా భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్‌పై ఆరోపణలు రావడంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ రోడ్డుపై సోమవారం జరిగిన హిందూత్వ మూకల విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని ఆరోపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మాట మార్చి అది ఒక ప్రమాదం మాత్రమేనని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన శాంతిభద్రల సమస్య ఎంత మాత్రం కాదని, ఆ నాటి విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ కూడా వ్యాఖ్యానించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘ఎవరో, ఎక్కడి నుంచో పశు కళేబరాలను తీసుకొచ్చి ఇక్కడెందుకు వేశారు? వారి ఉద్దేశం ఏమిటీ? ఎలాంటి పరిస్థితుల్లో వారీ పని చేశారు?’ అంటూ ఆయన వేసిన ప్రశ్నల్లో అనుమానపు ఆనవాళ్లు లేవా? నాటి విధ్వంసకాండలో సుమిత్ కుమార్ అనే 20 ఏళ్ల పౌరుడితోపాటు పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ మరణించడం మామూలు విషయం కాదు. పైగా యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం ఎంత మాత్రం యాధృశ్చికం కాదు. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్ దళ్ నాయకులు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. హింసాకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్ రాజ్ కూడా భజరంగ్ దళ్ నాయకుడు కావడం గమనార్హం. ఆ రోజు తాను తన మిత్రులతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా రోడ్డు పక్క పొలంలో ఏడుగురు వ్యక్తులు పశువును కోస్తుండడం కనిపించిందని తాను అక్కడికి వెళ్లే వరకల్లా వారంతా పారిపోయారని యోగేశ్ రాజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగేష్ రాజ్ సోదరి సుమత్ మహర్ కథనం అందుకు భిన్నంగా ఉంది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడి నుంచో ఫోన్ వస్తే యోగేష్ ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారని ఆమె తెలిపారు. పైగా పొలంలో పడి ఉన్న పశు ఎముకలు తాజావి కావని, రెండు, మూడు రోజుల క్రితం చంపేసిన పశు కళేబరాలని అక్కడికి స్వయంగా వెళ్లి పరిశీలించినన సియాన తహసిల్దార్ రాజ్‌కుమార్ భాస్కర్ చెప్పడం కూడా గమనార్హం. పశు ఎముకలు కనిపించిన మహావ్ గ్రామం పొలం పక్కనే ఉన్న చెరకు తోటలో ఆవు తలకాయ, తోలు ఆరేసి ఉన్నాయని, మాంసం కోసం ఆవును చంపేసే వాళ్లు ఇలా ‘ఎగ్జిబిట్’ చేయరని ఆయన చెప్పారు. తన గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలు ఆవును చంపడం తాను కళ్లారా చూశానంటూ సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సియానా గ్రామంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి నయాబామ్ గ్రామానికి చెందిన యోగేశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఆయన పేర్కొన్న ఏడుగురు ముస్లింలలో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా, వారు ఆవు మాంసం తీస్తు కనిపించారని, దగ్గరికెళ్లే సరికి పారిపోయారని రాజ్ అంతకుముందు వీడియా ముఖంగా కూడా చెప్పారు. అలా పారిపోయిన వారిని ఆయన పేర్లతో సహా ఎలా కనిపెట్టారన్నది మరో ప్రశ్న. ఆ ఎముకలు రెండు, మూడు రోజుల క్రితం చంపిన ఆవు వన్నప్పుడు, ఆ ఏడుగురు అక్కడ ఉండే అవకాశం ఉందా? సియాన పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుభోత్ కుమార్ సింగ్ అప్పటికే ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆ విషయం సియాన పోలీసు స్టేషన్‌కు అందలేదా? అందలేదనుకుంటే అదనపు బలగాలను అక్కడి నుంచి ఎలా పంపించారు? ఛింగ్రావత పోలీసు అవుట్ పోస్ట్ వద్ద పోలీసు ఇన్స్పెక్టర్ సుభోద్ కుమార్ సింగ్‌తో భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ వాగ్వాదానికి దిగడం పలు సెల్‌ఫోన్ వీడియోల్లో కూడా రికార్డయింది. ఆ తర్వాత సుభోద్ తలలో బుల్లెట్ గాయంతో మరణించాడు? ఎలా జరిగింది ? ఎముకలను తీసుకొచ్చిన ట్రాక్టర్ ఏమయింది? ఫోరెన్సిక్‌లాబ్‌కు పంపించాల్సిన ట్రాక్టర్‌లోని ఎముకలు ఎందుకు అదృశ్యమయ్యాయి? పొలంలో కూడా ఎముకల ఆనవాళ్లు లేకుండా ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? యోగేశ్ రాజ్ ఫిర్యాదు మేరకు ఏడుగురు ముస్లింలను అరెస్ట్ చేసిన పోలీసులు విధ్వంసకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. పారిపోయే అవకాశం ఆయనకు ఎందుకు ఇచ్చారు? ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్ వద్ద విధ్వంసకాండ జరిగితే చుట్టుపక్కలున్న ఏడు గ్రామాల ప్రజలు, అంతా యువకులే వాహనాల్లో ఎలా వచ్చారు? వారి వద్ద తుపాకులు ఎందుకు ఉన్నాయి? ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన పిల్లలకు ఐదేసి లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి నిరాకరించిన యోగి ఆదిత్యనాథ్ సంఘటన జరిగిన రోజే సుబోధ్ కుమార్ కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్ట పరిహారం, భార్యకు లేదా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ అంత ఉదాహరంగా ఎలా ప్రకటించారు? ఇద్దరు మరణానికి కారణమైన విధ్వంసకాండ కేంద్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసులు ఆవును చంపడం తీవ్రమైన నేరం అంటూ ఆ దిశగానే దర్యాప్తు జరపడం కుట్రలో భాగం కాదా? -
‘చివరిసారిగా నాతో బాగా చదువుకో అని చెప్పారు’
లక్నో : మా నాన్న మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారు.. మతం పేరుతో ప్రజలు హింసకు పాల్పడటాన్ని ఆయన ఏ మాత్రం సహించే వారు కారు అంటున్నారు అభిషేక్. నిన్న యూపీలోని బులందషహర్‌లో గోరక్షకులకు, పోలీసులకు నడుమ జరిగిన దాడుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించిన సంగతి తెలిసింది. మరణించిన సుబోధ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు అభిషేక్.. ఇంటర్ పూర్తి చేశాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న అభిషేక్ ప్రపంచం.. తండ్రి మరణవార్తతో ఒక్కసారిగా మూగ బోయింది. ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు నేను మా నాన్నతో మాట్లాడాను. అప్పుడు ఆయన వీక్‌గా ఉన్న సబెక్ట్‌ల మీద దృష్టి సారించాల్సిందిగా నాకు సూచించారు . గత పరీక్షల్లో ఏ సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయో వాటి మీద బాగా ఫోకస్ చేయమని చెప్పారు అంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాక నాన్న మాతో ఎప్పుడు మీ ఆహారాన్ని మీరు సంపాదించుకున్న రోజున నేను మరణించినా పర్వాలేదు అని చెప్పేవారు. కొన్ని సార్లు కొన్ని కేసులను విచారించకూడదంటూ ఆయన మీద ఒత్తిడి వచ్చేది. కానీ ఆయన అలాంటి వాటికి ఎప్పుడు భయపడలేదు అని తెలిపారు. సుబోధ్ సింగ్ పెద్ద కొడుకు అతని అంత్యక్రియలను నిర్వహించాడు. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కబేళాల్లో గోవధ జరుగుతుందంటూ స్ధానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్-సైనా రహదారిపై ఆందోళనకు దిగిన పలు హిందూ సంస్థల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. హిందూ యువవాహని, బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాలను దగ్ధం చేసి, పోలీస్ అధికారులపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. ఈ హింసాకాండలో సైనా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించగా, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. -
అక్రమ కబేళాలపై ఆందోళన హింసాత్మకం
లక్నో : యూపీలోని బులంద్‌షహర్‌లో అక్రమ కబేళాలు నడుస్తున్నాయనే వదంతులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోరక్షకుల పేరుతో గుమికూడిన ఆందోళనకారులు, పోలీసుల నడుమ జరిగిన ఘర్షణలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మరణించారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కబేళాల్లో గోవధ జరుగుతుందంటూ స్ధానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్-సైనా రహదారిపై ఆందోళనకు దిగిన పలు హిందూ సంస్థల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. హిందూ యువవాహని, బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాలను దగ్ధం చేసి, పోలీస్ అధికారులపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. హింసాకాండలో సైనా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించగా, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బులంద్‌షహర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు రప్పించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీనియర్ పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై మరణించాడని వార్తలు రాగా, ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించలేదు. -
భయపడి గోవును వెనక్కి ఇచ్చేశారు!
రామ్‌పూర్ : రోజురోజుకు మూకదాడులు.. హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లిం నేతలు ఆవులను పెంచుకునేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ భార్య, రాజ్యసభ సభ్యురాలు తంజీమ్ ఫాతిమా తన ఇంట్లో ఆవుపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనకు ఓ సాధువు నుంచి కానుకగా వచ్చిన ఆవును తిరిగిచ్చేశారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో ముస్లిం యువకుడు రగ్బర్ ఖాన్‌ను కొట్టి చంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘గోవధ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయి. మాకు చాలా బాధగా ఉంది. అందుకే ఇటీవల ఓ సాధువు ఎంతో ప్రేమతో మాకు కానుకగా ఇచ్చిన గోవును గోశాలకే తిరిగి ఇచ్చేస్తున్నాం. మేం ముస్లింలం అయిన కారణంగా ఎవరైనా ఆ గోవును చంపేసి మా కుటుంబంపై నింద మోపుతారన్న భయంతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని’ తంజీమ్ ఫాతిమా వివరించారు. గోశాలలకు రూ.25లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ హాయాంలోనే మైనార్టీలపై దారుణాలు జరుగుతున్నాయని, ముస్లింలకు రక్షణ కరువైందని విమర్శించారు. గోశాలలకు ముస్లింలు దూరంగా ఉండాలని, ముస్లింలు ఆవులను పెంచుకోవద్దని, పాల వ్యాపారం లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని అజాంఖాన్ పిలుపునిచ్చారు. మనం ఆవులను తాకితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. -
‘ఆ వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిది’
రాంపూర్, ఉత్తరప్రదేశ్ : ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఆవులకు దూరంగా ఉండాల్సిందేనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన మూక హత్యను ఉటంకిస్తూ.. ఎప్పుడైతే గోవధను పూర్తి స్థాయిలో నిషేధిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండదంటూ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్.. భవిష్యత్ తరాల బాగుకోసమైనా మనం(ముస్లింలు) ఆవులు, పాల వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ‘గోమాతగా పిలుచుకునే ఆవులను తాకితే చాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆవులతో వ్యాపారం చేసిన వాళ్లని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాటికి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది కదా. భవిష్యత్ తరాలకు ఈ విషయం గురించి సవివరంగా చెప్పాల్సి ఉంటుందంటూ’ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. కాగా ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాంల పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బర్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. -
గోవధపై ఆరెస్సెస్ నేత సంచలన వ్యాఖ్యలు
రాంచీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ తమకు కావల్సినప్పుడు ప్రవేశిస్తుందని ఇటీవల పేర్కొన్న ఆయన.. తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన దారుణంపై స్పందించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జగ్రాన్ హిందూ మంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇంద్రేష్ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆవును చంపాలని ఏ మతం బోధించద లేదన్నారు. ఎప్పుడైతే ఆవులను చంపడం (గోవధ) ఆపేస్తారో అప్పుడే దేశంలో కొనసాగుతోన్న మారణహోమానికి ఫుల్స్టాప్ పడుతుందని పేర్కొన్నారు. మూక దాడులు, హత్యలపై ఇంద్రేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మీ ఇంట్లో వాళ్లపైగానీ, పక్కింటి వారిపైగానీ.. ఎవ్వరిపైనైనా సరే దాడులు అనేది హేయమైన చర్య. అయితే ఆవులను చంపాలని చెప్పే మతం ఏదైనా ఉంటే చెప్పండంటూ ఆయన ప్రశ్నించారు. ‘క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తారు. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడమే అందుకు కారణం. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పుడైతే గోవధను నిషేధించి, పూర్తిస్థాయిలో పాటిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండని’ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ జూలై 17న అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఇంద్రేష్ ఖండించారు. హిందువులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారన్న కారణంగా జార్ఖండ్‌లోని పాకుర్లో అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతియడానికి యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవులను చంపుతున్న కారణంగానే మెజార్టీ వర్గాల్లో అనిచ్చితి నెలకొని దాడులకు ప్రేరేపిస్తోందని, గోవధకు స్వస్తి చెబితే అంతా శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మృతుడిపై పోలీసు కేసు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లాలో ఆదివారం ఇద్దరు ముస్లిం యువకులపై గోరక్షకులు చేసిన దాడిలో ఓ యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు దాఖలు చేశారు. మరణించిన వ్యక్తి, ఆయన స్నేహితుడిపై గోహత్య కేసును.. వారిపై దాడిచేసిన వారిపై హత్యా, హత్యాయత్నం కేసులను దాఖలు చేశారు. ఈ సంఘటనలో మరణించిన వ్యక్తి పోలీసులు చెప్పినట్లు రియాజ్ ఖాన్ కాదు. షిరాజ్ ఖాన్ అతను. సాత్న జిల్లాలోని మైహార్ పట్టణంలో షిరాజ్ ఖాన్ కుట్టుమిషన్ నడుపుకుంటూ జీవిస్తుండగా, ఆయన స్నేహితుడు షకీల్ (38) సైకిల్ షాపు నడుపుకుంటున్నారు. షిరాన్ ఖాన్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇద్దరు మిత్రులు సమీపంలోని పొరుగూరికి వెళ్లి ఆదివారం ఉదయం పట్టణానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కొంత మంది గోరక్షకులు దాడిచేసి ఇనుప రాడ్లతో, చెక్క ఫలకలతో చితక్కొట్టారు. షిరాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. షకీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షకీల్ కోలుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సంఘటన జరిగిన చోట రెండు కిలోల ఆవు మాంసం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. షిరాజ్ ఖాన్‌కు పొరుగూరులో ఒకరు డబ్బివ్వాల్సి ఉండగా, ఆ డబ్బుల కోసం స్నేహితుడిని తీసుకొని వస్తుండగా అన్యాయంగా వారిపై దుండగులు దాడి చేశారని షిరాజ్ ఖాన్ భార్య ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు జరపకుండా ఆవు మాంసం కలిగి ఉన్నారని ఎలా ఆరోపిస్తున్నారని షిరాజ్ ఖాన్ తమ్ముడు ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి
సాక్షి, బెంగళూరు : గోవధను అడ్డుకున్నందుకు బెంగళూరులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. మాకే అడ్డుపడతావా అంటూ సుమారు 150మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, విచక్షణారహితంగా కొట్టి ...కారును ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. దాడి నుంచి తేరుకున్న ఆమె...ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.....కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా నగర శివారులోని తలఘట్టపుర పరిధిలోని టిప్పు సర్కిల్ కసాయిఖానా వద్ద సాగే గోవధను అడ్డుకునేందుకు తాను ఇద్దరు కానిస్టేబుల్స్‌తో కలిసి అక్కడకు వెళ్లినట్లు నందిని తెలిపారు. అయితే అప్పటికే అక్కడ పెద్ద గుంపు ఉందని, ఒక్కసారిగా వారంతా తమపై విరుచుకుపడ్డారన్నారు. దీంతో తనతో వచ్చిన కానిస్టేబుల్స్ అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. మరోవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఖండించారు. బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణించాయనటానికి ఇదో ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దాడి సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. The incident clearly exposes once again the deteriorated law and order in the state. https://t.co/NlBaGx5iUk — B.S. Yeddyurappa (@BSYBJP) 15 October 2017 మహిళను కొట్టి కారును ధ్వంసం చేసిన వీడియో -
గోవధపై జాతీయ భద్రత చట్టం
లక్నో: గోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ), గ్యాంగ్స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. కేంద్రం తెచ్చిన పశువధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
పశువధపై బీజేపీకి ఝట్కా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పశువధ నిషేధంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మరోవైపు బీజేపీకి సొంత పార్టీ నుంచి కూడా నిరసనలు తప్పడం లేదు. మేఘాలయకు చెందిన బీజేపీ నేత బెర్నార్డ్ మరక్ ఏకంగా పార్టీని వీడారు. కాగా మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను నిషేధించబోమని, పేదలకు బీఫ్‌ను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన రెండు రోజుల క్రితం వాగ్దానం చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో కాంగ్రెస్ నుంచి అధికారం దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. క్రైస్తవులు అత్యధికంగా ఉన్న మేఘాలయాలో బీఫ్‌ను స్థానికులు సహజసిద్ధమైన ఆహారంగా స్వీకరిస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను పేదలకు అందుబాటు ధరల్లో చేరువ చేస్తామని, గారో హిల్స్‌లోని కబేళాలను చట్టబద్ధం చేస్తామని బెర్నార్డ్ మరక్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పశువధపై కేంద్రం తాజా నిర్ణయం బెర్నార్డ్‌కు తలనొప్పిగా మారింది. ఈ సందర్భంగా బెర్నార్డ్ మాట్లాడుతూ... బీజేపీని వీడేందుకు నిర్ణయించుకున్నానని, స్వతహాగా క్రిస్టియన్‌తో పాటు గారో తెగకు చెందిన తాను ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకమన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ యత్నిస్తోందని, బలవంతంగా హిందుత్వాన్ని రుద్దుతోందని అన్నారు. అయితే బెర్నార్డ్ మరక్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శిబున్ అన్నారు. తాము బీఫ్ తినేవారికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. -
గోవధ నిషేధం ఓ సంస్కరణ: కేంద్రమంత్రి నక్వీ
- కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ హైదరాబాద్: గోవధ నిషేధంపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందించారు. గోవధను మతపరంగా కాకుండా సంస్కరణగా చూడాలని ఆయన అన్నారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడూతూ..పశువుల మార్కెట్లను క్రమబద్దీరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దీనికి అందరూ సహరించాలని కోరారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉందని, కానీ కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఫ్ పార్టీల పేరుతో కొందరు గోవధ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశంలో సామరస్యతను దెబ్బతీస్తుందని చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. గోవధ సెంటిమెంట్‌తో ముడిపడి విషయమని, గోవధ నేరమని తెలిపారు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా భారతఖ్యాతిని పెంచిందని, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేశామని వివరించారు. దేశంలో 80 నుంచి 90 శాతం మతపరమైన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ అవసరం ఎక్కువగా ఉందని, బీజేపీకి తెలంగాణ చాలా ముఖ్యమైనదని అన్నారు. 2019 లో రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. తాయిలాలు లేకుండానే మైనార్టీల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. యూపీలో ముస్లింల ఓటర్ల పై రవిశంకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని, ఇవి ఎన్నికల కోసం వేసే ఎత్తులు మాత్రమేనని స్పష్టం చేశారు. -
ఆ విష ప్రచారాలు నమ్మొద్దు: వెంకయ్య
ఒంగోలు: టీడీపీ-బీజేపీలపై వస్తున్న విష ప్రచారాలు నమ్మొద్దని, రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ గోవధపై కొందరు పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను కబేళాలకు తరలించవద్దనేదే కేంద్ర ప్రభుత్వం విధానమని, పశు ఆహారం తినవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. గోవధపై వచ్చిన అభ్యంతరాలను కేంద్రం పరిశీలిస్తోందని వెంకయ్య అన్నారు. కాగా ఏపీ రాష్ట్రానికి రూ.2.30 లక్షల కోట్ల నిధులతో కూడిన ప్యాకేజీ కేటాయించామని వెంకయ్య వెల్లడించారు. సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రకాశం జిల్లాలో రామయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు. శాశ్వతమైన అభివృద్ధి కావాలని, అంతేకానీ రంజాన్ తోఫా... సంక్రాంతి కానుకలు ప్రజలకు మేలు చేయవని, అటువంటివాటికి తాము వ్యతిరేకమన్నారు. -
ఆవును చంపితే జీవిత ఖైదు: కోర్టు
ఎవరైనా ఆవులను చంపితే వాళ్లకు జీవిత ఖైదు విధించాలని రాజస్థాన్ హైకోర్టు సూచించింది. చాలామంది హిందువులు పవిత్ర జంతువుగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కూడా తెలిపింది. ఆసియాలోనే అత్యుత్తమ గోరక్షణ కేంద్రాల్లో ఒకటిగా భావించే హింగోనియా గోశాల కేసును హైకోర్టు విచారిస్తోంది. అక్కడ గత సంవత్సరం జనవరి 1 నుంచి జూలై 31 వరకు ఏకంగా 8వేల ఆవులు చనిపోయాయి. రాజ్యాంగంలోని 48, 51 ఎ(జి) అధికరణాలను బట్టి చూస్తే ఆవులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు వాటిని పూర్తిగా సంరక్షించాలని, అందువల్ల ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తన 145 పేజీల తీర్పులో తెలిపారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమని, ఇక్కడ పశుపోషణ కూడా చాలా ముఖ్యమని కోర్టు తెలిపింది. ఆవుల సంరక్షణ, పరిరక్షణకు సంబంధించి కస్టోడియన్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్‌లను జడ్జి నియమించారు. వాళ్లు ఆవుల విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. పశువధను నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం, వాటిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని సంఘాలు కూడా గొడవ చేయడం తెలిసిందే. పశువులను కబేళాలకు తరలించేందుకు కొనుగోలు, అమ్మకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కఠినమైన నిబంధనలను నోటిఫై చేసింది. ఆవులతో పాటు ఎద్దులు, ఆంబోతులు, గేదెలు, దూడలు, ఒంటెలు తదితర జంతువులను ఇందులో చేర్చారు. ఈ నోటిఫికేషన్ మీద మద్రాస్ హైకోర్టు మదురై బెంచి నాలుగు వారాల పాటు స్టే విధించింది. -
నిరసన పేరిట బర్రెను పబ్లిగ్గా నరికేశారు!
యూత్ కాంగ్రెస్ కార్యర్తల తీరుపై ఆగ్రహం తిరువనంతపురం: ఆవుల అమ్మకాలపై ఆంక్షలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా ఒక బర్రెను బహిరంగంగా నరికి చంపిన ఘటన కేరళలో దుమారం రేపుతోంది. ఈ ఘటనలో పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఆదివారం కేసు నమోదుచేశారు. కబేళాలకు ఆవుల అమ్మడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగంగా ఓ బర్రెను వారు తెగనరుకుతున్న వీడియోను కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనాం రాజశేఖరన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ఇది అత్యంత అమానుషమని, సామాన్య వ్యక్తులెవరూ ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. సీపీఎం సైతం ఈ నిరసనను తప్పుబట్టింది. ఇలాంటి మూర్ఖమైన నిరసనలను మానుకోవాలని, ఇలా చేయడం సంఘ్ పరివార్‌కే మేలు చేస్తుందని సీపీఎం ఎంపీ ఎంబీ రాజేశ్ తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనను ఖండించింది. ఈ నిరసన ప్రదర్శనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఇలా చేయడం అనాగరికం, తనకు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఆమోదయోగ్యం కాదంటూ ఖండించారు. మరోవైపు ఈ నిరసన ప్రదర్శనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ చర్యపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయడం లేదు. -
గోవధను నిషేధించాలన్న పోరాటం ఫలించింది
► కేంద్రం నిర్ణయంపై స్పందించిన శారదపీఠాధిపతి విశాఖపట్నం: దేశంలో గోవధను నిషేధిస్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శారద పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. గోవధను నిషేధించాలని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం భారతీయుల హృదయాల్లో ఆనందాన్ని నింపిందని, తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్నో ప్రభుత్వాలు మారినా గోవధపై సరైన నిర్ణయం తీసుకోకపోవడం దరదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లైన తర్వాతైనా ప్రధాని మోడి గొప్ప నిర్ణయం తీసున్నారన్నారు. మూడేళ్ల క్రితం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గోవధ నిషేధం జరుగుతుందని తాము ఆకాంక్షినట్లు పేర్కొన్నారు. దేశ ప్రజలు గోవును కులమతాలకు అతీతంగా పూజిస్తారని, తల్లిగా, ఇంటి మహాలక్ష్మిగా కొలుస్తారని తెలిపారు. కేవలం ఇది మాటలకే పరిమితం కాకుండా సవరణలకు వీలులేని విధంగా చట్టాలను తీసుకురావాలని శారదాపీఠం తరపున లేఖ రాయనున్నట్లు స్వరూపానందేంద్ర సరస్వతి తెలియచేశారు. -
గోరక్షణ పేరుతో హింస వద్దు: భగవత్
న్యూఢిల్లీ: గోరక్షణ పేరుతో హింసకు పాల్పడడం సమర్థనీయం కాదని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అన్నారు. దేశంలో గోవధను నిషేధిస్తూ చట్టం తేవాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 'గోరక్షణ పేరుతో ఎటువంటి హింసకు దిగినా మన లక్ష్యానికి చెడ్డపేరు వస్తుంది. చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల'ని ఆయన అన్నారు. గోరక్షణ పేరుతో దాడులు పెరిగిపోవడంతో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పెహ్లు ఖాన్(55) అనే రైతును గోరక్షకులు హత్య చేయడంతో ఆందోళనలు రేగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని విపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా భగవత్ పేరును ఇటీవల శివసేన తెరపైకి తెచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నిక రేసులో తాను లేనని భగవత్ ప్రకటించారు. -
ట్రిపుల్ తలాక్ బ్యాన్, గోవధపై ఫత్వా!
న్యూఢిల్లీ: ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డు (ఏఐఎస్పీఎల్బీ) బుధవారం మూడు కీలక తీర్మానాలను ఆమోదించింది. దేశంలో కలకలం రేపుతున్న గోవధకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయడమే కాకుండా.. ట్రిపుల్ తలాక్ నిషేధానికి మద్దతు పలికింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు విషయాన్ని కోర్టు బయట చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. లక్నోలో బుధవారం జరిగిన ఏఐఎస్పీఎల్బీ కార్యవర్గ సమావేశంలో కీలకమైన గోవధను నిషేధిస్తూ ఫత్వాను జారీచేశారు. ఇరాక్‌కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద అయాతుల్లా షేఖ్ బషీర్ హుస్సేన్ నజఫీ నుంచి అనుమతి తీసుకున్న అనంతరం షియా బోర్డు గోవధకు వ్యతిరేకంగా ఫత్వాను అమల్లోకి తెచ్చింది. గోవధ కారణంగా దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, అందుకే ఈ ఫత్వా జారీచేశామని షియా బోర్డు స్పష్టం చేసింది. -
ఆవులను చంపితే ఉరితీస్తాం: ముఖ్యమంత్రి
రాయ్‌పూర్: ఆవులను ఎవరైనా చంపితే ఉరితీస్తామంటూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. రాష్ట్రంలో గోవధకు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఛత్తీస్‌గఢ్‌లో గోహత్య జరుగుతున్నాదా? గత 15 ఏళ్లలో ఎవరైనా హత్య చేశారా? ఎవరైనా ఆవులను చంపితే.. వారిని ఉరితీస్తాం' అంటూ ఆయన నవ్వుతూ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు.. గోవధ, అక్రమ మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గోవధను, అక్రమ మాంసం దుకాణాలను మూసివేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యల ప్రభావం బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాలలోనూ కనిపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. #WATCH: Chhattisgarh CM Raman Singh says 'will hang those who kill (cows)' when asked will Chhattisgarh make any law against cow slaughter. pic.twitter.com/V5fdNs4CEk — ANI (@ANI_news) 1 April 2017 -
‘సంపూర్ణ గోవధ నిషేధం’పై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నవేళ గోవధకు సంబంధించిన పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలను ఎత్తేసేలా ఉత్తర్వులు జరీచేయాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను శుక్రవారం కొట్టేసింది. సదరు వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని స్పష్టం చేసింది. ‘కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై మేం జోక్యం చేసుకోలేం. దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం..’అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గోవుల అక్రమ రవాణాపై ఇప్పటికే తాను మార్గదర్శకాలు ఇచ్చానన్న సుప్రీంకోర్టు.. కొత్తగా సంపూర్ణ గోవధ నిషేధం పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు గోవధను, గోమాంసాన్ని నిషేధించిన నేపథ్యంలో, దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అవలంభించాలని ఒక వర్గం నుంచి డిమాండ్ వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ మేరకు వినీత్ సహాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేశారు. -
క్రికెటర్ షమీ కుటుంబానికి 'గోవధ' ఉచ్చు
- షమీ ఎదుగుదలచూసి ఓర్వలేకే కుట్రలు - గోవధ నిందితులను కాపాడామనే ఆరోపణ అవాస్తవం - వేధింపులపై నెల కిందటే ఫిర్యాదుచేశా: షమీ తండ్రి మీరట్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ సోదరుడు మొహమ్మద్ హసీబ్ పై పోలీసు కేసు చిలికిచిలికి గాలివానలా మారుతోంది. గోవధకు పాల్పడినవారితో తమకు ఎలాంటి సంబంధంలేదని, షమీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఉద్దేశపూర్వకంగా తమను కేసులోకి లాగారని క్రికెటర్ తండ్రి తౌసీప్ అహ్మద్ ఆరోపించారు. గొడవ జరిగిన ప్రాంతంలో కేవలం ప్రేక్షకుడిలా ఉన్న హసీబ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వేధింపుల్లో భాగంగానే ఇలా జరిగిందని విమర్శించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలోకి వెళితే.. గురువారం షమీ స్వగ్రామమైన అమ్రోహలో గోవధ జరుగుతోందన్న సమాచారంతో దిబోలీ స్టేషన్ కు చెందిన ఇద్దరు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే షమీ సోదరుడైన హసీబ్ పోలీస్ వాహనానికి అడ్డుపడి నిందితులను వదిలిపెట్టాలన్నాడని, కుదరదన్న తమపై దాడి చేశాడని పోలీసుల వాదన. నిందితుల పరారీకి సహకరించడంతోపాటు, విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై హసీబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అనారోగ్యకారణాలతో హసీబ్ బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే పోలీసులు చెబుతున్నట్లు తన పెద్దకొడుకు(హసీబ్) దాడికి పాల్పడలేదని తండ్రి తౌసీఫ్ అంటున్నారు. 'గోవధ నిందితులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో చాలా మంది గుమ్మిగూడారు. అందరిలాగే హసీబ్ కూడా చూస్తూ నిల్చున్నాడేకానీ పోలీసులను అడ్డుకోలేదు. ఇదంతా ఒక కుట్ర. గోవధ కేసులోకి మమ్మల్ని లాగాలనే ఉద్దేశంతో కొందరు కల్పించిన కట్టుకథ. గతంలోనూ ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నా. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది' అని తౌసీఫ్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై అమ్రోహా కలెక్టర్ వేద ప్రకాశ్ స్పందిస్తూ.. కొందరు వేధిస్తున్నారంటూ షమీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కచ్చితంగా ఎవరు బెదిరిస్తున్నారనే సమాచారం లేనందున తదుపరి చర్యలు తీసుకోలేకపోయామని కలెక్టర్ వివరించారు. -
గోవులను వధించకుండా కొత్త చట్టం
నార్నల్(హర్యానా): త్వరలో గోవు సంరక్షణ చట్టం రాబోతుందని, అది వచ్చిన తర్వాత ఎవరైనా గోవధకు పాల్పడినా, వాటిని అమ్మినా, తిన్నట్లు తెలిసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. గో సంరక్షణ చట్టం చేసేందుకు బిల్లును రూపొందించామని, దానికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ కూడా ఇచ్చామని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దానిని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం అమలుచేసిన తర్వాత ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బిల్లు 90 మందిచే అసెంబ్లీలో ఆమోదం పొందిందని, ఆ బిల్లును ఆమోదించినవారిలో ముస్లింలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ బిల్లు తీసుకురావడంలో ముస్లింలు కూడా ఎంతో సహకరించారని, బిల్లు రూపొందించే దశ నుంచి చట్ట సభలోకి తీసుకెళ్లే వరకు ఏ రకమైన సహాయమైనా తాము అందించేందుకు సిద్ధమని వారు చెప్పారని వివరించారు. ఇక నుంచి హర్యానాలో గోవధ మాత్ర ఉండదని చెప్పారు. -
బీఫ్‌పై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
హరిద్వార్: గొడ్డుమాంసం, గోవధ చేసేవారిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చేసేవారికి భారత్‌లో నివసించే హక్కులేదని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 'గోవులను ఏ మతానికి చెందినవారు చంపినా సరే.. వాళ్లు భారత్‌కు అతిపెద్ద శత్రువు. అలాంటి వ్యక్తులకు దేశంలో నివసించే హక్కులేదు' అని ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం అన్నారు. గోవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, బీజేపీ పాలిత హరియాణ ముఖ్యమంత్రి ఎమ్ ఎల్ ఖట్టర్ ఇటీవల బీఫ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని వ్యాఖ్యానించారు. -
మంగళూరు హత్య కేసులో ఎనిమిదిమంది అరెస్టు
మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు సంబంధించి ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు సంబంధించి మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. కేసు విచారణ ప్రారంభమైందని, దోషులకు శిక్షపడే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మంగళూరులో గోమాంసం మార్కెట్లను మూసివేయించే కార్యక్రమంలో భయరంగ్ దళ్ కార్యకర్త అయిన ప్రశాంత్ పూజారీ చాలా కీలకపాత్ర పోషించేవాడు. గోహత్యను నిషేధించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాల రూపకల్పనలో కూడా అతడు మేటి. ఇలా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రశాంత్‌పై ఒకేసారి ఆరుగురు ముస్లిం వ్యక్తులు ఈ నెల(అక్టోబర్) 9న మూడ్‌బిద్రి వద్ద దాడి చేసి ఉరి తీసి హత్య చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లు, 21 మంది అరెస్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మణిపూరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆవులను చంపేస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో హింస చెలరేగింది. రాష్ట్ర రాజధాని లక్నోకి ఆగ్రాకి సమీపంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ఆవులను వధించారని, సమీప పొలాల్లో వాటి కళేబరాలు పడివున్నాయనే పుకార్లు చెలరేగడంతో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు పలుషాపులను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవు మాంసం అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో లల్లా, షాఫిక్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. గుంపునుంచి వారిని విడిదీసి స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసు వాహనంపై దాడి చేసిన వారిని బయటకు లాగి పడేశారు. దీంతో అ దనపు బలగాలను రప్పించారు. డీఐజీ లక్ష్మీ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప రిస్థితిని అదుపు చేశారు. తమ విచారణలో ఇవన్నీ పుకార్లని తేలాయని జిల్లా మాజిస్ట్రేట్ ప్రకటించారు. ఈ కేసులో 21 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా డీఎస్పీ ని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా ఉత్తర ప్రదేశ్ దాద్రి లో ఆవు మాంసం అమ్ముతున్నాడనే అనుమానంతో 52 ఏళ్ల వృద్ధుణ్ని కొట్టి చంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. -
'గెలిపిస్తే గోవధను నిషేధిస్తాం'
పట్నా: ఒకవైపు గోవధ, గోమాంసం నిషేధంపై తీవ్ర వివాదం చెలరేగుతోంటే మరోవైపు బిహార్ బీజేపీ నాయకులు ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే గోవధను నిషేధిస్తామని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వాగ్దానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోవధను నిషేధించడం ద్వారా వేలాది ఆవులను రక్షించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ప్రధాని తన చర్య ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారంటూ ట్వీట్ చేశారు. ఆవులను రక్షించడం ద్వారా గోపాలకుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. -
'ఆవును చంపితే.. ఇలా శిక్షిస్తారా'
హైదరాబాద్ : గోవును చంపారేమోనన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. 'ఒకవేళ గోవును చంపితే.. ఇలా శిక్షిస్తారా' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఒవైసీ మాట్లాడుతూ.. 'ఓ వ్యక్తిని చంపారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యాన్ని దోపిడీ, దౌర్జన్య సామ్యంగా మార్చుతున్నారు' అంటూ ధ్వజమెత్తారు. భారత్ ను హిందుత్వ దేశంగా చేయాలని సంఘ్ పరివార్ సభ్యులు ప్రయత్నిస్తే దేశం మరింత బలహీనమవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. హత్యకు గురైన వ్యక్తి కొడుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో సేవలందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఓ వ్యక్తి బీఫ్ తింటే మాత్రం చంపాలని ఆదేశాలు జారీ చేస్తారా.. అలా అయితే, చట్టాలు.. కోర్టులు.. పోలీసులు ఎందుకు.. వాటినన్నింటిని మూసివేయొచ్చుగా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి మహేశ్ శర్మ.. ఇది కేవలం తప్పిదమేనని వ్యాఖ్యానించడంపై కూడా ఒవైసీ మండిపడ్డారు. ఓ వ్యక్తిని హత్య చేయడం చిన్న విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించింది, కానీ ఘటనకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుందని ఒవైసీ ప్రశ్నించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన అక్లాక్ (50) హత్య, అతని కొడుకు దానిస్ స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. -
నేను బీఫ్ తింటా, ఎవరైనా ఆపగలరా?
న్యూఢిల్లీ : ఎన్డీయే సర్కార్‌లో సహచర మంత్రుల మధ్య బీఫ్ వ్యవహారం ముదురుతోంది. బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ వలస వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. 'నేను గొడ్డు మాంసం తింటాను. అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఉంటా. నాతో ఎవరైనా బీఫ్ తినడం మాన్పించగలరా? అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. భారత్ దేశంలో అందరి మనోభావాలు గుర్తించాలని, వారి వారి పద్ధతులు, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సి ఉందన్నారు. బీఫ్ తినవద్దని చెప్పడానికి ఆయన ఎవరూ అంటూ నక్వీపై కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఒకవేళ బీఫ్ తినకుండా నిషేధించాలనుకుంటే.. మహారాష్ట్రలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉన్నందున హిందు మతవిశ్వాసం ప్రకారం అక్కడని చట్టాన్ని అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక శాతం ప్రజలు బీఫ్ తింటారని, దానివల్ల తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రతి పౌరుడి మనోభావాలను గుర్తించాలని కిరణ్ రిజిజు అన్నారు. బీఫ్ తినాలనుకుంటే పాక్,లేదా అరబ్ దేశాలు వెళ్లాలని నక్వీ వ్యాఖ్యలు చేయటం మంచి పరిణామం కాదన్నారు. అయితే ఆయనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ...ప్రజల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. కాగా గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్తాన్, లేదా అరబ్ దేశాలకు వెళ్లాలని నక్వీ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. గోవధను నిషేధించడం మీద కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇక గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా ఆవు మాంసాన్ని విక్రయించిన లేదా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించనున్నారు. -
'బీఫ్ తినకపోతే చచ్చిపోతారా.. పాక్ వెళ్లండి'
గోవధను నిషేధించడం మీద కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్థాన్ వెళ్లాలని సలహా ఇచ్చారు. దానివల్ల లాభం గానీ, నష్టం గానీ లేవని, అది కేవలం విశ్వాసాలకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. హిందువులకు సున్నితమైన అంశమని ఆయన ఆజ్‌తక్ టీవీ ఛానల్ నిర్వహించిన 'మంథన్' సదస్సులో చెప్పారు. గోమాంసం తినకపోతే చచ్చిపోయేవాళ్లు పాకిస్థాన్‌కు గానీ, అరబ్బు దేశాలకు గానీ వెళ్లాలని లేదా ప్రపంచంలో మరే ప్రాంతంలోనైనా అది అందుబాటులో ఉంటే అక్కడకు పోవాలని సూచించారు. కొంతమంది ముస్లింలు కూడా గోవధకు వ్యతిరేకమేనని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. గోవా, జమ్ము కాశ్మీర్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ తరహా మాంసమే తింటారని, కేంద్రం దేశవ్యాప్తంగా గోవధను నిషేధించగలదా అంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నఖ్వీ ఖండించారు. -
బక్రీద్ రోజున గోవధ నిషేధం
బక్రీద్ సందర్భంగా ఎవరైనా గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించరాదని తెలిపారు. ఆవులను, గేదెలను, దూడలను కబేళాలకు అమ్మడాన్ని కూడా నిషేధించినట్లు హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించి కబేళాలకు వీటిని అమ్మినా, గోవధకు పాల్పడినా చట్టపక్రారం శిక్ష తప్పదన్నారు. బక్రీద్ సమయంలో ఎవరైనా ఆవులను, గేదెలను కబేళాల వద్ద కొనుగోలు చేయరాదని, కేవలం ఆంబోతులు, దున్నపోతులను మాత్రమే కొనాలని కబేళాల యాజమాన్యాలకు కూడా పోలీసులు సూచించారు. గోల్కొండ, లంగర్ హౌస్, నాంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఉన్న కబేళాల యాజమాన్యాలు, నిర్వాహకులతో పోలీసులు ఓ సమావేశం నిర్వహించారు. -
'మంచి హిందువుగా గోవధ నిషేధానికి మద్దతు'
పనాజీ: గోవధకు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థలు చేస్తున్న ప్రచారానికి ఊహించని నాయకుడి మద్దతు లభించింది. పదుదైన మాటలతో నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గోవధ నిషేధానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉత్తముడైన హిందువుగా గోహత్యకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. గోవాలో జరుగుతున్న హిందువుల సమావేశంలో గోవధను నిషేధిస్తూ ఓ తీర్మానం ఆమోదించారు. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ... గోహత్యను నిషేధిస్తూ 1930లోనే కాంగ్రెస్ పార్టీ అధికారిక తీర్మానం చేసిందని గుర్తు చేశారు. మొఘళుల కాలం నుంచి గోవధ నిషేధం అమల్లోవుందని తెలిపారు. భోపాల్ రాజకుటుంబం కూడా గోహత్యకు వ్యతిరేమని చెప్పారు.