ఆవులను చంపితే ఉరితీస్తాం: ముఖ్యమంత్రి
రాయ్‌పూర్: ఆవులను ఎవరైనా చంపితే ఉరితీస్తామంటూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. రాష్ట్రంలో గోవధకు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఛత్తీస్‌గఢ్‌లో గోహత్య జరుగుతున్నాదా? గత 15 ఏళ్లలో ఎవరైనా హత్య చేశారా? ఎవరైనా ఆవులను చంపితే.. వారిని ఉరితీస్తాం' అంటూ ఆయన నవ్వుతూ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు.. గోవధ, అక్రమ మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గోవధను, అక్రమ మాంసం దుకాణాలను మూసివేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యల ప్రభావం బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాలలోనూ కనిపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
#WATCH: Chhattisgarh CM Raman Singh says 'will hang those who kill (cows)' when asked will Chhattisgarh make any law against cow slaughter. pic.twitter.com/V5fdNs4CEk
— ANI (@ANI_news) 1 April 2017