![Chhattisgarh To Get 2 Deputy CMs Raman Singh to be Speaker - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/10/Chhatisgarh_img.jpg.webp?itok=hhHIOjGq)
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అరుణ్ సావో, విజయ్ శర్మల పేర్లను ఖరారు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. సీఎంగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. రాయ్‌పూర్‌లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు. 2003 నుంచి 2018 వరకు మూడు సార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నాయకుడు రమణ్ సింగ్‌ను స్పీకర్ పదవికి పరిమితం చేశారు.
ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు.
ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి
Comments
Please login to add a commentAdd a comment