మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం.
ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?
Comments
Please login to add a commentAdd a comment