deputy cm
-
ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ: డిప్యూటీ సీఎం వ్యాఖ్యల దుమారం
Aurangzeb Controversy మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మంగళవారం ఈ అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్‌పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే కౌన్సిల్లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు రైట్‌వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని గురించి పొగడటమేమిటి? ‘ఔరంగజేబు ఎవరు? మన రాష్ట్రంలో ఆయనను కీర్తించడాన్ని మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో అతను ఒక మాయని మచ్చ‘ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాలనను ఔరంగజేబు పాలనతో పోల్చడాన్ని శిందే తీవ్రంగా తప్పుపట్టారు. ఫడ్నవీస్ పాలన, ఔరంగజేబు పాలనా ఒకటేనా? ‘ఔరంగజేబు తన శత్రువులను హింసించిన విధంగా ఫడ్నవీస్ ఎప్పుడైనా ఎవరినైనా హింసించారా?‘ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అనిల్ పరబ్ వైపు తిరిగి ప్రశ్నించారు.చదవండి: Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?దీనికి పరబ్ కోపంగా తనకు ఈ విషయంపై స్పందించే అవకాశమివ్వాల్సిందిగా చైర్మన్‌ను కోరారు. కానీ చైర్మన్ రామ్‌శిందే పరబ్‌ను అనుమతించలేదు. ఆయన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేశారు. అయినప్పటికీ పరబ్, ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే, సచిన్ పరబ్ ఇతర సభ్యులతో కలిసి తమను మాట్లాడనివ్వవలసిందిగా నిరసన తెలియజేశారు. ఇంత జరుగుతున్నా శిందే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘నేనేంచేసినా బహిరంగంగా చేశా. ఔరంగజేబ్ (కాంగ్రెస్) పట్ల సానుభూతి చూపే వారి నుంచి శివసేనను కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నానని అనిల్ పరబ్ మర్చిపోకూడదు. ఔరంగజేబ్ సమాధికి రక్షణ కల్పించింది కాంగ్రెస్సే.‘ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ?
-
నారా లోకేశ్ అలకకు కారణమేంటి?
-
అలిగిన లోకేష్..!సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన
సాక్షి,విజయవాడ:డిప్యూటీ సీఎం పదవి రాకపోవడంతో మంత్రి నారా లోకేష్ అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం ఆశలపై బీజేపీ అగ్రనేత,కేంద్ర హెం మంత్రి అమిత్‌షా నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. తనను డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదని లోకేష్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. లోకేష్,పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన పోరులో లోకేష్ పరాజయం పాలయ్యారని కూటమి వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇందుకే లోకేష్ అలిగి పార్టీ పదవి వదులుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే టార్గెట్ చేసి లోకేష్ పార్టీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది.లోకేష్ ప్రభుత్వంలో పార్టీలో సూపర్‌పవర్‌గా ఉండాలని చంద్రబాబు భావించారు. అయితే తమ ప్లాన్ పారకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల దావోస్ పర్యటనలోనూ చంద్రబాబు లోకేష్‌ను ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే.కాగా, ఇటీవల లోకేష్‌ను సీఎం చేయాలంటూ టీడీపీలో సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేశారు. లోకేష్ యువగళం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పొగడ్తలు కురిపించారు. వీటికి కౌంటర్‌గా అటు జనసేన నేతలు తమ నేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చేయాలని మాట్లాడే దాకా వెళ్లారు.దీంతో కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య లోకేష్ డిప్యూటీ సీఎం అంశం చిచ్చుపెట్టేదాకా వెళ్లింది. చివరికి అమిత్‌షా మోకలడ్డడంతో లోకేష్‌కు అసంతృప్తి మిగిలి పవన్‌దే పైచేయి అయిందన్న ప్రచారం జరుగుతోంది. -
అయ్యన్న వ్యాఖ్యలతో విస్మయానికి గురైన టీడీపీ నేతలు
-
సోషల్ మీడియాలో.. డిప్యూటీ సీఎం రచ్చ
సాక్షి, భీమవరం: మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు అందుకున్న రాగం కూటమిలో కుంపటి రాజేసింది. తమ నాయకుడి ప్రాధాన్యతను తగ్గించేందుకు టీడీపీ కూటమి ధర్మాన్ని కాలరాస్తోందని జన సైనికులు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆ రెండు పారీ్టల అధిష్టానాలు ప్రకటించినా తగ్గేదే లేదంటూ సోషల్ మీడియా వేదికగా పోటాపోటీగా పోస్టులు పెట్టుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో జనసేన.. ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకులలో టీడీపీ పోటీ చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కారణమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమ అధినేత సీఎం కావాలని జనసేన పార్టీ కేడర్ ఆశించింది. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టినా రాష్ట్రానికి ఒక్కరే డిప్యూటీ సీఎం కదా అని కేడర్ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రచారానికి తెరలేపడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు పారీ్టల అధిష్టానాల సూచనల నేపథ్యంలో పబ్లిక్‌గా ఎవరూ స్టేట్మెంట్లు ఇవ్వకపోయినప్పటికీ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ టాపిక్ పైనే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పవన్ ప్రాధాన్యం తగ్గించేందుకే.. దీనిపై జనసేన కేడర్ రకరకాల పోస్టులు, కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. కూటమిలో పవన్ ప్రాధాన్యతను తగ్గించేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి గెలుపులో ఆయన పాత్రని అప్పుడే మీరు మర్చిపోయారా అని ఒకరు పోస్టు పెట్టగా, డిప్యూటీ సీఎంగా లోకేష్ ఓకే.. పవన్‌కల్యాణ్‌ని సీఎం చేస్తారంటూ ఒక నెటిజన్ పోస్టు చేశారు. టీడీపీ ప్లాన్‌లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారంటూ, ఈ ఎనిమిది నెలల్లో విద్యా శాఖ, ఐటీ శాఖల్లో వచ్చిన అభివృద్ధి ఏమిటి తమ్ముళ్లూ.. అన్ని ప్రశి్నస్తూ ఒకరు, కూటమి ధర్మం ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం.. ఇది పాటించండి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మంత్రి లోకేష్‌పై సెటైరికల్‌గా రీల్స్ పోస్టు చేస్తున్నారు.పవన్‌కు పదవులు లెక్క కాదు ..నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీని చిన్నచూపు చూస్తున్నారని, నీటి సంఘాల నియామకాల్లో టీడీపీ ఒంటెద్దు పోకడగా వ్యవహరించిందని ఇటీవల ఒక సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి ఈ టాపిక్ పైనా ఓ పోస్టు పెట్టారు. మళ్లీ చెబుతున్నాం.. పదవులు మీకు గొప్ప.. ఆయనకు కాదు.. పదవి ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా ఆయనకేం ఊడదు.. అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఉండి నియోజకవర్గానికి చెందిన ఒక పొలిటికల్ వాట్సప్ గ్రూపులో ఆయన పేరిట వచ్చిన పోస్టు వైరల్ అవుతోంది. పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.లోకేష్ కు మద్దతుగా టీడీపీ కేడర్ ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లోని టీడీపీ, జనసేన పారీ్టల పేరిట, పవన్ కల్యాణ్, లోకేష్ అభిమానుల పేరిట ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు, లోకల్ వాట్సప్ గ్రూపులు, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. యువగళం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని కొందరు కోరితే, డిప్యూటీ సీఎంగా చేస్తే తప్పేంటని కొందరు, సీఎం చేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. -
భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా
ఆగండ్రా బాబు.. అసలే అయన తిక్కలోడు.. ఏ క్షణానికి కండువా విసిరేసి వెళ్ళిపోతాడో తెలీదు.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి.. వచ్చి ఏడాది కూడా కాలేదు ఇప్పుడే మీరు చినబాబు డిప్యూటీ సీఎం .. చినబాబు డిప్యూటీ సీఎం అని కేకలు వేయకండి.. కొన్నాళ్ళు ఆగండి .. పరిస్థితులు చిన్నగా సర్దుకున్నాక అన్నీ చేద్దాం.. ముందే గాయిగాత్తర చేయకండి. అసలే తిక్కలోడికి ఢిల్లీ సపోర్ట్ ఉంది.. వాళ్ళ సపోర్ట్ టోన్ మనం గెలిచాం.. అప్పుడే అల్లరల్లరి చేస్తే లేనిపోని బాధలు. కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి అని తెలుగుదేశం అధిష్టానం పార్టీ వీరవిధేయులైన ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులకు సూచించింది.వాస్తవానికి ఇది అధిష్టానానికి తెలిసి.. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందో..లోకేష్ పట్ల భక్తిభావం పెల్లుబికి.. దాన్ని అణచుకోలేక అంటున్నారో తెలియదు కానీ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అర్జంట్ గా లోకేష్ ను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన పిఠాపురం వర్మ కూడా అదే రాగం ఎత్తుకున్నారు. ఇది గత రెండు నెలలుగా ఉధృతంగా సాగింది. ఐతే ఇన్నాళ్లుగా ఆ భజనను చూస్తూ ఊరుకున్న జనసైనికులు గత కొద్దిరోజులుగా నోరువిప్పుతూ సోషల్ మీడియాలో టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ ఇవ్వండి ఫర్లేదు కానీ అదే టైములో పవన్‌కు సీఎంగా బాధ్యతలు ఇవ్వండి.. అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు.. అంతేకానీ పవన్‌ను డిప్యూటీ సీఎంగా ఉంచుతూ మళ్ళీ లోకేష్‌కు అదే హోదా ఇస్తేమాత్రం గొడవలైపోతాయి అన్నట్లుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ జనసైనికులను పవన్ సైతం నియంత్రించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు.. జనసేనలో సీట్ల సర్దుబాటు వంటివన్నీ పవన్ దగ్గరుండి మరీ కుదిర్చారు. పవన్ లేకపోతె మొన్న తెలుగుదేశం గెలుపు అసాధ్యం అనేది అందరికి తెలిసిందే అలాంటపుడు మా పవన్‌ను కాదని వేరే వాళ్లకు.. అదే లోకేష్‌కు ఎలా డిప్యూటీ ఇస్తారు అనేది జనసేన వాదన. దీంతోబాటు కేంద్రం సైతం పవన్ తోబాటు ఇంకో డిప్యూటీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొన్న అమిత్ షా వచ్చినపుడు సైతం లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగా అయన తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేంద్రం దన్ను సంపూర్ణంగా ఉన్న పవన్ తో గొడవ ఎందుకు.. అందాకా సైలెంట్ గా ఉండండి అని తెలుగుదేశం తన క్యాడరుకు ఒక మెసేజ్ పంపింది.ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పార్టీ శ్రేణులకు ఒక సందేశం పంపింది. ఇకముందు ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ డిమాండ్లు చేయకండి. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకండి అంటూ గేటు వేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికారం రుచి మరిగిన నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టి. ఇరిటేట్ చేసేలా ఏదీ చేయొద్దని.. అలాగైతే కూటమిలో చిచ్చు రేగుతుందని చంద్రబాబు గ్రహించి క్యాడర్‌ను నియంత్రించినట్లు చెబుతున్నారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది అనే పవన్ కు తిక్కరేగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారన్నమాట. --సిమ్మాదిరప్పన్న -
లోకేష్ ను పొగిడేవారి మంత్రులనే దావోస్ తీసుకెళ్లిన చంద్రబాబు
-
నారా లోకేష్ కు మద్దతు ప్రకటించని హోంమంత్రి అనిత
-
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాల్సిందే
-
టీడీపీపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
-
లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ
సాక్షి,కాకినాడజిల్లా: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం(జనవరి 19) మీడియాతో మాట్లాడారు.‘నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని,టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారు.ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి.లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు.అలాంటిది పార్టీని బలోపేతం చేసి, టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి?కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.టీడీపీ కార్యకర్తల మనసులో మాట.ఏదేమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం’అని వర్మ అన్నారు. కాగా, లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. ఈ నేతల జాబితాలో పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
డిప్యూటీ సీఎంగా లోకేష్.. జనసేన స్ట్రాంగ్ కౌంటర్లు
వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోకాలడ్డు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చిచ్చు రగల్చింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్లిస్తోంది.టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి(R Srinivasulu Reddy) వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తోంది. ఒకవేళ.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులుకు సూచిస్తున్నారు. పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులు రెడ్డినే తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు.. బాబుకు వయసైపోయింది!నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్(Nara Lokesh Babu)కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. అయితే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయడం ద్వారా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డీ.సీఎం. చైర్లో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది. అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో? అనే ఆందోళనలో జనసేన ఉందిప్పుడు. ఈ క్రమంలోనే ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.ఇదీ చదవండి: ‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’ -
చంద్రబాబును మించిపోయేలా పవన్!
పవన్ కళ్యాణ్ తన నటనా కౌశలాన్ని వెండితెరపై నుంచి రాజకీయాలకు కూడా విస్తరించినట్లుంది. రాజకీయాల్లో నటన, వంచనా చాతుర్యం వంటివి జనాలకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదైతే.. పవన్ ఆయన అడుగుజాడల్లో.. అతని కంటే ఘనుడు అనిపించుకునేలా నడుస్తున్నాడు. ‘స్వర్ణాంధ్ర2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగాన్ని గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. గతంలో ఆయన ఉపన్యాసాలకు, ఇప్పుడు చెబుతున్న సుద్దులకు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. పదవి వస్తే అంతా సుభిక్షంగా ఉందని నేతలు ఫీల్ అవుతారట. పవన్ ప్రస్తుతం ఆ దశలో ఉన్నారు. పాతికేళ్లపాటు ఏపీలో రాజకీయ స్థిరత్వం ఉండాలని చంద్రబాబు నేతృత్వంలో పని చేస్తానని ఆయన చెప్పుకున్నారు. బాబును ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ అవసరాల కోసం పొగిడితే తప్పులేదు కానీ.. అతిగా చేస్తేనే వెగటు పుడుతుంది. 2019లో చంద్రబాబును ఉద్దేశించి పవన్ మాట్లాడిందేమిటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ’2020 విజన్ అంట.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు..అవి ఇచ్చారా? ఆ ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం సాగుతోంది. చంద్రబాబు దృతరాష్ట్రుడి మాదిరిగా కొడుకు లోకేష్ కోసమే పనిచేస్తున్నారు.‘ అని ఆయన అప్పట్లో ధ్వజమెత్తారు ఇప్పుడు మాత్రం.. ’2020 విజన్ అంటే ఆనాడు అర్థం చేసుకోలేక పోయారు..వెటకారం చేశారు. ఇప్పుడు వారికి అదే భిక్ష పెడుతోంది. చంద్రబాబు గారి అనుభవం, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అమోఘం...‘ అంటున్నారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టారని పవన్ అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ‘విజన్2020’తో ఒరిగిందేమిటో చెప్పకుండా ఒట్టిగా పొగిడితే చెవిలో పూలు పెడుతున్నారని జనం అనుకోరా? పవన్ కళ్యాణ్ విజన్2020 డాక్యుమెంట్‌ను అసలు చూశారా? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ డాక్యుమెంట్‌తో ప్రచారం నిర్వహించారు. అందులోని అంశాలు పరిశీలించిన వారు ఇదేదో కాలక్షేపం వ్యవహారమని, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ డాక్యుమెంట్‌ను అస్సలు పట్టించుకోలేదు అనేందుకు ఆ తరువాతి రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడమే నిదర్శనం. ఈ సమయంలో కానీ.. రాష్ట్ర విభజన తరువాత 201419 మధ్యకాలంలో కానీ చంద్రబాబు ఈ విజన్ పేరెత్తితే ఒట్టు! ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్ అన్నారో.. బాబుగారికి ఠక్కున గుర్తొచ్చింది. తాను వెనుకబడకూడదన్నట్టు ‘స్వర్ణాంధ్ర2047’ను వదిలారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.. ’కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. 21వ శతాబ్దంలో కూడా కులాలేమిటి..మతాలేమిటి ప్రాంతాలేమిటి?‘ అని ప్రశ్నించారు. ఆయన నిజంగానే ఇలా అనుకుంటూంటే... జనసేన తరపున తీసుకున్న మూడు మంత్రి పదవులలో ఇద్దరు కాపులు ఎందుకు ఉన్నారో చెప్పాలి కదా? మరో మంత్రి పదవిని కూడా కాపు వర్గానికి చెందిన తన సోదరుడు నాగబాబుకే ఎందుకు కట్టబెడుతున్నారు? కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర వర్గాల వారికి పదవి ఇప్పించ లేకపోయారే అన్న ప్రశ్న వస్తే ఏం జవాబు ఇస్తారు? కొద్ది నెలల క్రితం వరకు కులం కావాలని, అందులోను కాపులు, బలిజలు అంతా ముందుకు రాకపోతే రాష్ట్రంలో మార్పు రాదని రెచ్చగొట్టే రీతిలో ఉపన్యాసాలు ఈయనే చేయడం విశేషం. కాపులు తనకు ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకల్లో ఎందుకు ఓడిపోతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కుల భావన అన్నా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని కూడా అప్పట్లో సెలవిచ్చారు. పవన్ తమ కులం వాడని నమ్మి మద్దతిచ్చిన కాపులు, బలిజలు ఇప్పుడు కుల భావాన్ని వదులుకోవాలా? అందుకు వారు సిద్దం అవుతారా? లేక పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేయడంలో నైపుణ్యం సాధించారని సరిపెట్టుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఏది అవసరమైతే అది చెప్పి ప్రజలను మభ్య పెట్టడంలో ఆరితేరుతున్నారు. కొద్ది నెలల క్రితమే కదా! ‘‘ఐయామ్ సనాతన్ హిందూ’’ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని పవన్ అరిచింది? ఆ సందర్భంలో ముస్లింలతో పోల్చి హిందువులను రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ సడన్‌గా ఇంకా మత భావన ఏమిటని అంటే ఏపీ జనం నోట్లో వేలేసుకుని వినాలన్నమాట. పవన్ అసలు మతం గురించి ఎప్పుడు ఏమి మాట్లాడారో వివరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవి వింటే ఇన్ని రకాలుగా మాటలు మార్చవచ్చా? అన్న భావన కలుగుతుంది. వాటి గురించి వివరణ ఇవ్వకుండా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడితే సరిపోతుందా?మరో వ్యాఖ్య చూద్దాం. పార్టీ పెట్టి నలిగిన తర్వాత చంద్రబాబుపై గౌరవం అపారంగా పెరిగిందని పవన్ అన్నారు. చంద్రబాబు తనకు చాలా గౌరవం ఇస్తున్నారని, కలిసే పని చేస్తామని కూడా పవన్ అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అలాగే కలిసి ఉండాలని, చిన్ని, చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అన్నారు. తను కోరిన విధంగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పవన్ ఈ మాట చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబుపై నిజంగానే అంత నమ్మకం ఉంటే నాగబాబు పదవి గురించి ఎందుకు లిఖిత పూర్వక హామీ తీసుకున్నారో కూడా చెప్పగలగాలి. విభజన నాటి నుంచి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారట పవన్. మరి 2018లో చంద్రబాబుతో విడిపోయి, వేరే కూటమి ఎందుకు పెట్టుకున్నారు? అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లు అత్యంత అవినీతిపరులని గుంటూరులో సభ పెట్టి మరీ గొంతు అరిగేలా చెప్పింది పవన్ కళ్యాణే కదా? ఈ విషయంలో ఈయన కచ్చితంగా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు.చంద్రబాబు కూడా ఎవరినైనా పొగడగలరు.. తేడా వస్తే అంతకన్నా తీవ్రంగా తిట్టగలరు. పరిస్థితి బాగోలేదనుకుంటే తగ్గిపోయి ఎంతకైనా పొగడుతారు. ప్రధాని నరేంద్ర మోడీని గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించింది.. దూషణలు చేసింది.. గుర్తు చేసుకోండి. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. టీడీపీ ఓటమి తర్వాత పూర్తిగా రివర్స్ లో మోడి అంత గొప్పవాడు లేడని మెచ్చుకున్నది కూడా ఆయనే. పవన్ ఇప్పుడు అదే దారిలో ఉన్నారు. లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకే చంద్రబాబు మరో పాతికేళ్లు అధికారంలో ఉండాలని పవన్ అభిలషిస్తున్నట్లు ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.ఇంతకుముందు మరో సదేళ్లు సీఎంగా ఉండాలని చెప్పిన ఈయన ఈసారి పాతికేళ్లు అని అంటున్నారు. అప్పటికి చంద్రబాబుకు 99 ఏళ్లు వస్తాయి. అంటే పవన్ తాను సి.ఎమ్. కావాలన్న ఆశను వదలుకున్నట్లేనా? ఇది వ్యూహాత్మక వ్యాఖ్యా? లేక టీడీపీతో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భయపడుతున్నారా? ఇది అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరోమారు తెరపైకి అమృత్సర్..
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగిన దాడిలో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి తర్వాత గోల్డెన్ టెంపుల్ భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే పలువురు స్వర్ణదేవాలయ ఘన చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.తాజ్‌మహల్ తరువాత..భారతదేశంలోని పంజాబ్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకునివున్న నగరం అమృత్సర్. దీనిని సిక్కులు అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. టూరిజం డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం.. యూపీలోని తాజ్‌మహల్ తర్వాత పర్యాటకులు అమితంగా ఇష్టపడే నగరం అమృత్సర్. ఇక్కడి గోల్డెన్ టెంపుల్ కారణంగా అమృత్సర్ పేరు అగ్రస్థానంలో నిలిచింది. గోల్డెన్ టెంపుల్‌ను స్వర్ణదేవాలయం అని కూడా అంటారు.రామాయణ కాలంలో..ఇప్పడు అమృతసర్ ఉంటున్న ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదట. శ్రీరాముని కుమారులు లువుడు, కుశుడు ఇక్కడే బస చేశారట. వాల్మీకి ఆశ్రమం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని రామతీర్థంగా కూడా పిలుస్తారు.గురు నానక్ దేవ్ ముచ్చటపడి..సిక్కుల గురువు గురు నానక్ దేవ్ ఈ ప్రదేశంలోని అందానికి ముచ్చటపడి, ఇక్కడి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారట. దీని ఆనవాలు ఇప్పుటికీ కనిపిస్తుంది. అమృత్‌సర్‌కు సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. సిక్కుల నాల్గవ గురువు గురు రాందాస్ 1564ఏడీలో ఈ నగరానికి పునాది వేశారని చెబుతారు. నాడు అతని పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని రాందాస్పూర్ అని పిలిచేవారట. ఆ తర్వాత క్రీ.శ.1577లో ఇక్కడ గురుద్వారా నిర్మాణానికి హరిమందర్ సాహిబ్‌కు పునాది వేశారు. ఈ గురుద్వారాలో ఒక సరస్సు కూడా నిర్మితమయ్యింది. ఈ గురుద్వారా నిర్మాణంతో అమృత్సర్ నగరం సిక్కు మతస్తులకు కేంద్రంగా మారింది.బ్రిటిష్ పాలకుల అరాచకం1849లో అమృత్సర్ను బ్రిటిష్ పాలకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమృత్సర్ చరిత్రలో జలియన్‌వాలాబాగ్ మారణకాండను అత్యంత బాధాకరమైన సంఘటనగా చెబుతారు. 1919, ఏప్రిల్ 13న ఈ ప్రాంతంలో సమావేశమైన వందలాది మంది నిరాయుధులపై బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వెయ్యమంది మృతి చెందారు. ఇక్కడి పార్కు గోడలపై నేటికీ అప్పటి ఆనవాళ్లు కనిపిస్తాయి. అమృత్సర్ నగరంలో జరిగిన ఈ ఘటన చరిత్రలోనే అత్యంత బాధాకరమైన ఉదంతంగా చెబుతారు. ఇదిలావుండగా అమృత్‌సర్‌లో హోలా మొహల్లా, లోహ్రీ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అమృత్‌సర్‌లో ని గోల్డెన్ టెంపుల్, దుర్గా టెంపుల్, వాఘా సరిహద్దు, జలియన్‌వాలా బాగ్, గోవింద్ఘర్ కోట, విభజన మ్యూజియంలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం.. షిండే ఏమన్నారంటే?
ముంబై : మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలనే యోచనలో మహాయుతి కూటమి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఆ చర్చల్లో నిజమెంత? అనే దానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సి ఉంది. మరోవైపు, శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ వస్తున్న వార్తపై ఏక్నాథ్ షిండే స్పందించారు. ‘ఇలాంటి చర్చలన్నీ మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. మహాయుతి కూటమిలో పదవులపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. #WATCH | Satara: Maharashtra caretaker CM Eknath Shinde says, "I am doing good now. I had come here to rest after the hectic election schedule... I did not take any leave during my 2.5 years as the CM. People are still here to meet me. This is why I fell ill... This government… pic.twitter.com/YYa8p7Sh1y— ANI (@ANI) December 1, 2024ఎన్నికల ఫలితాల అనంతరం, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్ షాత్‌తో నేను (ఏక్‌నాథ్‌షిండే), అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యాం. ముంబైలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ సమావేశంలో అన్నీ విషయాలపై కులంకషంగా చర్చిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు మేం జవాబుదారీగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, మహాయుతి పెద్దలు తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏక్నాథ్ షిండే ఖండించారు. తీవ్ర జ్వరంతో సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఉన్న షిండే మీడియాతో మాట్లాడుతూ.. నిర్విరామంగా ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురయ్యా. అందుకే మా స్వగ్రామం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నా. నా ఆరోగ్యం బాగుంది. ఇక మహరాష్ట్ర సీఎం ఎవరు? అని అంటారా. సోమవారం మహాయుతి పెద్దలే స్పష్టత ఇస్తారు’ అని స్పష్టం చేశారు. -
Maharashtra: ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. కుదిరిన ఒప్పందం?
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. మహాయుతిలో సీఎం పదవికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. తాజాగా జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. అయినప్పటికీ షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎం ఏక్నాథ్ షిండేనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లాడ్లీ బహనా యోజనను సీఎం ఏక్నాథ్ షిండే ప్రారంభించారని, ఇది మహాయుతికి లబ్ధి చేకూర్చిందని వారు చెబుతున్నారు.ఏక్నాథ్ షిండే సీఎం అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లోనూ, ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని షిండే క్యాంపు అభిప్రాయపడింది. అయితే బీజేపీకి అత్యధిక సీట్లు దక్కినందున దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.కాగా మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఫడ్నవీస్‌ను సీఎం చేయడానికి మహాయుతిలోని అజిత్ గ్రూపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని భావిస్తున్నారు.ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి కీలక పోర్ట్‌ఫోలియోలు ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం జరగనుంది.ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్‌గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.‘ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.తెలంగాణ వైపు దేశం చూపు..బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది..బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు. -
ఝాన్సీ ఆసుపత్రి విషాదం.. డిప్యూటీ సీఎంకి వీఐపీ వెలకమ్
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి పది మంది నవజాత శిశువులు సజీవదహనమవ్వడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఈ విషాదం వేళ ఆస్పత్రికి వర్గాలు వ్యవహరించిన తీరుపై విమర్శలకు దారితీసింది. ఝాన్సీ ఆసుపత్రికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వస్తున్నారని తెలిసి... ఆయన రాక ముందే సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి, సున్నం చల్లడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది.ఓవైపు అగ్నిప్రమాదంలో చిన్నారులు మృత్యువాత పడి.. వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు రోడ్లు శుభ్రం చేసి, సున్నం చల్లుతున్నారంటూ కాంగ్రెస్ మండిపింది. . అప్పటి వరకు మురికి కూపంలా ఉన్న ఆస్పత్రి ఆవరణను డిప్యూటీ సీఎం రాక వేళ శుభ్రం చేశారని స్థానికులు తెలిపినట్లు పేర్కొంది. మంటల్లో చిన్నారులు చనిపోతే.. ఈ ప్రభుత్వం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ఇది సిగ్గుచేటని మండిపడింది.BJP सरकार की संवेदनहीनता देखिए।एक ओर बच्चे जलकर मर गए, उनके परिवार रो रहे थे, बिलख रहे थे। दूसरी तरफ, डिप्टी CM के स्वागत के लिए सड़क पर चूने का छिड़काव हो रहा था।परिजनों का यहां तक कहना है कि पूरे कम्पाउंड में गंदगी फ़ैली हुई थी, जो डिप्टी CM के आने से पहले ही साफ की गई।… pic.twitter.com/M1sk8SAa0E— Congress (@INCIndia) November 16, 2024యూపీలోని ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి, నిర్లక్ష్యానికి నిలయాలుగా మారాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. చిన్నారులను రక్షించడానికి ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఆరోపించింది. ప్రజలు చనిపోతున్నా ఆ పార్టీకి ఏమీ పట్టదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్ విమర్శించారు. కాగా ఆసుపత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటల వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితేవిద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఈ దుర్ఘటనలో పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే మంటలు చెలరేగిన వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు కనిపించడంతో పాటు సేఫ్టీ అలారాలు కూడా మోగలేదు. 2020లో ఎక్స్టింగ్విషర్ల గడువు ముగిసినట్లు గుర్తించారు. -
తస్సుమనిపించిన పవన్ ఢిల్లీ పర్యటన!
న్యూఢిల్లీ, సాక్షి: హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. గంట గడవక ముందే తిరుగుపయనం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అని చెప్పి హడావిడి చేసి.. కేవలం 10-15 నిమిషాలపాటే ఆయనతో చర్చించారు. తీరా బయటకు వచ్చాక ‘జరిగింది మర్యాదపూర్వక భేటీ’ అని స్టేట్మెంట్ ఇచ్చి తుస్సుమనిపించారు.ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ అగ్రనేతతో, అందునా హోం మంత్రితో పవన్ కల్యాణ్ భేటీ అవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుకు.. రెండ్రోజుల కిందట పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని, పోలీసులు పదే పదే చెప్పించుకుంటున్నారని, హోం మంత్రి అనిత కూడా బాధ్యతయుతంగా ఉండాలని.. లేనిపక్షంలో తప్పుకోవాలని హెచ్చరించారు. అలాగే.. తాను హోం మంత్రి పదవి తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని వ్యాఖ్యానించారు.దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి పార్టీల నడుమ నిజంగానే ఏదైనా జరుగుతోందా? లేదంటే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామానా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈలోపే.. పవన్ ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతుండడంపై అనేక కోణాల్లో చర్చ నడిచింది. పవన్ తాజా వ్యాఖ్యలే ప్రధానాంశంగా ఈ భేటీ ఉండొచ్చనే కోణమూ అందులో ఉంది. కానీ, వాటన్నింటిని పటాపంచల్ చేస్తూ.. మర్యాదపూర్వక భేటీ అని చెప్పి తుస్సుమనిపించారు. దీంతో ఇది కూడా డ్రామానేనా? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంతేకాదు డిప్యూటీ సీఎం హోదాలో తన తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రజాధనాన్ని పవన్ ఇలా వృథా చేశారన్నమాట. -
మా మాటే పవన్ చెప్పారు: అంబటి రాంబాబు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కల్యాణ్, ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టగలిగారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వ్యాఖ్యలు, సరస్వతి పవర్ భూముల్లో పర్యటన పరిణామాలపై అంబటి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని పవన్ కల్యాణ్ అన్నారు. మేం మొదటి నుంచి అదే కదా చెబుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారు. పాలన చేతకాక పవన్ ఇలా తప్పించుకుంటున్నారు. ఐదు నెలల తర్వాత పోలీసులు విఫలమయ్యారంటే మీకు పాలన చేతకాదని అర్థం. అసలు అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నారు. పిఠాపురంలో కూటమి నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ ఏం చేశారు?. పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్ట్ చేశారు. పైగా ప్రశ్నిస్తే.. డైవర్షన్ పాలిటిక్సా? అని పవన్‌పై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ముందే అనిత హోం మంత్రి, వెనకాల నారా లోకేష్ అన్ని ట్రాన్స్ఫర్లు చేస్తారు అని ఎద్దేవా చేశారాయన. అలాగే.. గతంలో ఇదే పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. ‘‘ఏపీలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని వైఎస్సార్సీపీ హయాంలో పవన్ అన్నారు. మరి మిస్సైన వాళ్లలో ఒక్కరి జాడ అయినా కూటమి ప్రభుత్వం కనిపెట్టిందా?’’ అని అంబటి ప్రశ్నించారు. సరస్వతి పవర్ భూములు చట్టం ప్రకారం కొనుగోలు చేసినవి. అలాంటిది మీకు ఏ హక్కు ఉందని అక్కడికి వెళ్లారు. సరస్వతి భూముల వ్యవహారం ఇప్పుడు కొత్తదా? అని పవన్‌ను ప్రశ్నించారు అంబటి. ఇదీ చదవండి: నేరస్తులే అప్డేట్ అయ్యి తప్పించుకుంటున్నారు: హోం మంత్రి అనిత -
సోఫా, ఏసీ, ట్యాప్‌లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఆరోపణలు
రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్‌లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. -
భట్టి ఇంట్లో చోరీ నిందితుల రిమాండ్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంట్లో నగదు, నగల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్ కొంతకాలంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో పని చేస్తున్నాడు. ఇటీవల భట్టి అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఇంట్లోని బెడ్రూంలోని రోషన్ మండల్ అల్మరా తాళాలు పగులగొట్టి రూ.2.50 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసి తన స్నేహితులు ఉదయ్‌కుమార్ మండల్, కృష్ణ, సంజులతో కలిసి ఉడాయించాడు. గత నెల 24న సాయంత్రం చోరీ చేసిన నగదు, వస్తువులతో ఉదయ్‌కుమార్, సంజు, కృష్ణలతో కలిసి నాంపల్లి దాకా ఆటోలో వెళ్లి అక్కడి నుంచి రైలులో ఘట్కేసర్ వెళ్లారు. ఘట్కేసర్లో రైలెక్కి కాజీపేటలో దిగి అక్కడ మళ్లీ విజయవాడ రైలెక్కారు. విజయవాడ నుంచి విశాఖలో రైలు దిగి అక్కడి నుంచి బిహార్ ఖరగ్‌పూర్ రైలెక్కారు. గత నెల 26వ తేదీ ఉదయం ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో దిగిన వీరు అనుమానాస్పదంగా సంచరించడంతో అక్కడి రైల్వే పోలీసులు గుర్తించారు. కృష్ణ, సంజు అక్కడి నుంచి పారిపోగా.. ప్రధాన నిందితుడు రోషన్ కుమార్, ఉదయ్‌కుమార్‌లు పట్టుబడ్డారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ రాంబాబు బృందం ఖరగ్‌పూర్ వెళ్లి పీటీ వారెంట్ వేసి నిందితులను నగరానికి తీసుకువచ్చి శనివారం నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. నిందితులిద్దరికీ 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్ కల్యాణ్‌కు మరోసారి కౌంటర్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. నిన్న తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి పవన్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో స్పందించారు. 'మీరు సనాతన ధర్మ పరిరక్షణలో ఉండండి.. సమాజ రక్షణలో మేముంటాం'.. జస్ట్ ఆస్కింగ్.. ఆల్ ది బెస్ట్' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.(ఇది చదవండి: పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న)కాగా.. తిరుపతి లడ్డు వ్యవహారం మొదలైనప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ వరుస పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతకుముందే కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి అంటూ ఘూటుగా ఇచ్చిపడేశారు. నిన్న తిరుమల డిప్యూటీ సీఎం పవన్.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మాన్ని కాపాడాతానంటూ ఆవేశంగా మాట్లాడారు. దీంతో ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్‌కు చురకలంటించారు. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్. 🙏🏿🙏🏿🙏🏿 All the Best #justasking— Prakash Raj (@prakashraaj) October 4, 2024 -
ఉదయనిధికి ప్రమోషన్ అందుకే: స్టాలిన్ వివరణ
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు. డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రి వర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు సీఎం స్టాలిన్. డిప్యూటీ సీఎంగా ఉదయనిది స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజ్ భవన్లో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురి మంత్రుల శాఖల్ని మార్చారు సీఎం స్టాలిన్. ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రిపదవి దక్కింది. 👉 చదవండి : చంద్రబాబు పొలిటికల్ జాదు -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ.. నిందితులు అరెస్ట్
-
డిప్యూటీ సీఎంగా పగ్గాలు.. స్పందించిన ఉదయనిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై తాజాగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని మరోసారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ..ఈ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం. మీరు.(మీడియాను ఉద్ధేశిస్తూ..) నిర్ణయం తీసుకోకూడదు. మంత్రులందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని అడగండి. ఇది సీఎం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం’ అని ఉదయనిధి పేర్కొన్నారు.అయితే ఈ పుకార్లను ఉదయనిధి కొట్టిపారేయడం తొలిసారి కాదు. గతంలోనూ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తన వరకు యువజన విభాగం కార్యదర్శి పదవి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.చదవండి :జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లుకాగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.ఇక ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. -
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్: భట్టి విక్రమార్క
సాక్షి,పెద్దపల్లిజిల్లా: రామగుండంలో 800 మెగావాట్ల జెన్కో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం(ఆగస్టు31) భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జెన్కో పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో సింగరేణి సంస్థ, జెన్కో సహకారంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న పాత ప్లాంటు 50 ఏళ్లుగా రాష్ట్రానికి వెలుగులు ఇచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వంలో ప్లాంటు ప్రారంభించి మాట నిలబెట్టుకుంటా. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తాం’అని భట్టి తెలిపారు. -
ఉదయనిధి ప్రమోషన్‌పై స్టాలిన్ క్లారిటీ
చెన్నై: తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు డిప్యూటీ సీఎం చేసేందుకు ఇంకా టైమ్ రాలేదని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో డిమాండ్ మాత్రం గట్టిగా ఉందని చెప్పారు. ఈ విషయమై సోమవారం(ఆగస్టు5) స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు సరైన సమయం రావాల్సి ఉందన్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా, యువజన సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాల అమలు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
‘రైతు భరోసా’పై దృఢ సంకల్పంతో ఉన్నాం: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం: రైతు భరోసా పథకంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతుల నుంచి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ రైతులు 10 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులు సూచించారు.బీడు భూములు, పంట సాగు చేయని వారికి ఇవ్వొద్దని సూచించారు.. ఇదే సందర్భంలో కౌలు రైతులకు సాగు చేయడానికి ఇచ్చిన పట్టా భూములు ఉన్న రైతులు అంగీకరణ పాత్రలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడగగా రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మీము ఇవ్వడానికి సిద్ధంగా లేమని పట్టా భూములు ఉన్న రైతులు తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని మంత్రులకు సూచించారు. కౌలు రైతుల విషయంలో మాత్రం మంత్రుల సబ్ కమిటీ సమావేశం లో ఎటువంటి క్లారిటీ రాలేదు.రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతి కి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా హామీ ఇచ్చిందని.. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ నియామకం చేసింది.ఈ సబ్ కమిటీలో తాను, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరావు దుద్దిల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నాము.. రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు.ఇది పేదోడి ప్రభుత్వం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిఇది పేదోడి ప్రభుత్వం.. ఓపెన్ గా డిబెట్ చేసి రైతుల నుంచి వివరాలు తీసుకోవాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని జిల్లా లో సబ్ కమిటీ పర్యటించి వివరాలు సేకరిస్తుంది. మా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొం. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయి. ప్రతి పక్ష బీఆర్ ఎస్ ఇష్టానుసరంగా మాట్లాడుతుంది.. రైతుల ప్రభుత్వం ఎవరిదో త్వరలో రైతులే చెబుతారన్నారు. -
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
జగిత్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో గట్టుకు చేరుకున్న ఆయనకు.. ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు. పవన్‌కు కొండగట్టు ఆలయం మొదటి నుంచి ఒక సెంటిమెంట్‌గా ఉంది. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకు ముందు తుర్కపల్లి దగ్గర బీజేపీ-జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ సమయంలో కారుపైకి అభివాదం చేసిన ఆయన.. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
టాలీవుడ్ నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ (ఫోటోలు)
-
బొగ్గు గనుల వేలం ప్రకటనను వెంటనే ఆపేయాలి: భట్టి
సాక్షి, ఖమ్మం: బొగ్గు గనుల ప్రైవేట్ పరంపై బీజేపీ బిల్ పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేసి మద్దతు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బిల్‌కు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు బావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకుని వచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు.బొగ్గు బావులు వేలంలో పక్క వాళ్లకు వెళ్లకుండా అడ్డుకోలేకపోయిన బీఆర్ఎస్.. గోదావరి లోయలోని బొగ్గుగనులు తీసుకోవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.. తమ అనుచర కాంట్రాక్టర్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ వల్లనే రెండు బొగ్గు గనుల ప్రభుత్వానికి రాకుండా పోయాయి’’ అని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.తెలంగాణ మీద ప్రేమ వున్నట్లు గా మాట్లాడుతున్న బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి.. శ్రావణపల్లి బొగ్గు వేలం కాకుండా చూడాలి.. తెలంగాణ ఆస్తులను కాపాడాలి. అన్ని పార్టీల తో కలసి ప్రధాన మంత్రి వద్దకు వెళ్తాం. తెలంగాణను పదేళ్లు నాశనం చేసిన బీఆర్ఎస్ ఇంకా అలానే వ్యవహరించాలని చూస్తుంది. సింగరేణి వేలంపై కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. -
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్
అమరావతి, సాక్షి: జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలోని క్యాంప్ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య.. అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి&గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారన్నది తెలిసిందే.డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ రెండు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకం, ఉద్యాన వన పనులకు నిధులు మంజూరు ఫైల్ మీద తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయితీ భవనాల నిర్మాణాల ఫైల్‌పై రెండో సంతకం చేశారాయన. బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు పలువురు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు క్యాంప్ కార్యాలయం వద్ద పవన్‌కి గౌరవ వందనం లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పవన్ ఇవాళంతా బిజి బిజీగా గడపనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గ్రూప్-1, 2 అధికారులతో సమావేశం.. ఆపై పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీస్‌లోనే పవన్ బస చేయనున్నట్లు సమాచారం. -
డిప్యూటీ సీఎం పవన్ ఛాంబర్
-
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు
-
ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్?
అమరావతి, సాక్షి: మంత్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?.. ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్‌తో పాటు నారా లోకేష్‌కు, అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్‌కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్‌కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చంద్రబాబు కేబినెట్.. తెరపైకి కొత్త ఈక్వేషన్లు!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్‌కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్‌ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది. ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్‌తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠమరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది. -
ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది.అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారని సదరు వెబ్సైట్ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం. డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్ ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్‌కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్‌తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట. మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్‌ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది. -
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ !
-
సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. రైలులో మొదలై..
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుశీల్ మోదీ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఆయన లవ్ స్టోరీ. తొలి చూపులోనే జెస్సీతో ప్రేమలో పడిన ఆయన దానిని పెళ్లి వరకూ ఎలా తీసుకువెళ్లారంటే..సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ల ప్రేమ కథ సినిమాను తలపిస్తుంది. రైలు ప్రయాణంలో తొలిసారిగా సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ ఒకరినొకరు చూసుకున్నారు. తరువాత మాట్లాడుకున్నారు. తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. కలిసి జీవించాలనుకుని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారుంటున్న పరిస్థితుల్లో వారికి సంప్రదాయాల అడ్డుగోడ దాటడం చాలా కష్టంగా మారింది.ఆ సమయంలో సుశీల్ మోదీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో సభ్యునిగా ఉండేవారు. అయితే జెస్సీ జార్జ్ రాజకీయాలకు దూరంగా మెలిగేవారు. ఆమె కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. దీంతో విరిద్దరి మధ్య భాషతో పాటు మతపరమైన అడ్డంకి కూడా ఉంది. అయినా సుశీల్ మోదీ జెస్సీ జార్జ్ల ప్రేమ కథ విజయవంతంగా ముందుకు సాగింది.40 ఏళ్ల క్రితం నాటి వీరి ప్రేమ కథ గురించి సుశీల్ మోదీ స్నేహితుడు సరయూ రాయ్ ఒకప్పుడు మీడియాకు తెలిపారు. విద్యార్థి పరిషత్ పనుల మీద సుశీల్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో ఆయన జెస్సీని రైలులో కలుసుకున్నారు. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల సభ్యులకు తెలియగానే వారు కోపంతో రగిలిపోయారు. అయితే ఆ జంట తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.చివరికి పెద్దలు ఒప్పుకోవడంతో సుశీల్ మోదీ, జెస్సీలు 1987లో వివాహం చేసుకున్నారు. నాడు బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి వారి వివాహానికి హాజరయ్యారు. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 1990లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సుశీల్ మోదీ గెలుపొందారు. సుశీల్ మోదీ రాజకీయాల్లో కొనసాగగా, జెస్సీ జార్జ్ మోదీ లెక్చరర్‌గా పనిచేశారు. -
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు: చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజమ్మపురం, శ్రీకావేరిరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 99.5 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్‌తో కలసి ఐదేళ్లలోమొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలకు మేలు చేశామనే పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగం పడ్డారని విమర్శించారు.అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షులు షరి్మల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనామళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు, సింగిల్‌విండో చైర్మన్ గాలి జ్యోతి, వైస్ ఎంపీపీ శేఖర్ యాద్, పార్టీ మండల కన్వీనర్ తులసియాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్భళగన్, సినీ నిర్మాత షణ్ముగం, ఆర్బీకే చైర్మన్ పోలయ్య, పుత్తూరు మార్కెట్ డైరెక్టర్ రమాదేవి, కో–ఆప్షన్ మెంబర్ వేలు, సర్పంచ్ గాలి మహేష్ బాబు, అయ్యప్ప, నరసింహరాజు, భాష్కర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పుత్తూరు కేశవరెడ్డి, మురళి, నరసింహన్, ప్రేమ్‌కుమార్, ఆనందన్, ప్రకాశ్, కుమార్, చంద్రశేఖర్‌రాజు, షణ్ముగరెడ్డి, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, శరవణన్, కుట్టి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, రాజామణి, అరుల్, బాబు, మనోహర్, దనంజయన్, వాసురాజు, కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షణ్ముగం పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం వాహనాన్ని ఆపిన సీపీ..
మహేశ్వరం: తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనమని.. సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని తెలిసింది. పైగా డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చేయి చేసుకున్నారని..అతడి జేబులోని ఐడీ కార్డును లా క్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం. అరగంట తర్వాత తిరిగి ఆ డ్రైవర్‌ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను చిత్రీ కరిస్తున్న వీడియోగ్రాఫర్, ఇతరుల సెల్ఫోన్లను పోలీసులు లాక్కుని, చేయిచేసుకున్నట్టు తెలిసింది. -
అరుణాచల్‌లో 10 ఏకగ్రీవాలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు. దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది. -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంట విషాదం నెలకొన్నది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వరరావు(70) కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని ఖమ్మం జిల్లా వైరాకు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోదరుడి మరణవార్త తెలియగానే భట్టి విక్రమార్క తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి వైరాకు ఆయన వెళ్లనున్నారు. -
డిప్యూటీ సీఎం పదవులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం పదవులపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ డిప్యూటీసీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ‘కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. మంత్రి వర్గంలోని సీనియర్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి లేదా సంకీర్ణంలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి డిప్యూటీ సీఎంలను అపాయింట్ చేస్తున్నారు. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రి వర్గంలో ఒక మంత్రే. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగంలోని ఏ నిబంధనను ఉల్లంఘించడం లేదు’అని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్ -
టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్
-
బీజేపీతో పొత్తు ?..యాంకర్ ప్రశ్నకు డిప్యూటీ సీఎం సూపర్ రిప్లై
-
సాహిత్యం వల్ల టూరిజం అభివృద్ధి
జైపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వల్ల రాజస్థాన్ టూరిజంకు గణనీయమైన మేలు జరగడమే కాకుండా జైపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. జైపూర్‌లో గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తూ ఈ సాహిత్య వేడుక వల్ల ఎంత మంది ప్రముఖులు వచ్చి వెళతారో మిగతా సంవత్సరమంతా అంతమంది ప్రముఖులు వచ్చి వెళతారని ఆమె అన్నారు. భారీ సాహిత్య ఉత్సవాల వల్ల ప్రాంతీయ నగరాలకు గుర్తింపు, టూరిజం కార్యకలాపాల పెరుగుదల జరుగుతుందని తెలిపారు. కాగా, జైపూర్‌లోని క్లార్క్ హోటల్లో విశేష సంఖ్యలో సాహితీ ప్రేమికుల మధ్య ఐదురోజుల లిటరేచర్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుక కోసం తరలి వచ్చారు. వీరిలో ముగ్గురు బుకర్‌ప్రైజ్ విజేతలు, ఐదుగురు పులిట్జర్ ప్రైజ్ విజేతలు ఉన్నారు. ఇతర భారతీయ భాషల సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. కాగా తెలుగు నుంచి కేవలం ఒకే ఒక స్పీకర్‌గా పరకాల ప్రభాకర్‌కు ఆహ్వానం అందింది. అది కూడా సాహిత్యాంశ కాకుండా రాజకీయాంశ మీద ఆయన మాట్లాడతారు. తెలుగులో మంచి సాహిత్యం ఉన్నా ఇంగ్లిష్ పాఠకులకు అనువాదాల ద్వారా తగినంతగా అందకపోవడం వల్లే ప్రతిసారీ ఈ ఉత్సవంలో చోటు దొరకడం లేదు. -
Bihar: కొత్త డిప్యూటీ సీఎం తలపాగ వెనుక ఆసక్తికర కథ
పాట్నా: బిహార్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన సామ్రాట్ చౌదరి కాషాయ తలపాగా వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. గతంలో నితీశ్ బీజేపీని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సామ్రాట్ ఒక శపథం చేశారు. నితీశ్ కుమార్‌ను గద్దె దించిన తర్వాతే తాను తలపాగా తీస్తానని ప్రతిన పూనారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నితీశ్ తాజాగా బిహార్‌లో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో మీడియా ప్రతినిధులు సామ్రాట్‌కు తన తలపాగాపై ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సామ్రాట్ బీజేపీ తనకు రెండో తల్లిలాంటిదని, అయోధ్యకు వెళ్లినపుడు రాముడిని దర్శించుకునేందుకు తల వంచేందుకు వీలుగా తలపాగా తీసేస్తానని సామ్రాట్ నర్మగర్భంగా సమాధానిమిచ్చారు. సామ్రాట్ 2018లో నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూను వీడి బీజేపీలో చేరడం గమనార్హం. मुरेठा खोलने पर सम्राट बोले : मुरेठा के सम्मान में अगर मुझे अयोध्या जाकर सिर मुड़वाना पड़े तो मैं तैयार हूं#BiharCM #Bihar #BiharNews #BJP #SamratChaudhary @RJDforIndia @RohiniAcharya2 pic.twitter.com/bBOmAsDXiQ — FirstBiharJharkhand (@firstbiharnews) January 29, 2024 ఇదీచదవండి.. మోదీ మళ్లీ పీఎం అయితే.. ఖర్గే కీలక వ్యాఖ్యలు -
ప్రవాసీయుల సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్!
సౌదీలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మొత్తం భారతదేశంలోకెల్లా ఎక్కువగా ప్రవాసీయుల సంక్షేమానికి వైఎస్ జగన్ సర్కారే పెద్ద పీఠం వేస్తుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పెర్కోన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా భీమా పథకం విజయవంతంగా అమలవుతుందని తద్వారా అకాల మరణం పాలైన అనేక మంది ఆభాగ్యులకు ఆపన్నహస్తం లభిస్తుందని ఆయన అన్నారు. మక్కా యాత్రకు వచ్చిన అంజద్ బాషా జెద్ధాలో తనను కలిసిన ప్రవాసీయులను, సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) ప్రతినిధులతో మాట్లాడుతూ.. దేశంలో ఆదర్శవంతంగా ప్రచారంలో ఉన్న కేరళ రాష్ట్రం కంటె కూడ మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఏపీ ఎన్నార్టీ సంస్ధ పని చేస్తుందని అన్నారు. కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలలో ఏపీ ఎన్నార్టీ సంస్ధ చురుక్కుగా ఉందని ఆయన అన్నారు. విదేశాలలో తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండాలని, ఇక్కడ కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగుతనంతో కలుపుకోలుగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కుల,మత, ప్రాంతీయ విబేధాలకు అతీతంగా ఇక్కడ తెలుగువారు కలిసిఉండి, భారతీయ ప్రతిష్ఠను పెంపొందించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో సాటా పని తీరును వివరించగా ఆయన వారిని అభినందించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శివ సైమన్ పీటర్, రాంబాబు, శాంతి, శ్రీమతి నాగరాజు, ఫైజ్, ఖాదర్ వలీలు ఉన్నారు. తన పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సౌదీలోని దక్షిణ ప్రాంతంలోని ఆభాలో సాటా అధ్వర్యంలో జరిగిన భారతీయ సమ్మేళాన్ని కూడా వీడియో కాల్ ద్వారా సంబోధించారు. (చదవండి: యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం) -
కాంగ్రెస్ పార్టీలో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలు..!
కర్ణాటక: అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ బహుళ ఉప ముఖ్యమంత్రుల నియామకం కలకలం చెలరేగింది. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాపనుల శాఖామంత్రి సతీశ్ జార్కిహొళి నేతృత్వంలో కొందరు నేతలు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలు, లింగాయత సముదాయాలకు చెందిన ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా చేయాలని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నారు. గతంలో మంత్రి కేఎన్.రాజణ్ణతో పాటు పలువురు మంత్రులు ఈ విషయమై గట్టిగా మాట్లాడారు. రచ్చ అవుతుందని అనుకున్న హైకమాండ్ దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడరాదని హుకుం జారీచేసింది. దీంతో కొన్నాళ్లు డిప్యూటీ సీఎంల గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఓట్ల పేరుతో డిమాండ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ఇన్చార్జ్ రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్లను జార్కిహొళి, ఆయన బృందం కలుస్తారు. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని గట్టిగా కోరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమైన మూడు కులాల నేతలకు ఆ పదవులిస్తే లోక్‌సభ ఎన్నికల్లో దండిగా ఓట్లు రాబట్టవచ్చని వాదన వినిపించే అవకాశముంది. డీకే శివకుమార్‌కు చెక్ పెట్టే యత్నం ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి స్థానం కావాలని పట్టుబట్టిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. చివరకు డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు. అయితే తనను తప్ప ఎవరిని డిప్యూటీ సీఎం చేయరాదని ఆయన హైకమాండ్‌కు షరతు విధించారు. బెళగావి రాజకీయాల్లో డీకే.శివకుమార్ జోక్యం పెరిగిపోయిందని కోపోద్రిక్తుడైన సతీశ్ జార్కిహొళి.. డీకేశికి అడ్డుకట్టవేయాలని ముగ్గురు డీసీఎంల ప్రస్తావన తెచ్చారు. దీంతో డీకే జోరుకు బ్రేక్ వేయవచ్చునని జార్కిహొళితో పాటు సీఎం సిద్దరామయ్య వర్గం నేతలు భావిస్తున్నారు. -
Maharashtra: మంత్రికి కొవిడ్ పాజిటివ్
ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు కొవిడ్ సోనినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ అన్నారు. ‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్ ముండేకు కొవిడ్ పాజటివ్ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముండేకు కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని పవార్ తెలిపారు. ‘కొవిడ్ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లో నుంచి ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటున్నారు. అయితే మంత్రి ఆఫీసు సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయినప్పటికీ వారికి కొవిడ్ లక్షణాలు లేవు’ అని మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇదీచదవండి..బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్ -
యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచింది. అయితే తాజాగా కూడా అదే ఫార్ములా ప్రయోగించింది. రాజస్థాన్‌లో కేవలం మొదటిసారి గెలిచిన భజన్‌లాల్ శర్మను సీఎంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ప్రేమ్ చంద్ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్‌లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్‌రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి సీనియర్ నేతలతో పోటీపడ్డ దియా కుమారి.. డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది. ప్రస్తుతంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జైపూర్ మహారాజ కుటుంబంలో ఆమె 1971లో జన్మించారు. తాత మాన్ సింగ్-2 బ్రిటీష్ ఇండియా కాలంలో చివరి జైపూర్ మహారాజు. తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహిత. ఆయన 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మహారాణి గాయత్రీ దేవి పాఠశాల విద్య, జైపూర్‌లోని మహారాణి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసుకున్నారు. నరేంద్ర సింగ్‌ను వివాహం చేసుకున్న దియాకుమారికి.. ముగ్గురు పిల్లలు. ఆమె 2018లో నరేంద్ర సింగ్‌తో విడాకులు తీసుకుంది. రాజకీయం జీవితం.. రాజకీయలపై ఆసక్తితో దియాకుమారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారి గెలుపొందగానే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపోందారు. రాజకీయాలతో పాటు దియా కుమారి అనేక బిజినెస్ వెంచర్లు, రెండు స్కూల్స్, మ్యూజియం, ట్రస్టు, హోటల్, ఎన్జీఓలను నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తారు. పలు ఎన్జీఓ ద్వారా సేవ చేసినందుకు.. ఆమె ఇటీవల జైపూర్‌లోని అమిటీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 2023 రాజస్థాన్ అసెంబ్లీలో విధ్యాదర్నగర్లో నియోజకవర్గలో పోటీ చేసి 71,368 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ ఈ యువరాణి(దియా కుమారి) మహిళలకు భద్రతకు కృషి చేస్తానని, యూవతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కష్టాలను తీర్చుతానని ప్రచారంలో హామీలు ఇచ్చారు. చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ -
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, రమణ్ సింగ్‌కు స్పీకర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అరుణ్ సావో, విజయ్ శర్మల పేర్లను ఖరారు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. సీఎంగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. రాయ్‌పూర్‌లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు. 2003 నుంచి 2018 వరకు మూడు సార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నాయకుడు రమణ్ సింగ్‌ను స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి సహకారమందించిన మహిళలకు బీజేపీ మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో జరిగిన సమావేశంలో ఈ మూడు రాష్ట్రాల్లో మహిళలకు సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మూడు రాష్ట్రాల్లోనూ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎం పదవులు మహిళలకు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు మరింతగా రాజకీయ సాధికారత కల్పించేందుకు పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. మూడు రాష్ట్రాల్లోనూ డిప్యూటీ సీఎంలుగా మహిళలను నియమించడం ఖాయమని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ జనాభా పరంగా పెద్ద రాష్ట్రం కావడం, పలువురు సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో గెలుపొందిన కారణంగా ఇక్కడ ఇద్దరు మహిళలను డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో ఓబీసీ, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీ, రాజస్థాన్‌లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి దక్కడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ తోమర్‌ను, రాజస్థాన్‌లో కిరోరీ లాల్ మీనాను స్పీకర్‌గా ఎంపిక చేయాలనే అంశంపై చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే! -
భట్టికి డిప్యూటీ సీఎం+పీసీసీ పగ్గాలు?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నాయకుడిగా ఎంపిక చేసిన నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో ఆయన స్థానంలో కొత్త నేతను అధిష్టానం ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా సీఎల్పీ నాయకుడి ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన భట్టి ముందు అధిష్టానం ఓ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ కోరినట్టు సమాచారం. అయితే సీఎం పదవి కావాలని అధిష్టానం వద్ద పట్టుబట్టిన భట్టి, ఈ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదని చెబుతున్నారు. బీసీ కోటాలో పలువురి పేర్ల పరిశీలన! పీసీసీ చీఫ్ పదవిని భట్టి నిరాకరించిన పక్షంలో.. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, డిప్యూటీ సీఎం ఎస్సీ నేతకు ఇచ్చే పక్షంలో పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ఈ కోటాలో వినిపిస్తున్న మొదటి పేరు పొన్నం ప్రభాకర్. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రభాకర్.. అటు పార్టీకి, ఇటు గాంధీ కుటుంబానికి విధేయుడిగా గుర్తింపు పొందారు. ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేసిన పొన్నం ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో డి.శ్రీనివాస్ కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మంత్రిపదవి నిర్వహించడాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఈ ప్రతిపాదనపై చర్చ జరుపుతోందని తెలుస్తోంది. అది సాధ్యం కాని పక్షంలో మరో ఇద్దరు బీసీ నేతలు మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్‌ల పేర్లు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలను బట్టి సీనియర్ నేతలైన ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మైనార్టీ నేత షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మల్లురవిల పేర్లను కూడా హైకమాండ్ పరిశీలించే అవకాశముందనే చర్చ జరుగుతోంది. -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయ నిధి స్టాలిన్ సోమవారం 46వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే నినాదం తెర మీదకు వచ్చింది. డిసెంబరులో జరిగే యువజన మహానాడు అనంతరం ఆయనకు ప్రమోషన్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ జన్మదినాన్ని డీఎంకే యువజన విభాగం వాడవాడలా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయ నిధి అందుకున్నారు. అదే సమయంలో డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయ నిధి కోసం ఎంగల్ అన్న ( మా అన్న)పేరిట ఓ పాటల సీడీని సిద్ధం చేసింది. అలాగే ఉదయ నిధి నటించి విజయవంతమైన మామన్నన్ చిత్రంలోని ఓ పాట ఆధారంగా మరో ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. వీటిని మంత్రి అన్బిల్ మహేశ్ విడుదల చేశారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ నిధి సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. తండ్రి బాటలోనే.. తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా డీఎంకే రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా అధికార వ్యవహారాల్లో దూసుకెళ్లారు. తండ్రి మరణంతో డీఎంకే పగ్గాలు చేపట్టి ప్రస్తుతం సీఎంగా ద్రవిడ మోడల్ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తన వారసుడు ఉదయ నిధి స్టాలిన్‌ను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సినీ నటుడిగా డీఎంకే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి ప్రజాకర్షణలో ఫలితం సాధించారు. 2021 లోక్ సభ ఎన్నికలలో తండ్రి స్టాలిన్‌తో సమానంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించాలని పలువురు సినీయర్లు నినాదించడంతో క్రీడల శాఖను కేటాయించారు. ప్రస్తుతం డిప్యూటీ నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్(ఏడీఆర్)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారేనని పేర్కొంది. సుర్‌గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అంబికాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్ సింగ్ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్‌లో పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్‌నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది. ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు భట్గావ్ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్ ప్రసాద్ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్ ఛత్తీస్‌గఢ్ పార్టీకి చెందిన యశ్వంత్ కుమార్ నిషాద్ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ముంగేలి ఎస్సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌లో ఆజాద్ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్ జనతా పార్టీకే చెందిన ముకేశ్ కుమార్ చంద్రాకర్ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ తెలిపింది. సీఎం బఘేల్‌కు అత్యధిక ఆదాయం ఆప్ అభ్యర్థి విశాల్ కేల్కర్, కాంగ్రెస్ నేత, సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. కేల్కర్ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. 52 శాతం మంది 12వ తరగతిలోపే మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు. -
కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఇవాళ ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి: డిప్యూటీ సీఎం
-
పురందేశ్వరిపై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
-
చంద్రబాబు పేరు చెప్పగానే అవినీతి గుర్తొస్తుంది: డిప్యూటీ సీఎం
-
మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు
పట్నా: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసి, ప్రధాని మోదీ మహారాజు స్థానంలో ఉండాలనుకుంటున్నారని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. దర్భంగాలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ పట్టించుకోరన్నది వాస్తవమన్నారు. ఎన్నికల్లో గెలవడం, అధికారం నిలుపుకోవడం మాత్రమే మోదీ లక్ష్యమని తేజస్వి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి, మహారాజుగా మారాలన్నది మోదీ కోరికని పేర్కొన్నారు. కానీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి షాక్ తప్పదని ఆయన స్పష్టం చేశారు. -
మీరిప్పుడున్నది సముచిత స్థానం కానీ..
పుణే: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతలు ఆదివారం పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత మీరిప్పుడు సరైన స్థానంలో ఉన్నారు. కానీ, చాలా ఆలస్యమైంది’అని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్‌తో కలిసి నేను పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమమిది. ఈ సందర్భంగా ఆయనకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. చాలా కాలం తర్వాత ఆయన ఇప్పుడు సముచిత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఎప్పుడూ ఇదే స్థానంలోనే ఉండటం సబబు. కానీ, ఈ స్థానంలోకి ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. నెల క్రితం ఎన్సీపీనీ చీల్చిన అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు ఆయన వర్గానికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
-
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
-
రూ.12 కోట్లు దాటిన అన్ని ఆలయాలు ఇక ఆ కేటగిరి కిందకు..
-
పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
బాబును ప్రజలు నమ్మొదు..!
-
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు సీఎం జగన్ ఇచ్చారు: డిప్యూటీ సీఎం కొట్టు
-
YS Sharmila: డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
బెంగళూరు: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లిన ఆమె.. ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీని నడిపించినందుకుగానూ శివకుమార్‌ను పుష్ఫ గుచ్చం ఇచ్చి వైఎస్ షర్మిల అభినందించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ సారాంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ను విలీనం చేయాలంటూ సోనియా గాంధీ నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చిందన్న ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేశారు. కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని అందించనప్పటికీ డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగడంతోనే సరిపెట్టుకున్నారాయన. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితం కావాలంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ కుంపటిపై హస్తినలో హీట్ -
కర్ణాటక సీఎంగా సిద్ధూ ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు. జాతీయ నేతలు హాజరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్‌లు పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్ఎస్పీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు. -
అదే జరిగితే.. డీకేఎస్ సీఎం కావడం ఖాయం!
ఢిల్లీ: కర్ణాటక సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ పవర్ షేరింగ్ ఫార్ములా.. అంటే చెరో రెండున్నరేళ్లు(50:50 నిష్పత్తిలో) లేదంటే ఒకరు మూడు, మరొకరు రెండు ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం. ఆ గ్యాప్‌లో మరొకరికి డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పోర్ట్‌పోలియోలు అప్పజెప్పడం.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రూపొందించిన పవర్ షేరింగ్ ఫార్ములా ఇదేనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ సీఎం అయ్యే అవకాశం ఇంకా డీకే శివకుమార్‌కు దూరం కాలేదా?. ఆ ఛాన్స్ ఇంకా ఉందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పైకి పవర్ షేరింగ్ ఫార్ములాకు డీకేఎస్ అంగీకరించలేదని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆయన్ని షరతుల మీద అందుకు ఒప్పించే డిప్యూటీ సీఎం పదవి(పీసీసీ చీఫ్, 6 పోర్ట్పోలియోలుకూడా) కాంగ్రెస్ హైకమాండ్ కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్.. డీకే శివకుమార్‌కు ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 25 దక్కించుకోగా.. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. దీంతో.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం కోసం కృషి చేసి మెరుగైన ఫలితం ఇస్తే డీకే శివకుమార్‌ను కర్ణాటక సీఎం కుర్చీలో.. అదీ మిగతా రెండున్నరేళ్లు/ మూడేళ్ల కాలానికి కూర్చోబెడతామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీనికి శివకుమార్ సైతం అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ ఫార్ములాపై ఆయన ఏమన్నారంటే.. ‘‘పవర్ షేరింగ్ ఫార్ములాను నేను వెల్లడించలేను. మేమంతా కలిసి జరిపిన చర్చలను నేను బహిర్గతం చేయదలచుకోలేదు. ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దీనికి సమాధానం ఇస్తారు. ప్రస్తుతానికి నేను బాధపడటం లేదు. ప్రయాణం ఇంకా మిగిలి ఉంది అని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీపడ్డాను. కర్ణాటక ప్రజలకు మా నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తలవంచాల్సిందే. పార్టీ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా అని డీకేఎస్ చెబుతున్నారు. -
దళితుడ్ని డిప్యూటీ సీఎం చేయకపోతే తీవ్ర పరిణామాలు
బెంగళూరు: ఐదు రోజులపాటు అలుపెరగకుండా చర్చించింది. చివరకు.. కర్ణాటక ముఖ్యమంత్రి అంశం ఓ కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో కొత్త తలనొప్పులు సిద్ధం అవుతున్నాయా?. సామాజిక వర్గాల వారీగా పలు డిమాండ్లు తెర మీదకు రాబోతున్నాయా?.. కర్ణాటక సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననిపిస్తోంది. దళితుడ్ని గనుక డిప్యూటీ సీఎం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ హెచ్చరించారాయన. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర పార్టీ అధిష్టానానికి ముందస్తుగా ఈ హెచ్చరికలు పంపారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకకే శివకుమార్‌ను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించిన తరుణంలోనే.. పరమేశ్వర మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తానే ఏకైక సీఎంగా ఉండాలని శివకుమార్ పెట్టిన షరతును కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘శివకుమార్ కోణంలో ఆయన కోరింది సరైందే కావొచ్చు. కానీ, హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉండాలి. అదే మేం ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. డిప్యూటీ సీఎం పదవితోనే దళితులకు న్యాయం జరుగుతుందా? అని మీడియా ప్రశ్నించగా.. దళిత వర్గం భారీ అంచనాలు పెట్టుకోవడం సహజమే కదా అని పేర్కొన్నారు. ‘‘ఈ అంచనాలను అర్థం చేసుకుని.. మా నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే.. సాధారణంగానే ప్రతికూల స్పందన వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మేల్కొనే బదులు.. ఇప్పుడే ఆ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకుంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అదే అర్థం చేసుకోమని నేను హైకమాండ్‌ను కోరుతున్నా’’ అని పరమేశ్వర కాంగ్రెస్ అధిష్టానానికి సున్నితంగా హెచ్చరికలు పంపించారు. అలాగే.. తానూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను ఆశించిన వాళ్లలో ఉన్నట్లు చెబుతున్నారాయన. కానీ, హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కదా అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతానికి వాళ్లిద్దరి పోస్టులను ప్రకటించారు. చూద్దాం.. కేబినెట్ ఏర్పాటులో దళితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో’’ అని వ్యాఖ్యానించారాయన. దళిత సామాజిక వర్గానికి చెందిన 71 ఏళ్ల వయసున్న జి. పరమేశ్వర, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాదు.. సుదీర్ఘకాలం కర్ణాటక పీసీసీగా పని చేసిన రికార్డు కూడా(ఎనిమిది ఏళ్లు) ఈయన పేరిట ఉంది. 2013లో కేపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పరమేశ్వర.. ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకుంది ఈయన్నే. కానీ, ఓడిపోవడంతో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఆ తర్వాత పరమేశ్వరని ఎమ్మెల్సీని చేసి.. తన ప్రభుత్వంలో మంత్రిని చేశారు సిద్ధరామయ్య. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పరమేశ్వర కొరటగెరె స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇదీ చదవండి: డీకే శివకుమార్ నిజంగానే తలొగ్గాడా? -
ఈ నిర్ణయం కోర్టు తీర్పులాంటిది: డీకేఎస్
ఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం తనను ఎంపిక చేయడంపై డీకే శివకుమార్‌ను స్పందించారు. అధిష్టాన నిర్ణయం కోర్టు తీర్పులాంటిదని, కాబట్టి దానిని అంగీకరించక తప్పదని వ్యాఖ్యానించారు. ‘‘నిర్ణయాన్ని పూర్తిగా హైకమాండ్‌కు వదిలేశాం. అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని హైకమాండ్ భావించింది. కాబట్టి హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’’ అని శివకుమార్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐదు రోజుల సస్పెన్స్ తర్వాత.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను అధిష్టానం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వరకు శివకుమార్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: శివకుమార్‌ను ఒప్పించడంలో సోనియా కీ రోల్ -
మాకు వ్యతిరేకంగా కేంద్రం సీబీఐ, ఈడీని వాడుకుంటోంది: సిసోడియా
-
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
ఏపీని నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
పవన్ వల్ల ఓ సామాజికవర్గం ఆందోళన చెందుతోంది : డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు : ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
-
నకిలీ సంతకాలు పెట్టి జీతం తీసుకుంటున్న అధికారిపై సస్పెన్షన్ వేటు
లక్నో: ఆఫీస్‌కు వెళ్లకుండానే ఆరు నెలలుగా జీతం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారిపై వేటు వేశారు ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్. ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల అందరిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అమ్రోహా జిల్లాలో విధులు నిర్వహించే డా.ఇందు బాల శర్మ అనే అధికారిణి ఆర్నెళ్లుగా ఆఫీస్‌కు వెళ్లడం లేదు. కానీ రిజిస్టర్లో ఫేక్ సంతకాలు చేయించి జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయి తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం ఇప్పటికే డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించింది. జిల్లా అధికారులకు జీతాలు మంజూరు చేసే అధికారి సంతోష్ కుమార్‌పైనా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరు అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు -
Maharashtra: ‘వసూల్ రాజా’లకు ఫడ్నవీస్ వార్నింగ్
సాక్షి, ముంబై: మాతాడి ప్రాంతంలో వేతన జీవులనుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. నేవీముంబైలోని వేతన జీవులు ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్లో మాతాడి వర్కర్లు అంతర్భాగమని, వారి నుంచి ఇతరులెవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే మాతాడీ ప్రాంతంలో వేతన జీవులనుంచి వసూల్ రాజాలకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని, వారి వల్ల మాతాడీ ప్రాంతానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముంబైలోని వొర్లి–సెవ్రీ ఎలివేటెడ్ రోడ్ నిర్మాణంలో నిర్వాసితులైన వారి కష్టాలు వినేందుకు ఏక్నాథ్ శిందే రెండు కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. -
డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ తనిఖీలు
-
మాజీ సీఎం.. తాజాగా డిప్యూటీ సీఎం.. ఫడ్నవీస్ పేరిట ఓ రికార్డు
ముంబై: ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు అనంతర కాలంలో మంత్రి పదవులు చేపట్టడం రావడం అరుదనే చెప్పాలి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ పేరిట ఇలాంటి రికార్డు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, అనంతరం అంతకంటే తక్కువ పదవులతోనే సరిపెట్టుకున్న నాలుగో మాజీ సీఎం అయ్యారు ఫడ్నవీస్. 2014–19 సంవత్సరాల్లో బీజేపీకి చెందిన ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేనతో విభేదాలు తలెత్తాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేల అండతో సీఎం పదవిని చేపట్టినా పొత్తు పొసగక మూడు రోజుల్లోనే సీటు దిగిపోయారు. మహారాష్ట్ర సీఎంగా 1975లో కాంగ్రెస్ నేత శంకర్రావు చవాన్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల అనంతరం వసంతదా పాటిల్ సీఎం అయ్యారు. 1978లో శరద్ పవార్ ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి సీఎం అయ్యారు. చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ పవార్ కేబినెట్లో చవాన్ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1985–86 సంవత్సరాల్లో శివాజీరావు పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం, 2004లో సుశీల్ కుమార్ షిండే కేబినెట్లో ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. శివసేనకు చెందిన నారాయణ రాణే 1999లో మహారాష్ట్ర సీఎం అయి తక్కువ కాలంలోనే వైదొలిగారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చదవండి👉🏻కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన -
అయ్యన్న పాత్రుడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణ స్వామి
-
సంక్షేమ పథకాలై విక్రమ్ ను గెలిపిస్తాయి
-
టీడీపీది..నయవంచక మహానాడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్‌శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు. చదవండి: ఉంగరం దొంగలు మీరేనా? రాజకీయ నేపథ్యం: 1981లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1981–86 వరకు కార్వేటినగరం సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1987లో కార్వేటినగరం మండలాధ్యక్షుడు అయ్యారు. 1989–94 వరకు పీసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. 1994, 1999ల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో సత్యవేడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2022 వరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రెండోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. -
భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా..
తాడేపల్లిగూడెం: భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా.. పదవికి వన్నె తెస్తానని డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన పట్టణానికి వచ్చారు. నియోజకవర్గంలో అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐలాండ్ సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై అభిమానం, తనపై నమ్మకంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురుతర బాధ్యత అప్పగించారని, పారదర్శకంగా పనిచేసి పదవికి వన్నె తెస్తానన్నారు. ఆలయాల్లో రాజకీయాలు చేసే పార్టీలకు గుణపాఠం చెప్పడంతో పాటు ధర్మాన్ని కాపాడాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ఆలయాల్లో రాజకీయాలు చేస్తున్నాయని ఇది దుర్మార్గం అని అన్నారు. హిందూ ధర్మంపై విశ్వాసం పెంచేలా.. ప్రతిఒక్కరిలో దైవభక్తి, హిందూధర్మంపై విశ్వాసం పెంచేలా కృషిచేస్తానని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. దేవుడిని ప్రజలకు దగ్గర చేయాలనే ప్రభుత్వ ఉద్దేశా న్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తానన్నారు. దేవదాయ శాఖను అత్యంత విశ్వసనీయ శాఖగా మారుస్తానన్నారు. మంత్రివర్గంలో స్థానంతో పాటు తనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన గౌరవంగా భావించాలన్నారు. కాపులకు సముచిత స్థానం కాపు సామాజికవర్గానికి ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇస్తున్నారని, దీనిని అందరూ గమనించాలని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. కాపులకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల దుష్ప్రచారం, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు గుర్తించాలని కోరారు. పేదలకు న్యాయం చేస్తామని చెప్పిన కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజాద్వేషానికి గురవుతున్నాయన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో తాడేపల్లిగూడెం ప్రాంత అభివృద్ధికి కృషిచేశారని, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా ఇక్కడి వారిపై ప్రేమ చూపించడం ఆనందంగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రికి కా నుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అపూర్వ స్వాగతం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విజయవాడ నుంచి ఉంగుటూరు మండలం పట్టంపాడులోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా బయలుదేరారు. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలోని ము త్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణ వీధుల్లో ఊరేగారు. కార్యకర్తలు, అభిమానులు క్రేన్ సాయంతో గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. -
రామరాజ్యంలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
-
ఏపీ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..
-
ఏపీ కొత్త ఉప ముఖ్యమంత్రులు వీరే
-
AP: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. అంబటి రాంబాబు : జలవనరుల శాఖ ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం) బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ దాడిశెట్టి రాజా (రామలింగేశ్వర రావు) : రోడ్లు, భవనాల శాఖ ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గుడివాడ అమర్నాథ్ : పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్ శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం) నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం) ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం) ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ విడదల రజిని : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖలు వీళ్లలో అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్ , సీదిరి అప్పలరాజు, తానేటి వనితలు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. -
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం శిరోధార్యమన్నారు. తమకు పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. జేసీపై పల్లె సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌కు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానని.. దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వైఎస్ జగన్ సీఎంగానే ఉంటారని, అన్ని అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని నారాయణ స్వామి అన్నారు. వేషాలు వేసుకునే వాళ్లు రాజకీయాలకు పనికిరారని.. ఎన్టీఆర్‌పై నేను పోటీ చేస్తా అన్న చంద్రబాబు.. నేడు ఆ తెలుగుదేశం పార్టీ వారసులుగా చలామణి అవుతున్నాడు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం వుంటే.. కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని.. అలా గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాని నారాయణ స్వామి సవాల్ విసిరారు. -
టీడీపీ నేతలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం, రూ. 2 బియ్యం పథకాన్ని బాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారన్నారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఒక్క సీటు అయినా గెలవగలరా? అని ప్రశ్నించారు. చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు ఓట్ల కోసం చంద్రబాబు నాటకాలు ఆడటం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త హంగులు తీసుకొచ్చారు. చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ పథకాలను అమలు చేశాడా?. సారా వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదని’’ నారాయణస్వామి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ వారసుడు అవుతారు?. చంద్రబాబు, లోకేష్ సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలి. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా?. పేదవాడి పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదు. పేదల కష్టాలు ఏనాడు పట్టించుకోలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. పవన్ పొత్తు లేకుండా ప్రజల్లో వచ్చి సత్తా చూపించాలని’’ మంత్రి నారాయణ స్వామి అన్నారు. -
వ్యవసాయానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
-
ఆ ఘనత సీఎం జగనన్నదే: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
‘సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా?’
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఏపీ మంత్రులు ఆళ్ల నాని, నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. చదవండి: చీప్ లిక్కర్ రూ.75, కుదిరితే రూ.50కే.. వాహ్.. ఎంత గొప్ప పథకం: కేటీఆర్ అనంతరం ఆలయ వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు చంద్రబాబు మాట వింటున్నాయన్నారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదని, ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని నారాయణ స్వామి అన్నారు. -
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దీపావళి సంబరాలు
-
డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు
-
బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్
-
వైరల్: బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్
సాక్షి, తిరుపతి: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్న బుల్లెట్ బండి పాటనే మార్మోగుతోంది. ఏ వేడుకల్లో చూసిన ఇదే పాట వినిపిస్తోంది. ఎప్పుడైతే ఈ పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని హవా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తా పా.. డుగ్గు డుగ్గు’ అంటూ సాగే ఈ పాటకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్టెప్పులేస్తున్నారు. అంత పాపులర్ అయిన ఈ సాంగ్‌కు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణి డాన్స్ చేశారు. మంత్రి నారాయణస్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్ బండి పాటకు భర్త ముందు సరదాగా డాన్స్ చేశారు. ఆమె తన హావభావాలు, స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మద్యంపై ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోంది
-
ఫ్యామిలీతో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి-ఫోటోలు
-
29 మంది మంత్రులు, నో డిప్యూటీ సీఎం : బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం నేతృత్వంలో కొత్త మంత్రులు ఇవాళ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాత, కొత్త మేలు కలయికతో కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం బొమ్మై ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం ఎవరూ ఉండకూడదని హైకమాండ్ నిర్ణయించిందని బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని కేబినెట్లో, ముగ్గురు డిప్యూటీ సీఎంలున్న సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జాబితా సిద్ధం చేసినట్టు సీఎం తెలిపారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో వేడుకకు హాజరయ్యే వారు మాస్క్ ధరించాలని, అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అలాగే ఎవరూ పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని కూడా చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. మరోవైపు మంత్రుల అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుదారులు తమ నాయకులను ఎంపిక చేయకపోవడంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ముఖ్యంగా హవేరి ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే యడ్యూరప్ప హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ఎమ్మెల్యే ఆనంద్ మమణి తనను మంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానంటూ బెదిరింపుకు దిగారు. కాగా జూలై 28 న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొమ్మై క్యాబినెట్‌పై నిర్ణయం తీసుకునే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనే ఐదు రోజులు గడపటం గమనార్హం. -
Karnataka: డిప్యూటీ సీఎంగా శ్రీరాములు, ఆయనేమన్నారంటే..
సాక్షి, బెంగళూరు: నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బళ్లారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు పాల్గొనక పోవడంతో మీడియాల్లో పలు కథనాలు రావడంతో ఆయన స్పందించారు. తనకు పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని, మూడుసార్లు మంత్రిని చేసిందని గుర్తు చేశారు. గురువారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... ఇంట్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశానని, ఎవరిపైన ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేది లేనిది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు విజయేంద్రను షాడో సీఎం అంటూ ప్రతిపక్షాలు మాట్లాడారని, ప్రస్తుతం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపడితే యడియూరప్పను షాడో సీఎం అంటూ సంభోదిస్తున్నారని మండిపడ్డారు. -
డిప్యూటీ సీఎం కొడుకు కారు ఢీకొని రైతు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది కుమారుడు ప్రయాణిస్తున్న కారు ఒక బైక్‌ను ఢీ కొట్టగా రైతు మరణించాడు. ఈ ఘటన బాగలకోటె జిల్లా హనగుంద తాలూకా కూడల సంగమ క్రాస్ వద్ద జాతీయ రహదారి– 50పై జరిగింది. లక్ష్మణ సవది కుమారుడు చిదానంద సవది స్నేహితులతో కలసి కారులో వెళ్తుండగా, ఎదురుగా పొలం పనులు చూసుకుని బైక్‌పై వస్తున్న రైతు కొడ్లప్ప హనుమప్ప బోళి (55)ని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన రైతును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తరువాత చిదానంద సవది వేరే కారులో పరారీ అయ్యారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హనగుంద పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఆ కారులో నా కొడుకు లేడు రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో తన కుమారుడు లేడని డీసీఎం లక్ష్మణ సవది చెప్పారు. ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదని, ఏదీఏమైనా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. గాయపడిన ఆ వ్యక్తిని తన కుమారుడే ఆస్పత్రిలో చేర్పించాడని చెప్పారు. తన కుమారుడు స్నేహితులతో అంజనాద్రి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా, చిదానందను రక్షించాలంటూ తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎస్పీ తెలిపారు. -
దిశా యాప్ ను ప్రతి ఒక్క మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి :పుష్పశ్రీవాణి
-
నటుడు దుర్మరణం: స్నేహితుడిపై కేసు
సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాలమరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.స్నేహితుడితోకలిసి వస్తుండగా ప్రమాదానికి గురైన విజయ్ తీవ్రగాయాలతో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో విజయ్ స్నేహితుడు నవీన్‌పై ఐపీసీ సెక్షన్ 279, 338 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విజయ్ మరణం తరువాత అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబం ముందుకొచ్చింది. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ మరణంపై విచారం వ్యక్తం సీఎం నటుడు మరికొందరికి జీవం పోశారని కొనియాడారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు కాగా జూన్ 12 శనివారం రాత్రి 11:30 గంటలకు బెంగళూరులోని జేపీ నగర్ సమీపంలో తన స్నేహితుడు నవీన్ కలిసి వస్తున్నారు. ఆ సమయంలో వేగంతో వెళుతున్న బైక్ ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో విజయ్ తలకు తీవ్రగాయం కావడంతో అత్యవసర చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే విజయ్ బ్రెయిన్ డెడ్ అయ్యిందని అపోలో వైద్యులు తెలిపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్ నడుపుతున్న ఫౌండేషన్ విజయ్ చికిత్స ఖర్చులను భరించేందుకు ముందుకువచ్చారు. 'ರಾಷ್ಟ್ರಪ್ರಶಸ್ತಿ ಪುರಸ್ಕೃತ ನಟ ಸಂಚಾರಿ ವಿಜಯ್ ಅವರ ಅಂತ್ಯಕ್ರಿಯೆಯನ್ನು ಪೊಲೀಸ್ ಗೌರವಗಳೊಂದಿಗೆ ನಡೆಸಲಾಗುವುದು. ಅವರ ಅಂಗಾಂಗ ದಾನ ಮಾಡಿ ಸಾರ್ಥಕತೆ ಮೆರೆದಿರುವ ಕುಟುಂಬದವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳ ಜೊತೆಗೆ ಸಂತಾಪ ಸೂಚಿಸುತ್ತಾ, ಪ್ರತಿಭಾವಂತ ಕಲಾವಿದ ಸಂಚಾರಿ ವಿಜಯ್ ಅವರಿಗೆ ಭಾವಪೂರ್ಣ ಶ್ರದ್ಧಾಂಜಲಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ' : ಸಿಎಂ @BSYBJP. — CM of Karnataka (@CMofKarnataka) June 15, 2021 చదవండి : కొరటాల బర్త్‌డే : ఎమోషనల్ ట్వీట్ చేసిన ఎన్టీఆర్ -
ఏపీలో వక్ఫ్ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు: అంజాద్ బాషా
-
ముస్లిం మైనారిటీలు సీఎంకు రుణపడి ఉంటారు: అంజాద్ భాష
-
శివాజీపై కర్ణాటక డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
బెలగావి: ఛత్రపతి శివాజీ మహరాజ్ కన్నడ వ్యక్తి అని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కార్జోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యపై చాలా రోజులుగా మహా రాష్ట్ర, కర్ణాటక అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటగా బెల్గావ్, కార్వార్ కర్ణాటకలోనివి కాదని, మహారాష్ట్రవని సీఎం ఉద్ధవ్‌ఠాక్రే వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఆ వెంటనే ఆర్థిక రాజధాని ముం బై కర్ణాటకది అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లక్ష్మణ్ వివాదాన్ని మరింత పెద్దది చేశారు. దీంతో ఎన్సీపీ నేతలు రంగంలోకి దిగి లక్ష్మణ్‌పై విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తుది తీర్పువచ్చే వరకు కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర భూభాగంగా ప్రకటించాలని ఉద్ధవ్ ఇటీవల డిమాండ్ చేశారు. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు ఉప ముఖ్య మంత్రులు ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. కరువు వస్తే మహారాష్ట్రకు వచ్చారు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ’కన్నడిగ’ అని డిప్యూటీ సీఎం గోవిద్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు చరిత్ర తెలియదని, శివాజీ పూర్వీకుడు బెల్లియప్ప కర్ణాటకలోని గడగ్ జిల్లా సోరటూర్‌కు చెందినవాడని పేర్కొన్నారు. గడగ్‌లో కరువు వచ్చినపుడు బెల్లియప్ప మహారాష్ట్రకు బయలుదేరాడని డిప్యూటీ సీఎం తెలిపారు. శివాజీ నాల్గవ తరానికి చెందిన వ్యక్తి అని గోవింద్ వ్యాఖ్యానించారు. శివసేన గుర్తుగా, పార్టీ పేరుగా పెట్టుకున్నది ఒక కన్నడ వ్యక్తి శివాజీది అని పేర్కొన్నారు. ఉద్ధవ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో గొడవలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బెల్గావ్ సమస్యను లేవనెత్తాడని కార్జోల్ ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో విఫలమైందని ఉద్ధవ్ ప్రజాధరణ కోల్పోతున్నాడని మరో డిప్యూటీ సీఎం లక్ష్మణ్ ఆరోపించారు. ముంబై కర్ణాటకలో భాగం కావాలని, లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లక్ష్మణ్ డిమాండ్‌చేశారు. స్వేచ్ఛ కోసం కిట్టూర్ రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుబాటుకు దారితీసిన భూమి బెల్గావి అని బెలగావి జిల్లాకు చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశికళ జోల్లె వ్యాఖ్యానించారు. -
ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం
సాక్షి, నల్గొండ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో ఘటన జరిగింది. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఉప ముఖ్యమంత్రికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కర్ణాటకలో ‘మరాఠ’ బోర్డు చిచ్చు
బెంగళూరు: మరాఠ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో సోమవారం సమావేశమయ్యారు. లింగాయత్‌లు సైతం తమకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నందున ‘వీరశైవ లింగాయత్ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను కోరారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం పాటిల్, జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరాట్టి సైతం ముఖ్యమంత్రికి ఇంతకు ముందే లేఖ రాశారు. (చదవండి: నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్) మరాఠ అభివృద్ధి బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి లింగాయత్‌లకు సైతం ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కన్నడ అనుబంధ సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరాఠి మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో త్వరలో ఉప ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో యడ్యూరప్ప సర్కార్ మరాఠ బోర్డు ఏర్పాటుకు రూ.50 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బసవకళ్యాణ్, మస్కీ అసెంబ్లీ స్థానాలతో పాటు బెల్గావి లోక్‌సభ ఉప ఎన్నికలకు త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీరా, ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ‘కడుగొల్ల అభివృద్ధి సంస్థ’ ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో సరిహద్దు వివాదాలున్న కారణంగా కన్నడ ఉద్యమ నాయకుడు వి నాగరాజ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. (చదవండి: 35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం) -
డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి ఫోర్న్ క్లిప్ షేరింగ్
పనాజీ : గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేల్కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ముబైల్ ఫోన్ నుంచి ఒక వాట్సప్ గ్రూప్‌కు పోర్న్ క్లిప్ ఫార్వర్డ్ అయింది. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి తమకు అందిన ఆ పోర్న్ వీడియోలను చూడగానే వాట్సాప్ గ్రూపు సభ్యులు షాకయ్యారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని విజ్ఙప్తి చేశారు. కాగా, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం కవెల్కర్ స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని, వారిని పట్టుకోవాలని శిక్షించాలని కోరారు. ఈ మేరకు సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ‘ నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే ‘విలేజెస్ ఆఫ్ గోవా’ గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేశారు’అని కవెల్కర్ ఆరోపించారు. కాగా, పోర్న్ క్లిప్ షేరింగ్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని మండిపడుతోంది. ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు. సామాజిక కార్యకర్తలను అవమానపర్చడానికి, వారిని కించపర్చడానికే చంద్రకాంత్ కవ్లేకర్ ఉద్దేశపూరకంగా పోర్న్ వీడియోలను పంపించి ఉంటారని మండిపడుతున్నారు. -
లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి: మంత్రి ఆదేశం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వర్షాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ శాఖ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా తమ్మిలేరుకు వరద ఉధృతి పెరిగింది. అక్కడ 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏలూరు తమ్మిలేరుకు ఇరు వైపుల ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టండి అని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు -
ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం
సాక్షి, ఢిల్లీ : కరోనాతో భాదపడుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆసుపత్రిలో చేరారు. ఈనెల 14న మనీశ్ సిసోడియాకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఆయన స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక రాజధానిలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 53 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,816 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,53,075కు చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. (3 వేల ఐటీ నిపుణులకు తిరిగి ఉద్యోగాలు..) -
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్ఠలాలు
-
వాహన మిత్ర చెక్కులను పంపిణి చేసిన అంజద్ బాషా
-
‘ప్రజల కోసం కూలీగా పనిచేస్తా’
సాక్షి, వెదురుకుప్పం: ‘రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాదు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజలకు సేవలందించే కూలీగా పనిచేస్తాను’ అని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మండలంలోని పచ్చికాపల్లం సమీపంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు తిరుమలరాజపురం గ్రామంలో తాగునీటి బోరును ప్రారంభించి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేశా రు. అనంతరం వివిధ∙శాఖాధికారులతో సమస్యలపై సమీక్షించారు. (ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ ) రూ.15 కోట్లతో డిగ్రీ కళాశాల అభివృద్ధి.. కొత్తగా మంజూరైన వైఎస్సార్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సంబంధించి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇది జిల్లాలోనే మోడల్ డిగ్రీ కళాశాలగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మండలానికి డిగ్రీ కళాశాల కావాలని తాను అడిగినట్లు తెలిపారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూమిని అనుభవిస్తున్న రైతులకు న్యాయం చేయాలన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచి్చన వారికి ప్రభుత్వ భూమి, ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని తహసీల్దార్ కులశేఖర్‌ను ఆదేశించారు. (వాషింగ్టన్లో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం) డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సాగునీటి కొరత నివారణకు చర్యలు గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో సాగునీటి కొరత నివారణ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం రిజర్వాయర్ పరిధిని పెంచి తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వావిల్ చేను సమీపంలో ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లందిస్తామన్నారు. నీటి సమస్య నివారణకు రూ. 225 కోట్లతో ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రత్యేకాధికారి ఎస్. విజయలు రెడ్డి, హౌసింగ్ పీడీ నగేష్, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎంపీడీఓ సుధాకరరావు, సీఐ సురేంద్రరెడ్డి, జె డ్పీటీసీ సి.సుకుమార్, కళాశాల అభివృద్ధి కమి టీ చైర్మన్ బండి గోవర్ధన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఢిల్లీ ప్రసాద్,నాయకులు బి.సుబ్రమణ్యం, పేట ధనుంజయరెడ్డి కే. పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. (ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు ) -
‘గిరిజనులకు అన్యాయం జరగనివ్వం’
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో గిరిజనులకు న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను కోరిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా వాకబు చేశారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకే అన్ని ఉద్యోగాలు వచ్చేలా 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జీవో నెంబర్.3 ను జారీ చేశారన్నారు. (‘ఆయన చెప్పిందే నిజమైంది’) అయితే ఈ జీవో ఆధారంగా ఏజెన్సీ ఏరియాలోని టీచర్ల నియామకాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం జీవో నెంబర్.3ను కొట్టి వేసిందని వివరించారు. ఈ తీర్పు నేపథ్యంలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఏ చర్యలు తీసుకోవాలనే విషయంగా న్యాయ కోవిదులను సంప్రదిస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ వివరాలు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి, వారు సూచించిన విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తుందని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు. (‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు) -
క్షమించమని కోరుతున్నా: డిప్యూటీ సీఎం
సాక్షి, పుత్తూరు: ముస్లింలు, మత గురువులు తనను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నానని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం పుత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం దురదృష్టకరమన్నారు. జమాత్ నుంచి వచ్చిన ముస్లింలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశానన్నారు. భావ వ్యక్తీకరణలో లోపం కారణంగానే తాను చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయన్నారు. తన వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరణ ఇచ్చానని చెప్పారు. ఇది చదవండి: కరోనాపై పోరుకు కదం తొక్కుతూ.. -
ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు
-
టీమ్ ఉద్ధవ్
-
‘మహా’ డిప్యూటీ అజిత్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే విషయంలో ఉత్కంఠ వీడింది. శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్‌పవార్ ఉప ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల అనంతరం సోమవారం మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వీరితో విధాన భవన్ ప్రాంగణంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా విస్తరణలో ఎన్సీపీకి 10 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, శివసేనకు 8 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, కాంగ్రెస్‌కు 8 కేబినెట్, 2 సహాయమంత్రి పదవులు లభించాయి. ఈ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రితో కలుపుకుని, మొత్తం మంత్రుల సంఖ్య 43కి చేరింది. 15% నిబంధన మేరకు.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర మంత్రివర్గ సంఖ్య 43కి మించకూడదు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేసిన సమయంలోనే ఈ మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు తాజా విస్తరణలో చోటు దక్కలేదు. ఆయనకు రాష్ట్ర పీసీసీ పీఠం అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. మిత్ర పార్టీ క్రాంతికారీ షేట్కారీ ప„Š నుంచి శంకర్రావు గడఖ్‌కు కేబినెట్ హోదాతో మంత్రిపదవి, మరో మిత్రపక్షం ప్రహార్ జనశక్తి పార్టీ నుంచి బచ్చు కడుకు సహాయమంత్రి పదవి లభించాయి. ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజేంద్ర పాటిల్‌కు కూడా సహాయమంత్రి పదవి లభించింది. ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్, దిలిప్ వాల్సే పాటిల్, ధనుంజయ ముండే, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడెట్టివర్లకు కూడా తాజాగా మంత్రివర్గంలో స్థానం లభించింది. సంజయ్ రౌత్‌కు కోపమొచ్చింది!: కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. తన సోదరుడు, సేన ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగానే సంజయ్ హాజరుకాలేదని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేసి పడవీపై గవర్నర్ ఆగ్రహం: తొలిసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి పడవీపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం చేసేటపుడు స్క్రిప్ట్‌లో ఉన్నదే చదవాలని, లేనిది చదవొద్దని పడవీని మందలించారు. ‘సీనియర్ నేతలు శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే ఇక్కడే ఉన్నారు.కావాలంటే వారిని అడగండి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం పడవీ చేత మళ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. నాలుగోసారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేయడం దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా నవంబర్ 23న ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఎన్సీపీ తిరుగుబాటు నేతగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణంచేశారు. తర్వాత ఆయన మనసు మార్చుకుని మళ్లీ సొంత గూటికి వెళ్లడంతో ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలింది. దాంతో 80 గంటల సీఎంగా ఫడ్నవీస్, 80 గంటల డిప్యూటీ సీఎంగా అజిత్ చరిత్రకెక్కారు. అయితే, అజిత్‌పవార్ గతంలో రెండు పర్యాయాలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 2010 నవంబర్‌లో, ఆ తరువాత 2012లో అజిత్‌పవార్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర ప్రజలకు దాదాగా చిరపరిచితుడైన అజిత్‌పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ సోదరుడి కుమారుడు. 1980వ దశకంలో శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి ఏడు సార్లు ఆ స్థానం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1.65 లక్షల భారీ మెజారిటీ సాధించారు. తొలిసారి 1991 జూన్‌లో సహాయమంత్రి పదవి స్వీకరించారు. -
అవి రెండూ ఒకటి కాదు : డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లు ఒకటి కాదని, రెండూ వేర్వేరని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఏఏ అనేది ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లోని మైనార్టీలకు పౌరసత్వం ఇచ్చే చట్టమని, ఎన్నార్సీపై కేంద్రం ఇంకా చట్టం చేయలేదని పేర్కొన్నారు. కొంతమంది అవగాహన లేక ఇవి రెండూ ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నార్సీపై మైనార్టీల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశామని, ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరిగినా జగన్మోహన్రెడ్డి ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. తమను గుండెల్లో పెట్టుకున్న వైఎస్సార్ కుటుంబం మైనార్టీల పక్షపాతి అని వివరించారు. మైనార్టీలకు అన్యాయం జరిగే పని వైఎస్సార్సీపీ చేయదని, ఒకవేళ ఎన్నార్సీ వస్తే వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నార్సీ చట్టాన్ని అమలుపరిచేందుకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. దేశ రక్షణ అవసరాల నేపథ్యంలో సీఏఏకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపిందని, ముస్లిం సోదరులు ఈ తేడాను గమనించాలని కోరారు. -
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మామ మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మామ, ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ హనీఫ్ ఆదివారం మృతిచెందారు. ఆయన పార్దీవ దేహం వద్ద డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. 80 ఏళ్ల వయసులోనూ మునిసిపల్ కౌన్సిలర్‌గా సేవలందించిన హనీఫ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
మతపరమైన దుష్ప్రచారం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తుండడంతో ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా జెరూసలేం, మక్కా యాత్రలకు వెళ్లేవారికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాయని గుర్తు చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు ఆర్థిక సహాయం పెంచితే దానిని టీడీపీ, పచ్చ మీడియాలు వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఉనికి కోసం, విమర్శించడానికి ఏ విషయాలు లేక ఇలా మతపరమైన దుష్ప్రచారానికి దిగి, అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
రాష్ట్రంలో మత కల్లోలానికి టీడీపీ కుట్రలు : డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : మతాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాష్ట్రంలో కల్లోలం రేపాలని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. పవిత్రయాత్రలకు రాయితీలు ఇవ్వడం దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ విధానమంటూ.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాన్ని అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో.. ‘రాష్ట్రంలో మత ఘర్షణలకు ప్రతి పక్ష తెలుగదేశం పార్టీ, కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, దాని అనుకూల మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల ముసుగులో విద్వేషకారులు రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి అలజడి సృష్టించానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ ఆయా వర్గాల మేలుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటిని కూడా వక్రీకరించి, అల్పబుద్ధితో గౌరవ ముఖ్యమంత్రిగారి మీద, ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు. ఈ కుయత్నాల్లో కొన్ని మీడియా సంస్థలు భాగస్వాములు కావడం దురదృష్టకరం. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవిత్ర యాత్రలకోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈకార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. గత అక్టోబరు 30 జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవిత్ర యాత్రలకు వెళ్తున్న క్రైస్తవ, మైనార్టీ సోదరులకు రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హజ్, జెరూసలేంలకు వెళ్తున్న యాత్రికుల వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.40వేల నుంచి రూ.60వేలకు, రూ. 3లక్షలకు పైబడి ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.20వేల నుంచి రూ.30వేలకూ పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పై నిర్ణయాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాలు జీవోలు జారీచేస్తున్నాయి. ఈ జీవోలను పట్టుకుని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాలను అంటుగడుతూ చేస్తున్న ప్రచారం అత్యంత దుర్మార్గమైనది. రాష్ట్రంలో మతాలమధ్య చిచ్చు పెట్టే పన్నాగమిది. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ప్రభుత్వానికి అన్ని మతాలూ సమానమే. అందరి సంక్షేమం మా లక్ష్య’మంటూ ముగించారు. -
హరియాణాలో బీజేపీకే ‘జేజే’పీ
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ(జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ నేత ఉంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌నే మళ్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా ఉంటారని జేజేపీ వర్గాలు తెలిపాయి. హరియాణాలో రాజకీయ సుస్థిరత కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు దుష్యం త్ చౌతాలా తెలిపారు. హరియాణాలో మెజారిటీ వచ్చే అవకాశం లేదని అమిత్ షాకు ముందే సమాచారముందని, అందువల్ల ఫలితాల వెల్లడికి ముందే అమిత్‌షా దుష్యంత్ చౌతాలాతో మాట్లాడా రని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరుగుతుందని, ఆ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరవుతారని బీజేపీ హరియాణా ఇన్చార్జ్ అనిల్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ శనివారం గవర్నర్‌ను కలిసి కోరతారని, దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ముందు స్వతంత్రుల మద్దతుతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ గురువారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించింది. మెజారిటీకి ఆరు స్థానాలు అవసరమవడంతో.. తాజాగా గెలిచిన ఏడుగురు ఇండిపెండెంట్లతో సంప్రదింపులు జరిపింది. వారు కూడా మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా నివాసంలో మద్దతు లేఖను సీఎం ఖట్టర్‌కు అందజేశారు. స్వతంత్రుల్లో ఎక్కువమంది బీజేపీ రెబల్సే కావడం గమనార్హం. జేజేపీ మద్దతిచ్చేముందు, ఐఎన్ఎల్yీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా మద్దతూ తమకేనని బీజేపీ నమ్మకంగా ఉంది. గోపాల్ కందా మద్దతుపై అభ్యంతరం స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో.. హరియాణ్ లోక్‌హిత్ పార్టీ నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా నుంచి మద్దతు తీసుకోవడంపై వివాదం నెలకొంది. పలు క్రిమినల్ కేసులున్న స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకుని పార్టీ నైతిక విలువలకు ద్రోహం చేయవద్దని సీనియర్ నేత ఉమాభారతి పార్టీ నాయకత్వాన్ని కోరారు. వెనక్కు తగ్గని కాంగ్రెస్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా కూడా శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ తదితరులతో భేటీ అయ్యారు. జేజేపీ(జననాయక్ జనతా పార్టీ)తో చర్చలు జరుపుతూనే, స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌తో జేజేపీ కలిసి వచ్చినప్పటికీ మెజారిటీకి మరో ఐదుగురు సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిపై హుడా స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో మేం ఏమాత్రం వెనుకబడలేదు. స్వతంత్రులు చాలామంది మాతో కూడా టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారంటూ వస్తున్న వార్తలపై హుడా స్పందిస్తూ..‘వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాస్తున్నారు. హరియాణా ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరు. వారిని చెప్పులతో కొట్టడం ఖాయం’అని మండిపడ్డారు. -
దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని పథకం ఇది
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశంలోని ఏరాష్ట్రం కూడా ఆటో డ్రైవర్లను గుర్తించలేదని కానీ మన ముఖ్యమంత్రి వారి కష్టాలను తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం పదివేల రూపాయలను వారి ఖాతాల్లో వేసారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్‌జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8536 మంది డ్రైవర్లకు ఆర్ధిక సహాయం విడుదల చేశారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున మొట్టమొదటి కార్యక్రమంగా వైఎస్సార్ వాహనమిత్ర నిలవడం సంతోషకరమనం వ్యాఖ్యానించారు. త్వరలో అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలను అందించబోతున్నామని తెలిపారు. గత పాలన మొత్తం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని విమర్శించారు. అవినీతి రహిత పాలన దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. -
టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తా : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమ గోదావరి : టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు టైలర్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. అందరికీ ఆరోగ్య శ్రీ వర్తింపు, అర్హులైన వృద్ధులకు పెన్షన్ సౌకర్యం వంటి సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. టైలర్ల సంఘానికి కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు బాధ్యత తీసుకుంటానని ఆళ్ల నాని వెల్లడించారు. -
'డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది'
సాక్షి, విశాఖపట్నం : ఏపీ చరిత్రలో మొదటిసారి ఓ మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. విశాఖలో ఆదివారం జరిగిన మైనారిటీ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించి వైఎస్సార్ మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైఎస్సార్ సాధికారత కింద పేద ముస్లింలకు హజ్ యాత్ర కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు నిధులు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. -
నేను కూడా పోలీసులను అడగలేదు : డిప్యూటీ సీఎం
మండపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగించిన మండపేటలో నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. జసిత్‌ను చూసేందుకు శనివారం మండపేట వచ్చిన డిప్యూటీ సీఎం బోస్ మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో పోలీసులు, మీడియా ఒకరికొకరు పోటీపడి పనిచేశారని ప్రశంసించారు. జసిత్ విషయమై స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీసేవారన్నారు. తాను ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సమీక్షించానన్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ మూడు రోజులపాటు మండపేటలోనే ఉండి కేసు దర్యాప్తు చేయడం పట్ల ఆయనను అభినందించారు. కేసును పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారని, వివరాలు వెల్లడించడం సరికాదని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను కూడా పోలీసులను వివరాలు అడగలేదని, వారిని స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోనివ్వాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకోనున్నట్టు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ విషయమై అనుమానాలున్నాయని ఒక విలేకరి అడుగ్గా అసాంఘిక, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యకలాపాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. వారు ఎవరైనా, ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని బోస్ అన్నారు. అటువంటి వ్యక్తులు ఒకవేళ తమ పార్టీలో ఉన్నా వారిని వదులుకుంటామే తప్ప క్షమించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు చాలాచోట్ల సరిగా పనిచేయడం లేదని బోస్ దృష్టికి తీసుకురాగా పక్కాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత జసిత్ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళిని పరామర్శించిన బోస్ కొద్దిసేపు జసిత్‌తో ముచ్చటించారు. నన్ను ఎలా కిడ్నాప్ చేశారంటే..అంటూ బాలుడు చెప్పే మాటలు విని మురిసిపోయారు. లిటిల్ హీరో అంటూ జసిత్‌ను ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాజుబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా ?
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : ఏలూరు కార్పొరేషన్లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఏమాత్రం నాణ్యత లేదని, పనుల వ్యయాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరపాలకసంస్థ అధికారులపై ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో బుధవారం ఆళ్లనాని, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ ముత్యాలరాజులు సమీక్షించారు. డివిజన్లలో పర్యటించిన సమయంలో ప్రజలు అనేక విషయాల్ని తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేస్తామని నాని అన్నారు. కాగితాలపై కాకి లెక్కలు తప్ప సరైన సమాచారం ఇచ్చే స్థితిలో అధికారులు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అంశాన్ని ప్రస్తావించినా అవగాహనలేని మాటలే తప్ప వాస్తవ పరిస్థితులపై అధికారులకు అవగాహన లేదని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై పొంతన లేకుండా లెక్కలు చెబుతున్నారని, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వెచ్చించారని విమర్శించారు. పనులు చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపారని, కార్పొరేషన్లో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్దితి నెలకొందని అన్నారు. రోడ్లు వేసిన నెల రోజులకే దెబ్బతిన్న తీరు చూస్తుంటే నాణ్యతను పట్టించుకోలేదని, తనిఖీ చేయాల్సిన అధికారులు కూడా ఎక్కడ ఏ పని జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండటాన్ని మంత్రి తప్పుపట్టారు.టూటౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానం లేనప్పుడు తంగెళ్లమూడిలో పనులకు ప్రతిపాదన ఎలా చేశారని, వన్‌టౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా సరిదిద్దకుండా ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. రాబోయే మూడు రోజుల్లో పనుల వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చినా డ్రెయిన్ల పూడికతీత పనులు ఎందుకు పూర్తి కాలేదని మంత్రి ప్రశ్నించారు. నగరంలో ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో నాణ్యత కరువైందని, వెంటనే పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైపులైన మరమ్మతుల నిమిత్తం రూ.6 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారని, చాలా చోట్ల పనులు జరగకుండానే జరిగినట్లు బిల్లు డ్రా చేసినట్లు తనకు ఫిర్యాదులు అందాయని మంత్రి అన్నారు. తనకు తెలియకుండా ఏ ఒక్క అధికారిని రిలీవ్ చేయవద్దని ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ ఏ.మోహన్‌రావును కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. తెల్లముఖం వేసిన అధికారులు దేనికి అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలకు స్పష్టమైన వాస్తవ వివరాలతో రావాలని, ఏమాత్రం సమాచారం లేకుండా టైంపాస్‌కు వస్తే ఇక మీద సహించేది లేదని హెచ్చరించారు. గత ఏడాది రూ. 27 కోట్లు ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకుని కేవలం రూ. 15 కోట్లు మాత్రమే వసూలు చేశారని, ఈ ఆర్థిక సంవత్సరం మళ్ళీ రూ.28 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని.. గత బకాయిలతో కలిపి రూ. 40 కోట్లు ఎలా వసూలు చేయగలరని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నిధులతో ఎస్ఎంఆర్ నగర్లో ఓ కుల కల్యాణమండపాన్ని ఎలా నిర్మిస్తున్నారని, అలా నిర్మించేందుకు ఏమైనా అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ఎలాంటి అనుమతులు లేవని, గత పాలకులు ఆదేశాలతో చేపట్టామని అధికారులు వివరణ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ ఎ.మోహనరావు, హెల్త్ ఆఫీసర్ సూర్యారావు, ఏసీపీలు వి.శ్రీనివాస్, అప్పారావు, ఆర్వోలు పాల్గొన్నారు. -
ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు?
కర్నూలు : జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారంటూ బోర్డు కమిటీ సభ్యులు, అధికారులపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాష సీరియస్ అయ్యారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఆయన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు. స్థానిక మహ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కార్యాలయంలో బోర్డు కమిటీ సభ్యులు, అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా వక్ఫ్‌బోర్డు భూములు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని, అన్యాక్రాంతమైన భూములు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వార్షిక నివేదిక వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకుని కమ్యూనిటీ ప్రయోజనం కోసం ఉపయోగిస్తామన్నారు. పెళ్లికానుక పథకాన్ని వైఎస్ఆర్ దుల్హన్ పథకంగా మార్పుచేసి, పేద వధువులకు వారి పేరిట కాకుండా తల్లిదండ్రుల పేరిట చెక్కు పంపించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సాయం వస్తే అందులో దళారులకే రూ. 20 వేల దాకా ఖర్చయ్యేదని, కానీ నేడు నయాపైసా తగ్గకుండా రూ. లక్ష అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌వలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబ్బర్బాష తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ వర్సిటీలో అవినీతిపై విచారణ కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్బాష స్పష్టం చేశారు. వర్సిటీకి వచ్చిన ఆయన దృష్టికి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముజఫర్ అలీ, కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థి సంఘాల నేతలు, వర్సిటీ విద్యార్థులు పలు సమస్యలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వర్సిటీ అద్దె భవనాల్లో కొనసాగడం బాధాకరమన్నారు. 2016లో వర్సిటీ ఏర్పాటయితే ఇంత వరకు సొంత భవనం నిర్మాణం కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణం ఏ ద«శలో ఉందని అడిగి తెలుసుకున్నారు. నిధులు లేక నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని వీసీ వెల్లడించారు. నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్‌ను మంత్రికి చూపించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించారని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ తన భర్తకు పోస్టు ఇప్పించుకోవడానికే తమను తొలగించారని, రాష్ట్రంలో ఏ వర్సిటీలో లేని విధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించిన రిజిస్ట్రార్ భర్తకు సెమిస్టర్‌కు రూ.1.20 లక్షల చొప్పున చెల్లించారని తెలిపారు. వీసీ ముజఫర్ అలీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ సాహెదా అక్తర్లను కాంట్రాక్ట్ స్టాఫ్ సమస్య గురించి మంత్రి అడగ్గా.. ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఉస్మానియా కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి ఉస్మానియా కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్బాష హామీ ఇచ్చారు. కరస్పాండెంట్ అజ్రాజావేద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన హాజిరా కాలేజీకి మున్సిపల్ అధికారులు రూ. లక్షల్లో పన్ను విధించారని కరస్పాండెంట్ అజ్రాజావేద్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. పన్ను మినహాయించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించారు. ప్రొటోకాల్ విస్మరణ డిప్యూటీ సీఎం పర్యటన విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉర్దూ వర్సిటీ ఉంది. అయితే.. అధికారులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంజాద్ బాష ఉర్దూ వర్సిటీకి ఉదయం 10.30 గంటలకే చేరుకోగా.. ఆయన వచ్చిన 15 నిమిషాల తరువాత సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు నింపాదిగా రావడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. -
కబ్జాదారుల భరతం పట్టండి
ఏలూరు(పశ్చిమగోదావరి) : పేదల ఇళ్ల స్థలాలు కాజేసి అమ్ముకున్న కబ్జాదారుల భరతం పట్టాలని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కబ్జా వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తామన్నారు. బుధవారం ఆయన ఏలూరు మండలం వెంకటాపురం, కొమడవోలు, మాదేపల్లిరోడ్డులో ఇందిరమ్మ ఇళ్ల కాలనీలను ఆకస్మిక తనిఖీ చేశారు. కాలనీల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు, ఖాళీ స్థలాలు, కామన్ సైట్లను పరిశీలించారు. కాలనీ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే హౌసింగ్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌తో పాటు స్థానిక తహసీల్దార్‌తో కాలనీల స్థితిగతులు, ప్రజల సమస్యల గూర్చి చర్చించారు. కబ్జాదారులపై చర్యలు.. కొందరు టీడీపీ నాయకులు ఖాళీస్థలాలు అమ్ముకున్నారని కాలనీవాసులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేసిన స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్న వారిని గుర్తించాలన్నారు. అవసరమైతే వీరిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. స్థలాలు కొనుక్కుని ఇళ్లు నిర్మించుకున్న వారు అర్హులైతే న్యాయం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కాగా కొత్తూరు కాలనీలో ఉన్న 900 ఇళ్ల స్థలాల్లో 640 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి చెప్పారు. కామన్ సైట్ల చుట్టూ కంచె వేయండి.. కాలనీల్లో కామన్‌సైట్లను గుర్తించి పంచాయతీ కార్యదర్శికి అప్పగించాలని తహసీల్దార్ సూర్యనారాయణను ఆదేశించారు. కామన్సైట్లు ఆక్రమణకు గురికాకుండా తక్షణం కంచె నిర్మాణం చేపట్టాలని కార్యదర్శి సాయికృష్ణకు చెప్పారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు మహిళలు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును పిలిచి రోజూ రాత్రి వేళల్లో కాలనీల్లో గస్తీ తిరగాలని సూచించారు. పోలీసులు చర్యలు చేపట్టకపోతే నాకు ఫోన్ చేయండి అంటూ మహిళలకు తెలిపారు. బాధితుడికి చేయూత : అనారోగ్యంతో మంచాన పడిన కాలనీవాసుడు దత్తి రవికుమార్ అనే వ్యక్తిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి పర్యటనలో పలుశాఖల అధికారులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులు ఉన్నారు. -
అవినీతిరహిత పాలనే లక్ష్యం : డిప్యూటీ సీఎం
సాక్షి, కడప : రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా సాగుతున్నారని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్‌బాషా పేర్కొన్నారు. కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్తు సర్వసభ్య చివరి సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సీఈఓ నగేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సభ ప్రారంభంలో జిల్లాకు విశిష్ట సేవలు అందించిన మాజీ ఎంపీ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం నూతనంగా ఎంపికైన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభకు పరిచయం చేసుకోవాలని చైర్మన్ కోరగా అందరం పాత వాళ్లమే కదా అన్నారు. ఇందులో ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శివనాధరెడ్డి సభకు పరిచయం చేసుకున్నారు. తర్వాత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను జిల్లా పరిషత్తు చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, జేసీలు శివారెడ్డి, గౌతమిలు సన్మానించారు. అనంతరం సభనుద్దేశించి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారని, 151 మంది ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను గెలిపించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి 30 రోజులైందని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా సాగుతున్నారని వివరించారు. అన్ని కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయనకు ప్రజాపత్రినిధులు, అధికారులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన నవతర్నాల్లో భాగంగా జులై 2 నుంచి వృద్ధులకు పెన్షన్, ఆశ, అంగన్వాడీల జీతాలను పెంచి అమలు చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో నూతన పద్ధతి ద్వారా 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున 4 లక్షల మంది యువతి, యువకులను గ్రామ వలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసి రెండు వేల జనాభా ఉన్న ప్రతి చోట ఒక సెక్రటరీని నియమించి నిరుద్యోగ వ్యవస్థను తొలగించనున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను చదువుకోవాలనే ఉద్దశ్యంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టినట్లు, ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నట్లు తెలిపారు. 2019 కంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారని వివరించారు. తండ్రి అడగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు బరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు రూ. 12,500 అందించనున్నట్లు చెప్పారు. వీటితోపాటు నవరత్నాల్లోని అన్ని సంక్షేమ పథకాలను గ్రామవాంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించన్నారన్నారు. మంత్రులు, అధికారుల కార్యాలయాల్లో మేనిఫెస్టో టేబుల్‌పై ఉండాలని అన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథకంలో నడిపించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పడకేసిందని, ప్రభుత్వ పథకాల లబ్ధి కొందరికే చేకూరిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంతి జగన్ 30 రోజులపాలన స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చీప్‌విఫ్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పట్ల త్వరితగతిన స్పందించాలని, జిల్లాలో మంచినీటి ఎద్దడి అధికంగా ఉందని దీనిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాయచోటి విడిజన్‌లో విత్తనాల కొరత కొంత వేధిస్తోందని, 50 శాతం మేర మామిడి చెట్లు ఎండిపోయాయని, పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్‌ను కోరారు. అధికారులు బయటకు వెళ్లేటప్పుడు సమాచారాన్ని కార్యాలయంలో ఇచ్చి వెళ్లాలన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సీఎం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తున్నామన్నారు.కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం మన జిల్లాకు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సమస్యలేమైనా ఉంటే తమకు తెలియజేయాలని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. జలశక్తి అభియాన్‌లో మన జిల్లాకు చోటు దక్కిందన్నారు. అధికారులంతా ఒక ఫ్యామిలీలాగా పనిచేయాలని,ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. త్వరలో మున్సిపాలిటీలు, జెడ్పీ, ఎంపీపీల పాలకవర్గం ముగియనుందని, వారి స్థానాల్లో మీరంతా స్పెషల్ అపీసర్లు కానున్నారన్నారు. త్వరలో గ్రామవలంటీర్ వ్యవస్థ వస్తుందని, ప్రతి ప్రభుత్వ పథకం వారి ద్వారానే అమలవుతుందని వివరించారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించకుని పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
అవినీతి రహిత పాలనను అందిస్తాం: డిప్యూటి సీఎం
సాక్షి, అమరావతి : మైనార్టీ శాఖా మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా.. వైఎస్సార్ కడప జిల్లాలోని మసీదులు, చర్చిల మరమ్మత్తుల నిమిత్తం 3 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎం చేసినందుకు సీఏం గారికి కృతజ్ఞతలు తెలిపారు. వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, వక్స్ బోర్డు ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సోదరులు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లో వైఎస్సార్సీపీ అవినీతి రహిత పాలననే అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని, తాము కూడా అదే బాటలో ముందుకు వెళడానికి కృషి చేస్తామని పేర్కోన్నారు. జగన్ పాలన, తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి పాలనను మించేలా ఉండబోతుందని పేర్కోన్నారు. -
కడప ప్రజల రుణం తీర్చుకుంటా
సాక్షి, కడప : తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన కడప నగర ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్‌బాషా అన్నారు. శనివారం రాత్రి మాజీ కార్పొరేటర్ కరీం జిలానీ, ఎన్ఆర్ఐ సిటీ అలీ, నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శి అతావుల్లా, అక్తర్, ఎస్. అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో అంజద్‌బాషాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. కడప నగరాన్ని, ముఖ్యంగా రవీంద్రనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాజోలి రిజర్వాయర్‌ను నిర్మించాలి కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి రిజర్వాయర్ నిర్మించాలని ఆదివారం ఏపీ రైతు సంఘం నాయకులు డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. చంద్ర మాట్లాడుతూ రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. వైఎస్ఆర్ హయాంలో రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా వివక్ష చూపాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజోలి రిజర్వాయర్ నిర్మించి రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాలచంద్రయ్య, శివశంకర్‌రెడ్డి, రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఓడిపోయిన నాకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇవ్వడం పట్ల వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం చివరలో మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో దొంగలు, బ్యాంక్ లూటీ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. జగన్ మాత్రం ఓడిపోయిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలనే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి సంక్షేమం జరిగిందో సీఎం జగన్ సారథ్యంలో కూడా అలానే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తాం : అంజాద్ బాషా
-
మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం
-
చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ... తనకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాలలో మెరుగైన వైద్యం అందరికీ అందేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, నవరత్నాలలో మెరుగైన పథకంగా మారుస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైద్యం, ఆరోగ్యమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతలని సీఎం వైఎస్ జగన్ చెప్పారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. 108, 104 పథకాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని.. ప్రభుత్వ ఆసుపత్రులలో అవినీతిని నిర్మూలిస్తామన్నారు. పేదలందరికీ ఉచితంగా మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆళ్ల నాని హామీయిచ్చారు. (చదవండి: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు) -
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, తాడేపల్లి: మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. కేబినెట్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్ కమిషన్ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి. ప్రతి కాంట్రాక్ట్ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్ కమిషన్ సూచనల మేరకు ప్రతి టెండర్లో మార్పులు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేడతాం. రివర్స్ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్ పెరగాలి. నామినేషన్ పద్థతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం.’ అని తెలిపారు. -
అరుణాచల్ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మరణించిన ఘటన అనంతరం అరుణాచల్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ బంగళాను ఆందోళనకారులు దగ్ధం చేశారు. జిల్లా కమిషనర్ నివాసాలకు సైతం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎస్పీ స్ధాయి పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అరుణాచల్‌ప్రదేశేతర షెడ్యూల్డ్ తెగలవారికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ ప్రైవేటు నివాసంపైనా ఆందోళనకారులు దాడి చేశారు. మరోవైపు ఘర్షణలు తీవ్రమవుతుండటంతో సైన్యాన్ని రప్పించగా, వారు ఇటానగర్‌లో కవాతు నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు నగరంలో అంతర్జాల సేవలను నిలిపివేసి కర్ఫ్యూ విధించారు.