డిప్యూటీ సీఎం కాన్వాయిలోని వాహనం, డ్రైవర్
డ్రైవర్‌పై చేయి చేసుకున్న పోలీసులు
మహేశ్వరం: తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనమని.. సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని తెలిసింది. పైగా డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చేయి చేసుకున్నారని..అతడి జేబులోని ఐడీ కార్డును లా క్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం.
అరగంట తర్వాత తిరిగి ఆ డ్రైవర్‌ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను చిత్రీ కరిస్తున్న వీడియోగ్రాఫర్, ఇతరుల సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కుని, చేయిచేసుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment