tarun joshi
-
డిప్యూటీ సీఎం వాహనాన్ని ఆపిన సీపీ..
మహేశ్వరం: తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనమని.. సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని తెలిసింది. పైగా డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చేయి చేసుకున్నారని..అతడి జేబులోని ఐడీ కార్డును లా క్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం. అరగంట తర్వాత తిరిగి ఆ డ్రైవర్‌ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను చిత్రీ కరిస్తున్న వీడియోగ్రాఫర్, ఇతరుల సెల్ఫోన్లను పోలీసులు లాక్కుని, చేయిచేసుకున్నట్టు తెలిసింది. -
ఆయన టార్గెట్.. ఎవరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కొత్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఓ పర్వతారోహకుడు. ఆదిలాబాద్ ఎస్పీగా పని చేస్తున్న సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఇప్పటి వరకు 6 పర్వతాలను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్నారు డాక్టర్. తరుణ్ జోషి బుధవారం రాచకొండ సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ♦పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పాటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సరీ్వసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ♦ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉద్యోగంలో తర్వాతే పదేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీస్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరి 2019 జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... వర్సిటీ టాపర్‌గా నిలిచారు. ♦ తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరక ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ పోలీసు విభాగంలో ఉన్న ఎస్పీ జి.రాధిక అప్పట్లో అదే జిల్లాలో అదనపు ఎస్పీగా పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఆమె పలు పర్వతాలను అధిరోహించారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ♦ ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడు కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుఢ్యానికి ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. ♦ ఆదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లు పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచి్చన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. ♦ 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఆరింటిపై తన కాలు మోపారు. ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తరుణ్ జోషి అధిరోహించిన పర్వతాలు... ► 2018 మేలో సదరన్ రష్యాలోని భారీ అగి్నపర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ను ఎక్కారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది. ► 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది. ► అదే ఏడాది ఆగస్టులో ఇండోనేయాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ అధిరోహించారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు. ► 2020 జనవరి 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4,897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది. ► విన్సన్ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2,280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ► 2021 జనవరి 21న టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఇది సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది. -
రాచకొండ సీపీగా తరుణ్ జోషి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎఫెక్ట్‌తో రాచకొండ పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న జి.సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. ఈయన్ను మల్టీ జోన్–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్ జోషిని రాచకొండ కొత్త సీపీగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు కమిషనరేట్ల నుంచి బదిలీ అయిన అధికారుల్లో ఎన్నికల కోడ్ ప్రభావం పడిన వారే అధికంగా ఉన్నారు. కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్ 30ని గడువుగా తీసుకుని..ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. సుదీర్‌బాబు 2018 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్‌లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్ చేసిన ఆయన ఐజీగా పదోన్నది పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడాది డిసెంబర్ 13న రాచకొండ పోలీసు కమిషనర్‌గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్‌లో మూడేళ్లు పనిచేసిన జాబితాలో సుధీర్ బాబు ఉన్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్ జోషిని కొత్త సీపీగా నియమించింది. గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఈయనకు ఉంది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో కీలక పోస్టింగ్‌లతో పాటు వరంగల్ సీపీగానూ పని చేశారు. కోడ్ ఎఫెక్ట్‌తోనే ఈస్ట్‌జోన్ డీసీపీ బి.సాయి శ్రీ సైతం బదిలీ కాగా..ఆ స్థానంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీగా పని చేస్తున్న ఆర్.గిరిధర్ నియమితులయ్యారు. గద్వాల డీఐజీగా ఉన్న డి.జోయల్ డెవిస్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా నియమించింది. ఈయన ఇటీవల జరిగిన బదిలీల వరకు వెస్ట్ జోన్ డీసీపీగా, ఆపై సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా పని చేశారు. ట్రాన్స్‌కోలో పని చేస్తున్న డి.ఉదయ్‌కుమార్ రెడ్డిని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా, ఎస్.రష్మీ పెరుమాళ్‌ను హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ యూఎల్‌సీలో పనిచేస్తున్న కె.వెంకట ఉపేందర్‌రెడ్డి రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. కీసర ఆర్డీవోగా రమాదేవి, శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డిలకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. -
కేఎంసీ మైదానంలో ‘అవేక్ వరంగల్’ (ఫొటోలు)
-
రోజుకు పది గంటలు చదివితే ఉద్యోగం ఖాయం
వరంగల్: యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. వరంగల్ కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం కోచింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తరుణ్ జోషి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది సెంటర్లలో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్‌కు చెందిన నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇచ్చా మని, ప్రతి విద్యార్థికి రూ.2 వేల విలువైన స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యువత శిక్షణ కాలం అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, గిరికుమార్, ఇన్స్పెక్టర్లు రాఘవేం దర్, శ్రీనివాస్, రవికుమార్, రమేశ్, పీజేఆర్ కో చింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు
సాక్షి, వరంగల్ : ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వంచించడమే కాకుండా భూమిపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ రూ.90 లక్షలు వసూలు చేసిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు మూడు రోజుల కిందట కేసు నమోదు చేసినా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. దీంతోపాటు పోలీసులపై పలు ఆరోపణలు వస్తుండడంతో సీపీ అలర్ట్ అయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా ఈ కేసులో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు పెద్దోళ్లకు దగ్గరనే ఆలస్యమా.. మూడు దశాబ్దాలుగా గ్రేటర్ వరంగల్‌లో లిక్కర్ డాన్‌గా ముద్రపడిన కార్పొరేటర్ భర్త తండ్రి తన వ్యాపార విస్తరణకు ఎందరో ముఖ్య నేతలకు దగ్గరయ్యాడు. బిజినెస్ సాఫీగా సాగేందుకు కొందరు పోలీసులతో సన్నిహితంగా ఉండడమే కాదు.. వారికి మగువ, మద్యం చూపి లోబరుచుకొని పనులు చేయించుకునేవాడని వార్తలు సామాజిక మాధ్యమాలతోపాటు టీవీ చానళ్లలో ప్రసారం కావడం పోలీస్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఏకంగా కొందరు ఖాకీలను శ్రీలంక, మలేసియాకు తీసుకెళ్లి విందు వినోదాలు ఇచ్చాడని వచ్చిన వదంతులను తీవ్రంగా పరిగణించిన సీపీ ఈ మేరకు విచారణ చేపట్టి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ మరోవైపు సాధ్యమైనంత తొందరగా ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని హుకుం జారీచేసినట్టు తెలిసింది. ఈ కార్పొరేటర్ భర్త, అతడి తండ్రి ఓ ముఖ్య నేత వ్యాపారంలో భాగస్వామి కావడంతో ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సదరు నేత సీరియస్ అవడంతోనే మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ ఒక రోజు మొత్తం సెలవుపై వెళ్లాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత విధులకు వచ్చారు. దీనిపై ఏసీపీ గిరికుమార్‌ను ఫోన్లో సంప్రదిస్తే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వీరిని అరెస్టు చేశామని వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. కార్పొరేటర్ భర్త పై మోసం, అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఇతడికి సహకరించిన తండ్రిపై కూడా బెదిరింపుల కేసు పెట్టారు. -
ఆర్థిక లావాదేవీలే కారణం
సాక్షిప్రతినిధి, వరంగల్: సంచలనం సృష్టించి న వరంగల్ హత్యాకాండకు షఫీ, అతని అన్న చాంద్‌పాషాల మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీలే కారణమని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి చెప్పారు. దీనివెనుక ఆరుగురు నిందితులు ఉన్నారని, వారిని ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం తెల్లవారుజామున వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతంలో అన్న చాంద్‌పాషాతోపాటు వదిన సబీరాబేగం, బావమరిది ఖలీల్‌ని షఫీ పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులు షఫీని, అతనికి సహకరించిన బోయిని వెంక న్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్, ఎండీ మీరా అక్బర్, ఎండీ పాషాలను రిమాండ్‌కు తరలించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. షఫీ, చాంద్‌పాషా పదేళ్ల క్రితం పరకాల నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడ్డారని చెప్పా రు. వీరు పరకాల, జంగాలపల్లి, ఏటూరునాగారం ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్‌లోని కబేళాలకు తరలించే వ్యాపారాన్ని నిర్వహించేవారన్నా రు. వచ్చే లాభాన్ని ఇరువురు పంచుకునేవారని, ఇటీవల నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. చెల్లించాల్సిన అప్పులను చెల్లించి తనకు రావాల్సిన వాటా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా పెద్ద మనుషుల మధ్య పంచా యితీ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో స్నేహితులతో కలిసి షఫీ హత్యలు చేశారని వెల్లడించారు. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు తమకేమైనా సమస్యలుంటే సీఐ స్థాయి నుంచి పోలీస్ కమిష నర్ వరకు నిర్భయంగా ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సమావేశంలో సెంట్రల్‌జోన్ డీసీపీ పుష్ప, వరంగల్ ఏసీపీ కె.గిరికుమార్, సీఐలు గణేష్, మల్లేష్ పాల్గొన్నారు. -
ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులు: ఎస్సై సస్పెండ్..
వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా అర్బన్ ఎస్సై శ్రీనివాసరెడ్డి.. తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఎస్సై పోలిస్ కమిషనర్ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేసింది. ఎస్సై ట్రైనింగ్పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కన్నీటి పర్యంతమయ్యింది. కాగా, ప్రజలను కాపాడాల్సిన అధికారిపైనే.. ఫిర్యాదు రావడంతో పోలీస్ ఉన్నతా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందించి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎస్సై శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి తాజాగా ఉత్తర్వులను జారీచేశారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కరోనా చికిత్సకు వచ్చి చిక్కిన మావోయిస్టులు
సాక్షి, వరంగల్: అడవుల్లో ఉండే అన్నలు కరోనా బారినపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్‌లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి పేర్లు గడ్డం మధుకర్, వినయ్ అని తెలిపారు. మరో 12 మంది మావోయిస్టులు ప్రస్తుతం కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్లు సమాచారం ఉందని కమిషనర్ చెప్పారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మన్యంలో ఉంటున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ -
కిలిమంజారోపై ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్/భువనగిరి: సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఖాతాలోకి మరో మైలురాయి వచ్చి చేరింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను ఆయన శుక్రవారం ఉదయం 8.15 గంటలకు అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఈయన ఎక్కారు. నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న జోషి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నారు. జోషి పంజాబ్‌కు చెందిన వ్యక్తి. పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పట్టా పుచ్చుకుని దంత వైద్యుడయ్యారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా పని చేస్తున్నారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుని అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోని మౌంట్ రీనాక్‌ను అధిరోహించారు. అన్వితారెడ్డి కూడా... యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. భువనగిరికి చెందిన పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళల కమార్తె అన్విత భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో 2018 నుంచి రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్‌లో శిక్షణ పొందారు. అనంతరం ఖిల్లా వద్దనే శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. ‘చదువుతో పాటు పర్వతారోహణ అంటే ఇష్టం. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. పర్వతారోహణకు గురువులు శేఖర్‌బాబు, పరమేశ్ ఎంతగానో ప్రోత్సహించారు’అని ఆమె అన్నారు. -
ఎంబీబీఎస్ టు ఐపీఎస్
సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు తరుణ్ జోషి... డాక్టర్ చదివినా 2004లో సివిల్ సర్వీస్ ఉత్తీర్ణులై ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీసు కమిషనర్ హోదాలో నేతృత్వం వహిస్తున్నారు. అదిలాబాద్ ఎస్పీగా పని చేస్తుండగా పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నారు... రెండేళ్ళ కాలంలో ఐదు పర్వతాలను అధిరోహించారు... గత నెలలోనే అంటార్కిటికా, ఆస్ట్రేలియాల్లో ఉన్న రెండింటిపై పాద మోపారు... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్న ఆయన విజయాలపై ప్రత్యేక కథనం.. ఎంబీబీఎస్ టు ఐపీఎస్ పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఓపక్క తన విధుల్ని సమర్థవంతంగా నిర్వరిస్తూనే... మరోపక్క ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం ఓయూ నుంచి పోలీస్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరిన ఆయన గత ఏడాది జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... ఓయూలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. రాచకొండ నుంచే నాంది అదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లూ పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచ్చిన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఐదింటిపై తన కాలు మోపారు. అనునిత్యం ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈయన పర్వతారోహణ కోసం అదనపు కసరత్తు చేస్తుంటారు. సమయం చూసుకుని ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే తన లక్ష్యమని తరుణ్ జోషి చెప్తున్నారు. అనుకోకుండా ఆసక్తి.. తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరకు అదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. అప్పట్లో అదనపు ఎస్పీ జి.రాధిక ఆ జిల్లాలోనే పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఈమె అప్పట్లోనే కొన్నింటిని అధిరోహిస్తూ ఉండే వారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడిని కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుణ్యాలకు ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. అదో చిత్రమైన అనుభూతి ఓ బృందంతో ఈ నెలలో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌ను అధిరోహించా. దక్షిణ ధృవంలో ఉన్న అంటార్కిటికాలో ప్రస్తుతం 24 గంటలూ పగలే ఉంటుంది. దీంతో రెండు రోజుల పాటు నిద్రపోవడానికి, సమయం గుర్తించడానికి చాలా ఇబ్బంది పడ్డా. వాచీ చూసుకుంటే 11, 12 గంటలు చూపించేది. అది పగలో, రాత్రో తెలియక తికమక పడాల్సి వచ్చింది. ఆపై ఫోన్లో టైమ్‌ను 24 గంటల ఫార్మాట్‌కు మార్చుకుని.. రాత్రి అయిందని తెలుసుకుని నిద్రపోయే వాళ్ళం. సూర్యరస్మి కారణంగా గరిష్టంగా 3 గంటలకు మించి నిద్ర పట్టేదికాదు. అది పర్వతారోహణ పూర్తయిన వారంలోనే ఆస్ట్రేలియాలోని మరో పర్వతాన్ని అధిరోహించాం. తదుపరి టార్గెట్... మౌంట్ ఎవరెస్ట్.– డాక్టర్ తరుణ్ జోషి, సంయుక్త సీపీ, సిటీ ఎస్బీ తరుణ్ జోషి అధిరోహించిన పర్వతాలు... ♦ 2018 మేలో సదరన్ రష్యాలోని భారీ అగ్నిపర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ను చేరుకున్నారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది. ♦ 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది. ♦ అదే ఏడాది ఆగస్టులో ఇండోనేషియాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ ఎక్కారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు. ♦ ఈ నెల 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎల్తైన మౌంట్ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది. ♦ విన్సన్ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. -
చెంగిచర్ల ఘటనలో ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: చెంగిచర్ల వద్ద ఆయిల్ ట్యాంకర్ల పేలుడు, అగ్నిప్రమాదం సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్ల యజమానులు రాజు, జగదీష్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 3 బైక్‌లు, 2 కార్లు, 12 పెట్రోల్ ట్యాంకర్లు, రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దక్షిణ భారతంలోనే మొదటిదని రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ల నుంచి పెట్రోల్ తీస్తుండగా ప్రమాదం సంభవించిందని, ఇలా తీసిన పెట్రోల్‌లో కిరోసిన్ కలిపి విక్రయిస్తుంటారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో వీరు అక్రమంగా కార్ఖానా నిర్వహిస్తున్నారన్నారు. చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల నుంచి వెల్డింగ్ ద్వారా పెట్రోల్ తొలగించే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని జోషి తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎస్పీ తరుణ్‌జోషి
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తరుణ్‌జోషి సూచించారు. సోమవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో ఆర్టీవో, ఆర్టీసీ ప్రత్యేక విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందస్తు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల స్థలాలను గుర్తించి హెచ్చరికలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, మూలమలుపు ప్రదేశాల్లో సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ వారం జాతీయ రహదారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలు తనిఖీ చేయాలన్నారు. ఆటోల్లో ఎటువంటి సరుకులు రవాణా చేయకూడదని, వాహనాలకు ముందు, వెనకాల రిజిస్ట్రేషన్ నెంబర్లు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల తరలించే విషయంలో ఎటువంటి రాజీలేకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. రవాణా ఉప కమిషనర్ రాజారత్నం, ఆర్టీవో భద్రునాయక్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
చెన్నూర్/మందమర్రిరూరల్/మంచిర్యాల టౌన్ : మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. బుధవారం రాత్రి మంచిర్యాల పోలీసుస్టేషన్, గురువారం చెన్నూర్, మందమర్రిలోని పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. సెంట్రీ, తుపాకులు భద్రపర్చే గదులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయా స్టేషన్లలో విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల నుంచి జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, కాసిపేట మండలం తిర్యాణిలో ఎదురుకాల్పులు జరిగాయని, అక్కడ తప్పించుకుని పారిపోయారని అన్నారు. జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 15ఏళ్ల క్రితం సికాస పనిచేసిందని, ఆ సమయంలో పనిచేసిన సానుభూతి పరులను ఆకట్టుకుని ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా బుధవారం మందమర్రిలో వాల్‌పోస్టర్లు వేశారని తెలిపారు. వీటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. మందమర్రి పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లోపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌తోపాటు మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఎస్సై నియామకానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతలు కాపాడుతా..
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఘర్షణలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతామని, శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామని ఎస్పీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ఈయన ఇటీవలే ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. సోమవారం తరుణ్‌జోషి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న గజరావు భూపా ల్ పుష్పగుచ్చం అందజేసి కొత్త ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. జిల్లాలో అల్లర్లు సృష్టిం చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. మావోయిస్టుల ప్రబల్యం తగ్గించేందు కు, మతఘర్షణలను నివారించేందుకు అంతర్రాష్ట్ర కార్యకలాపాలపై ప్ర త్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థకు ప్రజల సహకారం తప్పనిసరని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో పోలీసు శాఖ కీలక ప్రాత పోషించేలా చూస్తానన్నారు. త్వర లో జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను సందర్శించి పరిస్థితులు తెలుసుకుంటానని వివరించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న గజరావు భూపాల్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో పనిచేయడం గొప్పగా భా విస్తున్నానని పేర్కొన్నారు. జిల్లా భౌగోళికంగా పెద్ద ది కావడంతో ఎవైనా అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు సమయానికి వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నా రు. ఇక్కడి ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలు వచ్చినా సమర్థవంతం గా నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషికి పోలీసు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. -
సార్లొస్తారా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాస్థాయి కీలక పోస్టులలో ఇన్చార్జులు కొనసాగుతుండటంతో పాలనపై ప్రభావం పడుతోంది. ఖాళీలకు తోడు,ఉన్నతాధికారులు సెలవులో వెళ్లినప్పుడు ఒకే ఉన్నతాధికారి నాలుగైదు పోస్టుల కు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అధికారులు ఏ పోస్టుకూ న్యాయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థి తి నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో స్తబ్దత ఏర్పడింది. జాయింట్ కలెక్టర్, అడిషనల్ జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకు న్న రొనాల్డ్ రోస్ ఈ నెల 15 నుంచి సెలవులో వెళ్లా రు. డీఆర్ఓ తప్ప అన్ని పోస్టులకు జడ్పీ సీఈఓ రా జారాం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబా ద్ ఆర్డీఓ యాదిరెడ్డి ఇన్చార్జి డీఆర్ఓగా వ్యవహరి స్తున్నారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ 19న తిరిగి విధుల లో చేరాలి. కానీ, ఆయన రాకపోవడంతో సెలవు పొ డిగించినట్లు ప్రచారం జరుగుతోంది.కలెక్టర్ క్యాంపు వర్గాలు మాత్రం రోస్ సోమవారం విధులలో చేరుతారని చెబున్నారు. పోలీసు బాస్ ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి కూడ ఈ నెల 15 నుంచి సెలవులో వెళ్లగా అడిషనల్ ఎస్పీ బాలునాయక్ ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల సెలవుపై చర్చ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పీఎస్ ప్రద్యుమ్నను, బోధ న్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రద్యుమ్న స్థానంలో ఎవరినీ ని యమించకుండా, అప్పటి జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావుకు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జులై 30న రొనాల్డ్ రోస్‌ను కలెక్టర్‌గా నియమితులయ్యారు.అదేరోజు జేసీ వెంకటేశ్వర్రావు సైతం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. మరోవైపు అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి అనారోగ్య కారణాలతో ఏప్రిల్ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఆ పోస్టు కూడా ఖా ళీగా ఉంది. రోనాల్డ్ రోస్ జూలై 31న కలెక్టర్‌గా బా ధ్యతలు తీసుకొని సీఎం పర్యటన, సమగ్ర కుటుంబ సర్వేలో చురుకుగా పాల్గొని సీఎం ప్రశంసలు అందుకున్నారు. ఈ లోగా ఐఏఎస్‌ల విభజనలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ యన అక్కడి సీఎస్‌కు రిపోర్టు చేయడం అనివార్యం గా మారింది. రోస్‌ను డిప్యూటేషన్‌పై ఇదే జిల్లాలో కొ నసాగించే విషయమై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషిపై టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు అసంతృప్తిగా ఉండటమే కాకుండా, ఆయన వైఖరిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. జిల్లాలో జరిగిన 41 మంది ఎస్ఐల బదిలీలను ప్రభుత్వం నిలిపి వేయడంపై ఎస్పీ కొం త కలత చెందినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యం లో నే ఇద్దరు ఉన్నతాధికారులు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. -
ఆగిన ఎస్ఐల బదిలీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీల వివాదం ముఖ్యమంత్రి పేషీకి చేరింది. దీంతో బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొంత కాలంగా ఎస్పీ తరుణ్‌జోషి, డీఐజీ సూర్య నారాయణ మధ్యన అంతరం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీల విషయమై కొంత వివాదం ఏర్పడింది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేసిన సిఫారసుల విషయమై ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన సమన్వయం కుదరని కారణంగా, మంగళవారం రాత్రి వెలువడిన 43 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు తాజా వివాదానికి తెరలేపాయి. ఎస్పీ తమను పట్టించుకోకుండా, ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పో స్టింగులు ఇచ్చారంటూ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయిని న ర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మొదటి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని వివరించారు. స్పందించిన సీఎం ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు నిలిపివేయాలని హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించడం చర్చనీయాంశం అయ్యింది. ఎస్పీని మార్చాలని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, అప్పటి కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి తమ పట్ల పక్షపా త ధోరణితో వ్యవహరించారన్న భావన మొదటినుంచీ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఉంది. ఓట్ల లెక్కిం పు సందర్భంగా డిచ్‌పల్లిలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భా స్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ పీ తీరుపై పోచారం సహా పలువురు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బా ధ్యతలు చేపట్టిన తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టా రు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్నను మాత్రమే బదిలీ చేసిన ప్రభుత్వం ఎస్పీ జోలికి వెళ్లలేదు. పోలీసు అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ పలువురు అధికార పార్టీ నేతలు ఇటీవల కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఎస్ఐల బదిలీల జాబితా కొత్త వివాదానికి తెర లేపింది. రెండు, మూడు నెలలుగా ఎస్ఐల బదిలీలు జరుగు తాయన్న ప్రచారం జరిగింది. పది రోజులుగా డీఐజీ, ఎస్పీ బదిలీలకు కసరత్తు చేస్తున్నా సమన్వయం కుదరక కొలిక్కి రాలేదని తెలిసింది. కొందరు అధికార పార్టీ ప్ర జాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఎస్ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరు దారిలో వెళ్లడం వివాదానికి కారణంగా చెప్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు ఒకరు, అంకితభావంతో పనిచేసే ఎస్ఐలకు ఇంకొకరు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేయడంతో వివాదంగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఎస్పీని బదిలీ చేయాలని పట్టుబట్టడంతో ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు తాత్కాలికంగా రద్దు చేశారు. 43 మంది ఎస్ఐల బదిలీ సారాంశం ఇదీ కోటగిరి, నిజామాబాద్-2టౌన్, నిజాంసాగర్, మద్నూరు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, నవీపేట, వర్ని ఎస్ఐలు మినహా మిగతావారు బదిలీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఆరుగురు ఎస్ఐలు కొత్తగా జిల్లాకు రాగా, జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురిని హైదరాబాద్‌కు పంపారు. డీడీ హైదరాబాద్‌లో ఎస్ఐగా ఉన్న వేణుగోపాల్‌కు డిచ్పల్లి, టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న రాజశేఖర్, శ్రీనివాస్‌కు నందిపేట, కమ్మర్పల్లి పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్, చిక్కడపల్లిల్లో ఎస్ఐలుగా ఉన్న విజయ్‌కుమార్, వీరబాబు, రాంప్రసాద్‌లను దేవునిపల్లి, భిక్కనూర్, ఎడవల్లి ఎస్ఐలుగా నియమించారు. నిజామాబాద్ వీఆర్‌లో ఉన్న జాన్‌రెడ్డి, డిచ్పల్లి, బాన్సువాడ, ధర్పల్లి, బోధన్, నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్ఐలు చంద్రశేఖర్, కృష్ణ, అంజయ్య, రవి, సురేష్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడివారిని హైదరాబాద్‌కు బదిలీ చేయడం. అక్కడి నుంచి వచ్చిన వారిని వీరి స్థానాలలో నియమిస్తున్న విషయంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు కనీస సమాచా రం లేదనే వాదన ఉంది. కొందరు ఎమ్మెల్యేలు తమ కోసం పని చేసిన కేడర్, వారి బంధువులు, పరిపాలన సౌలభ్యం కోసం చేసిన సిఫారసులకు ఈ బదిలీలలో ప్రాధాన్యం దక్కలేదని అంటున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి పోచారంతోపాటు శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, హన్మంత్ సింధే, బిగాల గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, అహ్మద్ షకీల్ తదితరులు సీఎం, హోంమంత్రిని కలిసినట్లు తెలిసింది. రెండు మూడు రోజులలో ఎస్ఐల బదిలీలపై తాజా ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. -
వలంటీర్లకు ప్రశంస పత్రాలు
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి శుక్రవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, తెలంగాణ యూనివర్సీటీ విద్యార్థులు దాదాపు 2,268 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తమ విధులను అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో నిర్వహించినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారు విధుల్లో పాల్గొన్నారన్నారు. ప్రత్యేకంగా ఓటర్లను ‘క్యూ’ పద్ధతి పాటించే విధంగా చూసి, ఓటర్ల సందేహాలను నివృత్తిచేసి, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కృషి చేశారన్నారు. దీంతోపాటు పోలింగ్ స్టేషన్లో సంబంధిత పోలీసు సిబ్బందికి సహాయ సహకారాలు అందించడంద్వారా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా రిజర్వు ఇన్స్పెక్టర్ సి.హెచ్.మల్లికార్జున్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జి.దేవిదాసు, బి.ప్రమోద్‌కుమార్, ఎన్.ఆరున్‌రెడ్డి ,వి.నర్సారెడ్డి, జి. హన్మాండ్లు, ఎం.సురేష్‌కుమార్, వై.నారాయణ, కే.రవీందర్రావు, డి.వీరారెడ్డి, డాక్టర్లు ఐ.గంగాధర్, కే.రవీందర్‌రెడ్డి, విద్యార్థులు ఉన్నారు. -
కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : డిచ్పల్లి సీఎంసీ కళాశాల భవనంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు వె య్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. గురువారం సీఎంసీ ఆవరణలో పోలీసు సిబ్బందితో ఆయ న మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.దీంతో ఎన్నికల సిబ్బంది, సుమారు వెయ్యి మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కౌంటింగ్ ఉద యం 8 గంటలకు ప్రారంభమ వుతుందని, అయితే బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బం ది ఉదయం 4.30 గంటలకే చేరుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రానికి బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు, ఆర్మూర్, బాల్కొండ నియోజవకర్గాలకు సంబంధించిన వాహనాలు వస్తాయన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నడిపల్లి నుంచి సీఎంసీ కళాశాలకు వచ్చే రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా చూడాల న్నారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే వాహనా లు నిలుపేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూ పాలన్నారు. ఒక్కో అధికారికి పదిమంది సహాయంగా ఉంటారన్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లోనికి వెళ్లాలని సూచించారు. పాసులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించ రాదన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి పంపించాలన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తుల్లో కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాల్‌తో పాటు వరండా, భవనం చుట్టూ, చెకింగ్ పాయింట్ వద్ద బందోబస్తు ఉంటుందన్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలు రద్దీగా ఒకచోట చేరకుండా చూడాలన్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 64మంది ఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, నాలుగు స్పెషల్‌పార్టీలు, 240 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ప్రమోద్‌రెడ్డి, డీఎస్పీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల నిర్వహణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. ప్రదాన రహదారులతో పాటు చెక్‌పోస్టు ల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద వాహనాల తనిఖీని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో వా హనాలను తనిఖీ చేస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారుల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అ చ్చంపేట అథితి గృహం వద్ద స్థానిక అధికారులతో వారు మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా నగదు, మ ద్యం రవాణా కాకుండా పకడ్బందీగా సోదాలు చేయాలన్నారు. వాహనాల తనిఖీల పై కొందరు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆర్టీసీ తో పాటు ప్రై వేటు వాహనాలను అణువణువు తనిఖీ చేయాలన్నారు. అభ్యర్థులు ప్రచారం కోసం వాడుకుం టున్న వాహనాల అనుమతులను పరిశీలించాలన్నా రు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న పార్టీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేయా లన్నారు. వందశాతం పోలింగ్ నమోదుకావాలి ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియో గించుకొని వందశాతం పోలింగ్ నమోదు చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న గిరిజన ఓటర్లకు సూచించారు. పిప్పిరేగడి తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మీ అవసరాల కోసం తండాలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లంద రూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు. నిజామాబాద్ ఎంపీ స్థానానాకి పోటీలో ఉన్న అభ్యర్థులతో శనివారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి , ప్రచార కార్యక్రమం, నిర్వహణ, అభ్యర్థుల ఖర్చు, చెల్లింపువార్తలు, వీడియో ప్రసారం తదితర విషయాలను వివరించారు. అభ్యర్థులంతా ఎలక్షన్ ఏజెంట్లను నియమించుకుంటే బాగుంటుందని కలెక్టర్ సూచించారు. వ్యక్తిగతంగా సమావేశానికి హాజరుకాలేనప్పుడు ఏజెంట్లను పంపించవచ్చన్నారు. ఖర్చు వివరాల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, వాహనాల కోసం తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి రూపొందిస్తే ప్రింటింగ్ ప్రెస్ యజమాన్యం మూడు రోజుల్లోగా పూర్తి వివరాలతో ప్రచురణ సామగ్రి ప్రతులను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. టీవీ ఛానళ్లలో ప్రచారం చేసుకోవాలంటే మూడు రోజుల ముందుగానే అనుమతి కోసం నిర్దేశించిన అనెక్జర్-ఏ పట్టికలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఆమోదించిన పిదపనే ప్రచారం చేసుకోవలసి ఉంటుందన్నారు. హోర్డింగ్‌లు, బ్యానర్లు అనుమతి ఇచ్చిన చోటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2,058 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30వ తేదీ వరకు అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చి 15వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి అందిస్తామని, ఇతర పార్టీ వారు, స్వతంత్ర అభ్యర్థులు జాబితాలను కొనుగోలు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు గాని వచ్చి ఓటింగ్ ప్రక్రియను చూసుకోవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులంతా సహకరించాలని కోరారు. అనుమతి తప్పనిసరి... సమావేశంలో ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ... లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ఇతర పార్టీల వారు గాని, అభ్యర్థులు గాని ఆటంకం కలిగించడం, అడ్డుకోవడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చట్టారీత్యా చర్యలు తప్పవన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోండి... సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు సూర్యనారాయణసోని మాట్లాడుతూ... అభ్యర్థులకు అనుమానాలు, ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ, తననుగాని సంప్రదించాలన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే లిఖిత పూర్వకంగా అందించవచ్చని, సెల్ నం.94918 60465కు కాల్ చేయవచ్చన్నారు. సమావేశంలో అభ్యర్థులు మధుయాష్కీగౌడ్ (కాంగ్రెస్), సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కోటపాటినర్సింహనాయుడు, తలారి రాములు (స్వంతంత్రులు), రాపెల్లి శ్రీనివాస్ (ఆమ్ఆద్మీ పార్టీ) పాల్గొన్నారు. -
జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి
ఇందూరు, న్యూస్‌లైన్ : భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముకలాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరని జిల్లా కలెక్టర్ పీ.ఎస్. ప్రద్యుమ్న అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ 107వ జయంతి సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం లో రాజకీయ స్వాతంత్య్రం ఉంటే సరిపోదని, ప్రజలకు ఆర్థిక, సామాజిక, సమన్యాయ స్వాతంత్య్రం కావాలని జగ్జీవన్‌రామ్ పోరాడి సాధించారని అన్నారు. ఆయన పోరాట ఫలి తంగానే రాజ్యాంగంలో పలు అంశాలను చేర్చడంతో నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. బీహార్‌లో జన్మించిన జగ్జీవన్ రామ్ కేంద్రానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. తరువాత వ్యవసాయ మంత్రిగా ప్రజల మేలు కోరి దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలి చారని కొనియాడారు. అయితే ప్రస్తుత తరం దేశ కోసం పోరాడిన మహనీయులను మరిచి పోతోందన్నారు. విద్యార్థులకు మహనీయుల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం చాలా విచారకరమన్నారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జేసీ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ అంటరాని తనాన్ని రూపు మాపేందుకు పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నడవాలన్నారు. అంటరానితనం అక్కడక్కడా ఇంకా ఉందని,దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించేదుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక రైల్వే కమాన్ వద్ద పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్, ఐకేపీ పీడీ వెంకటేశం, ఇన్చార్జి డీఎస్‌డబ్ల్యూఓ అల్ఫోన్స్, ఏఎస్‌డబ్ల్యూ జగదీశ్వర రెడ్డి,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ రైల్వే కమాన్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ నివాళి.. రైల్వే కమాన్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ పూల మాలలు వేసి వివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్‌లోని చిత్ర పటానికి పూల మాలలు వేశారు. సాంఘిక సంక్షేమాధికారులు భోజనాలు ఏర్పాటు చేయగా, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు కలిసి భోజనం చేశారు. కాగా అక్కడున్న ఓ వృద్ధురాలిలో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేసి అందరిని ఆకట్టుకున్నారు. -
పోలీస్ రెడీ
కామారెడ్డి, న్యూస్‌లైన్: నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు తమ పరిధిలోని సర్కిళ్లు, పోలీసుస్టేషన్లవారీగా శాంతిభద్రతల పరిస్థితులపై నివేదికలను రూపొందించారు. గతంలో జిల్లా లో నక్సల్స్ కార్యకలాపాలు జోరుగా సాగిన పరిస్థితులు, ఇప్పుడు నక్సల్స్ కదలికలు లేకుండా పోయిన నేపథ్యం వంటి అంశాలపై అధికారుల అభిప్రాయాలను సేకరించి ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలు, రౌడీషీటర్లు, ఇతర అసాం ఘిక శక్తుల గురించి ఇప్పటికే నివేదికను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు 2010లో జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నిక, 2011లో జరిగిన కామా రెడ్డి ఉప ఎన్నికలలోని అనుభవాలను కూడా పోలీసు అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా అధికారులతో ఎస్పీ ప్రతీ అంశాన్ని చర్చించారు. గతంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఘటనలకు అవకాశం ఉంటుందనే అంశాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. బదిలీలతో వే గం పెంచి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎస్ఐల బదిలీలతో పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇటీవల రెండు విడతలుగా ఎస్ఐలను బది లీలు చేశారు. కొత్తవారికి పోస్టింగులు ఇవ్వాల్సి ఉం డడంతో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 70 మందికి పైగా ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొన్నవారిని వీఆర్‌కు, చురుకుగా లేనివారిని లూప్లైన్కు బదిలీ చేశారు. యువ అధికారులకు పోస్టింగులు ఇచ్చారు. ప్రతిసారి బదిలీ వ్యవహారంలో రాజకీయ నేతల ముద్ర కనిపించేంది. ఈ సారి మాత్రం రాజకీయ నేతలకు సంబంధం లేకుండానే బదిలీలు జరిగాయంటున్నారు. గొడవలపైనే దృష్టి ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు, నేతల మధ్య ఆధిపత్యపోరు ఎక్కువైన నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశాలున్నందున వాటిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారిం చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నోటిఫికేషన్ రాకముందు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజాప్రతిని ధులు, నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తి గొడవలు చెల రేగా అవకాశాలున్న ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే గొడవలు మొదలైతే ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశమున్నం దున, గొడవలకు ఎవరు కారణమైనా ఉపేక్షించొద్దని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఏది ఏమైనా ఓట్ల పండుగకు పోలీసు యం త్రాంగం ముందస్తుగానే సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికలు సజావుగా జరిపేందుకు అధి కారులు కసరత్తు చేస్తున్నారు. -
కలెక్టర్ బంగళాలో నూతన సంవత్సర వేడుకలు
న్యూస్‌లైన్, కలెక్టరేట్ : కలెక్టర్ బంగళాలో సోమవారం 2014 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రద్యుమ్న కేకును కోసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం పలువురు అధికారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసినవారిలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, ఎస్పీ తరుణ్‌జోషీ సంయుక్త కలెక్టర్ హర్షవర్ధన్, అదనపు సంయుక్త కలెక్టర్ శేషాద్రి, జిల్లా అధికారులు వెంకటేశం, సత్యనారాయ ణ, భిక్షునాయక్, సుధాకర్‌రావు, చైతన్యకుమార్, నాగేశ్వర్ రావు, జడ్పీ సీఈఓ రాజరాం, డీఈఓ శ్రీనివాసాచారి, సీపీఓ నబీ, టీఎన్జీఓ నాయకులు గైని గంగారాం, కిషన్, సుధాకర్, తెలంగాణ రెవెన్యూ సంఘం నాయకులు సూర్యప్రకాష్, వెంకటయ్య, రాంచందర్, తెలంగాణ ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రాములు, గంగాకిషన్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు బాబూరాం, గంగాకిషన్, శ్రీకర్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు నాగేశ్వర్రావు, సుభాష్, సత్యనారాయణ, రాజు, డ్రైవర్ల సంఘం నాయకులు అజీజ్, గంగాధర్ తదితరులు ఉన్నారు. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తాం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి పేర్కొన్నారు. 2013లో నమోదైన కేసుల సంఖ్య 32.5 శాతం పెరిగిందని ఆయన ప్రకటించారు. నూతన సంవత్సరంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకు ప్రజల సహకరించాలని కోరారు. నేరా లు, కేసుల నమోదు, దర్యాప్తు తదితర 43 అంశాలతో కూడిన 2013-నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఇందులోని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. 2012 సంవత్సరంలో జిల్లాలో 6326 కేసులు నమోదు కాగా ఈ ఏడాది వీటి సంఖ్య 7349కి పెరిగిందన్నారు. 2013లో జిల్లా పోలీసులు మూడు దొంగల ముఠాలను అరెస్టు చేసి రూ. 21.17 లక్షల విలువ చేసే ఆస్తులను రికవరీ చేశామని చెప్పారు. రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయల్ 100కు మొత్తం 19,654 ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇందులో 1,507 పేకాల్స్ ఉన్నాయని వివరించారు. వీధిబాలల పునరావాస చర్యల్లో భాగంగా 175 మంది చిన్నారులను గుర్తించామని, ఇందులో 107 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించగా, మిగిలిన 68 మందిని బాలల పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. కుటుంబ తగాదాల పరిష్కారం కోసం జిల్లా లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహించామని ఎస్పీ తెలిపారు. ఇందులో 859 ఫిర్యాదులు రాగా 704 ఫిర్యాదులు పరి ష్కారమయ్యాయని, మిగిలిన 116 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2013లో నమోదైన కేసుల కు సంబంధించి రూ. 4.00 కోట్లు విలువ చేసే సొత్తు అపహారణకు గురికాగా ఇప్పటి వరకు రూ. 1.95 కోట్ల సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ వివరించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఇందులో 382 మంది ఫోన్ ద్వారా ఫిర్యా దు చేయగా 364 మంది ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది 23 నిర్భయ కేసులు నమోదు చేశామన్నారు. మరో 12 మంది మైనర్ బాలికలపై లైంగికదాడి, లైంగికదాడి యత్నాలకు పలుపడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందని , 2012లో 95 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 91 కేసులు నమోదయ్యాయన్నారు. ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ విభాగం చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గత ఏడాది 102 ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు కాగా , 2013లో అవి 300లకు పెరిగాయని ఎస్పీ వివరించారు.