
సాక్షి, వరంగల్: అడవుల్లో ఉండే అన్నలు కరోనా బారినపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్‌లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి పేర్లు గడ్డం మధుకర్, వినయ్ అని తెలిపారు. మరో 12 మంది మావోయిస్టులు ప్రస్తుతం కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్లు సమాచారం ఉందని కమిషనర్ చెప్పారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మన్యంలో ఉంటున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment