Naxals arrest
-
కరోనా చికిత్సకు వచ్చి చిక్కిన మావోయిస్టులు
సాక్షి, వరంగల్: అడవుల్లో ఉండే అన్నలు కరోనా బారినపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్‌లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి పేర్లు గడ్డం మధుకర్, వినయ్ అని తెలిపారు. మరో 12 మంది మావోయిస్టులు ప్రస్తుతం కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్లు సమాచారం ఉందని కమిషనర్ చెప్పారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మన్యంలో ఉంటున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ -
విశాఖలో మావోయిస్టు కీలక నేతల అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాదిలను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబందించిన చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు వెల్లడించారు. ‘అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్ దాదాపు 35 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ఇతనిపై సుమారు 20 లక్షలు రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉంది. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్ భార్య, కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాది అలియాస్ పూల్ బత్తిని కూడా అరెస్టు చేశామ’ని ఏఎస్పీ తెలిపారు. ఆమెపై రూ. ఆరు లక్షలు రివార్డు ఉందని, సుమారు 30కు పైగా కేసులు ఏవోబీలో నమోదయ్యాయని, గత 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని ఏఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి విశాఖ తరలించినట్లు చెప్పారు. -
నలుగురు మావోయిస్టుల అరెస్ట్
అరకులోయ/మల్కన్‌గిరి: ఒడిశా కటాఫ్ ప్రాంతంలోని ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పట్టుబడిన నలుగురు మావోయిస్టుల నుంచి పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ ముగ్గురు మహిళా మావోయిస్టులు, ఓ మిలీషియా సభ్యుడి ఫోటోలను మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా శనివారం మీడియాకు వెల్లడించారు. ఆండ్రపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్న రాజశేఖరకర్మతో పాటు జంత్రి గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు జయంతి గొల్లూరి (20), రాధిక (20), సుమ గొల్లూరి (17)గా పోలీసులు గుర్తించారు. వారి కిట్ బ్యాగ్‌ల నుంచి 3 జిలెటిన్లు, 2 క్రోడాక్స్, వైరు, 2 టిపెన్‌బాక్స్ బాంబులు, ఎలక్ట్రీకల్ వైరును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. గాయాలపాలైన పోలీసులకు పాడేరులో చికిత్స కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా మృతదేహంతోపాటు, పట్టుబడిన మావోయిస్టులను గ్రేహౌండ్స్ పోలీసులు తరలిస్తున్న సమయంలో కొంతమంది గిరిజనులు అడ్డుకుని పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పలువురు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివచ్చారు. గాయపడిన 11 మంది గ్రేహౌండ్స్ పోలీసులకు పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు నిడి గొండ ప్రమీల ఉరఫ్ మీనా మృతదేహాన్ని శనివారం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. -
9మంది మావోయిస్టుల అరెస్ట్
రాయపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో తొమ్మిదిమంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. నారాయణ్‌పూర్ జిల్లా కొసల్నార్ అటవీ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న మావోలను విచారిస్తున్నారు. వీరు పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసినవారిలో ఇద్దరిపై రివార్డు ఉంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.