
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాదిలను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబందించిన చింతపల్లి ఏఎస్‌పీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు వెల్లడించారు.
‘అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్ దాదాపు 35 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ఇతనిపై సుమారు 20 లక్షలు రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉంది. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్ భార్య, కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాది అలియాస్ పూల్ బత్తిని కూడా అరెస్టు చేశామ’ని ఏఎస్‌పీ తెలిపారు. ఆమెపై రూ. ఆరు లక్షలు రివార్డు ఉందని, సుమారు 30కు పైగా కేసులు ఏవోబీలో నమోదయ్యాయని, గత 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని ఏఎస్‌పీ పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి విశాఖ తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment