ముంబై: ఫెర్రీ ప్రమాదం.. ఇద్దరి మృతి | Mumbai Ferry Sink Incident News Latest Updates | Sakshi
Sakshi News home page

వీడియో: ప్రయాణికుల ఫెర్రీని ఢీ కొట్టిన స్పీడ్‌బోట్‌.. ముంబై తీరంలో ప్రమాదం

Published Wed, Dec 18 2024 5:49 PM | Last Updated on Wed, Dec 18 2024 7:11 PM

Mumbai Ferry Sink Incident News Latest Updates

సాక్షి: ముంబై సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది.  ఓ స్పీడ్‌ బోటు అదుపుతప్పి ప్రయాణికులతో ఉన్న పర్యాటక బోటును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

బుధవారం సాయంత్రం.. ఎలిఫెంటా కేవ్స్‌ నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా తీరానికి ప్రయాణికులతో కూడిన ఓ ఫెర్రీ తిరిగి వస్తోంది. ఆ టైంలో.. కరంజా ఉరన్‌ ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ వద్ద ఓ స్పీడ్‌బోటు ఆ ఫెర్రీని ఢీ కొట్టింది. ఫెర్రీలో 80 మంది ప్రయాణికులు ఉండగా.. స్పీడ్‌బోటులో నలుగురు ఉన్నట్లు సమాచారం. 

తొలుత ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేవలం  మునిగిపోతున్న ఫెర్రీ నుంచి ప్రయాణికులను సహాయక బృందాలు కాపాడుతున్నాయని ప్రకటించారు. అయితే స్పీడ్‌ బోటు అదుపు తప్పి ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని వీడియోల ద్వారా స్పష్టత వచ్చింది.

ఈ ప్రమాదం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరా తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని  తెలిపారాయన. ఇప్పటిదాకా 73 మందిని రక్షించినట్లు తెలిపారాయన. ఇద్దరు మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. స్పీడ్‌ బోటు దూసుకొచ్చి ఫెర్రీని ఢీ కొట్టిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

VIDEO CREDITS: NDTV Marathi 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement